June
-
ఆతిథ్య పరిశ్రమలో సందడి వాతావరణం
ముంబై: ఆతిథ్య పరిశ్రమలో సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో ఈ రంగంలోని కంపెనీలకు (హోటళ్లు) ఒక్కో గది వారీ ఆదాయం 4.8 శాతం మేర అధికంగా సమకూరింది. రోజువారీ సగటు రూమ్ ధరల పెరుగుదల ఇందుకు అనుకూలించినట్టు ‘జేఎల్ఎల్ హోటల్ మూమెంటమ్ ఇండియా (2024 క్యూ2)’ నివేదిక వెల్లడించింది. కానీ, ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు, జూన్ క్వార్టర్లో ఆక్యుపెన్సీ (గదుల భర్తీ రేటు) స్వల్పంగా తగ్గినట్టు తెలిపింది. కార్పొరేట్ ప్రయాణాలు తగ్గడాన్ని కారణంగా పేర్కొంది. హోటళ్ల రోజువారీ సగటు రేటు (ఏడీఆర్) గోవాలో స్వల్పంగా క్షీణించగా, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ మార్కెట్లలో ఏడీఆర్‌లో చెప్పుకోతగ్గ వృద్ధి కనిపించినట్టు, ముఖ్యంగా హైదరాబాద్ ఈ విషయంలో ముందున్నట్టు జేఎల్ఎల్ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్ మార్కెట్లో డిమాండ్ హైదరాబాద్ ఆతిథ్య పరిశ్రమలో గదుల సగటు ఆదాయం మిగిలిన నగరాలతో పోలి్చతే మెరుగ్గా నమోదైనట్టు జేఎల్ఎల్ నివేదిక తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు ఈ ఏడాది ఏప్రిల్–జూన్‌లో 11.9 శాతం మేర ఆదాయం పెరిగింది. ఆ తర్వాత ఢిల్లీలో 11.8 శాతం, బెంగళూరులో 10.4 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే ఆక్యుపెన్సీ (గదుల భర్తీ) రేటు స్థిరంగా ఉంది. రోజువారీ సగటు ధరల పెరుగుదలే రూమ్ వారీ సగటు ఆదాయంలో వృద్ధికి తోడ్పడింది. ఇక కార్పొరేట్ ప్రయాణాలు తిరిగి ప్రారంభం కావడం, ఇతర కార్పొరేట్, సామాజిక సమావేశాలు, సదస్సులు, ప్రదర్శనలతో రానున్న త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్)నూ ఆతిథ్య పరిశ్రమలో మెరుగైన డిమాండ్ ఉండొచ్చని జేఎల్ఎల్ అంచనా వేసింది. -
నెమ్మదించిన పరిశ్రమలు
న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం జూన్‌లో నెమ్మదించింది. ఐదు నెలల్లో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 4.2 శాతంగా నమోదయ్యింది. ఐఐపీ సూచీలో మెజారిటీ వెయిటేజ్ కలిగిన తయారీ రంగం పనితీరు నిరుత్సాహ పరిచినప్పటికీ విద్యుత్, మైనింగ్ రంగాలు చక్కటి ఫలితాలను నమోదుచేశాయి. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సూచీ వరుసగా 4.2%, 5.6%, 5.5%, 5.0%, 6.2 శాతం వృద్ధి రేట్లను (2023 ఇవే నెలలతో పోల్చి) నమోదుచేసుకుంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో సూచీ 5.2 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 4.7 శాతం. గత ఏడాది జూన్‌లో ఐఐపీ వృద్ధి రేటు 4 శాతంగా నమోదయ్యింది. అంటే అప్పటికన్నా తాజా సమీక్షా నెల జూన్‌లో (4.2 శాతం) కొంత మెరుగైన ఫలితం వెలువడ్డం గమనార్హం. 2023 అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో 11.9 శాతం ఐఐపీ వృద్ధి నమోదైంది. -
రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
ముంబై: దేశీయ కార్పొరేట్ కంపెనీల జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై సానుకూల అంచనాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై ఆశలు, బడ్జెట్‌కు ముందు కొనుగోళ్లు అంశాల నేపథ్యంలో స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ ఈ వారమూ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కంపెనీల క్యూ1 ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు, ద్రవ్యోల్బణ గణాంకాలతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల క్రయ, విక్రయాలు సూచీలకు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. వీటితో పాటు రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. మొహర్రం సందర్భంగా బుధవారం (జూన్ 17న) ఎక్సే్చంజీలకు సెలవ కావడంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. ‘‘వృద్ధి ఆధారిత బడ్జెట్ ఉహాగానాలు, క్యూ1 ఆర్థిక ఫలితాలపై మిశ్రమ అంచనాల నడుమ మార్కెట్లో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. సాంకేతికంగా నిఫ్టీకి ఎగువ స్థాయిలో 24,600 వద్ద నిరోధం ఉంది. దిగువున 24,150 – 24,200 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది. ఫలితాల సీజన్ సందర్భంగా స్టాక్ ఆధారిత ట్రేడింగ్ జరగొచ్చు. రుతుపవనాలు చురుగ్గా కదలుతున్నందున ఎఫ్ఎంసీజీ షేర్లకు డిమాండ్ లభించవచ్చు.’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సాంకేతిక నిపుణులు నాగరాజ్ శెట్టి తెలిపారు. గతవారం స్టాక్ సూచీలు దాదాపు ఒక శాతం ర్యాలీ చేశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 523 పాయింట్లు, నిఫ్టీ 178 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రభావం మార్కెట్ ముందుగా గత వారాంతాన వెల్లడైన హెచ్‌సీఎల్ టెక్, డీమార్ట్ క్యూ1 ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో నిఫ్టీ ఇండెక్స్‌లో 36% వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఆటో, ఏసియన్ పేయింట్స్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, కోటక్ మహీంద్రా బ్యాంక్, బీపీసీఎల్ కంపెనీలు తమ జూన్ త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. వీటితో పాటు జియో ఫైనాన్సియల్ సరీ్వసెస్, హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్, ఏంజెల్ వన్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, స్పైస్‌జెట్, ఆదిత్య బిర్లా కంపెనీ, ఎల్అండ్టీ ఫైనాన్స్ హావెల్స్, ఎల్అండ్టీ సరీ్వసెస్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, పాలీక్యాబ్ ఇండియా, టాటా టెక్నాలజీ, ఐసీఐసీఐ లాంబార్డ్, పేటీఎం, పీవీఆర్, యూనియన్ బ్యాంక్, ఆర్బీఎల్, యస్ బ్యాంక్ సహా మొత్తం 197 కంపెనీలు తమ తొలి త్రైమాసిక ఫలితాలు వెల్లడించనున్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం దేశీయ జూన్ హోల్‌సేల్ ద్రవ్యల్బణ డేటా, చైనా క్యూ1 జీడీపీ, జూన్ రిటైల్ అమ్మకాలు, యూరోజోన్ మే పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నేడు(జూన్ 15న) విడుదల కానున్నాయి. మంగళవారం మే నెల యూరోజోన్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, జూన్ అమెరికా రిటైల్ అమ్మకాల డేటా, బుధవారం బ్రిటన్ జూన్ ద్రవ్యోల్బణం, యూరోజోన్ జూన్ ద్రవ్యోల్బణం, అమెరికా జూన్ పారిశ్రామికోత్పత్తి డేటా వెల్లడి కానుంది. గురువారం బ్రిటన్ మే నిరుద్యోగ గణాంకాలు, జపాన్ జూన్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ డేటా, యూరోజోన్ ఈసీబీ వడ్డీరేట్ల నిర్ణయం వెలువడునున్నాయి. వారాంతపు రోజైన శుక్రవారం ఆర్బీఐ జూన్ 12తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలు ప్రకటించనుంది. బ్రిటన్ జూన్ రిటైల్ అమ్మకాల డేటా, జపాన్ జూన్ ద్రవ్యోల్బణం, యూరోజోన్ మే కరెంట్ ఖాతాల గణాంకాలు వెలువడునున్నాయి. ఆయా దేశాలకు సంబంధించిన కీలక స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది.రెండు వారాల్లో రూ.15వేల కోట్ల పెట్టుబడులువిదేశీ ఇన్వెస్టర్లు జూలై తొలి రెండు వారాల్లో దేశీయ మార్కెట్లో రూ.15,352 కోట్ల పెట్టుబడి పెట్టారు. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండటం, కొనసాగుతున్న సంస్కరణలు ఇందుకు కారణాలని నిపుణులు చెబుతున్నారు. ‘‘రాబోయే కేంద్ర బడ్జెట్లో వివిధ రంగాలకు సంబంధించి ప్రోత్సహకాలు, రాయితీలు ఉండే అవకాశం ఉంది. అలాగే, అమెరికా ఫెడరల్ తన వడ్డీ రేట్లను తగ్గించే సూచనలు కూడా ఉన్నాయి. దీంతో విదేశీ పెట్టుబడిదారులు దేశీయ ఈక్విటీల్లో పెద్ద ఎత్తున కొనుగోళ్లను జరుపుతున్నారు’’ అని మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్‡్ష శ్రీవాస్తవ తెలిపారు. మరోవైపు సమీక్షా కాలంలో డెట్ మార్కెట్లో ఎఫ్‌పీఐలు రూ.8,484 కోట్ల పెట్టుబడులు పెట్టారు. విదేశీ కొనుగోలుదారులతో పాటు దేశీయ కొనుగోలు దారులు సైతం 2024లో ఈక్విటీల్లో స్థిరమైన కొనుగోలుదారులుగా ఉన్నారు. ఎఫ్‌పీఐలు జనవరి, ఏప్రిల్, మే నెలల్లో రూ.60,000 కోట్లు ఉపసంహరించుకోగా, ఫిబ్రవరి, మార్చి, జూన్లలో కలిపి రూ.63,200 కోట్లు కొనుగోళ్లు జరిపారు.బడ్జెట్‌పై ఆంచనాలు ఫిబ్రవరి మధ్యంతర బడ్జెట్ తరహాలోనే ఈసారి ఆర్థిక లోటు, రుణ లక్ష్యాలపై దృష్టి సారించవచ్చు. గ్రామీణ ఆర్థికావృద్ధిని బలోపేతం దిశగా సానుకూల ప్రకటనలు ఉండొచ్చు. తక్కువ ఆదాయ శ్రేణి వర్గాలకు పన్ను ప్రయోజనాలు ఉండొచ్చు. మూలధన వ్యయాలకు పెద్దపీట వేయవచ్చు. మొత్తంగా ప్రభుత్వ విధానాలు కొనసాగించే వీలుంది. బడ్జెట్ ఆధారిత వార్తలకు అనుగుణంగా ఆయా రంగాల షేర్లలో కదిలికలు ఉండొచ్చు. మొహర్రం సందర్భంగా బుధవారం ఎక్సే్చంజీలకు సెలవు -
కూరగాయలు భగ్గు
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో ‘యూ’టర్న్ తీసుకుంది. పదకొండు నెలలుగా మెట్లు దిగివస్తూ, 2024 మేలో 4.8 శాతానికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం, జూన్‌లో 28 బేసిస్ పాయింట్లు పెరిగి (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) 5.08 శాతానికి (2023 జూన్‌తో పోల్చి) చేరింది. అంతక్రితం గడిచిన నాలుగు నెలల్లో ఇంత తీవ్ర స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం నెలకొనడం ఇదే తొలిసారి. ఆహారం ప్రత్యేకించి కూరగాయల ధరల తీవ్రత దీనికి ప్రధాన కారణం. రిటైల్ ద్రవ్యోల్బణంలో కీలక విభాగమైన ఆహార విభాగంలో ద్రవ్యోల్బణం 9.36%గా ఉంది. మేలో ఈ రేటు 8.69%. కూరగాయల ధరలు భారీగా 29.32% పెరిగాయి. పప్పు దినుసుల ధరలు 16.07 శాతంగా నమోదయ్యాయి. ధరల పెరుగుదల నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు సన్నగిల్లాయి. -
సేవలకు కొత్త ఆర్డర్ల భరోసా
న్యూఢిల్లీ: సేవల రంగం జూన్‌లో మంచి ఫలితాన్ని నమోదుచేసుకుంది. హెచ్ఎస్బీసీ ఇండియా సరీ్వసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 60.5కు ఎగసింది. మేలో సూచీ ఐదు నెలల కనిష్ట స్థాయి 60.2కు పడిపోయిన సంగతి తెలిసిందే. కొత్త ఆర్డర్లు పెరగడం, దేశీయ, అంతర్జాతీయ విక్రయాల్లో పురోగతి వంటి అంశాలు జూన్‌లో పటిష్ట ఫలితాలు రావడానికి కారణం. కాగా, సూచీ 50పైన ఉంటే దానిని వృద్ధి ధోరణిగానే పరిగణించే సంగతి తెలిసిందే. సూచీ 50 దిగువకు పడిపోతేనే దానిని క్షీణతగా పరిగణిస్తారు. ఇదిలావుండగా, సేవలు–తయారీ విభాగాలతో కలగలిపిన హెచ్ఎస్బీసీ ఇండియా కాంపోజిట్ అవుట్‌పుట్ ఇండెక్స్ కూడా మేలో 60.5 వద్ద ఉంటే, జూన్‌లో 60.9కి ఎగసింది. 400 సంస్థల ప్యానెల్‌కు పంపిన ప్రశ్నపత్రాలకు వచి్చన ప్రతిస్పందనల తో హెచ్ఎస్బీసీ ఇండియా సరీ్వసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్‌ను ఎస్అండ్పీ గ్లోబల్ రూపొందిస్తుంది. -
జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి నైరుతి
సాక్షి, హైదరాబాద్: కేరళలోకి గురువారం ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు క్రమంగా ముందుకు సాగుతూ జూన్ 5 నుంచి 11 మధ్య తెలంగాణలోకి ప్రవేశించి విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈలోగా పగటి ఉష్ణోగ్రతలు మరికొంత పెరగొచ్చని పేర్కొన్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో ఎండలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వివరించారు. ప్రస్తుతం పశ్చిమ, వాయవ్య దిశల నుంచి వడగాడ్పులు వీస్తుండటంతో గురువారం రాష్ట్రంలో చాలాచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.మంచిర్యాల జిల్లా భీమారంలో అత్యధికంగా 47.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతగా నమోదైంది. ఇప్పటివరకు ఈ వేసవిలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం గమనార్హం. అలాగే భద్రాద్రి కొత్తగుడెం జిల్లా గరిమెల్లపాడులో 47.1 డిగ్రీల సెల్సియస్, కమాన్‌పూర్‌లో 46.7, కుంచవల్లిలో 46.6, కాగజ్‌నగర్, పమ్మిలో 46.5, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 46.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగత నమోదైంది. చాలాచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే ఖమ్మంలో 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. -
జూన్ రెండో వారంలో తెలంగాణకు రుతుపవనాలు !
సాక్షి,హైదరాబాద్: తెలంగాణకు వాతావరణ శాఖ(ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. ఈనెల చివరి వరకు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు జూన్ 8 నుంచి 11 మధ్య తెలంగాణలోకి ప్రవేశించనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను రుతుపవనాలు తాకిన విషయం తెలిసిందే. కాగా, బంగాళాఖాతంలో రుతుపవనాల కదలిక చురుగ్గా ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. సోమవారం(మే20) నుంచి మరో నాలుగు రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ నగరంలోనూ తేలికపాటి జల్లులు పడనున్నాయి. ఈ 22న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. -
మూడు దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి..
రానున్న లోక్ సభ ఎన్నికలు పలు విశేషాలు, ప్రత్యేకతలను సంతరించుకున్నాయి. ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో జరగనున్న 2024 లోక్‌సభ ఎన్నికలు అత్యంత సుదీర్ఘంగా జరగనున్నాయి. జూన్ 1న చివరి దశ ఓటింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు జూన్ నెలలో పోలింగ్ జరగడం మూడు దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి. దేశంలో మొదటి లోక్‌సభ ఎన్నికలు జరిగిన 1951-52 తర్వాత ఇవే సుదీర్ఘమైన లోక్‌సభ ఎన్నికలు. 1951 అక్టోబర్ 25 నుంచి 1952 ఫిబ్రవరి 21 మధ్య దాదాపు నాలుగు నెలల పాటు లోక్‌సభకు మొదటి సార్వత్రిక ఎన్నికలు 68 దశల్లో జరిగాయి. 1991లో జూన్‌లో ఓటింగ్ 1991లో మాత్రమే లోక్‌సభ ఎన్నికలు జూన్ నెలలో జరిగాయి. ఆ సంవత్సరం మార్చి 13న కేంద్రంలోని ప్రధానమంత్రి చంద్రశేఖర్ నేతృత్వంలోని ప్రభుత్వం రద్దయిన తర్వాత మే 20, జూన్ 12, జూన్ 15 తేదీల్లో ఓటింగ్ జరిగింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా మూడు రాష్ట్రాల్లో పోలింగ్ వాయిదా పడింది. గత మూడు లోక్‌సభ ఎన్నికల్లో ఎప్పుడూ ఎన్నికలు మే నెల తర్వాత జరగలేదు. 2019లో పోలింగ్ చివరి తేదీ మే 19 కాగా ఫలితాలు మే 23న వెల్లడయ్యాయి. 2014లో ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు మే 12 వరకు జరిగాయి. ఫలితాలు మే 16న ప్రకటించారు. 2009లో చివరి దశ పోలింగ్ మే 13న జరిగింది. -
భారత్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో ‘ఎల్‌నినో’ మాయం!
న్యూఢిల్లీ: దేశంలోని రైతులకు వాతావరణ సైంటిస్టులు గుడ్‌న్యూస్ చెబుతున్నారు. గత ఏడాదిలా కాకుండా ఈ ఏడాది దేశంలో సమృద్ధిగా వర్షాలు పడతాయని వారు అంచనా వేస్తున్నారు. 2023లో దేశంలో అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావానికి కారణమైన ఎల్‌నినో పరిస్థితులు నైరుతి రుతుపవనాలు వచ్చే సమయానికి మారిపోతాయని అమెరికాతో పాటు భారత్‌కు చెందిన వాతావరణ సైంటిస్టులు వెల్లడిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రం వేడెక్కడంతో ఏర్పడిన ఎల్‌నినో(వర్షాభావ పరిస్థితి) జూన్ నాటికి బలహీనపడి లా నినా ఏర్పడుతుందని అమెరికాకు చెందిన క్లైమేట్ ప్రెడిక్షన్ సెంటర్, నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకటించాయి. ఎల్‌నినో తొలుత ఏప్రిల్-జూన్ మధ్య ఈఎన్ఎస్ఓ(తటస్థ స్థితి)కి రావడానికి 83 శాతం, ఆ తర్వాత ఇది జూన్-ఆగస్టు మధ్య లానినాగా మారడానికి 62 శాతం అవకాశం ఉందని వెల్లడించాయి. లా నినా పరిస్థితులు ఏర్పడితే గనుక ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సమయంలో దేశంలో సాధారణవర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ సైంటిస్టులు చెబుతున్నారు. ఒక వేళ లానినా ఏర్పడకపోయినా తటస్థ(ఈఎస్ఎన్ఓ) పరిస్థితులు ఏర్పడినా భారత్‌లో ఈ ఏడాది వర్షాలకు ఢోకా ఉండదని ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ మాజీ సెక్రటరీ మాధవన్ రాజీవన్ తెలిపారు. భారత్‌లో 70 శాతం వార్షిక వర్షపాతం నైరుతి రుతుపవనాల వల్లే నమోదవుతుంది. జీడీపీలో 14 శాతం వాటా కలిగిన వ్యవసాయరంగానికి ఈ రుతుపవనాలే కీలకంగా ఉండటం గమనార్హం. ఇదీ చదవండి.. రైతుల ఉద్యమం మరింత ఉధృతం -
ఎన్‌బీఎఫ్‌సీలకు భారీగా బ్యాంకు రుణాలు
ముంబై: బ్యాంకుల నుంచి ఎన్బీఎఫ్సీలు భారీగా నిధుల సమీకరణ చేస్తున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకుల రుణాలు జూన్‌లో 35 శాతం పెరిగి రూ.14.2 లక్షల కోట్లకు చేరినట్టు కేర్ రేటింగ్స్ తెలిపింది. ఎన్బీఎఫ్సీలు అంతర్జాతీయ రుణాలపై ఆ ధారపడడాన్ని తగ్గించినట్టు ఇది తెలియజేస్తోందని పేర్కొంది. మొత్తం రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల వాటా 2022 జూన్ నాటికి ఉన్న 8.5 శాతం నుంచి ఈ ఏడాది జూన్ నాటికి 9.9 శాతానికి పెరిగినట్టు కేర్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనం జూలై 1 నుంచి అమల్లోకి వచి్చనందున.. బ్యాంకుల రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల వాటా తగ్గుతుందని అంచనా వేసింది. హెచ్డీఎఫ్సీ రుణాలు పునర్వర్గీకరణకు గురవుతాయని పేర్కొంది. ఎన్‌బీఎఫ్‌సీలకు మ్యూచువల్ ఫండ్స్ డెట్ పథకాల ఎక్స్పోజర్ సై తం జూన్‌లో 14.5 శాతం పెరిగి రూ.1.62 లక్షల కోట్లకు చేరుకున్నట్టు కేర్ రేటింగ్స్ వివరించింది. బ్యాంకుల రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల వాటా 2018 ఫిబ్రవరి నాటికి 4.5 శాతంగా ఉంటే, అది ఈ ఏడా ది జూన్ నాటికి 10 శాతానికి చేరుకున్నట్టు తెలిపింది. 2021–22 ద్వితీయ ఆరు నెలల కాలం నుంచి ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకుల రుణాలు పెరుగుతూ వ స్తున్నట్టు కేర్‌రేటింగ్స్ వెల్లడించింది. కరోనా తర్వా త ఆరి్థక కార్యకలాపాలను తిరిగి పూర్తి స్థాయిలో తెరవడం ఇందుకు అనుకూలించినట్టు తెలిపింది. -
రెట్టింపు స్థాయిలో రిటర్నుల దాఖలు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ రిటర్నులు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల కాలంలో గతేడాది ఇదే కాలంతో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో దాఖలయ్యాయి. ఆడిటింగ్ అవసరం లేని రిటర్నుల దాఖలుకు (వ్యక్తులు) గడువు జూలై 31తో ముగిసింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొత్తం 1.36 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. ఇక రిటర్నుల దాఖలుకు చివరి నెల జూలైలో మొత్తం 5.41 కోట్ల రిటర్నులు నమోదయ్యాయి. దీంతో ఏప్రిల్ నుంచి జూలై 31 నాటికి 6.77 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. 2022లో ఏప్రిల్–జూన్ మధ్య ఆదాయపన్ను శాఖ ఈఫైలింగ్ పోర్టల్‌లో 70.34 లక్షల రిటర్నులు దాఖలు కాగా, 2023 ఏప్రిల్–జూన్ మధ్య 1.36 కోట్ల రిటర్నులు నమోదయ్యాయి. ఈ ఏడాది అధిక సంఖ్యలో రిటర్నులు దాఖలు కావడానికి సోషల్ మీడియా ప్రచారం, ఎస్ఎంఎస్, ఈమెయిల్స్ ద్వారా రిటర్నులు దాఖలు చేసేలా ప్రోత్సహించడమేనని ఆదాయపన్ను శాఖ తెలిపింది. పెరిగిన కోటీశ్వరులు రూ.కోటికి పైన ఆదాయం కలిగిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2022 మార్చితో ముగిసిన రెండేళ్ల కాలంలో రెట్టింపై 1.69 లక్షలకు చేరింది. 2022–23 అసెస్మెంట్ సంవత్సరంలో మొత్తం 1,69,890 మంది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నుల్లో రూ.కోటికి పైన ఆదాయం చూపించారు. 2021–22 అసెస్మెంట్ సంవత్సరం (ఏవై) రిటర్నుల్లో రూ.కోటికి పైన ఆదాయం పేర్కొన్న వారు 1,14,446 మంది ఉన్నారు. 2020–21 అసెస్మెంట్ సంవత్సరంలో వీరి సంఖ్య 81,653గానే ఉంది. 2022–23 ఏవైలో వ్యక్తులు, కంపెనీలు, ట్రస్ట్‌లు, సంస్థలు ఇలా అన్ని వర్గాలూ కలసి రూ.కోటికి పైన ఆదాయం వెల్లడించిన వారి సంఖ్య 2.69 లక్షలుగా ఉంది. 2022–23 అసెస్మెంట్ సంవత్సరంలో మొత్తం 7.78 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. 2021–22లో ఏవైలో 7.14 కోట్లు, 2020–21 ఏవైలో 7.39 కోట్ల చొప్పున రిటర్నులు వచ్చాయి. -
టాప్ వన్‌లో ఉన్న హీరో, హీరోయిన్ ఎవరంటే..?
వివిధ సినీ ఇండస్ట్రీల్లో మోస్ట్ పాపులర్ నటులు ఎవరనే విషయంలో ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ 'ఓర్మాక్స్ మీడియా' (Ormax Media) ఒక సర్వే నిర్వహించింది. అందులో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో మోస్ట్ పాపులర్, ఇష్టమైన హీరోలు, హీరోయిన్లు ఎవరు అనేది టాప్ 10 జాబితాను ప్రకటించింది. ఈ సంస్ధ 2010 నుంచి ప్రతి నెల వారిగా జాబితాను విడుదల చేస్తుంది. 2023 జూన్ నెలకు సంబంధించి ఈ జాబితాలో మొదటి స్థానంలో కోలీవుడ్ హీరో విజయ్ ఉన్నారు. తర్వాత షారుఖ్ ఖాన్ ఉన్నారు. మూడో స్థానంలో ప్రభాస్ ఉన్నారు. (ఇదీ చదవండి: అయ్యో.. ఈ సీన్ ఎప్పుడు జరిగిందంటూ మళ్లీ హృతిక్‌ను గెలికిన కంగనా) అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా గత నెలతో చూస్తే ఈసారి మూడు స్థానాలు ఎగబాకి 4, 5వ స్థానాలలో నిలిచారు. తర్వాత అజిత్ కుమార్ (6), సల్మాన్ ఖాన్ (7)లో ఉన్నారు. గత నెలలో 6వ స్థానంలో ఉన్న రామ్ చరణ్ ఈసారి 8వ నంబర్‌తోనే సరిపెట్టుకున్నారు. అక్షయ్ కుమార్ (9), మహేష్ బాబు (10) స్థానంలో ఉన్నారు. పాన్ ఇండియా సినిమాలు చేయకుండానే మహేష్ జాతీయ స్థాయిలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల జాబితాలో చోటు సంపాదించడం గమనార్హం. గత నెలలో 10వ స్థానంలో ఉన్న KGF హీరో యశ్‌కు జూన్ నెలలో చోటు దక్కలేదు. (ఇదీ చదవండి: యాంకర్ రష్మీపై వల్గర్ కామెంట్ చేసిన కమెడియన్) ఇక హీరోయిన్ల విషయానికొస్తే.. టాప్ పొజీషన్లో టాలీవుడ్ హీరోయిన్ సమంత ఉన్నారు. తర్వాత రోండో స్థానంలో అలియా భట్ ఉన్నారు. తర్వాత దీపికా పదుకొనే, నయనతార కాజల్ అగర్వాల్, త్రిష, కత్రినా కైఫ్, కైరా అద్వానీ, కీర్తి సురేశ్, రష్మిక మందన్నా వరుసుగా టాప్ టెన్‌లో ఉన్నారు. Ormax Stars India Loves: Most popular male film stars in India (Jun 2023) #OrmaxSIL pic.twitter.com/I0e35kOGBm — Ormax Media (@OrmaxMedia) July 21, 2023 -
జూన్‌లో విమానయానం జూమ్..
దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య జూన్‌లో 1.25 కోట్లుగా నమోదైంది. గతేడాది జూన్‌లో నమోదైన 1.05 కోట్లతో పోలిస్తే 19 శాతం పెరిగింది. గో ఫస్ట్ కార్యకలాపాలు నిలి్చపోయిన నేపథ్యంలో ఇండిగో, ఎయిరిండియా, విస్తార, ఎయిర్‌ఏíÙయా ఇండియా, ఆకాశ ఎయిర్ తమ తమ మార్కెట్ వాటాలను పెంచుకున్నాయి. అయితే, స్పైస్‌జెట్ మార్కెట్ వాటా మాత్రం మరింత తగ్గింది. ఈ ఏడాది జనవరిలో ఇది 7.3 శాతంగా ఉండగా జూన్‌లో 4.4 శాతానికి పడిపోయింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 79 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా ఇండిగో.. 63.2 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది. టాటా గ్రూప్‌లో భాగమైన ఎయిరిండియా, ఎయిర్‌ఏíÙయా ఇండియా (ప్రస్తుతం ఏఐఎక్స్ కనెక్ట్‌గా పేరు మారింది) విమానాల్లో వరుసగా 12.37 లక్షలు, 10.4 లక్షల మంది ప్రయాణం చేశారు. ఎయిరిండియా మార్కెట్ వాటా 9.7 శాతంగాను, ఎయిర్‌ఏíÙయా ఇండియా వాటా 8 శాతంగాను ఉంది. 10.11 లక్షల మంది ప్రయాణికులతో విస్తార 8.1 శాతం, 6.18 లక్షల ప్యాసింజర్లతో ఆకాశ ఎయిర్ 4.9 శాతం వాటాను దక్కించుకున్నాయి. అటు స్పైస్‌జెట్ 5.55 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. మరోవైపు, సమయ పాలన విషయంలో 88.3 శాతం ఆన్ టైమ్ పర్ఫార్మెన్స్తో (ఓటీపీ) విస్తార అగ్రస్థానంలో నిల్చింది. ఇండిగో, ఆకాశ ఎయిర్ (చెరి 87.6 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. కీలకమైన హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు విమానాశ్రయాల్లో డేటా ఆధారంగా ఓటీపీని లెక్కించారు. -
టాప్ గేర్‌లో ఆటో: ఆదాయం ఎంత పెరిగిందంటే!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ ఆదాయ వృద్ధి 17 శాతం స్థాయిలో నమోదు చేయొచ్చని బ్రోకరేజీ సంస్థ ఎమ్కే గ్లోబల్ ఒక నివేదికలో అంచనా వేసింది. వివిధ విభాగాలన్నీ కూడా మెరుగ్గా రాణించడం ఇందుకు దోహదపడగలదని పేర్కొంది. టాటా మోటర్స్ మినహా పరిశ్రమలోని మిగతా సంస్థలను ఈ నివేదిక కోసం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. విభాగాలవారీగా చూస్తే అర్బన్, ప్రీమియం సెగ్మెంట్లో డిమాండ్ కారణంగా ద్విచక్ర వాహన విక్రయాలు 10 శాతం వృద్ధి చెందనున్నాయి. బజాజ్ ఆటో అమ్మకాలు 10 శాతం, టీవీఎస్ మోటర్స్వి 5 శాతం, ఐషర్ మోటర్–రాయల్ ఎన్ఫీల్డ్ విక్రయాలు 21 శాతం పెరగనున్నాయి. వాటి మొత్తం ఆదాయాలు వరుసగా 24 శాతం, 19 శాతం, 16 శాతం వృద్ధి చెందనున్నాయి. హోండా మోటర్‌సైకిల్ అమ్మకాల పరిమాణం 3 శాతం తగ్గినా ఆదాయం 6 శాతం పెరగనుంది. ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 8శాతం అప్ ఉత్పత్తిని పెంచడం, ఎస్‌యూవీలకు డిమాండ్ నెలకొనడం తదితర సానుకూల పరిణామాల నేపథ్యంలో దేశీయంగా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు క్యూ1లో 8 శాతం పెరగనున్నాయి. మారుతీ సుజుకీ విక్రయాలు 6 శాతం, ఆదాయం 17 శాతం వృద్ధి చెందనున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో డివిజన్ ఆదాయం 33 శాతం, అమ్మకాలు 21 శాతం పెరగనున్నాయి. వివిధ కేటగిరీల్లో వాహనాల లభ్యత, ధరల పెంపు వంటి అంశాల కారణంగా త్రైమాసికాలవారీగా మారుతీ సుజుకీ మార్జిన్లు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. మరోవైపు, అశోక్ లేల్యాండ్ ఆదాయం 9 శాతం, అమ్మకాలు 4 శాతం పైగా వృద్ధి చెందవచ్చు. -
నాల్గొసారి.. లక్షా 61 కోట్లకు చేరిన జీఎస్టీ ఆదాయం!
దేశీయంగా జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డ్లను నమోదు చేస్తున్నాయి. గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే ఈ ఏడాది జూన్ నెలలో 12 శాతం వృద్దిని సాధించి రూ.1,61,497 కోట్ల వసూళ్లను రాబట్టిన కేంద్ర ఆర్థిక శాఖ అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ నెలలో జీఎస్టీ రూ.1.87లక్షల కోట్లు వసూలు కాగా, మే నెలలో రూ.1,57,090 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు ఆర్థిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జీఎస్టీ కలెక్షన్లు స్థూలంగా (Gross) 1.6 లక్షల కోట్ల మార్క్‌ను దాటడం 4వ సారి, 1.4 కోట్లను వసూలు చేయడం 16 నెలలకు పెరిగింది. ఇక 1.5లక్షల కోట్ల మార్క్‌ను 7వ సారి అధిగమించినట్లు ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది. జూన్ నెలలో గ్రాస్ జీఎస్టీ రూ.1.61,497 కోట్లు వసూలైంది. వాటిల్లో సీజీఎస్టీ రూ.31,013 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.38,292 కోట్లు, ఐజీఎస్టీ రూ.80,292 కోట్లు (వస్తువుల దిగుమతిపై రూ.39,035 కోట్లతోపాటు) ఉండగా.. సెస్ రూ.11,900 కోట్లు రూ.1,028 కోట్ల దిగుమతి సుంకంతోపాటు) వసూలయ్యాయి. ఐజీఎస్టీ నుంచి కేంద్రం రూ.36,224 కోట్లు సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ కింద రూ.30,269 కోట్లు కేటాయించింది. జూన్ నెల జీఎస్టీలో కేంద్రానికి రూ.67,237 కోట్లు, రాష్ట్రాలకు రూ.68,561 కోట్లుగా సెటిల్ చేసినట్లు ఆర్థికశాఖ వెల్లడించింది. 👉 ₹1,61,497 crore gross #GST revenue collected for June 2023; records 12% Year-on-Year growth 👉 Gross #GST collection crosses ₹1.6 lakh crore mark for 4th time since inception of #GST; ₹1.4 lakh crore for 16 months in a row; and ₹1.5 lakh 7th time since inception 👉… pic.twitter.com/Q17qM9mTEX — Ministry of Finance (@FinMinIndia) July 1, 2023 -
తాజా గోల్డ్ బాండ్ స్కీమ్.. ఎప్పటి నుంచో తెలుసా?
న్యూఢిల్లీ: బంగారంలో పెట్టుబడిపెట్టాలనుకునేవారికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) మొదటి ఆరు నెలల్లో రెండుసార్లు– జూన్, సెప్టెంబర్‌లో సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అందుబాటులో రానుంది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం జూన్ 19 నుంచి 23వ తేదీ వరకూ అలాగే సెప్టెంబర్ 11 నుంచి 15 వ తేదీల్లో గోల్డ్ బాండ్ స్కీమ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. గోల్డ్ బాండ్లు– షెడ్యల్డ్ కమర్షియల్ బ్యాంకులు (స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహా), స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నిర్దిష్ట పోస్టాఫీసులు, డీ–మ్యాట్ అకౌంట్‌తో గుర్తింపు పొందిన స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా కొనుగోలు చేయవచ్చు. -
రూ.2 వేల నోటు: జూన్ బ్యాంకు హాలిడేస్ లిస్ట్ చూస్తే షాకవుతారు!
సాక్షి,ముంబై: ప్రతీ నెల చివరి వారంలో తదుపరి నెలలోని పండుగలు, బ్యాంకు హాలిడేస్‌పై ఆసక్తి ఉంటుంది. అందులోనూ పెద్ద నోటు రూ.2 వేల రీకాల్ నేపథ్యంలో జూన్ నెలలో బ్యాంకుల సెలవులకు మరింత ప్రాధాన్యత నెలకొంది. జూన్‌లో ఏకంగా 12 రోజులు బ్యాంకులు మూతపడనుండటం ఒక విధంగా నోట్ల మార్పిడికి ప్రయత్నిస్తున్న ఖాతాదారులకు షాకింగ్ అనే చెప్పాలి. (ఐపీఎల్ 2023: ముంబై ఇండియన్స్ ద్వారా అంబానీల సంపాదన ఎంతో తెలుసా?) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన ప్రకారం ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్ల మార్పిడికి, డిపాజిట్లకు గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో రెండు , నాలుగు శనివారాలు, ఆదివారాలతో కలిపి జూన్ నెలలో మొత్తం 12 రోజుల సెలవుల వివరాలు మీకోసం.. జూన్ నెలలో బ్యాంకుల సెలవులు జూన్ 4: ఆదివారం జూన్ 10: రెండో శనివారం జూన్ 11: ఆదివారం జూన్ 15: రాజా సంక్రాంతి కారణంగా మిజోరం, ఒడిశాలో బ్యాంకులకు సెలవు జూన్ 18: ఆదివారం జూన్ 20: రథయాత్ర ఒడిశా, మణిపూర్‌లో సెలవు జూన్ 24: చివరి, నాలుగో శనివారం జూన్ 25: ఆదివారం జూన్26: త్రిపురలో మాత్రమే సెలవు జూన్ 28: ఈద్ ఉల్ అజా, మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్, కేరళల బ్యాంకులకు సెలవు జూన్ 29: బక్రీద్ దేశవ్యాప్తంగా సెలవు జూన్ 30: రెమ్నా ఈద్-ఉల్-అజా మిజోరం, ఒడిశాలో సెలవు. ఇదీ చదవండి: మరో 9 వేల మందికి పింక్ స్లిప్స్ సిద్ధం: రూ 2 వేల కోట్ల డీలే కారణమా? Neuralink మనిషి మెదడులో చిప్ ప్రయోగాలు: మేము సైతం అంటున్న ట్వీపుల్ -
మారుతీ ‘జిమ్నీ’: మీకో గుడ్‌న్యూస్, ఇంట్రస్టింగ్ అప్డేట్స్
న్యూఢిల్లీ: వచ్చే నెలలో మార్కెట్లోకి రానున్న జిమ్నీ మోడల్ చేరిక సంస్థ అమ్మకాలు గణనీయంగా పెరిగేందుకు దోహదం చేస్తుందని మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) వెల్లడించింది. అంతేగాక వేగంగా అభివృద్ధి చెందుతున్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) విభాగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి స్థానాన్ని లక్ష్యంగా చేసుకున్న కంపెనీకి ఇది బలమైన మోడల్‌గా నిలుస్తుందని ఆశిస్తోంది. ఎస్యూవీ సెగ్మెంట్లో అగ్రస్థానంలో నిలిచేందుకు బ్రెజ్జా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా వంటి ఇతర మోడళ్లతో పాటు జిమ్నీ కీలక పాత్ర పోషించాలని సంస్థ భావిస్తోంది. ప్యాసింజర్ కార్ల రంగంలో భారత్‌లో ఎస్‌యూవీల వాటా ప్రస్తుతం 45 శాతం ఉంది. ఎస్‌యూవీల్లో కాంపాక్ట్ ఎస్‌యూవీలు సగానికిపైగా వాటాను కైవసం చేసుకున్నాయి. 2022–23లో దేశంలో 39 లక్షల యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి. ఇందులో కాంపాక్ట్ ఎస్‌యూవీలు 8.7 లక్షల యూనిట్లు ఉన్నాయి. లైఫ్‌స్టైల్ ఎస్యూవీ సెగ్మెంట్ కొత్తగా ప్రాచుర్యంలోకి వస్తోంది. (మంటల్లో మహీంద్రా ఎక్స్‌యూవీ700: వీడియో వైరల్, స్పందించిన కంపెనీ) కంపెనీ వృద్ధిలో సాయం.. సంస్థ మొత్తం బ్రాండ్ విలువపై జిమ్నీ సానుకూల ప్రభావం చూపుతుందని మారుతీ సుజుకీ ఇండియా సేల్స్, మార్కెటింగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ‘ఒక నిష్ణాత ఎస్‌యూవీగా వారసత్వాన్ని జిమ్నీ కలిగి ఉంది. ఈ విభాగంలో కంపెనీ వృద్ధికి ఇది ఖచ్చితంగా సహాయం చేస్తుంది’ అని అన్నారు. అయిదు డోర్లు కలిగిన జిమ్నీ ఎస్యూవీ అభివృద్ధి కోసం ఎంఎస్ఐ రూ.960 కోట్లు వెచ్చించింది. ప్రపంచవ్యాప్తంగా 199 దేశాలు, ప్రాంతాల్లో సుజుకీ ఇప్పటి వరకు 32 లక్షల యూనిట్ల జిమ్నీ వాహనాలను విక్రయించింది. విదేశాల్లో ఇది మూడు డోర్లతో లభిస్తోంది. తొలిసారిగా అయిదు డోర్లతో భారత్‌లో రంగప్రవేశం చేస్తోంది. ఆల్-టెరైన్ కాంపాక్ట్ లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీగా స్థానం సంపాదించింది. ఈ ఫోర్-వీల్-డ్రైవ్ ఆఫ్-రోడర్ కఠినమైన భూభాగాల్లో కూడా పరుగెత్తగలదు. (e-Sprinto Amery: మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి చార్జి చేస్తే 140 కిలోమీటర్లు..) జిమ్నీకి 30 వేల బుకింగ్స్.. ఇప్పటికే జిమ్నీ కోసం సుమారు 30,000 బుకింగ్స్ నమోదయ్యాయని శ్రీవాస్తవ వెల్లడించారు. వచ్చే నెల నుంచి డెలివరీలు ఉంటాయన్నారు. ఏటా దాదాపు 48,000 యూనిట్ల విక్రయాలు నమోదయ్యే లైఫ్‌స్టైల్ ఎస్యూవీ సెగ్మెంట్ రాబోయే కొద్ది సంవత్సరాల్లో త్వరగా విస్తరిస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది. జిమ్నీతో అమ్మకాలు తక్కువ సమయంలో రెట్టింపు అవుతాయని శ్రీవాస్తవ చెప్పారు. బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఫ్రాంక్స్, జిమ్నీలతో కంపెనీ 2022–23లో దేశీయ ఎస్యూవీ విభాగంలో 25 శాతం మార్కెట్ వాటాను ఆశిస్తోంది. ఎస్యూవీ సెగ్మెంట్లో కంపెనీ వాటా 2022 ఏప్రిల్‌లో 12 శాతం ఉంటే.. గత నెలలో ఇది 19 శాతానికి ఎగసిందన్నారు. (నైజిరియన్ చెఫ్ రికార్డ్: ఏకంగా 100 గంటలు వంట, ఎందుకో తెలుసా?) సాయుధ దళాలకు.. జిప్సీ మాదిరిగా సాయుధ దళాలకు జిమ్నీ వాహనాలను అందించాలని అనుకుంటున్నారా అన్న ప్రశ్నకు శ్రీవాస్తవ స్పందిస్తూ.. ఈ మోడల్‌ను పరిచయం చేసిన తర్వాత ఏదైనా నిర్దిష్ట అవసరం ఉంటే కచ్చితంగా పరిశీలిస్తాం. గతంలో సాయుధ దళాలకు 6–10 వేల యూనిట్ల జిప్సీ వాహనాలను సరఫరా చేసేవాళ్లం. ప్రస్తుతం జిప్సీ తయారీని నిలిపివేశాం అని తెలిపారు. మరిన్ని బిజినెస్ వార్తలు, ఇంట్రస్టింగ్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
డుండుండుం పిపిపి.. మే, జూన్ నెలల్లో 24 పెళ్లి ముహూర్తాలు.. తేదీలివే!
సాక్షి, అమరావతి: మండు వేసవిలో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. మే, జూన్ నెలల్లో దాదాపు 24 శుభముహూర్తాలు ఉన్నట్టు పండితులు ప్రకటించారు. గత శుభకృతు నామ సంవత్సరం(2022–23)లో దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత వచ్చిన శుభ ముహూర్తాలకు ఏపీ, తెలంగాణలో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ తర్వాత ఆగస్టు నుంచి నవంబర్ నెలాఖరు వరకు సరైన ముహూర్తాలు లేవు. మళ్లీ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 12 వరకు పెళ్లిళ్లు జరిగాయి. డిసెంబర్ 16 నుంచి ఈ ఏడాది జనవరి 14 వరకు ధనుర్మాసం కావడంతో వివాహాలు చేయలేదు. జనవరి 19 నుంచి మార్చి 9 వరకు మొత్తం 18 శుభ ముహూర్తాలు వచ్చాయి. మళ్లీ నెల రోజుల విరామం తర్వాత తాజాగా మే నెలలో 6, 8, 9, 10, 11, 15, 16, 20, 21, 22, 27, 29, 30 తేదీలతో పాటు జూన్‌లో 1, 3, 5, 6, 7, 11, 12, 23, 24, 26, 27 తేదీల్లో శుభముహూర్తాలు ఉన్నాయని పండితులు ప్రకటించారు. ఇప్పుడు కాకుంటే మరో 2 నెలలు బ్రేక్.. మే మాసం అంతా వరుసగా మంచి ముహూర్తాలున్నాయి. జూన్ నెలలో కూడా 18వ తేదీ వరకు అనువైన ముహూర్తాలు బాగానే ఉన్నాయి. 19వ తేదీ నుంచి ఆషాఢ మాసం మొదలుకానుండటంతో మళ్లీ శుభకార్యాలకు బ్రేక్ పడనుంది. ఆషాఢ మాసం జూలై 18 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత వచ్చే శ్రావణ మాసం, అధిక శ్రావణ మాసం ఆగస్టు 17 వరకు ఉంటుంది. దీంతో జూలై, ఆగస్టు నెలల్లో పెళ్లిళ్లకు బ్రేక్ పడుతుందని పండితులు చెబుతున్నారు. వివాహాలకే.. గృహ ప్రవేశాలకు అనుకూలించవు ప్రస్తుత వైశాఖం, జ్యేష్ఠ మాసాల్లో దాదాపు 25 మంచి ముహూర్తాలున్నాయి. వీటిలో చాలా ముహూర్తాలు పెళ్లిళ్లు, ఉపనయనాలకు బాగా అనుకూలిస్తాయి. మే 11 నుంచి 24వ తేదీ వరకు అగ్ని కార్తె ఉండటంతో ఆ సమయంలో వచ్చే ముహూర్తాలు గృహ ప్రవేశాలకు అనుకూలించవు. జూన్ నెలాఖరు వరకు ముహూర్తాలున్నప్పటికీ ఆషాఢం వస్తుంది. ఆ తర్వాత దాదాపు 2 నెలల పాటు ముహూర్తాలు ఉండవు. అందుకే మే, జూన్ నెల మొదట్లోనే వివాహాలు జరిపించేందుకు చాలా మంది ఏర్పాట్లు చేసుకుంటున్నారు. – కొత్తపల్లి సూర్యప్రకాశరావు, పురోహితుడు, భీమవరం -
క్యూ1లో పీఈ పెట్టుబడులు డీలా!
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి క్వార్టర్లో ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు దేశీ కంపెనీలలో 17 శాతం క్షీణించాయి. వార్షిక ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో 6.72 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 53,000 కోట్లు)కు పరిమితమయ్యాయి. డీల్స్ సైతం 15 శాతం నీరసించి 344కు చేరాయి. గతేడాది(2021–22) క్యూ1లో 8.13 బిలియన్ డాలర్ల పెట్టుబడులు నమోదయ్యాయి. ఇక గతేడాది జనవరి–మార్చి(క్యూ4)లో తరలివచ్చిన 8.97 బిలియన్ డాలర్లతో పోలిస్తే త్రైమాసికవారీగా 25 శాతం తగ్గాయి. లావాదేవీల సమీక్షా సంస్థ, లండన్ స్టాక్ ఎక్సే్ఛంజీ గ్రూప్ కంపెనీ రెఫినిటివ్ వెల్లడించిన గణాంకాలివి. కాగా.. ఈ క్యాలండర్ ఏడాది(2022)లో తొలి ఆరు నెలల(జనవరి–జూన్)ను పరిగణిస్తే.. దేశీ కంపెనీలలో పీఈ పెట్టుబడులు 26 శాతం పుంజుకుని 15.7 బిలియన్ డాలర్లను తాకాయి. టెక్నాలజీ స్పీడ్ 2022 జనవరి–జూన్ మధ్య పీఈ పెట్టుబడుల్లో టెక్నాలజీ రంగానికి అత్యధిక ప్రాధాన్యత లభించింది. మొత్తం పెట్టుబడుల్లో 73 శాతానికిపైగా అంటే 6.53 బిలియన్ డాలర్లను టెక్ రంగం సొంతం చేసుకుంది. ఏడాదిక్రితంతో పోలిస్తే ఇండియా ఆధారిత ఫండ్స్ రెట్టింపునకుపైగా 7 బిలియన్ డాలర్లను సమీకరించినట్లు రెఫినిటివ్ పేర్కొంది. ఈ పెట్టుబడులు సైతం వెచ్చించవలసి ఉన్నట్లు తెలియజేసింది. ఇక పరిశ్రమలవారీగా చూస్తే ఇంటర్నెట్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, రవాణా గరిష్టంగా పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. అయితే బయోటెక్నాలజీ, మెడికల్– హెల్త్ విభాగాలకు పెట్టుబడులు భారీగా నీరసించాయి. కాగా.. తొలి అర్ధభాగంలో 10 పీఈ డీల్స్‌లో వెర్సే ఇన్నోవేషన్(82.77 కోట్ల డాలర్లు), థింక్ అండ్ లెర్న్(80 కోట్ల డాలర్లు), బండిల్ టెక్నాలజీస్(70 కోట్ల డాలర్లు), టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ(49.47 కోట్ల డాలర్లు), ఎన్‌టెక్స్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్(330 కోట్ల డాలర్లు), డెల్హివరీ(30.4 కోట్ల డాలర్లు) బిజీబీస్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్(30 కోట్ల డాలర్లు) చోటు చేసుకున్నాయి. -
ఈక్విటీ పథకాల్లోకి రూ.15,498 కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పటి మాదిరే జూన్ మాసంలోనూ ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని చూరగొన్నాయి. రూ.15,498 కోట్లు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. ఈక్విటీ పథకాల్లోకి ఇలా నికరంగా పెట్టుబడుల రాక వరుసగా 16వ నెల (2021 ఫిబ్రవరి నుంచి) కావడం గమనార్హం. అయితే, ఈ ఏడాది మే నెలలో ఈక్విటీ పథకాలు రూ.18,529 కోట్లను ఆకర్షించాయి. దీంతో పోలిస్తే జూన్‌లో కాస్తంత తగ్గాయి. ఫండ్స్‌లో పెట్టుబడులకు సంబంధించి జూన్ నెల గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. దాదాపు అన్ని విభాగాలూ పెట్టుబడులను ఆకర్షించాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో వచ్చిన పెట్టుబడులు రూ.12,286 కోట్లుగా నమోదయ్యాయి. సిప్ ఖాతాల సంఖ్య 5.54 కోట్లకు పెరిగింది. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ విభాగంలోకి అత్యధికంగా రూ.2,512 కోట్ల పెట్టుబడులు రాగా, మల్టీక్యాప్ పథకాల్లోకి రూ.2,130 కోట్లు వచ్చాయి. బంగారం ఈటీఎఫ్‌లు రూ.135 కోట్లు ఆకర్షించాయి. అలాగే, ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు రూ.12,660 కోట్లు రాబట్టాయి. నూతన పథకాల ఆవిష్కరణపై సెబీ నిషేధం విధించినప్పటికీ పెట్టుబడుల రాక బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. డెట్ విభాగం నుంచి జూన్ నెలలో రూ.92,247 కోట్లకు నికరంగా బయటకు వెళ్లాయి. అంతకుముందు మేలో డెట్ పథకాల నుంచి రూ.32,722 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకోవడం గమనార్హం. అన్నీ కలిపి చూస్తే జూన్ నెలలో ఫండ్స్ పరిశ్రమ నుంచి రూ.69,853 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. నిర్వహణ ఆస్తులు మే చివరికి రూ.37.37 లక్షల కోట్లుగా ఉంటే, జూన్ చివరికి రూ.36.98 లక్షల కోట్లకు తగ్గాయి. ప్రతికూలతలు ఉన్నా.. ‘‘విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) నుంచి విక్రయాల తీవ్రత పెట్టుబడుల రాకపై ఉంది. దీనికితోడు అంతర్జాతీయ మాంద్యం ఆందోళనలు కూడా ఉన్నాయి. బిట్‌కాయిన్, ఎథీరియం ఇతర క్రిప్టో కాయిన్ల ధరలు పతనం అయ్యాయి. సంప్రదాయ ఉత్పత్తుల్లో రాబడులు తక్కువగా ఉన్నాయి. దీర్ఘకాల పెట్టుబడుల సాధపాల పట్ల ఇన్వెస్టర్లలో పెరిగిన అవగాహన పెట్టుబడుల రాక కొనసాగేందుకు సాయపడ్డాయి’’అని మార్నింగ్‌స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ కవిత కృష్ణన్ తెలిపారు. మార్కెట్లో అస్థిరతలు అధికంగా ఉన్నా కానీ, ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా చురుకైన పాత్ర పోషిస్తున్నట్టు ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి తెలిపారు. ఒక్క జూన్ మాసంలోనే ఎఫ్‌పీఐలు రూ.50వేల కోట్ల మేర ఈక్విటీల్లో అమ్మకాలు చేయడం గమనార్హం. ‘‘అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. రూపాయి బలహీనపడుతోంది. వర్షాల ప్రారంభం మిశ్రమంగా ఉంది. దేశీయంగా, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇవన్నీ చిన్న పొదుపుదారులను అవరోధం కాలేదు. వారు సిప్ ద్వారా తమ పెట్టుబడులు కొనసాగించారు’’అని యాంఫి సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ తెలిపారు. -
యస్‌బ్యాంకు భారీ ఊరట: రుణాల్లో 14 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: గతేడాది జూన్ ఆఖరుతో పోలిస్తే ఈ ఏడాది జూన్ ఆఖరు నాటికి ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ రుణాల వ్యాపారం 14 శాతం వృద్ధి చెంది రూ. 1,63,654 కోట్ల నుంచి రూ. 1,86,598 కోట్లకు చేరింది. జూన్ క్వార్టర్లో స్థూల రిటైల్ రుణాలు రెట్టింపై రూ. 5,006 కోట్ల నుంచి రూ. 11,431 కోట్లకు పెరిగాయి. ఇక డిపాజిట్లు 18.3 శాతం వృద్ధితో రూ. 1,63,295 కోట్ల నుంచి రూ. 1,93,241 కోట్లకు చేరాయి. అయితే, మార్చి త్రైమాసికంతో పోలిస్తే 2 శాతం తగ్గాయి. ఇవి ప్రొవిజనల్ గణాంకాలని, త్వరలోనే జూన్ త్రైమాసిక ఆర్తిక ఫలితాలను ప్రకటించ నున్నామని బ్యాంక్ తెలిపింది. అటు, ఆర్బీఎల్ బ్యాంక్ కూడా తమ వ్యాపార గణాంకాలను స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మొత్తం డిపాజిట్లు 6 శాతం పెరిగి రూ. 79,217 కోట్లకు చేరినట్లు పేర్కొంది. రిటైల్ రుణాలు వార్షికంగా 5 శాతం, సీక్వెన్షియల్‌గా 3 శాతం క్షీణించాయని వివరించింది. గత కొద్ది త్రైమాసికాలుగా పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో వ్యాపారం కూడా పుంజుకుంటోందని ఆర్బీఎల్ బ్యాంకు పేర్కొంది. -
జూన్‌లోనూ భారీగానే, కానీ మే నెలతో పోలిస్తే
న్యూఢిల్లీ: యూయూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఆధారిత డిజిటల్ లావాదేవీలు జూన్ నెలలోనూ భారీగా నమోదయ్యాయి. వరుసగా రెండో నెలలో రూ.10లక్షల కోట్లకుపైగా విలువైన లావాదేవీలు జరిగినట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) డేటా స్పష్టం చేస్తోంది. అయితే మే నెలతో పోలిస్తే లావాదేవీల విలువ జూన్‌లో 3 శాతం తగ్గింది.యూపీఐ లావాదేవీలు మేతో పోలిస్తే జూన్‌లో వాల్యూమ్ , విలువ రెండింటిలోనూ తగ్గిపోయాయని ఎన్పీసీఐ డేలా తెలిపింది. జూన్ నెలకు రూ.10,14,384 కోట్ల విలువ చేసే యూపీఐ లావాదేవీలు నమోదు కాగా, మే నెలకు ఈ మొత్తం రూ.10,41,506 కోట్లుగా ఉంది. జూన్ నెలలో 596 కోట్ల యూపీఐ లావాదేవీలు (సంఖ్య) నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్ నెలకు యూపీఐ లావాదేవీలు 558 కోట్లుగా ఉంటే, వీటి విలువ రూ.9,83,302 కోట్లుగా ఉండడం గమనార్హం. -
పండగే పండగ.. జూన్‌లో సినిమాల జాతర!
మొన్నటిదాకా భారీ బడ్జెట్ సినిమాలు దుమ్ములేపాయి. కరోనాతో వెలవెలబోయిన థియేటర్లకు జనాలను రప్పిస్తూ తిరిగి కళకళలాడేలా చేశాయి. దీంతో అప్పటిదాకా రిలీజ్ చేయాలా? వద్దా? అని ఆలోచించిన సినిమాలన్నీ వరుసపెట్టి విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని బోల్తా కూడా కొట్టాయి. మరికొన్ని అంచనాలకు మించిన విజయాన్ని అందుకున్నాయి. ఇదే హుషారుతో జూన్ నెల కూడా బోలెడన్ని సినిమాలతో రెడీ అయింది. ఇప్పటికే జూన్ 3న సౌత్‌లో రిలీజైన రెండు సినిమాలు మేజర్, విక్రమ్, పృథ్వీరాజ్ మంచి హిట్లుగా నిలిచాయి. మరి రానున్న రోజుల్లో ఏమేం సినిమాలు రిలీజవుతున్నాయో చూద్దాం.. జూన్ 10న 'అంటే సుందరానికీ', 'సురాపానం, జరిగిన కథ', '777 చార్లీ', 'జురాసిక్ వరల్డ్ డొమీనియన్' సినిమాలు రిలీజవుతున్నాయి. 17వ తేదీన 'గాడ్సే', 'విరాటపర్వం', కన్నడ డబ్బింగ్ మూవీ 'కే3', కీర్తి సురేశ్ 'వాశి', 'కిరోసిన్' ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే జూన్ చివరి వారంలో రిలీజవుతున్న సినిమాలు మరో ఎత్తు. జూన్ ఆఖరి వారంలో ఏకంగా 9 సినిమాలు విడుదలవుతున్నాయి. జూన్ 23న 'కొండా', 24న 'సమ్మతమే', '7 డేస్ 6 నైట్స్', 'ఒక పథకం ప్రకారం', 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు', '10th క్లాస్ డైరీస్', 'సదా నన్ను నడిపే', 'సాఫ్ట్వేర్ బ్లూస్' సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. కృష్ణ వ్రింద విహారి సినిమా కూడా జూన్ నెలలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని చిన్న మూవీస్ కూడా తమ లక్ పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాయి. మరి వీటిలో ఏ సినిమాలకు ప్రేక్షకులు జై కొడతారనేది చూడాలి. చదవండి: ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను: ఉదయభాను భావోద్వేగం నాకు సినిమా అవకాశాలు లేకుండా పోయాయి సల్మాన్ కంటతడి -
వామ్మో ‘జూన్’.. తలుచుకుంటే వణుకు పుడుతోంది!
‘జూన్ అంటేనే మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ నెలలోనే విద్యాసంస్థలు, వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల్లో ఫీజులు చుక్కలనంటుతున్నాయి. బుక్స్, యూనిఫాం, పెన్నులు, పెన్సిల్ ఇతరాత్ర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు వానాకాలం సీజన్ మొదలవ్వడంతో రైతులు పెట్టుబడుల కోసం తిప్పలు పడుతున్నారు. విత్తనాలు, ఇతర ఖర్చులకు డబ్బుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూనే బ్యాంకర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దీంతో ఈనెల ఎలా గట్టేక్కుతుందా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.’ సాక్షి,కరీంనగర్: పేద, మధ్య తరగతి కుటంబీకుల జేబులకు చిల్లుపడే మాసం వచ్చేసింది. ఈ నెల 12 నుంచి కొత్తవిద్యాసంవత్సరం ప్రారంభంకానున్న నేపథ్యంలో పిల్లల చదువుకు పెట్టే ఖర్చులపై తల్లిదండ్రులు బేరీజు వేసుకుంటున్నారు. కొత్తగా అడ్మిషన్ తీసుకునేవారు ప్రైవేటు విద్యాసంస్థలు వసూలు చేస్తున్న అడ్మిషన్, డొనేషన్ ఫీజులు చూసి జంకుతున్నారు. ఇదివరకే చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం తదితర వస్తువుల కొనుగోలుతో తల్లిదండ్రులకు జేబులకు చిల్లుపడనుంది. దీంతో ‘వామ్మో జూన్’ అంటూ తలపట్టుకుంటున్నారు. ఒక వైపు తమ పిల్లలను ఏ పాఠశాలలో చేర్పించాలి, ఏయే స్కూల్లో ఏ స్థాయి ఫలితాలు వచ్చాయి, తదితర అంశాలపై తల్లిదండ్రులు విశ్లేషించుకుంటున్నారు. అప్పు చేసైనా పైసలున్న బడికి.. జిల్లావ్యాప్తంగా సుమారు 600 పైగా ప్రైవేట్ పాఠశాలల్లో వాటి విద్యాప్రమాణాలు, ఇతర అంశాలతో కూడిన స్థాయిని బట్టి ఏడాదికి రూ.10 వేల నుంచి మొదలుకొని రూ.లక్షకు పైగా ఫీజులున్నాయి. అందులోనూ ఐఐటీ, ట్యూషన్, సాంస్కృతిక, కరాటే తదితర అంశాలు నేర్పించేందుకు అదనంగా రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు ప్రైవేట్ స్కూళ్లు వసూలు చేస్తున్నాయి. వీటిలో కొన్ని తోకల పేరుతో 1వ తరగతికే రూ.లక్షల్లో వసూలు చేయడం విశేషం. కొన్ని పాఠశాలలైతే నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అప్పు చేసైనా ప్రైవేట్ స్కూల్ అనేది వేళ్లూనుకోవడంతో దిగువ, మధ్య తరగతి జనం కూడబెట్టుకున్న దానికి మరికొంత అప్పు చేసి పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. రైతులకు ఖరీఫ్ భారం ఏటా రైతులకు వానాకాలం సీజన్ భారంగా మారుతోంది. ఈ యాసంగి పంటలు పండినా ధా న్యం డబ్బు చేతికి రాని దైన్య స్థితిలో రైతులు ఉ న్నారు. వ్యవసాయ పనులూ అంతంతే. ఇతరత్రా కూలీ పనులు దొరక్క గ్రామీణులుæ ఉపాధి పనుల కు వెళ్లినా కొద్ది రోజులుగా డబ్బులు అందక వారి పరిస్థితి గందరగోళంగా ఉంది. మండుతున్న ఎండల్లో ఉపాధి పనులకు వెళ్తే రూ.200 నుంచి రూ. 250 వరకు దక్కడం లేదు. ఈ పరిస్థితుల్లో ఖరీ ఫ్‌నకు సంబంధించి ఎరువులు, విత్తనాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల్లో సరిపడా రుణాలు లభించక అప్పు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. పిల్లల చదువు, వ్యవసాయ ఖర్చులు అంచనా వేయలేని స్థితి ఏర్పడడంతో పేద, మధ్య తరగతి ప్రజల్లో ఆందోళన నెలకొంది. చదవండి: కుక్క కరిచిందా.. అయితే రూ.10వేలు తీసుకోవడం మరచిపోకండి!