మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగుల అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరం. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు నూతనోత్సాహం. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం.
వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు సజావుగా సాగుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వస్తు, వస్త్రలాభాలు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. ఉద్యోగవర్గాలకు పదోన్నతి అవకాశాలు. రాజకీయరంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు.
మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఒక సమాచారం విద్యార్థులను ఆకట్టుకుంటుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరం. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామికరంగం వారికి విదే శీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం.
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
రుణబాధలు తీరతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. భూములు, వాహనాలు కొంటారు. బంధువుల నుంచి మాట సహాయం అందుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఉద్యోగులు పనిభారం తగ్గి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. ధనవ్యయం.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడే అవకాశం. ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరతాయి. ఇంటి కొనుగోలు యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు హోదాలు రాగలవు. వారం మధ్యలో దూరప్రయాణాలు. అనారోగ్యం.
కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,)
ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగావున్నా అవసరాలకు డబ్బు అందుతుంది. ఆత్మీయులు మరింత దగ్గరవుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగుల శ్రమకు తగిన ఫలితం. భూములు, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. ఉద్యోగులకు సంతోషక రమైన వార్తలు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు.
తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.)
ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటర్వ్యూలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. తీర్థయాత్రలు చేస్తారు. పనుల్లో విజయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు హోదాలు. కళాకారులకు సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. గృహం, వాహనయోగాలు. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికరంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
కొత్తగా చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పలుకుబడి పెరుగుతుంది. వాహనాలు, భూములు కొంటారు. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం మధ్యలో దూరప్రయాణాలు. అనారోగ్యం.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
రుణాలు తీరి ఊరట చెందుతారు. మిత్రుల చేయూతతో ముందుకు సాగుతారు. కుటుంబానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అరుదైన ఆహ్వానాలు రాగలవు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికరంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి. వారం చివరిలో కుటుంబంలో ఒత్తిడులు.
కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
ఖర్చులు పెరుగుతాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. దూరప్రయాణాలు. బంధువుల తాకిడి పెరుగుతుంది. ఒక ప్రకటన నిరుద్యోగులను నిరాశ పరుస్తుంది. ఆరోగ్యం మందగిస్తుంది. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులు అప్రమత్తత పాటించాలి. రాజకీయవర్గాలకు కొంత గందరగోళం. వారం మధ్యలో ధనలాభం.
మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటాబయటా అనుకూల వాతావరణం. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆధ్యాత్మిక చింతన.
- సింహంభట్ల సుబ్బారావు,
జ్యోతిష పండితులు
చంద్రబింబం: మే 25 నుండి 31 వరకు
Published Sun, May 25 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM
Advertisement
Advertisement