హైదరాబాద్: హెచ్‌ఎస్‌బీసీ ఇండియా ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీని తన బ్రాండ్ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా నియమించుకుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేసింది. విరాట్ కోహ్లీతో మీడియా ప్రచారాన్ని నిర్వహించడం వల్ల హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకింగ్ సేవలకు విలువ తోడవుతుందని పేర్కొంది. ప్రపంచంలో ప్రతిష్టాత్మక ఆర్థిక సేవల సంస్థతో భాగస్వామ్యం కావడం పట్ల విరాట్ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు.
కాగా గత ఫిబ్రవరిలో హెచ్‌ఎస్‌బీసీ భారతదేశంలో కార్యకలాపాల నుంచి ప్రీ ట్యాక్స్ ఫ్రాఫిట్‌లో 15.04 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 2022 సంవత్సరానికి అది 1.277 బిలియన్ డాలర్లు. ఆ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఎస్‌బీసీ ఉద్యోగుల సంఖ్య 1,000 పెరిగి మొత్తంగా 39,000కి చేరుకుంది.
ఇదీ చదవండి: నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు గుడ్ న్యూస్! భారీగా తగ్గిన సబ్‌స్క్రిప్షన్ చార్జీలు
Comments
Please login to add a commentAdd a comment