simhambhatla subbarao
-
గ్రహం అనుగ్రహం (06-07-2020)
శ్రీశార్వరినామ సంవత్సరం. ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఆషాఢ మాసం. తిథి బ.పాడ్యమి ఉ.9.15 వరకు, తదుపరి విదియ. నక్షత్రం ఉత్తరాషాఢ రా.11.47 వరకు, తదుపరి శ్రవణం. వర్జ్యం ఉ.7.40 నుంచి 9.16 వరకు. తిరిగి తె.4.05 నుంచి 5.40 వరకు (తెల్లవారితే మంగళవారం). దుర్ముహూర్తం ప. 12.31 నుంచి 1.23 వరకు, తిరిగి ప.3.07 నుంచి 4.00 వరకు. అమృత ఘడియలు సా. 5.27 నుంచి 7.03 వరకు సూర్యోదయం: 5.34 సూర్యాస్తమయం: 6.35; రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు. యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు గ్రహఫలం మేషం: పలుకుబడి పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూలం. కార్యజయం. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ప్రముఖ పాత్ర పోషిస్తారు. వృషభం: కుటుంబసభ్యుల నుంచి విమర్శలు. ఆరోగ్య విషయంలో మెలకువ పాటించండి. ఆస్తి వివాదాలు. రాబడి కన్నా ఖర్చులు అధికం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాల్లో అనుకోని పనిభారం. మిథునం: రాబడి అంతగా కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆస్తి విషయంలో సోదరులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలు భారంగా సాగుతాయి. కర్కాటకం: ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు.విలువైన వస్తువులు కొంటారు. కొత్త వ్యాపారాలకు శ్రీకారం. ఉద్యోగాలలో సంతోషకరమైన వార్తలు. సింహం: ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాల్లో ప్రోత్సాహకరమైన పరిస్థితి. కన్య: అనుకోని ప్రయాణాలు. రాబడి కొంత మందగిస్తుంది. బంధువర్గంతో అకారణంగా తగాదాలు. ముఖ్యమైన కార్యక్రమాలలో జాప్యం. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. తుల: రాబడి అంతగా అనుకూలించదు. బంధువులు, మిత్రులతో తగాదాలు. అనారోగ్యం. ముఖ్య కార్యక్రమాలలో అవాంతరాలు. దైవచింతన. వ్యాపారాలలో నిరుత్సాహమే. ఉద్యోగాల్లో చికాకులు. వృశ్చికం: ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. అనుకున్న పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. వ్యాపారాలు కొంత లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి. ధనుస్సు: కుటుంబసభ్యులతో విరోధాలు. ఆరోగ్యం మందగిస్తుంది. రావలసిన సొమ్ము అందక ఇబ్బందులు. దూరప్రయాణాలు. వ్యాపారాలలో కొంత నిరాశ. ఉద్యోగాలలో అనుకోని బాధ్యతలు. మకరం: ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. రాబడి సంతృప్తినిస్తుంది. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కుంభం: ఆర్థికంగా కొంత ఇబ్బందులు. ఆలోచనలు నిలకడగా సాగవు. కుటుంబసభ్యులతో వివాదాలు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. మీనం: రాబడి సంతృప్తినిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు మరింత సçహాయపడతారు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో లాభాలు రాగలవు. ఉద్యోగాలలో కొత్త హోదాలు. -
గ్రహం అనుగ్రహం (14-06-2020)
శ్రీశార్వరినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం తిథి బ.నవమి రా.3.05 వరకు తదుపరి దశమి నక్షత్రం ఉత్తరాభాద్ర రా.12.43 వరకు తదుపరి రేవతి వర్జ్యం ఉ.8.53 నుంచి 9.33 వరకు దుర్ముహూర్తం సా.4.45 నుంచి 5.37 వరకు అమృతఘడియలు..రా.7.30 నుంచి 9.34 వరకు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు సూర్యోదయం 5.29 సూర్యాస్తమయం 6.31 గ్రహఫలం...ఆదివారం, 14.06.20 మేషం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి .ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో ప్రోత్సాహం. మిథునం: ఆస్తుల విషయంలో ఒప్పందాలు. ఆర్థిక ప్రగతి సా«ధిస్తారు. ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సానుకూలం. కర్కాటకం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశాజనకం. సింహం: కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాల సందర్శనం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి. కన్య: రుణబాధలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. తుల: కొత్త విషయాలు గ్రహిస్తారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిచయాలు పెరుగుతాయి. వస్తులాభాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సంతృప్తికరంగా ఉంటాయి. వృశ్చికం: పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ధనుస్సు: ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. సోదరులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. మకరం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గొరవం. ఆస్తిలాభం. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి. కుంభం: మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనుకోని ఖర్చులు. అనారోగ్యం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో నిరాశ. మీనం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. సోదరులతో సఖ్యత. ఆరోగ్యం కుదుటపడుతుంది. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. -
గ్రహం అనుగ్రహం (09-06-2020)
శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి బ.చవితి రా.9.26 వరకు, తదుపరి పంచమి నక్షత్రం ఉత్తరాషాఢ సా.4.05 వరకు, తదుపరి శ్రవణం వర్జ్యం రా.8.13 నుంచి 9.54 వరకు, దుర్ముహూర్తం ఉ.8.04 నుంచి 8.55 వరకు, తదుపరి రా.10.51 నుంచి 11.35 వరకు అమృతఘడియలు... ఉ.9.34 నుంచి 10.43 వరకు. సూర్యోదయం : 5.28 సూర్యాస్తమయం : 6.29 రాహుకాలం : ప. 3.00 నుంచి 4.30 వరకు యమగండం : ఉ.9.00 నుంచి 10.30 వరకు గ్రహఫలం.. మంగళవారం, 09.06.20 మేషం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. వాహనయోగం. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. వృషభం: కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం. మిథునం: మిత్రులు, బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కర్కాటకం: ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖ వ్యక్తుల పరిచయం. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. సింహం: కొత్త మిత్రుల పరిచయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. భూలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. కన్య: ఆదాయానికి మించి ఖర్చులు. అదనపు బాధ్యతలు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. తుల: అనుకున్న పనుల్లో ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. సోదరులతో స్వల్ప వివాదాలు. మానసిక అశాంతి. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగించవచ్చు. వృశ్చికం: దూరపు బంధువులు సహాయపడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. ఇంటాబయటా అనుకూలం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ధనుస్సు: శ్రమ తప్పదు. పనుల్లో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. మకరం: శుభవార్తలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. అదనపు రాబడి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం. కుంభం: దూరప్రయాణాలు. ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. మీనం: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. చిన్ననాటి విషయాలు తెలుస్తాయి.ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. వ్యాపార, ఉద్యోగాలలోఅంచనాలు నిజమవుతాయి. -
గ్రహం అనుగ్రహం (07-06-2020)
శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం తిథి బ.విదియ రా.10.24 వరకు, తదుపరి తదియ, నక్షత్రం మూల ప.3.49 వరకు తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం ప.2.15 నుంచి 3.51 వరకు, తిరిగి రా.1.22 నుంచి 2.58 వరకు, దుర్ముహూర్తం సా.4.43 నుంచి 5.35 వరకు, అమృతఘడియలు... ఉ.9.34 నుంచి 11.05 వరకు. సూర్యోదయం : 5.28 సూర్యాస్తమయం : 6.28 రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు గ్రహఫలం...ఆదివారం, 07.06.20 మేషం: కొన్ని పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబంలో కొన్ని సమస్యలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి. వృషభం: స్నేహితులతో తగాదాలు. ప్రయాణాలలో మార్పులు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక ప్రగతి. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆశ్చర్యకర సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు. కర్కాటకం: మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. ఉద్యోగయత్నాలలో అనుకూలత. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. సింహం: సన్నిహితులు, మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ఇబ్బంది. కన్య: ఆదాయం కంటే ఖర్చులు అధికం. పనుల్లో తొందరపాటు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. తుల: అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి. సంఘంలో గౌరవం. ఆస్తి తగాదాలు కొలిక్కి వస్తాయి. వాహనయోగం. వ్యాపారాలు విస్తరణలో పురోగతి. ఉద్యోగాలలో ప్రోత్సాహం. వృశ్చికం: పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. ధనుస్సు: శుభవార్తలు వింటారు. దూరపు బంధువుల కలయిక. ఇంటాబయటా అనుకూల పరిస్థితి. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు. మకరం: వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు. కుంభం: బంధువుల ద్వారా శుభవార్తలు. వాహనయోగం. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు తొలగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. మీనం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధనలాభం. కార్యసిద్ధి. ఉద్యోగార్ధులకు శుభవార్తలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అభివృద్ధి. -
గ్రహం అనుగ్రహం (26-02-2020)
శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువుఫాల్గుణ మాసం, తిథి శు.తదియ రా.1.44 వరకు, తదుపరి చవితి, నక్షత్రం ఉత్తరాభాద్ర రా.8.10 వరకు, తదుపరిరేవతి, వర్జ్యం సా.3.50 నుంచి 5.35 వరకుదుర్ముహూర్తం ప.11.48 నుంచి 12.35 వరకుఅమృతఘడియలు... ప.2.50 నుంచి 4.35 వరకు. సూర్యోదయం : 6.25 సూర్యాస్తమయం : 6.01 రాహుకాలం : ప. 12.00 నుంచి 1.30 వరకు యమగండం : ఉ.7.30 నుంచి 9.00 వరకు భవిష్యం మేషం: సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యభంగం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు. వృషభం: పనులలో పురోగతి సాధిస్తారు. సంఘంలో ఆదరణ. సోదరులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత. మిథునం: నూతన ఉద్యోగలాభం. కొత్త విషయాలు తెలుస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. కర్కాటకం: మిత్రులతో వివాదాలు. ప్రయాణాలు వాయిదా. పనులలో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ. సింహం: దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. కన్య: కొత్త వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో విశేష గౌరవం. సన్మానాలు. విద్యావకాశాలు దక్కుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. తుల: పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. సోదరులతో సఖ్యత. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. వృశ్చికం: సన్నిహితులు, మిత్రులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ధనుస్సు: ఇంటాబయటా ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. కొన్ని వ్యవహారాలు వాయిదా వేస్తారు. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు. మకరం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనసౌఖ్యం. కీలక నిర్ణయాలు. దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత. కుంభం: కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. నిర్ణయాలు మార్చుకుంటారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. మీనం: చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆస్తివివాదాల పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.– సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం (02-02-2020)
శ్రీ వికారి నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి శు.అష్టమి సా.4.10 వరకు, తదుపరి నవమి నక్షత్రం భరణి రా.7.54 వరకు తదుపరి కృత్తిక, వర్జ్యం ..లేదు, దుర్ముహూర్తం సా.4.22 నుంచి 5.07 వరకు, అమృతఘడియలు... ప.2.40 నుంచి 3.44 వరకు. సూర్యోదయం : 6.35 సూర్యాస్తమయం : 5.52 రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు భవిష్యం మేషం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికలాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. దైవదర్శనాలు. ఉద్యోగులకు పదోన్నతులు. వృషభం: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. అనారోగ్యం.బంధువులతో వివాదాలు.వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. కుటుంబంలో ఒత్తిడులు. మిథునం: యత్నకార్యసిద్ధి.మిత్రులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మికచింతన. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి. కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. ఆకస్మిక ధనలాభం.బంధువుల నుంచి శుభవార్తలు.వాహనయోగం. వ్యాపారాలు,ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. సింహం: రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు.అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి. కన్య: కుటుంబ సమస్యలు. అనారోగ్యం.పనుల్లో అవాంతరాలు.రుణాలు చేస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఉద్యోగాలలో కొంత గందరగోళం. తుల: శుభవార్తలు వింటారు.పనుల్లో విజయం. వాహనయోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. వృశ్చికం: ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. ధనుస్సు: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ పెరుగుతుంది. విందువినోదాలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో నిరుత్సాహం. మకరం: మకరం...వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. కొత్త రుణాలు చేస్తారు. శ్రమకు ఫలితం కనిపించదు. భూవివాదాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ. కుంభం: నిరుద్యోగులకు అనుకూలం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వృత్తి,వ్యాపారాలు సాఫగా సాగుతాయి.శ్రమ ఫలిస్తుంది. మీనం: మిత్రులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. పనులు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం.వృత్తి, వ్యాపారాలలో చిక్కులు. – సింహంభట్ల సుబ్బారావు -
వారఫలాలు(18 ఫిబ్రవరి నుంచి 24 ఫిబ్రవరి 2018 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు ఎదురవుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. శ్రమ మరింత పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. కళాకారుల యత్నాలు ముందుకు సాగవు. వారం మధ్యలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. పసుపు, లేత ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) రాబడి ఆశాజనకంగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులు మిత్రులుగా మారతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ఖర్చులు. అనారోగ్యం. గులాబి, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. రామరక్షాస్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ముఖ్యమైన కార్యక్రమాలలో ముందడుగు వేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. జీవిత భాగస్వామితో వివాదాలు పరిష్కారం. పాతమిత్రులను కలుసుకుంటారు. కాంట్రాక్టులు పొందుతారు. పోటీపరీక్షల్లో నిరుద్యోగులకు విజయం. వ్యాపారాలలో కొత్త పెటుబడులు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఒత్తిడులు. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) రుణబాధల నుంచి విముక్తి పొందుతారు. అప్రయత్న కార్యసిద్ధి. సోదరులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ శక్తిసామర్థ్యాలు అందరూ గుర్తిస్తారు. ఆస్తి విషయాలు కొలిక్కి వస్తాయి. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. విద్యార్థులకు ఊరటనిచ్చే ప్రకటన రావచ్చు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగాలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు, ఆరోగ్యభంగం. తెలుపు, గులాబి రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ æచేయండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు, రుణయత్నాలు. సోదరులు, సోదరీలతో విభేదాలు తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలపై చర్చిస్తారు. స్థిరాస్తి వివాదాలు నెలకొంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు కాస్త నిరాశాజనకంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తల అంచనాలు తప్పుతాయి. వారం చివరిలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. ఎరుపు, లేత గులాబి రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవిని పూజించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) శ్రమ మరింత పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆదాయం అంతగా కనిపించక అప్పులు చేయాల్సివస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఇంటి నిర్మాణ యత్నాలు ముందుకు సాగవు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఒత్తిడులు. కొన్ని వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. కళాకారులకు చికాకులు. వారం ప్రారంభంలో వాహనయోగం. ఆలయాలు సందర్శిస్తారు. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఇంటాబయటా అనుకూల పరిస్థితులు. శు¿¶ కార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు తీరి ఉపశమనం పొందుతారు. విద్యార్థుల యత్నాలు సఫలం. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. పారిశ్రామికవేత్తలకు మంచి గుర్తింపు రాగలదు. వారం చివరిలో అనారోగ్యం. ఆకుపచ్చ, గులాబి రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) వీరికి అన్నింటా విజయాలు సిద్ధిస్తాయి. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. శత్రువుల్లా భావించే వారు కూడా మిత్రులుగా మారతారు. వాహనాలు, భూములు కొంటారు. కొన్ని వ్యవహారాలలో చర్చలు సఫలం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కుతుంది. కళాకారులకు సంతోషకరమైన సమాచారం. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆప్తులతో కలహాలు. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీ నృసింహస్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. శ్రమాధిక్యమే తప్ప ఫలితం కనిపించదు. బంధువులతో వివాదాలు నెలకొంటాయి. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్థిరాస్తి విషయంలో కొద్దిపాటి చికాకులు. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. దూరప్రాంతాల నుంచి ఒక కీలక సమాచారం రావచ్చు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు బదిలీ అవకాశాలు. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం. గులాబి, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఇంటాబయటా ఒత్తిడులు. అనుకోని ఖర్చులు. రుణదాతల నుంచి ఒత్తిడులు. ఎంతగా కష్టించినా ఫలితం కనిపించదు. ప్రాణస్నేహితులు కొంత వ్యతిరేకత చూపుతారు. ఆలోచనలు కలసిరావు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. విద్యార్థుల యత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలలో లాభాలు స్వల్పంగానే ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామికవేత్తలకు ఒడిదుడుకులు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) రాబడికి మించిన ఖర్చులు. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. మీపై ఉంచిన బాధ్యతల నిర్వహణలో జాప్యం. సోదరులు, మిత్రులతో అకారణంగా వైరం నెలకొంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలు. శ్రమాధిక్యంతో కొన్ని పనులు పూర్తి కాగలవు. మీరు తీసుకునే నిర్ణయాలు మనస్పర్థలకు కారణం కాగలవు. వ్యాపారాలలో పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగవర్గాలకు మరిన్ని బాధ్యతలు తప్పవు. రాజకీయవర్గాలకు నిరుత్సాహమే. వారం మ«ధ్యలో విందువినోదాలు. కార్యజయం. నలుపు, లేత పసుపు రంగులు. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ స్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. అనుకున్న పనులు సజావుగా పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దూరపు బంధువుల రాకతో సంతోషంగా గడుపుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఆకుపచ్చ, గోధుమరంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో (18 ఫిబ్రవరి నుంచి 24 ఫిబ్రవరి, 2018 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) గతంలో జరిగిన పొరపాట్లను గురించే నిరంతరం ఆలోచిస్తూ కూర్చోకండి. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. వాటిని అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండండి. జరిగిపోయిన దాన్ని ఎవ్వరూ మార్చలేరన్న విషయాన్ని గ్రహించండి. వృత్తిరీత్యా కొత్త జీవితం మిమ్మల్ని ఆహ్వనిస్తోంది. ధైర్యంగా ఆ వైపుకు అడుగులు వేయండి. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. విహారయాత్రకు సన్నాహాలు చేసుకోండి. కలిసివచ్చే రంగు : లేత ఆకుపచ్చ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) ఈ వారమంతా కొన్ని అనుకోని సమస్యలు ఎదురవుతాయి. మీకు బాగా దగ్గరైన వారొకరు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తోంది. జీవితాశయానికి చాలా దూరంలో ఉన్నట్లైతే, ఇప్పటికైనా ఆ విషయాన్ని గ్రహించి ఆ వైపు అడుగులు వేయండి. వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. వృత్తిరీత్యా కొత్త పదవులను అలంకరిస్తారు. ప్రేమ విషయంలో మాత్రం మొండిగా ఉన్న మీ ఆలోచనా తీరును మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కలిసివచ్చే రంగు : ఊదా మిథునం (మే 21 – జూన్ 20) గతాన్ని గురించి ఆలోచిస్తూ అద్భుతమైన భవిష్యత్‌ను నాశనం చేసుకోకండి. ప్రస్తుతాన్ని బాగా ఆస్వాదించాల్సిన సమయం ఇది. మీ శక్తినంతా కూడగట్టుకొని భవిష్యత్‌ను నిర్మించుకోండి. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. ఆత్మ విశ్వాసంతో ఆ అవకాశాలను అందిపుచ్చుకోండి. మీదైన శైలిని నమ్ముకొని ముందుకు వెళ్లండి. కొత్త శిఖరాలను అధిరోహిస్తారు. పిల్లలతో ఎక్కువ సమయం గడపడం వల్ల కొత్త ఉత్సాహం పొందుతారు. మీకోసం కాస్త ఎక్కువ సమయాన్ని కేటాయించుకోండి. విహారయాత్ర సూచనలు కనిపిస్తున్నాయి. కలిసివచ్చే రంగు : నారింజ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) పరిస్థితులు కొన్ని మీకు ప్రతికూలంగా మారిపోయే అవకాశం ఉంది. జీవితమంతా చీకట్లో గడిచిపోతున్నట్లు ఉంటుంది. అయితే ఇదేమీ శాశ్వతం కాదన్న విషయం తెలుసుకోవాలి. మీ జీవితంలో వెలుగులు నింపడానికి ఒక కొత్త వ్యక్తి మీకు పరిచయమవుతారు. మీదైన ఆలోచనా విధానమే మిమ్మల్ని పై స్థాయికి తీసుకెళుతుంది. అందరినీ ఒకేలా చూడాలన్న ఆలోచన కూడా మీకు ఒక ప్రత్యేక గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. కొత్త పనులు మొదలుపెట్టడానికి ఇదే సరైన సమయం. కలిసివచ్చే రంగు : ముదురు గోధుమ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఇప్పటివరకూ ఏ చెడు జరిగినా అదంతా మంచికే అని గ్రహించాల్సిన సమయం ఇది. కొత్త ఉత్సాహంతో పనిచేయడానికి మిమ్మల్ని సిద్ధం చేసే ఆలోచన ఇదే. మీకు ఏది అవసరమో, మీ ఆలోచనలు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళుతున్నాయో అటువైపే మీ అడుగులు వేయండి. మీకు పెద్దగా ఉత్సాహం లేని పనులు మాత్రం అస్సలు మొదలుపెట్టకండి. ఫలితం గురించి ఆలోచించకుండా పనిచేయండి. త్వరలోనే మీ సమస్యలన్నీ సద్దుమణిగి జీవితం కొత్తగా మళ్లీ మొదలవుతుంది. కలిసివచ్చే రంగు : పసుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మీదైన ఆలోచనా విధానాన్ని ఎప్పటికీ మార్చుకోవద్దు. విజయం మీవైపే ఉంది. కష్టపడి దాన్ని సొంతం చేసుకోవాలన్న ఆలోచనను బలంగా నమ్మండి. పోటీ ప్రపంచంలో మీకొక గుర్తింపు దక్కాలని కోరుకుంటున్నారు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు త్వరలోనే లభిస్తుంది. ఎక్కువ పనులు మీద వేసుకొని ఒత్తిడికి లోనుకావద్దు. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. పెళ్లి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ప్రేమ జీవితం మిమ్మల్ని కొన్నాళ్లుగా బాగా ఇబ్బంది పెడుతోన్న అంశం. ఈ వారంలో అన్నీ చక్కబడతాయి. ఈ విషయంలో మీరు కోరుకుంటున్న రీతిలోనే ఒక పూర్తి అవగాహన వస్తుంది. కొత్త జీవితం మొదలుపెడతారు. మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక విహారయాత్రకు వెళ్లే ఆలోచన చేస్తారు. ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. వృత్తిరీత్యా కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ప్రేమ జీవితానికి, వృత్తి జీవితానికి మధ్య సమన్వయం కుదుర్చుకోవాల్సిన అవసరం ఉంది. కలిసివచ్చే రంగు : పసుపు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) పరిస్థితులకు ఎదురెళ్లి ధైర్యంగా ముందడుగు వేయాల్సిన సమయం ఇది. ఊహలకు, వాస్తవ ప్రపంచానికి ఉన్న దూరాలను తగ్గించాలంటే, మీరు ఊహా ప్రపంచాలను వీడి వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారికి సమాధానంగా ఓ గొప్ప విజయం చేకూరుతుంది. వృత్తి జీవితంలో మంచి రోజులు కనిపిస్తున్నాయి. ఉన్నత పదవులు అలంకరిస్తారు. ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామిని సంతోషపెట్టడానికి కొత్త ఆలోచనలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కలిసివచ్చే రంగు : లేత గులాబి ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఫలితం గురించి ఆలోచిస్తూ కూర్చోవడం మానండి. మీ శక్తినంతా వెచ్చించి పనిచేయండి. ఫలితం దానంతట అదే వస్తుందని నమ్మండి. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. కొత్త అవకాశాలను అందిపుచ్చుకొని మరింత ఉత్సాహంతో పనిచేస్తారు. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకొని, వారితో ప్రేమగా మెలగండి. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఉదర సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. కలిసివచ్చే రంగు : లేత గోధుమ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ప్రేమ జీవితంలో ఒడిదుడుకులు అలాగే ఉంటాయి. అయితే నమ్మకంతో, కాస్త విరామం తీసుకొని మీ జీవిత భాగస్వామికి మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు చేయండి. వృత్తి జీవితం కూడా ఊహించినంత ఆశాజనకంగా ఉండటం లేదు. కొద్దిరోజులు అన్నింటికీ దూరంగా ఒక విహారయాత్రకు వెళ్లే ఆలోచన చేయండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకునే ఆలోచనా∙విధానంలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉంది. కలిసివచ్చే రంగు : ముదురు గోధుమ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) జీవితాన్ని నిరంతరం ఆస్వాదించడమే మన ఉన్నతికి పాటుపడే అంశమని గ్రహించి పనిచేయడం అలవర్చుకోండి. అనవసరమైన విషయాలను గురించి, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విషయాలను గురించి ఎక్కువ ఆలోచించకండి. జీవితం మీద మీకున్న అభిప్రాయాలను చిన్న చిన్న అంశాలేవీ ప్రభావితం చేయకుండా చూసుకోండి. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. అందులో మీ స్థాయికి తగ్గవాటినే ఎంచుకోండి. మీ చుట్టూనే కొందరు మీ అభివృద్ధికి అడ్డు పడుతున్నారు. కాస్త జాగ్రత్తగా ఉండండి. కలిసివచ్చే రంగు : ముదురు గోధుమ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) జీవితమంతా నిరాశాజనకంగా సాగుతుందని భావిస్తారు. ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చి మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవాల్సిన సమయం ఇదే. అపజయాలు సర్వ సాధారణమనీ, వాటికి ఎదురెళ్లి నిలబడే ధైర్యం ఎప్పుడూ కోల్పోవద్దని తెలుసుకోండి. ఏది జరిగినా దానికి మూల కారణం మీరేనన్న విషయాన్ని నమ్మండి. కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు ప్రశాంతంగా ఆలోచించండి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగవుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కలిసివచ్చే రంగు : తెలుపు - ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) అనుకున్న వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. రాబడి కొంత పెరిగే సూచనలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులు ఆహ్వానాలు అందిస్తారు. విద్యార్థులు కొత్త అవకాశాలు అందుకుంటారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాల వారి శ్రమ ఫలిస్తుంది. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబి, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) ఆశ్చర్యకరమైన రీతిలో పనులు పూర్తి కాగలవు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. బంధువులు, మిత్రుల సహాయసహాకారాలు అందుతాయి. మీ అనుభవాలు పదిమందికీ పంచుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో ఖర్చులు. మానసిక అశాంతి. ఆకుపచ్చ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) కొన్ని వివాదాలు నెలకొన్నా చాకచక్యంతో పరిష్కరించుకుంటారు. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. కార్యజయంతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తుల వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కే అవకాశం. కళాకారులు అనుకున్నది సాధిస్తారు. వారం ప్రారంభంలో వివాదాలు. అనారోగ్యం. తెలుపు, గులాబి రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) మొదట్లో చికాకులు, సమస్యలు ఎదురై పరీక్షగా నిలుస్తాయి. పనులు శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారులకు లాభాలు కనిపిస్తాయి. ఉద్యోగులకు ఒక సమాచారం మరింత సంతోషం కలిగిస్తుంది. కళాకారులకు సన్మానాలు. వారం ప్రారం¿¶ ంలో వివాదాలు. ఆరోగ్యసమస్యలు. గులాబి, లేత ఆకుపచ్చరంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులు మరింత దగ్గరవుతారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం, ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు. వారం మధ్యలో అనుకోని ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కొత్త విషయాలు తెలుస్తాయి. చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో చర్చలు ఫలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. గతానుభవాల రీత్యా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులకు అవార్డులు దక్కవచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. వివాదాలు. గులాబి, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. రుణఒత్తిడులు తొలగుతాయి. మీలోని నైపుణ్యం వెలుగుచూస్తుంది. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. ఆరోగ్యం కొంత మందగించినా ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. రాజకీయవర్గాలకు పదవులు, సన్మానాలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. శ్రమాధిక్యం. నీలం, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆప్తులు అన్నివిధాలా సహకరిస్తారు. ఎంత కష్టమైన పనైనా అవలీలగా పూర్తి చేస్తారు. విద్యార్థులు సత్తా చాటుకుని ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతారు. వాహనాలు, భూములు కొంటారు. వివాహయత్నాలు కొలిక్కి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులు సమర్థతను నిరూపించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఎరుపు,నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతకు అర్చనలు చేయండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. మీకు నచ్చిన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభిస్తుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. ఆలోచనలు కలసివస్తాయి. వ్యాపారాలు విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులు అనుకున్న పదోన్నతులు పొందుతారు. కళాకారులకు ప్రయత్నాలు సఫలం. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. గులాబి, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) పనుల్లో కొంత జాప్యం తప్పదు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఎంత కష్టించినా ఫలితం కనిపించక డీలా పడతారు. ఆరోగ్య, కుటుంబసమస్యలు వేధిస్తాయి. బంధువులతో అకారణంగా తగాదాలు. ఆస్తి వ్యవహారాలలో కొద్దిపాటి చికాకులు. నిరుద్యోగులకు కాస్తనిరుత్సాహం. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామికవేత్తలు నిరాశ చెందే అవకాశం. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) పనులు చకచకా పూర్తి కాగలవు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మీవెన్నంటి నిలుస్తారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. చిరకాల స్వప్నం నెరవేరే సమయం. కొన్ని సమస్యలు వాటంతట అవే పరిష్కారమవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నత స్థితి ఖాయం. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కవచ్చు. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. వృథా ఖర్చులు. నీలం, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. అదనపు ఆదాయం సమకూరుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పాతమిత్రులను కలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు. కళాకారులకు పురస్కారాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువులతో తగాదాలు. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో (24 డిసెంబర్ నుంచి 30 డిసెంబర్, 2017 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఈవారం మీకు బాగా కలిసివస్తుంది. కొద్దికాలం క్రితమే మొదలుపెట్టిన ఒక పనిలో విజయం సాధిస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. జీవితాశయం వైపుకు అడుగులు వెయ్యాలన్న ఆలోచన ఎప్పట్నుంచో ఉన్నట్లైతే, అందుకు సరైన సమయం ఇదే. మీ వ్యవహార శైలిలో కొన్ని ఊహించని మార్పులు వస్తాయి. అయితే అవి మిమ్మల్ని ప్రేమించే వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండేలా చూసుకోండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కలిసివచ్చే రంగు : ముదురు గోధుమ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) చాలాకాలంగా మీ స్థాయికి తగ్గ విజయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఆ విజయం కోసం ఓపిగ్గా ఇంకొంత కాలం ఎదురుచూడాల్సి రావొచ్చు. పరిస్థితులకు భయపడిపోకుండా ఆత్మవిశ్వాసంతో పనిచేస్తూ వెళ్లండి. మీదైన ప్రతిభ త్వరలోనే ప్రపంచానికి తెలుస్తుంది. దక్కాల్సిన గుర్తింపు తప్పకుండా దక్కుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తిని కలుసుకుంటారు. ఆ వ్యక్తి రాక మీకు కొత్త ఉత్సాహాన్నిస్తుంది. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) ఈవారం చాలా సంతోషంగా గడుపుతారు. ప్రేమ జీవితంలో కొత్త కొత్త రంగులను చూస్తారు. ఇష్టపడ్డ వ్యక్తి కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. జీవితాశయం వైపుకు అడుగులు వేస్తారు. కొద్దికాలం క్రితమే మొదలుపెట్టిన ఓ పనిలో మంచి విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత కలవరపెడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆత్మవిశ్వాసంతో, విజయంపై ధీమాతో పనిచేసే మీ స్వభావమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని నమ్మండి. కలిసివచ్చే రంగు : గులాబి కర్కాటకం (జూన్ 21 – జూలై 22) మీ శ్రమకు తగ్గ గుర్తింపు దక్కే సమయం ఇదే. ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న ఓ విజయం మీకు దగ్గరగా వచ్చి ఉంది. మీదైన శైలిలో, ఫలితాన్ని గురించే ఆలోచిస్తూ కూర్చోకుండా కష్టపడితే ఆ విజయం మీదే! మీ జీవితానికి సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ నిర్ణయంపైనే మీ భవిష్యత్ ఆధారపడి ఉందని గ్రహించండి. ఆ ఆలోచనలతో జీవితంలో మీకుగా మీరు ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కలిసివచ్చే రంగు : నారింజ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఈవారం మీకు కొన్ని అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. మీకు సన్నిహితులైన వ్యక్తులతో చిన్న చిన్న వివాదాలు తలెత్తుతాయి. మాట్లాడేముందు ఆ మాట ఎదుటివ్యక్తికి ఎలా చేరుతుందన్న విషయాన్ని కూడా ఆలోచించి మాట్లాడండి. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఎప్పట్నుంచో వాయిదా వేస్తూ వస్తోన్న విహారయాత్రను ఇప్పుడే చేపడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆహరపు అలవాట్లలో మార్పు రావాల్సిన పరిస్థితి వస్తుంది. కలిసివచ్చే రంగు : పసుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఆర్థిక పరిస్థితి ఈవారం మిమ్మల్ని కాస్తంత కలవరపెడుతుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండటాన్ని ఇప్పటికైనా అలవాటు చేసుకుంటే మంచిది. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. తోటి ఉద్యోగులతో కలిసిమెలిసి ఉండడం అలవర్చుకోవాల్సిన సమయం ఇదే. ఖాళీ అన్నదే లేకుండా వారమంతా కష్టపడుతూనే ఉంటారు. ప్రేమ జీవితం బాగుంటుంది. మీకిష్టమైన వ్యక్తి ఇచ్చే ఓ బహుమతి మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కలిసివచ్చే రంగు : తెలుపు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఆర్థిక పరిస్థితి మిమ్మల్ని నిరాశలోకి నెట్టేసే ప్రమాదం కనిపిస్తోంది. దీనంతటికీ కారణం అనవసర ఖర్చులను దూరం చేసుకోలేకపోవడమే. గతాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చుంటారు. దీంతో ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు మిమ్మల్ని మీరు ఎలా సిద్ధం చేసుకోవాలో ఆలోచించండి. ఒక కొత్త అవకాశం మీకోసం ఎదురుచూస్తోంది. మీదైన శైలిలో కష్టపడి పనిచేస్తూ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. కలిసివచ్చే రంగు : గులాబి వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఒక కొత్త ఆలోచన మీ వ్యాపారాన్ని మరింత బాగా వృద్ధిలోకి తీసుకొస్తుంది. అయితే ఆ ఆలోచనను బలంగా నమ్మి, కష్టపడితేనే ఫలితం సాధ్యమని గ్రహించండి. వరుసగా అవకాశాలు వచ్చిపడతాయి. తొందరపడకుండా మిమ్మల్ని పై స్థాయికి తీసుకెళ్లే అవకాశాన్ని మాత్రమే అందుకొని ముందుకెళ్లండి. మనుషులతో కలిసిపోవడాన్ని ఇకనైనా అలవాటు చేసుకుంటే మంచిది. ఆర్థిక పరిస్థితి మీరు ఊహించిన దానికంటే బాగుంటుంది. మీకు ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రేమ జీవితం బాగుంటుంది. కలిసివచ్చే రంగు : గులాబి ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే ఓ వ్యక్తిని కలుసుకుంటారు. ఆ వ్యక్తి రాకతో ఊహించనంత సంతోషంగా రాబోయే రోజులను గడుపుతారు. ప్రేమ జీవితం మీకు ఒక కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఒక గొప్ప అవకాశం మీకు దగ్గరలో ఉంది. దాన్ని అందుకునేందుకు నిరంతరం కష్టపడుతూ ఉండండి. పాత మిత్రులను కలుసుకుంటారు. విహారయాత్రకు వెళ్లే ఆలోచన కూడా చేస్తారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కలిసివచ్చే రంగు : ఎరుపు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఈవారమంతా సాఫీగా సాగిపోతుంది. జీవితాశయం వైపుకు అడుగులు వేయాలని తపిస్తారు. అందుకు తగ్గట్టుగా మీ ఆలోచనా విధానాన్ని కూడా మార్చుకుంటూ ముందుకు వెళతారు. మారే మీ ఆలోచనా విధానం మీలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఎటువంటి పరిస్థితులకైనా ఎదురెళ్లే శక్తిని కూడగట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే చాలా మెరుగుపడుతుంది. మీరు బాగా ఇష్టపడే వ్యక్తికి సమయం కేటాయిస్తారు. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. కలిసివచ్చే రంగు : పసుపు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఈవారం మీకు అదృష్టం బాగా కలిసివస్తుంది. ఇష్టమైన వ్యక్తితో సంతోషంగా కాలాన్ని గడుపుతారు. మీదైన ప్రతిభను ప్రపంచానికి చాటుకునే అవకాశం కూడా త్వరలోనే వస్తుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి గతంలోకంటే మెరుగుపడుతుంది. అయితే అనవసర ఖర్చులకు దూరంగా ఉండడం ఇప్పటికైనా అలవాటు చేసుకుంటే మంచిది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. వృత్తి జీవితంలో ఓ కీలక మలుపు సూచనలు కనిపిస్తున్నాయి. కలిసివచ్చే రంగు : తెలుపు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) మీ భయాలే మిమ్మల్ని విజయం వైపుకు వెళ్లనీయకుండా ఆపేస్తున్న శక్తులని నమ్మండి. ఆ భయాలను దూరం చేసుకొని ధైర్యంగా ముందుకెళ్లాల్సిన సమయం ఇదే. ఇతరుల అభిప్రాయాలకే పూర్తిగా విలువ ఇచ్చేయకుండా, మీదైన బలమైన అభిప్రాయం ఒకటి ఏర్పరచుకోండి. ఒక కొత్త వ్యక్తిని కలుసుకుంటారు. ఆ వ్యక్తి పరిచయం మిమ్మల్ని జీవితాశయం వైపుకు అడుగులు వేయిస్తుంది. కొన్ని దురలవాట్లని తెలిసినా, వాటిని వదల్లేకపోతూంటే, ఇప్పటికైనా వాటిని దూరం చేసుకోండి. ఆర్థిక పరిస్థితి సాదాసీదాగా ఉంటుంది. కలిసివచ్చే రంగు : నీలం ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు(10 డిసెంబర్ నుంచి 16 డిసెంబర్ 2017 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభను చాటుకుంటారు. మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు గౌరవిస్తారు. ఆదాయం గతంతో పోలిస్తే మెరుగుపడుతుంది. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహకరిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కుతాయి. రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారం. వారం ప్రారంభంలో ఖర్చులు. మానసిక ఆందోళన. స్వల్ప అనారోగ్యం. గులాబి, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆవుపాల పొంగలి ఇష్టౖ§ð వానికి నివేదించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు, పనుల్లో జాప్యం ఉంటాయి. ఆర్థికపరమైన సమస్యలు తీరతాయి. మీలో దాగి ఉన్న నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వాహనయోగం. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఊరట కలిగించే సమాచారం. పారిశ్రామికవేత్తలకు సన్మానాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. లేత నీలం, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆవునేతితో గణేశ్ వద్ద దీపం వెలిగించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) కొన్ని కార్యక్రమాలను నిదానంగా పూర్తి చేస్తారు. సేవాభావంతో అందర్నీ మెప్పిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు కొంటారు. ప్రముఖులు పరిచయమవుతారు. గతంలోని కొన్ని సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభాలదిశగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరిగే అవకాశాలు. కళాకారులు పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి పొందుతారు. వారం మధ్యలో ఆరోగ్య సమస్యలు. నేరేడు, గులాబి రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) అనుకున్న ఆదాయం సమకూరక కొంత ఇబ్బంది తప్పదు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. కుటుంబసభ్యులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులపై ఒత్తిడులు పెరుగుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపార లావాదేవీలు స్వల్పంగానే లాభిస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయవేత్తలకు సమస్యలు ఎదురవుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబి, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) పనుల్లో విజయం సా«ధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఇళ్లు, వాహనాలు కొంటారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు, లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కుతుంది. కళాకారులకు నూతనోత్సాహం. వారం చివరిలో వృథా ఖర్చులు అవుతాయి. కుటుంబంలో అనుకోని ఒత్తిడులు. లేత ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఎటువంటి సమస్యనైనా అవలీలగా పరిష్కరించుకుంటారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిరకాల మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ఖర్చులు తప్పవు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. నేరేడు, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) రుణబాధలు తొలగి ఊరట లభిస్తుంది. పనులు అనుకున్న విధంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు తీరి ఉపశమనం లభిస్తుంది. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. రాజకీయవేత్తలకు సన్మానాలు. వారం చివరిలో వృథా ఖర్చులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) వీరికి పట్టింది బంగారంగా ఉంటుంది. కార్యశూరులై అనుకున్న పనులు పూర్తి చేస్తారు. స్వచ్ఛంద కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. అభిమానులు పెరుగుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. వాహనాలు, భూములు కొంటారు. వివాదాల పరిష్కారంలో చొరవ చూపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కుతుంది. రాజకీయవేత్తల కృషి ఫలిస్తుంది. వారం చివరిలో అనారోగ్యం. ధనవ్యయం. ఎరుపు, లేత గులాబి రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) అదనపు రాబడి దక్కి ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులకు సత్కారాలు. వారం చివరిలో ఖర్చులు. కుటుంబసమస్యలు. లేత పసుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ప్రారంభంలో కొన్ని సమస్యలు వేధిస్తాయి. అయినా ఆత్మవిశ్వాసం, పట్టుదలతో అధిగమించి ముందుకు సాగుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. విద్యార్థుల సత్తా చాటుకునేందుకు తగిన సమయం. వివాహాది శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో చిక్కులు తొలగుతాయి. రాజకీయవేత్తలకు అనుకూల పరిస్థితులు. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. ఆరోగ్య సమస్యలు. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) పనులు కొంత నెమ్మదించినా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. బంధువుల సలహాలు స్వీకరిస్తారు. వాహనయోగం. చర్చలు సఫలమవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. కళాకారులకు సత్కారాలు అందుతాయి. వారం మధ్యలో వృథా ఖర్చులు. మిత్రులతో వివాదాలు. వారం చివరిలో కొంచెం అనారోగ్యం. ఆకుపచ్చ, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. మీ సమర్థత, నైపుణ్యం వెలుగులోకి వస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులకు నూతనోత్సాహం. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త భాగస్వాములు చేరతారు. ఉద్యోగులకు విధుల్లో అనుకూల వాతావరణం. రాజకీయవేత్తలకు పదవీయోగం. వారం ప్రారంభంలో శ్రమ తప్పదు. అనారోగ్యం. గులాబి, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు సానుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో (10 డిసెంబర్ నుంచి 16 డిసెంబర్, 2017 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) వృత్తి జీవితంలో మీదైన గుర్తింపు కోసం కష్టపడతారు. చాలాకాలంగా మీ జీవితాన్ని మలుపుతిప్పే విజయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ విజయం త్వరలోనే మీకు దక్కుతుంది. మీరు చేస్తున్న పని ఏదయినా అది మీకు ఆత్మసంతృప్తిని ఇచ్చేదై ఉండాలన్న విషయాన్ని మరవకండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు ఇష్టమైన వ్యక్తుల దగ్గర్నుంచి ఓ శుభవార్త వింటారు. ఇది మీకు ఎంతో సంతోషాన్నిస్తుంది. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. కలిసివచ్చే రంగు : తెలుపు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదే! వృత్తి జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. యజమానితో మాటపట్టింపు సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. మీకు కావాల్సింది ఏంటో స్వతహాగా, అన్నీ ఆలోచించి నిర్ణయించుకోండి. ఆ నిర్ణయంతో మీరు సంతోషంగా ఉంటారన్న నమ్మకం వస్తేనే ముందుకు వెళ్లండి. ప్రేమ జీవితం బాగుంటుంది. కలిసివచ్చే రంగు : గోధుమ మిథునం (మే 21 – జూన్ 20) మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేసిన సమస్యలను చూసి భయపడిపోతున్నారు. అయితే ఆ భయాలన్నింటినీ వదిలి, ముందుకు వెళ్లడంలోనే విజయం ఉందని గ్రహించండి. మీకు ఇష్టమైన వాళ్లు మీతో మాట్లాడే విధానంలో తేడా గమనిస్తారు. అందుకు మీ ఇద్దరి మధ్యా వచ్చే మనస్పర్థలు కారణం కావొచ్చు. బంధాన్ని బలంగా నిలుపుకోవడానికి ఇలాంటి సందర్భాల్లో వాళ్లు ఏ పరిస్థితుల్లో ఉండి అలా మాట్లాడుతున్నారో ఆలోచించండి. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) కొత్త వ్యక్తుల పరిచయం మీకు మరింత ఉత్సాహాన్నిస్తుంది. ఈవారమంతా ఖాళీ అన్నదే లేకుండా గడుపుతారు. మీ ప్రతిభను ప్రదర్శించుకునేందుకు ఒక వేదిక దొరుకుతుంది. ఈ అవకాశాన్ని అన్నివిధాలా అందిపుచ్చుకొని మీరేంటో నిరూపించుకోవాల్సిన సమయం కూడా ఇదేనని నమ్మండి. మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. మీ ఇద్దరూ ఇష్టంగా కన్న ఒక విహారయాత్ర కలను సాకారం చేసుకుంటారు. కలిసివచ్చే రంగు : ఎరుపు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) జీవితం ఓ దగ్గర ఆగిపోయి, ఎటూ ముందుకు పోని పరిస్థితుల్లో చిక్కుకున్నట్టు అనిపిస్తుంది. అయితే ఇలాంటి ఒక రోజును దాటి ముందుకు వెళితేనే జీవితమన్న విషయాన్ని గ్రహించండి. ఒక కొత్త వ్యక్తి పరిచయం మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ వ్యక్తికి తక్కువ సమయంలోనే చాలా దగ్గరవుతారు. మీకు ఆత్మసంతృప్తినిచ్చే విషయాలేంటో తెలుసుకుంటారు. చాలాకాలంగా ఎదురుచూస్తోన్న ఓ అవకాశం మీ తలుపు తడుతుంది. కలిసివచ్చే రంగు : గోధుమ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) మీ స్వభావానికి తగ్గట్టే పరిస్థితులూ అనుకూలించడంతో ఈవారమంతా చాలా సంతోషంగా గడుపుతారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా నిలబడాలన్న మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని విజయం దిశగా తీసుకెళుతుంది. ఒక కొత్త అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కలిసివచ్చే రంగు : పసుపు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) జీవితంలో ఓ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఆ నిర్ణయం తీసుకునేందుకు అన్నివిధాలా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఈ నిర్ణయం మీకు ఎంత ముఖ్యమో తెలుసుకొని, మీరు కోరుకున్న విధంగా ఆ వైపుకు ధైర్యంగా అడుగు వేయండి. మీకు బాగా ఇష్టమైన వ్యక్తి వల్లే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థిక, ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. ప్రేమ జీవితం ఉల్లాసంగా ఉంటుంది. కలిసివచ్చే రంగు : గులాబి వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) చాలాకాలంగా చీకట్లో కూరుకుపోయి ఉన్న మీ జీవితమంతా ఒక్కసారిగా కొత్త కాంతిని చూసినట్టుగా మారిపోతుంది. జీవితంలో వచ్చే ఈ మార్పును సంతోషంగా అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండండి. వృత్తి జీవితం బాగుంటుంది. ఓ గొప్ప అవకాశం మీ తలుపు తడుతుంది. మీదైన శ్రమ పెడితేనే ఆ అవకాశాన్ని విజయం దిశగా తీసుకెళ్లగలరన్న విషయాన్ని మనసులో పెట్టుకోండి. మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు కొత్త ప్రదేశాలకు వెళ్లండి. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) మీ ఆలోచనా విధానం పూర్తిగా మారాల్సిన పరిస్థితి వచ్చి పడుతుంది. అందుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఎప్పట్లానే మారకుండా ఉంటే మీరే చిక్కుల్లో పడతారు. మారే మీ ఆలోచనా విధానమే మీకు ఒక గొప్ప అవకాశాన్ని తెచ్చిపెడుతుంది. ఆ అవకాశాన్ని అందుకోవడంతోనే విజయం వైపుకు మీరు ఒక అడుగు వేసేసినట్లని నమ్మండి. ప్రశాంతంగా ఉండేందుకు ఏదైనా విహారయాత్రకు వెళ్లాలన్న ఆలోచన ఉంటే వెంటనే ఆ దిశగా అడుగులు వేయండి. కలిసివచ్చే రంగు : నారింజ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఈవారమంతా కాస్తంత గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ వాయిదా పడుతూ మీ సహనానికి పరీక్ష పెడతాయి. మీ చుట్టూ ఉండేవారంతా మంచి వారే అనుకోవడం మీ స్వభావమే అయినా గుడ్డిగా నమ్మితే కొన్ని సమస్యలు తలెత్తుతాయన్న విషయం తెలుసుకోండి. ఎప్పుడో మొదలుపెట్టి మధ్యలో ఆపేసిన ఓ పని గురించి బాగా ఆలోచిస్తారు. ఆ పనిని మళ్లీ కొత్తగా మొదలుపెట్టేందుకు ఇదే సరైన సమయం. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఈ నెలంతా మీకు కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. ఆ పరిస్థితులు మీపై తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తాయి. ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. వీటన్నింటినీ ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధంగా ఉండండి. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. వారి మాటలే మీకు ఈ కష్టసమయంలోనూ కొండంత అండగా కనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కలిసివచ్చే రంగు : నారింజ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదే! గమ్యాన్ని చేరేందుకు ఏయే మార్గాలు ఎంచుకోవాలో ఇప్పట్నుంచే ఆలోచించండి. పగటికలలు మానేసి గమ్యం వైపుకు వెళ్లేందుకు శక్తినంతా వెచ్చించి పనిచేయండి. సన్నిహితుల నుంచి వచ్చే సలహాలు, సూచనలు తీసుకుంటూనే ముందుకెళ్లండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ఇష్టంగా ప్రేమించే వ్యక్తి నుంచి వచ్చే ప్రోత్సాహం కూడా మిమ్మల్ని మరింత ఉత్సాహంగా ముందుకు నడిపిస్తుంది. కలిసివచ్చే రంగు : బూడిద ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు : 31 జూలై నుంచి 6ఆగస్టు, 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) అనుకున్న కార్యక్రమాలు నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశాజనకంగా ఉంటుంది. దూరపు బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి. గులాబి, తెలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యయప్రయాసలు. మిత్రులు, కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొనే అవకాశం. కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. ఆకుపచ్చ, లేత నీలం రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. భూవివాదాలు పరిష్కారం. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా అనుకూల పరిస్థితి. కాంట్రాక్టులు పొందుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసి వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు చికాకులు తొలగుతాయి. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. పసుపు, నేరేడు రంగులు, ఆదిత్య హృద యం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) పనులు సమయానికి పూర్తి చేస్తారు. కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. భూ, గృహయోగాలు కలుగుతాయి. గతంలో చేజారిన వస్తువులు తిరిగి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. లేత ఎరుపు, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులకు మంచి గుర్తింపు రాగలదు. లేత ఎరుపు, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) యత్నకార్యసిద్ధి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. పేరు ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. కళాకారులకు అవార్డులు. తెలుపు, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. ఆకుపచ్చ, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ముఖ్యమైన కొన్ని పనులు అనుకున్న రీతిలో పూర్తి కాగలవు. ఆలోచనలు కలసి వస్తాయి. నూతన ఉద్యోగప్రాప్తి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వాహనయోగం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎరుపు, లేత పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) పనుల్లో కొంత జాప్యం జరిగినా చివరికి పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దొరుకుతాయి. రాజకీయవర్గాలకు సన్మానయోగం. గులాబి, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఇంటాబయటా అనుకూల పరిస్థితి. వ్యాపారాలు విస్తరిస్తారు. లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. నీలం, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ యత్నాలు కలసి వస్తాయి. ఉద్యోగులకు కొంత పనిభారం తప్పదు. కళాకారులకు నిరుత్సాహం. ఆకుపచ్చ, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) పనులు నిదానంగా పూర్తి చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఇంటాబయటా అనుకూల పరిస్థితి. భూవివాదాలు పరిష్కారమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. కీలక అంశాల్లో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కళాకారుల యత్నాలలో పురోగతి. ఎరుపు, పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయదండకం పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
వారఫలాలు : 24 జూలై నుంచి 30జూలై, 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) వ్యయప్రయాసలు. ఆదాయానికి మించి ఖర్చులు. పనుల్లో ప్రతిబంధకాలు. బంధువులతో అకారణంగా వివాదాలు. కొన్ని ఒప్పందాలు, రిజిస్ట్రేషన్లు వాయిదా వేస్తారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయ వర్గాలకు నిరుత్సాహం. పసుపు, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. ఆరోగ్య సమస్యలు తీరతాయి. పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి. ఉద్యోగులకు కొన్ని సమస్యలు తీరతాయి. కళాకారులకు యత్నకార్యసిద్ధి. లేత ఆకుపచ్చ, నలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతకు కుంకుమార్చన చేయండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆదాయం పెరిగి రుణాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. సోదరులు, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు లాభిసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయ వర్గాలకు నూతనోత్సాహం. పసుపు, లేత నీలం రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలోనూ, కుటుంబంలోనూ ప్రత్యేక గౌరవం పొందుతారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధన లాభ సూచనలు. వివాహ, ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగి ఊరట లభిస్తుంది. రాజకీయ వర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. తెలుపు, ఎరుపు రంగులు, హనుమాన్ చాలీసా పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య విషయంలో కొద్దిపాటి చికాకులు. బంధువులతో మాటపట్టింపులు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కళాకారులకు ఒత్తిడులు. గులాబి, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఆదాయానికి మించి ఖర్చులు. అనుకున్న పనుల్లో ఆటంకాలు. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వేడుకలకు డబ్బు వెచ్చిస్తారు. ఆరోగ్య భంగం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందకొడిగానే సాగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనల్లో మార్పులు. ఆకుపచ్చ, నీలం రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వాహన యోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహంగా ఉంటుంది. పసుపు, నేరేడురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణు ధ్యానం చేయండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. అనూహ్యంగా ఒక ఆహ్వానం అందుతుంది. మీ తెలివితేటలకు తగిన గుర్తింపు రాగలదు. వాహన, గృహ యోగాలు కలుగుతాయి. బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు. రాజకీయ వర్గాలకు పదవులు దక్కే సూచనలు. గులాబి, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటా బయటా చికాకులు ఎదుర్కొంటారు. ఆరోగ్యవిషయంలో కొంత శ్రద్ధ చూపండి. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. కళాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. లేత ఆకుపచ్చ, పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంత కాలం పడిన శ్రమ వృథా కాగలదు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామిక వర్గాలకు పర్యటనలు వాయిదా. నీలం, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) చేపట్టిన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. శ్రమాధిక్యం. బంధు మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. నిరుద్యోగుల కృషి అంతగా ఫలించదు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో చికాకులు ఎదురవుతాయి. రాజకీయ వర్గాలకు నిరుత్సాహం. నలుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీనృసింహ స్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిచయాలు పెరుగుతాయి. స్థిరాసి ్తలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు తథ్యం. కళాకారులకు సత్కారాలు. గులాబి, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రామరక్షా స్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
వారఫలాలు : 17 జూలై నుంచి 23జూలై, 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) పనులు నిదానంగా కొనసాగుతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు. కాంట్రాక్టుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో కొద్దిపాటి మార్పులు. ఉద్యోగులకు ఒత్తిడులు తప్పవు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. విద్యార్థులకు ఆశించిన ఫలితాల కోసం అదనపు శ్రమ తప్పదు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) కొత్త ప్రయత్నాలు సానుకూలం. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలు. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. ఎరుపు, చాక్లెట్, నేరేడు, గులాబి రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత. విలువైన సమాచారం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. వ్యాపారులకు అధికలాభాలు. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పసుపు, లేత ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. అందరిలోనూ గుర్తింపు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. లాభదాయకమైన కాంట్రాక్టులు దక్కుతాయి. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. చాక్లెట్, పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం పొందుతారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. ధార్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చిరకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయ, కళారంగాల వారికి యోగవంతంగా ఉంటుంది. ఎరుపు, తెలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కొన్ని కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. బంధుమిత్రుల సహాయం అందుతుంది. ఇంటర్వ్యూలు ఉత్సాహాన్నిస్తాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయదర్శనాలు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు. ప్రతిభకు గుర్తింపు దొరుకుతుంది. ఉద్యోగాలలో పదోన్నతులు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. దూరప్రయాణాలు ఉంటాయి. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు మార్పులు. కళాకారులు, రాజకీయవేత్తలకు అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. తెలుపు, లేత ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) పట్టిందల్లా బంగారమే అన్నట్లుంటుంది. సేవాకార్యక్రమాలపై ఆసక్తి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహన,కుటుంబసౌఖ్యం. అత్యంత విలువైన సమాచారం. పాతబాకీలు వసూలవుతాయి. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్య నుంచి బయటపడతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయ, కళారంగాల వారికి పురస్కారాలు. ఎరుపు, నేరేడు రంగులు, ద క్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. కుటుంబ సమస్యలు తీరుతాయి. పొరపాట్లు సరిదిద్దుకుని పనుల్లో విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో చిరకాలంగా సాగుతున్న ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. గులాబి, బంగారు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనక దుర్గా స్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) కొత్తకార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అవివాహితులకు వివాహ యత్నాలు, నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఉత్సాహంగా ఉంటుంది. రాజకీయ, కళారంగాల వారికి పురస్కారాలు. ఆస్తి వివాదాలు పరిష్కారం. నలుపు, లేత ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ఈవారం కొన్ని కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. బంధువుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉండవచ్చు. పనిభారం పెరగవచ్చు. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా. నీలం, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. పట్టుదల పెరుగుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయ, కళారంగాల వారికి అనుకోని అవకాశాలు. పసుపు, ఎరుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. వినాయక స్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
వారఫలాలు : 10 జూలై నుంచి 16జూలై, 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, ఆప్తులు చేదోడుగా నిలుస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింతగా పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఒక ముఖ్యసమాచారం అందుతుంది. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. లేత పసుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడే అవకాశం. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి కాగలవు. ఆస్తి విషయంలో బంధువులతో ఒప్పందాలు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పనిభారం కొంత తగ్గవచ్చు. రాజకీయవర్గాలకు పదవులపై కొత్త ఆశలు. నీలం, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు కొంత మందగిస్తాయి. శ్రమ తప్ప ఫలితం అంతగా కనిపించదు. మిత్రులతో మాటపట్టింపులు. ఆరోగ్యపరంగా చికాకులు ఎదురవుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార లావాదేవీలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. కళాకారుల యత్నాలు నిరాశ పరుస్తాయి. ఆకుపచ్చ, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) అనుకున్న కార్యక్రమాలలో అవరోధాలు. బంధువులు, మిత్రులతో విభేదాలు ఏర్పడవచ్చు. ముఖ్య నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఆస్తుల విషయంలో వివాదాలు నెలకొంటాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థుల కృషి అంతగా ఫలించదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో సామాన్య లాభాలు. ఉద్యోగులకు ఒత్తిడులు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనల్లో మార్పులు. పసుపు, లేత ఎరుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతస్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) శ్రమాధిక్యంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి కాగలవు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. సోదరులు, శ్రేయోభిలాషుల నుంచి ఒత్తిడులు. వాహన, గృహం కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు. గులాబి, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. తీర్థయాత్రలు చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఎంతోకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థులకు అనుకూల సమాచారం. వ్యాపారాలు అభివృద్ధిపథంలో సాగుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు. కళాకారులకు అప్రయత్న కార్యసిద్ధి. ఆకుపచ్చ, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) వ్యవహారాలలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఎంతగా కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు. సోదరులు, మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆరోగ్యభంగం. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం తప్పదు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. లేతనీలం, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) అనుకున్న పనులు సాఫీగా పూర్తి కాగలవు. రాబడి కొంత పెరిగే అవకాశం. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఆరోగ్యం కుదుటపడి ఉపశమనం పొందుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు అభివృద్ధి దిశగా సాగుతాయి. ఉద్యోగులకు పైస్థాయి నుంచి ప్రోత్సాహం. కళాకారులకు సన్మానాలు. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాస్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. సోదరుల నుంచి ధనలాభ సూచనలు. ఇళ్లు, వాహనాల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. నేరేడు, పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబపరంగా కొన్ని ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. భూ, వాహనయోగాలు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు. రాజకీయవర్గాలకు సన్మానయోగం. నలుపు, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆరోగ్య, కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని విషయాలలో రాజీపడక తప్పదు. ఒప్పందాలు కొన్ని వాయిదా వేస్తారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. కళాకారులకు ఒత్తిడులు. లేతనీలం, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీగణపతి స్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. సోదరులు, సోదరీలతో అకారణంగా వివాదాలు. శ్రమ మరింత పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తప్పకపోవచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు విధుల్లో కొద్దిపాటి మార్పులు. రాజకీయవర్గాలకు కొంత గందరగోళంగా ఉంటుంది. గులాబి, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు సానుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
వారఫలాలు : 3 జూలై నుంచి 9జూలై, 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఆస్తి వ్యవహారాలలో కొద్దిపాటి చిక్కులు. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆలోచనలు అంతగా కలసిరావు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వ్యాపారాలు స్వల్పంగానే లాభిస్తాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా పడవచ్చు. పసుపు, లేత ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతిని అర్చించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వాహన, గృహయోగాలు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారుల ఆశలు ఫలిస్తాయి. నీలం, ఆకుపచ్చరంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతను పూజించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) వ్యయప్రయాసలు తప్పకపోవచ్చు. అనుకున్న కార్యాలు ముందుకు సాగవు. కుటుంబసభ్యులతో అకారణంగా తగాదాలు ఏర్పడవచ్చు. ఆప్తులు కూడా మీపట్ల వ్యతిరేకత చూపుతారు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. భూవివాదాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు మరింత పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు చికాకులు. గులాబి, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు రాగలవు. వాహనయోగం. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు దక్కుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు పదవీయోగం. పసుపు, లేత ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కొన్ని వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరవుతారు. సేవాకార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. భూములు, వాహనాలు కొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఇబ్బందులు తొలగి ఊరట లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. గులాబి, లేత ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) అనుకున్న రాబడి లభించి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. కార్యజయం. ఆప్తులు, బంధువులతో విభేదాలు తొలగుతాయి. వాహనసౌఖ్యం. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. మీ సాహసోపేత నిర్ణయాలు కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరుస్తాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు సన్మానయోగం. పసుపు, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. బంధువులతో వివాదాలు నెలకొంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అవసరాలు తీరతాయి. చాకచక్యంగా వ్యవహరించి కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం మందగిస్తుంది. నిరుద్యోగుల కృషి అంతగా ఫలించదు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు మార్పులు అనివార్యం. నీలం, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) అనుకున్న పనులు నెమ్మదిస్తాయి. శ్రమకు ఫలితం అంతగా కనిపించదు. ఆస్తి విషయాలలో బంధువర్గంతో వివాదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగించవచ్చు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కళాకారులకు నిరుత్సాహం. గులాబి, లేత పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రాగలవు. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వాహనయోగం. కీలక నిర్ణయాలకు తగిన సమయం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు కొత ్తహోదాలు లభిస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. నేరేడు, లేత ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్వామిని ఆరాధించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) యత్నకార్యసిద్ధి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఓర్పు, నేర్పుతో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు సత్కారాలు. నీలం, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యసమస్యలు. బంధువులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఒత్తిడులు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం తప్పదు. రాజకీయవర్గాలకు పర్యటనల్లో మార్పులు. నలుపు, ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. అనారోగ్య సూచనలు. బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగయత్నాలు నిరాశ కలిగించవచ్చు. వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. కళాకారుల యత్నాలలో ఆటంకాలు. పసుపు, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు -
వారఫలాలు : 26 జూన్ నుంచి 2జూలై, 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలమ వుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు. రాజకీయవర్గాలకు సన్మానాలు. ఎరుపు, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆర్థికంగా బలపడతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది. వివాహ, ఉద్యోగయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. కళాకారులకు అవార్డులు దక్కే సూచనలు. నీలం, ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) అనుకున్న కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆరోగ్యం, కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. పొరపాట్లు సరిదిద్దుకుని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటాబయటా అనుకూల పరిస్థితి నెలకొంటుంది. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. రాబడి పెరిగి అవసరాలు తీరతాయి. వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. నలుపు, లేత పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మిత్రులు, బంధువులతో విభేదాలు తొలగుతాయి. జీవితాశయం నెరవేరుతుంది. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు తథ్యం. వాహనసౌఖ్యం. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం కొంత తగ్గవచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. తెలుపు, గులాబి రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆర్థిక ఇబ్బందులు కొంత తొలగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. అనుకున్న పనులు నెమ్మదిగా సాగుతాయి. దూరపు బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. ఒక సమస్య పరిష్కారమవుతుంది. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళాకారులకు ప్రయత్నాలు సఫలం. నీలం, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) పనులు సజావుగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. భూలాభాలు. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. ఆకుపచ్చ, లేత పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. పలుకుబడి కలిగినవారు పరిచయమై సహాయపడతారు. కొన్ని వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు సన్మానయోగం. ఎరుపు, తెలుపురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు మొదట్లో ఇబ్బందికరంగా ఉన్నా క్రమేపీ పుంజుకుంటాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. భూవివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రావచ్చు. కళాకారులకు సన్మానయోగం. పసుపు, చాక్లెట్ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) పనులు ముందుకు సాగవు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. రాబడి అంతగా కనిపించదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సోదరులు, మిత్రులతో కలహాలు. విద్యార్థులకు నిరుత్సాహం. ఆరోగ్యపరంగా కొద్దిపాటి ఇబ్బందులు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. రాజకీయవర్గాలకు ఒత్తిడులు. నీలం, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు రావచ్చు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు సన్మానయోగం. ఆకుపచ్చ, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) పట్టింది బంగారమే. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. యత్నకార్యసిద్ధి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. గులాబి, తెలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
వారఫలాలు : 19 జూన్ నుంచి 25 జూన్, 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక లావాదేవీలు కొంత ఆశాజనకంగా ఉంటాయి. పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఒక వివాదం నుంచి బయటపడతారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకూలం. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. పసుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) కొన్ని కార్యక్రమాలు నిదానంగా పూర్తి కాగలవు. ఆదాయం కొంత తగ్గి రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బంధువులు, మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు సంభవం. కళాకారులకు ఒత్తిడులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక లావాదేవీలలో పురోగతి కనిపిస్తుంది. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. ఓర్పు, నేర్పుతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అవివాహితులకు వివాహ యత్నాలు, నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి. రాజకీయవర్గాలకు ఆశించిన పదవులు దక్కుతాయి. నేరేడు, ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) పనుల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరిగినా, కొత్త హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు తీరతాయి. గులాబి, లేత ఆకుపచ్చ రంగులు, దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కొన్ని సమస్యలు, వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ప్రతిభ చాటుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనయోగం. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు సన్మానయోగం. ఎరుపు, లేత పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పర్చినా అవసరాలు తీరుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. పాతమిత్రులను కలుసుకుంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు సన్మానాలు. గులాబి, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. బంధువర్గంతో విభేదాలు ఏర్పడతాయి. ఆరోగ్య, కుటుంబ సమస్యలు వేధిస్తాయి. విద్యార్థులకు ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు బదిలీ అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. నీలం, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు, బంధువుల నుంచి ఆహ్వానాలు. సంఘంలో గౌరవం. కాంట్రాక్టర్లకు శుభవర్తమానాలు. అదనపు రాబడి ఉంటుంది. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు పదవీయోగం. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఎరుపు, పసుపు రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. పాతమిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక ప్రగతి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ యత్నాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు కలిసొస్తాయి. కళాకారులకు సన్మానాలు దక్కుతాయి. ఆకుపచ్చ, గులాబి రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ స్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) కార్యజయం. కుటుంబసభ్యులతో వివాదాలు తీరుతాయి. స్థిరాస్తి వివాదాలు, కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారమవుతాయి. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు సంతోషాన్నిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కవచ్చు. కళాకారులకు ఊహించని ఆహ్వానాలు రాగలవు. నీలం, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. మిత్రులు, బంధువులతో వివాదాలు కొంత తీరుతాయి. కొత్తగా భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. అవివాహితులకు వివాహ యత్నాలు, నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు లభిస్తాయి. రాజకీయవర్గాలకు సన్మానాలు. నలుపు, చాక్లెట్ రంగులు, దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణాలు తీరుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కే అవకాశాలు ఉన్నాయి.. కళాకారులకు అవార్డులు దక్కుతాయి. గులాబి, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
వారఫలాలు : 12 జూన్ నుంచి 18జూన్, 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) పనులలో పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు నెలకొన్నా సర్దుబాటు కాగలవు. శ్రమకు ఫలితం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు సహాయపడతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు సన్మానాలు. నేరేడు, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆకస్మిక ధనలబ్ధి. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. కళాకారులకు నూతనోత్సాహం. పసుపు, ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. రామరక్షాస్తోత్రం పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. నూత న పరిచయాలు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆలయాలు సందర్శిస్తారు. సంఘంలో గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఉత్సాహంగా ఉంటుంది. ఎరుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. బంధువులతో మాటపట్టింపుల వల్ల మనశ్శాంతి లోపిస్తుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యభంగం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృథా శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు తప్పకపోవచ్చు. రాజకీయవర్గాలకు నిరాశ తప్పదు. ఆకుపచ్చ, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విందువినోదాలతో ఉల్లాసంగా గడుపుతారు. నూతన ఉద్యోగయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతి అవకాశాలు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఎరుపు, లేత పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఆర్థిక లావాదేవీలు ఉత్సాహవంతంగా ఉంటాయి. పనులు సజావుగా పూర్తి చేస్తారు. బంధువులతో విభేదాలు తొలగిపోతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వాహనయోగం. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. నూతన వస్తు, వస్త్రలాభాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళాకారులు తమ ప్రతిభను చాటుకుంటారు. తెలుపు, లేత ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గి ఊరట లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు, విదేశీ పర్యటనలు. నీలం, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు మరింత దగ్గరవుతారు. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. గులాబి, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గా స్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు నెలకొన్నా క్రమేపీ తొలగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. రాబడి సంతృప్తినిస్తుంది. ఆస్తి వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు రాగలవు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. నీలం, నలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) అనుకున్న పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆత్మీయులతో మాటపట్టింపులు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. విద్య, ఉద్యోగయత్నాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. చాక్లెట్, లేత ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రతిభను చాటుకుంటారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. వివాహయత్నాలు సానుకూలం. వాహనయోగం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు, విస్తరణయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళాకారులకు ఆహ్వానాలు రాగలవు. గులాబి, ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
వారఫలాలు : 5 జూన్ నుంచి 11జూన్, 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. పనులు నత్తనడకన సాగుతాయి. బంధువులు, మిత్రులతో విభేదాలు ఏర్పడవచ్చు. నిరుద్యోగుల యత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార లావాదేవీలు కొంత నిరాశ కలిగించవచ్చు. ఉద్యోగులకు పని ఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. పసుపు, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. గతం నుంచి ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు పరిష్కారవుతాయి. వాహనయోగం. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. గులాబి, ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ముఖ్యమైన కార్యక్రమాలు సాఫీగా పూర్తి కాగలవు. ఆదాయం కొంత పెరిగే అవకాశం. బంధువులు, మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. వేడుకల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారంలో చొరవ చూపుతారు. దైవదర్శనాలు చేసుకుంటారు. విద్యార్థులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి. కళాకారులను విజయాలు వరిస్తాయి. లేత ఎరుపు, నీలం రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రులతో విభేదాలు పరిష్కారమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు సహకరిస్తారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. రాజకీయవర్గాలకు సన్మానాలు. తెలుపు, లేత పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రావ లసిన సొమ్ము అందుతుంది. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా పూర్తి కాగలవు. వివాహ, ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చేజారిన విలువైన సామగ్రి తిరిగి దక్కించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. ఎరుపు, గులాబి రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కొన్ని ఇబ్బందులు ఎదురైనా అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆకుపచ్చ, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో చికాకులు సర్దుబాటు కాగలవు. చేపట్టిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు సన్మానాలు. నీలం, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ముఖ్యమైన కార్యక్రమాలను నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. భూవివాదాల నుంచి బయటపడతారు. ఒక పెండింగ్ వ్యవహారంలో అనుకూలత. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. కళాకారులకు ప్రయత్నాలలో పురోగతి. ఎరుపు, లేత గులాబి రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయంలో ప్రదక్షణలు చేయండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. బంధువులు, మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థుల యత్నాలు కలసివస్తాయి. ఇంటాబయటా అనుకూల పరిస్థితులు. వాహనయోగం. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు పదవీయోగం. పసుపు, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) కార్యజయం. ఆప్తులు,సన్నిహితులను కలుసుకుంటారు. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం. ఇంటిలో శుభకార్యాల నిర్వహణపై చర్చలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. భూములు, గృహం కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు. కళాకారులకు సన్మానాలు. నీలం, ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. భూ, వాహనయోగాలు. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. నలుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ముఖ్యమైన కార్యక్రమాలను కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు ఎదురుకావచ్చు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
వారఫలాలు : 29 మే నుంచి 4 జూన్, 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) బంధువుల ద్వారా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొన్ని బాకీలు వసూలవుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కివచ్చే అవకాశం. విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. అనుకున్న పనులు కొంత నిదానంగా సాగుతాయి. ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఒక సమస్య పరిష్కారమవుతుంది. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. లేతనీలం, చాక్లెట్ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) కొన్ని పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా అదేస్థాయిలో ఉంటాయి. దూరపు బంధువుల రాకతో ఉత్సాహంగా గడుపుతారు. స్వల్ప అనారోగ్యం. తీర్థయాత్రలు చేస్తారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగుల శ్రమ ఫలిస్తుంది. కళాకారులకు సత్కారాలు, విదేశీ పర్యటనలు. పసుపు, ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ప్రారంభంలో కుటుంబ సమస్యలు కొంత చికాకు పరిచినా సర్దుబాటు కాగలవు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము అందుతుంది. పనులు సకాలంలోనే పూర్తి కాగలవు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు పెరిగే అవకాశం. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు. లేతపసుపు, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) చేపట్టిన కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి కాగలవు. దూరపు బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. రాబడి ఆశాజనకమే. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. విద్యార్థులు, నిరుద్యోగులను విజయాలు వరిస్తాయి. వాహనయోగం. వ్యాపారాలు కొంత మేరకు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. రాజకీయవర్గాలకు సంతోషకరమైన సమాచారం. ఎరుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారకస్తోత్రం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విద్యావకాశాలు దగ్గరకు వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బంధువులు, మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వాహన, గృహయోగాలు. వ్యాపారాలలో పెట్టుబడులు పెరుగుతాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు. కళాకారులకు కొన్ని అవకాశాలు దగ్గరకు వస్తాయి. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) పనులు చకచకా పూర్తి కాగలవు. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేసే అవకాశముంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. నీలం, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొన్ని వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. ఒక సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. రాబడి, ఖర్చులు సమానంగా ఉంటాయి. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వాహనయోగం. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఉద్యోగులకు ఒత్తిడుల నుంచి ఉపశమనం. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. ఎరుపు, బంగారు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడినా అధిగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. గృహం, వాహనాలు కొనుగోలు యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వ్యాపారాలలో స్వల్పలాభాలు. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. కళాకారులకు ప్రయత్నాలు కొంత సఫలమవుతాయి. గులాబి, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) అనుకున్న పనులలో అవాంతరాలు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. విలువైన వస్తువులు భద్రంగా చూసుకోండి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఉద్యోగులకు పనిఒత్తిడులు. రాజకీయవర్గాల వారు పర్యటనలు వాయిదా వేస్తారు. నీలం, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) పనుల్లో విజయం. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. రావలసిన డబ్బు చేతికందుతుంది. బంధువర్గంతో వివాదాలు తీరతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. ఇంటి నిర్మాణయత్నాలలో పురోగతి ఉంటుంది. వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. కళాకారుల యత్నాలు కలిసి వస్తాయి. నలుపు, ఆకుపచ్చరంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఉత్సాహాన్నిస్తుంది. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వాహనయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు పదవులు వరించే సూచనలు. గులాబి, లేతఎరుపు రంగులు, దక్షిణదిశప్రయాణాలు సానుకూలం. కనకధారా స్తోత్రం పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
వారఫలాలు : 22 మే నుంచి 28మే, 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు సంతోషక రమైన సమాచారం. పసుపు, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) అవసరాలకు డబ్బు అందుతుంది. పనులు కొంత నెమ్మదిస్తాయి. బంధువులతో ముఖ్య విషయాలపై చర్చలు జరుపుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. ఎరుపు, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) కొత్త పనులు ప్రారంభిస్తారు. సేవాకార్యక్రమాలు, వేడుకలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుకుంటారు. ఒక సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళాకారులకు సన్మానాలు. పసుపు, లేత ఎరుపురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్వల్ప అనారోగ్యం. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వాహనయోగం. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. చాక్లెట్, లేత పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. భూవివాదాలు పరిష్కారమవుతాయి. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. పలుకుబడి కలిగిన వారితో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామికవర్గాలకు అంచనాలు నిజమవుతాయి. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవికి కుంకుమార్చన చేయండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులకు అవార్డులు దక్కవచ్చు. గులాబి, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వ్యవహారాలలో కావాల్సిన వారితో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. విద్యార్థులకు కొంత నిరాశ ఎదురుకావచ్చు. వాహనాలు, ఆరోగ్య విషయంలో కొంత మెలకువ అవసరం. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు పర్యటనల్లో మార్పులు. నీలం, చాక్లెట్ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఈ వారం పట్టింది బంగారమే అన్నట్టుంటుంది. శుభవార్తలు. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. తండ్రి తరఫు వారి నుంచి ఆహ్వానాలు రావచ్చు. స్థిరాస్తి వృద్ధి. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు తథ్యం. కళాకారులకు సంతోషకరమైన సమాచారం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్య తీరుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవులు దగ్గరకు రాగలవు. పసుపు, గులాబి రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ అర్చనలు చేయండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) అదనపు ఆదాయం సమకూరుతుంది. రుణబాధలు తొలగుతాయి. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఎంతటివారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు మరింతగా పెరుగుతాయి. వాహనయోగం. పుణ్యక్షేత్రాల సందర్శనం. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. నీలం, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని వివాదాలు, సమస్యల నుంచి బయటపడతారు. మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు. కళాకారుల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. నలుపు, లేత ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. రాబడి మరింతగా పెరుగుతుంది. ఇతరుల సహాయంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు కుదురుతాయి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. రాజకీయవర్గాలకు ఊహించని పిలుపురావచ్చు. గులాబి, బంగారు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
వారఫలాలు : 15 మే నుంచి 21మే, 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కొత్త పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఒక ముఖ్య వ్యవహారం సానుకూలమవుతుంది. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు హోదాలు రాగలవు. ఎరుపు, చాక్లెట్ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు. అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. వాహన, గృహ కొనుగోలు యత్నాలలో కదలికలు రావచ్చు. పాతమిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు విధులు. ఆకుపచ్చ, నీలం రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రం పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) కొన్ని పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. ఆర్థిక లావాదేవీలు కొంత ఆశాజకనంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి. శుభకార్యాల నిర్వహణపై కుటుంబంలో చర్చలు. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు ఊరిస్తాయి. కళాకారులకు అప్రయత్న కార్యసిద్ధి. పసుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) అనుకున్న కార్యక్రమాలలో అవాంతరాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. బంధువర్గంతో అకారణంగా వివాదాలు. ముఖ్య నిర్ణయాలు తీసుకునే సందర్భంలో తొందరపాటు వద్దు. విలువైన సామగ్రి చేజారే సూచనలు. వ్యాపారాలలో భాగస్వాములతో ఇబ్బందులు. ఉద్యోగులకు అదనపు విధులు తప్పకపోవచ్చు. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. తెలుపు, లేత ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారకస్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలై అవసరాలు తీరతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు పదవులు, సన్మానాలు. ఎరుపు, నేరేడు రంగులు, పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి. సంఘంలో విశేష గౌరవం. చాకచక్యంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. భూవివాదాలు పరిష్కారం. శుభకార్యాల నిర్వహణలో భాగస్వాములవుతారు. ఎంతోకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. క్రీడాకారులకు అవార్డులు, పురస్కారాలు అందుతాయి. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి సహాయం. వాహనాలు, భూముల కొనుగోలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు పదవీయోగం. నీలం, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) పట్టింది బంగారమే. సంఘంలోనూ, కుటుంబంలోనూ మీదే పైచేయి. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు సఫలం. అనుకున్న పనులలో విజయం. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. భూ, వాహనయోగాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్తహోదాలు. కళాకారులకు అప్రయత్నంగా అవకాశాలు. గులాబీ, లేత పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశస్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక లావాదేవీలు గతం కంటే అనుకూలిస్తాయి. బంధువులు, మిత్రుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పనులు కొంత నిదానంగా పూర్తి కాగలవు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం. విద్యార్థులు చేసే యత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వాహనయోగం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ప్రారంభంలో చికాకులు నెలకొన్నా క్రమేపీ పరిస్థితులు అనుకూలిస్తాయి. రావలసిన సొమ్ము అందుతుంది. చేపట్టిన కార్యక్రమాలు సజావుగానే సాగుతాయి. శుభవార్తలు అందుతాయి. ఆరోగ్య, కుటుంబ సమస్యలు కొంతవరకూ తీరతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు ఊహించని ఆహ్వానాలు. నీలం, నేరేడురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం. స్వల్ప అనారోగ్యం. వివాదాలు పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలలో అవాంతరాలు తొలగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు ముఖ్య సమాచారం అందుతుంది. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుతాయి. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. నలుపు, ఆకుపచ్చరంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఒక సమస్య చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనయోగం. నిరుద్యోగులకు అనుకూల ప్రకటన రావచ్చు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారుల యత్నాలు సఫలం. ఎరుపు, లేత పసుపురంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
వారఫలాలు: 1 నవంబర్ నుంచి 7 నవంబర్, 2015 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులు, విద్యార్థులకు శుభదాయకమైన కాలం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. గులాబి, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయ దర్శనం మంచిది. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమానంతరం పనులు పూర్తి కాగలవు. విద్యార్థులకు నిరుత్సాహపూరితం. వాహనాలు, గృహ కొనుగోలు యత్నాలు ముందుకు సాగవు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపార లావాదేవీలు సామాన్యం. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఆకుపచ్చ, లేతనీలం రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. వినాయకుని పూజించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) యుక్తితో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. సేవా కార్య క్రమాలు చేపడతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణదాతల ఒత్తిడులు తొలగు తాయి. వ్యాపార విస్తరణలో ముందడుగు. ఉద్యోగులకు పదోన్నతులు. తెలుపు, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కొత్త పనులు ప్రారంభిస్తారు. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. మనసులోని భావాలను కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కొంత జాప్యం జరిగినా వ్యవహారాలు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొన్ని నిర్ణయాలపై కుటుంబసభ్యుల నుంచి ప్రశంసలు. ఇంటి నిర్మాణయత్నాలు కలిసి వస్తాయి. వాహనయోగం. నిరుద్యోగులకు శుభవార్తలు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళాకారులకు విశేష ఆదరణ, సన్మానాలు. పసుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) పట్టింది బంగారమే. కొత్త పనులకు శ్రీకారం. ఆత్మీయులు, బంధువులతో సఖ్యత. మాటల చాతుర్యంతో అందర్నీ ఆకట్టు కుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక లాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆకుపచ్చ, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతకు కుంకుమార్చన చేయండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత బయటపడతారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి కాగలవు. విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు అనుకూల పరిస్థితి. చాక్లెట్, పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) మొదట్లో కొన్ని చికాకులు, సమస్యలు వచ్చినా క్రమేపీ తొలగుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకమే. సంఘంలో గౌరవ మర్యాదలు. వాహనయోగం. ఆస్తి వివాదాలు తీరతాయి. సోదరులతో సఖ్యత. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులు సమర్థత చాటుకుంటారు. ఎరుపు, ఊదా రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ స్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) పనులు నిదానంగా పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళాకారులకు అవార్డులు. తెలుపు, లేత పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఇంటా బయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువర్గంతో విభేదాలు తొలగుతాయి. భూములు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు పదవీయోగం. నీలం, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) చేపట్టిన పనులు సజావుగానే పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుని ముందుకు సాగుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. కళాకారులకు అవార్డులు దక్కవచ్చు. నలుపు, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) పనులు నిదానంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. భూవివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహంగా గడుస్తుంది. గులాబీ, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణ స్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
చంద్రబింబం: జూలై 20 నుండి 26 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కివస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కే అవకాశం. పారిశ్రామికరంగం వారికి పట్టింది బంగారమే. వారం మధ్యలో దూరప్రయాణాలు. అనారోగ్యం. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్య నుంచి బయటపడే అవకాశం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం చివరిలో వ్యయప్రయాసలు. ప్రయాణాలు. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. జీవితాశయం నెరవేరుతుంది. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులు ఇంక్రిమెంట్లు పొందుతారు. కళారంగం వారికి సంతోషకరమైన సమాచారం అందుతుంది. వారం మధ్యలో దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) పాతబాకీలు వసూలవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థుల యత్నాలు సఫలం. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం చివరిలో అనారోగ్య సూచనలు. వివాదాలు. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) నూతన వ్యక్తుల పరిచయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ శ్రమ ఫలిస్తుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో అకారణంగా వివాదాలు. ఆరోగ్యభంగం. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,) ప్రారంభంలో కొన్ని చికాకులు ఎదురైనా క్రమేపీ సర్దుబాటు కాగలవు. రుణబాధలు తొలగుతాయి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు కొంత అనుకూల పరిస్థితి ఉంటుంది. వ్యాపారులు అనుకున్న లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.) ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులు కొన్ని సకాలంలో పూర్తి చేస్తారు. భూవివాదాలు పరిష్కారమవుతాయి. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు కోరుకున్న మార్పులుండవచ్చు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శుభకార్యాల రీత్యా ధనవ్యయం. రావలసిన సొమ్ము అందుతుంది. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ఇంతకాలం పడిన శ్ర మ ఫలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో చికాకులు తొలగుతాయి. కళారంగంవారికి అవార్డులు లభించవచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. బంధువులతో వివాదాలు. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వాహనాలు, భూములు కొంటారు. చిరకాల కోరిక నెరవేరుతుంది. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులు సమర్థతను చాటుకుంటారు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బంధువులతో విభేదాలు తొలగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. ఆకస్మిక ధనలాభం. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు. రాజకీయవర్గాలకు అంచనాలు నిజమవుతాయి. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. విద్యార్థులకు విద్యావకాశాలు. వాహనయోగం. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళారంగంవారికి సన్మానాలు. వారం మధ్యలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) పనులు నెమ్మదిస్తాయి. బంధు, మిత్రులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యపరంగా చికాకులు. నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. రాజకీయవర్గాలకు నిరాశాజనకంగా ఉంటుంది. వారం ప్రారంభంలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు -
చంద్రబింబం: జూలై 6 నుండి 12 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) ఆర్థిక లావాదేవీలు ఊహించిన విధంగానే ఉంటాయి. కొద్దిపాటి ఆరోగ్యసమస్యలు ఎదురుకావచ్చు. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు సమర్థతను చాటుకుంటారు. రాజకీయవర్గాలకు పదవులు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనుకోని ప్రయాణాలు. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) నేర్పుతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నతస్థాయి నుంచి ప్రశంసలు. పారిశ్రామికరంగం వారు వ్యవహారాలలో విజయంసాధిస్తారు. వారం ప్రారంభంలో ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) ఆర్థిక ఇబ్బందులు తొలగే సమయం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ చూపండి. బంధువర్గంతో నెలకొన్న వివాదాలు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలులో ప్రతిబంధకాలు తొలగుతాయి. వ్యాపారాల విస్తరణలో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం. కళారంగం వారికి విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. ప్రయాణాలు. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఆర్థిక వ్యవహారాలు కొంత మందకొడిగా సాగుతాయి. రావలసిన సొమ్ము ఆలస్యమవుతుంది. ప్రయాణాలలో చివరిక్షణంలో మార్పులు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగస్తులు ఇంక్రిమెంట్లు అందుకుంటారు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. అనారోగ్యం. తీర్థయాత్రలు. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) అనుకున్న పనులలో జాప్యం. కుటుంబసభ్యులతో అకారణంగా వివాదాలు నెలకొనవచ్చు. ఆర్థిక లావాదేవీలలో నిరుత్సాహం. ఒక ముఖ్య వ్యక్తి సహాయం అందే అవకాశం. ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు అదనపు పనిభారం. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు. వారం మధ్యలో శుభవార్తలు. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,) బంధువుల నుంచి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము అంది ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. భూములు, వాహనాల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులలో కొత్త ఆశలు. వ్యాపార లావాదేవీలు లాభిస్తాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కళారంగం వారు అవార్డులు అందుకుంటారు. వారం చివరిలో వ్యయప్రయాసలు. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.) పనులు విజయవంతంగా సాగుతాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం. రుణాలు సైతం తీరుస్తారు. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు లభించే సమయం. రాజకీయరంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కోర్టు కేసులో విజయం చేకూరే అవకాశం. వాహనయోగం. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు. దూరప్రయాణాలు చేయాల్సివస్తుంది. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. పారిశ్రామికరంగం వారు కొత్త అవకాశాలు అందుకుంటారు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గ తం కంటే మెరుగ్గా ఉంటుంది. కుటుంబసభ్యులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. భూములు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వారం చివరిలో మిత్రులతో వివాదాలు. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి విషయంలో వివాదాలు సర్దుబాటు కాగలవు. విద్యార్థుల యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గి ఊరట చెందుతారు. వారం ప్రారంభంలో అనారోగ్య సూచనలు. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) పనులు మొదట్లో కొంత మందగిస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే సూచనలు. కళారంగం వారికి సన్మానయోగం. వారం మధ్యలో సోదరులతో వివాదాలు. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) రావలసిన సొమ్ము ఆలస్యమవుతుంది. ముఖ్యమైన పనులలో కుటుంబసభ్యుల సాయం అందుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద ్ధవహించండి. అనుకోని ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో స్వల్పలాభాలు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వారం ప్రారంభంలో వాహనయోగం. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు -
చంద్రబింబం:జూన్ 29 నుండి జూలై 5 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. కాంట్రాక్టర్లకు అనుకూలించదు. విద్యార్థులకు కొంత నిరాశ. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం చివరిలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. పనులు పూర్తి. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) పనుల్లో జాప్యం. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. దూరప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు తప్పవు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలలో లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగులు విధులపై మరింత శ్రద్ధ వహించాలి. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. వారం ప్రారంభంలో వాహనయోగం. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. బంధువులు, మిత్రులతో వివాదాలు. ఆస్తి విషయాలలో ఒప్పందాలలో జాప్యం. వ్యాపారాలలో నిదానం అవసరం. ఉద్యోగులపై అదనపు పనిభారం, మార్పులు. కళారంగం వారికి శ్రమాధిక్యం. వారం ప్రారంభంలో ధనలాభం. వాహనయోగం. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు సానుకూలం. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు లభించే అవకాశం. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. శ్రమాధిక్యం. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) ఆర్థిక విషయాలు నిరాశాజనకంగా ఉంటాయి. కొత్తగా రుణాలు చేస్తారు. కుటుంబసభ్యులతో లేనిపోని వివాదాలు. ఆరోగ్యపరంగా చికాకులు. ప్రత్యర్థుల నుంచి కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు అసంతృప్తి తప్పకపోవచ్చు. వారం ప్రారంభంలో విందువినోదాలు. పనుల్లో విజయం. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,) దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఇళ్లు, వాహనాల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరం. కళారంగం వారికి సన్మానయోగం. వారం చివరిలో అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.) ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి. రాజకీయరంగం వారికి యోగదాయకమైన కాలం. వారం మధ్యలో ఆకస్మికప్రయాణాలు. రుణాలు చేస్తారు. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) రావలసిన సొమ్ము అందుతుంది. ప్రత్యర్థులు కూడా అనుకూలురుగా మారతారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. ప్రతిభకు గుర్తింపు రాగలదు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కవచ్చు. పారిశ్రామికరంగం వారికి విదేశీ ఆహ్వానాలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. వ్యయప్రయాసలు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. బంధువులు, మిత్రులతో వివాదాలు నెలకొంటాయి, దూరప్రయాణాలు చేస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు పైస్థాయి నుంచి సమస్యలు. కళారంగం వారికి నిరుత్సాహం. వారం చివరిలో ఆస్తిలాభం. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) బంధువులతో స్వల్ప వివాదాలు. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్థిరాస్తి వివాదాలు. వ్యాపార లావాదేవీలు సామాన్యం. ఉద్యోగులకు మార్పులు. రాజకీయవర్గాలకు నిరాశాజనకం. వారం ప్రారంభంలో ధన, వస్తులాభాలు. ముఖ్య నిర్ణయాలు. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) శుభకార్యాల నిర్వహణ. దీర్ఘకాలిక సమస్యలు తీరే అవకాశం. బంధువుల నుంచి ధనలాభ సూచనలు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహనయోగం. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. కళాకారులకు నూతనోత్సాహం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబసమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు