
చంద్రబింబం: నవంబర్ 24 నుండి నవంబర్ 30 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆర్థిక పరిస్థితి మొదట్లో కొంత నిరాశ కలిగించినా క్రమేపీ మెరుగుపడుతుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వస్తులాభాలు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు జరుగవచ్చు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు.
వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. చాకచక్యంగా సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులకు అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో ఆరోగ్యభంగం. బంధువులతో వివాదాలు.
మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. రుణాల కోసం ప్రయత్నిస్తారు. ఇంటా బయటా ఒత్తిడులు. ఆరోగ్యభంగం. ప్రత్యర్థుల పట్ల అప్రమత్తత పాటించండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. విద్యార్థులకు నిరాశ. వారం మధ్యలో ఆకస్మిక ధనలాభం.
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. నిర్ణయాలలో సోదరుల సలహాలు స్వీకరిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు రాగలవు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
కొత్త పనులు చేపడతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. మిత్రుల చేయూతతో ముందుకు సాగుతారు. అరుదైన ఆహ్వానాలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. విద్యార్థులు లక్ష్యాల సాధనలో విజయం సాధిస్తారు. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. ధనవ్యయం.
కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,)
పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు. వారం చివరిలో దూరప్రయాణాలు. శ్రమాధిక్యం.
తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.)
ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. పనుల్లో విజయం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు. వారం మధ్యలో ప్రయాణాలు.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి కాస్త నయమనిపి స్తుంది. రుణభారాలు తగ్గే అవకాశం. వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగులు, విద్యార్థులు ఒక ప్రకటనకు ఆకర్షితులవుతారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. మిత్రుల ఒత్తిడి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
కార్యక్రమాలలో పురోగతి. బంధువుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగి ముందడుగు వేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వారం మధ్యలో వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో వివాదాలు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
పనులు నిదానంగా సాగుతాయి. అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు కొంత అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. వారం చివరిలో ధన వ్యయం. దూరప్రయాణాలు.
కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పరపతి పెరుగుతుంది. అందరిలోనూ ప్రత్యేకత చాటుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వారం చివరిలో ప్రయాణాలు. ఆరోగ్యభంగం.
మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పనుల్లో విజయం. దీర్ఘకాలిక సమస్య పరిష్కారమవుతుంది. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు
ఈ వారంలో పుట్టినరోజు జరుపుకునేవారికి...
పట్టింది బంగారమే. ఆదాయం మరింతగా పెరుగుతుంది. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. స్థిరాస్తిని వృద్ధి చేసుకుంటారు. పరపతి పెరుగుతుంది. అభిమానులు, శ్రేయోభిలాషులు పెరుగుతారు. ప్రత్యర్థులు సైతం మీపట్ల విధేయత చూపుతారు. వృత్తి, వ్యాపారాలలో అవకాశాలు లభిస్తాయి. ద్వితీయార్థంలో కొద్దిపాటి చికాకులు.
మీతో పాటు ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటోన్న సెలెబ్రిటీ...
యమీ గౌతమ్, నటి
పుట్టినరోజు: నవంబర్28