చంద్రబింబం:జూన్ 29 నుండి జూలై 5 వరకు | Funday Book: Astrology of the week, June 29 to july 5 | Sakshi
Sakshi News home page

చంద్రబింబం:జూన్ 29 నుండి జూలై 5 వరకు

Published Sun, Jun 29 2014 2:39 AM | Last Updated on Sat, Sep 2 2017 9:31 AM

Funday Book: Astrology of the week, June 29 to july 5

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
 ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. కాంట్రాక్టర్లకు అనుకూలించదు. విద్యార్థులకు కొంత నిరాశ. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం చివరిలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. పనులు పూర్తి.
 
 వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
 పనుల్లో జాప్యం. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. దూరప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు తప్పవు.  నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలలో లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగులు విధులపై మరింత శ్రద్ధ వహించాలి. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. వారం ప్రారంభంలో వాహనయోగం.
 
 మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
 ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది.  బంధువులు, మిత్రులతో వివాదాలు. ఆస్తి విషయాలలో ఒప్పందాలలో జాప్యం. వ్యాపారాలలో నిదానం అవసరం. ఉద్యోగులపై అదనపు పనిభారం, మార్పులు. కళారంగం వారికి శ్రమాధిక్యం. వారం ప్రారంభంలో  ధనలాభం. వాహనయోగం.
 
 కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు సానుకూలం. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు లభించే అవకాశం. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. శ్రమాధిక్యం.
 
 సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
 ఆర్థిక విషయాలు నిరాశాజనకంగా ఉంటాయి. కొత్తగా రుణాలు చేస్తారు. కుటుంబసభ్యులతో లేనిపోని వివాదాలు. ఆరోగ్యపరంగా చికాకులు. ప్రత్యర్థుల నుంచి కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు అసంతృప్తి తప్పకపోవచ్చు. వారం ప్రారంభంలో విందువినోదాలు. పనుల్లో విజయం.
 
 కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,)
 దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఇళ్లు, వాహనాల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరం. కళారంగం వారికి సన్మానయోగం. వారం చివరిలో అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం.
 
 తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.)
 ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి. రాజకీయరంగం వారికి యోగదాయకమైన కాలం. వారం మధ్యలో ఆకస్మికప్రయాణాలు. రుణాలు చేస్తారు.
 
 వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
 రావలసిన సొమ్ము అందుతుంది. ప్రత్యర్థులు కూడా అనుకూలురుగా మారతారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. ప్రతిభకు గుర్తింపు రాగలదు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కవచ్చు. పారిశ్రామికరంగం వారికి విదేశీ ఆహ్వానాలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ధనవ్యయం.
 
 ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
 ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. వ్యయప్రయాసలు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. బంధువులు, మిత్రులతో వివాదాలు నెలకొంటాయి,  దూరప్రయాణాలు చేస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు పైస్థాయి నుంచి సమస్యలు. కళారంగం వారికి నిరుత్సాహం. వారం చివరిలో ఆస్తిలాభం.
 
 మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
 బంధువులతో స్వల్ప వివాదాలు. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్థిరాస్తి వివాదాలు. వ్యాపార లావాదేవీలు సామాన్యం. ఉద్యోగులకు మార్పులు. రాజకీయవర్గాలకు నిరాశాజనకం. వారం ప్రారంభంలో  ధన, వస్తులాభాలు. ముఖ్య నిర్ణయాలు.
 
 కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
 శుభకార్యాల నిర్వహణ. దీర్ఘకాలిక సమస్యలు తీరే అవకాశం. బంధువుల నుంచి ధనలాభ సూచనలు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహనయోగం. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. కళాకారులకు నూతనోత్సాహం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం.
 
 మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
 ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబసమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.   భూములు, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో ధనవ్యయం.  కుటుంబసభ్యులతో వివాదాలు.
 - సింహంభట్ల సుబ్బారావు,
 జ్యోతిష పండితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement