ఆర్థిక రికవరీ అంతంత మాత్రమే... | Only fragility of economic recovery | Sakshi
Sakshi News home page

ఆర్థిక రికవరీ అంతంత మాత్రమే...

Published Mon, Jul 20 2015 1:17 AM | Last Updated on Sun, Sep 3 2017 5:48 AM

Only fragility of economic recovery

ఆసోచామ్ సర్వేలో కంపెనీల అభిప్రాయం
 
 న్యూఢిల్లీ : ఆర్థిక పరిస్థితులు రానున్న కాలంలో  కుదుటపడతాయన్న విషయంలో భారత కంపెనీలు ఏమంత ఆశావహంగా లేవని ఆసోచామ్ బిజ్‌కాన్ సర్వేలో వెల్లడైంది. పెట్టుబడుల పరిస్థితులు ప్రతికూలంగా ఉండడం, బలహీనమైన ఎగుమతులు, కమోడిటీ ధరల్లో ఒత్తిడి దీనికి ప్రధాన కారణాలని ఈ సర్వేలో తేలింది. మొత్తం మీద వ్యాపార సెంటిమెంట్ బలహీనంగా ఉన్న నేపథ్యంలో రానున్న నెలల్లో జాబ్ మార్కెట్‌లో చెప్పుకోదగ్గ మెరుగుదల ఉండదని పేర్కొంది.  ఆసోచామ్ సెక్రటరీ జనరల్ డి.ఎస్, రావత్ వెల్లడించిన సర్వే ముఖ్యాంశాలు..,

♦ రానున్న నెలల్లో ఆర్థిక పరిస్థితులు కుదుటపడతాయని ఈ ఏడాది మార్చిలో 82 శాతం కంపెనీలు అభిప్రాయపడ్డాయి. తాజా సర్వేలో ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేసిన కంపెనీల సంఖ్య 55 శాతానికి పడిపోయింది.
♦ ఆర్నెల్ల క్రితం నాటి పరిస్థితులే ఉన్నాయని 62 శాతం కంపెనీలు పేర్కొన్నాయి.   
♦ అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు బాగాలేని కారణంగా ఎగుమతుల క్షీణత కొనసాగుతోందని, కమోడిటీ ధరల్లో తీవ్రమైన ఒత్తిడి కనిపిస్తోందని, ఈ కారణంగా పెట్టుబడుల వాతావరణంపై ప్రతికూల ప్రభావం పడుతోందన్న అభిప్రాయం వ్యక్తమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement