
సాక్షి, సిటీబ్యూరో: విదేశాల్లో స్థిరపడిన భారతీయుల్లో మన అనే భావనను పెంపొందించే లక్ష్యంతో ఓ ప్రచార కార్యక్రమం చేపట్టినట్టు ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌ఎస్‌బీసీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీని కోసం మన దేశానికి చెందిన గ్లోబల్ సూపర్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్‌ను ప్రచారంలో భాగం చేశామని, ‘సినీ స్టార్‌తో భోజనం’ అంటూ, స్వదేశీ రుచులను గుర్తు చేస్తున్నామన్నారు. అంతర్జాతీయంగా పేరొందిన మిచెలిన్–స్టార్ రెస్టారెంట్ ఎగ్జిక్యూటీవ్ చెఫ్, సిద్ అహుజా కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment