జూన్‌లో సూచీ 60.5కు అప్
న్యూఢిల్లీ: సేవల రంగం జూన్‌లో మంచి ఫలితాన్ని నమోదుచేసుకుంది. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సరీ్వసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 60.5కు ఎగసింది. మేలో సూచీ ఐదు నెలల కనిష్ట స్థాయి 60.2కు పడిపోయిన సంగతి తెలిసిందే. కొత్త ఆర్డర్లు పెరగడం, దేశీయ, అంతర్జాతీయ విక్రయాల్లో పురోగతి వంటి అంశాలు జూన్‌లో పటిష్ట ఫలితాలు రావడానికి కారణం.
కాగా, సూచీ 50పైన ఉంటే దానిని వృద్ధి ధోరణిగానే పరిగణించే సంగతి తెలిసిందే. సూచీ 50 దిగువకు పడిపోతేనే దానిని క్షీణతగా పరిగణిస్తారు. ఇదిలావుండగా, సేవలు–తయారీ విభాగాలతో కలగలిపిన హెచ్‌ఎస్‌బీసీ ఇండియా కాంపోజిట్ అవుట్‌పుట్ ఇండెక్స్ కూడా మేలో 60.5 వద్ద ఉంటే, జూన్‌లో 60.9కి ఎగసింది. 400 సంస్థల ప్యానెల్‌కు పంపిన ప్రశ్నపత్రాలకు వచి్చన ప్రతిస్పందనల తో హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సరీ్వసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్‌ను ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రూపొందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment