వారఫలాలు: 1 నవంబర్ నుంచి 7 నవంబర్, 2015 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులు, విద్యార్థులకు శుభదాయకమైన కాలం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. గులాబి, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయ దర్శనం మంచిది.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమానంతరం పనులు పూర్తి కాగలవు. విద్యార్థులకు నిరుత్సాహపూరితం. వాహనాలు, గృహ కొనుగోలు యత్నాలు ముందుకు సాగవు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపార లావాదేవీలు సామాన్యం. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఆకుపచ్చ, లేతనీలం రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. వినాయకుని పూజించండి.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
యుక్తితో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. సేవా కార్య క్రమాలు చేపడతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణదాతల ఒత్తిడులు తొలగు తాయి. వ్యాపార విస్తరణలో ముందడుగు. ఉద్యోగులకు పదోన్నతులు. తెలుపు, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొత్త పనులు ప్రారంభిస్తారు. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. మనసులోని భావాలను కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొంత జాప్యం జరిగినా వ్యవహారాలు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొన్ని నిర్ణయాలపై కుటుంబసభ్యుల నుంచి ప్రశంసలు. ఇంటి నిర్మాణయత్నాలు కలిసి వస్తాయి. వాహనయోగం. నిరుద్యోగులకు శుభవార్తలు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళాకారులకు విశేష ఆదరణ, సన్మానాలు. పసుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
పట్టింది బంగారమే. కొత్త పనులకు శ్రీకారం. ఆత్మీయులు, బంధువులతో సఖ్యత. మాటల చాతుర్యంతో అందర్నీ ఆకట్టు కుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక లాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆకుపచ్చ, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతకు కుంకుమార్చన చేయండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత బయటపడతారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి కాగలవు. విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు అనుకూల పరిస్థితి. చాక్లెట్, పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
మొదట్లో కొన్ని చికాకులు, సమస్యలు వచ్చినా క్రమేపీ తొలగుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకమే. సంఘంలో గౌరవ మర్యాదలు. వాహనయోగం. ఆస్తి వివాదాలు తీరతాయి. సోదరులతో సఖ్యత. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులు సమర్థత చాటుకుంటారు. ఎరుపు, ఊదా రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
పనులు నిదానంగా పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళాకారులకు అవార్డులు. తెలుపు, లేత పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఇంటా బయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువర్గంతో విభేదాలు తొలగుతాయి. భూములు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు పదవీయోగం. నీలం, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
చేపట్టిన పనులు సజావుగానే పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుని ముందుకు సాగుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. కళాకారులకు అవార్డులు దక్కవచ్చు. నలుపు, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పనులు నిదానంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. భూవివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహంగా గడుస్తుంది. గులాబీ, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణ స్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు