చంద్రబింబం: జూలై 20 నుండి 26 వరకు | Funday Astrology of the week: July 20 to July 26 | Sakshi
Sakshi News home page

చంద్రబింబం: జూలై 20 నుండి 26 వరకు

Published Sun, Jul 20 2014 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 AM

Funday Astrology of the week: July 20 to July 26

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
 ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కివస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కే అవకాశం. పారిశ్రామికరంగం వారికి  పట్టింది బంగారమే. వారం మధ్యలో దూరప్రయాణాలు. అనారోగ్యం.
 
 వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
 రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్య నుంచి బయటపడే అవకాశం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. రాజకీయవర్గాలకు పదవీయోగం.  వారం చివరిలో వ్యయప్రయాసలు. ప్రయాణాలు.
 
 మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
 ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. జీవితాశయం నెరవేరుతుంది. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులు ఇంక్రిమెంట్లు పొందుతారు. కళారంగం వారికి సంతోషకరమైన సమాచారం అందుతుంది. వారం మధ్యలో దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం.
 
 కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 పాతబాకీలు వసూలవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థుల యత్నాలు సఫలం. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం చివరిలో  అనారోగ్య సూచనలు. వివాదాలు.
 
 సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
 నూతన వ్యక్తుల పరిచయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ శ్రమ ఫలిస్తుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో అకారణంగా వివాదాలు. ఆరోగ్యభంగం.
 
 కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,)
 ప్రారంభంలో కొన్ని చికాకులు ఎదురైనా క్రమేపీ సర్దుబాటు కాగలవు. రుణబాధలు తొలగుతాయి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు కొంత అనుకూల పరిస్థితి ఉంటుంది. వ్యాపారులు అనుకున్న లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు.
 
 తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.)
 ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులు కొన్ని సకాలంలో పూర్తి చేస్తారు. భూవివాదాలు పరిష్కారమవుతాయి. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు కోరుకున్న మార్పులుండవచ్చు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు.
 
 వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
 కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శుభకార్యాల రీత్యా ధనవ్యయం. రావలసిన సొమ్ము అందుతుంది. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.  ఇంతకాలం పడిన శ్ర మ ఫలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో చికాకులు తొలగుతాయి. కళారంగంవారికి అవార్డులు లభించవచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. బంధువులతో వివాదాలు.
 
 ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
 ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వాహనాలు, భూములు కొంటారు. చిరకాల కోరిక నెరవేరుతుంది. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులు సమర్థతను చాటుకుంటారు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం.
 
 మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
 కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బంధువులతో విభేదాలు తొలగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. ఆకస్మిక ధనలాభం. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు. రాజకీయవర్గాలకు అంచనాలు నిజమవుతాయి. వారం మధ్యలో ఆస్తి వివాదాలు.
 
 కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
 రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. విద్యార్థులకు విద్యావకాశాలు. వాహనయోగం. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళారంగంవారికి సన్మానాలు. వారం మధ్యలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం.
 
 మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
 పనులు నెమ్మదిస్తాయి. బంధు, మిత్రులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యపరంగా చికాకులు. నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. రాజకీయవర్గాలకు నిరాశాజనకంగా ఉంటుంది. వారం ప్రారంభంలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు.
 - సింహంభట్ల సుబ్బారావు,
 జ్యోతిష పండితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement