బ్యాంకుల లాభాలకు గండి! | Banks profitability likely to moderate in FY26 says India Ratings | Sakshi
Sakshi News home page

బ్యాంకుల లాభాలకు గండి!

Published Thu, Jan 9 2025 9:15 AM | Last Updated on Thu, Jan 9 2025 9:15 AM

Banks profitability likely to moderate in FY26 says India Ratings

మొండిబకాయిల ప్రభావం ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26) బ్యాంకింగ్‌ (Banks)లాభదాయకతపై ప్రభావం చూపుతుందని దేశీయ రేటింగ్‌ సంస్థ– ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఇండ్‌–రా) నివేదిక పేర్కొంది. బ్యాంకింగ్‌ లాభదాయకత 2024–25లో ‘‘పీక్‌’’ స్థాయిలో ఉండగా, 2025–26లో ఇది దిగివచ్చే అవకాశాలు అధికమని వివరించింది. రిటైల్‌ రంగం నుంచి ప్రధానంగా మొండి బకాయిల సవాళ్లు తలెత్తే వీలుందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ హెడ్‌ అండ్‌ డైరెక్టర్‌ కరణ్‌ గుప్తా నివేదికలో వెల్లడించారు.  

నివేదికలోని ముఖ్యాంశాలు... 
»    మొండి బకాయిలు నియంత్రణ స్థాయిలోనే ఉంటాయి. రూ.50,000 కంటే తక్కువ రిటైల్‌ సురక్షిత రుణాలు బ్యాంకుల రుణాల మొత్తంలో 0.4 శాతంగా ఉన్నాయి. 11 శాతానికి పైగా వడ్డీ రేటు కలిగిన రుణాలు మొత్తం రుణాల్లో 3.6 శాతంగా ఉన్నాయి.  
»    2024–25లో రుణ వృద్ధి మందగించింది. 2023–24తో పోల్చితే ఈ రేటు 15 శాతం నుండి 13–13.5 శాతానికి తగ్గే వీలుంది.  
»   బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 2025–26లో 0.10 శాతం తగ్గిపోతుంది.  డిపాజిట్‌ వడ్డీ రేటు పెంపు, కొత్త అకౌంటింగ్‌ విధానాలు దీనికి కారణంగా ఉంటాయి.  
»    2025–25లో రుణ–డిపాజిట్‌ వృద్ధి మధ్య వ్యత్యాసం తగ్గుముఖం పడుతుంది. అయితే ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌ కొత్త నిబంధనలు, లిక్విడిటీ కవరేజ్‌ రేషియో, క్రెడిట్‌ నష్టాల అంచనా విధానం వంటి అంశాలు బ్యాంకింగ్‌ రంగానికి సవాళ్లను సృష్టిస్తాయి.  
»    2024–25లో మైక్రోఫైనాన్స్‌ ఆస్తుల వృద్ధి 5 శాతంగా ఉంటుంది. 2024–25లో ఇది 12 శాతానికి పెరుగుతుంది. గ్రామీణ ఎకానమీ బలోపేతం మైక్రోఫైనాన్స్‌ రంగానికి లాభదాయకంగా 
ఉండొచ్చు.  

శక్తికాంతదాస్‌ విధానాలు భేష్‌ 
మాజీ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ నేతృత్వంలో ఆర్‌బీఐ తీసుకున్న సంస్కరణలు బ్యాంకింగ్‌ వ్యవస్థను మరింత బలంగా మార్చాయని నివేదిక పేర్కొనడం గమనార్హం. అయితే కొత్త గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా నేతృత్వంలో ఈ నిబంధనల్లో పూర్తిగా కాకున్నా, కొంతమేర సరళతరం అయ్యే అవకాశం ఉందని అంచనావేసింది.

వ్యక్తిగత రుణాలు, సురక్షిత వ్యాపార రుణాలు, మైక్రోఫైనాన్స్‌ రంగంపై అవుట్‌లుక్‌ ‘స్థిరత్వం’ నుండి ‘దుర్వినియోగ పరిస్థితి‘ గా మారుతోందని నివేదిక పేర్కొంది. బ్యాంకులు, నాన్‌–బ్యాంకు ఫైనాన్స్‌ కంపెనీలు అలాగే హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలపై ఇండ్‌రా  రేటింగ్‌ తన  అవుట్‌లుక్‌ను కొనసాగించింది. అయితే ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున కొన్ని అసెట్‌ సెగ్మెంట్లపై అవుట్‌లుక్‌ను సవరించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement