వారఫలాలు : 26 జూన్ నుంచి 2జూలై, 2016 వరకు | varaphalalu | Sakshi
Sakshi News home page

వారఫలాలు : 26 జూన్ నుంచి 2జూలై, 2016 వరకు

Published Sun, Jun 26 2016 12:02 AM | Last Updated on Mon, Sep 4 2017 3:23 AM

వారఫలాలు : 26 జూన్ నుంచి 2జూలై, 2016 వరకు

వారఫలాలు : 26 జూన్ నుంచి 2జూలై, 2016 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలమ వుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు. రాజకీయవర్గాలకు సన్మానాలు. ఎరుపు, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.
 
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆర్థికంగా బలపడతారు.  ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది. వివాహ, ఉద్యోగయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. కళాకారులకు అవార్డులు దక్కే సూచనలు. నీలం, ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
 
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
అనుకున్న కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆరోగ్యం, కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. పొరపాట్లు సరిదిద్దుకుని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటాబయటా అనుకూల పరిస్థితి నెలకొంటుంది. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. రాబడి పెరిగి అవసరాలు తీరతాయి. వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. నలుపు, లేత పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.
 
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)

ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మిత్రులు, బంధువులతో విభేదాలు తొలగుతాయి. జీవితాశయం నెరవేరుతుంది. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు తథ్యం. వాహనసౌఖ్యం. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం కొంత తగ్గవచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. తెలుపు, గులాబి రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి పఠించండి.
 
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక ఇబ్బందులు కొంత తొలగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. అనుకున్న పనులు నెమ్మదిగా సాగుతాయి. దూరపు బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు కలసివస్తాయి.  ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
 
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. ఒక సమస్య పరిష్కారమవుతుంది. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళాకారులకు ప్రయత్నాలు సఫలం. నీలం, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.
 
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
పనులు సజావుగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. భూలాభాలు. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. ఆకుపచ్చ, లేత పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి.
 
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. పలుకుబడి కలిగినవారు పరిచయమై సహాయపడతారు. కొన్ని వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకుంటారు.  ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు సన్మానయోగం. ఎరుపు, తెలుపురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.
 
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు మొదట్లో ఇబ్బందికరంగా ఉన్నా క్రమేపీ పుంజుకుంటాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. భూవివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రావచ్చు. కళాకారులకు సన్మానయోగం. పసుపు, చాక్లెట్ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
 
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
పనులు ముందుకు సాగవు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. రాబడి అంతగా కనిపించదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సోదరులు, మిత్రులతో కలహాలు. విద్యార్థులకు నిరుత్సాహం. ఆరోగ్యపరంగా కొద్దిపాటి ఇబ్బందులు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. రాజకీయవర్గాలకు ఒత్తిడులు. నీలం, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
 
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు రావచ్చు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు సన్మానయోగం. ఆకుపచ్చ, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి.
 
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పట్టింది బంగారమే. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. యత్నకార్యసిద్ధి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. గులాబి, తెలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement