వారఫలాలు : 24 జూలై నుంచి 30జూలై, 2016 వరకు | varaphalalu | Sakshi
Sakshi News home page

వారఫలాలు : 24 జూలై నుంచి 30జూలై, 2016 వరకు

Published Sun, Jul 24 2016 1:38 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

వారఫలాలు : 24 జూలై నుంచి 30జూలై, 2016 వరకు

వారఫలాలు : 24 జూలై నుంచి 30జూలై, 2016 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
వ్యయప్రయాసలు. ఆదాయానికి మించి ఖర్చులు. పనుల్లో ప్రతిబంధకాలు. బంధువులతో అకారణంగా వివాదాలు. కొన్ని ఒప్పందాలు, రిజిస్ట్రేషన్లు వాయిదా వేస్తారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయ వర్గాలకు నిరుత్సాహం. పసుపు, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
 
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. ఆరోగ్య సమస్యలు తీరతాయి. పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి. ఉద్యోగులకు కొన్ని సమస్యలు తీరతాయి. కళాకారులకు యత్నకార్యసిద్ధి. లేత ఆకుపచ్చ, నలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతకు కుంకుమార్చన చేయండి.
 
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

ఆదాయం పెరిగి రుణాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. సోదరులు, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు లాభిసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయ వర్గాలకు నూతనోత్సాహం. పసుపు, లేత నీలం రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
 
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలోనూ, కుటుంబంలోనూ ప్రత్యేక గౌరవం పొందుతారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధన లాభ సూచనలు. వివాహ, ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగి ఊరట లభిస్తుంది. రాజకీయ వర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. తెలుపు, ఎరుపు రంగులు, హనుమాన్ చాలీసా పఠించండి.
 
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య విషయంలో కొద్దిపాటి చికాకులు. బంధువులతో మాటపట్టింపులు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కళాకారులకు ఒత్తిడులు. గులాబి, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
 
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆదాయానికి మించి ఖర్చులు. అనుకున్న పనుల్లో ఆటంకాలు. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వేడుకలకు డబ్బు వెచ్చిస్తారు. ఆరోగ్య భంగం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందకొడిగానే సాగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనల్లో మార్పులు. ఆకుపచ్చ, నీలం రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
 
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వాహన యోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహంగా ఉంటుంది. పసుపు, నేరేడురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణు ధ్యానం చేయండి.
 
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
 ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. అనూహ్యంగా ఒక ఆహ్వానం అందుతుంది. మీ తెలివితేటలకు తగిన గుర్తింపు రాగలదు. వాహన, గృహ యోగాలు కలుగుతాయి. బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు. రాజకీయ వర్గాలకు పదవులు దక్కే సూచనలు. గులాబి, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
 
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటా బయటా చికాకులు ఎదుర్కొంటారు. ఆరోగ్యవిషయంలో కొంత శ్రద్ధ చూపండి. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. కళాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. లేత ఆకుపచ్చ, పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి.
 
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంత కాలం పడిన శ్రమ వృథా కాగలదు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామిక వర్గాలకు పర్యటనలు వాయిదా. నీలం, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
 
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
చేపట్టిన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. శ్రమాధిక్యం. బంధు మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. నిరుద్యోగుల కృషి అంతగా ఫలించదు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో చికాకులు ఎదురవుతాయి. రాజకీయ వర్గాలకు నిరుత్సాహం. నలుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీనృసింహ స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిచయాలు పెరుగుతాయి. స్థిరాసి ్తలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు తథ్యం. కళాకారులకు సత్కారాలు. గులాబి, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రామరక్షా స్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement