![Dwindling wage growth emerging as bigger worry - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/9/WAGE-GROWTH.jpg.webp?itok=AIa0Qreb)
ముంబై: ఆర్థిక పునరుద్ధరణ ఊపందుకున్నప్పటికీ, వేతన పెంపు క్షీణించడం తీవ్ర ఆందోళనకరమైన అంశమని ఇండియా రేటింగ్స్ నివేదిక ఒకటి పేర్కొంది. వ్యవస్థలో డిమాండ్ తగ్గుదలకు ఇది దారితీస్తుందని, దీనివల్ల పరశ్రమలో సామర్థ్యం వినియోగం తగ్గుతుందని పేర్కొంది. వస్తు ఉత్పత్తి– వినియోగం అంతరాన్ని ఈ పరిస్థితి మరింత పెంచుతుందని విశ్లేషించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే...
► 2012–16 ఆర్థిక సంవత్సరం మధ్య ఉద్యోగుల వేతన వృద్ధి సగటున 8.2 శాతంగా నమోదయితే, 2017–21 మధ్య ఇది 5.7 శాతానికి క్షీణించింది.
► వేతన పెంపు భారీగా లేకపోవడం వల్లే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (20 22–23 ఏప్రిల్–జూన్) అంచనాలకన్నా తక్కువగా 13.5 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది.
► పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గృహ కొనుగోలు శక్తి బలహీనంగా నమోదవుతోంది.
► జూన్ 2022ను తీసుకుంటే సంవత్సరం ప్రాతిపదికన పట్టణాల్లో వేతన పెంపు సగటు 2.8 శాతం ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 5.5 శాతంగా ఉంది. అయితే ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటుచేస్తే, వేతనంలో వృద్ధిలేకపోగా ఈ రేట్లు వరుసగా 3.7 శాతం, 1.6 శాతం మేర క్షీణించాయి.
► ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.8 శాతంగా నమోదయ్యే వీలుంది. తృణధాన్యాలు, సేవల రంగాల్లో ధరల తీవ్రత దీనికి కారణం.
► ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా 2022–23లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను (మే నుంచి 1.4 శాతం మేర పెంపుతో ప్రస్తుతం 5.4 శాతం) 25 నుంచి 50 బేసిస్ పాయింట్లమేర పెంచే వీలుంది.
Comments
Please login to add a commentAdd a comment