వారఫలాలు : 3 జూలై నుంచి 9జూలై, 2016 వరకు | varaphalalu | Sakshi
Sakshi News home page

వారఫలాలు : 3 జూలై నుంచి 9జూలై, 2016 వరకు

Published Sun, Jul 3 2016 1:53 AM | Last Updated on Mon, Sep 4 2017 3:59 AM

వారఫలాలు : 3 జూలై నుంచి 9జూలై, 2016 వరకు

వారఫలాలు : 3 జూలై నుంచి 9జూలై, 2016 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి.  ఆస్తి వ్యవహారాలలో కొద్దిపాటి చిక్కులు. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆలోచనలు అంతగా కలసిరావు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వ్యాపారాలు స్వల్పంగానే లాభిస్తాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా పడవచ్చు. పసుపు, లేత ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతిని అర్చించండి.
 
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.  స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వాహన, గృహయోగాలు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారుల ఆశలు ఫలిస్తాయి. నీలం, ఆకుపచ్చరంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతను పూజించండి.
 
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
వ్యయప్రయాసలు తప్పకపోవచ్చు. అనుకున్న కార్యాలు ముందుకు సాగవు. కుటుంబసభ్యులతో అకారణంగా తగాదాలు ఏర్పడవచ్చు. ఆప్తులు కూడా మీపట్ల వ్యతిరేకత చూపుతారు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు.  భూవివాదాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు మరింత పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు చికాకులు. గులాబి, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
 
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు రాగలవు. వాహనయోగం. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు దక్కుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు పదవీయోగం. పసుపు, లేత ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
 
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొన్ని వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరవుతారు. సేవాకార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. భూములు, వాహనాలు కొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఇబ్బందులు తొలగి ఊరట లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. గులాబి, లేత ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
 
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
అనుకున్న రాబడి లభించి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. కార్యజయం. ఆప్తులు, బంధువులతో విభేదాలు తొలగుతాయి. వాహనసౌఖ్యం.  స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. మీ సాహసోపేత నిర్ణయాలు కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరుస్తాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు సన్మానయోగం. పసుపు, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి.
 
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. బంధువులతో వివాదాలు నెలకొంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అవసరాలు తీరతాయి. చాకచక్యంగా వ్యవహరించి కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం మందగిస్తుంది. నిరుద్యోగుల కృషి అంతగా ఫలించదు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు మార్పులు అనివార్యం. నీలం, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
 
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
అనుకున్న పనులు నెమ్మదిస్తాయి. శ్రమకు ఫలితం అంతగా కనిపించదు. ఆస్తి విషయాలలో బంధువర్గంతో వివాదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగించవచ్చు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కళాకారులకు నిరుత్సాహం. గులాబి, లేత పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
 
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రాగలవు. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వాహనయోగం. కీలక నిర్ణయాలకు తగిన సమయం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు కొత ్తహోదాలు లభిస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. నేరేడు, లేత ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్వామిని ఆరాధించండి.
 
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
యత్నకార్యసిద్ధి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఓర్పు, నేర్పుతో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు సత్కారాలు. నీలం, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
 
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)

పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యసమస్యలు. బంధువులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఒత్తిడులు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం తప్పదు. రాజకీయవర్గాలకు పర్యటనల్లో మార్పులు. నలుపు, ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.
 
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. అనారోగ్య సూచనలు. బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగయత్నాలు నిరాశ కలిగించవచ్చు. వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. కళాకారుల యత్నాలలో ఆటంకాలు. పసుపు, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
- సింహంభట్ల సుబ్బారావు
 జ్యోతిష్య పండితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement