చంద్రబింబం: ఏప్రిల్ 6 నుండి 12 వరకు | Astrology of the week | Sakshi
Sakshi News home page

చంద్రబింబం: ఏప్రిల్ 6 నుండి 12 వరకు

Published Sun, Apr 6 2014 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 AM

Astrology of the week

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
 ఆర్థిక విషయాలలో కొంత నిరుత్సాహంగా ఉంటుంది. ఇంటబయటా ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన కార్యక్రమాలు మందగిస్తాయి. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు వాయిదా పడతాయి. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు. పారిశ్రామిక, రాజకీయవర్గాల వారికి సామాన్యం. వారం ప్రారంభంలో శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు.
 
వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
 పనులు నత్తనడకన సాగుతాయి. దూరప్రయాణాలు చేస్తారు. విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. విద్యార్థులు కొంత అసంతృప్తి చెందుతారు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగస్తులు అదనపు విధులు చేపట్టాల్సి వస్తుంది. కళారంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. వారం మధ్యలో ధనలాభం. బంధువుల కలయిక.
 
మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
 చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రుణఒత్తిడులు తొలగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి, లాభాలు తథ్యం. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. పారిశ్రామికరంగం వారు విదేశీ పర్యటనలు జరుపుతారు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధన వ్యయం. అనారోగ్యం.
 
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుంది. పనులు వాయిదా వేస్తారు. తీర్థయాత్రలు జరుపుతారు. కుటుంబసభ్యులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. సోదరులు, మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగులు మరింత శ్రమపడాల్సిన సమయం. రాజకీయవర్గాలకు నిరాశాజనకం. వారం ప్రారంభంలో శుభకార్యాలలో పాల్గొంటారు.
 
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
 కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంటాబయటా ఎదురుండదు. రావలసిన సొమ్ము అందుతుంది. గృహ నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉపయుక్త సమాచారం. కళారంగం వారికి సన్మానాలు. వారం చివరిలో అనుకోని ప్రయాణాలు. మిత్రులతో వివాదాలు. అనారోగ్యం.
 
కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,)
 నూతన పరిచయాలు. నిరుద్యోగుల కల ఫలించే సమయం. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సేవలకు గుర్తింపు లభిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగవర్గాలకు ప్రశంసలు. రాజకీయరంగం వారికి అనూహ్యమైన విజయాలు. వారం మధ్యలో ధనవ్యయం.
 
తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.)
 కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. దూరప్రయాణాలు.
 
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
 ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. కొత్త రుణయత్నాలు. మిత్రులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. అనుకున్న పనులలో జాప్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులు విధుల్లో కొద్దిపాటి ఒత్తిడులు ఎదుర్కొంటారు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు వాయిదా. వారం చివరిలో శుభవార్తలు. ధనలాభం.
 
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
 పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. సన్నిహితులతో వివాదాలు. కొన్ని ఒప్పందాలు వాయిదా వేసుకుంటారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు ఆక స్మిక మార్పులు. రాజకీయరంగం వారికి శ్రమాధిక్యం. వారం ప్రారంభంలో కీలక నిర్ణయాలు.
 
మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
 ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కొన్ని వివాదాలు ఎట్టకేలకు పరిష్కారం. నిరుద్యోగులు, విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. కళారంగం వారికి అనుకోని సన్మానాలు. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం.
 
కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
 ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పనులు సాఫీగా పూర్తి చేస్తారు. వస్తులాభాలు. ఆస్తి వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ధనవ్యయం.
 
మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. బంధువులు, మిత్రులతో వివాదాలు. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడే అవకాశం. వారం చివరిలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. ఉద్యోగయోగం.
 - సింహంభట్ల సుబ్బారావు,
 జ్యోతిష పండితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement