మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
అనుకున్న పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వాహనసౌఖ్యం. ఇంటి నిర్మాణయత్నాలు సాగిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో నూతనోత్సాహం. ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామికరంగం వారు విదేశీ పర్యటనలు జరుపుతారు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం.
వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
పనుల్లో విజయం. ఒక ప్రకటన విద్యార్థులను ఆకట్టుకుంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరం. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. సోదరుల నుంచి ధనలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. రాజకీయవర్గాల వారికి ఊహించని ఫలితాలు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. రుణయత్నాలు.
మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరకు చేరతారు. ఆర్థిక లావాదేవీల్లో పురోగతి. ఒక సమస్య చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు అనుకున్న పదోన్నతులు. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యభంగం.
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
శ్రమ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. కాంట్రాక్టు పనులు నిరాశ కలిగిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో ఉత్తరప్రత్యుత్తరాలు. వ్యాపారాలలో లాభాలు స్వల్పం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఊరిస్తాయి. రాజకీయరంగం వారికి ఒత్తిడులు. వారం చివరిలో శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. బంధువులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. సోదరుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు మార్పులు. కళారంగం వారికి విదేశీ పర్యటనలు వాయిదా. విద్యార్థులు కొంత అసంతృప్తి చెందుతారు. వారం మధ్యలో వాహనయోగం.
కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీసేవలకు గుర్తింపు. పనులు సకాలంలో పూర్తి. బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. శ్రమ ఫలించే సమయం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. పారిశ్రామికరంగం వారికి ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం.
తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.)
కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో లాభాలు రాగలవు. ఉద్యోగాలలో నూతనోత్సాహం. రాజకీయరంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. అనారోగ్యం.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరం. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. విలువైన సమాచారం అందుతుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కళారంగం వారికి కొత్త అవకాశాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
కొత్త విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు. పనులలో పురోగతి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. భూ, గృహయోగాలు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికరంగం వారికి నూతనోత్సాహం. వారం మధ్యలో దూరప్రయాణాలు. అనారోగ్యం.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
పనులలో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఇంటాబయటా ఒత్తిడులు తొలగుతాయి. భూవివాదాలు తీరతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపంలో పెడతారు. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం.
కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటాబయటా అనుకూలం. ప్రముఖులతో పరిచయాలు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగవర్గాలకు పదోన్నతులు. రాజకీయరంగం వారికి సన్మానయోగం. వారం మధ్యలో వివాదాలు. ధనవ్యయం. అనారోగ్యం.
మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పనులు నెమ్మదిగా సాగుతాయి. బంధువులతో వివాదాలు నెలకొంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. రుణయత్నాలు. శ్రమ వృథాకాగలదు. ఒప్పందాలలో జాప్యం. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. కళారంగం వారికి నిరుత్సాహం తప్పదు. వారం ప్రారంభంలో శుభవార్తలు. ఆర్థిక లాభాలు.
- సింహంభట్ల సుబ్బారావు,
జ్యోతిష పండితులు
చంద్రబింబం: మే 11 నుండి 17 వరకు
Published Sun, May 11 2014 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 7:11 AM
Advertisement
Advertisement