వారఫలాలు : 17 జూలై నుంచి 23జూలై, 2016 వరకు | Rasi Phalalu | Sakshi
Sakshi News home page

వారఫలాలు : 17 జూలై నుంచి 23జూలై, 2016 వరకు

Published Sun, Jul 17 2016 3:20 AM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

వారఫలాలు : 17 జూలై నుంచి 23జూలై, 2016 వరకు

వారఫలాలు : 17 జూలై నుంచి 23జూలై, 2016 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
పనులు నిదానంగా కొనసాగుతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు. కాంట్రాక్టుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో కొద్దిపాటి మార్పులు. ఉద్యోగులకు ఒత్తిడులు తప్పవు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. విద్యార్థులకు ఆశించిన ఫలితాల కోసం అదనపు శ్రమ తప్పదు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
 
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
కొత్త ప్రయత్నాలు సానుకూలం. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలు. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. ఎరుపు, చాక్లెట్, నేరేడు, గులాబి రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.
 
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత. విలువైన సమాచారం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. వ్యాపారులకు అధికలాభాలు. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పసుపు, లేత ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.
 
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. అందరిలోనూ గుర్తింపు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. లాభదాయకమైన కాంట్రాక్టులు దక్కుతాయి. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. చాక్లెట్, పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
 
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం పొందుతారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. ధార్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చిరకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయ, కళారంగాల వారికి యోగవంతంగా ఉంటుంది. ఎరుపు, తెలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
 
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొన్ని కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. బంధుమిత్రుల సహాయం అందుతుంది. ఇంటర్వ్యూలు ఉత్సాహాన్నిస్తాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయదర్శనాలు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు. ప్రతిభకు గుర్తింపు దొరుకుతుంది. ఉద్యోగాలలో పదోన్నతులు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
 
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. దూరప్రయాణాలు ఉంటాయి. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు మార్పులు. కళాకారులు, రాజకీయవేత్తలకు అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. తెలుపు, లేత ఆకుపచ్చ రంగులు,  పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
 
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
పట్టిందల్లా బంగారమే అన్నట్లుంటుంది. సేవాకార్యక్రమాలపై ఆసక్తి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహన,కుటుంబసౌఖ్యం. అత్యంత విలువైన సమాచారం. పాతబాకీలు వసూలవుతాయి. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్య నుంచి బయటపడతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయ, కళారంగాల వారికి పురస్కారాలు. ఎరుపు, నేరేడు రంగులు, ద క్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రం పఠించండి.
 
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. కుటుంబ సమస్యలు తీరుతాయి. పొరపాట్లు సరిదిద్దుకుని పనుల్లో విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో చిరకాలంగా సాగుతున్న ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు  విదేశీ పర్యటనలు ఉంటాయి. గులాబి, బంగారు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనక దుర్గా స్తోత్రాలు పఠించండి.
 
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొత్తకార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అవివాహితులకు వివాహ యత్నాలు, నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఉత్సాహంగా ఉంటుంది. రాజకీయ, కళారంగాల వారికి పురస్కారాలు. ఆస్తి వివాదాలు పరిష్కారం. నలుపు, లేత ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
 
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఈవారం కొన్ని కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. బంధువుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉండవచ్చు. పనిభారం పెరగవచ్చు. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా. నీలం, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
 
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. పట్టుదల పెరుగుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయ, కళారంగాల వారికి అనుకోని అవకాశాలు. పసుపు, ఎరుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. వినాయక స్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement