న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ మంగళవారం తగ్గించింది. ఇంతక్రితం అంచనా 7.5 శాతంకాగా, దీనిని 20 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.3 శాతానికి కుదించింది. సాధారణంకన్నా తక్కువ వర్షపాతం నమోదు, పారిశ్రామిక ఉత్పత్తి భారీ వృద్ధిపై అనుమానాలు వంటి అంశాలు తమ వృద్ధిరేటు కోత అంచనాలకు కారణమని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఫిచ్ గ్రూప్ విభాగం అయిన ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ పేర్కొంది. తాజా నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే...
►పారిశ్రామిక ఉత్పత్తిలో తయారీ, విద్యుత్ రంగాల పనితీరు పేలవంగా ఉంది.
►దివాలా చట్టం 2016 కింద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు నివేదిస్తున్న కేసుల విచారణ మందగమనంలో ఉంది. ఒకచోటు నిరర్థకంగా ఉండిపోయిన మూలధనాన్ని తిరిగి ఉత్పత్తి ప్రక్రియలోకి తీసుకురావడం కష్టంగా మారుతున్న తరుణంలో ఈ అంశం కూడా వృద్ధితీరుపై ప్రభావం చూపే వీలుంది.
►పెట్టుబడుల వ్యయ వృద్ధి రేటు అంచనాలను 10.3% నుంచి 9.2%కి తగ్గించింది.
►వ్యవసాయ రంగం వృద్ధి అంచనాను 3 శాతం నుంచి 2.5 శాతానికి కుదించింది. 2018–19లో ఈ రేటు 2.7 శాతం.
►సేవల రంగం కొంత మెరుగైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది.
జీడీపీ వృద్ధి రేటు కోత!
Published Wed, May 1 2019 12:28 AM | Last Updated on Wed, May 1 2019 4:59 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment