చంద్రబింబం: డిసెంబర్ 1నుండి డిసెంబర్ 7 వరకు | Astrology of the week: December 1 to December 7 | Sakshi
Sakshi News home page

చంద్రబింబం: డిసెంబర్ 1నుండి డిసెంబర్ 7 వరకు

Published Sun, Dec 1 2013 4:25 AM | Last Updated on Sat, Sep 2 2017 1:08 AM

చంద్రబింబం: డిసెంబర్ 1నుండి డిసెంబర్ 7 వరకు

చంద్రబింబం: డిసెంబర్ 1నుండి డిసెంబర్ 7 వరకు

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
 వ్యవహారాలలో క్రియాశీల పాత్ర పోషిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు. ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. శ్రమ ఫలిస్తుంది. ప్రముఖుల నుంచి ముఖ్యసందేశం అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. విద్యార్థులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వారం మధ్యలో దూరప్రయాణాలు.రుణాలు చేస్తారు.
 
 వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
 కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, భూములు కొంటారు. పలుకుబడి పెరుగుతుంది. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం.
 
 మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

 పరపతి పెరుగుతుంది. ఇతరులకు సైతం సహాయపడతారు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. విద్యార్థులు విజయం సాధిస్తారు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో చికాకులు.
 
 కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రుణబాధలు తొలగుతాయి.  శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్య పరిష్కారమవుతుంది. వారం మధ్యలో ధనవ్యయం. వివాదాలు.
 
 సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
 వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. రుణాలు చేస్తారు. ఇంటా బయటా ఒత్తిడులు. ఆరోగ్యభంగం. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు వాయిదా పడతాయి. వ్యాపారులు కొంత నిదానం పాటించాలి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. వారం ప్రారంభంలో శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు.
 
 కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,)
 వ్యవహారాలలో ఆటంకాలు చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్య సూచనలు. ఇంటా బయటా వ్యతిరేకత. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం చెందుతారు. వారం మధ్యలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు.
 
 తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.)
 కొత్త పనులు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆస్తి వివాదాలు తీరతాయి. వాహనాలు కొంటారు. ప్రముఖులతో పరిచయాలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వారం చివరిలో వ్యవహారాలలో ఆటంకాలు. వ్యయప్రయాసలు.
 
 వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
 మీ ఆశయాలు నెరవేరడంలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. పోటీపరీక్షల్లో విజయం. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం.
 
 ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)

 ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు. ఆస్తి విషయాలలో సోదరులతో అంగీకారానికి వస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి కనిపిస్తుంది. నిరుద్యోగులను ఒక ప్రకటన ఆకర్షిస్తుంది. వారం చివరిలో దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు.
 
 మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
 పనులు సజావుగా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. దూరపు బంధువుల నుంచి  ధనలాభం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు.
 
 కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
 భూసంబంధిత వివాదాలు తీరతాయి. సమయానికి సొమ్ము అంది అవసరాలు తీరతాయి. కుటుంబసమస్యల నుంచి బయటపడతారు. వ్యాపార, ఉద్యోగాలలో అడుగు ముందుకు వేస్తారు. విద్యార్థులకు ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ప్రయాణాలు.
 
 మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
 పరిచయాలు పెరుగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. ఇంటి నిర్మాణాలు చేపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వృత్తి, వ్యాపారాలలో అనూహ్యమైన అభివృద్ధి కనిపిస్తుంది. కళాకారులకు సన్మానయోగం. వారం మధ్యలో దూరప్రయాణాలు.
 - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు
 
 ఈ వారంలో పుట్టినరోజు జరుపుకునేవారికి...
 గ్రహాల అనుకూలత వల్ల అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కాగలవు. ఆదాయం పెరుగుతుంది. ఆపన్నులకు స్నేహహస్తం అందిస్తారు.  ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. పెండింగ్‌లో పడిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఊహించని సన్మానాలు, పురస్కారాలు. ద్వితీయార్ధంలో ఆర్థిక ఇబ్బందులు, వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు.
 
 మీతో పాటు ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటోన్న సెలెబ్రిటీ...
 కొంకణాసేన్ శర్మ (నటి)
 పుట్టినరోజు: డిసెంబర్ 3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement