economic recovery
-
అంతంతమాత్రం వేతన పెంపు తీవ్ర ఆందోళనకరం!
ముంబై: ఆర్థిక పునరుద్ధరణ ఊపందుకున్నప్పటికీ, వేతన పెంపు క్షీణించడం తీవ్ర ఆందోళనకరమైన అంశమని ఇండియా రేటింగ్స్ నివేదిక ఒకటి పేర్కొంది. వ్యవస్థలో డిమాండ్ తగ్గుదలకు ఇది దారితీస్తుందని, దీనివల్ల పరశ్రమలో సామర్థ్యం వినియోగం తగ్గుతుందని పేర్కొంది. వస్తు ఉత్పత్తి– వినియోగం అంతరాన్ని ఈ పరిస్థితి మరింత పెంచుతుందని విశ్లేషించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► 2012–16 ఆర్థిక సంవత్సరం మధ్య ఉద్యోగుల వేతన వృద్ధి సగటున 8.2 శాతంగా నమోదయితే, 2017–21 మధ్య ఇది 5.7 శాతానికి క్షీణించింది. ► వేతన పెంపు భారీగా లేకపోవడం వల్లే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (20 22–23 ఏప్రిల్–జూన్) అంచనాలకన్నా తక్కువగా 13.5 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. ► పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గృహ కొనుగోలు శక్తి బలహీనంగా నమోదవుతోంది. ► జూన్ 2022ను తీసుకుంటే సంవత్సరం ప్రాతిపదికన పట్టణాల్లో వేతన పెంపు సగటు 2.8 శాతం ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 5.5 శాతంగా ఉంది. అయితే ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటుచేస్తే, వేతనంలో వృద్ధిలేకపోగా ఈ రేట్లు వరుసగా 3.7 శాతం, 1.6 శాతం మేర క్షీణించాయి. ► ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.8 శాతంగా నమోదయ్యే వీలుంది. తృణధాన్యాలు, సేవల రంగాల్లో ధరల తీవ్రత దీనికి కారణం. ► ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా 2022–23లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను (మే నుంచి 1.4 శాతం మేర పెంపుతో ప్రస్తుతం 5.4 శాతం) 25 నుంచి 50 బేసిస్ పాయింట్లమేర పెంచే వీలుంది. -
కంపెనీలకు చమురు సెగ
కోవిడ్–19 సృష్టించిన విలయం నుంచి నెమ్మదిగా బయటపడుతున్న ప్రపంచ దేశాలు ఆర్థిక రికవరీ బాటలో సాగుతున్నాయి. దీంతో ఇటీవల బాండ్ల ఈల్డ్స్, డాలరు ఇండెక్స్ పుంజుకుంటోంది. మరోవైపు ముడిచమురు ధరలు సైతం బలపడుతున్నాయి. ఫలితంగా చమురు ఉత్పత్తి దేశాలు, కంపెనీలు లాభపడనుండగా.. దేశీయంగా పలు రంగాలపై ప్రతికూల ప్రభావం పడనుంది. వెరసి వచ్చే ఆర్థిక సంవత్సరం (2021–22)లో పలు రంగాల కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి పడవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. ముంబై: కొద్ది రోజులుగా ముడిచమురు ధరలు మండుతున్నాయి. తాజాగా విదేశీ మార్కెట్లో 14 నెలల గరిష్టానికి చేరాయి. న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు, లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ ధరలు పెరగడంతో ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధరలు సైతం వేడిని పుట్టించనున్నాయి. నైమెక్స్ బ్యారల్ దాదాపు 66 డాలర్లకు చేరగా.. బ్రెంట్ 69 డాలర్లను అధిగమించింది. దీంతో దేశీయంగా పలు రంగాలపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రతికూల ప్రభావం పడనుంది. అయితే చమురును ఉత్పత్తి చేయగల అప్‌స్ట్రీమ్ కంపెనీలు ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, కెయిర్న్, ఆర్ఐఎల్ లబ్ధి పొందే వీలుంది. అంతర్జాతీయ మార్కెట్ల ధరల ఆధారంగా ముడిచమురును విక్రయించేందుకు వీలుండటమే దీనికి కారణంకాగా.. చమురు శుద్ధి(రిఫైనింగ్) కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి పడనుంది. ఇదేవిధంగా ముడిచమురు నుంచి లభించే పలు డెరివేటివ్స్ ధరలు పెరగడంతో పెయింట్లు, ప్లాస్టిక్, ప్యాకేజింగ్ మెటీరియల్స్, కెమికల్స్ తదితర రంగాల లాభదాయకతను దెబ్బతీసే వీలుంది. చమురు జోరు ప్రపంచ ఆర్థిక రికవరీ, ఉత్పత్తిలో కోతల ఎత్తివేత తదితర అంచనాలతో ఈ ఏడాది రెండు నెలల్లోనే బ్రెంట్ చమురు 30 శాతం జంప్‌చేసింది. అయితే గత మూడేళ్లుగా స్తబ్దుగా ఉన్న చమురు ధరలతో దేశీయంగా లబ్ధి పొందుతూ వచ్చిన పలు రంగాలు దీంతో మార్జిన్ల సవాళ్లను ఎదుర్కొనే అవకాశముంది. చమురు డెరివేటివ్స్‌ను పెయింట్స్, టైర్ల తయారీలో కీలక ముడిసరుకుగా వినియోగించే సంగతి తెలిసిందే. పెయింట్స్, టైర్ల తయారీ ముడివ్యయాలలో 40–60 శాతం వాటాను ఇవి ఆక్రమిస్తుంటాయి. ఈ బాటలో ఎఫ్ఎంసీజీ, కెమికల్స్, సిమెంట్ తదితర రంగాలలోనూ చమురు డెరివేటివ్స్ కీలకపాత్ర పోషిస్తుంటాయి. చమురు ధరలు మండితే.. ఏటీఎఫ్ ధరలకు రెక్కలొస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ఫలితంగా విమానయాన రంగంపై భారీగా భారం పడుతుంది. వెరసి ఎయిర్‌లైన్స్ కంపెనీలకు ఆర్థిక సవాళ్లు ఎదురయ్యే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. -
జీఎస్టీ వసూళ్లు రూ.1.13 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ చక్కని వృద్ధి పథంలో కొనసాగాయి. వార్షికంగా క్రితం ఏడాది ఇదే నెలలో ఉన్న రూ.1.05 లక్షల కోట్లతో పోల్చి చూస్తే.. 7 శాతం వృద్ధితో రూ.1.13 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది జనవరిలో జీఎస్టీ వసూళ్లు రూ.1,19,875 కోట్లుగా ఉండగా, 2020 డిసెంబర్లో రూ.1.15లక్షల కోట్ల మేర వసూలైంది. రూ.లక్ష కోట్లకు పైన జీఎస్టీ వసూళ్లు కావడం వరుసగా ఐదో నెల కావడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్థూల జీఎస్టీ రూ.1,13,143 కోట్లు కాగా.. ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూ.21,092 కోట్లుగాను, రాష్ట్రాల జీఎస్టీ రూ.27,273 కోట్లు, ఇంటెగ్రేటెడ్ జీఎస్టీ రూ.55,253 కోట్ల చొప్పున ఉంది. రూ.9,525 కోట్లు సెస్సు రూపంలో సమకూరింది. జీఎస్టీ పెరుగుదల ఆర్థిక రికవరీని సూచిస్తోందని, నిబంధనల అమలు దిశగా పన్నుల అధికారులు తీసుకున్న ఎన్నో చర్యల ప్రభావం కూడా కనిపిస్తోందంటూ కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ‘‘జీఎస్టీ వసూళ్లలో గత ఐదు నెలలుగా ఉన్న రికవరీ ధోరణి కొనసాగింది. దిగుమతులపై జీఎస్టీలో 15 శాతం వృద్ధి నమోదు కాగా, దేశీయ లావాదేవీలపై జీఎస్టీ 5 శాతం పెరిగింది’’ అని ఆర్థిక శాఖ తెలిపింది. ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని ప్రతిబింబించే జీఎస్టీ వసూళ్లు గతేడాది కరోనా లాక్డౌన్ అమలు చేసిన ఏప్రిల్‌లో రూ.32,172 కోట్లకు పడిపోయిన విషయం తెలిసిందే. ఆరోగ్యకరమే.. ‘‘జీఎస్టీ వసూళ్లు ఫిబ్రవరిలో కాస్త నెమ్మదించినా కానీ.. ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణకు తగినట్టు ఆరోగ్యకరమైన స్థాయిలోనే ఉన్నాయి’’ అని ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితినాయర్ పేర్కొన్నారు. -
ఉద్యోగులకు పండగ బొనాంజా
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపేందుకు, డిమాండ్‌ను పెంచేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పలు చర్యలు ప్రకటించారు. వినిమయాన్ని పెంచేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ క్యాష్ వోచర్, పండుగ ప్రత్యేక అడ్వాన్స్ పథకాలను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ఎల్టీసీ నగదును 12 శాతం ఆపై జీఎస్టీ విధించే వస్తువులపై ఖర్చు పెట్టాలని, డిజిటల్ మాధ్యమం ద్వారా వీటిని వెచ్చించాలని ఆమె స్పష్టం చేశారు. జీఎస్టీ ఇన్వాయిస్ను సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. కరోనా వైరస్‌తో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని, పేదలు, చిన్న పరిశ్రమలను ఆదుకునేందుకు ఆత్మనిర్భర్ ప్యాకేజ్ ప్రకటించగా తాజాగా వ్యవస్థలో డిమాండ్‌కు ఊతమిచ్చే చర్యలను ప్రకటించామని చెప్పారు. వస్తువులను కొనుగోలు చేయడానికి వోచర్లు వాడే అవకాశం కల్పిస్తున్నామని, తమకు నచ్చిన ప్రాంతానికి, తమ సొంత ఊరికి వెళ్లేందుకు ఎల్టీసీ సదుపాయం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. వీటిపై ఎలాంటి ఆదాయం పన్ను ఉండదని స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థలో దూకుడు పెంచేందుకు వినియోగదారుల నుంచి డిమాండ్, మూలధన వ్యయం పెరగాల్సి ఉందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇక జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రాలకు పరిహారం విషయంపై సోమవారం మద్యాహ్నం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక సమావేశంలో పాల్గొంటారు. చదవండి : వ్యవసాయ చట్టాలతో రైతులకు మేలు (function(w,d,s,u,n,i,f,g,e,c){w.WDMObject=n;w[n]=w[n]||function(){(w[n].q=w[n].q||[]).push(arguments);};w[n].l=1*new Date();w[n].i=i;w[n].f=f;w[n].g=g;e=d.createElement(s);e.async=1;e.src=u;c=d.getElementsByTagName(s)[0];c.parentNode.insertBefore(e,c);})(window,document,"script","//api.dmcdn.net/pxl/cpe/client.min.js","cpe","5f686da28ba2a6d8cbff0ede",{scroll_to_pause: true}); -
పడగొట్టిన ‘ఫెడ్’!
అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి చాలా కాలమే పడుతుందని ఆ దేశ కేంద్ర బ్యాంక్ సంకేతాలివ్వడంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా గురువారం పతనమైంది. టెలికం కంపెనీలు ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సిందేనంటూ సుప్రీం కోర్ట్ వ్యాఖ్యానించడం, ఇటీవల బాగా పెరిగిన బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం, మళ్లీ లాక్డౌన్ విధిస్తారనే వదంతులు, కరోనా కేసులు పెరుగుతుండటం... ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 34,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 10,000 పాయింట్ల దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్ 709 పాయింట్లు క్షీణించి 33,538 పాయింట్ల వద్ద, నిఫ్టీ 214 పాయింట్లు పతనమై 9,902 పాయింట్ల వద్ద ముగిశాయి. గత మూడు వారాల్లో సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్క రోజులో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే ప్రథమం. ఇంట్రాడేలో సెన్సెక్స్ 767 పాయింట్లు, నిఫ్టీ 231 పాయింట్ల మేర నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. కాగా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. మరిన్ని వివరాలు... ► ఎస్బీఐ షేర్ 6% నష్టంతో రూ.177 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పడిన షేర్ ఇదే. ► 30 సెన్సెక్స్ షేర్లలో ఐదు షేర్లు–ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటొకార్ప్, పవర్ గ్రిడ్, మహీం ద్రా అండ్ మహీంద్రా, నెస్లే ఇండియా మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 25 షేర్లు నష్టపోయాయి. ► మార్కెట్ భారీగా నష్టపోయినా, 80కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. అరబిందో ఫార్మా, ముత్తూట్ ఫైనాన్స్, క్యాడిలా హెల్త్‌కేర్, గ్రాన్యూల్స్ ఇండియా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► స్టాక్ మార్కెట్లో భారీ క్షీణత చోటు చేసుకున్నా దాదాపు 350కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. పీఎన్బీ హౌసింగ్, ఫ్యూచర్ రిటైల్, లెమన్ ట్రీ హోటల్స్, ఫ్యూచర్ కన్సూమర్, డిష్ టీవీ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► ప్రముఖ ట్రేడర్ విజయ్ ఖేడియా 1.1 శాతం వాటా షేర్లను కొనుగోలు చేయడంతో రామ్‌కో సిస్టమ్స్ షేర్ 20 శాతం లాభంతో రూ.110 వద్ద ముగిసింది. ఇక ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో శంకర బిల్డింగ్ షేర్ 16 శాతం ఎగసి రూ.352 వద్ద ముగిసింది. ► ఏజీఆర్ బకాయిల విషయమై ఊరట లభించకపోవడంతో టెలికం షేర్లు నష్టపోయాయి. వొడాఫోన్ ఐడియా, భారతీ ఇన్ఫ్రాటెల్, హెచ్ఎఫ్సీఎల్, తేజాస్ నెట్వర్క్స్, ఐటీఐ, భారతీ ఎయిర్టెల్ షేర్లు 13 శాతం వరకూ నష్టపోయాయి. ► వరుసగా ఐదో రోజూ ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ పెరిగింది. ఒక్క వారంలో ఈ షేర్ 30 శాతం లాభపడింది. నష్టాలు ఎందుకంటే... ► ఫెడ్ కఠిన వ్యాఖ్యలు... వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ, అమెరికాలో ఆర్థిక రికవరీకి దీర్ఘకాలమే పడుతుందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ వ్యాఖ్యానించడం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను పడగొట్టింది. వడ్డీరేట్లను మరో రెండేళ్ల పాటు సున్నా స్థాయిల్లోనే కొనసాగిస్తామని, తక్కువ రేట్లను కొనసాగించడానికి బాండ్ల కొనుగోళ్లు కొనసాగిస్తామని ఫెడ్ వెల్లడించింది. కరోనా కల్లోలంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి చాలా కాలమే పడుతుందని ఈ వ్యాఖ్యల ద్వారా ఫెడ్ అంగీకరించినట్లయింది. ఫెడ్ వ్యాఖ్యల కారణంగా ఆసియా, యూరప్ మార్కెట్లు 1–4 శాతం మేర నష్టపోయాయి. ► ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సిందే... టెలికం కంపెనీలు ఏజీఆర్(సవరించిన స్థూల రాబడి)బకాయిలు చెల్లించాలాంటూ సుప్రీం కోర్ట్ తేల్చి చెప్పడంతో బ్యాంక్ షేర్లు పడ్డాయి. ► బ్యాంక్ షేర్లలో లాభాల స్వీకరణ... లాక్డౌన్ నిబంధనలు సడలించినప్పటి నుంచి ఆర్థిక రికవరీపై సానుకూల అంచనాలతో బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లు పెరుగుతూ వస్తున్నాయి. ఈ షేర్లన్నీ బాగా పెరిగిన నేపథ్యంలో ఫెడ్ తాజా నిర్ణయం కారణంగా పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ► రూపాయి పతనం డాలర్‌తో రూపాయి మారకం విలువ 20 పైసలు పతనమై 75.79 వద్దకు చేరింది. ► మళ్లీ లాక్డౌన్...? కరోనా కేసులు బాగా పెరుగుతుండటంతో ఈ నెల 15 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధిస్తారన్న వదంతులు చెలరేగాయి. ఈ వార్తలను కేంద్రం ఖండించినప్పటికీ, లాక్డౌన్ వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ► పెరుగుతున్న కరోనా కేసులు... ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్త కరోనా కేసులు 74 లక్షలకు, మరణాలు 4.2 లక్షలకు చేరువయ్యాయి. ఇక భారత్‌లో కరోనా కేసులు 2.9 లక్షలకు పైగా చేరగా, మరణాలు 8 వేలు దాటిపోవడం కూడా మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి. ► ఎస్ అండ్ పీ రేటింగ్స్ ఆందోళన గత వారం మన రేటింగ్‌ను మూడీస్ సంస్థ డౌన్‌గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. అయితే స్డాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్ అండ్ పీ) గ్లోబల్ రేటింగ్స్ సంస్థ మన సావరిన్ రేటింగ్‌ను కొనసాగించడం ఒకింత ఊరటనిచ్చింది. అయితే ద్రవ్యలోటు, ఆర్థిక రంగ బలహీనతలపై ఆందోళన వ్యక్తం చేయడం ప్రతికూల ప్రభావం చూపించింది. రూ.2.4 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా రూ.2.4 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.2.4 లక్షల కోట్లు తగ్గి రూ.133 లక్షల కోట్లకు పడిపోయింది. భారీ నష్టాల్లో అమెరికా మార్కెట్ కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతుండటం, అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిరాశాపూర్వక వ్యాఖ్యలు చేయడంతో గురువారం అమెరికా స్టాక్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికాలో కరోనా కేసులు 20 లక్షలకు పైగా పెరిగిపోగా, మరణాలు 1.1 లక్షలకు చేరాయి. కరోనా కేసులు మళ్లీ తిరగబెడుతున్నాయని నిపుణులంటున్నారు. రాత్రి గం.11.30ని. సమయానికి డోజోన్స్ సూచీ 1,300 పాయింట్లు, (5 శాతం), నాస్డాక్ సూచీ 328 పాయింట్లు (3 శాతం), ఎస్ అండ్ పీ 500 సూచీ 128 పాయింట్లు(4 శాతం) మేర నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇక మన ఎన్ఎస్ఈ నిఫ్టీకి ప్రతీక అయిన ఎస్‌జీఎక్స్ నిఫ్టీ సూచీ 278 పాయింట్ల(2%) నష్టంతో 9,575 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ప్రభావంతో శుక్రవారం మన స్టాక్ సూచీలు భారీ గ్యాపప్‌తో మొదలవుతాయని అంచనా. -
ఆర్థిక రికవరీ అంతంత మాత్రమే...
ఆసోచామ్ సర్వేలో కంపెనీల అభిప్రాయం న్యూఢిల్లీ : ఆర్థిక పరిస్థితులు రానున్న కాలంలో కుదుటపడతాయన్న విషయంలో భారత కంపెనీలు ఏమంత ఆశావహంగా లేవని ఆసోచామ్ బిజ్‌కాన్ సర్వేలో వెల్లడైంది. పెట్టుబడుల పరిస్థితులు ప్రతికూలంగా ఉండడం, బలహీనమైన ఎగుమతులు, కమోడిటీ ధరల్లో ఒత్తిడి దీనికి ప్రధాన కారణాలని ఈ సర్వేలో తేలింది. మొత్తం మీద వ్యాపార సెంటిమెంట్ బలహీనంగా ఉన్న నేపథ్యంలో రానున్న నెలల్లో జాబ్ మార్కెట్లో చెప్పుకోదగ్గ మెరుగుదల ఉండదని పేర్కొంది. ఆసోచామ్ సెక్రటరీ జనరల్ డి.ఎస్, రావత్ వెల్లడించిన సర్వే ముఖ్యాంశాలు.., ♦ రానున్న నెలల్లో ఆర్థిక పరిస్థితులు కుదుటపడతాయని ఈ ఏడాది మార్చిలో 82 శాతం కంపెనీలు అభిప్రాయపడ్డాయి. తాజా సర్వేలో ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేసిన కంపెనీల సంఖ్య 55 శాతానికి పడిపోయింది. ♦ ఆర్నెల్ల క్రితం నాటి పరిస్థితులే ఉన్నాయని 62 శాతం కంపెనీలు పేర్కొన్నాయి. ♦ అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు బాగాలేని కారణంగా ఎగుమతుల క్షీణత కొనసాగుతోందని, కమోడిటీ ధరల్లో తీవ్రమైన ఒత్తిడి కనిపిస్తోందని, ఈ కారణంగా పెట్టుబడుల వాతావరణంపై ప్రతికూల ప్రభావం పడుతోందన్న అభిప్రాయం వ్యక్తమైంది. -
ఎకానమీ రికవరీ మొదలైంది
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు ధరల తగ్గుదల తోడ్పాటుతో కరెంటు అకౌంటు లోటును ప్రభుత్వం ఒక మోస్తరు స్థాయికి తేగలిగిందని, దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ వృద్ధి బాట పట్టడం మొదలైందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. బడ్జెట్ ముం దస్తు సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆర్థికవేత్తలతో భేటీ అయిన సందర్భంగా జైట్లీ ఈ విషయాలు చెప్పారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌కి చెందిన రోహిణి సోమనాథన్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్ గ్రోత్‌కి చెందిన సవ్యసాచి కర్, అహ్మదాబాద్ ఐఐఎంకి చెం దిన ఎరోల్ డిసౌజా తదితర ఆర్థికవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పలు సూచనలు కూడా చేశారు. వ్యవసాయంలోనూ, ఇన్‌ఫ్రాలోనూ పెట్టుబడులు పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.