November
-
ఈఎస్ఐ కిందకు కొత్తగా 16 లక్షల మంది
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) నిర్వహించే బీమా పథకం ‘ఈఎస్ఐ’ కిందకు 2024 నవంబర్ నెలలో కొత్తగా 16.07 లక్షల మంది సభ్యులుగా నమోదయ్యారు. అంతక్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే ఒక శాతం అధికంగా సభ్యులు చేరినట్టు తెలుస్తోంది. 2023 నవంబర్‌లో కొత్త సభ్యుల నమోదు 15.92 లక్షలుగా ఉంది. ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసింది. గతేడాది నవంబర్‌లో 20,212 సంస్థలు ఈఎస్ఐసీలో చేరాయి. తద్వారా ఆయా సంస్థల్లో పనిచేసే కార్మికులకు ఈఎస్ఐ రక్షణ లభించినట్టయింది. 16.07 లక్షల మందిలో 7.57 లక్షల మంది (47.11 శాతం) 25 ఏళ్లలోపు వయసున్నవారు కావడం గమనార్హం. 3.28 లక్షల మంది మహిళలు కాగా, 44 మంది ట్రాన్స్జెండర్లు కూడా కొత్త సభ్యుల్లో భాగంగా ఉన్నారు. -
బంగారం దిగుమతి లెక్కల్లో పొరపాటు
వాణిజ్య లోటు రికార్డు స్థాయికి పెరగడానికి కారణమైన నవంబర్ బంగారం దిగుమతి (Gold Import) డేటాలో చూసిన "అసాధారణ" పెరుగుదలను ప్రభుత్వం తాజాగా సరిదిద్దింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం నవంబర్ నెలలో బంగారం దిగుమతి విలువ 14.8 బిలియన్ డాలర్లు నుండి 9.8 బిలియన్ డాలర్లకు సర్దుబాటు చేసింది.గణన లోపం కారణంగా మునుపటి సంఖ్య తప్పుగా ఉంది. జూలైలో పద్దతిలో మార్పును అనుసరించి గిడ్డంగులలో రెట్టింపు లెక్కింపు దీనికి కారణం కావచ్చు. ఈ విషయంపై వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.2024 జనవరి నుండి నవంబర్ వరకు బంగారం దిగుమతులపై సవరించిన డేటా "వార్షిక సగటు 800 టన్నుల కంటే చాలా తక్కువగా ఉంది" అని జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ విపుల్ షా అన్నారు. జనవరి నుండి నవంబర్ వరకు మొత్తం బంగారం దిగుమతులు 796 టన్నుల నుండి 664 టన్నులకు సరిదిద్దారు. అక్టోబర్‌కు సంబంధించి 97 టన్నులు నుండి 58 టన్నులకు, నవంబర్‌లో దిగుబడులను 170 టన్నుల నుండి 117 టన్నులకు సర్దుబాటు చేశారు.డిసెంబర్ 16న జరిగిన సాధారణ నెలవారీ ట్రేడ్ డేటా బ్రీఫింగ్లో, బంగారం దిగుమతులు పెరగడం వల్ల నవంబర్‌లో భారతదేశ వాణిజ్య లోటు రికార్డు గరిష్ట స్థాయి 37.8 బిలియన్ డాలర్లకు విస్తరించిందని డేటా చూపించింది . 2024 డిసెంబరులో అసాధారణ పెరుగుదలను గమనించిన డీజీసీఐఎస్.. కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు, కస్టమ్స్ అందుకున్న డేటాతో సమన్వయం చేసుకుంటూ బంగారం దిగుమతి డేటాపై వివరణాత్మక పరిశీలనను చేపట్టింది. -
భారత్‌కు ‘వాణిజ్య లోటు’ భయాలు!
న్యూఢిల్లీ: భారత్‌కు వాణిజ్యలోటు సవాళ్లు తలెత్తుతున్నాయి. ఎగుమతులు నవంబర్‌లో అసలు పెరగకపోగా, 4.85 శాతం క్షీణించి (2023 ఇదే నెలతో పోల్చి) 32.11 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఎగుమతులు భారీగా 27 శాతం పెరిగి 69.95 బిలియన్ డాలర్లకు చేరాయి. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు ఆల్‌టైమ్ హై 32.84 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వంట నూనెలు, ఎరువులు, పసిడి వెండి దిగుమతులు భారీగా పెరగడం మొత్తం వాణిజ్యలోటు తీవ్రతకు దారితీసిందని వాణిజ్య మంత్రిత్వశాఖ తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. → పసిడి దిగుమతుల విలువ ఆల్‌టైమ్ హై 14.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 2023 నవంబర్‌లో ఈ విలువ 3.5 బిలియన్ డాలర్లు. → క్రూడ్ ఆయిల్ దిగుమతులు సమీక్షా నెల్లో 7.9 శాతం పెరిగి 16.11 బిలియన్ డాలర్లకు చేరాయి. → పెట్రోలియం ప్రొడక్టుల దిగుమతులు 50 శాతం తగ్గి, 3.71 బిలియన్ డాలర్లుగా నమోదైంది. → జౌళి, ఇంజనీరింగ్ గూడ్స్, ఎల్రక్టానిక్స్, ఫార్మా, సుగంధ ద్రవ్యాల ఎగుమతులు బాగున్నాయి. ఏప్రిల్–నవంబర్ మధ్య ఇలా.. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య ఎగుమతులు 2.17 శాతం పెరిగి 284.31గా నమోదయ్యాయి. దిగుమతులు 8.35 శాతం పెరిగి 486.73 బిలియన్ డాలర్లుగా ఉంది. దీనితో వాణిజ్యలోటు 202.42 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 170.98 బిలియన్ డాలర్లు. కాగా, ఎనిమిది నెలల్లో పసిడి దిగుమతులు 49 శాతం పెరిగి 49 బిలియన్ డాలర్లకు ఎగశాయి. సేవల రంగం ఇలా.. నవంబర్‌లో సేవల ఎగుమతుల విలువ గత ఏడాది ఇదే కాలంతో పోలి్చతే 28.11 బిలియన్ డాలర్ల నుంచి 35.67 బిలియన్ డాలర్లకు చేరాయి. -
నవంబర్‌లో ద్రవ్యోల్బణం ఊరట
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో కొంత ఊరట నిచ్చింది. సూచీ 5.48 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. ఆహార ఉత్పత్తులు ప్రత్యేకించి కూరగాయల ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణం. రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో ఆందోళనకరంగా 14 నెలల గరిష్ట స్థాయిలో 6.2 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయిన సంగతి తెలిసిందే. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటు ఇటుగా 4 శాతం వద్ద ఉండాలి. అంటే ఎగువదిశగా 6 శాతం పైకి పెరగకూడదు. జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన నవంబర్ గణాంకాల్లో ముఖ్యమైనవి... → అక్టోబర్‌లో 10.87 శాతంగా ఉన్న ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం సమీక్షా నెల్లో 9.04 శాతానికి తగ్గింది. → కూరగాయలుసహా పప్పుదినుసులు, ఉత్పత్తులు, చక్కెర, పండ్లు, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు సుగంధ ద్రవ్యాల ధరలు తగ్గాయి. -
కలిసొచ్చిన పెళ్లిళ్ల సీజన్.. వాహన అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: పెళ్లిళ్ల సీజన్, ఎస్‌యూవీలకు డిమాండ్ నెలకొనడం, గ్రామీణ మార్కెట్లు మెరుగుపడుతుండటం వంటి సానుకూల అంశాలతో నవంబర్‌లో వాహన విక్రయాలు పెరిగాయి. మారుతీ సుజుకీ ఇండియా, టాటా మోటర్స్, టయోటా కిర్లోస్కర్ మోటర్స్ మొదలైన దిగ్గజాల దేశీయ అమ్మకాలు వృద్ధి చెందాయి.మారుతీ విక్రయాలు 5 శాతం, టాటా మోటర్స్ 2 శాతం, టయోటా 44 శాతం మేర వృద్ధి నమోదు చేశాయి. అటు, కొత్తగా లిస్టయిన హ్యుందాయ్ మోటర్ ఇండియా అమ్మకాలు 2 శాతం క్షీణించాయి. గ్రామీణ మార్కెట్లు పుంజుకుంటూ ఉండటం, ఎస్‌యూవీలకు డిమాండ్ నెలకొనడం, లిమిటెడ్ ఎడిషన్లను ప్రవేశపెట్టడం తదితర అంశాలు తమకు కలిసొచ్చాయని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు.నవంబర్‌లో బ్రెజా, ఎర్టిగా, గ్రాండ్ విటారా ఎక్స్ఎల్6 వంటి యుటిలిటీ వాహనాల అమ్మకాలు గత నవంబర్‌లో నమోదైన 49,016 యూనిట్లతో పోలిస్తే 59,003 యూనిట్లకు పెరిగాయి. అయితే, ఆల్టో, ఎస్–ప్రెసోలాంటి మినీ–సెగ్మెంట్ కార్ల అమ్మకాలు 9,959 యూనిట్ల నుంచి 9,750 యూనిట్లకు తగ్గాయి. మరోవైపు, వివిధ వర్గాల అవసరాలకు అనుగుణమైన హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి ఎస్‌యూవీల వరకు వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోతో విక్రయాలు మెరుగుపర్చుకుంటున్నట్లు టయోటా వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ తెలిపారు. -
International Mens Day: మార్కెట్లో మగసిరులు
అందచందాలను కాపాడుకోవడంలో పురుషులు ఏమీ తీసిపోవడం లేదు. సౌందర్య సాధనాల ఖర్చులోను, సౌందర్య పరిరక్షణ సేవల కోసం చేసే ఖర్చులోను మహిళలతో పోటీ పడుతున్నారు. పురుషుల సౌందర్య సాధనాల మార్కెట్ అంతర్జాతీయంగా వేగంగా విస్తరిస్తోంది. ఎప్పటికప్పుడు మార్కెట్‌ను ముంచెత్తుతున్న కొత్త కొత్త సౌందర్య సాధనాలను కొనుగోలు చేయడంలో పురుషులు ముందంజలో ఉంటున్నారు. అలాగే, అందానికి తగిన అలంకరణ చేసుకోవడంలోను, ఎప్పటికప్పుడు మార్కెట్లోకి కొత్తగా వచ్చే ఫ్యాషన్ దుస్తులను ధరించడంలోనూ ‘తగ్గేదే లే’ అంటున్నారు. పురుషుల సౌందర్య పోషణాభిలాష, ఫ్యాషన్ స్పృహ మార్కెట్లో సిరులు కురిపిస్తున్నాయి.అందచందాలను కాపాడుకోవడంలో మహిళలకు కొంత ఎక్కువ శ్రద్ధ ఉండే సంగతి వాస్తవమే అయినా, ఇటీవలి కాలంలో ఈ విషయంలో పురుషులు తామేమీ తీసిపోవడం లేదంటూ నిరూపిస్తున్నారు. నఖ శిఖ పర్యంతం అందంగా కనిపించడానికి తాపత్రయపడుతున్నారు. కేశ సంరక్షణ ఉత్పత్తులకు, చర్మ సంరక్షణ ఉత్పత్తులకు, ఫ్యాషన్ దుస్తులకు భారీగా ఖర్చుపెడుతున్నారు. పురుషుల్లో సౌందర్య స్పృహ పెరగడం గమనించిన సౌందర్య ఉత్పత్తుల తయారీ సంస్థలు కొత్త కొత్త ఉత్పత్తులతో ముందుకొస్తున్నాయి. పురుషుల అలంకరణ వస్తువుల తయారీ సంస్థలు, ఫ్యాషన్ దుస్తుల తయారీ సంస్థలు కూడా పురుషుల అందచందాలను ఇనుమడింపజేయడానికి ఇతోధికంగా పాటుపడుతున్నాయి. ఇటీవలి కాలంలో పురుషుల్లో పెరిగిన సౌందర్య స్పృహకు మార్కెట్ గణాంకాలే అద్దం పడుతున్నాయి.అంతర్జాతీయ గణాంకాల ప్రకారం 2023లో పురుషులు అలంకరణ వస్తువుల కోసం 53.46 బిలియన్ డాలర్లు (రూ.4.50 లక్షల కోట్లు) ఖర్చు చేశారు. ఈ ఖర్చు 2032 నాటికి 85.53 బిలియన్ డాలర్లకు (రూ.7.20 లక్షల కోట్లు) చేరుకోగలదని అంచనా. చర్మ సంరక్షణ వస్తువుల కోసం 13.56 బిలియన్ డాలర్లు (రూ.1.14 లక్షల కోట్లు) ఖర్చు చేశారు. ఈ ఖర్చు 2032 నాటికి 29.61 బిలియన్ డాలర్లకు (రూ.2.49 లక్షల కోట్లు) చేరుకోగలదని అంచనా. కేశసంరక్షణ వస్తువుల కోసం 32.90 బిలియన్ డాలర్లు (రూ.2.77 లక్షల కోట్లు) ఖర్చు చేశారు. ఈ ఖర్చు 2032 నాటికి 67.20 బిలియన్ డాలర్లకు (5.65 లక్షల కోట్లు) చేరుకోగలదని అంచనా. పురుషుల సౌందర్య సాధనాల మార్కెట్లో అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ చాలాకాలంగా ముందంజలో ఉంటున్నాయి. ఈ దేశాల్లో మార్కెట్ నిలకడగా వృద్ధి చెందుతోంది. ఇటీవలి కాలంలో ఆసియా–పసిఫిక్ దేశాల్లో పురుషుల సౌందర్య ఉత్పత్తుల మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోంది. చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాలు సౌందర్య ఉత్పత్తుల వినియోగంలో అగ్రరాజ్యాలతో పోటీ పడే స్థాయికి చేరుకుంటున్నాయి.మన దేశంలో పురుషుల అలంకరణ, కేశసంరక్షణ, చర్మసంరక్షణ ఉత్పత్తుల విక్రయాలు 2023లో రూ.17,696 కోట్లుగా నమోదయ్యాయి. ఈ అమ్మకాలు 2032 నాటికి రూ.34,550 కోట్లకు చేరుకోగలవని మార్కెట్ వర్గాల అంచనా. భారత్‌లో పురుషుల సౌందర్య సాధనాల మార్కెట్లో ఏటా సగటున 7.2 శాతం వృద్ధి నమోదవుతోంది. ఈ వృద్ధి ఎలక్ట్రానిక్స్ వస్తువుల మార్కెట్ కంటే ఎక్కువగా ఉండటం విశేషం. మన దేశంలో ఎలక్ట్రానిక్స్ వస్తువుల మార్కెట్ వార్షిక సగటు వృద్ధి 6.8 శాతం వరకు నమోదవుతోంది. రానున్న కాలంలో మన దేశంలో పురుషుల సౌందర్య సాధనాల మార్కెట్ వృద్ధి మరింత వేగాన్ని పుంజుకుని, 12.1 శాతానికి చేరుకోగలదని నిపుణులు చెబుతున్నారు.నవతరం కొత్తపోకడలుతర తరానికీ పురుషుల సౌందర్య సాధనాల వినియోగంలోను, ఫ్యాషన్లలోను మార్పులు సర్వసాధారణం. ఇదివరకటి రోజులతో పోల్చుకుంటే, ఇప్పటి నవతరం యువకులు సౌందర్య సాధనాలు, ఫ్యాషన్లలోను మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. మహిళలకు పోటీగా సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పెడుతున్నారు. ప్రస్తుత కాలంలో మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్న నవతరాన్ని ‘జెన్ ఆల్ఫా’గా పిలుచుకుంటున్నారు. ఈ శతాబ్ది తొలినాళ్లలో పుట్టిన ఈ యువతరం ‘టిక్‌టాక్’ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ‘లుక్ మ్యాక్స్’ ట్రెండ్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ముఖాలంకరణలు, వస్త్రాలంకరణలో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ‘టిక్‌టాక్’లోనే ‘గెట్ రెడీ విత్ మీ’ అనే ట్రెండ్ కూడా నడుస్తోంది. ఇందులో భాగంగా నవతరం యువకులు చక్కగా ముస్తాబైన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ, తమకు దీటుగా తయారవగలరా? తమ ఫాలోవర్లకు చాలెంజ్ విసురుతున్నారు. ఇదివరకటి కాలంలో పురుషులు వాడే సౌందర్య సాధనాలు చాలా పరిమితంగా ఉండేవి. సబ్బు, పౌడర్, షేవింగ్ రేజర్, షేవింగ్ క్రీమ్ ఉంటే చాలనుకునేవారు. ఆఫ్టర్‌షేవ్ లోషన్లు వాడేవాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఇటీవలి యువకులు రకరకాల హెయిర్ స్టైల్స్ మారుస్తున్నారు. గడ్డం పెంచేవాళ్లు గడ్డాన్ని ఎప్పటికప్పుడు తీరుగా ట్రిమ్ చేయించుకోవడం, గడ్డానికి పోషణ అందించడానికి బీయర్డ్ వ్యాక్స్ పట్టించుకోవడం వంటివి చేస్తున్నారు. ఇదివరకు జుట్టు నెరిసినవాళ్లు మాత్రమే జుట్టుకు రంగు వేసుకునేవాళ్లు. ఇటీవలికాలంలో జుట్టు నెరవకపోయినా, జుట్టుకు రకరకాల రంగులు వేసుకుంటున్నారు. శరీరమంతా నిగనిగలాడుతూ మెరిసిపోయేలా చూసుకునేందుకు పెడిక్యూర్, మ్యానిక్యూర్, వ్యాక్సింగ్, బ్లీచింగ్ వంటి సౌందర్యసేవలను పొందడానికి వెనుకాడటం లేదు. పురుషుల సౌందర్య సాధనాల జాబితాలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వస్తువులు వచ్చి చేరుతున్నాయి. హెయిర్ జెల్, సన్‌స్క్రీన్ లోషన్, ఫేస్‌వాష్ క్రీమ్, డియాడరెంట్స్, ఫేస్ క్రీమ్, మాయిశ్చరైజర్ వంటివి పురుషుల సౌందర్య సాధనాలలో తప్పనిసరి వస్తువులుగా మారుతున్నాయి. ఈ వస్తువులను కూడా ఎంపిక చేసుకోవడంలో ఇప్పటి యువకులు అమిత శ్రద్ధ తీసుకుంటున్నారు. అల్యూమినియం ఫ్రీ డియాడరెంట్, ఆర్గానిక్ ఫేస్‌వాష్ క్రీమ్, నేచురల్ హెయిర్ కలర్ వంటి వాటిని ఎంపిక చేసుకుంటున్నారు. వీటి ఖరీదు ఎక్కువైనా ఖర్చుకు వెనుకాడటం లేదు. ఫ్యాషన్లపై పెరుగుతున్న శ్రద్ధశరీరాన్ని నిగనిగలాడేలా చూసుకోవడమే కాదు, శరీరానికి తగిన దుస్తులు ధరించడంలోను, వాటికి తగినట్లుగా ఇతర అలంకరణలను ధరించడంలోను ఈ తరం పురుషులు అమిత శ్రద్ధ చూపుతున్నారు. సమయానికి, సందర్భానికి, కాలానికి తగిన ఫ్యాషన్లతో ఆకర్షణీయంగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పురుషుల ఫ్యాషన్ దుస్తుల మార్కెట్ వ్యాపారం 2023లో 537.31 బిలియన్ డాలర్లు (రూ.45.31 లక్షల కోట్లు) నమోదైంది. ఈ వ్యాపారం 2032 నాటికి 988.24 బిలియన్ డాలర్లకు (రూ.83.33 లక్షల కోట్లు) చేరుకోగల అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాల అంచనా. భారత్‌లో పురుషుల ఫ్యాషన్ దుస్తుల మార్కెట్ వ్యాపారం 2023లో రూ.2.24 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ వ్యాపారం 2028 నాటికి రూ.3.30 లక్షల కోట్లకు చేరుకోగలదని మార్కెట్ నిపుణుల అంచనా. దుస్తులు, బెల్టులు, షూస్ వంటివి కొనాలంటే దుకాణాలకు వెళ్లేవారు. ఆన్లైన్ మార్కెట్లు అందుబాటులోకి వచ్చాక చాలామంది ఆన్లైన్లోనే కొనుగోళ్లు సాగిస్తున్నారు. మన దేశంలో ఫ్యాషన్ దుస్తులు, వస్తువుల ఆన్లైన్ కొనుగోళ్లలో మహిళల కంటే పురుషులే దూకుడు ప్రదర్శిస్తున్నారు. మహిళలతో పోల్చుకుంటే పురుషులు ఆన్లైన్లో ఫ్యాషన్ దుస్తులు, ఇతర వస్తువుల కొనుగోళ్ల కోసం 36 శాతం ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్లు అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం–ఏ) గత ఏడాది చేపట్టిన అధ్యయనంలో తేలింది. ఈ కొనుగోళ్ల కోసం పురుషులు సగటున రూ. 2.484 మేరకు ఖర్చు చేస్తే, మహిళలు సగటున రూ.1,830 మేరకు ఖర్చు చేసినట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. మరో విశేషం ఏమిటంటే, ఈ కొనుగోళ్లలో మెట్రో నగరాల్లో కంటే, రెండో తరగతి, మూడో తరగతి, నాలుగో తరగతి చిన్న నగరాల్లోని పురుషులే ముందంజలో ఉంటున్నారు. మెట్రో నగరాల్లోని పురుషులు ఫ్యాషన్ దుస్తులు, వస్తువుల ఆన్లైన్ కొనుగోళ్ల కోసం గత ఏడాది సగటున రూ.1,119 ఖర్చు చేస్తే, రెండో తరగతి నగరాల్లో రూ.1,870, మూడో తరగతి నగరాల్లో రూ.1,448, నాలుగో తరగతి నగరాల్లో 2,034 మేరకు ఖర్చు చేసినట్లుగా ఐఐఎం–ఏ అధ్యయనంలో వెల్లడైంది. పురుషుల సౌందర్య చరిత్రపురుషుల సౌందర్య చరిత్ర ఆధునిక యుగం నుంచి ప్రారంభమైందనుకుంటే పొరపాటే! పురాతన నాగరికతల కాలంలోనే పురుషులు తమ సౌందర్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించేవారు. ముఖంపైన, శరీరంపైన రోమాలను తొలగించుకోవడానికి, గోళ్లను కత్తిరించుకోవడానికి కంచు వంటి లోహాలతో తయారు చేసిన రేజర్లు, ట్వీజర్లు, కత్తెరలు, సన్నని చురకత్తులు వంటి పరికరాలను ఉపయోగించేవారు. శిరోజాలంకరణ కోసం రకరకాల సుగంధ తైలాలను, లేపనాలను ఉపయోగించేవారు. ముఖానికి, శరీరానికి చందనం వంటి చెట్ల బెరళ్లతో తయారు చేసిన చూర్ణాలను పూసుకునేవారు. ప్రాచీన ఈజిప్షియన్, రోమన్, గ్రీకు నాగరికతల ప్రజలు అలంకరణపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారు.పురుషులు కూడా కళ్లకు రకరకాల వర్ణ లేపనాలను ఉపయోగించేవారు. కొందరు మీసాలు, గడ్డాలు ఏపుగా పెంచుకుని, వాటిని తీర్చిదిద్దినట్లుగా కత్తిరించుకునేవారు. మధ్యయుగాల కాలంలో కూడా పురుషులు మీసాలు, గడ్డాలు తీర్చిదిద్దినట్లుగా కత్తిరించుకునే పద్ధతి ఉన్నా, మీసాలు, గడ్డాలు నున్నగా గొరిగించుకునే వారి సంఖ్య బాగా పెరిగింది. ముఖ్యంగా సైన్యంలో పనిచేసే యోధులు, రక్షణ విధులు నిర్వర్తించేవారు ఎక్కువగా మీసాలు, గడ్డాలను పూర్తిగా తొలగించుకునేవారు. అయితే, కళాకారులు, తత్త్వవేత్తలు, మేధావులు వంటి వర్గాల వారు మాత్రం మీసాలు, గడ్డాలు ఏపుగా పెంచుకుని కనిపించేవారు. బారెడు గడ్డం పెంచుకోవడాన్ని మేధావితనానికి చిహ్నంగా భావించేవారు. గడ్డానికి, మేధావితనానికి ఎలాంటి సంబంధం లేదనే సంగతి ఇప్పటి జనాలకు బాగా తెలిసినా, గడ్డాలు పెంచుకోవడం, వాటి పోషణకు నానా జాగ్రత్తలు తీసుకోవడం ఇప్పటికీ ఫ్యాషన్ రంగాన్ని ప్రభావితం చేస్తుండటం విశేషం. గడ్డాల విషయానికొస్తే, విక్టోరియన్ కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. విక్టోరియన్ కాలంలో ఇంగ్లండ్‌లో పురుషులకు గడ్డాల పోటీలు జరిగేవి. అందమైన గడ్డాన్ని పెంచుకునేవాళ్లకు ఖరీదైన బహుమతులు ఇచ్చి ప్రోత్సహించేవారు. గడ్డాలు, మీసాలు పెంచుకోవడం, శరీరానికి రకరకాల లేపనాలు పూసుకోవడం వంటివాటితో పాటు పురుషులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త పద్ధతుల్లో దుస్తులు ధరించేవారు. రకరకాల టోపీలు, తలపాగాలు ధరించేవారు. నాగరికతల తొలినాళ్ల నుంచి మధ్యయుగాల చివరికాలం వరకు శరీర అలంకరణల్లోను, దుస్తుల ఫ్యాషన్లలోను మహిళలకు ఏమీ తీసిపోకుండా ఉండేవారు. అయితే, ఇరవయ్యో శతాబ్దం నుంచి ఈ ధోరణి మారింది. ఈ శతాబ్దంలో రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఫలితంగా పురుషుల సౌందర్య సాధనాలు కనీస స్థాయికి చేరుకున్నాయి. సమాజంలోని ఉన్నతవర్గాల పురుషులు తప్ప సామాన్యులు ఫ్యాషన్లలో మార్పులను పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇరవయ్యో శతాబ్ది ప్రథమార్ధం అంతా ఇలాగే గడిచింది. సినిమాలు పెరిగి, యుద్ధాలు సద్దుమణిగిన తర్వాత అగ్రరాజ్యాల్లోని ఫ్యాషన్ ప్రపంచంలో నెమ్మదిగా మార్పులు మొదలయ్యాయి. పురుషుల దుస్తుల ఫ్యాషన్లలో ఈ మార్పులు ప్రస్ఫుటంగా కనిపించసాగాయి. ఈ శతాబ్ది తొలినాళ్ల నుంచి పురుషుల సౌందర్య పోషణ, ఫ్యాషన్ రంగాలు బాగా వేగాన్ని పుంజుకున్నాయి. స్పాలు.. సెలూన్లకు పెరుగుతున్న గిరాకీమహిళలకు ప్రత్యేకంగా బ్యూటీపార్లర్లు చాలాకాలంగా ఉన్నాయి గాని, పురుషుల కోసం హెయిర్ సెలూన్లు తప్ప వేరేవేమీ ఉండేవి కాదు. ఇటీవలి కాలంలో పురుషుల కోసం ప్రత్యేకంగా స్పాలు, బ్యూటీ సెలూన్లు పెరుగుతున్నాయి. పెద్దపెద్ద నగరాల్లోనే కాకుండా, చిన్న పట్టణాల్లోనూ వీటికి ఆదరణ పెరుగుతోంది. ‘కోవిడ్’ మహమ్మారి తర్వాత పురుషుల స్పా సేవలకు గిరాకీ విపరీతంగా పెరిగింది. ‘స్పాబ్రేక్స్’ సర్వే ప్రకారం 2019–23 మధ్య కాలంలో పురుషుల స్పా సేవలకు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 346 శాతం మేరకు గిరాకీ పెరిగింది. పురుషుల సౌందర్య ఉత్పత్తులకు సెలబ్రిటీలు ప్రచారం చేయడం, సెలబ్రిటీలే స్వయంగా సొంత బ్రాండ్స్ ప్రారంభించడం వంటి పరిణామాలు కూడా ఈ వ్యాపారంలో అనూహ్యమైన వృద్ధికి కారణమవుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో పురుషుల బ్యూటీ సెలూన్లు, స్పాల వ్యాపారం 2023లో రూ.88,800 కోట్ల మేరకు నమోదైంది. ఈ వ్యాపారం 2032 నాటికి రూ1.86 లక్షల కోట్లకు చేరుకోగలదని మార్కెట్ వర్గాల అంచనా. భారత్‌లో పురుషుల స్పా, సెలూన్ల వ్యాపారం కనీసం 7.85 శాతం వార్షిక వృద్ధి సాధించగలదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. -
మినీ సంక్రాంతిగా నవంబర్ సీజన్
-
నవంబర్‌లో చలి లేనట్లే!
న్యూఢిల్లీ: సాధారణంగా నవంబర్ మాసం వచి్చందంటే చలికాలం మొదలైనట్లే. చలి గాలులు గిలిగింతలు పెడుతుంటాయి. కానీ, ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర శుక్రవారం చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్‌లో సాధారణం కంటే 1.23 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. అక్టోబర్‌లో సాధారణంగా 25.69 డిగ్రీలు నమోదు కావాల్సి ఉండగా, ఈసారి 26.92 డిగ్రీలు నమోదైంది. 1901 తర్వాత అత్యంత వేడి కలిగిన అక్టోబర్‌గా రికార్డుకెక్కింది. నవంబర్లోనూ ఉష్ణోగ్రతలు తగ్గిపోయే సూచనలు కనిపించడం లేదని మృత్యంజయ్ వివరించారు. చలి పెరగడానికి వీలుగా వాతావరణ పరిస్థితులు లేవని అన్నారు. నవంబర్‌లో చలికి వాయువ్య భారతదేశం నుంచి వీలే గాలులే కీలకమని వివరించారు. అక్కడ రుతుపవనాల ప్రభావం ఇంకా ఉండడంతో గాలులు వీచడం లేదని తెలియజేశారు. వాయువ్య భాగంలో మరో రెండు వారాలపాటు ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 2 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని చెప్పారు. రెండు వారాల తర్వాత మాత్రమే ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి రావడానికి అవకాశం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. నవంబర్‌లో కోస్తాంధ్ర, రాయలసీమ, కేరళ, కర్ణాటక, తమిళనాడులో సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని తెలిపారు. వాస్తవానికి వాతావరణ విభాగం దృష్టిలో నవంబర్ నెల చలి మాసం కాదు. జనవరి, ఫిబ్రవరి మాత్రమే చలి మాసాలు. -
నవంబర్ నుంచి కొత్త రూల్స్ ఇవే
-
బ్యాంకు పనులు ఈరోజుల్లో మానుకోండి..!
బ్యాంకులు మన నిత్య జీవితంలో భాగమైపోయాయి. ఎంత ఆన్లైన్ సేవలు ఉన్నప్పటికీ కొన్ని పనులను బ్యాంకులకు వెళ్లే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు ఏయే రోజుల్లో పనిచేస్తాయి.. ఎప్పుడు సెలవులు ఉంటాయి అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.బ్యాంకు సెలవుల సమాచారం ముందుగా తెలిస్తే దాని ఆధారంగా ప్రణాళికలు వేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల జాబితాను విడుదల చేసింది. మరి వచ్చే నవంబర్‌లో బ్యాంకులు ఎన్ని రోజులు మూతపడబోతున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.ఇదీ చదవండి: పేటీఎంకి ‘కొత్త’ ఊపిరి!సెలవుల జాబితా ఇదే..» నవంబర్ 1 శుక్రవారం దీపావళి » నవంబర్ 2 శనివారం దీపావళి (కొన్ని ప్రాంతాల్లో)» నవంబర్ 3 ఆదివారం భాయ్ దూజ్» నవంబర్ 9 రెండవ శనివారం» నవంబర్ 10 ఆదివారం» నవంబర్ 15 శుక్రవారం గురునానక్ జయంతి» నవంబర్ 17 ఆదివారం» నవంబర్ 23 నాల్గవ శనివారం» నవంబర్ 24 ఆదివారంఇదీ చదవండి: యూనియన్ బ్యాంక్‌పై భారీ జరిమానా -
‘నవంబరు 1-19 వరకు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించొద్దు’
దేశంలో విమానలకు గత కొన్ని రోజులుగా వరుసగా బాంబు బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాల వేళ ఖలిస్థానీ వేర్పాటువాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ.. విమానాలకు సంబంధి హెచ్చరికలు చేయడం తీవ్ర కలకలం రేపింది. నవంబరు 1 నుంచి 19 వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని గురుపత్వంత్ సింగ్ ప్రయాణికులను హెచ్చరించాడు.భారత్‌లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏళ్లు కావొస్తున్న సందర్భంగా ఎయిర్ ఇండియా విమానాలపై దాడి జరిగే అవకాశం ఉందని, కావును ఆయా తేదీల్లో ఆ సంస్థ విమానాల్లో ప్రయాణించొద్దంటూ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నాడు. కాగా సిక్కుల ఫర్ జస్టిస్ (ఎస్జేఎఫ్) వ్యవస్థాపకుడైన పన్నూ ఇలాంటి హెచ్చరికలు చేయడం ఇది మొదటి సారి కాదు. గతేడాది కూడా నవంబర్ నెలలోనే ఇలాంటి బెదిరింపులే చేశాడు. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించొద్దని సూచించాడు. లేని పక్షంలో మీ ప్రాణాలకు ముప్పు ఉంటుందని హెచ్చరించాడు. ‘నవంబర్ 19న ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దని సిక్కు ప్రజలను కోరుతున్నాం. ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ ఇండియాను దిగ్బంధిస్తాం. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దు. లేదంటే మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది’ అని పేర్కొన్నాడు.అంతేగాక నవంబరు 19న దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆ రోజు మూతపడుతుందని, దాని పేరు కూడా మార్చేస్తామని గతేడాది అతడు ఓ వీడియోలో హెచ్చరించాడు. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (ఉపా) కింద భారత ప్రభుత్వం పన్నూను 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇతడికి కెనడాతోపాటు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. -
48లక్షల పెళ్లిళ్లు.. రూ.5.76లక్షల కోట్లు ఖర్చు
సాక్షి అమరావతి: జూన్ నెలాఖరు నుంచి సరైన ముహూర్తాలు లేవు. వివాహాలు, శుభకార్యాలు వాయిదా పడుతూ వస్తు న్నాయి. ఎట్టకేలకు ఇక ముహూర్తం కుదిరింది. వధూవరులు ఒక్కటయ్యే తరుణం వచ్చేసింది. దేశవ్యాప్తంగా శనివారం నుంచి పెళ్లి సందడి అంబరాన్ని తాకనుంది. ఈ ఏడాది చివరి వరకు ఇది కోలాహలం కొనసాగనుంది. అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ 81 మధ్య 23 శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఈ శుభ ఘడియల్లో దాదాపు 48లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కాన్సెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఎఐటీ) తాజాగా విడుదల చేసిన సర్వే నివేదిలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా 2023వ సంవత్సరంలో చివరి మూడు నెలల్లో దాదాపు 35 లక్షల పెళ్లిళ్లు జరిగాయి. సుమారు రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ ఆఖరు వరకు ఉన్న ముహూర్తాల్లో దేశవ్యాప్తంగా మొత్తం 48లక్షలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉంది. ఒక్కొక్క పెళ్లి వేడుకకు సగటున రూ.12 లక్షలు ఖర్చు పెడతారని అంచనా. ఈ లెక్కన ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్లో దాదాపు రూ.5,76 లక్షల కోట్లు ఖర్చు అవుతుం దాని ప్రాథమికంగా లెక్క తేల్చారు.షాపింగ్ సందడి షురూ..దసరా పండుగతోపాటు పెళ్లిళ్ల షాపింగ్ కూడా కొందరు. ప్రారంభించారు. దీంతో మార్కెట్లో సైతం సందడి నెలకొంది. భోజనాలు, క్యాటరింగ్, కళ్యాణ మండపాలు ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, డెకరేషన్లకు ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నారు. శుభలేఖల ప్రీం టింగ్స్, ఫ్లెక్సీ ప్రింటర్స్, ఫొబో గ్రావర్లు, టెంట్ హౌస్, వంటమేస్త్రీలు, ముట పనివాళ్లు, క్యాటరింగ్ బాయ్స్, బ్యూటీ మనన్లు, మెహందీ ఆది పూలు అమ్మేవాళ్లు, మంగళ వాయిద్య కళాకారులు, డీజే మ్యూజి నివ్వాహకులు ఇలా పెళ్లి వేడుకతో ప్రతి ఒక్కరిని ముందుగానే ఎంపిక చేసుకుని అడ్వాన్సులు ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. దేశంలో సాధారణ, మధ్య తరగతి ప్రజల నుంచి సంపన్నుల వరకు పెళ్లి వేడుక అన్నట్లుగా ఖర్చు చేస్తున్నారు. ఎంగేజ్మెంట్, ఫ్రీ వెడ్డింగ్, హల్దీ, రిసెప్షన్ పోస్ట్ వెడ్డింగ్... ఇలా అనేక దశలుగా పెళ్లి వేడుకకు రాజీపడకుండా నిర్వహిస్తున్నారు. అందువల్ల ఈ ఏడాది చివరి వరకు దేశవ్యాప్తంగా పెళ్లి సందడి ఉంటుందని సీఏఐటీ వెల్లడించింది.ముహూర్తాలు.. ఇవీ అక్టోబర్ 12, 13, 16, 20,27వ తేదీల్లో మహూర్తాలు ఉన్నాయి. నవంబర్ 3, 7, 8, 9, 10, 13, 14, 16,17. డిసెంబర్లో 5,6,7 8, 11, 12, 14, 15, 26 వ తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత సంక్రాంతి మాసం ప్రారంభం కావడంతో మళ్లీ వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలు వరకు శుభ ముహూ కోసం ఆగాల్సి వస్తుంది. అందువల్ల ఈ ఏడాురు దీపావళి తర్వాత పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఉపనయనాలు, గృహప్రవేశాలు కూడా ఎక్కువగా జరుగుతాయని అంచనా. -
నవంబర్‌లో ఢిల్లీలో కృత్రిమ వర్షాలు.. ఎందుకంటే?
న్యూఢిల్లీ: దేశ రాజధానిని ప్రతిఏటా ఇబ్బంది పెట్టే విషయం వాయు కాలుష్టం. అక్టోబర్ చివరి నుంచే వాయు కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా రైతులు పంటల వ్యర్థాలు తగలబెట్టడానికి తోడు, చలికాలం కావడంతో దట్టమైన పొగ మంచు కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణిస్తుంది. దీన్ని కట్టడి చేసేందుకు ఆప్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈసారి కూడా వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది.నవంబర్‌లో వాయు కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉండటంతో నగరంలో కృత్రిమ వర్షం కురిపించేందుకు సిద్ధమైంది.నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు రాజధాని ప్రాంతంలో కృత్రిమ వర్షం కురిపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ బుధవారం పేర్కొన్నారు. ఈ మేరకు కృత్రిమ వర్షాలు కురిపించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర పర్యావరణ మంత్రికి లేఖ రాసినట్లు చెప్పారు. కేంద్ర సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.చలికాలంలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోడానికి 21 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను మంత్రి విడుదల చేశారు. 2016 – 2023 మధ్య రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యం 34.6 శాతం తగ్గిందని మంత్రి తెలిపారు. గడిచిన నాలుగేళ్లలో నగరంలో రెండు కోట్ల చెట్లను నాటామని, దీని ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించగలిగామని చెప్పారు. డ్రోన్ల ద్వారా కాలుష్య హాట్‌స్పాట్ ప్రాంతాలను రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తామన్నారు. రాజధాని ప్రాంతంలో కాలుష్యాన్ని పర్యవేక్షించేందుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ, రవాణా మంత్రిత్వ శాఖ, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ దిల్లీ, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సిబ్బందితో సహా 86 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. -
నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు- మహారాష్ట్ర సీఎం
దాదర్: అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది నవంబరు మొదటి వారంలో జరిగే అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సారి ఎన్నికలు రెండు దశల్లో జరగొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. గణేశోత్సవాలు పురస్కరించుకుని శిందే అధికార నివాసమైన వర్షా బంగ్లాలో విలేకరులతో కొద్ది సేపు ముచ్చటించారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇదివరకే వెల్లడించాల్సి ఉంది. కానీ వరుసగా వస్తున్న ఉత్సవాలు, పర్వదినాల కారణంగా వాయిదా వేయాల్సి వస్తోందని అన్నారు. అయినప్పటికీ తుది నిర్ణయం ఎన్నికల సంఘమే తీసుకుంటుందని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమిలో ఎవరు ఎన్ని స్థానాలపై, ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంపై వారం, పది రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని సంకేతాలిచ్చారు. తమ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. ఈ పథకాలను రాష్ట్ర ప్రజలు ఆదరిస్తున్నారని శిందే ధీమా వ్యక్తం చేశారు. అయితే సీట్ల పంపకం విషయంలో విభేదాలు రాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వచి్చన ఫలితాలను ప్రధాన అం«శంగా పరిగణించి మెరిట్, స్ట్రైక్ రేట్ బేసిక్‌పై సీట్ల పంపిణీ చేపడతామని శిందే స్పష్టం చేశారు. ప్రస్తుతం సీట్ల పంపకంపై ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయి. మిత్రపక్షాల్లో కొందరి ఎక్కువ సీట్లు, మరికొందరికి తుక్కువ సీట్లు లభించవచ్చని అన్నారు. ఏ పార్టీకి, ఎక్కడ గెలిచే సత్తా ఉందో ఆ పారీ్టకే అక్కడ స్థానాలు కేటాయిస్తామని స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఫార్ములా వచ్చే వారం లేదా పది రోజుల్లో పూర్తవుతుందని ఆయన వెల్లడించారు. అభ్యర్థిత్వం ఇచ్చేముందు మూడు పారీ్టలకు ఎక్కడెక్కడ మంచి పట్టు ఉందో ఆయా పార్టీల అభ్యర్థులను ఎంపికచేసి బరిలోకి దింపుతామని పేర్కొన్నారు. అభ్యర్థిత్వం ఇచ్చే ముందు అధ్యయనం చేపడతామని తెలిపారు. తమది సామాన్య ప్రజల ప్రభుత్వం, మహిళల రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల తమ ప్రభుత్వానికి ప్రజల మద్దతు లభిస్తుందని తెలిపారు. కానీ ప్రతిపక్షాలు ఓర్వలేక అనవసరంగా మహాయుతి కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. (పని ఒత్తిడితో మహిళా ఉద్యోగి షాకింగ్ డెత్, స్పందించిన కేంద్రం)కాంగ్రెస్‌కు 1,633 దరఖాస్తులు! లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించడంతో మహావికాస్ అఘాడీ (ఎంవీఏ)లో చాలా ఉత్సాహకర వాతావరణం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆశావహులు క్యూలు కడుతున్నారు. కొందరైతే ఇప్పటి నుంచే పైరవీలు చేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో టికెట్లు ఆశిస్తున్న వారి నుంచి నివేదికలు తెప్పించుకుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ వద్దకు 1,633 దరఖాస్తులు వచ్చాయి. అత్యధిక దరఖాస్తులు విదర్భ నుంచి (485), ఆ తర్వాత మరఠ్వాడా రీజియన్ నుంచి (325) నియోజక వర్గాల నుంచి రాగా అతి తక్కువ కొంకణ్ రీజియన్ నుంచి (123) దరఖాస్తులు వచ్చాయి. అదే 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 476 దరఖాస్తులు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. దీన్ని బట్టి 2019తో పోలిస్తే ఈ సారి జరిగే అసెంబీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల్లో ఆసక్తి పెరిగినట్లు స్పష్టమవుతోంది. అధికార మహా అఘాడీకి చెందిన కొందరు సభ్యులు కూడా కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. కానీ వారి పేర్లు ఇప్పుడే బయట పెట్టలేమని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనేక మంది ఆసక్తి కనబరుస్తున్నప్పటికీ వారి ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను బట్టి ఎంపిక చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేతలు చెబుతున్నారు. భారీ సంఖ్యలో వచి్చన దరఖాస్తుల్లో కొన్నింటినే ఎంపిక చేయాల్సి ఉంటుంది. తిరస్కరణకు గురైన దరఖాస్తుల్లో కొందరు తిరుగుబాటు చేసే ప్రమాదం కూడా ఉంది. దీంతో ఎంవీఏ నేతలు ఆచితూచి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇదీ చదవండి: సుశీల్‌కుమార్ శిందే మనవడు, జాన్వీ బాయ్‌ఫ్రెండ్ రాజకీయాల్లోకి! -
ఎయిర్ ఇండియాలోకి విస్తారా: ఆ రోజే చివరి ఫ్లైట్
ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా (Vistara).. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాలోకి విలీనం కానుంది. 2024 నవంబర్ 11న విస్తారా తన చివరి విమానం నడపనుంది. అంతకంటే ముందు (సెప్టెంబర్ 3) సంస్థ టికెట్ రిజర్వేషన్లను కూడా ఎయిర్ ఇండియా వెబ్‌సైట్‌కు మళ్ళించనున్నట్లు సమాచారం. అయితే విమాన ప్రయాణాలు మాత్రం నవంబర్ 11వరకు కొనసాగుతాయి.విస్తారా సంస్థ.. ఎయిర్ ఇండియాలో విలీనం కావడానికి సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపిందని సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అంటే ఎయిర్ ఇండియాలో విలీనం కానున్న విస్తారాలో.. సింగపూర్ ఎయిర్‌లైన్స్ 25.1 శాతం వాటాను కొనుగోలు చేయనుంది.ఎయిర్ ఇండియా ఫ్లైట్ నెంబర్ & ఏఐ ప్రిఫిక్స్‌తో విస్తారా నెట్వర్క్.. విమానాలు కొనసాగుతాయి. విస్తారా సిబ్బంది.. విస్తారా విమానాలను 2025 ప్రారంభం వరకు ఎయిర్ ఇండియా కింద నిర్వహిస్తారు. అయితే సర్వీస్ లెవల్స్, భోజనం, ఇతరత్రా కార్యకలాపాలు ఎయిర్ ఇండియా పాలసీ ప్రకారం ఉంటాయి.ఇప్పటికే విస్తారా ఫ్లైట్ టికెట్ నవంబర్ 11 తరువాతకు బుక్ చేసుకుని ఉంటే.. ఎయిర్ ఇండియాలో ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ ప్రయాణానికి ఏ లోటు లేదు. కానీ మీరు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవచ్చు. -
నవంబరు నాటికి రామ్‌లల్లా దర్బారు సిద్ధం!
ఈ ఏడాది నవంబర్ నాటికి అయోధ్య రామాలయ మొదటి అంతస్తు (రామ్‌లల్లా దర్బారు) సిద్ధం కానున్నదని రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. సర్క్యూట్ హౌస్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ నిర్ణీత గడువులోగానే రామమందిర నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, టెంపుల్ పార్కు, ఇతర సౌకర్యాల కోసం జరుగుతున్న పనులను పరిశీలించామని మిశ్రా తెలిపారు. ఆలయంలోని మొదటి, రెండో అంతస్తుల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయడంపై దృష్టి సారించామని, రామ్‌లల్లా దర్బారు నవంబర్ నాటికి పూర్తికానున్నదని పేర్కొన్నారు. ఇదిలావుండగా అయోధ్య తీర్థ వికాస్ పరిషత్ ప్రధాన కార్యాలయాన్ని రామనగరిలో నెలకొల్పనున్నారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్, అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాల కోసం కొత్త భవనాలను నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఆలయ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆలయ నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ఏజెన్సీ టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్ ఆనంద్ మెహతా తెలిపారు. మార్చి నెలాఖరులోగా కాశీ-అయోధ్య మధ్య హెలికాప్టర్ సర్వీసు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని కేవలం 55 నిమిషాల్లోనే పూర్తిచేయవచ్చు. ఒక్కో ప్రయాణికునికి ఛార్జీ రూ.14,159 చొప్పున వసూలు చేయనున్నారు. ఒక ట్రిప్పులో ఐదుగురు ప్రయాణించే అవకాశం ఉండనుంది. ఈ హెలికాప్టర్ సేవలను ఉత్తరాఖండ్‌కు చెందిన రాజాస్ ఏరోస్పోర్ట్ అండ్ అడ్వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ అందించనుంది. -
ఎగుమతులు మళ్లీ మైనస్‌లోకి..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ తీవ్ర అనిశ్చితి పరిస్థితులకు భారత్ వస్తు ఎగుమతులు అద్దం పడుతున్నాయి. అక్టోబర్‌లో ‘ప్లస్’లోకి వచి్చన ఎగుమతులు తిరిగి నవంబర్‌లో మైనస్‌లోకి జారిపోయాయి. 2022 ఇదే నెలతో పోలి్చతే 2023 నవంబర్‌లో ఎగుమతుల విలువ 2.83% క్షీణించి 33.90 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక 10 నెలల తర్వాత అక్టోబర్‌లో ఎగువబాటకు చేరిన దిగుమతులు నవంబర్‌లో మళ్లీ క్షీణతలోకి జారాయి. 4.33% పతనంతో 54.48 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 20.58 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ముందు.. వెనుకలు ఇలా... అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతి, ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం సవాళ్లు, కఠిన ద్రవ్య పరిస్థితుల నేపథ్యంలో 2023 ఫిబ్రవరి నుంచి జూలై వరకూ భారత్ వస్తు ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణతలో నడిచాయి. అయితే ఆగస్టులో వృద్ధిలోకి (3.88 శాతం) మారినా, మళ్లీ సెప్టెంబర్‌లో 2.6 శాతం క్షీణించాయి. అక్టోబర్‌లో సానుకూల ఫలితం వెలువడింది. మరుసటి నెలలోనే మళ్లీ క్షీణరేటు నమోదయ్యింది. ఏప్రిల్–నవంబర్ మధ్య క్షీణ గణాంకాలే.. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య భారత్ వస్తు ఎగుమతుల విలువ 6.51 శాతం క్షీణించి 278.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతుల విలువ కూడా 8.67 శాతం క్షీణించి 445.15 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు– ఈ ఏడు నెలల్లో 166.36 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎనిమిది నెలల కాలంలో పసిడి దిగుమతులు 21 శాతం పెరిగి 32.93 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. -
టాటా మోటార్స్ సరికొత్త రికార్డు.. ఎప్పుడూ లేనంతగా..
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ 2023 నవంబర్‌లో గరిష్ట విక్రయాలను నమోదు చేసింది. పండుగల సీజన్ నేపథ్యంలో స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు బలమైన డిమాండ్ ఇందుకు కారణమని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. ‘గత నెలలో దేశవ్యాప్తంగా కంపెనీ 53,000 యూనిట్లను విక్రయించింది. ఈ సంఖ్య అంత క్రితం నెలతో పోలిస్తే 8 శాతం, 2022 నవంబర్‌తో పోలిస్తే 30 శాతం అధికం. 2023 నవంబర్ నెలలో నమోదైన విక్రయాలు ఇప్పటి వరకు కంపెనీ చరిత్రలోనే అత్యధికం. ఇక 47 రోజుల పండుగల సీజన్లో 79,374 యూనిట్లు రోడ్డెక్కాయి. 2022 పండుగల సీజన్‌తో పోలిస్తే ఇది 18 శాతం అధికం. కొత్తగా విడుదలైన నూతన నెక్సన్, హ్యారియర్, సఫారీ మోడళ్లతోపాటు ఐ–సీఎన్జీ శ్రేణి ఈ జోరుకు కారణం’ అని చెప్పారు. డీజిల్ స్థానంలో సీఎన్జీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వెహికిల్స్ పరిశ్రమతోపాటు టాటా మోటార్స్ సైతం ఉత్తమ ప్రతిభ కనబర్చనుందని శైలేష్ చంద్ర అన్నారు. ‘2023–24లో అన్ని కంపెనీలవి కలిపి 40 లక్షల యూనిట్ల మార్కును దాటవచ్చు. నవంబర్ రిటైల్ విక్రయాల్లో టాటా మోటార్స్ వాటా 15 శాతం దాటింది. ఎస్‌యూవీల్లో నెక్సన్, పంచ్ గత నెలలో టాప్–2లో ఉన్నాయి. ఎస్యూవీ మార్కెట్లో టాటా రెండవ స్థానంలో నిలిచింది. ప్యాసింజర్ వెహికిల్స్ రంగం నెలకు 3.3–3.5 లక్షల యూనిట్లను నమోదు చేస్తుంది. చిన్న హ్యాచ్బ్యాక్స్, సెడాన్స్‌లో డీజిల్ మోడళ్లు కనుమరుగయ్యాయి. డీజిల్ స్థానంలో సీఎన్జీ వచ్చి చేరింది. ఈ విభాగాల్లో సీఎన్జీ ప్రధాన ప్రత్యామ్నాయంగా నిలిచింది. కాంపాక్ట్ ఎస్‌యూవీకి పైన డీజిల్ మోడళ్లకు బలమైన డిమాండ్ ఉంది. కాబట్టి మార్కెట్‌కు అనుగుణంగా నడుచుకుంటాం’ అని వివరించారు. -
ఢిల్లీ కాలుష్యం తగ్గించడానికి కృత్రిమ వర్షం?
ఢిల్లీ: ఢిల్లీలో వాయు నాణ్యత అడుగంటిపోతోంది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం, వాహన ఉద్గారాల వల్ల గత ఏడు రోజులుగా కాలుష్య స్థాయిలు విషమంగానే కొనసాగుతున్నాయి. గాలి నాణ్యత పెంచడానికి తక్షణ ఉపాయం ఆలోచించాలని సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోంది. నవంబర్ 20-21లో రెండు రోజుల పాటు ఢిల్లీలో కృత్రిమ వర్షం కురిపించాలని యోచిస్తోంది. ఐఐటీ కాన్పూర్ బృందంతో ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్, ఆర్థిక మంత్రి అతిషి సమావేశమయ్యారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి కృత్రిమ వర్షం కురిపించవచ్చని ప్రతిపాదించారు. కృత్రిమ వర్షానికి సంబంధించిన ప్రణాళికను ఢిల్లీ ప్రభుత్వం ఐఐటీ కాన్పూర్ నిపుణులను కోరింది. ఈ ప్రణాళికను సుప్రీంకోర్టులో శుక్రవారం సమర్పించనుంది. ఢిల్లీలో కాలుష్య సమస్యను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. సర్వోన్నత న్యాయస్థానం ఆమోదముద్ర వేస్తే ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం ఈ పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాయి. "కృత్రిమ వర్షం కురిపించాలంటే కనీసం 40 శాతం మేఘాలు కమ్ముకోవాలి. నవంబర్ 20-21 తేదీల్లో మేఘాలు కమ్ముకునే అవకాశం ఉంది. కృత్రిమ వర్షం ప్రణాళికను అమలు చేసేందుకు అనుమతి లభిస్తే అధ్యయనాన్ని నిర్వహిస్తాం' అని ఐఐటీ కాన్పూర్ నిపుణులు తెలిపారు. దేశ రాజధానిలో గాలి కాలుష్యం రాజకీయ వివాదంగా పరిణమించకూడదని సుప్రీంకోర్టు ఇటీవల హెచ్చరించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో పంట వ్యర్థాల దహనాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. కాలుష్య సమస్యను ఢిల్లీ ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలని కోరింది. కృత్రిమ వర్షం అంటే? కరువుల ప్రభావాన్ని తగ్గించడం, అటవీ మంటలను నివారించడం, గాలి నాణ్యతను పెంచడానికి సాధారణంగా ఉపయోగించే కృత్రిమ పద్ధతి. వివిధ రసాయనిక పదార్థాలను మేఘాలలోకి ప్రవేశపెట్టడం ద్వారా వర్షపాతాన్ని కలిగిస్తారు. సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, డ్రై ఐస్ వంటి రసాయనాలను హెలికాప్టర్ల ద్వారా మేఘాలలోకి విడుదల చేస్తారు. ఈ రసాయనాలు నీటి ఆవిరిని మేఘాలుగా ఏర్పర్చి వర్షం కురిసేలా చేస్తాయి. ఇదీ చదవండి: ఢిల్లీ కాలుష్యానికి రీజనరేటివ్ వ్యవసాయమే విరుగుడు..? అసలేంటది..? -
64.40 లక్షల మందికి రూ.1,775.33 కోట్లు
సాక్షి, అమరావతి: నవంబర్ నెలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 64,40,536 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వివిధ రకాల చేతి వృత్తిదారులకు రూ.1,775.33 కోట్ల మొత్తాన్ని పింఛన్లుగా ప్రభుత్వం పంపిణీ చేసింది. నాలుగు రోజులుగా వలంటీర్లే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు. ఇప్పటికే 98.26 శాతం లబ్ధిదారులకు పంపిణీ పూర్తయిందని అధికారులు వెల్లడించారు. మిగిలిన వారి కోసం ఆదివారం సెలవు రోజు అయినా వలంటీర్ల ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని పేర్కొన్నారు. -
Bank holidays: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్! నవంబర్‌లో సెలవులు ఇవే..
Bank holidays in November 2023: అక్టోబర్ నెల ముగుస్తోంది. నవంబర్‌లోకి అడుగు పెట్టబోతున్నాం. పండుగ సీజన్ కావడంతో నవంబర్ నెలలో బ్యాంకు సెలవులు ఎక్కువగా ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా కస్టమర్లు తమ ఆర్థిక కార్యకలాపాలను ప్లాన్ చేసుకునేందుకు వీలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సెలవుల జాబితాను ముందుగానే విడుదల చేసింది. నవంబర్‌లో దీపావళి, గోవర్ధన్ పూజ, ఛత్ పూజ, సాధారణ వారాంతాలతో సహా దేశంలోని పలు రాష్ట్రాలలో సెలవులతో కలుపుకొని మొత్తం 15 రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ సెలవుల్లో బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ వంటి ఆన్లైన్ సేవలను ఉపయోగించుకోవచ్చు. నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు అందుబాటులో ఉంటాయి. నవంబర్‌లో బ్యాంక్ సెలవుల జాబితా ఇదే.. నవంబర్ 1 - కన్నడ రాజ్యోత్సవం/కుట్/కర్వా చౌత్ (కర్ణాటక, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్) నవంబర్ 5 - ఆదివారం నవంబర్ 10 - వంగల పండుగ (మేఘాలయ) నవంబర్ 11 - రెండవ శనివారం (వీక్లీ ఆఫ్) నవంబర్ 12 - ఆదివారం (వీక్లీ ఆఫ్) నవంబర్ 13 - గోవర్ధన్ పూజ/లక్ష్మీపూజ (త్రిపుర, ఉత్తరాఖండ్, సిక్కిం, మణిపూర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర) నవంబర్ 14 - దీపావళి నవంబర్ 15 - భాయ్ దూజ్/చిత్రగుప్త జయంతి/లక్ష్మీ పూజ/నింగల్ చక్కుబా/భ్రాత్రి ద్వితీయ (సిక్కిం, మణిపూర్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్) నవంబర్ 19, 2023 - ఆదివారం నవంబర్ 20 - ఛత్ (బిహార్, రాజస్థాన్) నవంబర్ 23 - సెంగ్ కుట్ స్నెమ్/ఇగాస్ బగ్వాల్ (ఉత్తరాఖండ్, సిక్కిం) నవంబర్ 25 - నాల్గవ శనివారం నవంబర్ 26 - ఆదివారం నవంబర్ 27 - గురునానక్ జయంతి/కార్తీక పూర్ణిమ (త్రిపుర, మిజోరం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, చండీగఢ్, ఉత్తరాఖండ్, హైదరాబాద్ - తెలంగాణ, రాజస్థాన్, జమ్ము, ఉత్తరప్రదేశ్, బెంగాల్, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్) నవంబర్ 30 - కనకదాస జయంతి (కర్ణాటక) -
IPO: నెలలో రూ.15వేల కోట్లు సమీకరించే కంపెనీలు ఇవే..
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నవంబరులో దాదాపు 12 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు రానున్నాయి. వీటి ద్వారా వచ్చే నెల రోజుల్లో దాదాపు రూ.15,000 కోట్ల సమీకరణకు సిద్ధమవుతున్నాయి. ఈ డజన్ కంపెనీల్లో ఇప్పటికే బ్లూ జెట్ హెల్త్‌కేర్ ఐపీఓ ప్రారంభం అయింది. సెల్లో వరల్డ్ ఇష్యూ తేదీలను ప్రకటించింది. టాటా టెక్నాలజీస్, మామాఎర్త్, ఏఎస్కే ఆటోమోటివ్, ప్రోటీన్ ఈగవ్ టెక్, ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్, క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్ పబ్లిక్ ఆఫర్లు నవంబరులో రానున్నాయి. వీటితో మొత్తం దాదాపు రూ.15వేలకోట్లు సమీకరించే వీలుంది. రూ.1,900 కోట్ల సమీకరణ లక్ష్యంతో వస్తోన్న సెల్లో వరల్డ్ ఐపీఓ అక్టోబర్ 30న ప్రారంభమై నవంబర్ 1 వరకు కొనసాగనుంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని కంపెనీ రూ.617-648గా నిర్ణయించింది. మరోవైపు ఇప్పటికే ప్రారంభమైన బ్లూ జెట్ హెల్త్‌కేర్ ఐపీఓ అక్టోబర్ 27 వరకు కొనసాగుతుంది. ఈ కంపెనీ రూ.840 కోట్లు సమీకరించనుంది. చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా టెక్నాలజీస్ ఐపీఓ నవంబర్ రెండు లేదా మూడో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇరవయ్యేళ్లలో టాటా గ్రూప్ నుంచి వస్తున్న తొలి ఐపీఓ ఇది. దీని ఒక్కో షేరు ధర శ్రేణి రూ.400 నుంచి రూ.500 మధ్య ఉండొచ్చని మార్కెట్ నిపుణుల అంచనా వేస్తున్నారు. చివరగా 2004లో టాటా సంస్థల నుంచి టీసీఎస్ ఐపీఓగా వచ్చింది. హొనాస కన్జ్యూమర్(మామాఎర్త్ మాతృసంస్థ) పబ్లిక్ ఇష్యూకు త్వరలో రాబోతోంది. దాదాపు రూ.1,650 కోట్ల సమీకరించేందుకు సిద్ధమవుతోంది. ఫెడరల్ బ్యాంక్ ఆధ్వర్యంలోని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓకు రానుంది. రూ.1,200 కోట్ల సమీకరణ లక్ష్యంతో ప్రోటీన్ ఇగవ్ టెక్, రూ.1,000 కోట్ల సమీకరణ కోసం ఏఎస్కే ఆటోమోటివ్ సైతం నవంబర్లోనే ఐపీఓ (IPO)కి రానున్నాయి. వచ్చే నెలలోనే రూ.1,400 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఈ సంస్థ పబ్లిక్ ఇష్యూకి సిద్ధ అవుతుంది. రూ.750 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు మరో 70.3 మిలియన్ల షేర్లు ఓఎఫ్ఎస్ కింద జారీ చేయనున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఐపీఓకు వచ్చిన 36 కంపెనీలు దాదాపు రూ.28,330 కోట్లు సమీకరించాయి. గతేడాది మొత్తం 40 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వచ్చాయి. ఫలితంగా రూ.59వేలకోట్ల నిధులు కూడగట్టాయి. కంపెనీలు సమీకరించనున్న మొత్తం టాటా టెక్నాలజీస్: రూ.2500 కోట్లు సెల్లోవరల్డ్: రూ.1900 కోట్లు హొనాస కన్జ్యూమర్:రూ.1650 కోట్లు ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్సియల్: రూ.1400 కోట్లు ప్రొటీన్ ఈగోవ్టెక్: రూ.1300 కోట్లు డీఓఎంఎస్ ఇండస్ట్రీస్:రూ.1200 కోట్లు ఏఎస్కే ఆటోమోటివ్:రూ.1000 కోట్లు జనస్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: రూ.1000 కోట్లు ఫిన్‌కేర్ మైక్రోఫైనాన్స్: రూ.900 కోట్లు బ్లూజెట్ హెల్త్‌కేర్: రూ.840 కోట్లు ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్: రూ.800 కోట్లు ఈసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: రూ.630 కోట్లు -
ఆప్యాయనురాగాలతో..
పులివెందుల మహేశ్, ప్రియా పాల్ జంటగా శివరామ్ తేజ దర్శకత్వం వహించిన చిత్రం ‘మా ఊరి సిన్మా’. జి. మంజునాథ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా నవంబరులో విడుదల కానుంది. ఈ చిత్రం ప్రెస్మీట్లో పీపుల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్ కాసుల రామకష్ణ (శ్రీధర్), నటులు నాగమహేశ్, ‘బలగం’ సంజయ్ అతిథులుగా పాల్గొన్నారు. ‘‘ఇంత మంచి సినిమాను నిర్మించడానికి సహకరించినవారికి థ్యాంక్స్’’ అన్నారు జి. మంజునాథ రెడ్డి. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది’’ అన్నారు శివరామ్ తేజ. ‘‘తండ్రీకొడుకుల అనురాగం, బావా–మరదళ్ల ఆప్యాయతతో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు పులివెందుల మహేశ్. -
యాక్షన్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ పూర్తి
విక్రాంత్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్ ఎల్.ఐ.ఎఫ్.ఈ’. మెహరీన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లుగా నటించారు. విక్రాంత్ డెఫ్ ఫ్రాగ్ ప్రోడక్షన్స్పై రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా హీరో–డైరెక్టర్ విక్రాంత్ మాట్లాడుతూ– ‘‘సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. భావోద్వేగాలు, ప్రేమ, భారీ ఫైట్స్‌తో ఈ మూవీ రూపొందింది. ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ అనుభూతినిచ్చే సినిమా ఇది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నవంబర్ 17న ఈ సినిమాని రిలీజ్ చేస్తాం’’ అన్నారు. -
TSPSC: నవంబర్లోనే గ్రూప్-2.. కొత్త తేదీలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-2 అభ్యర్థులకు గమనిక. ఈనెల 29,30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షలను టీఎస్పీఎస్సీ రీషెడ్యూల్ చేసింది. ఈ మేరకు కొత్త తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ క్రమంలో నవంబర్ 2,3 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా.. గ్రూప్–2 పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలికింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్షలను నిర్వహించాలని స్పష్టంచేసింది. ఈమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సూచనలు చేశారు. గ్రూప్–2 పరీక్షను వాయిదా వేసే అంశంపై టీఎస్పీఎస్సీ యంత్రాంగంతో సంప్రదింపులు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే. మిగతా పరీక్షలకు అభ్యర్థులు సన్నద్ధమయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ వివరాలను ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ శనివారం రాత్రి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అనంతరం ఈనెల 29, 30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్–2 పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసిందని, వాటిని నవంబర్‌లో నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇది కూడా చదవండి: ఒక్క క్లిక్‌తో.. ఆర్టీసీ బస్సు ఎక్కడుందో చెబుతుంది.. డౌన్లోడ్ ఇలా.. -
గ్రూప్–2 పరీక్షలు నవంబర్‌కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలికింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్షలను నిర్వహించాలని స్పష్టంచేసింది. ఈమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సూచన లు చేశారు. గ్రూప్–2 పరీక్షను వాయిదా వేసే అంశంపై టీఎస్పీఎస్సీ యంత్రాంగంతో సంప్రదింపులు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మిగతా పరీక్షలకు అభ్యర్థులు సన్నద్ధమయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ వివరాలను ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ శనివారం రాత్రి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అనంతరం ఈనెల 29, 30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్–2 పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసిందని, వాటిని నవంబర్‌లో నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అభ్యర్థుల ఆందోళనకు చెక్ ఈనెల 29, 30వ తేదీల్లో గ్రూప్–2 పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ (తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ఐదు నెలల క్రితమే తెలిపింది. కమిషన్ షెడ్యూల్ ఆధారంగా ఆగస్టులో గురుకుల ఉద్యోగ అర్హత పరీక్షలకు గురుకుల బోర్డు సన్నద్ధమై పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించి నిర్వహిస్తోంది. వరుసగా ఆగస్టు 1 నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహిస్తుండటం... ఆ తర్వాత 29, 30 తేదీల్లో 5.35 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యే గ్రూప్–2 పరీక్షలుండటంతో అభ్యర్థులపై ఒత్తిడి తీవ్రమవుతుందనే వాదన తెరపైకి వచ్చింది. ఈక్రమంలో పలు రకాలుగా కమిషన్‌కు వినతులు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో కమిషన్ కార్యాలయ ముట్టడికి సైతం అభ్యర్థులు దిగడం... అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం... మరోవైపు కొందరు అభ్యర్థులు న్యాయపోరాటానికి సైతం ఉపక్రమించడంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. పరీక్ష నిర్వహణను వాయిదా వేయడంతో అభ్యర్థుల ఆందోళనకు చెక్ పడింది. -
‘వారంతా 18-25 ఏళ్ల వయస్సు వాళ్లే’.. దేశంలో పెరిగి పోతున్న ఉద్యోగం చేసే వారి సంఖ్య
న్యూఢిల్లీ: ఉపాధి కల్పనకు సంబంధించి నవంబర్ సానుకూల సంకేతం ఇచ్చింది. 2022 నవంబర్‌లో నికరంగా 16.26 లక్షల మంది చందాదారులు చేరినట్లు కార్మిక మంత్రిత్వశాఖ ప్రకటన ఒకటి తెలిపింది. 2021 ఇదే నెలతో పోల్చితే ఈ సంఖ్య 16.5 శాతం అధికంగా ఉండడం గమనార్హం. ఇక 2022 అక్టోబర్‌తో పోల్చితే ఈ గణాంకాలు ఏకంగా 25.67 శాతం అధికంగా ఉన్నాయి. తాజా గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► నవంబర్‌లో 16.26 లక్షల మంది నికరంగా ఈపీఎఫ్ఓ చందాదారులగా చేరితే అందులో 8.99 లక్ష మంది మొదటి సారి చేరినవారు. ఇలా చేరిన వారు అక్టోబర్‌తో (7.28 లక్షలు) పోల్చితే 1.71 లక్షల మంది అధికం. ► కొత్తగా ఆర్గనైజేషన్‌లో చేరిన వారిలో 18 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సువారు 2.77 లక్షల మంది. 22–25 మధ్య వయస్సు వారు 2.32 లక్షల మంది. మొత్తం కొత్త సభ్యుల్లో 18 నుంచి 25 మధ్య వయస్కుల వారి వెయిటేజ్ 56.60 శాతంగా ఉంది. మొదటిసారి ఉద్యోగంలో చేరినవారు భారీగా సంఘటిత రంగంలోనే నమోదయినట్లు ఈ గణాంకాలు పేర్కొనడం సానుకూల అంశం. ► ఇక దాదాపు 11.21 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్ఓమెంబర్షిప్లో తిరిగి చేరారని కూడా డేటా పేర్కొంది. ఉద్యోగాల మార్పు, ఈపీఎఫ్ఓ కింద ఉన్న సంస్థల్లో తిరిగి చేరడం, తుది పరిష్కారం కోసం దరఖాస్తు చేయడానికి బదులుగా సామాజిక భద్రతా రక్షణను పొడిగిస్తూ వారి నిధిని బదిలీ చేసుకోవడం వంటి నిర్ణయాలు తీసుకున్నవారు ఇందులో ఉన్నారు. ► ఈపీఎఫ్ఓ గణాంకాల ప్రకారం, నవంబర్ 2022లో నికర మహిళా సభ్యుల నమోదు సంఖ్య 3.19 లక్షలు. అక్టోబర్ 2022కు సంబంధించి 2.63 లక్షల మందితో పోల్చితే ఇది 0.56 శాతం అధికం. ఈఎస్ఐ స్కీమ్ గణాంకాలు ఇలా... ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఈఎస్ఐ స్కీమ్) తొలి విడత 2022 నవంబర్ పేరోల్ డేటాను కూడా కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇందులో సమీక్షా నెల్లో 18.86 లక్షల మంది కొత్త ఉద్యోగులు జతయ్యారు. 2021 నవంబర్‌తో పోల్చితే ఈ సంఖ్య నికరంగా 5.24 లక్షలు పెరిగింది. డేటా ప్రకారం, ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కింద తమ ఉద్యోగులకు సామాజిక భద్రత కవరేజీని అందజేయడానికి ఉద్దేశించి నవంబర్ 2022 నెలలో దాదాపు 21,953 కొత్త సంస్థలు రిజిస్టర్ అయ్యాయి. ఈఎస్ఐ కింద నవంబర్‌లో జతయిన 18.86 లక్షల మంది కొత్త ఉద్యోగుల్లో 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్కులు 8.78 లక్షల మంది. నమోదయిన నికర మహిళా సభ్యుల సంఖ్య 3.51 లక్షలు. నవంబర్‌లో మొత్తం 63 మంది ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులు కూడా ఈఎస్ఐ స్కీమ్‌లో నమోదు చేసుకున్నట్లు డేటా పేర్కొంది. సభ్యులకు బహుళ ప్రయోజనాలు... ఉద్యోగి రికార్డుల నవీకరణ నిరంతర ప్రక్రియ. ఈ ప్రాతిపదికన పేరోల్ డేటాను తాత్కాలికమైనదిగా పరిగణించాలి. మునుపటి డేటా ప్రతి నెలా మారుతుంది. ఏప్రిల్ 2018 నుండి ( సెప్టెంబర్ 2017 తరువాత కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ) పేరోల్ డేటా విడుదలవుతోంది. ఈపీఎఫ్ఓ తన సభ్యులకు సభ్యులకు ఈపీఎఫ్, ఎంపీ చట్టం, 1952 చట్టం కింద లభించే పలు ప్రయోజనాలను అందించడానికి బాధ్యత వహించే సామాజిక భద్రతా సంస్థ. ఇది సభ్యులకు వారి పదవీ విరమణపై భవిష్య నిధి, పెన్షన్ ప్రయోజనాలు అలాగే సభ్యుడు అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు కుటుంబ పెన్షన్, బీమా ప్రయోజనాలను అందిస్తుంది. ఈపీఎఫ్ఓ దాదాపు 6 కోట్ల మందికి పైగా చందాదారులతో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులను కలిగి ఉంది. పటిష్టమైన స్థాయిలో రూ.300 కోట్ల మిగులునూ నిర్వహిస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.1 శాతం వడ్డీ రేటు చెల్లించడానికి ఇటీవలే కేంద్రం ఆమోదముద్ర వేసింది. గడచిన నాలుగు దశాబ్దాల కాలంలో (1977–78లో ఈపీఎఫ్ 8 శాతం) కనిష్ట వడ్డీరేటు ఇది. డెట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి పొందిన వడ్డీ అలాగే ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈపీఎఫ్ఓ అత్యున్నత స్థాయి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) వడ్డీరేటును నిర్ణయిస్తుంది. 2015–16లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఈపీఎఫ్ఓ ప్రారంభించింది. ఈక్విటీల్లో తన మొత్తం నిధుల్లో 5 శాతంతో ప్రారంభమైన ఈపీఎఫ్ఓ పెట్టుబడులు, ప్రస్తుతం 15 శాతానికి చేరాయి. -
ఆధార్ ఈ కేవైసీ లావాదేవీలు 29 కోట్లు
న్యూఢిల్లీ: ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ లావాదేవీలు నెలవారీగా చూస్తే నవంబర్‌లో 22 శాతం పెరిగాయి. 28.75 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఈ ఏడాది నవంబర్ వరకు 1,350 కోట్ల మైలురాయిని లావాదేవీలు అధిగమించాయి. ఆధార్ ధ్రువీకృత లావాదేవీలు సైతం నవంబర్‌లో 11 శాతం అధికంగా 195 కోట్లు నమోదయ్యాయి. ఆధార్ వాడకం దేశవ్యాప్తంగా పెరుగుతోందని, చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనమని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ ప్రకటించింది. ఆధార్ ఈ కేవైసీ లావాదేవీ అంటే.. బ్యాంక్ ఖాతా కోసం ఈ–కేవైసీ ఇస్తాం కదా, ఇది ఒక లావాదేవీ కిందకు వస్తుంది. ఆధార్ ఈ–కేవైసీ లావాదేవీల వృద్ధికి ప్రధానంగా బ్యాంకింగ్, బ్యాంకింగేతర ఆర్థిక లావాదేవీలు మద్దతునిస్తున్నాయి. ఈ–కేవైసీ వల్ల పేపర్ డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన ఇబ్బంది తప్పిపోయింది. ఇది వచ్చిన తర్వాత బ్యాంక్ ఖాతాలు, టెలికం సిమ్ కార్డుల జారీ, కొత్త కస్టమర్లను చేర్చుకోవడం తదితర సేవలు ఎంతో సులభంగా మారడం తెలిసిందే. ఆధార్ హోల్డర్ వ్యక్తిగతంగా హాజరై వేలిముద్ర, ఓటీపీ ఇస్తేనే ధ్రువీకరణ కావడం ఇందులో భద్రతకు హామీ ఇస్తోంది. ఇక ఆధార్ ఈ–కేవైసీ విధానం వచ్చిన నాటి నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు మొత్తం 8,621 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఆధార్ ఆధారిత చెల్లింపులు రూ.1,592 కోట్లుగా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో 1,100 ప్రభుత్వ పథకాల కింద ప్రయోజనాలు అసలైన లబ్ధిదారులకు వేగంగా, పారదర్శకంగా చేరేందుకు ఆధార్ ఉపకరిస్తున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ తెలిపింది. -
నవంబర్‌లో 37 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం
న్యూఢిల్లీ: ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ నవంబర్‌లో దేశీయంగా 37.16 లక్షల ఖాతాలను నిషేధించింది. అంతక్రితం నెలతో పోలిస్తే ఇది 60 శాతం అధికం. అక్టోబర్‌లో 23.24 లక్షల ఖాతాలను నిషేధించింది. తాజాగా నవంబర్‌లో మిగతావారి నుంచి ఫిర్యాదులు రావడానికి ముందే క్రియాశీలకంగా వ్యవహరించి బ్యాన్ చేసిన ఖాతాల సంఖ్య 9.9 లక్షలుగా ఉందని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనల ప్రకారం తమ నెలవారీ నివేదికలో వాట్సాప్ తెలిపింది. విద్వేషపూరిత, తప్పుడు సమాచార వ్యాప్తికి వేదికలుగా మారుతున్నాయంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై ఆరోపణలు వస్తుండటంతో కేంద్రం గతేడాది కఠినతర ఐటీ నిబంధనలను అమల్లోకి తెచ్చింది. వీటి ప్రకారం 50 లక్షల పైగా యూజర్లు ఉన్న బడా డిజిటల్ ప్లాట్‌ఫాంలు తాము నిబంధనలను పాటిస్తున్నట్లు తెలిపేలా ప్రతి నెలా నివేదికను ప్రచురించాల్సి ఉంటుంది. తమకు వచ్చిన ఫిర్యాదులు, తాము తీసుకున్న చర్యల గురించి వెల్లడించాలి. దీనికి అనుగుణంగానే వాట్సాప్ తాజా నివేదికను రూపొందించింది. -
1.16 కోట్ల మంది విమాన ప్రయాణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా 2022 నవంబర్‌లో 1.16 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2021 నవంబర్‌తో పోలిస్తే ఈ సంఖ్య 11.06 శాతం అధికం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం.. 2022 అక్టోబర్‌లో దేశీయంగా 1.14 కోట్ల మంది విహంగ వీక్షణం చేశారు. కోవిడ్ మహమ్మారితో తీవ్రంగా దెబ్బతిన్న తరువాత.. దేశంలోని పౌర విమానయాన రంగం రికవరీ బాటలో ఉంది. ఇటీవలి కాలంలో దేశీయంగా సగటున ప్రతిరోజు 4 లక్షల పైచిలుకు మంది విమాన ప్రయాణం చేస్తున్నారు. నవంబరులో నమోదైన మొత్తం ప్రయాణికుల్లో 55.7 శాతం వాటాతో ఇండిగో తొలి స్థానంలో నిలిచింది. విస్తారా 9.3 శాతం వాటాతో 10.87 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. ఎయిర్ ఇండియా 9.1 శాతం, ఏయిర్‌ఏషియా ఇండియా 7.6, గో ఫస్ట్, స్పైస్‌జెట్ చెరి 7.5 శాతం వాటాను దక్కించుకున్నాయి. టాటా గ్రూప్ కంపెనీలైన ఎయిర్ ఇండియా, విస్తారా, ఎయిర్ఏషియా సంయుక్తంగా 26 శాతం వాటాతో 30.35 లక్షల మందికి విమాన సేవలు అందించాయి. 92 శాతం అధిక ఆక్యుపెన్సీతో స్పైస్‌జెట్ ముందంజలో ఉంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల్లో రాకపోకల విషయంలో సగటున 92 శాతం ఇండిగో విమానాలు నిర్ధేశిత సమయానికి సేవలు అందించాయి. -
5.85 శాతానికి టోకు ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం మాదిరే టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) సైతం నవంబర్‌లో గణనీయంగా తగ్గి 5.85 శాతానికి పరిమితమైంది. అంతకుముందు నెలలో (అక్టోబర్) ఇది 8.39 శాతంగా ఉంది. ఆహారం, చమురు, తయారీ ధరలు తగ్గుముఖం పట్టడం ద్రవ్యోల్బణం వేడి తగ్గేందుకు సాయపడ్డాయి. నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం సైతం అక్టోబర్‌లో ఉన్న 6.77 శాతం నుంచి 5.88 శాతానికి తగ్గడం తెలిసిందే. గతేడాది నవంబర్‌లో డబ్ల్యూపీఐ బేస్ అధికంగా ఉండడం, ఆహార ధరలు కొంత తగ్గడం ద్రవ్యోల్బణం నియంత్రణకు సాయపడినట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ఓ పరిశోధన పత్రంలో పేర్కొంది. 2021 ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 4.83% తర్వాత, అతి తక్కువ స్థాయిలో నమోదు కావడం మళ్లీ ఇదే మొదటిసారి. విభాగాల వారీగా.. ► ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 8.33% ఉంటే, నవంబర్‌లో 1.07%గా ఉంది. ► కూరగాయల ధరలు అయితే ఊహించని విధంగా నియంత్రణలోకి వచ్చాయి. కూరగాయలకు సంబంధించి ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 17.61 శాతంగా ఉంటే, నవంబర్‌లో ఏకంగా మైనస్ 20 శాతానికి (డిఫ్లేషన్) పడిపోయింది. ► ఇంధనం, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం 17.35 శాతంగా నమోదైంది. ► తయారీ ఉత్పత్తులకు సంబంధించి 3.59 శాతంగా ఉంది. మరింత తగ్గిస్తాం.. ప్రధాని మోదీ, మంత్రుల బృందం, అధికారులు ఎప్పటికప్పుడు జోక్యం చేసుకోవడం, చర్యలు తీసుకోవడం ఫలితాలనిచ్చాయి అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు తెలిపారు. సామాన్యుడి కోసం ద్రవ్యోల్బణాన్ని మరింత తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. -
భారీగా వంట నూనెల దిగుమతులు
న్యూఢిల్లీ: వంట నూనెల దిగుమతులు నవంబర్‌లో గణనీయంగా పెరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 11,38,823 టన్నులతో పోల్చి చూస్తే, 32 శాతం పెరిగి 15,28,760 టన్నులకు చేరాయి. ముఖ్యంగా ముడి పామాయిల్, రిఫైన్డ్ పామాయిల్ దిగుమతులు అధికంగా జరిగినట్టు సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) ప్రకటించింది. నవంబర్ నెలకు సంబంధించి వంట నూనెలు, ఇతర నూనెల దిగుమతుల గణాంకాలను ఎస్ఈఏ బుధవారం విడుదల చేసింది. వంట నూనెలకు సంబంధించి 2022–23 మార్కెటింగ్ సంవత్సరంలో నవంబర్ మొదటి నెల అవుతుంది. పామాయిల్ రికార్డులు ► మొత్తం నూనెల దిగుమతులు నవంబర్ నెలకు 15,45,540 టన్నులుగా ఉన్నాయి. 2021 నవంబర్‌లో ఇవి 11,73,747 టన్నులుగా ఉన్నాయి. ► కేవలం వంట నూనెల దిగుమతులు 15,28,760 టన్నులకు చేరాయి. ► ఇతర నూనెల దిగుమతులు ఏడాది క్రితం ఇదే కాలంలో ఉన్న 34,924 టన్నులతో పోలిస్తే 52 శాతం తగ్గి 16,780 టన్నులుగా ఉన్నాయి. ► ముడి పామాయిల్ దిగుమతులు 9,31,180 టన్నులుగా నమోదయ్యాయి. ఏడాది క్రితం ఇవి 4,77,160 టన్నులుగానే ఉన్నాయి. అంటే రెట్టింపైనట్టు తెలుస్తోంది. ► ఇప్పటి వరకు ఒక నెలలో ముడి పామాయిల్ అధిక దిగుమతులు ఇవే కావడం గమనించాలి. చివరిగా 2015 అక్టోబర్ నెలలో 8,78,137 టన్నుల ముడి పామాయిల్ దిగుమతులు జరిగాయి. ► రిఫైన్డ్ పామోలీన్ దిగుమతులు నవంబర్ నెలకు 2,02,248 టన్నులుగా ఉన్నాయి. 2021 నవంబర్‌లో ఉన్న 58,267 టన్నులతో పోలిస్తే మూడు రెట్లకు పైగా డిమాండ్ పెరిగింది. ► ముడి సోయాబీన్ ఆయిల్ దిగుమతులు 2,29,373 టన్నులకు తగ్గాయి. ఏడాది క్రితం ఇదే నెలలో ఇవి 4,74,160 టన్నులుగా ఉన్నాయి. ఎస్ఈఏ ఆందోళన..: రిఫైన్డ్ పామోలిన్ ఆయిల్ దిగుమతులు పెరిగిపోవడం దేశీ పరిశ్రమను దెబ్బతీస్తుందని ఎస్ఈఏ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘ముడి పామాయిల్, రిఫైన్డ్ ఆయిల్ మధ్య టారిఫ్ అంతరం 7.5 శాతమే ఉండడంతో, రిఫైన్డ్ పామోలీన్ దిగుమతులు పెరగడానికి దారితీస్తోంది. తుది ఉత్పత్తుల దిగుమతులు పెరగడం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకం. దేశీ సామర్థ్య వినియోగంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. రిఫైన్డ్ పామోలీన్ దిగుమతులు పెరగడానికి.. వాటిని ఎగుమతి చేసే దేశాలు (ఇండోనేషియా, మలేషియా) అక్కడి పరిశ్రమకు రాయితీలు ఇవ్వడం వల్లే. ముడి పామాయిల్ ఎగుమతులపై ఆయా దేశాలు అధిక సుంకాలు విధించాయి. తుది ఉత్పత్తి అయిన పామోలీన్ ఆయిల్‌పై తక్కువ డ్యూటీ విధించాయి’’అని అసోసియేషన్ పేర్కొంది. దేశీ పరిశ్రమను ఆదుకునేందుకు, ముడి పామాయిల్ దిగుమతిని ప్రోత్సహించేందుకు పరిశ్రమ కీలక సూచన చేసింది. రెండింటి మధ్య సుంకాల్లో అంతరం 15 శాతం మేర ఉంచాలని పేర్కొంది. రిఫైన్డ్ పామోలీన్ ఆయిల్‌పై డ్యూటీని 20 శాతం చేయాలని కోరింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో వంట నూనెల దిగుమతులు అంతకుమందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 131 లక్షల టన్నుల నుంచి 140 లక్షల టన్నులకు పెరగడం గమనార్హం. -
సామాన్యుడికి ఊరట:11 నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: సామాన్యుడికి ధరల మంట కాస్తంత తగ్గింది. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారోత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గాయి. దీంతో నవంబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం 5.88 శాతానికి దిగొచ్చింది. ఇది 11 నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. అంటే ఏడాది తర్వాత మళ్లీ తక్కువ ధరలు చూస్తున్నాం. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (వినియోగ ధరల ఆధారిత సూచీ/రిటైల్ ద్రవ్యోల్బణం) గణాంకాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) సోమవారం విడుదల చేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం ఇది వరుసగా రెండో మాసం. (ఎట్టకేలకు..మూడు రంగుల్లో ట్విటర్ వెరిఫైడ్ మార్క్ షురూ) అంతకుముందు అక్టోబర్‌లో 6.77 శాతంగా ఉంది. 2021 నవంబర్ నెలలో ఇది 4.91 శాతంగా ఉండడం గమనార్హం. ఏడాది క్రితంతో పోలిస్తే ఇప్పటికీ 1శాతం మేర అధికంగా ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ద్రవ్యోల్బణం కట్టడే ధ్యేయంగా ఆర్బీఐ వరుసగా వడ్డీ రేట్లను పెంచుతూ, వ్యవస్థలో లిక్విడిటీని తగ్గించే ప్రయత్నం చేస్తుండడం తెలిసిందే. ఈ నెల మొ దటి వారంలో ముగిసిన తాజా ఎంపీసీ సమీక్షలోనూ కీలక రెపో రేటు 0.35శాతం మేర పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి చూస్తే రెపో రేటు మొత్తం మీద 2.25 శాతం ఎగిసింది. వచ్చే జనవరి-మార్చి త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం 6శాతం లోపునకు దిగొస్తుందని, రానున్న రోజుల్లో ధరల మంట కాస్తంత చల్లారుతుందని ఇటీవలి సమీక్ష అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. (ఐఐపీ డేటా షాక్: పడిపోయిన పారిశ్రామికోత్పత్తి) ధరల తీరు...: ఆహార ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 7.01 శాతంగా ఉంటే అది నవంబర్ నెలకు 4.67 శాతానికి క్షీణించింది. సీపీఐలో ఆహారోత్పత్తుల వాటా 40 శాతం. కూరగాయల ధరలు 8 శాతం మేర తగ్గాయి. ఇక వంట నూనెల ధరలు 0.63 శాతం, చక్కెర ధరలు 0.25 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. ధాన్యాలకు సంబంధించిన ద్రవ్యోల్బణం ఇంకా గరిష్ట స్థాయిలో 12.96శాతం వద్ద ఉంటే, వంట దినుసులకు సంబంధించి 19.52 శాతం, పాల ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 8.16 శాతం, పప్పులకు సంబంధించి 3.15శాతంగా నమోదైంది. చమురు, పొగాకు, మత్తు కారకాల రేట్లు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఎక్కువలోనే ఉన్నాయి. వస్త్రాలు, పాదరక్షల ధరలు 9.83శాతం, ఇళ్ల ధరలు 4.57శాతం పెరిగాయి. ‘డిసెంబర్‌లోనూ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడితే వచ్చే ఫిబ్రవరి సమీక్షలో పాలసీ రేట్ల సమీక్షలో కీలక అంశంగా మారుతుందని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ తెలిపారు. ఊహించని విధంగా ద్రవ్యోల్బణం 6 శాతం లోపునకు దిగివచ్చినట్టు చెప్పారు. నవంబర్ నెలకు 5.88 శాతం చర్యల ఫలితమే ఇది..: ఆహార ధరల నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా, ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశిత గరిష్ట పరిధి అయిన 6 శాతం లోపునకు దిగొచ్చింది. ధాన్యాలు, పప్పులు, వంట నూనెల ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకున్నాం. ఈ చర్యల ఫలితాలు రానున్న నెలల్లో ద్రవ్యోల్బణంపై ఇంకా ప్రతిఫలిస్తాయి. – కేంద్ర ఆర్థిక శాఖ ట్వీట్ -
భారత్‌కు చమురు సరఫరాలో రష్యానే టాప్
న్యూఢిల్లీ: భారత్‌కు అత్యధికంగా ముడిచమురు సరఫరా చేసే దేశాల జాబితాలో వరుసగా రెండో నెలా నవంబర్లోనూ రష్యా అగ్రస్థానంలో నిల్చింది. ఎనర్జీ ఇంటెలిజెన్స్ సంస్థ వర్టెక్సా గణాంకాల ప్రకారం రోజుకు 9.09 లక్షల బ్యారెళ్ల (బీపీడీ) ముడి చమురును సరఫరా చేసింది. అక్టోబర్‌లో ఎగుమతి చేసిన 9.35 లక్షల బీపీడితో పోలిస్తే ఇది కాస్త తక్కువే అయినా.. మిగతా దేశాల ద్వారా వచ్చిన క్రూడాయిల్‌తో పోలిస్తే అధికంగానే ఉంది. (గుడ్‌న్యూస్..ఈ ఐటీ కంపెనీలో కొలువులే కొలువులు) సాధారణంగా భారత్‌కు చమురు సరఫరా చేయడంలో ఇరాక్, సౌదీ అరేబియా అగ్రస్థానాల్లో ఉంటాయి. కానీ తాజాగా నవంబర్‌లో మాత్రం ఇరాక్ నుంచి 8.61 లక్షల బీపీడీ, సౌదీ అరేబియా నుండి 5.70 లక్షల బీపీడీ చమురు మాత్రమే దిగుమతయ్యింది. 4.05 లక్షల బీపీడీతో అమెరికా నాలుగో స్థానంలో ఉంది. భారత్‌కు రష్యా నుంచి చమురు ఎగుమతులు ఈ ఏడాది మార్చిలో కేవలం 0.2 శాతం స్థాయిలో ఉండేవి. (‘క్రోమా’ వింటర్ సీజన్ సేల్..బంపర్ ఆఫర్లు) కానీ ప్రస్తుతం భారత చమురు సరఫరాల్లో అయిదో వంతుకు పెరిగాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం దరిమిలా పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడంతో భారత్‌కు రష్యా డిస్కౌంటు రేటుకే ముడి చమురును అందిస్తోంది. దీంతో ఇటీవలి కాలంలో రష్యా క్రూడాయిల్ దిగుమతులు గణనీయంగా పెరిగాయి. (ఎన్డీటీవీ బోర్డు: అదానీ గ్రూప్‌నకు 2 సీట్లు ఆఫర్) -
ఈ కార్లకు యమ క్రేజ్.. జనాలు ఎగబడి కొనేస్తున్నారు!
ముంబై: దేశీయంగా వ్యక్తిగత రవాణా గిరాకీ పుంజుకోవడంతో నవంబర్‌లో వాహన విక్రయాలు దూసుకెళ్లాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీలు అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని నమోదుచేశాయి. కియా ఇండియా, హోండా కార్స్, స్కోడా, ఎంజీ మోటార్స్ సంస్థలు సైతం చెప్పుకోదగిన స్థాయిలో అమ్మకాలు జరిపాయి. దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మొత్తం 1,59,044 వాహనాలు విక్రయించింది. గతేడాది నవంబర్ నాటి 1,39,184 అమ్మకాలతో పోలిస్తే ఇవి 14 శాతం అధికం. డిసెంబర్‌తో కలుపుకొని ఈ ఏడాదిలో మొత్తం 38 లక్షల కార్ల విక్రయాలను అంచనా వేస్తున్నట్లు కంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ శ్రీవాస్తవ తెలిపారు. హ్యుందాయ్ మోటార్ ఇండియా నవంబర్ విక్రయాలు 36 శాతం పెరిగి 64,004 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలో కంపెనీ 46,910 వాహనాలను అమ్మింది. టాటా మోటార్స్ మొత్తం విక్రయాలు 62,192 నుంచి 21 శాతం పెరిగి 75,478కు చేరాయి. కియా ఇండియా మొత్తం అమ్మకాలు 69 శాతం పెరిగి 24,025 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇక ద్విచక్ర వాహనాల గణాంకాలను పరిశీలిస్తే.., హీరో మోటోకార్ప్ అమ్మకాలు నవంబర్‌లో 12 శాతం పెరిగి మొత్తం 3.90 లక్షల యూనిట్లను విక్రయించిట్లు ఆ కంపెనీ తెలిపింది. బజాజ్ ఆటో విక్రయాలు 19 శాతం మేర క్షీణించాయి. -
CMIE: నవంబర్‌లో మూడు నెలల గరిష్టానికి నిరుద్యోగం!
ముంబై: దేశంలో నిరుద్యోగం రేటు నవంబర్‌లో మూడు నెలల గరిష్టం ఎనిమిది శాతానికి పైగా పెరిగింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాల ప్రకారం– పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 8.96 శాతానికి చేరితే, గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు 7.55 శాతంగా ఉంది. అక్టోబర్‌లో దేశంలో నిరుద్యోగం రేటు 7.77 శాతం. పట్టణ ప్రాంతాల్లో ఇది 7.21 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 8.04 శాతంగా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా సెప్టెంబర్‌లో నిరుద్యోగిత రేటు 6.43 శాతంగా ఉంది. నవంబర్‌లో 30.6 శాతంతో హర్యానా నిరుద్యోగంలో మొదటి స్థానంలో నిలిచింది. తరువాతి స్థానంలో రాజస్తాన్ (24.5 శాతం), జమ్మూ,కశ్మీర్ (23.9 శాతం) బీహార్ (17.3 శాతం), త్రిపుర (14.5)లు ఉన్నాయి. అతి తక్కువ నిరుద్యోగం రేటు విషయంలో చత్తీస్‌గఢ్ (0.1 శాతం), ఉత్తరాఖండ్ (1.2 శాతం), ఒడిస్సా (1.6 శాతం), కర్ణాటక (1.8 శాతం), మేఘాలయ (2.1 శాతం)లు ఉన్నాయి. -
రెండంకెల స్థాయిలో ఇంధన విక్రయాల వృద్ధి
న్యూఢిల్లీ: పండుగల సీజన్లో కార్యకలాపాలు మరింత పుంజుకోవడం, వ్యవసాయ రంగంలో డిమాండ్ పెరగడంతో నవంబర్‌లో దేశీయంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు గణనీయంగా వృద్ధి చెందాయి. రెండంకెల స్థాయిలో పెరిగాయి. గతేడాది నవంబర్‌తో పోలిస్తే ఈసారి పెట్రోల్ అమ్మకాలు 11.7 శాతం పెరిగి 2.66 మిలియన్ టన్నులకు, డీజిల్ విక్రయాలు 27.6 శాతం వృద్ధి చెంది 7.32 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. కోవిడ్ కష్టకాలమైన 2020 నవంబర్‌తో పోలిస్తే పెట్రోల్ అమ్మకాలు 10.7 శాతం, కోవిడ్ పూర్వం 2019 నవంబర్‌తో పోలిస్తే 16.2 శాతం పెరిగాయి. అటు డీజిల్ విక్రయాలు 17.4 శాతం (2020 నవంబర్‌తో పోలిస్తే), 9.4 శాతం (2019 నవంబర్‌తో పోలిస్తే) పెరిగాయి. జూన్ నుండి పెట్రోల్, డీజిల్ అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. పంటల సీజన్ కావడంతో డీజిల్‌కు డిమాండ్ గణనీయంగా ఉంటోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సాగు నీటి పంపులు, ట్రక్కుల్లో ఇంధనాల వినియోగం ఎక్కువగా పెరిగిందని వివరించాయి. విమాన ప్రయాణాలు కూడా పుంజుకుంటూ ఉండటంతో విమాన ఇంధన (ఏటీఎఫ్) విక్రయాలు సైతం గత నవంబర్‌తో పోలిస్తే ఈసారి 21.5 శాతం పెరిగి 5,72,200 టన్నులకు చేరాయి. అయితే, కోవిడ్ పూర్వం నవంబర్ (2019)తో పోలిస్తే మాత్రం 13.3 శాతం తక్కువగా నమోదయ్యాయి. దేశీయంగా విమాన ప్రయాణాలు కోవిడ్ పూర్వ స్థాయులకు చేరినప్పటికీ కొన్ని దేశాల్లో ఇంకా ఆంక్షలు కొనసాగుతుండటంతో అంతర్జాతీయ ప్రయాణాల ట్రాఫిక్ కాస్త తక్కువగానే ఉంటోందని పరిశ్రమ వర్గాలు వివరించాయి. ఏటీఎఫ్ ధర తగ్గింపు .. అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు తగ్గడంతో ప్రభుత్వ రంగ చమురు రిటైల్ కంపెనీలు ఏటీఎఫ్ రేటును గురువారం 2.3 శాతం తగ్గించాయి. అయితే, పెట్రోల్, డీజిల్ రేట్లను మాత్రం వరుసగా ఎనిమిదో నెలా సవరించకుండా, యథాతధంగా ఉంచాయి. తాజా తగ్గింపుతో ఏటీఎఫ్ రేటు ఢిల్లీలో కిలోలీటరుకు రూ. 2,775 తగ్గి రూ. 1,17,588కి చేరింది. గత నెల కూడా ఆయిల్ కంపెనీలు విమాన ఇంధనం రేటును 4.19 శాతం (రూ. 4,842) తగ్గించాయి. విమానయాన కంపెనీల నిర్వహణ వ్యయా ల్లో 40 శాతం వాటా ఇంధనానిదే ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజా తగ్గింపులు వాటికి కొంత ఊరటనివ్వనున్నాయి. ఏటీఎఫ్ రేటును ఆయిల్ కంపెనీ లు ప్రతి నెలా 1వ తారీఖున సమీక్షిస్తాయి. పెట్రో ల్, డీజిల్ రేట్లను అవి ఏప్రిల్ 6 నుండి సవరించలేదు. విండ్‌ఫాల్ లాభాలపై పన్ను సగానికి తగ్గింపు డీజిల్ ఎగుమతుల లెవీపై ఊరట అంతర్జాతీయంగా రేట్ల అనూహ్య పెరుగుదలతో, దేశీ చమురు ఉత్పత్తి దారులకు వచ్చే భారీ లాభాలపై (విండ్‌ఫాల్ ట్యాక్స్) పన్నును కేంద్ర ప్రభుత్వం సగానికి తగ్గించింది. అలాగే, డీజిల్ ఎగుమతులపైనా లెవీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఓఎన్జీసీ తదితర సంస్థలు ఉత్పత్తి చేసే టన్ను చమురుపై ప్రస్తుతం రూ.10,200గా ఉన్న పన్నును రూ.4,900కు తగ్గించింది. లీటర్ డీజిల్ ఎగుమతిపై లెవీని 10.5 నుంచి 8కి తగ్గించింది. ఏటీఎఫ్‌పై అదనపు ఎక్సైజ్ డ్యూటీ లీటర్‌కు రూ.5గా కొనసాగనుంది. మొదట పెట్రోల్ ఎగుమతులైనా కేంద్రం లెవీ విధించగా, తర్వాత దాన్ని ఎత్తివేయడం గమనార్హం. ఉక్రెయిన్‌పై రష్యా యు ద్ధం తర్వాత అంతర్జాతీయంగా చమురు ఉత్పత్తి, సరఫరా తగ్గిపోయి, ధరలు గణనీయంగా పెరిగిపోవడం తెలిసిందే. ఈ పరిణా మం దేశీ చమురు ఉత్పత్తి కంపెనీలకు అనూహ్య లాభాలు వచ్చేందుకు దారితీసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం విండ్‌ఫాల్ పన్నును ప్రవేశపెట్టడం తెలిసిందే. -
మైక్రో ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది..అత్యంత చౌక ధరలో
సాక్షి, ముంబై: భారతదేశపు అత్యంత చౌక ఎలక్ట్రిక్ కార్ ఈ నెలలోనే లాంచ్ కానుంది. పీఎంవీ ఎలక్ట్రిక్ సంస్థకు చెందిన మైక్రో ఎలక్ట్రిక్ వెహికిల్ పీఎంవీ ఎలక్ట్రిక్ ఈఏఎస్-ఈ కారు నవంబరు 16న విడుదల కానుంది. దీని ధర రూ. 4లక్షలు- 5 లక్షల మధ్యలో ఉండే అవకాశం ఉంది. ముంబై ఆధారిత పీఎంవీ ఎలక్ట్రిక్ సంస్థ (పర్సనల్ మొబిలిటీ వెహికిల్) ఇండియాలో తన తొలి ఫ్లాగ్షిప్ స్మార్ట్ మైక్రోకార్ EaS-Eని ఆవిష్కరించనుంది. EaS-E ఎలక్ట్రిక్ కార్ స్పెసిఫికేషన్ అంచనాలు కొత్త మినీ ఎలక్ట్రిక్ కారు మూడు వేరియంట్లలో లభించనుంది. ప్యాషనేట్ రెడ్, ఫంకీ ఎల్లో, డీప్ గ్రీన్, రూస్టిక్ చార్కోల్, స్పార్కిల్ సిల్వర్, బ్రిలియంట్ వైట్, రాయల్ లేత గోధుమరంగు, మెజెస్టిక్ బ్లూ, వింటేజ్ బ్రౌన్, పెప్పీ ఆరెంజ్, ప్యూర్ బ్లాక్ రంగుల్లో లభ్యం. పీఎంవీ ఎలక్ట్రిక్ సంస్థ ఫౌండర్ కల్పిత్ పటేల్ సమచారం ప్రకారం ఈ వెహికల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120-200 కి.మీ పయనిస్తుంది. నాలుగు గంటల్లోనే పూర్తిగా ఛార్జ్ అవుతంది. ఇందుకోసం 3కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్‌ని ఆఫర్ చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. పీఎంవీ ఎలక్ట్రిక్ ఈఏఎస్-ఈలో డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, ఏసీ, రిమోట్ కీలెస్ ఎంట్రీ, రిమోట్ పార్క్ అసిస్ట్, క్రూజ్ కంట్రోల్, సీట్ బెల్ట్స్ వంటివి ఉన్నాయి. ఇంకా మైక్రో ఎలక్ట్రిక్ కారు 550కేజీల బరువుతో పొడవు 2,915ఎంఎం, విడ్త్ 1,157ఎంఎం, హైట్ 1,600 ఎంఎంగానూ, వీల్‌బేస్ 2,087ఎంఎంగా, గ్రౌండ్ క్లియరెన్స్ 170ఎంఎంగా ఉంటుందట. -
క్యాన్సర్‌ను గుర్తించడం ఎలా?
గుంటూరు మెడికల్: పూర్వం రాచపుండుగా పిలువబడే క్యాన్సర్ వ్యాధి వస్తే మరణమే శరణ్యం అనే పరిస్థితులు ఉండేవి. అయితే ప్రస్తుతం ఆధునిక వైద్య విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందటంతో క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేస్తున్నారు. ప్రజల్లో వ్యాధిపై అవగాహన కలి్పంచేందుకు 2014లో నాటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ జాతీయ క్యాన్సర్ అవగాహన దినం ప్రకటించారు. క్యాన్సర్ చికిత్సలో కీలకమైన రేడియంను పోలాండ్ దేశానికి చెందిన మేడం క్యూరీ కనిపెట్టారు. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా న్యూక్లియర్ ఎనర్జీ, రేడియోథెరపీ క్యాన్సర్ వైద్య సేవలను ఆమె వృద్ధి చేశారు. ఆమె పుట్టన రోజు నవంబర్ 7. దీంతో ప్రతి ఏడాది నవంబర్ 7న నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డేను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. క్యాన్సర్‌ను గుర్తించడం ఎలా? మానకుండా ఉండే పుండు, శరీరంలోని ఏ భాగంలోనైనా ఎదుగుతున్న గడ్డ, ఎదుగుతున్న కణుతులు, అసహజమైన రక్తస్రావం, పెరుగుతున్న పుట్టుమచ్చలు, పులిపిరి కాయలు, మింగడం కష్టంగా ఉండటం, గొంతు బొంగురుపోయి తగ్గకుండా ఉండటం, చాలా రోజులుగా ఉన్న అజీర్ణ వ్యాధి తదితర లక్షణాలు ఉంటే తక్షణమే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్ కారకాలు.. సిగరెట్ పొగలో 400 రకాల హానికారక రసాయనాలు ఉంటాయి. వీటి ద్వారా నోటి క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్లు వస్తాయి. గుట్కా, పాన్‌పరాగ్ వల్ల నోటి క్యాన్సర్, ప్రేగు సంబంధిత క్యాన్సర్లు వస్తాయి. మసాలాలు, వేపుళ్లు, నిల్వ ఉన్న పచ్చళ్లు, బేకరీ పదార్థాలు ఎక్కువగా తింటే నోటి క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్లు వస్తాయి. ఊబకాయుల్లో మూత్రాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్, పాంక్రియాటిక్ క్యాన్సర్లు వస్తాయి. పారిశ్రామిక వ్యర్థాలు, ఫ్యాక్టరీలు వదిలే పొగలవల్ల క్యాన్సర్ రిస్క్ 3 నుంచి 4 శాతం ఉంటుంది. క్యాన్సర్ రాకుండా.. తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. వీటిల్లో క్యాన్సర్ కారకాలతో పోరాడే యాంటిజెంట్స్ ఉంటాయి. మాంసాహారం తీసుకునేవారు తప్పనిసరిగా వెజిటబుల్ లేదా ఫ్రూట్ సలాడ్ తినాలి. దీనివల్ల మాంసాహారంలో ఉండే క్యాన్సర్ కణాలతో సలాడ్‌లోని యాంటీజెంట్స్ పోరాడతాయి. కొవ్వుశాతం తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. భోజనంతో తాజా పండును ప్రతి రోజూ తీసుకోవాలి. ప్రతి రోజూ కనీసం అరగంట సేపు శారీరక వ్యాయామం చేయాలి. స్మోకింగ్, మద్యం, పాన్, గుట్కా లాంటి దురలవాట్లకు దూరండా ఉండాలి. జిల్లాలో బాధితులు.. నాన్‌కమ్యూనకబుల్ డిసీజ్ ప్రోగ్రామ్‌లో మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించగా జిల్లాలో 2,54,636 మంది రొమ్ముక్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. జిల్లాలో 40 మంది క్యాన్సర్ వైద్య నిపుణులు ఉండగా ప్రతి రోజూ వీరి వద్ద 20 నుంచి 30 మంది వరకు వైద్య సేవలు పొందుతున్నారు. అందుబాటులో ఆధునిక వైద్యం క్యాన్సర్‌ను నయం చేసే ఆధునిక వైద్య పద్ధతులు నేడు అందుబాటులో ఉన్నాయి. ముందస్తుగా వ్యాక్సిన్లు వేయించుకోవడం ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చు. వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నవారు (హైరిస్క్) ముందస్తుగా పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది. లిక్విడ్ బయాప్సీ, పెట్‌స్కాన్, ఇమ్యునోహిస్టోకెమిస్ట్రి వంటి అత్యాధునిక వైద్య పద్ధతుల ద్వారా అతి తక్కువ సమయంలో, ప్రాథమిక స్థాయిలోనే పలు రకాల క్యాన్సర్లను గుర్తించి నివారించవచ్చు. డాక్టర్ ఎంజీ నాగకిషోర్, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, గుంటూరు -
మారుతీ కార్లపై అదిరిపోయే ఆఫర్స్!
సాక్షి, ముంబై: దేశీయ కార్ల తయారీ సంస్థలుపలు వాహనాలపై ఫెస్టివ్ సీజన్ ముగిసిన తరువాత కూడా డిస్కౌంట్ ధరలను ప్రకటిస్తున్నాయి. తద్వారా ఫెస్టివ్ జోష్‌ను కొనసాగించి, తక్కువ ధరలతో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో హోండా ఇప్పటికే తగ్గింపు ధరలను ప్రకటించగా, తాజాగా ఈ కోవలో మారుతి సుజుకి చేరింది. నవంబర్ నెలలో నెక్సా లైనప్‌లో మారుతీ సుజుకి బాలెనో, ఇగ్నిస్, వ్యాగన్-ఆర్ లాంటి పలు మోడళ్ల కార్ల కొనుగోలుపై రూ. 50వేల వరకు తగ్గింపును అందిస్తోంది. ఆల్టో కే10: పాపులర్ మోడల్ ఆల్టో కే10పై అత్యధికంగా రూ. 50వేల వరకు తగ్గింపు లభించనుంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ తదితరాలు ఉన్నాయి. మారుతీ సుజుకి సియాజ్: మిడ్‌సైజ్ సెడాన్ సియాజ్ అన్ని మాన్యువల్ వేరియంట్లపై రూ. 40వేల దాకా, అన్ని ఆటోమేటిక్ వేరియంట్లపై రూ. 30,000 వరకు ప్రయోజనాలతో పొందవచ్చు. ఆల్టో 800: ఆల్టో 800 పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లపై రూ. 15వేల వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతోపాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 15వేలు , 4 వేల రూపాయల కార్పొరేట్ డిస్కౌంట్ ప్రకటించింది. సెలేరియో: సెలేరియో బేసిక్ మేన్యువల్ వేరియంట్, సీఎన్జీ వేరియంట్‌పై క్యాష్ డిస్కౌంట్ రూ. 20,000గా ఉంది. వీ, జెడ్, జెడ్ ప్లస్ వేరియంట్లపై 25వేల దాకా తగ్గింపును అందిస్తోంది. మిగిలిన సమాచారంకోసం మారుతి సుజరుకి డీలర్ల వద్దగానీ, వెబ్సైట్లో గానీ చూడవచ్చు. -
పలు మోడళ్ల హోండా కార్లపై భారీ తగ్గింపు
న్యూఢిల్లీ: పలు మోడళ్ల హోండా కార్లపై భారీ తగ్గింపు లభిస్తోంది. హోండా సిటీ, జాజ్, WR-V లాంటి మోడల్స్ రూ. 63,000 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. నవంబరు నెలకు సంబంధించిన ఈ డీల్స్ కస్టమర్లు తమకు సమీపంలో ఉన్న డీలర్‌షిప్‌ను సంప్రదించడం ద్వారా మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దేశంలో ఐదు విభిన్న హోండా మోడల్‌లు అందుబాటులో ఉన్నాయి: అమేజ్, సిటీ (5వ తరం), సిటీ (4వ తరం), జాజ్ , WR-బలతో సహా ఐదు విభిన్న మోడళ్లను అందిస్తుంది. హోండా డబ్యుఆర్-వీ డబ్యుఆర్-వీ కి అతిపెద్ద తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 30,000 నగదు తగ్గింపు లేదా రూ. 36,144 విలువైన ఉచిత యాక్సెసరీలున్నాయి. అలాగే రూ. 7,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5,000 లాయల్టీ బోనస్‌లు తదితరాలు ఉన్నాయి. హోండా అమేజ్ సబ్-కాంపాక్ట్ సెడాన్ హోండా అమేజ్ కొనుగోలుపై కస్టమర్లు రూ. 10,000 నగదు, లేదా రూ. 11,896 విలువైన ఉచిత యాక్సెసరీలను పొంద వచ్చు, అదనంగా రూ. 5,000 లాయల్టీ ఇన్సెంటివ్, రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు లభ్యం. హోండా జాజ్: త్వరలోనే ఉత్పత్తిని నిలిపివేయాలని భావిస్తున్న హోండా జాజ్‌పై 25 వేల తగ్గింపు లభ్యం. హోండా సిటీ (5వ జనరేషన్ : హోండా సిటీ మాన్యువల్‌పై రూ. 59,292 మొత్తం తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 30వేల నగదు తగ్గింపు లేదా రూ. 32,292 విలువైన ఉచిత యాక్సెసరీలు, ఇంకా ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బోనస్, కార్పొరేట్ తగ్గింపును కూడా అందిస్తోంది. -
Epilepsy: దేహం రంగు మారిందో ప్రాణాపాయం తప్పదు
సాక్షి, గుంటూరు: ఫిట్స్ వ్యాధికి వైద్యం లేదనే అపోహకు కాలం చెల్లింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 50 మిలియన్ల ప్రజలు మూర్చవ్యాధితో (ఎపిలెప్సి) బాధపడుతున్నారు. వీరిలో 80 శాతం బాధితులు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నారు. మన దేశంలో 10 మిలియన్ల మంది వ్యాధితో బాధపడుతున్నారు. ప్రజలకు ఫిట్స్ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఎపిలెప్సి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2009 నుంచి నవంబర్ నెలను జాతీయ ఎపిలెప్సీ అవగాహన మాసంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి ’ అందిస్తున్న ప్రత్యేక కథనం. మూర్చ అంటే (ఫిట్స్).. మెదడులో ఉన్న న్యూరాన్లలో విద్యుత్ ఆవేశం ఎక్కువైనప్పుడు బయట కనిపించే లక్షణాలనే ఫిట్స్ లేదా మూర్చ అంటారు. ఇది వచ్చినప్పుడు కాళ్లు, చేతులు కొట్టుకుని పడిపోతారు. ఫిట్స్ వచ్చినప్పుడు కొంత మందికి నాలుక కొరుక్కోవడం, నోటి నుంచి నురగ రావడం గమనించవచ్చు. ఫిట్స్ ఎక్కువ సమయం ఉండే మనిషి దేహం నీలంరంగుగా మారి ప్రాణాపాయ స్థితికి చేరుకోవచ్చు. కారణాలు.. మెదడులో వచ్చే ఇన్ఫెక్షన్లు, గడ్డలు, తలకు గాయాలు, బ్రెయిన్ స్ట్రోక్స్, మెదడులో రక్తనాళాలు ఉబ్బడం, పుట్టుకతో వచ్చే జన్యుపరమైన సమస్యల వల్ల ఫిట్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. పిల్లలు, పెద్దవాళ్లలో అందరిలోనూ ఈ మూర్ఛ వ్యాధి వస్తుంది. గొంతు, చెవిలో వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల చిన్నారుల్లో వచ్చే అవకాశం ఉంది. స్త్రీలు ప్రసవ సమయంలో కొన్ని రకాల చికిత్స విధానాలు పాటించకపోవడం వల్ల, టీబీ, హెచ్ఐవీ, మెదడువాపు జబ్బుల వల్ల, వైరస్లు, బ్యాక్టీరియా, ఫంగస్ల వల్ల ఫిట్స్ కేసులు దేశంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. జిల్లాలో బాధితులు.. గుంటూరు జీజీహెచ్‌లో ప్రతి శనివారం మూర్చవ్యాధి బాధితుల కోసం ప్రత్యేక ఓపీ ఏర్పాటు చేశారు. ప్రతి వారం 150 మంది ఓపీ విభాగానికి వైద్యం కోసం వస్తున్నారు. జిల్లాలో సుమారు 90 మంది న్యూరాలజిస్టులు, న్యూరోసర్జన్లు , ఫిజీషియన్ల వద్ద ప్రతి రోజూ ఒక్కొక్కరి వద్ద ఐదు నుంచి పది మంది వరకు ఫిట్స్ సమస్యతో చికిత్స పొందుతున్నారు. -
చిన్న సినిమాలతో పోటీ పడుతున్న సమంత
-
ఖాతాదారులకు అలెర్ట్, నవంబర్‌లో బ్యాంకు సెలవుల జాబితా ఇదే
ఆర్బీఐ ప్రతినెల బ్యాంక్ హాలిడేస్‌ను ప్రకటిస్తుంది. నవంబర్ నెలలో సైతం బ్యాంక్‌లకు ఎన్ని రోజులు సెలవులనే అంశంపై స్పష్టత ఇచ్చింది. నవంబర్ నెలలో గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ, కనకదాస్ జయంతి, వంగ్లా ఫెస్టివల్, కన్నడ రాజ్యోత్సవం, కుట్ ఫెస్టివల్, సెంగ్ కుత్సానేం వంటి పండుగలు ఉన్నాయి. ఈ పండుగల సందర్భంగా ఆయా రాష్ట్రాల్ని బట్టి బ్యాంకు హాలిడేస్‌ను ఇస్తుంటాయి. కాబట్టి హాలిడేస్‌ను ముందుగానే గుర్తించి మిగిలిన రోజుల్లో బ్యాంకుల్లో ఏదైనా పనులు ఉంటే చక్కబెట్టుకోవాలని ఆర్బీఐ సూచించింది. ఆర్బీఐ ప్రకటించిన బ్యాంక్ సెలవులు ఇలా ఉన్నాయి. నవంబర్ 1 : కన్నడ రాజ్యోత్సవ (కర్నాటక) నవంబర్ 6 : ఆదివారం నవంబర్ 8 : గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ, రహాస్ పూర్ణిమ నవంబర్ 11 : కనకదాస్ జయంతి,వంగలా ఫెస్టివల్ నవంబర్ 12 : రెండో శనివారం నవంబర్ 13 : ఆదివారం నవంబర్ 20 : ఆదివారం నవంబర్ 23 : సెంగ్ కుత్సానేం బెంగళూరు, షిల్లాంగ్‌లలో బ్యాంకులు మూసివేయబడతాయి . నవంబర్ 26 : నాలుగో శనివారం నవంబర్ 27 : ఆదివారం -
స్పైస్‌జెట్ దీపావళి కానుక: వారికి నెలకు రూ.7 లక్షల జీతం
సాక్షి, ముంబై: విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తన పైలట్లకు గుడ్ న్యూస్ చెప్పింది. నవంబరు 1 నుంచి వర్తించేలా జీతాలపెంపును ప్రకటించింది. తద్వారా స్పైస్‌జెట్ వారికిదీపావళి కానుక అందించింది. స్పైస్‌జెట్ కెప్టెన్లకు 80 గంటల విమాన ప్రయాణానికి నెలవారీ వేతనం 7 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపింది. ఈపెంపు నవంబర్ 1, 2022 నుండి వర్తిస్తుందని తెలిపింది. ట్రైనర్స్, సీనియర్ ఫస్ట్ ఆఫీసర్ల వేతనాలను కూడా తగిన విధంగా పెంచినట్లు స్పైస్‌జెట్ పేర్కొంది. నెలవారీ ప్రాతిపదికన పైలట్ వేతనాలను సవరించినట్టు తెలిపింది. అక్టోబర్‌లో కెప్టెన్లు , ఫస్ట్ ఆఫీసర్ల జీతం 22 శాతం పెంచింది. ఆగస్టుతో పోలిస్తే, సెప్టెంబర్ జీతంలో శిక్షకులకు 10 శాతం, కెప్టెన్లు, ఫస్ట్ ఆఫీసర్ల వేతనం 8 శాతం వరకు పెంచిన సంగతి తెలిసిందే. -
ఫారిన్ టూర్లో మహేశ్.. తివిక్రమ్ సినిమా షూటింగ్ అప్పుడేనా?
‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత దాదాపు పన్నెండేళ్ల అనంతరం హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ కొత్త సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ ముగిసింది. ఈ షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే ఈ నెల 9న ఆరంభం కావాల్సిన ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ వాయిదా పడింది. అనుకోకుండా మహేశ్‌బాబు తల్లి ఇందిరా దేవి మృతి చెందడంతో ఈ సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కాగా నవంబరు మొదటివారంలో ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను ఆరంభించాలనుకుంటున్నారట. గత వారం ఓ యాడ్ షూట్లో పాల్గొన్న మహేశ్‌బాబు ప్రస్తుతం ఫారిన్ టూర్లో ఉన్నారు. మహేశ్ తిరిగి హైదరాబాద్‌కు రాగానే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ సెకండ్ షెడ్యూల్లో మహేశ్, పూజాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల కానుంది. -
కేంద్రం సూచనలతో.. కంటోన్మెంట్లో టోల్‌ట్యాక్స్ రద్దు
సాక్షి, హైదరాబాద్: కంటోన్మెంట్లో టోల్ ట్యాక్స్ త్వరలోనే ముగియనుంది. కేంద్రం సూచనలతో టోల్ ట్యాక్స్ రద్దుకు కంటోన్మెంట్ బోర్డు తీర్మానం చేసింది. టోల్‌ట్యాక్స్ రద్దుతో కంటోన్మెంట్ బోర్డు రూ.10 కోట్ల వార్షిక బడ్జెట్‌ను కోల్పోనుంది. అదే సమయంలో కంటోన్మెంట్ గుండా ప్రయాణం సాగించే కమర్షియల్ వాహనదారులకు భారీ ఊరట లభించనుంది. అయితే టోల్‌ట్యాక్స్ రద్దుతో తాము కోల్పోయే ఆదాయాన్ని ప్రత్యామ్నాయ మార్గంలో భర్తీ చేయాల్సిందిగా బోర్డు కేంద్రానికి ప్రతిపాదనలు పంపనుంది. పెండింగ్ సర్వీసు చార్జీల విడుదల, గ్రాంట్ ఇన్ ఎయిడ్‌లకు తోడుగా టోల్‌ట్యాక్స్ నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరనున్నారు. బోర్డు అధ్యక్షుడు, బ్రిగేడియర్ సోమశంకర్ ఆధ్వర్యంలో జరిగిన బోర్డు సమావేశంలో సీఈఓ అజిత్ రెడ్డి, సివిలియన్ నామినేటెడ్ మెంబర్ రామకృష్ణలతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్యే సాయన్న, డిప్యూటీ సీఈఓ విజయ్ కుమార్ బాలన్ నాయర్లు పాల్గొన్నారు. ఆదాయ మార్గాలపై ఆసక్తికర చర్చ.. ఇప్పటికే ఆర్థిక లేమితో సతమతం అవుతున్న బోర్డు టోల్ట్యాక్స్ను సైతం రద్దు చేస్తే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బోర్డు సభ్యుడు రామకృష్ణ ప్రతిపాదించారు. ఆరేళ్ల క్రితమే ఆక్ట్రాయ్‌ను రద్దు చేయగా, సంబంధిత పరిహారాన్ని జీఎస్టీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. కొన్ని రాష్ట్రాల్లో గతంలోనే టోల్ట్యాక్స్ను రద్దుచేయడంతో సంబంధిత రాష్ట్రాలే నష్టపరిహారాన్ని చెల్లించాయని గుర్తు చేశారు. ఈ మేరకు ఏయే రాష్ట్రాలు కంటోన్మెంట్లకు నష్టపరిహారాన్ని ఇస్తున్నాయో వెల్లడించాలని ఎమ్మెల్యే సాయన్న కోరగా, అధ్యక్షుడు స్పష్టమైన సమాచారం తమ వద్ద లేదన్నారు. ఆర్మీ సర్వీసు చార్జీలను సక్రమంగా చెల్లిస్తే బోర్డు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని సాయన్న ప్రతిపాదించారు. నష్టపరిహారం చెల్లిస్తేనే టోల్‌ట్యాక్స్ రద్దు చేస్తామంటూ నెల రోజుల క్రితం బోర్డు తీర్మానం చేసి పంపినప్పటికీ, కేంద్రం మరోసారి సూచించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాల్సిందేనని అధ్యక్షుడు సోమశంకర్ అభిప్రాయపడ్డారు. సీఈఓ అజిత్ రెడ్డి సైతం ఇదే అభిప్రాయంతో ఏకీభవించగా, సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కూడా ఆమోదం తెలిపారు. టోల్ ట్యాక్స్ వసూళ్లను నిలిపివేతకు అంగీకారం తెలుపుతూనే నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరదాం అని తీర్మానించారు. ప్రస్తుతం కొనసాగుతున్న వసూళ్లకు అక్టోబర్ 31 వరకు గడువు ఉండటంతో, అప్పటి వరకు వసూళ్లు యధావిధిగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. టెండర్‌కు ఆమోదం టోల్‌ట్యాక్స్ వసూళ్ల నిలిపివేతకు బోర్డు తీర్మానం తీసుకున్న సమావేశంలోనే మరుసటి ఏడాది టెండర్లకు సంబంధించి, గతంలోనే జారీ చేసిన సర్క్యులర్ ఎజెండాకు బోర్డు ఆమోదం తెలపడం గమనార్హం. బోర్డు తాజా నిర్ణయంతో ఆ టెండర్ల ప్రక్రియపై ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో వెల్లడించలేదు. -
దేశంలో తగ్గిన చమురు ఉత్పత్తులు
న్యూఢిల్లీ: దేశీయంగా ముడి చమురు ఉత్పత్తి అంతకంతకూ తగ్గుతోంది. నవంబర్‌లో 2 శాతం క్షీణించింది. అధికారిక గణాంకాల ప్రకారం క్రూడాయిల్ ఉత్పత్తి గతేడాది నవంబర్‌లో 2.48 మిలియన్ టన్నులుగా ఉండగా, ఈ ఏడాది నవంబర్‌లో 2.43 టన్నులకు పరిమితమైంది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఇది 2.5 మిలియన్ టన్నులుగా నమోదైంది. పరికరాలు, యంత్రాలను సమకూర్చుకోవడంలో జాప్యం కారణంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ఉత్పత్తి 3 శాతం తగ్గి 1.6 మిలియన్ టన్నులకు పరిమితమైంది. ఆయిల్ ఇండియా ఉత్పత్తి 2,43,200 టన్నుల నుంచి 2,41,420 టన్నులకు పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో (ఏప్రిల్–నవంబర్ మధ్య) దేశీయంగా క్రూడాయిల్ ఉత్పత్తి 2.74 శాతం క్షీణించి 19.86 మిలియన్ టన్నులుగా నమోదైంది. దేశీయంగా ఇంధన అవసరాల కోసం భారత్ ఏటా 85 శాతం మేర క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. మరోవైపు, కోవిడ్ దెబ్బతో కుదేలైన ఎకానమీ క్రమంగా పుంజుకుంటూ ఉండటంతో ఇంధన వినియోగం పెరిగి, రిఫైనరీల్లో ప్రాసెసింగ్ సైతం గణనీయంగా మెరుగుపడింది. రిఫైనరీలు .. నవంబర్‌లో 21.48 మిలియన్ టన్నుల క్రూడాయిల్ (గత నవంబర్‌తో పోలిస్తే 3.38 శాతం అధికం) ప్రాసెస్ చేశాయి. ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో ఇది 11.7% వృద్ధి చెంది 155.73 మిలియన్ టన్నులుగానమోదైంది. | గ్యాస్ 23 శాతం అప్.. నవంబర్‌లో సహజ వాయువు (నేచురల్ గ్యాస్) ఉత్పత్తి 23 శాతం పెరిగి 2.86 బిలియన్ ఘనపు మీటర్లుగా (బీసీఎం) నమోదైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీ ఆధ్వర్యంలోని కేజీ–డీ6 బ్లాకులో కొత్త క్షేత్రాలు అందుబాటులోకి రావడం ఇందుకు దోహదపడింది. కేజీ–డీ6 నుంచి ఉత్పత్తి 1,251 శాతం ఎగిసి 581.36 బీసీఎంకి చేరగా, ఓఎన్జీసీ క్షేత్రాల్లో మాత్రం 5.28 శాతం క్షీణించి 1.72 బీసీఎంకి తగ్గింది. ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో గ్యాస్ ఉత్పత్తి 21.78 శాతం పెరిగి 22.77 బీసీఎంకి చేరింది. చదవండి: Oil Price: సామాన్యులకు ఊరట.. దిగిరానున్న వంట నూనె ధరలు! -
నవంబర్‌లో ఊపందుకున్న రిటైల్ విక్రయాలు
న్యూఢిల్లీ: రిటైల్ అమ్మకాలు ఈ ఏడాది నవంబర్‌లో మెరుగైన వృద్ధిని చూపించాయి. కరోనా ముందు నాటి సంవత్సరం 2019 నవంబర్ నెలలోని గణంకాలతో పోలిస్తే 9 శాతం పెరిగినట్టు రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (రాయ్) ప్రకటించింది. ఒకవేళ 2020 నవంబర్ నెల విక్రయాలతో పోల్చి చూస్తే వృద్ధి 16 శాతంగా ఉన్నట్టు తెలిపింది. పశ్చిమ భారతంలో 11 శాతంగా ఉంటే, తూర్పు, దక్షిణాదిన 9 శాతం చొప్పున, ఉత్తరాదిన 6 శాతం మేర అమ్మకాల్లో వృద్ధి నమోదైనట్టు వివరించింది. వ్యాపార వాతావరణం మెరుగైందని.. ఇది నిలదొక్కుకుంటుందని భావిస్తున్నట్టు రాయ్ సీఈవో కుమార్ రాజగోపాలన్ పేర్కొన్నారు. అయితే ఒమిక్రాన్, కరోనా మూడో దశకు సంబంధించి ఆందోళనలు అయితే ఉన్నాయన్నారు. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల విక్రయాలు నవంబర్‌లో 32 శాతం వృద్ధిని చూపించినట్టు రాయ్ తెలిపింది. క్రీడా ఉత్పత్తులు 18 శాతం అధిక అమ్మకాలను నమోదు చేసినట్టు పేర్కొంది. అలాగే, ఆహారం, గ్రోసరీ, క్విక్ సర్వీస్ రెస్టారెంట్ల విభాగంలోనూ వృద్ధి నమోదు కాగా.. పాదరక్షలు, సౌందర్య, విలాస ఉత్పత్తులు, ఫర్నిచర్ విభాగాలు కోలుకుంట్నుట్టు వివరించింది. -
ఈ ఏడాది రెట్టింపైన వాణిజ్యలోటు
న్యూఢిల్లీ: భారత్ నవంబర్ ఎగుమతి–దిగుమతుల తాజా గణాంకాలు వెలువడ్డాయి. 2020 ఇదే నెలతో పోల్చితే ఎగుమతులు 27.16 శాతం పెరిగి 30.04 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక దిగుమతుల విలువ ఇదే నెల్లో 56.58 శాతం పెరిగి 52.94 బిలయన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి రెండింటిమధ్య వాణిజ్యలోటు 22.91 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది నవంబర్ వాణిజ్యలోటు 10.19 బిలియన్ డాలర్లతో పోల్చితే ఇది రెట్టింపు. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ తాజా ప్రకటనలో ముఖ్యాంశాలు.. ఎగుమతుల తీరిది... - నవంబర్‌లో పెట్రోలియం ప్రొడక్టులు, ఇంజనీరింగ్ గూడ్స్, ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. - వార్షిక ప్రాతిపదికన పెట్రోలియం ప్రొడక్ట్స్ 154.22 శాతం పెరిగి 3.95 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులు 37 శాతం పెరిగి 8 బిలియన్ డాలర్లకు చేరాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతులు 30 శాతం పెరిగి 1.12 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆర్గానిక్– ఆర్గానిక్యేతర రసాయన ఎగుమతుల విలువ 32.54 శాతం పెరిగి 2.24 బిలియన్ డాలర్లకు చేరాయి. - సేవల ఎగుమతులు 16.88 శాతం పెరిగి 20.33 బిలియన్ డాలర్లకు చేరాయి. వస్తువులు, సేవలు కలిపితే ఎగుమతుల విలువ 22.80 శాతం ఎగసి 50.36 బిలియన్ డాలర్లకు పెరిగింది. దిగుమతుల వరుస... - దిగుమతుల విషయానికి వస్తే.. పసిడి విలువ 40 శాతం పెరిగి 4.22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. - బొగ్గు,కోక్, బ్రికెట్లు 135.81 శాతం పెరిగి 3.57 బిలియన్ డాలర్లకు చేరాయి. - పెట్రోలియం, క్రూడ్, సంబంధిత ఉత్పత్తుల దిగుమతులు 132.43 శాతం పెరిగి 14.67 బిలియన్ డాలర్లకు ఎగశాయి. - వెజిటబుల్ ఆయిల్స్ దిగుమతులు 78.82 శాతం పెరిగి 1.75 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ఆర్థిక సంవత్సరంలో ఇలా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య ఎగుమతులు 51.34 శాతం పెరిగి 263.57 బిలియన్ డాలర్లుగా నమోదుకాగా, దిగుమతులు ఇదే కాలంలో 74.84 శాతం పెరిగి 384.34 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి వాణిజ్యలోటు 120.76 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 45.66 బిలియన్ డాలర్లు. 2022 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా నిర్దేశించుకున్న 400 బిలియన్ డాలర్ల ఎగుమతులను దేశం సాధించగలదన్న విశ్వాసాన్ని ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డుకు ఎంపికైన ఆసీస్ స్టార్ ఓపెనర్
దుబాయ్: ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ నవంబరు నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా ఎంపికయ్యాడు. నవంబర్ నెలలో జరిగిన టీ20 ప్రపంచకప్-2021లో అద్భుత ప్రదర్శనకు గాను అతన్ని ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించినట్లు ఐసీసీ పేర్కొంది. వార్నర్.. పాకిస్థాన్ ఓపెనర్ ఆబిద్ అలీ, న్యూజిలాండ్ సీమర్ టిమ్ సౌథీలను వెనక్కినెట్టి ఈ అవార్డును కైవసం చేసుకున్నట్లు ఐసీసీ సోమవారం ప్రకటించింది. కాగా, వార్నర్ పొట్టి ప్రపంచకప్-2021లో రెండు హాఫ్ సెంచరీలతో చెలరేగిపోవడంతో ఆసీస్ తొలిసారి పొట్టి ప్రపంచకప్‌ను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆ మెగా టోర్నీలో అతను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. మరోవైపు, నవంబర్ నెల మహిళల ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ హేలీ మ్యాథ్యూస్ ఎంపికైంది. గత నెలలో జరిగిన వన్డేల్లో మాథ్యూస్ ఆల్‌రౌండ్ ప్రదర్శన(4 మ్యాచ్‌ల్లో 141 పరుగులు, 9 వికెట్లు)తో అదరగొట్టడంతో ఆమెను ఈ అవార్డు వరించింది. మాథ్యూస్.. ఈ అవార్డుకు ఎంపికయ్యే క్రమంలో పాక్ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆనం అమిన్, బంగ్లాదేశ్‌కు చెందిన నహీదా అక్తర్లను వెనక్కి నెట్టింది. చదవండి: మూడు రోజుల క్వారంటైన్లో టీమిండియా.. డుమ్మా కొట్టిన కోహ్లి..! -
మరీఘోరంగా టూ వీలర్స్ అమ్మకాలు
November 2021 Record Lowest wholesales In automobile industry Due To Chip Shortage: ఆటోమొబైల్ రంగంలో మునుపెన్నడూ లేనంత తీవ్ర ప్రతికూల పరిస్థితులు నడుస్తున్నాయి ఇప్పుడు. దాదాపు పదకొండేళ్ల తర్వాత ఒక నెలలో ద్విచక్ర వాహనాలు రికార్డు స్థాయిలో తక్కువగా అమ్ముడుపోవడం విశేషం. అంతేకాదు దాదాపు ఏడేళ్ల తర్వాత ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాల్లోనూ ఇదే ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది. 2021 నవంబర్ నెల ఆటోమొబైల్ రంగానికి అచ్చి రాలేదు. ఓవైపు పండుగ సీజన్ కొనసాగినా.. ఊహించినంత వాహన అమ్మకాలు లేకపోవడం విశేషం. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చురర్స్ (SIAM) నివేదికల ప్రకారం నవంబర్ నెలలో.. ప్యాసింజర్ వెహికిల్ అమ్మకాల మొత్తం 18.6 శాతం పడిపోయింది. అదే విధంగా టూ వీలర్స్ ఏకంగా 34 శాతం తగ్గింది. కిందటి ఏడాదితో పోలిస్తే ఈ డౌన్‌ఫాల్ దారుణంగా నమోదు అయ్యింది. ►ప్యాసింజర్ వెహికిల్స్ ఈ నవంబర్‌లో 2, 15, 626 యూనిట్లు అమ్ముడుపోగా.. కిందటి ఏడాది ఆ సంఖ్య 2, 64, 898గా ఉంది. ఇక ఉత్పత్తి కూడా 9.5 శాతం పడిపోయింది (2,94,596 యూనిట్ల నుంచి 2,66,552కి). ►టూ వీలర్స్ ఈ నవంబర్‌లో 10, 50, 616 యూనిట్లు మాత్రమే సేల్ అయ్యాయి. కిందటి ఏడాది నవంబర్‌లో ఈ సంఖ్య 16 లక్షల యూనిట్లకు పైనే ఉంది. ఇక ఉత్పత్తి కూడా 29 శాతం పడిపోయి.. పదకొండేళ్ల తర్వాత పతనం నమోదు చేసుకుంది. 19, 36, 793 యూనిట్లకు గానూ 13, 67, 701 యూనిట్లను ఉత్పత్తి పడిపోయింది. ►ఇక త్రీ వీలర్స్ విషయానికొస్తే.. ఈ నవంబర్‌లో 6.64 శాతం క్షీణత కనిపిస్తోంది. 22, 471 యూనిట్లు అమ్ముడుపోగా.. కిందటి ఏడాది ఆ సంఖ్య 24, 071 యూనిట్లుగా ఉంది. ఉత్పత్తి మాత్రం 6 శాతం పడిపోయింది. 65, 460 యూనిట్ల నుంచి 61, 451 యూనిట్లకు పడిపోయింది. పెరిగిన ఎగుమతి.. అమ్మకాల సంగతి ఎలా ఉన్నా.. ఎగుమతుల విషయంలో మాత్రం కంపెనీలు అస్సలు తగ్గట్లేదు. మొత్తంగా ఈ మూడు కేటగిరీలను పరిశీలిస్తే.. ప్యాసింజర్ వెహికిల్స్‌లో 15.5 శాతం పెరుగుదల (44, 265 యూనిట్లు), టూ వీలర్స్‌లో 9 శాతం (3, 56, 659 యూనిట్లు), త్రీ వీలర్స్‌లో 14 శాతం (42, 431 యూనిట్లు) ఎగుమతి శాతం పెరిగింది. కారణం.. సెమీ కండక్టర్ల కొరత. కరోనా సమయంలో చిప్ ఉత్పత్తి ఫ్యాక్టరీలు మూతపడి.. ఈ ప్రభావం ఏడాది తర్వాత కూడా వెంటాడుతోంది. చిప్‌ల సమస్య కారణంగా ఉత్పత్తి.. డెలివరీలు దెబ్బతింటోంది. మన దేశంలోనే కాదు.. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. అయితే నవంబర్‌లో అదీ పండుగ సీజన్లో ఈ రేంజ్ ప్రతికూల ప్రభావం చూడడం 19 ఏళ్లలో ఇదే తొలిసారి అని సియామ్(SIAM) డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ చెప్తున్నారు. ముఖ్యంగా త్రీ వీలర్స్ అమ్మకాలు మరీ దారుణంగా ఉన్నాయని చెప్తున్నారాయన. చదవండి: గూగుల్, యాపిల్‌ను తలదన్నే రేంజ్ ప్లాన్.. 17 బిలియన్ డాలర్లతో చిప్ ఫ్యాక్టరీ -
ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులు.. నవంబర్‌లో రూ.11,615 కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో నెలవారీ పెట్టుబడులు నవంబర్‌లో రూ.11,615 కోట్లకు పెరిగాయి. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి. మార్కెట్లు అస్థిరతల్లో ఉన్నప్పటికీ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులకు ఇన్వెస్టర్ల నుంచి ఆసక్తి కొనసాగడం పెట్టుబడులు బలంగా ఉండేందుకు దోహదం చేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రూ.5,215 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.8,677 కోట్లు, ఆగస్ట్‌లో రూ.8,666 కోట్ల చొప్పున నికర పెట్టుబడులను ఆకర్షించాయి. ఈ ఏడాది జూలై తర్వాత అత్యధిక స్థాయిలో పెట్టుబడులు వచ్చింది నవంబర్లోనే కావడం గమనార్హం. ఈ ఏడాది జూలైలో ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.25,002 కోట్లుగా ఉన్నాయి. మొత్తం మీద అన్ని రకాల పథకాల్లోకి కలిపి నవంబర్‌లో రూ.46,165 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అక్టోబర్‌లో ఈ మొత్తం రూ.38,275 కోట్లుగా ఉంది. నవంబర్ చివరికి ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.38.45 లక్షల కోట్లకు చేరుకుంది. హైబ్రిడ్ పథకాలు ఆదరణ - ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లోకి రూ.2,660 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. - ఈక్విటీ హబ్రిడ్ పథకాల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.9,422 కోట్లుగా ఉన్నాయి. - సిప్ ఖాతాలు 4.78 కోట్లకు పెరిగాయి. నెలవారీగా సిప్ రూపంలో వచ్చే పెట్టుబడులు 11,005 కోట్లుకు చేరాయి. - డెట్ పథకాల్లోకి నికరంగా రూ.14,893 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. - గోల్డ్ ఈటీఎఫ్ పథకాలు రూ.682 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. -
ఐసీసీ అవార్డు రేసులో వార్నర్, సౌథీ.. టీమిండియా ఆటగాళ్లకు దక్కని చోటు
David Warner Nominated For ICC Player Of The Month Award: 'ప్లేయర్ ఆఫ్ ద మంత్' అవార్డుకు గాను నవంబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రికెటర్ల జాబితాను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్, పాక్ ఆటగాడు ఆబిద్ అలీ, న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ నిలిచారు. పురుషుల విభాగంలో ఈ ముగ్గురు క్రికెటర్లు నామినీస్ కాగా.. మహిళల కేటగిరీలో పాక్ స్పిన్నర్ ఆనమ్ అమిన్, బంగ్లా బౌలర్ నహీదా అక్తర్, విండీస్ ఆల్‌రౌండర్ హలే మథ్యూస్ ఉన్నారు. వార్నర్.. నవంబర్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో 69.66 సగటుతో 209 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలువగా.. అదే టోర్నీలో సౌథీ 7 వికెట్లతో రాణించి తన జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. డబ్ల్యూటీసీలో భాగంగా భారత్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో సైతం సౌథీ 8 వికెట్లు సత్తా చాటాడు. ఈ అవార్డు రేసులో ఉన్న పాక్ ఓపెనర్ ఆబిద్ అలీ బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో 133, 91 పరుగులతో సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. ఇదిలా ఉంటే, నవంబర్ నెలలో టీమిండియా ఆటగాళ్లు తక్కువ మ్యాచ్‌లు ఆడటం.. అందులో పెద్దగా రాణించకపోవడంతో ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. కాగా, ఐసీసీ.. ఈ ఏడాది జనవరి నుంచి ప్రతి నెలా ఈ అవార్డును అందజేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: IND Vs SA: వాళ్లిద్దరినీ త్వరగా ఔట్ చేస్తే.. భారత్‌దే విజయం! -
నవంబర్‌లో ఎక్కువగా అమ్ముడైన టాప్-10 కార్లు ఇవే!
Here Are the Top 10 Best-Selling Cars From November: భారతదేశంలో కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకి ఇండియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. నవంబర్ నెలలో అత్యధికంగా అమ్ముడవుతున్న పది కార్ల జాబితాలో ఏడు స్థానాలను మారుతి సుజుకి ఇండియా ఆక్రమించింది. ఇండో-జపనీస్ కార్ల తయారీ కంపెనీ నవంబర్ నెలలో మొత్తంగా 9 శాతం అమ్మకాలు పడిపోయినప్పటికీ, జాబితాలో మాత్రం అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మిగిలిన మూడు హ్యుందాయ్, కియా, టాటా మోటార్స్ కు చెందిన ఒక్కొక్క మోడల్ ఉన్నాయి. నవంబర్‌లో భారతదేశంలో ఎక్కువగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 1. మారుతి వ్యాగన్ఆర్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో మారుతి సుజుకికి చెందిన వ్యాగన్ఆర్ అగ్రస్థానంలో నిలిచింది. మారుతి నవంబర్ 2021లో 16,853 యూనిట్ల వ్యాగన్ఆర్ కార్లను విక్రయించింది. ఇది నవంబర్ 2020లో విక్రయించిన 16,256 యూనిట్ల కంటే కొంచెం ఎక్కువ. 2. మారుతి స్విఫ్ట్ ఈ జాబితాలో మారుతి సుజుకికి వచ్చిన మారుతి స్విఫ్ట్ రెండవ స్థానంలో నిలిచింది. గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో తక్కువ రేటింగ్ పొందినప్పటికి అమ్మకాల పరంగా దూసుకెళ్లింది. మారుతి సుజుకి 2021 నవంబర్ నెలలో స్విఫ్ట్ 14,568 యూనిట్లను విక్రయించింది. అయితే, గత సంవత్సరంతో పోలిస్తే అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మారుతి 2020 నవంబర్ నెలలో 18,498 యూనిట్ల స్విఫ్ట్ కార్లను విక్రయించింది. 3. మారుతి ఆల్టో ఈ జాబితాలో మూడవ స్థానంలో కూడా మారుతి సుజుకికి చెందిన మారుతి ఆల్టో నిలిచింది. ఇది అక్టోబర్ నెలలో అగ్ర స్థానాన్ని కలిగి ఉంది, కానీ ఈసారి దీనిని వ్యాగన్ఆర్ ఓడించింది. మారుతి సుజుకి 2021 నవంబర్ నెలలో 13,812 యూనిట్ల ఆల్టో కార్లను విక్రయించింది. ఇది గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 15,321 యూనిట్ల కంటే తక్కువ. 4. మారుతి విటారా బ్రెజ్జా విటారా బ్రెజ్జా, భారతీయ మార్కెట్లలోకి ప్రవేశించిన మొట్టమొదటి సబ్-కాంపాక్ట్ ఎస్యువీ కారు. మారుతీ గత నవంబర్ నెలలో 10,760 యూనిట్ల బ్రెజ్జాను విక్రయించింది, గత ఏడాది ఇదే కాలంలో విక్రయించగలిగిన 7.838 యూనిట్ల కంటే చాలా ఎక్కువ. మారుతి రాబోయే రోజుల్లో బ్రెజ్జా యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. అయితే, కార్‌మేకర్ ఇంకా నిర్దిష్ట లాంచ్ టైమ్‌లైన్‌ను వెల్లడించలేదు. 5. హ్యుందాయ్ క్రెటా ఈ జాబితాలో కనిపించిన మొదటి నాన్-మారుతి కారు హ్యుందాయ్ క్రెటా మాత్రమే. గత కొంత కాలంగా చిప్ సంక్షోభం ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తున్నప్పటికీ హ్యుందాయ్ నవంబర్‌లో 10,300 యూనిట్ల క్రెటా కాంపాక్ట్ ఎస్యువీని విక్రయించింది. గతేడాది నవంబర్‌లో హ్యుందాయ్ క్రెటా 12,017 యూనిట్లను విక్రయించింది. 6. మారుతి బాలెనో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో 6వ స్థానంలో మారుతి బాలెనో నిలిచింది. మారుతి నవంబర్ 2020లో 17,872 యూనిట్లతో పోలిస్తే నవంబర్ 2021లో 9,931 యూనిట్ల బాలెనో కార్లను విక్రయించింది. ఈ కారు కూడా లాటిన్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో తక్కువ రేటింగ్ పొందింది. 7. టాటా నెక్సన్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల టాప్-10 జాబితాలో నిలిచిన ఏకైక కారు టాటా మోటార్స్ నెక్సాన్ మాత్రమే. హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్ యువి300 కార్ల నుంచి భారీ పోటీని ఎదుర్కొన్నప్పటికీ ఈ జాబితాలో 7వ స్థానంలో నిలిచింది. 2021 నవంబరులో టాటా 9,831 యూనిట్ల నెక్సన్ కార్లను విక్రయించింది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో 10,096 యూనిట్లతో పోలిస్తే ఇది తక్కువ. 8. మారుతి ఈఈసీఓ ఈ జాబితాలో కనిపించిన ఏకైక వ్యాన్ మారుతి ఈఈసీఓ. మారుతి నవంబరులో 9,571 యూనిట్ల ఈకో కార్లను విక్రయించింది, ఇది సంస్థ నుంచి అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఒకటిగా నిలిచింది. ఈ ఈఈసీఓ నాన్ కార్గో వేరియెంట్ల ధరలను మారుతి రూ.8,000 పెంచింది. ధరల పెంపు నవంబర్ 30 నుంచి అమల్లోకి వచ్చింది. 9. మారుతి ఎర్టిగా మారుతి ఎర్టిగా నవంబరులో ఏడు సీట్ల ఎంపివి విభాగంలో ఆధిపత్యం కొనసాగిస్తోంది. దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల టాప్-10 జాబితాలో ఇది 9వ స్థానంలో నిలిచింది. మారుతి సుజుకి నవంబరులో 8,752 యూనిట్ల ఎర్టిగా కార్లను విక్రయించింది, అక్టోబర్ నెలలో విక్రయించిన యూనిట్ల కంటే గణనీయమైన తగ్గుదలను నమోదు చేసింది. 10. కియా సెల్టోస్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల టాప్-10 జాబితాలో ఇది 10వ స్థానంలో కియా సెల్టోస్ నిలిచింది. 2020 నవంబరులో విక్రయించిన 9,205 యూనిట్లతో పోలిస్తే కియా నవంబర్ 2021లో 8,659 యూనిట్ల సెల్టోస్ ఎస్‌యూవీని విక్రయించింది. -
ధనాధన్ ‘నవంబర్’!
భారత్ ఆర్థిక వ్యవస్థ నవంబర్‌లో మంచి ఫలితాలను నమోదుచేసినట్లు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. వస్తు, సేవల పన్ను వసూళ్లు, ఎగుమతులు, తయారీ రంగం ఇలా ప్రతి కీలక విభాగమూ వృద్ధిలో దూసుకుపోయింది. ఆయా రంగాలను పరిశీలిస్తే.. జీఎస్టీ ఆదాయం రూ.1,31,526 కోట్లు న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు నవంబర్‌లో రూ.1,31,526 కోట్లుగా నమోదయ్యాయి. ఎక్సైజ్ సుంకం, సేవల పన్ను, వ్యాట్ వంటి పలు రకాల పరోక్ష పన్నులను ఒకటిగా మార్చుతూ 2017 జూలై నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత, జీఎస్టీ ద్వారా ఈ స్థాయి వసూళ్లు జరగడం ఇది రెండవసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో వసూలయిన రూ.1,39,708 కోట్లు ఇప్పటి వరకూ భారీ వసూలుగా రికార్డయ్యింది. కాగా, 2020 నవంబర్ నెలతో (1.05 లక్షల కోట్లు) పోల్చితే తాజా సమీక్షా నెల వసూళ్లలో 25 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. ఇక 2019 ఇదే నెలతో పోల్చితే వసూళ్లు 27 శాతం ఎగశాయి. వ్యాపార క్రియాశీలత మెరుగుపడ్డం, ఎకానమీ రికవరీ పటిష్టత వంటి అంశాలు తాజా సమీక్షా నెల్లో మంచి ఫలితాలకు కారణం. ఇక జీఎస్టీ వసూళ్లు లక్షకోట్లు పైబడ్డం కూడా ఇది వరుసగా ఐదవనెల. పన్ను ఎగవేతలను నిరోధించడానికి కేందం తీసుకుంటున్న చర్యలు ఫలితమిస్తున్నాయని, జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరగడానికి ఇదీ ఒక కారణమని ఆర్థిక శాఖ పేర్కొంది. అంకెల్లో చూస్తే... ► నవంబర్‌లో మొత్తం స్థూల వసూళ్లు రూ.1,31,526 కోట్లలో సెంట్రల్ జీఎస్టీ రూ.23,978 కోట్లు. ► స్టేట్ జీఎస్టీ రూ.31,127 కోట్లు. ► ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.66,815 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.32,165 కోట్లు సహా) ► సెస్ రూ.9,606 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలు చేసిన రూ.653 కోట్లుసహా) ఇదిలాఉండగా, ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటన ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలల జీఎస్టీ వసూళ్ల అంకెల్లో సవరణ జరిగింది. ఎగుమతులు 26 % అప్ భారత్ ఎగుమతులు నవంబర్‌లో గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 26.49 శాతం ఎగశాయి. విలువ రూపంలో 29.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇంజనీరింగ్, పెట్రోలియం, రసాయనాలు, మెరైన్ ఉత్పత్తుల వంటి పలు విభాగాలు పురోగతిలో నిలిచాయి. 2020 నవంబర్‌లో ఎగుమతుల విలువ 23.62 బిలియన్ డాలర్లు. ఇక దిగుమతులు 57.18 శాతం పెరిగి 53.15 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెల్లో ఈ విలువ 38.81 బిలియన్ డాలర్లు. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 23.27 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వార్షికంగా చూస్తే, వాణిజ్యలోటు రెట్టింపు కావడం గమనించాల్సిన మరో అంశం. కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► మొత్తం ఎగుమతుల్లో 28.19 శాతం వాటా ఉన్న ఇంజనీరింగ్ ఎగుమతులు 37% పెరిగి 8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎగుమతులు 145.3% పెరిగి 3.82 బిలియన్ డాలర్ల్లకు చేరాయి. ► రత్నాభరణాల దిగుమతులు మాత్రం 11% క్షీణించి 2.4 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ► సమీక్షా నెల్లో పసిడి దిగుమలు 8 శాతం పెరిగి 4.22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► పెట్రోలియం, క్రూడ్ ఉత్పత్తుల దిగుమతులు 132.44 శాతం పెరిగి 14.68 బిలియన్ డాలర్లకు చేరాయి. ► బొగ్గు, కోక్, బ్రికెట్స్ దిగుమతులు 135.81% పెరిగి 3.58 బిలియన్ డాలర్లకు చేరాయి. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ... కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ చూస్తే ఎగుమతులు విలువ 50.71 శాతం పెరిగి 174.15 బిలియన్ డాలర్ల నుంచి 262.46 బిలియన్ డాలర్లకు ఎగసింది. కరోనా ముందస్తు సమయం 2019 ఏప్రిల్–నవంబర్‌తో పోల్చినా ఎగుమతులు 24 శాతం పెరగడం గమనార్హం. అప్పట్లో ఈ విలువ 211.17 బిలియన్ డాలర్లు. 10 నెలల గరిష్టానికి ‘తయారీ’ భారత్ తయారీ రంగం నవంబర్‌లో పురోగమించింది. ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 57.6కు ఎగసింది. అక్టోబర్‌లో ఈ సూచీ 55.9 వద్ద ఉంది. గడచిన 10 నెలల్లో ఈ స్థాయి మెరుగుదల ఇదే తొలిసారి. కాగా ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగానే పరిగణిస్తారు. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా లెక్కించడం జరుగుతుంది. దీర్ఘకాలిక సగటు 53.6కన్నా కూడా సూచీ పైన ఉండడం తాజా సమీక్షా నెల ముఖ్యాంశం. మూడు నెలల వరుస క్షీణత అనంతరం నవంబర్‌లో ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా మెరుగుపడినట్లు ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పాలీయానా డీ లిమా పేర్కొన్నారు. వరుసగా ఐదు నెలల తర్వాత నిర్వహణా పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని కూడా ఆమె తెలిపారు. -
దూసుకెళ్తున్న జీఎస్టీ వసూళ్లు!
న్యూఢిల్లీ: నవంబర్ నెలలో కూడా జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్ల మైలురాయిని అధిగమించాయి. వరుసగా ఐదో నెలా జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లను దాటాయి. 2021 నవంబరులో వసూలైన జీఎస్టీ(గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) ఆదాయం రూ.1,31,526 కోట్లుగా ఉంది. మొత్తం జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ - రూ.23,978 కోట్లు, స్టేట్ జీఎస్టీ - రూ.31,127 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ - రూ.66,815 కోట్లు అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేగాక, జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇంత మొత్తంలో పన్ను ఆదాయం రావడం ఇది రెండోసారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మొదటిసారి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రూ.1,39,708 కోట్లు వచ్చాయి. ఈ సమ్మిళిత జీఎస్టీ వాటా రూ.66,815 కోట్లు(వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.32,165 కోట్లతో సహా), సెస్ రూపంలో వచ్చిన ఆదాయం రూ.9,606 కోట్లు(వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.రూ.653 కోట్లతో సహా) . గత ఏడాది ఇదే నెలలో వసూలైన జీఎస్టీ ఆదాయంతో పోలిస్తే నవంబర్ 2021లో సేకరించిన జీఎస్టీ ఆదాయం 25 శాతం పెరిగింది. 2019-20తో పోలిస్తే కంటే 27 శాతం పెరిగింది. ఈ సమ్మిళిత జీఎస్టీ వాటా నుంచి సీజీఎస్ఆర్ కు రూ.27,273 కోట్లు, రాష్ట్రాలతో 22,655 కోట్లు పంచుకొనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం వాటా పంచుకున్న తర్వాత కేంద్రం వాటా రూ. 51,251 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.53,782 కోట్లుగా ఉంది. దిగుమతుల నుంచి వచ్చిన ఆదాయం గత ఏడాది కంటే 43 శాతం ఎక్కువగా ఉన్నాయి. 2021 నవంబర్ 3న జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం రూ.17,000 కోట్లు విడుదల చేసింది. (చదవండి: కళ్లుచెదిరే లాభం.. లక్షకు ఏకంగా రూ.80 లక్షలు!) -
Thanks Giving Day : ఎవరికైనా థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయారా?
సాక్షి, హైదరాబాద్: మనిషిగా పుట్టింది మొదలు గిట్టే వరకు ఆ ‘నలుగురి’ సాయం లేకుండా సాగదు. ప్రస్తుతం ఒక స్థాయికి చేరుకోగలిగాము అంటే కచ్చితంగా ఎందరో తోడ్పాటు ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు, గురువులు,స్నేహితులు ఈ కోవలో ముందు వరుసలో నిలుస్తారు. చాలా సందర్భాల్లో చాలా క్లిష్టసమయాల్లో మన జీవితంలో చాలామంది పరోక్షంగానో ప్రత్యక్షంగా సాయపడతారు. మన కరియర్లో కీలక మలుపు తిరగడానికి దోహద పడతారు. ఫలానా వారి వల్లే నేను జీవితంలో ఇంత స్థాయికి చేరుకున్నాను అనుకుంటాం కదాం. అలాంటి వారి వద్దకు వెళ్లి ఒకసారి కలిసి, మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పందుకే ఈ థ్యాంక్స్ గివింగ్ డే. క్షణం తీరిక లేకుండా జీవితాల నుంచి కాస్త సమయం తీసుకుని అలాంటి చక్కగా ఆలింగనం చేసుకోవడం కోసమే ఈ రోజు. వారు చేసిన సేవ, సాయంగాని, ముఖ్యమైన సలహా గానీ, చేసిన మేలు, త్యాగం ఇలా ఏదైనా గుర్తు చేసుకోవడం. మన అభివృద్ధి కోసం పాటుపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం. ప్రపంచవ్యాప్తంగా ఈ థ్యాంక్స్ గివింగ్ డేకు చాలా ప్రాముఖ్యత ఉంది. దీనిని మొట్టమొదటి సారిగా అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ 1789 నవంబర్ 26న నిర్ణయించారు. అయితే తరువాత మరో అధ్యక్షుడు భారత సంతతికి చెందిన ప్రముఖుడు అబ్రహం లింకన్ ప్రతి సంవత్సరం నవంబర్ నాలుగో గురువారం రోజు ఈ కృతజ్ఞతా దినోత్సవంగా పాటించాలని పిలుపునిచ్చారు. ఈ రోజు అమెరికాలో నేషనల్ హాలిడే కూడా. సాంప్రదాయం ప్రకారం స్నేహితులు, హితులందరితో చక్కటి విందు భోజనం చేయడంతోపాటు ఉత్సాహంగా అందరూ కలిసి ఈ వేడుకను జరుపుకుంటారు. భారతదేశంలో ఇది పెద్దగా ప్రాచుర్యంలో లేనప్పటికీ, అమెరికా, బ్రెజిల్, కెనడా, జర్మనీ, జపాన్‌తో సహా ఇతర దేశాలలో కూడా థాంక్స్ గివింగ్ జరుపు కుంటారు. పండుగ తర్వాత మరుసటి రోజు బ్లాక్ ఫ్రైడే జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అన్ని రకాల ఉత్పత్తులపై భారీ తగ్గింపులతో మెగా షాపింగ్ మేలా ఉంటుంది. ఆసక్తికరంగా, కెనడాలో అక్టోబర్ రెండవ సోమవారం థ్యాంక్స్ గివింగ్ డే వేడుక ఉంటుంది. జీవితంలో తెలిసో తెలియకో, పాజిటివ్‌గానో, నెగిటివ్‌గానో ఎంతో కొంత మేలు చేసే ఉంటారు. వారిని ఏడాదికి ఒకసారైనా గుర్తు చేసుకోవడానికే ఈ కృతజ్ఞతా దినోత్సవం అన్నమాట. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి సెకండ్‌వేవ్‌తో జనం అల్లాడిపోయారు. తీరని కష్టాల్లో ఉన్న అలాంటి వారిని ఆదుకునేందుకు చాలామంది ముందుకు వచ్చారు. 24 గంటలూ నిద్రాహారాలు మాని, బాధితులకు ఎనలేని సేవలందించారు. వారి త్యాగాలు, సేవలకు విలువ కట్టడం అసాధ్యం. అలాంటి వారిందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పాలి. సో... ఇంకెందుకు ఆలస్యం...అలాంటి గొప్ప వ్యక్తులు అందరికీ థ్యాంక్స్ చెప్పేయండి! -
ఉచిత బియ్యం పంపిణీ నిలిపివేత!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా విపత్కర పరిస్థితుల దృష్ట్యా దేశంలో నిరుపేదలకు ఉచితంగా అందించిన బియ్యం, ఇతర ఆహార ధాన్యాల పంపిణీ నవంబర్ తర్వాత నిలిచిపోనున్నట్లు తెలుస్తోంది. ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ పథకం కింద పేదలకు ఉచితంగా బియ్యం/గోధుమల పంపిణీ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. గడువు పొడిగింపుపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆహార ధాన్యాల పంపిణీని కొనసాగించే అంశమై ఎలాంటి ప్రతిపాదన కేంద్రం వద్ద లేదని కేంద్ర ఆహార, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే ఇటీవలే ప్రకటించారు. కోవిడ్–19 మహహ్మరి వ్యాప్తి, లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా కేంద్రం ప్రభుత్వం ఏప్రిల్ నుంచి మూడు నెలల పాటు ఉచితంగా 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పును పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అనంతరం దీన్ని ఈ ఏడాది నవంబర్ వరకు పొడిగించారు. ఈ పథకం ద్వారా కేంద్ర ఆహార భద్రతా చట్టం పరిధిలోని 80 కోట్ల మందికి లబ్ధి చేకూరింది. ఇందుకోసం రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పథకాన్ని మరో ఆరు నెలలపాటు కొనసాగించాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణముల్ కాంగ్రెస్ తదితర విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం లెక్కచేయడం లేదు. -
కుండపోత వర్షాలతో హైదరాబాద్ మునక.. ఏటా ఇదే సీన్.. అయినా!
సాక్షి, హైదరాబాద్: వానకాలం..చలికాలం...ఇలా సీజన్‌తో సంబంధం లేకుండా కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలతో ఏటా గ్రేటర్ సిటీ నిండా మునుగుతోంది. ఈ ఏడాది జూన్ నుంచి నవంబర్ 19 వరకు సరాసరిన 21.8 శాతం అధిక వర్షపాతం నమోదైంది. కొన్ని మండలాల్లో సాధారణం కంటే 50 శాతానికి పైగా అధిక వర్షపాతం నమోదవడం గమనార్హం. అల్పపీడనం, వాయుగుండం, ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం, ఇలా పలు కారణాలతో ప్రతి నెలా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కుండపోతగా వర్షపాతం... జీహెచ్ఎంసీ పరిధిలోని 28 మండలాల్లో అల్వాల్, కుత్భుల్లాపూర్, పటాన్చెరు మినహా..ఈ ఏడాది జూన్ నుంచి నవంబరు 19 వరకు సాధారణం కంటే అత్యధిక వర్షపాతం నమోదైంది. కొన్ని మండలాల్లో ఏకంగా 50 శాతానికంటే అధిక వర్షపాతం నమోదవడం విశేషం. విశ్వవ్యాప్తంగా వాతావరణ పరంగా చోటుచేసుకుంటున్న అనూహ్య మార్పులు, ఎల్‌నినో, లానినో ప్రభావాలు, గతితప్పిన రుతుపవనాలు, సముద్రంలో తరచూ ఏర్పడుతున్న అల్లకల్లోల పరిస్థితులు, అల్పపీడనాలు, వాయుగుండాలు, తీవ్ర తుపానులు కూడా సీజన్‌తో సంబంధం లేకుండా అకాల వర్షాలకు కారణమౌతున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. వరద నీరు వెళ్లే దారేదీ... నగరంలో గంట వ్యవధిలో 5 సెంటీమీటర్ల వర్షం కురిసినా.. నిండా మునుగుతోంది. సుమారు 300 బస్తీలు ఏటా ముంపునకు గురవుతున్నట్లు బల్దియా లెక్కలు చెబుతున్నాయి. గతంలో ముంపు సమస్యల పరిష్కారానికి ముంబై ఐఐటీ నిపుణులు, కిర్లోస్కర్ కమిటీ సూచనలు, తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నిపుణులు చేసిన సూచనల అమలుపై సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఏటా ఇవే సీన్లు పునరావృతమౌతుండడం గ్రేటర్ పిటీ. నాలాల ఆక్రమణల పరిస్థితీ అలాగే ఉంది. -
నవంబర్ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్..! ఇవే..!
Major Changes That Will Set In From November 1: అమ్మో ఒకటో తారీఖు..! ఒకటో తారీఖు వచ్చిదంటే మనం వెంటనే అప్రమత్తమైపోతాం. ఇంటి అద్దె బిల్లులు , చిన్న చితకా బిల్లులను ఇతర లావాదేవీలను ఒకటో తారీఖున పూర్తి చేస్తాం. అంతేందుకు ప్రభుత్వాలు కూడా ఒకటో తేదీనే పలు ముఖ్యమైన కార్యక్రమాలను చేపడుతాయి. అంతేకాకుండా ప్రభుత్వాలు కొత్త నిబంధనలను కూడా అమలులోకి తెస్తాయి. దేశవ్యాప్తంగా వచ్చే నెల నవంబర్ 1 నుంచి పలు కీలక నిబంధనలు అమలులోకి వస్తున్నాయి.ఇక నవంబర్ 1 నుంచి సామాన్యులపై గ్యాస్ బండ మోత కూడా మోగనుంది. చదవండి: దివాళీ ఎఫెక్ట్ : తగ్గిన బంగారం ధరలు..ఎంతంటే నవంబర్ 1 నుంచి మారనున్న రూల్స్..! ఎల్పీజీ డెలివరీ సిస్టమ్ వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ సిస్టమ్‌లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. వచ్చే నెల నుంచి ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ కోసం వినియోగదారులు కచ్చితంగా వన్-టైమ్ పాస్వర్డ్ (OTP)ని అందించాల్సి ఉంటుంది.డెలివరీ అథెంటికేషన్ కోడ్ (DAC)లో భాగంగా ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ సిస్టమ్‌లో ఈ మార్పు రానుంది. డిపాజిట్లు, ఉపసంహరణలపై ఛార్జీలను సవరించనున్న పలు బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) నిర్దేశిత పరిమితిని మించి డిపాజిట్, డబ్బును విత్‌డ్రా చేయడం కోసం నవంబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు అందుబాటులోకి రానున్నాయి. కొత్త ఛార్జీలు సేవింగ్స్ ఖాతాదారులతో పాటు వేతన ఖాతాదారులకు వర్తిస్తాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్బీ, యాక్సిస్ , సెంట్రల్ బ్యాంకులు డిపాజిట్లు, విత్‌డ్రా విషయంలో త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైల్వే టైమ్ టేబుల్ దేశ వ్యాప్తంగా భారతీయ రైల్వే పలు రైళ్ల టైమ్ టేబుల్లో మార్పులు చేయబోతోంది. నవంబరు 1 నుంచి పలు రైళ్లకు కొత్త టైమ్‌టేబుల్ ప్రకటించనుంది. భారతీయ రైల్వేస్ ప్రకారం... 13 వేల ప్యాసింజర్ రైళ్లు , 7 వేల గూడ్స్ రైళ్లు టైమింగ్స్‌లో మార్పు రానున్నట్లు తెలుస్తోంది. ఎల్పీజీ ధరలు గ్లోబల్ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరల పెంపు కారణంగా..చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా ఒకటో తారీఖు నుంచి ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై గ్లోబల్ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ధరలు పెరిగితే ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో కూడా మార్పులు రానున్నాయి. చదవండి: వర్క్ ఫ్రమ్ హోంపై కీలక వ్యాఖ్యలు చేసిన పేటీఎమ్..! -
5న కేదార్‌నాథ్‌కు ప్రధాని
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నవంబర్ 5వ తేదీన ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత కేదార్నాథ్ ఆలయానికి వెళ్లి, పూజలు చేస్తారని ప్రధానమత్రి కార్యాలయం(పీఎంవో) గురువారం తెలిపింది. ఈ సందర్భంగా ప్రధాని పునర్నిర్మించిన శ్రీ ఆదిశంకరాచార్య సమాధిని ప్రారంభించి, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని పేర్కొంది. అనంతరం రూ.130 కోట్లతో నిర్మించిన వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు, రూ.180 కోట్లతో నిర్మించనున్న వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపింది. 2013లో సంభవించిన వరదల్లో ఆదిశంకరాచార్య సమాధి ధ్వంసమైందని పీఎంవో పేర్కొంది. -
పది రోజులు సెలవు తీసుకోండి, పండగ చేస్కోండి! ఆ కంపెనీ వినూత్న నిర్ణయం
ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, ప్రశాంతతే లక్ష్యంగా ఓ స్టార్టప్ కంపెనీ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఉల్లాసంగా, ఉత్సాహాంగా గడపండంటూ ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు ఇచ్చింది. అంతేకాదు ఈ సెలవులు స్పెషల్‌గా ప్లాన్ చేసుకునేందుకు వీలుగా రెండు నెలల ముందే హాలిడే షెడ్యూల్ సైతం ప్రకటించింది. పది రోజుల సెలవులు సోషల్కామర్స్ రంగంలో స్టార్టప్‌గా మొదలై యూనికార్న్ కంపెనీగా ఎదిగింది మీషో సంస్థ. ఉద్యోగులు రేయింబవళ్లు కష్టపడి పని చేయడంతో అనతి కాలంలోనే ఈ సంస్థ మార్కెట్ వాల్యూ అనూహ్యంగా పెరిగింది. దీంతో తమ కంపెనీ ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యతను యాజమాన్యం తీసుకుంది. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని భావించింది. దీంతో కంపెనీ ఉద్యోగులందరికీ ఒకేసారి పది రోజుల పాటు సామూహికంగా సెలవులు ప్రకటించింది. ఎప్పుడంటే గత రెండు నెలలుగా కరోనా సంక్షోభ సమయంలోనూ తమ కంపెనీ ఉద్యోగులు రేయింబవళ్లు కష్టపడినట్టు మీషో యాజమాన్యం ప్రకటించింది. దీనికి తోడు రాబోయే దసరా, దీపావళి సీజన్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని కూడా ముందే తెలిపింది. ఎంతో ఒత్తిడిలో సంస్థ అభివృద్ధికి పాటుపడిన ఉద్యోగులకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో పీక్ సీజన్ ముగిసిన తర్వాత 2021 నవంబరు 4 నుంచి 14 వరకు సంస్థలోని ఉద్యోగులకు సెలవులు ప్రకటించింది. అంతేకాదు ఆ పది రోజలు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపండి అంటూ ఉద్యోగులకు సూచించింది. మీషో ప్రస్థానం విదిత్ ఆత్రేయ్ అనే ఔత్సాహిక పారిశ్రామికవేత్త 2016లో మీషోను ప్రారంభించారు. చిన్న కళాకారులు, వ్యాపారులు తమ ఉత్పత్తులను అమ్ముకునేలా మీషోను వేదికగా మార్చారు. బయ్యర్లు, అమ్మకం దార్ల మధ్య మీషోను ప్లాట్‌ఫామ్‌గా చేశారు. కేవలం ఐదేళ్లలోనే ఈ మీషో స్టార్టప్ నుంచి యూనికార్న్‌గా ఎదిగింది. ఉద్యోగుల సంక్షేమం విషయంలో మీషో ఎల్లప్పుడు జాగ్రత్తగానే ఉంటుందనే పేరుంది. ఈ కంపెనీ అంతకు ముందు 64 ఆప్షనల్ హలిడేస్ను ఉద్యోగుల కోసం ప్రకటించింది. Meesho is going on a company-wide break from November 4-14th. Yes, you read that right. We are going to completely unplug from work — right after our busy and frenetic festive sale season, so that we are back to doing what we love — relaxed and rejuvenated. (1/2)#Meesho pic.twitter.com/CGusDZZyfw — Life@Meesho (@meeshoapp) August 30, 2021 చదవండి : ఫిట్‌గా ఉన్న ఉద్యోగులకు బంపర్ఆఫర్ ప్రకటించిన జెరోదా..! -
అప్పు చేయలేదు
సాక్షి, హైదరాబాద్: కరోనా దెబ్బకు కుదేలైన రాష్ట్ర రాబడులు నెమ్మదిగా యథాతథ స్థితికి వస్తున్నాయి. కొత్త అప్పు చేయకుండానే రాష్ట్రం నవంబర్ మాసాన్ని నెట్టుకురాగలిగింది. ఇది ఊరటనిచ్చే అంశం. కరోనా మహమ్మారి మిగిల్చిన ఆర్థిక కష్టాలతో... 2020–21 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచీ అప్పుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. ఇప్పుడది మారిందని నవంబర్ నెల రాష్ట్ర ఆర్థిక గణాంకాలు చెబుతున్నాయి. చదవండి: (1,950కోట్లు ఇవ్వండి) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వెల్లడించిన లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ మాసంలో రూపాయి కూడా అప్పు చేయలేదు. పైగా 398.63 కోట్ల రూపాయల అప్పును కూడా తీర్చింది. అటు రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయ వనరులు గత మూడు మాసాలుగా నిలకడగా వస్తుండటం, ఈసారి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో రూ. 3,784 కోట్లు రావడంతో నవంబర్‌లో అప్పు పద్దుకు వెళ్లాల్సిన అవసరం రాలేదని ఆర్థిక శాఖ అధికారులు చెపుతున్నారు. నిలకడగా ఆదాయం... ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే మొదలైన కరోనా కష్టాల నుంచి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కోలుకున్నట్టేనని కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నవంబర్ మాసంలో కూడా పన్నుల రాబడి కింద రూ. 6,374 కోట్లు ప్రభుత్వ ఖజానాకు సమకూరాయి. గత ఐదునెలలుగా రూ.6 వేల కోట్లు దాటుతున్న పన్ను ఆదాయం నవంబర్‌లో కూడా అదే స్థాయిలో రావడం గమనార్హం. ఇందులో జీఎస్టీ కింద నవంబర్ నెలలో రూ.2,360 కోట్లు సమకూరాయి. దీంతో వార్షిక బడ్జెట్ అంచనాల్లో జీఎస్టీ రాబడులు నవంబర్ నాటికి రూ. 15,247 కోట్లకు చేరాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం నామమాత్రంగానే వచ్చిందని నవంబర్ కాగ్ లెక్కలు చెబుతున్నాయి. ఎక్సైజ్ డ్యూటీల రూపంలో రూ.1,000 కోట్లు, అమ్మకపు పన్ను రూపంలో రూ.2,027 కోట్లు ఆదాయం వచ్చింది. ముఖ్యంగా ఈసారి కేంద్ర పన్నుల్లో వాటా పెద్దగా రాలేదు కానీ, గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో రూ. 3,784 కోట్లు వచ్చాయి. మొత్తం మీద రెవెన్యూ రాబడులు ఈ ఏడాది రూ.1.43 లక్షల కోట్లుగా ప్రభుత్వం అంచనా వేయగా, నవంబర్ నాటికి రూ.56,948 కోట్లు వచ్చింది. మొత్తం అంచనాలో ఇది 39.82 శాతం మాత్రమే. ఇక, మొత్తం రాబడుల అంచనా రూ.1.76 లక్షల కోట్లు కాగా నవంబర్ నాటికి రూ.84,702 కోట్లు (47.74 శాతం) వచ్చింది. ఆర్థిక సంవత్సరం మరో నాలుగు నెలల్లో ముగియనున్న నేపథ్యంలో మొత్తం రెవెన్యూ రాబడులు 70–75 శాతం మించే అవకాశం లేదని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. చదవండి: (అలర్ట్: జ్వరముంటే కరోనా వ్యాక్సిన్ వద్దు) ఖర్చు కూడా పెరిగింది నవంబర్ మాసంలో ఆదాయంతో పాటు ఖర్చు కూడా పెరిగిందని కాగ్ గణాంకాలు చెపుతున్నాయి. రెవెన్యూ పద్దు కింద ఈ ఏడాదిలో నవంబర్ నెలలో అతి తక్కువగా రూ. 2,045 కోట్లు మాత్రమే ఖర్చు కాగా, ఈ ఏడాదిలోనే అత్యధికంగా నవంబరులో ఉద్యోగుల వేతనాల కింద రూ. 2,558 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అదే విధంగా పింఛన్ల కోసం కూడా ఈ ఏడాదిలోనే అత్యధికంగా నవంబరులో రూ. 1,213 కోట్లు ఖర్చయ్యాయని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. సబ్సిడీల కింద కూడా రూ. 1,400 కోట్ల వ్యయం జరిగింది. మొత్తం మీద నవంబర్ నాటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.78,003 కోట్లు ఖర్చు పెట్టిందని కాగ్ వెల్లడించింది. -
నవంబర్ 26 సార్వత్రిక సమ్మెలో బ్యాంకు ఉద్యోగులు
సాక్షి, ముంబై: కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు నవంబర్ 26న జరగనున్న ఒక రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు బ్యాంకు ఉద్యోగుల సంఘం మద్దతు ప్రకటించింది. ఈ సమ్మెలో తామూ పాల్గొంటామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రకటించింది. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు నిర్ణయించామని మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇటీవల నిర్వహించిన లోక్‌సభ సెషన్లో 'ఈజీ ఆఫ్ బిజినెస్' పేరిట మూడు కొత్త కార్మిక చట్టాలను ఆమోదించిందని, ప్రస్తుత 27 చట్టాలను తుంగలో తొక్కి పూర్తిగా కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ఈ కొత్త చట్టాలను తీసుకొస్తోందని ఏఐబీఈఏ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. తద్వారా 75 శాతం మంది కార్మికులను చట్టపరిధిలోంచి తప్పించి వారికి రక్షణ లేకుండా కేంద్రం చేస్తోందని ఆరోపించింది. కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్ల జాతీయ కార్మిక సదస్సు పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేపట్టాలని నిర్ణయించాయి. భారతీయ మజ్దూర్ సంఘ్ మినహా పది కేంద్ర కార్మిక సంఘాలు నవంబర్ 26 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. -
నవంబర్‌లో ‘స్టార్స్’ హుషార్
స్టార్స్ ఉంటే ఆకాశం నిండుగా ఉంటుంది. స్టార్స్ ఉంటే సినిమాలు సందడిగా ఉంటాయి. కోవిడ్ వల్ల సినిమాల చిత్రీకరణలు అటూఇటూ అయ్యాయి. స్టార్స్ సినిమాలంటే భారీ కాన్వాస్‌తో కూడుకున్నవి. అందుకే కాస్త గ్యాప్ ఇచ్చి పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగుతున్నారు. ఈ నవంబర్‌లో చాలా మంది స్టార్స్ మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెడుతున్నారు. కొందరు కొత్త సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారు. మరికొందరు మధ్యలో ఉన్నవాటిని ముగించనున్నారు. ఆ విశేషాలు. వేసవిలో మెగామాస్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. కాజల్ కథానాయిక. ఈ సినిమా చిత్రీకరణ ఈ నెల 9న మళ్లీ ఆరంభం కానుంది. ‘నెలరోజుల పాటు సాగే షెడ్యూల్‌తో చాలా శాతం చిత్రీకరణ పూర్తి చేయనున్నాం. వచ్చే ఏడాది వేసవిలో థియేటర్స్‌లో మెగామాస్ చూస్తారు’ అని చిత్రబృందం పేర్కొంది. ఎంట్రీ షురూ బాలకృష్ణ–బోయపాటి కాంబినేషన్లో మూడో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభం అయింది. అయితే నవంబర్ 16 నుంచి బాలకృష్ణ లొకేషన్ ఎంట్రీ షురూ అయిందని తెలిసింది. క్రాక్ టు ఖిలాడీ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ నుంచి పక్కా పోకిరిగా మారబోతున్నారు రవితేజ. ఆయన ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా చేస్తున్నారు. అందులో రవితేజ పోలీస్‌గా కనిపిస్తారు. ఇది పూర్తి కాగానే రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమా ప్రారంభించనున్నారు. ఇందులో ఆయన ఖిలాడీగా కనిపిస్తారు. నవంబర్ చివరి వారంలో చిత్రీకరణలో పాల్గొంటారట రవితేజ. అడవిలోకి పుష్ప అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ చిత్రీకరణ కోసం నవంబర్ 6 నుంచి 10 మధ్యలో రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అడవులకు ప్రయాణం కానుంది యూనిట్. 30 రోజుల పాటు దట్టమైన అడవుల్లో చిత్రీకరణ జరపనున్నారు. ముంబైలో ఫైటర్ పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ‘ఫైటర్’ (వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతోంది. ఇందులో కిక్ బాక్సర్‌గా విజయ్ దేవరకొండ కనిపిస్తారు. ఈ సినిమా చిత్రీకరణ నవంబర్ మూడు లేదా నాలుగో వారం నుంచి ముంబైలో ఆరంభం కానుంది. శ్రీదేవి సోడా సెంటర్ సుధీర్‌బాబు హీరోగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే కొత్త చిత్రం ఇటీవలే ప్రకటించారు. ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకుడు. గోదావరి పరిసర ప్రాంతాల్లో నవంబర్ రెండో వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి, వేసవికి సినిమాలను థియేటర్స్‌లోకి తీసుకురావడానికి చిత్రబృందాలు ప్లాన్ చేస్తున్నాయి. ఈ ఏడాది మిస్సయిన జోష్ని వచ్చే ఏడాది రెండింతలు ఇవ్వడానికి ఇండస్ట్రీ రెడీ అవుతోంది. ఫుల్ స్పీడ్ స్టార్స్ అందరిలో ముందుగా షూటింగ్లో పాల్గొన్న హీరో నాగార్జున. ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ను పూర్తి చేసే పనిలో ఉన్నారాయన. అలాగే పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల ‘ఆర్ఆర్ఆర్’, నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’, శర్వానంద్ ‘శ్రీకారం’, నాగశౌర్య కొత్త చిత్రం, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, కార్తికేయ ‘చావు కబురు చల్లగా’ సినిమాలు ఫుల్ స్పీడ్‌లో షూటింగ్స్ జరుగుతున్నాయి. -
నవంబర్ నాటికి చైనా వ్యాక్సిన్
బీజింగ్: చైనా తయారు చేస్తోన్న కోవిడ్ వ్యాక్సిన్ నవంబర్ నాటికల్లా ప్రజలకు అందుబాటులోకి రానుందని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) వెల్లడించింది. చైనాలో మానవప్రయోగ తుది దశలో ఉన్న నాలుగు కోవిడ్ వ్యాక్సిన్లలో మూడింటిని ఇప్పటికే అత్యవసర కార్యక్రమం కింద, అత్యవసర సిబ్బందికి ఉపయోగించారు. ఫేజ్–3 క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియ సజావుగా సాగుతోందనీ, ఈ వ్యాక్సిన్ నవంబర్, లేదా డిసెంబర్లో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని సీడీసీ చీఫ్, బయోసేఫ్టీ ఎక్స్పర్ట్ గ్విన్‌జెన్ వూ వెల్లడించారు. ఏప్రిల్‌లో స్వయంగా తానే వ్యాక్సిన్ తీసుకున్న తరువాత, తనకు ఎటువంటి అసాధారణ లక్షణాలు కనిపించలేదని గ్విన్‌జెన్ వూ తెలిపారు. అయితే ఆమె ఏ వ్యాక్సిన్ తీసుకున్నారనే విషయాన్ని వెల్లడించలేదు. చైనా ఔషధ దిగ్గజ సంస్థ నేషనల్ ఫార్మాస్యూటికల్ గ్రూప్(సినోఫార్మ్), సినోవా బయోటెక్ అత్యవసర కార్యక్రమం కింద మూడు వ్యాక్సిన్లను అభివృద్ధిచేస్తున్నాయి. కాన్సినో బయోలాజిక్స్ డెవలప్ చేసిన నాల్గో వ్యాక్సిన్‌ని చైనా సైన్యానికి ఉపయోగించేందుకు జూన్‌లో అనుమతి లభించింది. మూడవ దశ ట్రయల్స్ ముగిసిన తర్వాత ఈ ఏడాది చివరి నాటికి ఈ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులో వస్తుందని సినోఫార్మ్ జూలైలో వెల్లడించింది. -
నవంబర్ నుంచి ఎరువుల ఉత్పత్తి
సాక్షి, పెద్దపల్లి: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) నిర్మాణం చివరి దశ పనులు త్వరగా పూర్తి చేస్తామని, నవంబర్ నుంచి ఎరువుల ఉత్పత్తి ప్రారంభించాలని కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ సహాయ మంత్రి మాన్సుఖ్ మాండవ్య అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మిస్తున్న ఆర్ఎఫ్సీఎల్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డితో కలసి శనివారం సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రూ.6,120.5 కోట్లతో చేపట్టిన ఎరువుల కర్మాగార పునరుద్ధరణ పనులు 99 శాతం పూర్తయ్యాయన్నారు. కరోనా కారణంగా ప్లాంట్ పనులు మూడు నెలలు ఆలస్యం అయ్యాయని చెప్పారు. ప్లాంట్‌లో ఏటా 12.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుందని, అందులో 6.25 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణకే కేటాయిస్తామని తెలిపారు. కర్మాగారం పూర్తయ్యాక ఎరువుల కొరత సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా రైతులు దాదాపు 4 కోట్ల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగిస్తారని, 2.5 కోట్ల యూరియా దిగుమతి చేసుకుంటామని వివరించారు. దేశవ్యాప్తంగా ఐదు ఎరువుల కర్మాగారాలు నిర్మిస్తున్నామని తెలిపారు. రైతులు వినియోగించే ఎరువుల బస్తాపై కేంద్ర ప్రభుత్వం రూ.600 నుంచి రూ.700 సబ్సిడీ అందిస్తుందన్నారు. ఈ కర్మాగారం ద్వారా స్థానికంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర ఎరువుల శాఖ అదనపు కార్యదర్శి ధర్మాపిల్, కలెక్టర్ భారతి హోళికేరి, ఆర్ఎఫ్సీఎల్ ఈడీ రాజన్ థాపర్ పాల్గొన్నారు. తమాషా చూస్తున్నారా? పోలీసులపై కిషన్‌రెడ్డి ఆగ్రహం రాష్ట్రంలో ఎక్కడ ప్రతిపక్షాలు ధర్నాలు చేసినా ముందే హౌస్ అరెస్ట్ చేసే పోలీసులు, అధికార పార్టీ నాయకుల విషయంలో పక్షపాతంగా వ్యవహరించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎఫ్సీఎల్ గేటు ఎదుట టీఆర్ఎస్ నాయకులు గంటసేపు ధర్నా చేసినా పట్టించుకోకుండా తమాషా చూస్తున్నారా అని పోలీసులను నిలదీశారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్న క్రమంలో జనాల వద్దకు మంత్రులు వెళ్లొద్దని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా.. తాము వాహనాలను దిగివచ్చి స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేతో మాట్లాడామన్నారు. అక్క డ పెద్దసంఖ్యలో గుమికూడిన ప్రజలను నియంత్రించడంలో పోలీసులు విఫలమ య్యారని విమర్శించారు. రాజకీయం కావా లా? ఫ్యాక్టరీ కావాలా? తెలంగాణ రైతులకు ఉపయోగపడే యూరియా కావాలా? అని ఆయన ప్రశ్నించారు. ఈ నెలాఖరుకు ప్లాంట్‌లో ట్రయల్‌రన్ నిర్వహిస్తామని, నవంబర్‌లో ప్రధాని మోదీ చేతులు మీదుగా ఆర్ఎఫ్సీఎల్ ప్రారంభిస్తామని తెలిపారు. ఆర్ఎఫ్సీఎల్లో ‘లోకల్ ఫైట్’ కేంద్ర మంత్రుల పర్యటన సందర్భంగా రామగుండం ఎరువుల కర్మాగారం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫ్యాక్టరీని సందర్శించేందుకు వచ్చిన కేంద్ర మంత్రులు మాండవ్య, కిషన్‌రెడ్డిని స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఆర్ఎఫ్సీఎల్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించడంతో కేంద్ర మంత్రులు వాహనాలు దిగి వారి వద్దకు వెళ్లారు. ఈ సమయంలో మంత్రులకు, ఎంపీ వెంకటేశ్, ఎమ్మెల్యే చందర్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఆర్ఎఫ్సీఎల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని, ఫ్యాక్టరీని ఆనుకుని ఉన్న వీర్నపల్లి గ్రామాన్ని తరలించాలంటూ టీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. ఇదే క్రమంలో అక్కడకు చేరుకొన్న బీజేపీ నాయకులు కూడా ప్రతిగా నినాదాలు చేశారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఒకదశలో అసహనానికి గురైన కేంద్రమంత్రులు వెనక్కివెళ్లి వాహనాల్లో కూర్చున్నారు. ఈ సమయంలో ఎంపీ వెంకటేశ్ వారివద్దకు వెళ్లి కేంద్రమంత్రులతో మాట్లాడారు. తర్వాత మంత్రులు ఫ్యాక్టరీ లోపలికి వెళ్లారు. ఎంపీ వెంకటేశ్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
కొత్త పురపాలికల్లో నవంబర్ వరకు ఎల్ఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: కొత్త మున్సిపాలిటీలు, మున్సిపాలిటీల్లో విలీనమైన ప్రాంతాల్లోని అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ పథకం గడువును పెంచామని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకునేలా త్వరలో ప్రత్యేకంగా ఎల్ఆర్ఎస్ మేళాలను నిర్వహించనున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకునేలా విస్తృతంగా ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. రానున్న ఐదారేళ్లలో సింహభాగం జనాభా పట్టణ ప్రాంతాల్లో ఉండే అవకాశముందని, దీనికి తగ్గట్టు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమని వివరించారు. పౌర సేవలే కేంద్రంగా నూతన పురపాలక చట్టాన్ని తెలంగాణ తెచ్చిందని, ఈ చట్టంలోని విధులు అధికారాలు కచ్చితంగా పాటించేలా అధికారులు పని చేయాలని సూచించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో గురువారం మహబూబ్‌నగర్, గద్వాల, నారాయణపేట జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలపై మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, స్థానిక ఎమ్మెల్యేలతో కలసి సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లాలుగా ఏర్పడిన నారాయణపేట, గద్వాల్ జిల్లా కేంద్రాల్లో స్పష్టమైన మార్పు కనిపించేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ సూచించారు. మూడు జిల్లాల పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో రోడ్లు, గ్రీనరీ, శ్మశానాల వంటి ప్రాథమిక అంశాలపై శ్రద్ధ వహించాలని కోరారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా అరికట్టేందుకు పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. టాయిలెట్లు, ఫుట్‌పాత్‌ల నిర్మాణాలు వేగంగా చేపట్టాలని సూచించారు. కేటీఆర్ సూచనల మేరకు తమ జిల్లాల పరిధిలోని పురపాలికల్లో అభివృద్ధి పనులు చేపడతామని మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, చైర్మెన్లు పాల్గొన్నారు. -
మరింత దిగజారిన టోకు ధరల సూచీ
సాక్షి, న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ(డబ్ల్యుపీఐ) ద్రవ్యోల్బణం నవంబరు మాసానికి 0.58 శాతంగా నమోదైంది. ప్రధానంగా ఆహార ధరలు కొండెక్కడంతో అక్టోబర్‌లో 0.16గా ఉన్న టోకు ధరల సూచీ మరింత దిగజారింది. కూరగాయల ద్రవ్యోల్బణం 45.32గా వుంది. గత నెలలో ఇది 38.91గా ఉంది. ఈ గణాంకాలు వెలువడిన వెంటనే కీలక సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభంలో 100పాయింట్లకుపైగా ఎగిసిన సెన్సెక్స్ వెంటనే ఫ్లాట్‌గా మారింది. ప్రస్తుతం 54 పాయింట్లు నష్టంతో ట్రేడ్ అవుతోంది. అటు ఆరంభంలో 8 పైసలు ఎగిసిన రూపాయి కూడా నష్టాల్లోకి మారింది. -
నవంబర్‌లో పెరిగిన మారుతీ సుజుకీ ఉత్పత్తి
న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ).. నవంబర్‌లో వాహనాల ఉత్పత్తిని పెంచింది. గత నెలలో మొత్తం వాహనాల ఉత్పత్తి 1,41,834 యూనిట్లుగా నమోదైనట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. అంతక్రితం ఏడాది నవంబర్‌లోని 1,35,946 యూనిట్లతో పోల్చితే ఈసారి ఉత్పత్తి 4.33 శాతం మేర పెరిగినట్లు వెల్లడించింది. ప్రయాణికుల వాహనాల ఉత్పత్తి గతనెల్లో 1,39,084 యూనిట్లు కాగా, అంతకుముందు ఏడాది ఇదే కాలంలోని 1,34,149 యూనిట్లతో పోల్చితే 3.67 శాతం వృద్ధి ఉందని కంపెనీ వివరించింది. అక్టోబర్ నెల కార్ల ఉత్పత్తిలో 20.7 శాతం కోతను విధించి 1,19,337 యూనిట్లకే పరిమితం చేసిన సంస్థ.. గతనెల్లో పెంపును ప్రకటించింది. -
బెర్లిన్ గోడను కూల్చింది ఈ రోజే..
సాక్షి, న్యూఢిల్లీ : తూర్పు, పశ్చిమ దేశాల మధ్య ప్రజలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వెళ్లకుండా, రాకుండా నిర్మించిన 96 మైళ్ల బెర్లిన్ గోడ్‌ను కూల్చేందుకు పూనుకున్నది నేడే. అంటే 1989, నవంబర్ 9వ తేదీ నాడు. ఆ గోడను కూలగొట్టడానికి మూడు రోజులు పట్టింది. అది కూలిన మరుక్షణం నుంచే తూర్పు జర్మనీ ప్రజలు తండోపతండాలుగా దాదాపు 30 లక్షల మంది పశ్చిమ జర్మనీ వెళ్లారు. మరో మూడు రోజుల్లోనే వారిలో ఎక్కువ మంది వెనక్కి తిరిగి వచ్చారు. తూర్పు జర్మనీలో కమ్యూనిస్టు ప్రభుత్వం, పశ్చిమ జర్మనీలో మితవాద ప్రభుత్వం ఉండడంతో ఇరు దేశాల మధ్య అంతర్యుద్ధ పరిస్థితులు నెలకొని ఉండేవి. ఆర్థికంగా వెనకబడిన తూర్పు జర్మనీలో కమ్యూనిస్టు పాలకులు కఠిన చట్టాలను అమలు చేస్తుండడంతో అక్కడి ప్రజలు ఆర్థికంగా పురోభివృద్ధి చెందిన పశ్చిమ జర్మనీకి వలసలు పోయేవారు. రానురాను ఈ వలసలు మరీ ఎక్కువవడంతో జర్మనీ డెమోక్రటిక్ రిపబ్లిక్‌గా పిలిచే తూర్పు జర్మనీ ప్రభుత్వం రెండు దేశాల సరిహద్దులో గోడను కట్టాల్సిందిగా తన సైనికులను ఆదేశించింది. దాంతో వారు 1961, ఆగస్టు 13న గోడ నిర్మాణం లాంఛనంగా ప్రారంభమైంది. ఇరు దేశాల మధ్య 200 రోడ్లను బ్లాక్ చేశారు. బారికేట్లు, తీగలతో మొదలైన 96 మైళ్ల ఈ గోడ ఆ తర్వాత కాంక్రీటు రూపం సంతరించుకుంది. రానురాను తూర్పు జర్మనీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. 1989 నాటికి పశ్చిమ జర్మనీతో పోలిస్తే దేశీయ దిగుబడి 40 శాతానికి పడిపోయింది. అదే ఏడాది అక్టోబర్‌లో అప్పటి రష్యా అధ్యక్షుడు మిహాయిల్ గోర్బచ్చేవ్, తూర్పు జర్మనీలో పర్యటించగా, ‘గోర్బీ హెల్ప్ అస్, గోర్బీ హెల్ప్ అస్’ జీడీర్ ప్రజలు నినాదాలు చేశారు. ఆ మరుసటి నెలలోనే ప్రజలు బెర్లిన్ గోడను కూల్చేందుకు స్వచ్ఛందంగా రంగంలోకి దిగారు. ప్రజాగ్రహాన్ని గమనించిన జీడీఆర్ ప్రభుత్వం దేశ పాలనలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. -
తదుపరి సీజేఐ జస్టిస్ బాబ్డే
న్యూఢిల్లీ: కీలకమైన పలు కేసులను విచారిస్తున్న జస్టిస్ శరత్ అరవింద్ బాబ్డే(63) సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ బాబ్డే నవంబర్ 18వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2021 ఏప్రిల్ 23 వరకు అంటే 17 నెలల పాటు జస్టిస్ బాబ్డే పదవిలో కొనసాగుతారు. సుప్రీంకోర్టులో సీనియారిటీ ప్రకారం జస్టిస్ బాబ్డే రెండో స్థానంలో ఉన్నారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీకాలం నవంబర్ 17వ తేదీతో ముగియనుంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో 1956 ఏప్రిల్ 24న బాబ్డే జన్మించారు. ఈయన తండ్రి ప్రముఖ న్యాయవాది అరవింద్ శ్రీనివాస్ బాబ్డే. నాగపూర్ యూనివర్సిటీ నుంచే బీఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1978లో బాబ్డే మహారాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడిగా చేరారు. బాంబే హైకోర్టులో 21 ఏళ్లు పనిచేశారు. 1998లో ఆయన్ను సీనియర్ న్యాయవాదిగా నియమించారు. 2000లో బోంబే హైకోర్టు అడిషనల్ జడ్జిగా, 2012లో మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. కీలక తీర్పుల్లో జస్టిస్ బాబ్డే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గోప్యత పౌరుడి ప్రాథమికహక్కు అంటూ 2017లో చారిత్రక తీర్పునిచ్చిన తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ బాబ్డే కూడా ఒకరు. జస్టిస్ బాబ్డే సహా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని 9 మంది సభ్యుల ధర్మాసనం గోప్యత హక్కుకు రాజ్యాంగం రక్షణ కల్పించిందని వ్యాఖ్యానించింది. దేశ పౌరులెవరూ కూడా ఆధార్ కార్డు లేని కారణంగా కనీస సదుపాయాలను గానీ, ప్రభుత్వ సేవలకూ గానీ దూరం కారాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాలుష్యాన్ని వెదజల్లుతోన్న టపాసులను కాల్చడాన్ని పూర్తిగా నిషేధించాలన్న వాదనను ఈ ఏడాది మార్చిలో జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. రాజకీయంగా అత్యంత సున్నితమైన రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదం కేసును విచారిస్తోన్న ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ బాబ్డే కూడా ఉన్నారు. యావద్దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఈ కేసుపై సుప్రీంకోర్టు నవంబర్ 15న తుదితీర్పును వెలువరించనుంది. ఆ తరువాత రెండు రోజులకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేయనున్నారు. -
ఏడాది కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
సాక్షి,ముంబై: నవంబర్ నెలలో వినియోగదారుల ధరల సూచి (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాది కనిష్టానికి దిగి వచ్చింది. బుధవారం వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2.33 శాతంగా నమోదైంది. అక్టోబర్ నెలలో ఇది 3.31 శాతంగా ఉంది. వరుసగా గత నాలుగు నెలలుగా దిగి వస్తున్న రీటైల్ ద్రవ్యోల్బణం తాజాగా దీంతో 2017 జులై నాటి స్థాయిని నమోదు చేసింది. మరోవైపు పారిశ్రామికవృద్ధి రేటు రెండింతలైంది. ఇది ఆర్థికవ్యవస్థకు డబుల్ బొనాంజా అని విశ్లేషకులు పేర్కొన్నారు. పారిశ్రామిక వృద్ధి రేటు అక్టోబర్ నెలలో 8.1 శాతం పెరిగింది.ఇది ఏడాది గరిష్టం. సిఎస్ఓ డేటా ప్రకారం కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ 2.61 శాతంతో పోలిస్తే.. తాజాగా 0.86 శాతంగా ఉంది. గత నెలలో 7.39 శాతంతో పోలిస్తే ఇంధనం ద్రవ్యోల్బణం 8.55 శాతంగా నమోదైంది. దుస్తులు, పాదరక్షల ద్రవ్యోల్బణం అక్టోబరు 3.55 శాతంతో పోలిస్తే 3.53 శాతం వద్ద ఉంది. హౌసింగ్ ద్రవ్యోల్బణం నవంబరు 5.99గా నమోదుకాగా అంతకుముందు నెలలో ఇది 6.55 శాతంగా ఉంది. -
నెలాఖరులో వరుస బ్యాంకు సెలవులు
సాక్షి, ముంబై: నవంబరు నెలాఖరులో బ్యాంకులు నాలుగు రోజులు మూత పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారంలో వీలైనంత త్వరగా ముఖ్యమైన బ్యాంకు పనులు పూర్తి చేసుకోవాలని బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ అసోసియేషన్ వెల్లడించింది. అయితే తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నవంబరులో దీపావళి, ఈద్ (నేడు) రెండే పండుగ సెలవులు. అసోసియేషన కార్యదర్శి వికె శెంగర్ అందించిన సమాచారం ప్రకారం ఈద్-ఎ-మిలాద్ సందర్భంగా ఈ రోజు బ్యాంకులు కొన్ని రాష్ట్రాల్లో పని చేయలేదు. నవంబరు 21 (ఈద్)న అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, గోవా, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, పంజాబ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్లో బ్యాంకులకు సెలవు లేదు. అలాగే గురునానక్ జయంతిని పురస్కరించుకొని నవంబరు 23న కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు. అయితే తెలుగు రాష్ట్రాలు, బిహార్, డామన్ అండ్ డయ్యు, గోవా, కర్ణాటక, కేరళ, మణిపూర్, మేఘాలయ, ఒడిశా, పాండిచ్చేరి, సిక్కిం, తమిళనాడు, త్రిపుర మినహా మిగిలిన రాష్ట్రాల్లో బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయి. 24, నవంబర్ - నాలుగో శనివారం పంజాబ్‌లో మాత్రమే సెలవు 25, నవంబర్ - ఆదివారం 26, నవంబర్ - కనకదాస్ జయంతి సందర్భంగా కర్ణాటకలో మాత్రమే సెలవు. అయితే సెలవు రోజుల్లో ఏటీఎంలలో నగదుకు ఎలాంటి కొరత ఉండదని బ్యాంకులు స్పష్టం చేశాయి. -
నవంబర్‌లో శాసనసభ ఎన్నికలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయడంతో ముందస్తు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఈ ఏడాది నవంబర్లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. నవంబర్లోనే ఎన్నికలు జరిపేలా ఓటర్ల జాబితా షెడ్యూల్‌ను సవరించింది. సాధారణ షెడ్యూల్ కంటే మూడు నెలల ముందుగానే ఈ ప్రక్రియను పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టింది. 2019 సాధారణ ఎన్నికల కోసం గతంలో ప్రకటించిన షెడ్యూల్లో ఈ మేరకు మార్పులు చేసింది. అక్టోబరు 8న ఓటర్ల తుది జాబితాను ఖరారు చేయనుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) రజత్‌కుమార్ ఈ మేరకు శనివారం కొత్త షెడ్యూల్ జారీ చేశారు. 2018 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండేవారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో పేరు ఉన్నవారికే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుందని స్పష్టంచేశారు. ఓటరు జాబితాలో పేరుతో పాటు గుర్తింపు కార్డు కూడా ఉండాలని పేర్కొన్నారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఓటరు నమోదు ప్రక్రియ జరుగుతుందని రజత్‌కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. ఓటరు జాబితా రూపకల్పన షెడ్యూల్ పూర్తి కాగానే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత గరిష్టంగా 50 రోజులలోపు ఫలితాల ప్రకటనతో పాటు మొత్తం ప్రక్రియ పూర్తి చేయనుంది. ఓటరు జాబితా తాజా షెడ్యూల్ ప్రకారం చూస్తే డిసెంబర్ మొదటి వారంలోపే ఎన్నికల ఫలితాలు సైతం వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. ఓటర్ల జాబితా షెడ్యూల్లో మార్పులు చేసిన నేపథ్యంలో ఓటర్ల నమోదు విషయంలోనూ ఎన్నికల కమిషన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సెస్టెంబర్ 15, 16 తేదీల్లో గ్రామసభలు, స్థానిక సంస్థలో ఓటరు నమోదు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. 2018 జనవరి 1 ఆధారం... కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి ఏటా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిర్వహిస్తుంది. జనవరి 1వ తేదీ ఆధారంగా 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పిస్తుంది. ప్రతి ఏటా జనవరి మొదటి వారంలో తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తుంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా షెడ్యూల్ ప్రక్రియలో మార్పులు జరిగాయి. పాత షెడ్యూల్ ప్రకారం 2019 జనవరి 1ని క్వాలిఫైయింగ్ తేదీగా నిర్ధారించగా, తాజా మార్పుల నేపథ్యంలో 2018 జనవరి 1 వరకు 18 ఏళ్లు నిండినవారికి మాత్రమే ఓటు హక్కు కల్పించనున్నారు. సాధారణ ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 1న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసింది. తాజా మార్పుల నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో రూపొందించిన ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. -
నవంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు!!
-
పెళ్లి పిలుపులు!
స్నేహితులను, బంధు మిత్రులను పెళ్లికి పిలుస్తున్నారట దీపికా పదుకోన్. బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్‌తో ఆమె వివాహం ఈ ఏడాది నవంబర్‌లో ఇటలీలో జరగనుందన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 12–14 తేదీల మధ్యలో దీపికా–రణ్‌వీర్‌ల వివాహం ఫిక్స్ అయ్యిందని బీటౌన్ టాక్. ఆల్రెడీ వీరిద్దరూ సన్నిహితులకు పెళ్లి ఆహ్వానాలను కూడా పంపుతున్నారట. ఇటలీలో జరగనున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కి చాలా తక్కువ మందిని పిలిచి, ఆ నెక్ట్స్ ముంబైలో గ్రాండ్‌గా అందరికీ రిసెప్షన్ అరేంజ్ చేయాలని భావిస్తున్నారట దీపికా అండ్ రణ్వీర్. ప్రస్తుతం తెలుగు ‘టెంపర్’ హిందీ రీమేక్ ‘సింబా’ సినిమాతో బిజీగా ఉన్నారు రణ్వీర్. ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత ఈ వివాహం జరుగుతుందట. ‘పద్మావతి’ చిత్రం విడుదలై ఆర్నెళ్లు అయినా దీపికా పదుకోన్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఇంకా క్లారిటీ రాలేదు. తాజాగా ఆమె నీరజ్ గయవాన్ దర్శకత్వంలో రూపొందనున్న ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ టాక్. ఈ సినిమా దీపికా పెళ్లి తర్వాత సెట్స్‌పైకి వెళ్తుందట. -
ఆ బ్యూటీ సినీ కెరీర్, జీవితం.. రెండూ సంచలనమే..
సాక్షి, చెన్నై: అగ్రనటి నయనతారపై రోజుకో సంచలన వార్త ప్రచారమవుతూ ఆమె అభిమానుల్ని టెన్షన్‌కు గురిచేస్తోంది. ఈ బ్యూటీ సినీ కెరీర్, వ్యక్తిగత జీవితం రెండూ సంచలనంగానే సాగుతున్నాయి. నటిగా వద్దంటే అవకాశాలన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇక వ్యక్తిగతంగా చూస్తే ప్రేమ, జాలీ అంటూ యమజోరుగా సాగిపోతోంది. దర్శకుడు విఘ్నేశ్‌శివతో పరిచయం నయనతార దిశను మార్చేసిందనే చెప్పాలి. వీరి కాంబినేషన్లో తెరకెక్కిన నానూమ్ రౌడీదాన్ చిత్రం హిట్. ఆ చిత్రంతో పరిచయం అయిన ఈ జంట బంధం బలపడింది. నయనతార, విఘ్నేశ్‌శివల మధ్య ప్రేమ వ్యవహారం సాగుతోందన్న ప్రచారమే తప్ప వారిద్దరూ ఆ విషయాన్ని బయటపెట్టలేదు. ఇటీవలే నయనతార డేర్ చేసి నా కాబోయే భర్తకు ధన్యవాదాలు అంటూ బహిరంగంగా విఘ్నేశ్‌శివతో తన బంధాన్ని స్పష్టం చేశారు. అయితే అంతకు ముందు చాలా విషయాలు జరిగాయన్నదే తాజా సమాచారం. నయనతారకు విఘ్నేశ్‌శివకు ఇటీవల కేరళలో అత్యంత రహస్యంగా వివాహ నిశ్చితార్థం జరిగిందని, ఆ వేడుకను ఎంజాయ్ చేయడానికే ఈ జంట అమెరికాకు వెళ్లినట్లు తెలిసింది. అయితే నయనతార, విఘ్నేశ్‌శివల వివాహ నిశ్చితార్థం ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్యనే జరిగిందట. మరో విషయం ఏమిటంటే వచ్చిన అవకాశాలన్నీ ఒప్పేసుకుంటున్న నయనతార త్వరలో నటనకు గుడ్‌బై చెప్పేయడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. అవును ఇప్పటికే నయనతార, విఘ్నేశ్శివలకు అర్ధ పెళ్లి జరిగిపోగా నవంబర్‌లో ఈ ప్రేమజంట పెళ్లి పీటలెక్కడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం. వివాహానంతరం నయనతార నటనకు టాటా, బైబై చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం హల్చల్ చేస్తోంది. ఇందులో నిజం ఎంత అన్నది తెలియాలంటే ఈ సంచలన జంట కల్యాణ ఘడియల వరకూ ఆగాల్సిందే. -
మరోసారి సత్తా చాటిన జియో
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం సంచలనం రిలయన్స్ జియో మరోసారి తన సత్తాను చాటుకుంది. 4జీ నెట్వర్క్ స్పీడ్‌లో మరోసారి టాప్‌లో నిలిచింది. వరుసగా 11వ సారి కూడా జోరును సాగించిన జియో నవంబర్‌లో నెలలో మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. తద్వారా ప్రధాన ప్రత్యర్థులు ఎయిర్టెల్, వొడాఫోన్లకు భారీ నిరాశను మిగిల్చింది. ఆరంభం నుంచి కస్టమర్లకు ఆఫర్లను అందించడంలో దూకుడును ప్రదర్శించిన టెలికాం సంస్థ రిలయన్స్ జియో వినియోగదారులకు హైస్పీడ్ డేటాను అందివ్వడంలో మళ్లీ టాప్ లో నిలిచిందనీ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వెల్లడించింది. ట్రాయ్ తన మై స్పీడ్ టెస్ట్ యాప్ ద్వారా సేకరించిన గణాంకాల ప్రకారం నవంబరు నెలలో దేశవ్యాప్తంగా ఉన్న టెలికాం సంస్థలు అందించిన డేటా స్పీడ్‌లో జియో మొదటి స్థానంలో నిలిచింది. ట్రాయ్ డేటా నవంబరు 2017 నాటికి 25.6 ఎంబీపీఎస్ వేగంతో 4జీ సర్వీసు ప్రొవైడర్ల జాబితాలో రిలయన్స్ జియో మొదటిస్థానంలో నిలిచింది. జియోకు సన్నిహిత ప్రత్యర్థి వోడాఫోన్ సెకనుకు 10 మెగాబిట్ ఎంబీపీఎస్, భారతీ ఎయిర్టెల్ 9.8 ఎంబీపీఎస్, ఐడియా సెల్యూలార్ 7 ఎంబీపీఎస్ వేగాన్ని అందించాయి. అప్లోడ్ వేగంలో ఐడియాను వెనక్కినెట్టి వోడాఫోన్ నవంబరులో 6.9 ఎంబీపీఎస్ వేగాన్ని నమోదు చేసింది. ఆ తరువాతి స్థానాల్లో ఐడియా(6.6 ఎంబీపీఎస్), జియో( 4.9 ఎంబీపీఎస్) నిలిచాయి. ఎయిర్టెల్ 4 ఎంబీపీఎస్ వేగాన్ని మాత్రమే నమోదు చేసింది. -
19 నెలల గరిష్టానికి ఈసీఐ ఇండెక్స్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని ప్రధాన రంగాలు రికార్డ్ స్థాయిలో భారీగా పుంజుకున్నాయి. ఐఐపీ డేటాలో 40శాతం వెయిటేజీ ఉన్న ఈసీఐ ఇండెక్స్ (ఎయిట్ కోర్ ఇండెక్స్) నవంబర్ నెలలో వృద్ధిరేటు 6.8 శాతం వృద్ధిని రేటును నమోదు చేసింది. దీంతో మౌలిక సదుపాయాల ఉత్పత్తి 19 నెలల గరిష్టాన్ని తాకింది. గత ఏడాది ఇదే నెలలో ఇది 3.2 శాతంగా ఉంది. బొగ్గు, ఉక్కు, సిమెంటు, విద్యుత్ వంటి ప్రధాన రంగాల ఉత్పాదనను సూచించే ఈసీఐ ఇండెక్స్ తాజా గణాంకాలను వాణిజ్య, పరిశ్రమల శాఖ సోమవారం విడుదల చేసింది. ఏప్రిల్, నవంబర్ మధ్యకాలంలో పారిశ్రామిక వృద్ధిరేటు 3.9 శాతంగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఐఐపి వృద్ధిరేటు 5.3 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే నెలలో 3.2 శాతం వృద్ధి సాధించిన ఎనిమిది ప్రధాన రంగాల వృద్ధిరేటు 6.8 శాతం వృద్ధి చెందిందని వాణిజ్య పరిశ్రమల శాఖ పేర్కొంది. ముఖ్యంగా సంవత్సరం ప్రాతిపదికన ఫెర్టిలైజర్స్, కోల్, క్రూడ్ ఆయిల్, నాచురల్ గ్యాస్,ఎలక్ట్రిసిటీ, స్టీల్ , పెట్రోలియం అండ్ రిఫైనరీ ఉత్పత్తి బాగా ఉంజుకుంది. స్టీల్ 8.4 శాతం నుంచి పుంజుకుని 16.6శాతం గానూ, సిమెంట్ సెక్టార్ -2.7నుంచి ఎగిసి 17.3శాతంగా నమోదైంది. అయితే మంత్ ఆన్ మంత్ బొగ్గు ఉత్పత్తి 0.2 శాతం, చమురు ఉత్పత్తి 0.2 తగ్గింది. స్టీల్ ఉత్పత్తి 16.6గా ఉంది. సిమెంట్ ఉత్పత్తి కూడా 2.7శాతం (నెలవారీ)క్షీణించి 17.3శాతంగా నమోదుకాగా, విద్యుత్ ఉత్పత్తి 2.1 శాతం క్షీణించి 2.1గా ఉంది. -
వాహన విక్రయాల జోరు:టాప్ గేర్‌లో దిగ్గజాలు
సాక్షి,న్యూఢిల్లీ: నవంబర్ వాహనాల అమ్మకాల్లో దిగ్గజ కంపెనీలు దూసుకుపోయాయి. మారుతి సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా, టొయోటాతో సహా ఆటో మేజర్లన్నీ గత నెలలో ఆరోగ్యకరమైన వృద్ధిని పోస్ట్ చేసాయి. భారీగా పుంజుకున్న అమ్మకాలతో డబుల్ డిజిట్ గ్రోత్ సాధించాయి. ఇయర్ ఆన్ ఇయర్ 26శాతం వృద్ధిచెందిన మొత్తంఅమ్మకాలు 6లక్షలకుపైగా నమోదయ్యాయి. గ్రామీణ మార్కెట్లలో డిమాండ్ పెరగడంతో పాటు కొత్త మోడళ్ళకు మంచి స్పందన లభిస్తోంది. మారుతి సుజుకీ ఇండియా అమ్మకాలు 15 శాతం పెరిగి 1,45,300 యూనిట్లు విక్రయించగా .. గత ఏడాది నవంబర్‌లో 1,26,325 యూనిట్లు విక్రయించింది. ఇందులో స్విఫ్ట్, డిజైర్, బాలెనో కార్ల అమ్మకాలు 32.4 శాతం పెరిగి 65,447 యూనిట్లకు చేరుకున్నాయి. యుటిలిటీ వాహన విక్రయాలు, జిప్సీ, గ్రాండ్ విటారా, ఎర్టిగా, ఎస్-క్రాస్, కాంపాక్ట్ ఎస్యూవీ వీటారా బ్రెజ్జాలతో సహా నవంబర్ నెలలో 34 శాతం పెరిగి 23,072 యూనిట్లు విక్రయించింది. అయితే, ఆల్టో, వ్యాగన్ఆర్ సహా మినీ సెగ్మెంట్ కార్ల అమ్మకాలు 1.8 శాతం క్షీణించి 38,204 యూనిట్లు విక్రయించగా .. అక్టోబర్‌లో 38,886 యూనిట్లు అమ్ముడయ్యాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) దేశీయ అమ్మకాల్లో 10 శాతం పెరిగి 44,008 యూనిట్లు విక్రయించింది. గ్రాండ్ ఐ 10, ఎలైట్ ఐ 20, క్రేతాతో పాటుగా తరువాతి తరానికి చెందిన వెర్నా బలమైన పనితీరు కారణంగా గత నెలలో వృద్ధి సాధించామని హెచ్ఎంఐఐఎల్ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ తెలిపారు సెప్టెంబర్ నుంచి డిసెంబరు 2017 వరకూ గ్రామీణ ప్రాంతాల డిమాండ్‌తో పాటు, పండుగ సీజన్కారణంగా నమోదైన వృద్ధితో..2 లక్షల యూనిట్ల రిటైల్ అమ్మకాలను ఆశిస్తున్నట్టు చెప్పారు. దేశీయ మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 21 శాతం వృద్ధితో 36,039 యూనిట్లు విక్రయించింది. ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో స్కోర్పియో, జియోలో, బొలోరో, వెరిటోలతో పోలిస్తే 21 శాతం పెరిగి 16,030 యూనిట్లు విక్రయించగా గత ఏడాది ఇదే నెలలో 13,198 యూనిట్లు విక్రయించింది. 2017 నవంబరు నెలలో సానుకూల వృద్ధి దశలో వున్నందుకు సంతోషిస్తున్నామని ఎం అండ్ ఎం ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ సెక్టార్) రాజన్ వధేర తెలిపారు. ఫోర్డ్ నవంబర్ నెలలో 13.1 శాతం వృద్ధితో 7,777 యూనిట్లు విక్రయించింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ అమ్మకాల్లో 13 శాతం వృద్ధితో 12,734 యూనిట్లు విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో 11,309 యూనిట్లు విక్రయించింది. ఇక ద్విచక్ర వాహన విభాగంలో ద్విచక్ర వాహన అమ్మకాలు 21 శాతం పెరిగి 3,26,458 యూనిట్లు విక్రయించగా గత ఏడాది ఇదే నెలలో 2,69,948 యూనిట్లు విక్రయించింది. ఐషర్ మోటార్స్ ద్విచక్ర వాహన విభాగంలోని రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు 21 శాతం పెరిగి 7,776 యూనిట్లు విక్రయించగా గత ఏడాది ఇదే నెలలో 55,843 యూనిట్లగా నమోదైంది. సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా అమ్మకాలు 42,722 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 30,830 యూనిట్లు విక్రయించగా .. 38.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. -
నవంబర్ 28న మెట్రో రైలు పరుగులు
-
దేశవ్యాప్తంగా బ్లాక్ డే
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా కుదిపేసి.. సరికొత్త మార్పులకు నాంది పలికిన నోట్లరద్దు నిర్ణయానికి బుధవారం ఏడాది నిండిన సందర్భంగా అధికార, ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించాయి. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ‘చీకటిదినం’ పేరుతో ఆందోళనలు నిర్వహించాయి. అధికార బీజేపీ నల్లధన వ్యతిరేక దినోత్సవం పేరుతో సంబరాలు జరిపింది. నల్లధనంపై ఉక్కుపాదం మోపేందుకు, నగదు రహిత ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహించేందుకు డిమానిటైజేషన్‌ను చేపట్టినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నోట్లరద్దు నిర్ణయంతో తమ వద్ద ఉన్న పెద్దనోట్లు మార్చుకోవడానికి ప్రజలు అష్టకష్టాలు పడ్డారని, ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందని విపక్ష నాయకులు ఆరోపించారు. ఇప్పటికీ కష్టాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌తోపాటు లెఫ్ట్ తదితర విపక్ష పార్టీలు బ్లాక్‌డేలో పాల్గొని ఆందోళనలకు దిగాయి. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ భారీ మారథాన్ నిర్వహించింది. నల్లదుస్తులు ధరించి కాంగ్రెస్ నేతలు, శ్రేణులు ఈ రన్లో పాల్గొని.. పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కశ్మీర్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు సహా పలు చోట్ల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించారు. రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన జరిపారు. వామపక్షాలు, ఇతర సామాజిక సంఘాలూ ఆందోళనల్లో పాలుపంచుకున్నాయి. మిఠాయిలు పంచిన బీజేపీ నాయకులు విపక్షాల బ్లాక్ డేకు వ్యతిరేకంగా బీజేపీ బుధవారం అన్ని రాష్ట్రాల్లో నల్లధన వ్యతిరేక దినాన్ని జరిపింది. పలు చోట్ల జరిగిన కార్యక్రమాలు మంత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశ రాజధానిలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ నేతృత్వంలో వేడుకలు నిర్వహించారు. నోట్లరద్దుతో ఉగ్రవాదం, అవినీతి తగ్గిందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ శ్రేణులు ఉత్తరప్రదేశ్‌లో పెద్దనోట్ల రద్దుకు ఏడాది పూర్తయిన సందర్భంగా సంబరాలు నిర్వహించాయి. మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో మోదీ ఫొటోకు స్వీట్లు తినిపిస్తూ.. కొత్త నోట్లను ప్రదర్శిస్తూ.. బీజేపీ నేతలు ’డిమానిటైజేషన్’ సంబరాలు నిర్వహించారు. నోట్లను రద్దు చేయడం వల్ల ఉగ్రవాదం వెన్ను విరిగిందని, కశ్మీర్లో రాళ్లు విసిరే ఘటనలు తగ్గాయని బీజేపీ నాయకులు అన్నారు. నల్లధనంపై యుద్ధం.. 125 కోట్ల మంది విజయం : ప్రధాని నరేంద్ర మోదీ పెద్దనోట్ల రద్దు నల్లధనంపై చేపట్టిన యుద్ధంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. ‘నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా 125 కోట్ల మంది భారత ప్రజలు నిర్ణయాత్మక యుద్ధం చేసి.. గెలిచారు. నల్లధనాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను సమర్థించిన ప్రతి భారతీయుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’ అని ప్రధాని బుధవారం మోదీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పెద్దనోట్ల రద్దుతో చేకూరిన ప్రయోజనాలను ఓ లఘుచిత్రం రూపంలో తీసుకొచ్చారు. ఈ వీడియోను ప్రధాని మోదీ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. పెద్దనోట్ల రద్దుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక ప్రయోజనాలు కనిపించాయని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. ఇదొక మహావిషాదం : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ పెద్దనోట్ల రద్దు విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ మరోసారి మండిపడ్డారు. నోట్లరద్దు పూర్తిగా అనాలోచిత నిర్ణయమని స్పష్టం చేస్తూ ‘విషాదం’ అనే మాటకు ఏమాత్రం తక్కువ కాదని వ్యాఖ్యానించారు. ట్విటర్ వేదికగా ఆయన బుధవారం స్పందిస్తూ... ‘నోట్ల రద్దు ఓ విషాదం. ప్రధాని తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా జీవితాలు, జీవనోపాధి కోల్పోయిన కోట్లాదిమంది నిజాయతీపరులైన భారతీయులకు మేము అండగా ఉంటాం’ అని సందేశం పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక హిందీ పద్యాన్ని కూడా ఉటంకించారు. ‘ఒక్క కన్నీటి బొట్టు కూడా ప్రభుత్వానికి ప్రమాదకరమే. అయితే మీరు ఇంతటి కన్నీటి సముద్రాన్ని చూసి ఉండరు...’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. దీనికి ఆయన జతచేసిన ఓ వయోధికుడి ఫోటో కంటతడి పెట్టించేలా ఉంది. డబ్బు చేతికి అందక ఏటీఎం ముందు నిలబడి విలపిస్తున్న ఈ దృశ్యం నెటిజన్లను కదిలిస్తోంది. సంక్షిప్తంగా.. నోట్లరద్దు కారణంగా అనేక మంది తమ జీవితాలను, ఉద్యోగాలను కోల్పోయారని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆరోపించారు. ప్రస్తుతం రూ. 15 లక్షల కోట్లు నగదు చలామణీలో ఉందని, త్వరలో అది రూ. 17 లక్షల కోట్లకు చేరుకుంటుందని అన్నారు. కృత్రిమంగా నగదు కొరత సృష్టించడం వల్ల ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందన్నారు. తమిళనాడువ్యాప్తంగా విపక్ష పార్టీ డీఎంకే బ్లాక్ డే కార్యక్రమాల్లో పాల్గొంది. నోట్లరద్దు సామాన్యుడికి కష్టాలు మినహా ఏమీ మిగల్చలేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ అన్నారు. బ్యాంకు క్యూల్లో నిలబడి ఎంతో మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుత ప్రభుత్వ తప్పుడు విధానాలు ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశాయన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల బీజేపీ మిత్రులే లబ్ధి పొందారన్నారు. ప్రభుత్వం చెప్తున్నట్లుగా ప్రజలకేమీ మేలు జరగలేదని స్టాలిన్ స్పష్టం చేశారు. పాట్నాలో జరిగిన బ్లాక్ డే ఆందోళనల్లో పాల్గొన్న ఆర్జేడీ అధిపతి లాలూ ప్రసాద్ యాదవ్ మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నోట్లరద్దు వల్ల సంపన్నులు సులువుగా తమ నల్లధనాన్ని తెలుపుగా మార్చుకున్నారని ఆరోపించారు. బిహార్ వ్యాప్తంగా ఆర్జేడీ ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించింది. నోట్లరద్దు తొందరపాటు, అపరిపక్వ నిర్ణయమని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. దీనివల్ల కోట్ల మంది భారతీయులు ఇబ్బందిపడ్డారని చెప్పారు. ఇప్పటికీ ఇబ్బందులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ వద్దే నల్లదనం అధికంగా ఉందనే విషయం ప్యారడైజ్ పత్రాల ద్వారా వెల్లడయిందన్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజధాని ముంబైలో జరిగిన బ్లాక్ డేలో పాల్గొన్న మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ నోట్లరద్దుపై పార్లమెంటరీ సంయుక్త సంఘంతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీజేపీ మిత్రపక్షం కూడా అయిన శివసేన అధికార పార్టీకి కర్మకాండలు నిర్వహించింది.ఎన్సీపీ నాయకులు పుణేలో బ్లాక్ డే నిర్వహించారు. పార్టీ అధిపతి శరద్ పవార్ సహా కీలక నేతలు పలువురు ఆందోళనల్లో పాల్గొన్నారు. -
రియల్ ఎస్టేట్‌కు 8/11 షాక్!
సాక్షి, హైదరాబాద్ : సరిగ్గా ఏడాది క్రితం కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేసేసింది.. పేద ప్రజలు మొదలు వ్యాపారవర్గాల వరకు ఒక్కసారిగా కలకలం చెలరేగింది.. దాదాపు మూడు నెలల పాటు పూర్తి గందరగోళం సృష్టించింది.. ఆ నోట్ల రద్దు పరిణామాలు రాష్ట్రంపై గణనీయస్థాయిలో ప్రభావం చూపాయి. ప్రధానంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో కీలకమైన నిర్మాణ రంగాన్ని దెబ్బతీశాయి. తీవ్రంగా ‘నగదు’ సంక్షోభం గతేడాది నవంబర్ 8న కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసింది. ఈ ఏడాది వ్యవధిలో బ్యాంకు లావాదేవీలు, నగదు చలామణీ తీవ్ర సంక్షోభాన్ని చవిచూశాయి. రూ.1,000, రూ.500 నోట్లను రద్దు చేయటంతో మొదటి మూడు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆర్థిక లావాదేవీలు స్తంభించిపోయాయి. నగదు కొరత కారణంగా నిత్యావసరాలు తప్ప మరేమీ కొనుగోలు చేయలేని దుస్థితి ఇంటింటా కనిపించింది. డబ్బులు తెచ్చుకునేందుకు బ్యాంకులు, ఏటీఎంల ముందు రోజుల తరబడి క్యూలు దర్శనమిచ్చాయి. ఈ ప్రభావం వ్యాపార, వాణిజ్య వర్గాలన్నింటిపైనా పడింది. చిన్నాచితక, చిల్లర వ్యాపారాలు చేసుకుని పొట్ట పోసుకునే సామాన్యులంతా తల్లడిల్లిపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు, ఉపాధి కూలీలు సైతం రోజువారీగా వచ్చే కూలి డబ్బులను అందుకోలేకపోయారు. క్రమంగా ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు నానా హంగామా చేశాయి. నగదు అందుబాటులో లేక గత్యంతరం లేని స్థితిలో డిజిటల్ లావాదేవీల దిశగా మార్కెట్ ముందుకు సాగింది. మొత్తంగా నోట్ల రద్దు నాటి నుంచి ఏకంగా 34 కోట్ల డిజిటల్ లావాదేవీలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు దాదాపు 212 గ్రామాలను నగదు రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం, బ్యాంకులు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించాయి. అయితే నగదు లావాదేవీలకు అలవాటు పడ్డ గ్రామీణ ప్రాంత ప్రజల అవసరాలను తీర్చలేకపోవటంతో అది మూడు నెలల ముచ్చటగానే ఆగిపోయింది. రియల్ ఎస్టేట్‌పై పంజా కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటున్న తరుణంలో నోట్ల రద్దు దెబ్బపడింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేల కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. గతేడాది నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం దాదాపు రూ.500 కోట్ల మేర తగ్గిపోయింది. కేవలం నగదుపై ఆధారపడి జరిగే ప్లాట్లు, లేఅవుట్ లావాదేవీలపై తీవ్ర ప్రభావం పడింది. భూముల క్రయవిక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. హైదరాబాద్ పరిసరాల్లోనే దాదాపు ఆరు వేల రియల్ ప్రాజెక్టులు, వెంచర్లు అర్ధంతరంగా ఆగిపోయాయి. దాంతో రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి కూడా గండిపడింది. జనం ప్లాట్లు కొనాలన్నా, అమ్మాలన్నా వెనుకంజ వేయడంతో.. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు ఆందోళనకర స్థాయిలో తగ్గాయి. రాష్ట్ర రాజధాని చుట్టుపక్కల 2015–16లో రూ.300 కోట్ల పెట్టుబడులురాగా.. 2016 జూన్ నుంచి 2017 జూన్ వరకు పెట్టుబడులు 35 శాతం తగ్గి.. కేవలం రూ.195 కోట్లకు పడిపోయాయి. దీంతో రియల్ఎస్టేట్ రంగంపై ఆధారపడిన ఉద్యోగులు, నిర్మాణ కూలీల వంటి వేలాది మంది ఉపాధి అవకాశాలూ దెబ్బతిన్నాయి. బ్యాంకుల వైపు చూస్తేనే భయం! నోట్ల రద్దు తర్వాత తమ బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బులను విత్‌డ్రా చేసుకునేందుకు, పాత నోట్లను కొత్త నోట్లతో మార్పిడి చేసుకునేందుకు ప్రజలు ముప్పుతిప్పలు పడ్డారు. అదే సమయంలో బ్యాంకర్లు వ్యవహరించిన తీరు, గంటల తరబడి నిరీక్షణలన్నీ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రభావితం చేశాయి. దానికితోడు ఏటీఎం నుంచి, ఖాతాలో నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు రకరకాల ఆంక్షలు విధించటంతో ఖాతాదారులు బెంబేలెత్తిపోయారు. బ్యాంకులో డబ్బులు జమచేసి ఇబ్బంది పడేకంటే బ్యాంకులకు దూరంగా ఉండటమే మంచిదనే అభిప్రాయం వెల్లువెత్తింది. దాంతో దాదాపు ఆరు నెలల పాటు అత్యవసర లావాదేవీలు, నగదు విత్‌డ్రా తప్ప నగదు జమ చేసేందుకు బ్యాంకులకెవరూ రావడంలో లేదని ఆర్బీఐ సైతం విస్తుపోయింది. 40 శాతం పెరిగిన పన్నుదారులు నోట్లరద్దు సమయంలోనే ప్రభుత్వం బ్యాంకు ఖాతాలను ఆధార్‌కు అనుసంధానం చేయటంతోపాటు ఖాతాల్లో లావాదేవీలపై ఐటీ శాఖను అప్రమత్తం చేసింది. దీనివల్ల రాష్ట్రంలో ఆదాయ పన్ను చెల్లింపుదారుల సంఖ్య దాదాపు 40 శాతం పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఐటీ భయం సామాన్యులు, చిన్న వ్యాపారులు, చిన్న, మధ్యతరగతి ఉద్యోగులను వెంటాడుతోంది. బ్యాంకు లావాదేవీలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తమ పంటల పెట్టుబడులకు, పేద, మధ్య తరగతి కుటుంబాలు తమ పిల్లల పెళ్లిళ్లు, చదువుల కోసం కూడబెట్టిన సొమ్ము సైతం ఐటీ పరిధిలోకి వెళుతుందనే భయం వెంటాడింది. -
నవంబర్‌లో పట్టాభిషేకం
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ నవంబర్ నెల్లో బాధ్యతలు చేపట్టే అవకాశముందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాహుల్ పట్టాభిషేకానికి ఇంకా కచ్చితమైన ముహూరం నిర్ణయించికపోయినా.. నవంబర్ నెల్లోనే రాహుల్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిచే అవకాశం ఉందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాహుల్ గాంధీ అధ్యక్షతన సోమవారం కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే అధ్యక్ష బాధ్యతల బదలాయింపుపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలోనే పార్టీ అధ్యక్ష ఎన్నికల వ్యవహారంపైనా చర్చ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా.. డిసెంబర్ 31 లోపు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తవుతాయని రెండు రోజుల కిందట పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ నవంబర్ నెల్లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గుజరాత్ శాసనసభ ఎన్నికల ప్రచారానికి కంటే ముందే రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారనే ప్రచారం మొదట్లో జరిగినా.. అది కార్యరూపం దాల్చలేదు. అదే సమయంలో వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తికాకపోవడం వల్లే రాహుల్ ఎన్నికకు కారణం అయిందని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. -
‘నోట్ల రద్దు’ పై విమర్శలకు బీజేపీ కౌంటర్
-
‘నోట్ల రద్దు’ పై విమర్శలకు బీజేపీ కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దును పలికిమాలిన చర్యగా అభివర్ణిస్తూ, నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన నవంబర్ 8ని ‘బ్లాక్ డే’గా ప్రకటించిన విపక్షాలకు.. అధికార బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. నవంబర్ 8న ‘యాంటీ బ్లాక్‌మనీడే’గా జరపాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. నోట్ల రద్దుతో పేదలకు మంచి : పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో నల్లధనాన్ని, అవినీతిని అంతం చేశామని, తద్వారా దేశంలోని పేదలకు మేలు చేకూరిందని మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నల్లధనాన్ని ఎందుకు వెలికితీయలేకపోయిందని ప్రశ్నించారు. తాము చేసిన మంచి పనులేవీ కాంగ్రెస్‌కు నచ్చవని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా జరగనున్న ‘యాంటీ బ్లాక్‌మనీ డే’ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు పాల్గొనాలని జైట్లీ కోరారు. అదొక చీకటి దినం : పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటన చేసిన నవంబర్ 8.. దేశానికి చీకటి దినమని విపక్షాల కూటమి అభిప్రాయపడింది. ఆ రోజును చీకటి దినం(బ్లాక్ డే)గా పరిగణిస్తున్నట్లు కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, టీఎంసీ, ఎస్పీ సహా 18 విపక్ష పార్టీలు ఇదివరకే ప్రకటించాయి. రాజధాని ఢిల్లీతోపాటు అన్ని ప్రాంతాల్లో ఆందోళనలకు సమాయత్తం కావాలని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్ మంగళవారం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పోటాపోటీ : నవంబర్ 8న అధికార, విపక్షాలు పరస్పర వ్యతిరేక నినాదాలతో నిరసనలకు పిలుపునియ్యడంతో శాంతిభద్రతల అంశం చర్చనీయాంశమైంది. ఇరు పక్షాలూ ప్రజాస్వామిక స్ఫూర్తితో వ్యవహరిస్తే తప్ప, ఉద్రిక్తతలను నివారించలేని పరిస్థితి. దీనిపై ఢిల్లీ సహా ఆయా రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు స్పందించాల్సిఉంది. -
నవంబర్‌లో నిర్ణయం
అనర్హత వేటు వ్యవహారంలో నవంబర్‌లో తుది విచారణకు మద్రాసు హైకోర్టు నిర్ణయించింది. ఆ నెల రెండో తేదీ నిర్ణయాన్ని తుది విచారణ అంటూ అదనపు పిటిషన్లు, వివరణలన్నీ ఈనెల 13వ తేదీలోపు ముగించాలని ప్రభుత్వానికి, పిటిషనర్లకు న్యాయమూర్తి రవిచంద్ర బాబు ఆదేశాలు ఇచ్చారు. సాక్షి, చెన్నై : సీఎం పళని స్వామికి వ్యతిరేకంగా వ్యవహరించిన అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలు 18 మందిపై అనర్హత వేటు పడ్డ విషయం తెలిసిందే. ఈ వేటును వ్యతిరేకిస్తూ ఆ 18 మంది మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో తమకు న్యాయం లభిస్తుందనే ఎదురుచూపులతో అనర్హత వేటు పడ్డ వారు ముందుకు సాగుతున్నారు. ఈ పిటిషన్ గత వారం న్యాయమూర్తి రవిచంద్ర బాబు నేతృత్వంలోని బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ తరఫున వివరణతో కూడిన పిటిషన్ ఆ రోజున దాఖలైంది. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్ధం కావడంతోనే అనర్హత వేటు వేసినట్టుగా అందులో వివరించారు. ఈ నేపథ్యంలో సోమవారం న్యాయమూర్తి రవిచంద్ర బాబు ముందు ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. నవంబర్ 2న తుది విచారణ పిటిషనర్ల తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ హాజరై వాదనల్ని వినిపించారు. అనర్హత వేటు పడ్డ వారి తరఫున అదనపు పిటిషన్లు దాఖలు చేసినట్టు వివరించారు. ఇందుకు ప్రభుత్వం తరఫున న్యాయవాది వైద్యనాథన్ హాజరై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. అదనపు పిటిషన్లకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా, మరింత సమయాన్ని కేటాయించాలని కోరారు. ఈ సమయంలో అభిషేక్ సింఘ్వీ, వైద్యనాథన్ మధ్య వాడి వేడిగా వాదనలు సాగాయి. విచారణ త్వరితగతిన ముగించాలని, పిటిషనర్లకు న్యాయం చేయాలని బెంచ్‌ను సింఘ్వీ కోరారు. చివరకు వాదనల అనంతరం న్యాయమూర్తి రవిచంద్ర బాబు జోక్యం చేసుకుని, తుది విచారణ నవంబర్ రెండో తేదీన జరుగుతుందని ప్రకటించారు. అదనపు పిటిషన్లు, వివరణలన్నీ ఈనెల 13వ తేదీలోపు ముగించాలని ఆదేశించారు. నవంబర్ రెండున తుది విచారణ తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తామంటూ, అప్పటివరకు బల పరీక్ష వ్యవహారంలో స్టే కొనసాగుతుందని ప్రకటించారు. తదుపరి విచారణను వాయిదా వేశారు. కాగా, అనర్హత వేటుపై కోర్టులో విచారణ మరికొన్ని వారాలకు వాయిదా పడ్డ దృష్ట్యా, నిర్ణయం కోసం ఆ 18 మంది మరి కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. ఆస్పత్రిలో తంగ తమిళ్ సెల్వన్ అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న తంగ తమిళ్ సెల్వన్ అనారోగ్యం బారిన పడ్డారు. గత కొంత కాలంగా క్యాంప్ రాజకీయాలతో పుదుచ్చేరి, బెంగళూరుల్లో తంగతమిళ్ సెల్వన్ తిష్ట వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వేటు పడడంతో మళ్లీ రాష్ట్రంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఆయన అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి తీవ్రత మరీ ఎక్కువ కావడంతో కుటుంబీకులు, సహచరులు చికిత్స నిమిత్తం గ్రీమ్స్ రోడ్డులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో మరి కొద్ది రోజులు ఉండి చికిత్స పొందాల్సి ఉన్నట్టు వైద్యులు ఆయనకు సూచించారు. దీంతో తంగ తమిళ్ సెల్వన్‌ను పలువురు అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు, దినకరన్ మద్దతు నాయకులు పరామర్శించే పనిలో పడ్డారు -
ఆన్లైన్... జస్ట్ 5 నిమిషాల్లో!!
వెబ్సైట్, యాప్ అభివృద్ధి సేవలందిస్తున్న నౌఫ్లోట్స్ ► 50 దేశాల్లో 2.5 లక్షల ఎస్ఎంఈ కస్టమర్లు ► ఇప్పటివరకు రూ.76 కోట్ల సమీకరణ ► ‘స్టార్టప్ డైరీ’తో నౌఫ్లోట్స్ కో–ఫౌండర్ జస్మిందర్ సింగ్ గులాటీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆఫ్‌లైన్ సంస్థలు ఆన్లైన్ వ్యాపారంలోకి రావాలంటే వెబ్సైటో లేక యాపో కావాలి. అలాగని చిన్న, మధ్య స్థాయి కంపెనీలు (ఎస్ఎంఈలు) వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేయటం, నిర్వహించటం కష్టం. మరెలా? దీనికి పరిష్కారం చూపిస్తోంది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న నౌఫ్లోట్స్.కామ్. మన దేశంలోనే కాదు ఆస్ట్రేలియా, కెనడా వంటి 50 దేశాల్లో 2.5 లక్షల ఎస్ఎంఈల వెబ్సైట్లను నిర్వహిస్తోందీ సంస్థ. మరిన్ని వివరాలు సంస్థ కో–ఫౌండర్ జస్మిందర్ సింగ్ గులాటీ మాటల్లోనే.. స్నేహితులు రోనక్ కుమార్ సమంత్రాయ్, నీరజ్ సబర్వాల్, నితిన్ జైన్‌తో కలిసి 2012లో రూ.80 లక్షల పెట్టుబడితో ‘నౌఫ్లోట్స్’ను ప్రారంభించాం. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ చాలెంజ్ అవార్డు గ్రాంట్‌ను రూ.15 లక్షలు గెలుచుకున్నాం. ఇదే నౌఫ్లోట్స్కు ప్రారంభ పెట్టుబడి. 11 పేటెంట్ల కోసం దరఖాస్తు.. చిన్న, మధ్యతరహా సంస్థలు, కూరగాయల షాపు, కిరాణా, మందుల దుకాణాలు వంటి చిన్న చిన్న షాపులు కూడా వారి వ్యాపారాన్ని ఆన్లైన్లో నిర్వహించుకునేందుకు వీలుగా వెబ్సైట్, యాప్‌లను అభివృద్ధి చేసి నిర్వహిస్తాం. వీటితో పాటు మార్కెటింగ్, పేమెంట్ గేట్‌వే కూడా అందిస్తాం. అంటే ఎస్ఎంఈల తరుఫున ఆన్లైన్ వ్యాపారాన్ని నౌఫ్లోట్సే చేస్తుందన్న మాట. అంతేకాక కస్టమర్లు ఆన్లైన్లో షాపింగ్ కోసం వెతికినప్పుడు వారి తాలుకు సర్వే వివరాలను, సామాజిక మాధ్యమాల రిపోర్ట్‌లను కూడా ఎస్ఎంఈలకు అందిస్తాం. బిగ్ డేటా ఆల్గోరిథం, ప్రాంప్టింగ్ వంటి 11 టెక్నాలజీల్లో పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకున్నాం. 50 దేశాలు.. 2.5 లక్షల ఎస్ఎంఈలు.. వెబ్సైట్, యాప్ అభివృద్ధికి 5 నిమిషాల సమయం పడుతుంది. ఏడాదికి వార్షిక ఫీజు రూ.25 వేలు. మన దేశంతో పాటూ ఆస్ట్రేలియా, కెనడా, దుబాయ్, ఫిలిప్పీన్స్, టర్కీ వంటి 50 దేశాల్లో 2.5 లక్షల ఎస్ఎంఈల వెబ్సైట్లను నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం దేశంలో 7 లక్షల ఎస్ఎంఈ వెబ్‌సైట్లుండగా.. వీటిలో 1.4 లక్షల వెబ్సైట్లను మేమే నిర్వహిస్తున్నాం. తయారీ, రిటైల్, వైద్య రంగంలో ఎక్కువ కస్టమర్లున్నారు. మరో నెల రోజుల్లో సిమ్లా, పుదుచ్చేరి, విశాఖపట్నం, హంపి వంటి టూరిస్ట్ హబ్స్‌లో నౌఫ్లోట్స్ సేవలను విస్తరిస్తున్నాం. 6 నెలల్లో రూ.5 కోట్ల సమీకరణ.. 2016–17 ఆర్ధిక సంవత్సరంలో రూ.20 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నాం. ఈ ఏడాది రూ.50 కోట్ల వ్యాపారాన్ని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం మాకు దేశంలో 65 కార్యాలయాలు, 900 మంది ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు ఐరన్ పిల్లర్ అండ్ ఐఐఎఫ్ఎల్, ఓమిడయ్యర్, బ్లూమీ వెంచర్స్, హైదరాబాద్, ముంబై ఏంజిల్స్ నుంచి రూ.76 కోట్ల నిధులను సమీకరించాం. మరో 6 నెలల్లో రూ.5 కోట్ల నిధులను సమీకరిస్తాం. -
హృతిక్ క్షమాపణలు చెప్పాల్సిందే: కంగనా
సాక్షి, న్యూఢిల్లీ: ప్రేమ యుద్ధం అంటూ మొదలై బాలీవుడ్లో కండల వీరుడు హృతిక్ రోషన్, కంగనా రనౌత్‌ల వ్యవహారం ఎంత దుమారం రేపిందో తెలిసిందే. పరస్పర విమర్శలతో గతేడాది వార్తల్లో ఈ జంట పతాక శీర్షికలో నిలిచింది. అయితే తప్పంతా క్వీన్దేనంటూ ఆమె మెయిల్స్ సాక్ష్యాలుగా చూపించాడు హృతిక్. అప్పటి నుంచి ఆ అంశం క్రమక్రమంగా గప్‌చుప్ అవుతూ వస్తోంది. అయితే హృతిక్ ఓ పెద్ద మోసగాడు అంటూ కంగనా వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై ఆమె పలు విషయాలను చెప్పుకొచ్చారు. ‘ హృతిక్‌తో ఎదురుపడే క్షణం కోసం ఎదురు చూస్తున్నా. కానీ, అతను మాత్రం అందుకు సుముఖంగా లేడు. హృతిక్, అతని తండ్రి రాకేష్ రోషన్ ఇద్దరూ మూర్ఖులే. అసత్య ఆరోపణలతో లోకాన్ని నమ్మించాలని చూశారు. ముఖ్యంగా హృతిక్ చాలా నీచమైన ఆరోపణలు చేశాడు. రెండేళ్లు పక్కా ఫ్లాన్తోనే ఇదంతా చేసుకొచ్చాడు. వాటిని నిరూపించాల్సిన అవసరం ఉంది. లేకపోతే అసలేం జరిగిందో నేనే ప్రపంచానికి చెబుతా’ అంటూ కంగానా తెలిపింది. అతనిక(హృతిక్)కు నా మెయిల్ ఐడీ పాస్వర్డ్ తెలుసు. వాటి ద్వారా నీచమైన పనులకు పాల్పడ్డాడు. నేను మౌనంగా ఉండటంతో తండ్రికొడుకులు మరింతగా రెచ్చిపోయారు అని ఆ ఇంటర్వ్యూలో వివరించింది. ఆరోపణలు నిరూపించకపోతే క్షమాణలు చెప్పాల్సిందేనని 30 ఏళ్ల కంగనా అంటున్నారు. మళయాళ నటి భావన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ మహిళలకు ఎక్కడా రక్షణ లేదని, తన విషయంలో మాత్రం బాలీవుడ్ పెద్దల నుంచి బెదిరింపులు వచ్చాయని కంగానా చెప్పుకొచ్చింది. సిల్లీ ఎక్స్ అంటూ కంగనా హృతిక్‌ను కామెంట్ చేయటంతో మొదలైన రచ్చ లీగల్ నోటీసులు, ఆపై పరస్పర విమర్శలతో తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. -
అచ్చం సినిమాలా ఓ బిజినెస్ టైకూన్ స్టోరీ
ముంబై: మోస్ట్ పాపులర్ క్లోతింగ్‌బ్రాండ్ రేమండ్స్ మాజీ ఛైర్మన్, బిజినెస్ టైకూన్ విజయ్‌పత్ సింఘానియా (78) చేతిలో పైసాలేని పరిస్థితిలో రోడ్డున పడ్డారు. ముంబాయికి చెందిన మాజీ షెరీఫ్ డిసెంబరు 19, 2005 నుండి 18 డిసెంబరు 2006 వరకు రేమండ్ గ్రూప్‌కు చైర్మన్‌గా ఒక వెలుగు వెలిగారు. అలా వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని అవోకగా నిర్వహించిన బడా వ్యాపారవేత్త ప్రస్తుతం కనీస అవసరాలకు కూడా కటకటలాడుతున్నారంటే నమ్మగలమా? కానీ తాజా వార్తల ప్రకారం ఇది నమ్మలేని నిజం. అచ్చం సినిమా స్టోరీని తలపిస్తూ...ఒకప్పుడు దేశంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన విజయ్‌పత్ సింఘానియా ప్రస్తుతం నిలువ నీడలేని స్థితిలో కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి తలెత్తింది. వివరాల్లోకి వెళితే తన సొంత కుమారుడి పైనే బాంబే హైకోర్టులో కేసు వేశారు సింఘానియా కంపెనీలోని షేర్లను తన కుమారుడుకి అప్పజెప్పి, ఇపుడు తాము మోసపోయామని, తన డూప్లెక్స్ హౌస్ తదితర ఆస్తులను తనకు ఇప్పించాల్సిందిగా కోరుతూ ఆయన కోర్టును ఆశ్రయించారు. తన బాధాకరమైన ఆర్థిక పరిస్థితి గురించి కోర్టుకు వివరిస్తూ, మూడు రోజుల క్రితం సీనియర్ సింఘానియా ముంబై హైకోర్టును ఆశ్రయించారు. రూ. 1000 కోట్ల విలువ కలిగిన కంపెనీని, షేర్లను కొడుకు గౌతమ్ సింఘానియా అప్పగించానని చెప్పారు. అలాగే మలబార్ హిల్ ప్రాంతంలో అభివృద్ధి చేసిన 36 అంతస్తుల జేకే హౌస్‌లో డూప్లెక్స్ ను స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ముంబైలోని నెపియన్ సీ రోడ్లో ఓ ఇంటిలోకి నెలకు రూ. 7 లక్షలకు అద్దెకు ఉంటున్నామనీ, ఇప్పటివరకూ చెల్లించిన అద్దెను కూడా రీఎంబర్స్ చేయాలని ఆయన కోరుతున్నారు. మరోవైపు తన కుమారుడి కోసం మొత్తం ఆస్తిని అంతా సింఘానియా త్యాగం చేస్తే.. ఇప్పుడా కొడుకు ఆయనను ఏమీ లేని స్థితికి చేరుస్తున్నాడని న్యాయవాదులు అంటున్నారు. ఈయన డాక్యుమెంట్స్, పర్సనల్ ఫైల్స్‌ను నిర్వహించిన ఇద్దరు రేమండ్ ఉద్యోగులు కూడా మిస్ కావడంతో, ఆయా పత్రాలను పొందేందుకు వీలు లేకుండా పోయిందని చెబుతున్నారు. కొడుకు గౌతమ్ వేధింపులు ఎక్కువయ్యాయని లాయర్లు చెబుతున్నారు. రీసెంట్గా గుండె ఆపరేషన్ కూడా చేయించుకున్న సింఘానియా కరియర్లో అనేక సాహసోపేత అవార్డులు, రివార్డులు కూడా ఉన్నాయి. నిర్విరామంగా 5,000 గంటలపాటు విమాన నడిపిన అనుభవం ఉంది. 1994 లో ఫెడేరేషన్ ఆఫ్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్ 24 రోజులు పాటు 34,000 కి.మీ పోటీలో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. భారత వైమానిక దళం నుంచి ఎయిర్ కమోడర్ పురస్కారం, 1998 లో యూకే నుండి భారతదేశం వరకు సోలో మైక్రోలైట్ విమానాన్ని నడిపి వరల్డ్ రికార్డ్, 2005 లో రాయల్ ఏరో క్లబ్ నుంచి బంగారు పతకం, 2006 లో భారత ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్ సత్కారాన్ని అందుకున్నారు. 'యాన్ ఏంజిల్ ఇన్ ది కాక్‌పిట్' అనే పుస్తకాన్ని కూడా రచించారు. మార్చి 2007 లో ఐఐఎం అహ్మదాబాద్ కు పాలక మండలి ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. కాగా ఆయన పెద్దకుమారుడు 1988లో మధుపతి సింఘానియా తన కుటుంబంతో తెగతెంపులు చేసుకున్నారు. ముంబైలోని పూర్వీకుల ఇంటిని, ఇతర ఆస్తులను వదులుకుని భార్యా, నలుగురు పిల్లలతో సహా సింగపూర్‌కి వెళ్లిపోయారు. అనంతరం గౌతం హరి సింఘానియా రేమాండ్స్ ఎండీగా ఎన్నికయ్యారు. అయితే దీనిపై సీనియర్ సింఘానియా కుమారుడు గౌతం ఇంకా స్పందించలేదు. -
నౌషెరాలో పాక్ కాల్పులు
రాజౌరి: నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ గురువారం మరోమారు ఉల్లంఘించింది. తెల్లవారుజామున నౌషెరా సెక్టార్లో కాల్పులు ప్రారంభించింది. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా.. మరోకరు గాయాలపాలయ్యారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది. -
48 గంటల్లో 4 టన్నుల బంగారం అమ్మారు!
-
48 గంటల్లో 4 టన్నుల బంగారం అమ్మారు!
న్యూఢిల్లీ : నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ నిర్ణయం ప్రకటించిన అనంతరం భారీగా బంగారం అమ్మకాలు జరిగినట్టు తెలిసింది. అయితే ఎంత బంగారం విక్రయించుంటారనే దానిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఎక్స్చేంజ్ ఇంటిలిజెన్స్ జరిపిన సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం 48 గంటల్లో జువెల్లర్ వర్తకులు 4 టన్నులకు పైగా బంగారాన్ని విక్రయించారని తేలింది. వాటి విలువ రూ.1,250 కోట్లకు పైగా ఉంటుందని తెలిసింది. పెద్దనోట్లను రద్దుచేస్తున్నట్టు రాత్రి ఎనిమిది ప్రకటించిన రోజునే దాదాపు రెండు టన్నుల బంగారం కొనుగోళ్లు జరిగాయట. రద్దయిన నోట్లను బంగారంలోకి మార్చుకోవడానికి పెద్ద ఎత్తున్న అనుమానిత మనీ లాండరింగ్ కార్యకలాపాలు జరిగాయని ఈ సర్వేలో వెల్లడైంది. ఢిల్లీకి చెందిన ఓ దిగ్గజ జ్యువెల్లర్ ఎక్కువగా 45 కేజీల బంగారాన్ని 700 మందికి అమ్మినట్టు అధికారులు చెప్పారు. అంతకముందు ఆయన కేవలం 820 గ్రాములే విక్రయించినట్టు తెలిసింది. చెన్నైలోని లలితా జువెల్లర్స్ 200 కేజీల గోల్డ్‌ను విక్రయించిందని, జైపూర్ లావత్ జువెల్లర్స్ 30 కేజీలు అమ్మినట్టు సెంట్రల్ ఎక్స్చేంజ్ అధికారులు పేర్కొన్నారు. ఆ జువెల్లర్స్ ముందు రోజు వరకు కేవలం గ్రాములోనే బంగారాన్ని విక్రయించినట్టు తెలిపారు. పెద్ద నోట్లు రూ.500, రూ.1000 రద్దు అనంతరం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మనీ లాండరింగ్ కార్యకలాపాలు విపరీతంగా జరుగుతున్నాయని గుర్తించిన డీజీసీఈఐ ఈ సర్వే నిర్వహించింది. పన్ను ఎగవేత, మనీ లాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడిన జువెల్లర్స్‌కు 300 పన్ను నోటీసులను ఈ ఏజెన్సీ జారీచేసింది. -
ఆర్బీఐ ఆ నోట్లను రద్దెప్పుడు చేసిందో తెలుసా?
పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు నవంబర్ 8న ప్రధాని నరేంద్రమోదీ జాతినుద్దేశించి ప్రసంగం. ఈ ప్రసంగానికి కొన్ని గంటల ముందే అంటే సాయంత్రం 5.30 గంటలకే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ఆమోదించేసిందట. అయితే ఈ విషయానికి ఎంతమంది మద్దతిచ్చారు, ఎంతమంది అనుకూలించారో మాత్రం ఆర్బీఐ రికార్డు చేయలేదు. సమాచార హక్కు చట్టం కింద కోరిన ప్రశ్నలకు సమాధానంగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని వెల్లడించిందని బ్లూమ్‌బర్గ్ న్యూస్ రిపోర్టు చేసింది. నవంబర్ ఎనిమిదిన బోర్డు మీటింగ్ నిర్వహించిన ఆర్బీఐ సాయంత్రం 5.30 గంటలకు పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ఆమోదించిందని ఆర్టీఐలో వెల్లడైంది. అనంతరం ప్రధాని రాత్రి ప్రసంగంలో తెలిపారు. బ్యాంకు బోర్డు మీటింగ్‌లో గవర్నర్ ఉర్జిత్ పటేల్, ముగ్గురు డిప్యూటీ గవర్నర్లు. ఆర్. గాంధీ, ఎస్ఎస్ ముంద్రా, వీఎస్ విశ్వనాథన్‌లతో పాటు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ వంటి పలువురు ప్రముఖులున్నారు. అయితే కరెన్సీ రద్దుతో ఏర్పడే నగదు కొరతకు ఆర్బీఐ ఎలాంటి చర్యలు ప్లాన్స్ సిద్ధం చేసుకుందో ఆర్బీఐ తెలుపలేదు. రోజుకు ఎన్ని కొత్త రూ.500, రూ.2000 నోట్లు ప్రింట్ చేస్తున్నారనే దానిపై కూడా ఆర్బీఐ సమాధానం చెప్పలేదు. పెద్ద నోట్లు రద్దయి 50 రోజులు గడుస్తున్నా ఇంకా నగదు కొరత సమస్య వెంటాడుతూనే ఉంది. ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిరీక్షిస్తూనే ఉన్నారు. దేశంలో చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీని నిరుపయోగంగా మార్చేస్తూ పెద్ద నోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఏర్పడిన పలు పరిణామాల్లో ఆర్బీఐ పలు సార్లు తడబడిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆర్బీఐ పలు విమర్శలు ఎదుర్కొంటుంది. గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో సెంట్రల్ బ్యాంకు స్వతంత్రత కూడా ప్రశ్నార్థకంగా మారిందని పలువురు వ్యాఖ్యానించారు. -
ప్రజల్ని నగ్నంగా నిలబెట్టకండి -శివసేన
ముంబై: శివసేన అధినేత బీజేపీ ప్రభుత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై శివసేన పదునైన వ్యాఖ్యలతో దాడికి దిగింది. బినామీ ఆస్తులకు చెక్ పెట్టే పేరుతో పేదలను నగ్నంగా నిలబెట్టొందంటూ శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే సూచించారు. దేశంలో అరాచకశక్తులకు వ్యతిరేకంగా మోదీ పోరాటాన్ని అభినందిస్తున్నామంటూనే, శివసేన అధికార పత్రిక సామ్నా, దో్ పహర్ కా సామ్నాలో బుధవారం ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బినామీ ఆస్తులను వెలికి తీసే నెపంతో పేదలకు మిగిలిన చడ్డీ బనియన్ ను కూడా తొలగించొద్దంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సూచించింది. ప్రధాని నిర్ణయం హర్షించ దగినదే అయినా పెద్దనోట్ల రద్దు తర్వాతలా పేద, మధ్య తరగతి ప్రజలు కష్టాల పాలు కావడానికి వీల్లేదన్నారు. ఇప్పటికే రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఎన్ ఆర్ ఐ,ఇతర మాఫియాలు తమ నల్లధనాన్ని వివిధ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టారని గుర్తు చేశారు కానీ దురదృష్టవశాత్తు సాధారణ ప్రజలు మాత్రం ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. పెద్దనోట్ల రద్దుతో పేదలు కష్టాలు మరింత పెరిగాయే తప్ప, నల్లధనం ఒక్కపైసా కూడా పట్టుబడలేదు.. ఒక్క పారిశ్రామికవేత్తనూ శిక్షించలేదంటూ థాకరే తీవ్ర విమర్శలు చేశారు. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తెస్తామని వాగ్దానం చేసిన మోదీ ఒక్క పైసా తేలేదు. కానీ ప్రజలు పెద్దనోట్ల రద్దు తీవ్రతను భరించారు..ఇప్పటికీ బాధలు కొనసాగుతున్నాయని థాకరే వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ తరువాత పాకిస్థాన్ టెర్రర్ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయనీ, దీంతో ఇప్పటివరకు 50 పైగా భారతీయ సైనికుల మరణానికి దారితీసిందన్నారు. అలాగే కశ్మీరీ పండిట్లకు చట్టబద్దంగా రావాల్సిన ఆస్తులు వారికి దక్కేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనికోసం సర్జికల్ దాడులు ప్రభుత్వం చేస్తుందా అని థాకరే ప్రశ్నించారు. కాశ్మీరీ పండితుల చట్టబద్ధ-యాజమాన్య ఆస్తుల హక్కులు తారుమారు కావని తాము ఆశిస్తున్నామన్నారు. -
షాకింగ్ న్యూస్ వెల్లడించిన ఆర్టీఐ
న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ తర్వాత రోజుకో సంస్కరణ, ఉపశమన చర్యలు ప్రకటిస్తుండగా ఆర్ టీఐ ద్వారా తాజాగా ఓ షాకింగ్ న్యూస్ వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత కరెన్సీ కొరతతో నానా అవస్థలు పడుతున్న తరుణంలో కొత్త 2 వేల రూపాయల కొరతకు సంబంధించి అసలు విషయం వెలుగులోకి తెచ్చింది. నవంబరు 8న కేంద్ర ప్రభుత్వ పెద్దనోట్ల రద్దు సంచలన ప్రకటన నాటికి రిజర్వ్ బ్యాంక్ వద్ద కొత్త రూ. 2 వేల నోట్ల కేవలం రూ.4.94 లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయట. రద్దుచేసిన రూ.500, రూ. 1000నోట్ల కరెన్సీ విలువ సుమారు రూ.20 లక్షల కోట్లు. అంటే రద్దయిన నోట్ల విలువలో నాలుగో వంతు మాత్రమే కొత్త నోట్లు అందుబాటులో వున్నాయని ఆర్ టీఐ తెలిపింది. ముంబయికి చెందిన కార్యకర్త అనిల్ గాల్గాలి దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నవంబర్ 8న నోట్ల రద్దు నిర్ణయంతో చలామణిలో ఉన్న రూ.9.13లక్షల కోట్ల విలువ కలిగిన వెయ్యి నోట్లు, రూ.11.38లక్షల కోట్ల విలువైన రూ.500 నోట్లు రద్దయ్యాయని ఆర్బీఐ తెలిపింది. 2,473 మిలియన్ల రూ. 2,000 నోట్లు (రూ 4.94 లక్షల కోట్లు) ఉన్నట్టు తెలిపింది. అనిల్ చేసిన దరఖాస్తుకు ఆర్బీఐ ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలు అందించింది. సమాచారము చట్టం, 2005 హక్కు సెక్షన్ 8 (1) (జి) కింద ఈ వివరాలను బహిర్గతం చేసినట్టు 'సమాధానంలో చెప్పారు. దీంతో దేశంలో రానున్న నగదు సంక్షోభం గురించి ఆర్ బీఐ ముందే తెలుసనీ, ఈ విషయాన్ని గ్రహించడానికి ఆర్థిక నిపుణుడై అయి వుండాల్సి అవసరం లేదని అనిల్ అరోపించారు. కోట్లాదిమంది భారతీయుల జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందనే సంగతి ఆర్ బీఐకి స్పష్టంగా తెలుసని వాదించారు. బహిర్గతం చేయాల్సిన సమాచారాన్ని గోప్యంగా ఉంచడం దురదృష్టమని వ్యాఖ్యానించారు. తద్వారా ఆర్ బీఐ 'ప్రకటన విధానాన్ని ఉల్లంఘించిందని మండిపడ్డారు. -
5 నెలల కనిష్టానికి డబ్ల్యుపిఐ
ముంబై: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం నవంబర్‌లో 5 నెలల కనిష్ట స్థాయికి దిగివచ్చింది. టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) 3.15 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో -2.04శాతంతో పోలిస్తే నవంబర్ నెలలో 3.15వద్ద నిలిచిందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. అక్టోబర్‌లో ఇది 3.39శాతం గా ఉంది. నవంబర్ నెలలో 'ఆల్ కమోడిటీస్' అధికారిక డబ్ల్యుపిఐ 0.1శాతం ఎగిసింది 183.1 (తాత్కాలిక) కు మునుపటి నెలలో 182.9 (తాత్కాలిక) నుండి పెరిగింది. ప్రాథమిక వస్తువుల సూచి 0.9 శాతం తగ్గివంది.మునుపటి నెలలో 261.8 (ప్రొవిజనల్) శాతంతో పోలిస్తే 259.4 శాతానికి తగ్గింది.తయారుచేయబడ్డ ఉత్పత్తుల సూచి నవంబర్‌లో 0.3శాతం పెరిగి157.9 గా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం నవంబరులో రెండేళ్ల కనిష్ఠానికి దిగొచ్చి 3.63 శాతంగా నమోదైంది. అక్టోబరులో ఇది 4.20 శాతం ఉంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం తలెత్తిన నగదు కొరత వల్ల వినియోగదారుల నుంచి డిమాండ్ గణనీయంగా తగ్గింది. దీంతో కూరగాయలతో పాటు పలు ఆహార వస్తువుల ధరలు చౌకగా మారడం ఇందుకు కలిసొచ్చింది. 2014 నవంబర్‌లో 3.23 శాతంగా నమోదైన తర్వాత రిటైల్ ద్రవ్యోల్బణానికి ఇదే కనిష్ఠ స్థాయి. 2015 ఆగస్టులో 3.66 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం.. ఆ తర్వాత మళ్లీ పెరిగింది. 2015 నవంబరులో ఇది 5.41 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. -
భారీగా ఎగిసిన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు!
న్యూఢిల్లీ : పాత నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ నవంబర్ 8న నిర్ణయం ప్రకటించిన అనంతరం ప్రజలు ఒక్కసారిగి బెంబేలెత్తిపోయిన సంగతి తెలిసిందే. అయితే పాత నోట్ల చెల్లుబాటు కోసం పెట్రోల్, డీజిల్ బంకుల్లో,ప్రభుత్వ ఆసుపత్రిల్లో ఈ నోట్లను తీసుకుంటారని, బ్యాంకుల్లో వీటిని మార్చుకోవచ్చని ఉపశమన వార్తలను ప్రకటించారు. దీంతో బ్యాంకులు, ఏటీఎంలు, పెట్రోల్, డీజిల్ బంకులు దగ్గర ఎక్కడ చూసినా చాతాడంత క్యూలైన్లే దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలో ఒక్క నవంబర్ నెలలోనే ఇంధన అమ్మకాలు ఏకంగా 10 శాతానికి పైగా ఎగిసినట్టు తెలిసింది. ముందస్తు అంచనాలను తిరగరాసేస్తూ ఈ అమ్మకాలు నమోదుకావడం గమనార్హం. చాలామంది ప్రజలు రద్దైన పాత నోట్లతో తమ ట్యాంకులను నింపేసుకున్నట్టు వెల్లడైంది. మూడు ప్రభుత్వ రంగ సంస్థలు-ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం సంస్థలే నోట్ బ్యాన్ తర్వాత నవంబర్ 8 నుంచి డిసెంబర్ 7 మధ్యకాలంలో రోజుకు సగటున 89,000 కిలో లీటర్ల పెట్రోల్‌ను విక్రయించినట్టు వెల్లడైంది. గతేడాది నవంబర్‌తో పోలిస్తే ఆ అమ్మకాలు సగటున 11 శాతం కంటే ఎక్కువగా పెరిగాయని ఈ సంస్థల డేటాలో తెలిసింది. ఈ నెల అక్టోబర్‌లో పెట్రోల్ అమ్మకాలు గతేడాది కంటే 1 శాతం తక్కువగానే నమోదయ్యాయి. అదేవిధంగా పెట్రోల్ అమ్మకాలకు ఏమాత్రం తీసిపోకుండా డీజిల్ అమ్మకాలు కూడా నమోదైనట్టు వెల్లడైంది. నవంబర్ 9 నుంచి డిసెంబర్ 7 వరకున్న కాలంలో రోజుకు సగటున 2,25,000 కిలో లీటర్లు అమ్ముడుపోయి, 11.4 శాతానికి పైగా పెరుగుదలను రికార్డు చేసినట్టు తెలిసింది. ఈ మూడు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలే మొత్తం ఇంధన అమ్మకాల్లో 90 శాతం ఆక్రమిస్తాయి. -
హత్యకేసులో నిందితునికి రిమాండ్
రాజంపేట: రాజంపేట పట్టణంలో గత నెల 25న రాత్రి జరిగిన హత్యకేసుకు సంబంధించి నిందితుడు శేఖర్‌ను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. అనంతపురం జిల్లా గుత్తికి చెందిన నల్లప్ప అనే వ్యక్తి హత్య కేసులో శేఖర్ నిందితుడన్నారు. -
రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం.
-
రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం సోమవారం జరగనుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో తాజా పరిమాణాలపై కేబినెట్లో చర్చించనున్నారు. ప్రజలు కరెన్సీ కోసం పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. శనివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం కేసీఆర్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలిసిన సంగతి తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు వల్ల తెలంగాణ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కేసీఆర్ ప్రధానితో చర్చించినట్టు సమాచారం. -
ఆ రోజు ఉద్యోగులకు సెలవులు బంద్
కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కమ్యూనిస్టు పార్టీలు బంద్ నిర్వహించే సోమవారం రోజు ప్రభుత్వ ఉద్యోగులందరూ తప్పనిసరిగా విధులకు హాజరుకావాల్సిందిగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజు ఏ ఉద్యోగికీ సెలవు మంజూరు చేసేదిలేదని, తగిన కారణం లేకుండా ఎవరైనా విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవని ఆ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి వాసుదేవ్ చెప్పారు. అత్యవసర, చాలా ముఖ్యమైన పని ఉంటే తప్ప ఉద్యోగులు సెలవు తీసుకోరాదని, సోమ, మంగళవారాల్లో కచ్చితంగా విధులకు హాజరుకావాలని ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది. బంద్ రోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు పనిచేస్తాయని చెప్పారు. బంద్‌లకు తాము వ్యతిరేకమని, పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తూ సోమవారం నాడు నిరసన ప్రదర్శనలో పాల్గొంటామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బంద్ రోజు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు, వారి ఆస్తులకు ఎలాంటి నష్టం కలగకుండా భద్రత కల్పించాలని చెప్పారు. -
యువరాజ్ తండ్రి చెప్పిన షాకింగ్ న్యూస్
న్యూఢిల్లీ: త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ షాకింగ్ న్యూస్ చెప్పారు. నవంబర్ 30న పంజాబ్ లోని ఫతేగఢ్ సాహిబ్ గురుద్వారాలో జరగనున్న యువరాజ్ వివాహానికి హాజరు కావడం లేదని ప్రకటించారు. హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. సంప్రదాయ బద్ధంగా జరుగుతున్న తన కుమారుడు యువరాజ్ సింగ్ పెళ్లికి రానని యువరాజ్ తల్లికి ముందే చెప్పానని వివరించారు. ఇది తన దురదృష్టమనీ యోగరాజ్ వ్యాఖ్యానించారు. తనకు దేవుడి మీద భక్తి ఉన్నప్పటికీ, మత గురువుల మీద నమ్మకం లేదని ఆయన స్పష్టం చేశారు. అందుకే వెళ్లడం లేదని విధి అలావుందని చెప్పారు. కానీ, యువరాజ్ కోరిక మేరకు నవంబరు 29 న హోటల్ లలిత్ వద్ద జరిగే మెహిందీ ఫంక్షన్ కు హాజరవుతానని చెప్పారు. అయితే యువరాజ్ కాబోయే భార్య హాజెల్ ను మాత్రం ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. ఆమె దేవతలాంటిదన్నారు. పాశ్చాత్య సంస్కృతిలో పెరిగినా సంప్రదాయ విలువలకు, పద్ధతులకు ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పారు. తమ ఆమె కుటుంబంలో సానుకూల మార్పులు తీసుకొస్తుందని నమ్ముతున్నానన్నారు. ఇతర సోదరీ మణులును ఒక చోటుకి చేరుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అలాగే యువరాజ్ , హాజెల్ దంపతులు కుటుంబంలోని మిగిలిన పిల్లలకు తల్లిదండ్రుల్లా వ్యవహరించాలని కోరుకుంటున్నానంటూ ముగించారు. అందరూ చట్టబద్ధ వివాహాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, విలాసవంతమైన వివాహాలకు స్వస్తి పలకాలని సూచించారు. పెళ్లళ్లలో కోట్లాది రూపాయల వృధా ఖర్చులకు అందరూ దూరంగా ఉండాలని యోగరాజ్ సింగ్ కోరారు. కాగా టీమిండియా డాషింగ్ ఆల్‌రౌండర్ యువీ, బాలీవుడ్ నటి హజెల్ కీచ్‌ను ఈ నెలాఖరున వివాహం చేసుకోబోతున్నాడు. యువరాజ్ సింగ్ తల్లి షబ్నమ్, తండ్రి యోగరాజ్ కొన్ని సంవత్సరాల క్రితమే విడిపోయారు. తల్లి దగ్గరే యువరాజ్ పెరిగిన సంగతి తెలిసిందే. -
నోట్ల రద్దుకు నిరసనగా భారత్ బంద్
కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడానికి నిరసనగా ప్రతిపక్షాలన్నీ కలిసి ఈనెల 28వ తేదీన భారత్‌బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు దాదాపు 13 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. పెద్దనోట్ల రద్దుపై ప్రచారాన్ని ముమ్మరం చేయాలని, ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇది మరింత ఉధృతంగా చేయాలని ప్రతిపక్షాలు తీర్మానించాయి. పెద్దనోట్ల రద్దుపై ప్రధానమంత్రి మాట్లాడాలని పార్లమెంటు లోపల, బయట విపరీతంగా డిమాండు పెరుగుతున్నా ఆయన మాత్రం మౌనాన్నే ఆశ్రయించడాన్ని నిరసిస్తూ 13 ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు వెలుపల నిరసన వ్యక్తం చేశాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ తదితర పార్టీలు ఈ నిరసనలలో పాల్గొన్నాయి. ఇక తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ జంతర్ మంతర్ వద్ద పలు పార్టీల ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొని.. పెద్ద నోట్ల రద్దుపై పోరాటాన్ని తాము మరింత తీవ్రంగా కొనసాగించి తీరుతామని చెప్పారు. ప్రజాగ్రహంలో మోదీ సర్కారు కొట్టుకుపోతుందని ఆమె మండిపడ్డారు. రైతులు తాము ఇన్నాళ్లూ దాచుకున్న మొత్తాన్ని కోల్పోతున్నారని, వాళ్లు ఎలా బతకాలని ప్రశ్నించారు. స్విస్ బ్యాంకులో దాచుకున్న నల్లడబ్బు మాటేం చేశారని నిలదీశారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిరేటుతో సాగుతున్నప్పుడు.. ప్రభుత్వం ఉన్నట్టుండి ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా మందగమనంలో పడిందని మండిపడ్డారు. ఈ విషయంలో బీజేపీ కార్యకర్తలు కూడా ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించరని అన్నారు. అయితే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాత్రం పెద్దనోట్ల రద్దును సమర్థించారు. దీనిపై చర్చ జరగనివ్వాలని ప్రతిపక్షాలను ఆయన కోరారు. ఈ అంశంపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నా.. ప్రతిపక్షాలు మాత్రం సభను నడవనివ్వడం లేదన్నారు. యావద్దేశం పెద్దనోట్ల రద్దు విషయంలో ప్రధానమంత్రిని సమర్థిస్తోందని ఆయన చెప్పారు. -
ఈపీఎఫ్ ఖాతాదారులకు మరో శుభవార్త!
ముంబై: కేంద్ర కార్మిఖ శాఖ మరో కీలక ముందడుగు వేసింది. నిర్వహణలో లేని ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతాలకు కొత్త నిర్వచనాన్ని అందించిన కార్మికశాఖ తాజాగా అలాంటి ఖాతాలకు వడ్డీ చెల్లింపు ప్రక్రియను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. దీని ద్వారా కోట్లాదిమంది పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త అందించింది. ఈ చెల్లింపులను ఏప్రిల్ 1, 2011 నుంచి వర్తింప చేయనున్నట్టు వెల్లడించింది. గత మూడు సంవత్సరాలుగా లావాదేవీలు జరపని ఈపీఎఫ్ ఖాతాలకు కూడా ఇకముందు వడ్డీ చెల్లించనున్నట్టు స్పష్టం చేసింది. 'పనిచేయని' ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతాల్లో ఉన్న నగదు నిల్వలకు కూడా వడ్డీ చెల్లింపును ప్రారంభిస్తున్నట్టుగా నవంబర్ 11 న ఒక నోటిఫికేషన్ జారిచేసింది. గత 36 నెలలుగా పనిచేయని పీఎఫ్ ఖాతాలను కార్మిక మంత్రిత్వ శాఖ ఆపరేటివ్ ఖాతాలుగా పరిగణించడంతోపాటు వాటికి వడ్డీ చెల్లింపు ప్రక్రియను ప్రారంభించడానికి నిర్ణయించుకుంది. ఈ నోటిఫికేషన్ అందించిన సమాచారం ప్రకారం ఒక ఉద్యోగి రాజీనామా చేసి రెండు నెలలలోపు మరో ఉద్యోగం చేపట్టకపోయినా కొత్త ఉద్యోగాన్ని ఈపీఎఫ్ ఖాతాకు బదిలీ చేయబడుతుంది. లేదా కొత్త ఉద్యోగంలో ఈపీఎఫ్ ఖాతాలో బదిలీచేయడంలో విఫలమైనా కూడా సదరు ఉద్యోగి ఖాతాను యాక్టివ్ ఖాతాగా పరిగణిస్తారు. దీంతోపాటుగా సంవత్సరానికి 8.8శాతం వడ్డీచెల్లించనున్నట్టు నోటిఫికేషన్ స్పష్టం చేసింది. అయితే 55 ఏళ్ల తరువాత ఉద్యోగాన్ని విరమించినా, లేదా శాశ్వతంగా విదేశాలకు వలస వెళ్లినా లేదా 36 నెలలలోపు ఆ ఉద్యోగి ఖాతాను స్వయంగా ఉపసంహరించుకున్నా, లేదా మరణించిన సందర్భంలో మాత్రమే పీఎఫ్ ఖాతా రద్దు అవుతుంది. కాగా గత రెండు సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా సుమారు 42, 000 కోట్ల నిధులు సంస్థలో ఉన్నట్టు సమాచారం. ఈ కీలక నిర్ణయం కారణంగా దాదాపు 9.70కోట్ల పీఎఫ్ ఖాతాదారులకు లబ్ది చేకూరనుంది.దీంతో కార్మికుల సంక్షేమం కోసం నిర్వహణలో లేని ఖాతాలకు ఇకముందు యాక్టివ్ ఖాతాలుగా పరిగణించనున్నట్టు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
టాటాల ఇన్వెస్టర్ మీట్ వాయిదా..
ముంబై: టాటా గ్రూప్ చైర్మన్ గా సైరస్ మిస్త్రీ ఉద్వాసన తరువాత కంపెనీలో రేగిన ప్రకంపనలు టాటాలను భారీగానే తాకుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నవంబర్ 18న జరగాల్సిన ఇన్వెస్టర్ల మీట్ ను వాయిదా వేసుకుంది. దేశీయంగా, అంతర్జాతీయంగా 150 మందితో జరగాల్సిన ఈ మీట్ ను గత నెలలో రచ్చకెక్కిన బోర్డు రూం డ్రామా కారణంగా వాయివా వేసినట్టు జాతీయ మీడియా నివేదించింది. అలాగే టాటా సన్స్ చైర్మన్ గా సైరస్ మిస్త్రీని తొలగించిన అనంతరం, ఇండియన్ హోటల్స్ లో ఆరుగురు ఇండిపెండెంట్ డైరెక్టర్లు మిస్త్రీకి మద్దతు పలకడాన్ని రతన్ టాటా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై వారి 'స్వతంత్రత'పై విచారణ జరిపించాలని టాటాలు నిర్ణయించినట్టు సమాచారం. మిస్త్రీని తొలగించాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా , సంస్థ భవిష్యత్తుపై అనుమానాలు పుట్టించేలా ఎందుకు మాట్లాడారన్న విషయమై ప్రశ్నించనునట్టు టాటా ట్రస్ట్స్ సీనియర్ సభ్యుడొకరు తెలిపారు.వారు షాపూర్ జీ పల్లోంజీ గ్రూప్ నుంచి తాము ఏ విధమైన ప్రోత్సాహకాలూ తీసుకోలేదని వారు నిరూపించుకోవాల్సి వుంటుందని టాటా గ్రూపు వర్గాలు స్టాక్ ఎక్స్ఛేంజీ కి వివరించాయి. మిస్త్రీపై వారు పూర్తి నమ్మకాన్ని ఉంచారని, ఈ విషయంలో ఐహెచ్‌సీఎల్ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడేందుకు తాము చర్యలు తీసుకోనున్నామని టాటా సన్స్ తెలిపింది. కాగా మిస్త్రీ ఆకస్మితక తొలగింపు తర్వాత టాటా సన్స్ జీఈసీని రద్దు చేశారు. దీంతో టాప్ లెవల్ అధికారులు రాజన్, నిర్మాల్య కుమారు, మధు కన్నన్ లు రాజీనామా చేశారు. అలాగే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూవలం మిస్త్రీకి సన్నిహితంగా మెలగడం మూలంగానే తనమీద వేటుపడిందని నిర్మాల్య కుమారు తన బ్లాగ్ లో ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
భారత్‌లో ఎల్జీ ఫోన్ ధర ఎంతంటే...
అంతర్జాతీయంగా విడుదలైన గూగుల్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ నోగట్ తొలి స్మార్ట్‌ఫోన్ ఎల్జీ వీ20, భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. రూ.49,990 ధరతో భారత విపణిలోకి ఈ నెల ఆఖరున ప్రవేశపెట్టాలని కంపెనీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ వీ20 ఫోన్‌ను గ్లోబల్‌గా లాంచ్ చేసే సందర్భంలోనే, దీన్ని నెలలోపల భారత మార్కెట్లోకి తీసుకొస్తామని ఎల్జీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కిమ్ కి-వాన్ ప్రకటించారు. 5.7 అంగుళాల క్యూహెచ్డీ ఐపీఎస్ డిస్ప్లేతో ఎల్జీ వీ20ను కంపెనీ ఆవిష్కరించింది. హై-ఫై క్వాడ్ డీఏసీ, హెచ్డీ ఆడియో రికార్డర్, ఫ్రంట్, రియర్ వైడ్-యాంగిల్ లెన్స్ కెమెరా వంటి మల్టీమీడియా ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రూపొందించింది. 16 మెగాపిక్సెల్ స్టాండర్డ్, 8 మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ డ్యుయల్ వెనుక కెమెరాలు కలిగిన ఈ ఫోన్, ఫ్రంట్ వైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను కలిగిఉంది. డ్యూయల్ డిస్ప్లే సిస్టమ్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. రెండో డిస్ప్లే ఫోన్‌కి టాప్‌లో ఉంటుంది. మొదటి దానికంటే ఈ రెండో డిస్ప్లే ఎక్కువ ప్రకాశవంతంగా, పెద్ద ఫాంట్‌తో ఉండనుంది. దీని వల్ల నోటిఫికేషన్ బార్ నుంచే పెద్ద మెసేజ్‌లకు త్వరగా రిప్లై ఇవ్వొచ్చు. క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు విస్తరణ మెమెరీ వంటివి ఈ ఫోన్ ఇతర ఫీచర్లు. భారత మార్కెట్లో ఇటీవల లాంచ్ అయిన ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్, గూగుల్ పిక్సెల్, పిక్సెల్ ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్ల కంటే ఈ ఫోన్ రేటే తక్కువగా ఉండాలని కంపెనీ నిర్ణయించినట్టు రిపోర్టులు చెబుతున్నాయి. -
రెడ్ మి 4 కమింగ్ సూన్!
ముంబై: స్మార్ట్ ఫోన్లతో ప్రపంచ వ్యాప్తంగా ఫోన్ లవర్స్ ను ఆకట్టుకుంటున్న చైనా మొబైల్ మేకర్ షియోమి మరింత వేగంగా దూసుకుపోతోంది. తాజాగా రెడ్ మి సిరీస్ లో భాగంగా ' రెడ్ మి 4' స్మార్ట్ ఫోన్ నులాంచ్ చేసేందుకు రడీ అవుతోంది. ఈ ఏడాది జనవరి లో లాంచ్ రెడ్ మి 3 కి అప్‌గ్రేడెడ్ వెర్షన్ గా రెడ్ మి 4 విడుదలకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. నవంబర్ లో మార్కెట్ లో లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం. చైనీస్ సర్టిఫికేషన్ సైట్ తెనా లో లీక్ అయిన వివరాలు ప్రకారం రెడ్ మి 4 ఫీచర్లు ఇలా ఉండనున్నాయి. 5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 1.4 ఆక్టా కోర్ ప్రాపెసర్ 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్ పాండబుల్ 13 ఎంపీరియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 ఎంపీ ముందు కెమెరా 4100 బ్యాటరీ సామర్థ్యంతో లాంచ్ కానున్న ఈ స్మార్ట్ ఫోన్ ధరను రూ.7వేలు గా నిర్ణయించినట్టు అంచనా. అయితే దీనిపై షియామి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
ఎన్‌కౌంటర్‌కు నిరసనగా నవంబర్ 3న బంద్
హైదరాబాద్: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో అక్టోబర్ 24న జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా సీపీఐ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటి నవంబర్ 3న బంద్‌కు పిలుపునిచ్చింది. ఎన్‌కౌంటర్‌ను కోవర్ట్ ఆపరేషన్‌గా పేర్కొంటూ.. ఈ బంద్‌ను తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని సీపీఐ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటి అధికార ప్రతినిధి జగన్ పత్రికా ప్రకటనలో పిలుపునిచ్చారు. -
ఆ రెండు ఫోన్ల లాంచింగ్ నవంబర్ 8నే!
మోటోరోలా కొత్త స్మార్ట్‌ఫోన్ డివైజ్ రూపకల్పనలో నిమగ్నమై ఉందని ఇప్పటికే పలు రిపోర్టులు నివేదించాయి. దాని పేరు మోటో ఎమ్ అని, ఆ ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉండబోతున్నాయంటూ ఆన్లైన్లో హల్చల్ చేశాయి. రియర్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్‌తో రాబోతున్న ఈ ఫోన్ లాంచింగ్ నవంబర్ 8న జరుగబోతుందని, దీంతో పాటు లెనోవా వైబ్ పీ2 స్మార్ట్‌ఫోన్ కూడా లాంచ్ అవుతుందని తాజా రిపోర్టుల బట్టి తెలుస్తోంది. వైబ్ పీ1 విజయం సాధించడంతో, వైబ్ పీ2ను లెనోవా ఆవిష్కరిస్తుందని టెక్డ్రాయిడర్ తెలిపింది. ఆండ్రాయిడ్ సోల్ ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లను పోస్టు చేసింది. లెనోవా వైబ్ పీ2 ఫీచర్లు 5100 ఎంఏహెచ్ బ్యాటరీ 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ 3జీబీ ర్యామ్+32జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 4జీబీ ర్యామ్+32జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 13 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ముందు వైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఓఎస్ ఇక మోటోరోలా మోటో ఎమ్ ఫీచర్లను పరిశీలిస్తే... 5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 2.1 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6755 ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్ 32జీబీ ఇంటర్నెల్ మెమరీ 3,000ఎంఏహెచ్ బ్యాటరీ 16 ఎంపీ ప్రైమరీ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా -
పాకిస్థాన్‌లో రాజకీయ అలజడి
ఇస్లామాబాద్: ప్రతిపక్ష పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ నవంబర్ 2న తలపెట్టిన 'ఇస్లామాబాద్ ముట్టడి' పాకిస్థాన్ లో తీవ్ర రాజకీయ అలజడిని సృష్టిస్తోంది. ప్రధాని నవాజ్ షరీఫ్ రాజీనామాను డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా చేస్తోన్న ఆందోళనలను మరింత ఉధృతం చేసే దిశగా పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన 'రాజధాని ముట్టడి' పిలుపునకు భారీ స్పందన లభిస్తోంది. వేలాది మంది పీటీఐ కార్యకర్తలతోపాటు సాధరణ జనం ఇప్పటికే ఇస్లామాబాద్ బాటపట్టినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దింపింది. పలు పట్టణాల్లో పీటీఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఇస్లామాబాద్ నగర తూర్పు ప్రాంతం బనీగాలలోని ఇమ్రాన్ ఖాన్ నివాసాన్ని కూడా శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే అక్కడున్న వందలాది మంది కార్యకర్తలపై లాఠీచార్జి చేసి ఖాన్ ను హౌస్ అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి తర్వాత కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల సూచన మేరకు ఇంట్లో నుంచి బయటికి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ కార్యకర్తలు, మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. నవంబర్ 2న ప్రజాస్వామ్యం అంటే ఏమిటో నవాజ్ షరీఫ్ కు రుచిచూపిస్తామని, ఆయన నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుతామని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పంజాబ్, ఖైబర్ ఫక్తున్ఖాల నుంచి ఇస్లామాబాద్ కు వెళ్లే రహదారులను పోలీసులు దిగ్బంధించారని, ప్రధాన రహదారులపై కాకుండా ఇతర మార్గాల్లో ఇస్లామాబాద్ కు పయనం కావాలని కార్యకర్తలకు సూచించారు. ఇమ్రాన్ ఖాన్ గృహనిర్బంధాన్ని గర్హిస్తూ పాకిస్థాన్ అంతటా నిరసనలు మిన్నంటాయి. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, అతని కుటుంబం భారీ అక్రమాలకు పాల్పడినట్లు పనామా పేపర్స్ బయటపెట్టిన నాటి నుంచి పీటీఐ ఆందోళనలు చేస్తోన్న సంగతి తెలిసిందే. -
గతి తప్పిన పాలనను ఎండగడతాం: ధర్మాన
విశాఖ : టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి సమరభేరికి సిద్ధమైంది. నవంబర్ 6న విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ బహిరంగ సభ ద్వారా చంద్రబాబు మోసాలను వైఎస్ఆర్ సీపీ ప్రజలకు వివరించనుంది. రాష్ట్రంలో గతి తప్పిన పాలనకు వ్యతిరేకంగా సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. ప్రజలందరూ ఈ పోరాటానికి మద్దతు పలకాలని ఆయన పిలుపునిచ్చారు. ధర్మాన శనివారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం సర్కార్ వాస్తవాలను దాచిపెడుతోందని ధ్వజమెత్తారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా రాష్ట్రంలో పరిపాలన సాగుతోందని ఆయన మండిపడ్డారు. గతి తప్పిన పాలనకు నిరసనగానే ఈ సభను నిర్వహిస్తున్నామన్నారు. -
'గతి తప్పిన పాలనను ఎండగడతాం'
-
నవంబర్ 15 బ్లాకవుట్ పేరుతో ప్రచారం
-
పీజీ మెడికల్ కోర్సులకు దరఖాస్తు గడువు పెంపు
విజయవాడ: పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షకు దరఖాస్తు గడవును పొడిగించారు. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. నవంబరు 7వ తేదీ వరకూ నీట్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామ్స్ గవర్నింగ్ బాడీ కౌన్సిల్ సభ్యులు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజు తెలిపారు. అదే విధంగా 2010 ఎంబీబీఎస్ బ్యాచ్‌కు ఇంటర్నెషిప్ పూర్తి చేసే గడువును ఏప్రిల్ 15 వరకూ పొడిగించినట్లు వీసీ తెలిపారు. ఇప్పటికే 2010 ఎంబీబీఎస్ బ్యాచ్ అభ్యర్ధులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు త్వరలో వెబ్సైట్ ను ప్రారంభించనున్నట్లు వీసీ పేర్కొన్నారు. -
రీటైల్ వ్యాపారులకు షాక్
ముంబై: ద్రవ్యోల్బణానికి చెక్ పెట్టే చర్యల్లో భాగం కేంద్రం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. అనూహ్యంగా పెరుగుతున్న పప్పుధాన్యాలు, చక్కెర లాంటి నిత్యావసర వస్తువుల రిటైల్ ధరలకు కళ్లెం వేసేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం మార్కెట్ శక్తుల ద్వారా నిర్ణయించబడుతున్ రేట్ల సంప్రదాయానికి, అదును చూసి అడ్డగోలుగా ధరలు పెంచేసే రీటైల్ వ్యాపారుల ఆగడాలకు చెక్ పెట్టనుంది. ఇప్పటికే ముఖ్యమైన వస్తువు రిటైల్ ధరను నిర్ణయించే లీగల్ కొలతల (ప్యాకేజ్డ్ కమోడిటీస్) నిబంధనల 2011 చట్ట సవరణలకు నోటిఫై చేసినట్టు సీనియర్ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు పీటీఐకి చెప్పారు. అసాధారణ పరిస్థితుల్లో మితిమీరిన స్థాయిలో పెరుగుతూ, నింగిని తాకే ధరలను కట్టడి చేసేందుకు మెట్రాలజీ నియమాలను సవరించనుంది. నిత్యావసరాల వస్తువుల రీటైల్ ధరలను నిర్ణయించే అధికారం ఎసెన్షియల్ కమోడిటీ చట్టం1955 నిబంధల ప్రకారం ..సంబంధిత అధికారి నిర్ణయం తీసుకుంటారని నోటిషికేషన్ తెలిపింది. రీటైల్ మార్కెట్లలో విడిగా, లేదా ప్యాకేజ్ లలో విక్రయించే అన్ని వస్తువులకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. అయితే రోజువారీ ధరలను కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుందాఅని ప్రశ్నించినపుడు.. ధరలు అనూహ్యంగా పెరిగినపుడు, అసాధారణ పరిస్థితులలో మాత్రమేనని ఆయన చెప్పారు. .ప్రస్తుతం, టోకు మరియు దిగుమతిదారులను నియంత్రించడానికి చర్యలు ఉన్నాయి కానీ, రీటైల్ వ్యాపారులకు లేవని వ్యాఖ్యానించారు. వినియోగదారుల సంక్షేమం కోసం ఈ నిబంధన ద్వారా ఈ క్రియా శీలక చర్యలను తీసుకునేలా ప్రభుత్వం సహాయం చేస్తుందని అధికారి తెలిపారు. కాగా కరువు పరిస్థితుల కారణంగా స్థానిక ఉత్పాదనలో తగ్గుదలతో జూన్ 2016 లో రిటైల్ మార్కెట్లలో పప్పుల ధర కిలో దాదాపు రూ.200 చేరాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం దిగుమతులు, పప్పు ధాన్యాల నిల్వల పెంపు తదితర చర్యల ద్వారా దేశీయ సరఫరాను మెరుగు పరచడానికి, పప్పు ధరల నియంత్రణకు కృషి చేస్తోంది. -
ఆధార్ లేకుంటే సబ్సిడీ గ్యాస్ కట్
నమోదుకు నవంబర్ వరకు గడువు న్యూఢిల్లీ: సబ్సిడీ గ్యాస్ పొందాలంటే ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులు ఆధార్‌కు అనుసంధానమయ్యేందుకు నవంబర్ 30వ తేదీ వరకు గడువునిచ్చింది. దీంతో నవంబర్ తర్వాత ఆధార్ లేకపోతే సబ్సిడీ గ్యాస్ అంద దు. ఆధార్ నమోదు కోసం తగిన ఏర్పాట్లు చేయాలని ఆయిల్ కంపెనీలకు కేంద్రం సూచించింది. అంతవరకూ బ్యాంకు పాస్‌బుక్, ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీ, ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, కిసాన్ ఫొటో పాస్‌బుక్, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లెసైన్స్‌లో ఏదో ఒక దాన్ని గుర్తింపు కార్డుగా పరిగణిస్తారు. ఈ ఉత్తర్వులు అస్సాం, మేఘాలయ, జమ్మూ కశ్మీర్ తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో తక్షణం అమల్లోకి వస్తాయని కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం సబ్సిడీ కింద ఏడాదికి 12 సిలిండర్లు ఇస్తుండగా... సబ్సిడీ మొత్తాన్ని ఆధార్ కార్డు ఆధారంగా బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నారు. -
నవంబర్ 3 నుంచి డీఎడ్ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్ : డీఎడ్ ద్వితీయ సంవత్సరం (2014–16 బ్యాచ్) పరీక్షలు నవంబర్ 3 నుంచి 8 వరకు నిర్వహిస్తామని జిలా విద్యాశాఖ అధికారి అంజయ్య, ప్రభుత్వ పరీక్ష అసిస్టెంట్ కమిషనర్ గోవింద్‌నాయక్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఇదివరకు ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా హాజరుకావచ్చన్నారు. 3న మెథడ్స్ ఆఫ్ టీచింగ్ (మాతృభాషా తెలుగు/ఉర్దూ/తమిళం), 4న మెథడ్స్ ఆఫ్ టీచింగ్ (ఇంగ్లీష్), 5న మెథడ్స్ ఆఫ్ టీచింగ్ (జనరల్ గణితం), 7న మెథడ్స్ ఆఫ్ టీచింగ్ (జనరల్ సైన్స్), 8న మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ( సోషియల్ స్టడీస్) పరీక్షలు ఉంటాయని వారు తెలిపారు. -
ఆ ఛాతీ 56 అంగుళాలు కాదు.. ఇప్పుడు 100
భోపాల్: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో భారత సైన్యం సర్జికల్ దాడులు జరపడానికి అనుమతిచ్చి పాక్‌కు దీటైన జవాబు చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసల్లో ముంచెత్తారు. మోదీ ఛాతీ ఇప్పుడు 56 అంగుళాలు కాదు, 100 అంగుళాలని చౌహాన్ అన్నారు. భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో చౌహాన్ మాట్లాడుతూ.. ఉడీ ఉగ్రవాద దాడికి ప్రతిచర్యగా పాక్‌కు గుణపాఠం చెప్పిన భారత సైన్యానికి, ప్రధాని మోదీకి అభినందనలు తెలియజేశారు. మోదీ శక్తిమంతమైన నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని అన్నారు. మన వృద్ధి రేటు చైనా కంటే ఎక్కువగా ఉందని చెప్పారు. -
నవంబర్‌లో అంతర్ జిల్లా క్రికెట్ టోర్నీ
వరంగల్ స్పోర్ట్స్ : జిల్లాకు చెందిన సీనియర్ క్రీడాకారుడు ఫారూఖ్ స్మారకార్థం నవంబర్‌లో అంతర్ జిల్లా సీనియర్స్ క్రికెట్ టోర్నమెంటును నిర్వహించనున్నట్లు క్రికెట్ అసోసియేష¯ŒS జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీని వాస్ తెలిపారు. హన్మకొండ అలంకార్ సమీపంలోని అసోసియేష¯ŒS జిల్లా కార్యాలయంలో ఆదివారం అసోసియేష¯ŒS సర్వసభ్య సమావేశంలో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ఆయన తెలిపారు. ప్రతిభ ఉండి పేదరికంతో ఆడలేని క్రీడాకారులను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, జిల్లా, నగరస్థాయిలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో ప్రతి నెలా టోర్నమెంటులు నిర్వహించాలని తీర్మానించారు. అంతేకాకుండా అసోసియేష¯ŒS న్యాయ సలహాదారులుగా సీహెచ్. చిదంబర్నాధ్, పి.సత్యప్రకాష్లను నియమించినట్లు శ్రీనివాస్ తెలిపారు. ప్రతి నెల కార్యవర్గ సమావేశంలో ఖర్చులను ప్రవేశపెట్టాలని తీర్మానించారు. సమావేశంలో అసోసియేష¯ŒS జిల్లా అధ్యక్షుడు గుజ్జారి ప్రతాప్, మార్నేని ఉదయభానురావు, మంచాల స్వామిచరణ్, ఖాజా జమీర్ అహ్మద్ పాల్గొన్నారు. -
నవంబర్ 20 మాదిగల ధర్మయుద్ధం
సంగారెడ్డి మున్సిపాలిటీ: ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు గాను మాదిగల ధర్మయుద్ధం పేరుతో నవంబర్ 20న హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు మాదిగ విద్యార్థి విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్ తెలిపారు. ఆదివారం స్థానిక డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబరు 20న నిర్వహించే మహా సభకు పెద్ద ఎత్తున విద్యార్థులు తరలిరావాలని పిలుపు నిచ్చారు. అందులో భాగంగానే ఈ నెల 20న జహీరాబాద్ నుంచి పాద యాత్ర ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో నాయకులు సింహచలం, శ్రీహరి, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నవంబర్ లోపు గాలేరు–నగరి పనులు పూర్తి
– జీఎన్ఎస్ఎస్ అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష – పనులు వేగవంతం చేయాలని ఆదేశం తిరుపతి తుడా: గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్‌లోని మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్ పనులను నవంబర్ రెండో వారం లోపు పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీషా ఆదేశించారు. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం జీఎన్ఎస్ఎస్ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాలేరు–నగరి ప్రాజెక్టు పనులను వేగవంతానికి ప్రణాళికలు అమలుచేయాలని ఆయన సూచించారు. మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్ నిర్మాణాల వల్ల ముంపునకు గురైన బాధితులకు అందాల్సిన నష్టపరిహారం, మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు రూపొందించాలని చెప్పారు. సోమశిల, స్వర్ణముఖి అనుసంధానం ద్వారా జిల్లాలో 72 చెరువులకు కాలువ ద్వారా నీటిని ఇచ్చేలా కాలువల తవ్వకం, పూడిక తీసే పనులు వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం ఆయన సబ్‌కలెక్టర్ హిమాంశు శుక్లా, జీఎన్ఎస్ఎస్, డెప్యూటీ కలెక్టర్ పద్మావతి, ఇంజనీరింగ్ అధికారులతో కలసి మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్ పనులను పరిశీలించారు. ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జీఎన్ఎస్ఎస్ అధికారులు, తహశీల్దార్ రాజారావు పాల్గొన్నారు. -
నవంబర్ 6న నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్–2016 పరీక్ష నవంబర్ 6న 8వ తరగతి విద్యార్థులకు రెవెన్యూ డివిజన్లలో నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మిబాయి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష అప్లికేషన్ ఫారాలు, నామినల్ రోల్స్, ప్రధానోపాధ్యాయులకు సూచనలు www.bsetelangana.org వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ఓబీసీ, బీసీ విద్యార్థులు 55శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు 50శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వ, మోడల్, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1.50లక్షల కంటే తక్కువగా కలిగి ఉండాలని, ఇటీవల తీసిన ఒరిజినల్ ఆదాయ సర్టిఫికెట్, 7వ తరగతి మార్కుల జాబితా, ఆధార్‌కార్డులను తప్పనిసరిగా జతపర్చాలని తెలిపారు. ఆధార్ నెంబర్ వేయకపోతే వాటిని స్వీకరించబడవని పేర్కొన్నారు. ఓబీసీ, బీసీ విద్యార్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ విద్యార్థులకు రూ.50 ఈ నెల 5, 6 తేదీల్లో ఎస్బీహెచ్, ఎస్బీఐ బ్యాంకుల్లో డీడీ తీయాలని కోరారు. పూర్తి చేసిన ఫారాలను మూడు సెట్లు నామినల్ రోల్స్, ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్ సర్టిఫికెట్లు ఈనెల 7వ తేదీలోపు జిల్లా విద్యాశాఖాది కార్యాలయంలో సమర్పించాలని కోరారు. -
రోబో-2 విషయంలో జాగ్రత్త అంటున్న రజనీ
-
నవంబర్ 24 నుంచి డిగ్రీ తొలి సెమిస్టర్ పరీక్షలు
► నవంబర్ 15 నుంచి ప్రాక్టికల్స్ ► అక్టోబర్ 2 నుంచి 16 వరకు దసరా సెలవులు ► ఆ సమయంలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించుకోవాలి ► డిగ్రీలో సీబీసీఎస్ అమలుపై వీసీలతో పాపిరెడ్డి సమీక్ష హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మొదటి సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 24 నుంచి ప్రారంభమవుతాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలను అదే నెల 15వ తేదీ నుంచి నిర్వహిస్తామని పేర్కొన్నారు. డిగ్రీలో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్)ను ఈ విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తెచ్చామన్నారు. అందులో భాగంగానే డిగ్రీలో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశ పెట్టామన్నారు. సీబీసీఎస్ అమలుపై సోమవారం వివిధ వర్సిటీల వైస్ చాన్స్లర్లతో సమీక్ష నిర్వహించారు. మొదటి సెమిస్టర్‌కు నవంబరు 14 ఆఖరి పనిదినమని వెల్లడించారు. అక్టోబర్ 2 నుంచి 16వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయన్నారు. ఆ సమయంలో డిగ్రీ వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయినవారి కోసం సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించుకోవాలని వీసీలను ఆదేశించారు. సీబీసీఎస్ అమలులో భాగంగా ఏటా 2 సెమిస్టర్లు ఉంటాయని, ప్రతి సెమిస్టర్ పూర్తయ్యాక పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈసారి ఆన్లైన్ ప్రవేశాల వల్ల ఆలస్యం అయినందున ఇంటర్నల్ పరీక్ష ఈ సెమిస్టర్లో ఒకటే ఉంటుందన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు. కేయూ, ఓయూలకు నిధుల కొరత ఉందన్న విషయం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని.. వచ్చే బడ్జెట్లో ఎక్కువ మొత్తం నిధులు కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారన్నారు. సమావేశంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ మల్లేశ్, కార్యదర్శి శ్రీనివాసరావు, వీసీలు రామచంద్రం, రాజారత్నం, సాంబయ్య, సాయన్న పాల్గొన్నారు. -
మోసమే మ్యాజిక్
హాలీవుడ్ థ్రిల్లర్ / నౌ యు సీ మీ ప్రపంచంలో నమ్మినా నమ్మకపోయినా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో లైఫ్‌లో ఒక్క మ్యాజిక్ జరిగితే బాగుండుఅనుకుంటుంటారు. కానీ మెజీషియన్లు ఇంద్రజాలం చేస్తే నమ్మరు. గారడీ అని కొట్టి పారేస్తారు. అలాంటి మ్యాజిక్ షో ఓ క్రైమ్‌కి తెర తీస్తే? అదే 2013లో విడుదలైన ‘నౌ యు సీ మీ’. లూయిస్ లెటరిర్స్ ఓ ఫ్రెంచి దర్శకుడు. ‘ట్రాన్స్పోర్టర్’ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన... ‘ది ఇన్క్రెడిబుల్ హల్క్’ సినిమాతో హాలీవుడ్లో పాగా వేశాడు. ఓ కథని వేగంగా, ఆసక్తిగా చెప్పడంతో పాటు సక్సెస్ చేసి, సీక్వెల్ రెడీ చేయడం లూయిస్ స్టయిల్. ‘ది ట్రాన్స్పోర్టర్’ సినిమాతో ఆ విషయాన్ని ప్రూవ్ చేసుకున్న లూయిస్ ‘నౌ యు సీ మీ’ కూడా అలాగే రూపొందించాడు. అందుకే 2013లో ఈ సినిమా విజయవంతం అయ్యింది. 2016లో వచ్చిన ఈ సినిమా సీక్వెల్‌కి బీజం పడింది (అయితే లూయిస్ దర్శకుడు కాదు. జాన్ బౌ అనే చైనీస్ డెరైక్ట్ చేశాడు). నలుగురు కుర్ర మెజీషియన్లు అనుకోకుండా నలుగురికి విడివిడిగా కార్డ్స్ వచ్చాయి. ఆ పేక ముక్కల ఆధారంగా న్యూయార్క్‌లో ఓ అపరిచితుణ్ని కలుసుకున్నారు.ఏడాది తర్వాత ఆ నలుగురు మెజీషియన్లు ఓ గ్రూప్‌గా ఫామ్ అయ్యి, లాస్ వేగాస్‌లో ఓ ప్రదర్శన ఇవ్వడానికి వచ్చారు. అందులో భాగంగా ప్యారిస్‌లోని ఓ బ్యాంక్ లాకర్లలో ఉన్న డబ్బుని బయటికి గాలికి ఎగురుకుంటూ వచ్చేలా చేయడం వీళ్లు ప్లాన్ చేసిన ట్రిక్. కానీ నిజంగానే ఆ బ్యాంక్‌లో కరెన్సీ మాయమైంది. దాంతో ఇంటర్‌పోల్ ఏజెంట్, ఎఫ్‌బీఐ ఏజెంట్ ఈ నలుగురు మెజీషియన్ల వెనక పడ్డారు. వాళ్లు సహజంగానే తమకేమీ తెలియదన్నారు. సీనియర్ మెజీషియన్ సహకారంతో ఈ కేసు పరిశోధన కొనసాగించారు. రెండోసారి మరో నగరంలో ఇదే తరహా మ్యాజిక్ షో ఇవ్వడానికి నలుగురు మెజీషియన్లు ప్లాన్ చేశారు. ఈసారి ఇన్సూరెన్స్ కంపెనీ అధినేత ఆర్థర్ డ్రెప్లర్ కంపెనీలో డబ్బుని మాయం చేశారు. ఆర్థర్ పగతో రగిలిపోయాడు. ఇంటర్‌పోల్ ఏజెంట్ అల్మా న్యూయార్క్‌లోని ఈ నలుగురు మెజీషియన్లూ ఉండే అపార్ట్మెంట్ మీద రైడ్ చేసింది. ముగ్గురు తప్పించుకుంటారు. ఒకడు (జాక్) ప్రమాదవశాత్తూ చనిపోతాడు. అక్కడ విలువైన డాక్యుమెంట్లు దొరుకుతాయి. వాటి ఆధారంగా మెజీషియన్స్ హార్స్‌మెన్ గ్రూప్ ఆ తర్వాత ఎక్కడ నేరం చేయబోతున్నారనే ఆధారాలు లభిస్తాయి. ఆ చివరి షోని పోలీసులు ముట్టడిస్తారు. షోలో భాగంగా జనంపై డాలర్ల వర్షం కురిపిస్తారు. నిజానికవి దొంగనోట్లు. అయినా ప్రదర్శనకి వచ్చినవాళ్లు వాటిని నిజం నోట్లే అని భ్రమించి, ఎగబడతారు. ఈ హడావుడిలో ముగ్గురు తప్పించుకుంటారు. అయినా అల్మా వెంట పడుతుంది.చివరికి తెలిసేది ఏమిటంటే... ఆ ముగ్గురిలో ఒకడయిన డైలాన్ తండ్రిని ఆ బ్యాంక్, ఇన్యూరెన్స్ కంపెనీలు మోసం చేస్తాయి. అందుకే ప్రతీకారంగా ఈ మ్యాజిక్ క్రైమ్‌లు చేసినట్లు చెబుతాడు. డెబ్భై అయిదు మిలియన్ల వ్యయంతో రూపొందిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. 352 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. - తోట ప్రసాద్ -
పెళ్లి తేదీని స్వయంగా ప్రకటించిన సల్మాన్!
ఔను! బాలీవుడ్ మోస్ట్ ముదురు బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ స్వయంగా తన పెళ్లి తేదీని ప్రకటించాడు. నవంబర్ 18న పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయినా.. ఆయన మహిళా అభిమానులు.. అయ్యో సల్మాన్ పెళ్లి చేసుకుంటున్నాడని బాధపడక్కర్లేదు. ఎందుకంటే నవంబర్ 18న పెళ్లి చేసుకుంటానని సల్మాన్ ప్రకటించాడు.. అది ఏ సంవత్సరంలో అన్నది మాత్రంలో చెప్పలేదు. ముంబైలో భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఆత్మకథ 'ఏస్ అగైనెస్ట్ ఆడ్స్' పుస్తకావిష్కరణ సందర్భంగా ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా వచ్చిన సల్మాన్ ఖాన్ ను స్వయంగా సానియానే 'మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు' అని ప్రశ్నించింది. ఈ ప్రశ్న ఎంతో కీలకమైనది కావడం వల్ల సమాధానం చెప్పాలని కోరింది. ఈ ఊహించని ప్రశ్నతో కాస్త ఇబ్బంది పడ్డ సల్మాన్ కొంత ఆలోచించుకొని.. నవంబర్ 18న అని చెప్పాడు. తన తండ్రి సలీం ఖాన్, తల్లి సల్మా నవంబర్ 18న పెళ్లి చేసుకున్నారు. కాబట్టి అదే తేదీన పెళ్లి చేసుకోవాలని తాను భావిస్తున్నట్టు చెప్పాడు. అయితే, ఇలాంటి నవంబర్ లో 20-25 వచ్చిపోయాయని, నవంబర్ 18న పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నప్పటికీ, అది ఏ సంవత్సరంలోనో తెలియదని సల్మాన్ భాయ్ చెప్పాడు. మీరు పెళ్లి చేసుకోకపోవడంపై మహిళలెవరూ మిమ్మల్ని అడగటం లేదా? అని సానియా అడుగగా.. హా.. కొందరు అడుగుతున్నారు.. మీకు తెలియదు ఎంతో ఒత్తిడి చేస్తున్నారు? సల్మాన్ బదులిచ్చాడు. ఆ మహిళలు ఎవరు అని అడుగగా.. మా అమ్మ, చెల్లెళ్లు.. వారు నేను పెళ్లిచేసుకోవాలని భావిస్తున్నారంటూ తెలిపాడు. -
పెళ్లి తేదీని ప్రకటించిన సల్మాన్!
-
ఇక మద్యానికో స్పెషల్ స్టాక్ మార్కెట్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఇప్పుడు ఒక కొత్త "స్టాక్ మార్కెట్" ఆవిష్కారానికి కేంద్రమైంది. మామూలు స్టాక్ మార్కెట్లలోని స్టాక్ ల కంటే చాలా విభిన్నమైన 'వైన్ స్టాక్ మార్కెట్.' అవును, మీరు చదవింది నిజమే. స్టాక్ మార్కెట్ అనేది ఆయా కంపెనీల వాటా (స్టాక్) లు కొనుగోళ్లు, అమ్మకాలు జరిపే వ్యవహారం. కానీ ఈ తాజా వైన్ స్టాక్ మార్కెట్ లో పేరుకు తగ్గట్టే మద్యం అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతాయన్న మాట. ముంబై లో దలాల్ స్ట్రీట్ మనీ ట్రేడింగ్ జరిగితే ఇక్కడ మాత్రం మద్యం ట్రేడింగ్ జరుగుతుందని దీని వ్యవస్థాపకులైన హిమాంశు గుప్త, విదిత్ గుప్త తెలిపారు. ఇతర స్టాక్ మార్కెట్లలోలాగానే తమ బార్ స్టాక్ మార్కెట్ లో డిమాండ్ అండ్ సప్లయ్ ఆధారంగా మద్యం ట్రేడింగ్ జరుగుతుందని చెప్పారు. ఇందులో కూడా పెట్టుబడులు, అంచనాలు, లాభాలు,నష్టాలు ఉంటాయన్నారు. తమ మార్కెట్ కూడా క్రాష్ అవుతుందని పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు తమకిష్టమైన వైన్ లేదా స్కాచ్ స్టాక్ ట్రేడింగ్ జరుపుకోవచ్చన్నారు. ఆర్డర్ ఫ్రీక్వెన్సీ ని బట్టి డిమాండ్ పెరగడం, క్షీణత, ధరలు పెరగడం, తగ్గడం ఉంటుందని, కొత్తగా నమోదు చేసిన బేస్ ధరతో మళ్ళీ అన్ని మరుసటి రోజు మార్కెట్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. మద్యం ప్రియుల కోసం మంచి రెస్టారెంట్ కావాలని కోరుకునే వారమని, ఆ క్రమంలోనే ఈ స్టాక్ మార్కెట్ రూపుదిద్దుకుందని విదిత్ తెలిపారు. దీనికి ఢిల్లీలోని కన్నాట్ ప్రదేశ అనువైందిగా భావించామన్నారు. తమ కెఫే దలాల్ స్ట్రీట్ లో 150 మంది సీటింగ్ కెపాసిటీ తో బార్అండ్ రెస్ట్రో లో అతి చవక ధరల్లో, నాణ్యమైన ఆహారంతోపాటు, వివిధ రకాల మద్యంతో క్లాసీ ఫీలింగ్ అందిస్తుందని తెలిపారు. అన్నట్టు ఇక్కడ మహిళలకోసం ప్రత్యేక కాక్ టైల్ ఉంటుందన్నారు. ఈ కెఫే లో ఏర్పాటుచేసిన ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ట్రేడింగ్ చేయవచ్చని పేర్కొన్నారు. సొంత చేతులతో సృష్టించిన ఈ స్టాక్ మార్కెట్ ఒకవిధంగా తమకు బిడ్డలాంటిదని వ్యాఖ్యానించారు. -
ఆ కంపును మోయొద్దు!
ఆత్మబంధువు ‘‘అమ్మా... ఆ శశిగాడితో నేను మాట్లాడను’’ అన్నాడు మిత్ర స్కూల్నుంచి వస్తూనే. ‘‘ఏమైంది నాన్నా. మీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కదా!’’ అంది రేఖ. ‘‘అది ఇంతకు ముందు. నౌ ఐ హేట్ హిమ్. వాడు నన్ను రోజూ ఏడిపిస్తున్నాడు.’’ ‘‘అవునా... ఏమనీ?’’ ‘‘వాడు నన్ను బోండాం, బోండాం అంటున్నాడమ్మా. అలా పిలవొద్దని చెప్పినా వినడంలేదు. అందుకే ఇక మీదట వాడితో మాట్లాడను’’ అన్నాడు కోపంగా. ‘‘నువ్వు లావుగా ఉండవుగా నాన్నా... మరి బోండాం అని పిలవడమెందుకు?’’ ‘‘ఏమో... వాడు అలానే పిలిచి ఏడిపిస్తున్నాడు.’’ ‘‘వాడలా పిలిస్తే నువ్వు ఉడుక్కుంటున్నావు కాబట్టి ఉడికిస్తున్నాడు. నువ్వు పట్టించుకోలేదనుకో.. రెండ్రోజులు పిలిచి వాడే ఊరుకుంటాడు’’ అంది రేఖ. ‘‘అంతేనంటావా మమ్మీ?’’ ‘‘అంతే నాన్నా... కావాలంటే రేపట్నుంచి ట్రై చేసి చూడు.’’ ‘‘సరే. రేపు వాడేమన్నా పట్టించు కోను. పిలిస్తే పిల్చుకో అని చెప్పేస్తా.’’ ‘‘గుడ్. దట్స్ ద స్పిరిట్’’ అంటూ కొడుకుని ముద్దాడింది రేఖ. వారం రోజులు గడిచాయి. ఓ రోజు స్కూల్నుంచి రాగానే స్కూల్ బ్యాగ్ విసిరికొట్టాడు మిత్ర. ‘‘మమ్మీ... ఆ శశిగాడిని తుక్కు తుక్కుగా కొట్టేస్తా’’ అన్నాడు కోపంగా. ఆ కోపం చూసి రేఖకు భయమేసింది. ‘‘మళ్లీ ఏమైందిరా?’’... మెల్లగా అడిగింది. ‘‘నేనెంత మంచిగా ఉన్నా వాడు నా మీద కామెంట్స్ చేయడం మానడం లేదమ్మా. పైగా వాడు నా బుక్స్ తీసి దాస్తున్నాడు. దాంతో బుక్ లేదని టీచర్ నన్ను తిడుతోంది. వాడివల్ల నాకు తిట్లు.’’ ‘‘నువ్వు వాడికి క్లోజ్ ఫ్రెండ్‌వి కదా. అందుకని సరదాగా చేస్తున్నాడులే నాన్నా. దానికే అంత కోపమైతే ఎలా?’’... బుజ్జగించే ప్రయత్నం చేసింది రేఖ. ‘‘అవును.. వాడు క్లోజ్ ఫ్రెండే. అందుకే వాడలా చేస్తే నాకు నచ్చదు.’’ ‘‘అదే వేరే వాళ్లు చేసుంటే?’’ ‘‘వేరే వాళ్లు చేస్తే నేను పట్టించు కోనుగా. నా ఫ్రెండ్ చేశాడు కాబట్టే నాకు కోపం.’’ ‘‘అంటే.. నీ ఫ్రెండ్ ఎలా ఉండాలో నీకో ఐడియా ఉంది. దాని ప్రకారం వాడు లేడు కాబట్టి వాడిమీద కోపం... అంతే కదా?’’ ‘‘హా... అంతే.’’ ‘‘వాడు నీ ఐడియా ప్రకారం ఎందుకు ఉండాలి? వాడు కూడా నువ్వు నాటీగా ఉండాలనుకుంటున్నాడేమో. నువ్వలా ఉంటావా మరి?’’ ‘‘వాడికి నచ్చినట్లు నేనెందుకు ఉంటాను? నాకు నచ్చినట్లే నేనుంటాను.’’ ‘‘కదా.. వాడు కూడా అలాగే ఉంటున్నాడు. దాన్ని యాక్సెప్ట్ చేస్తే నీకు కోపం రాదు. మీరు మంచి ఫ్రెండ్స్‌గా ఉండొచ్చు.’’ ‘‘ట్రై చేస్తా’’ అన్నాడు మిత్ర. అప్పటికి మిత్రకు సర్దిచెప్పింది కానీ తనలో పెరుగుతున్న అసహనాన్ని, కోపాన్ని చూస్తే రేఖకు భయమేసింది. టీనేజ్‌లోకి వస్తున్న ఈ దశలోనే వాటిని కట్టడి చేయాలని, వాటివల్ల నష్టమని తనకి ప్రాక్టికల్‌గా చెప్పాలని నిర్ణయించుకుంది. అందుకు మర్నాడు పొద్దున బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌ను ఎంచుకుంది. ‘‘అమ్మా....’’ పిలిచాడు మిత్ర కాస్త విసుగు, కాస్త బాధ నిండిన స్వరంతో. ‘‘ఏంటి నాన్నా?’’ అడిగింది రేఖ. ‘‘నాకు ఉల్లిపాయలు ఇష్టం లేదని తెలుసు కదా. వాటితో కర్రీ చేశావేం? పొటాటో కర్రీ చేయొచ్చుగా!’’ అన్నాడు కినుకగా. ‘‘సారీ నాన్నా. ఇవ్వాళ డాడీ కోసం చేశాలే. రేపు నీకోసం పొటాటో కర్రీ చేస్తా సరేనా!’’ ‘‘ఓకే.’’ ‘‘నాన్నా... నీకు పొటాటో అంటే చాలా ఇష్టం కదా!’’ ‘‘అవును... అది నీకు తెలుసు కదా మమ్మీ!’’ ‘‘సరే నేనో పని చెప్తా చేస్తావా?’’ ‘‘ఆ చేస్తా.’’ ‘‘నీకెంతో ఇష్టమైన పొటాటోని ఇవ్వాల్టి నుంచి నీ జేబులోనే పెట్టుకో.. నిద్ర పోతున్నప్పుడు కూడా తీయకూడదు. సరేనా!’’ ‘‘ఎందుకు?’’ అన్నాడు మిత్ర అయోమయంగా. ‘‘ముందుకో పెట్టుకో. ఎందుకో తర్వాత చెప్తా’’ అంటూ ఓ చిన్న దుంపను ఇచ్చింది రేఖ. ‘‘ఓకే మమ్మీ’’ అంటూ ఆ చిన్న బంగాళాదుంపను జేబులో వేసుకున్నాడు మిత్ర. నాలుగు రోజులు గడిచాయి. బంగాళాదుంప మెత్తబడటం మొదలు పెట్టింది. పదిరోజులు గడిచాక దుర్వాసన మొదలైంది. ‘‘అమ్మా... ఇది వాసన వస్తోంది, తీసేస్తా’’ అని చెప్పాడు మిత్ర. ‘‘అదేంట్రా... నీకెంతో ఇష్టం కదా. నీతోపాటే ఉంచుకో’’ అంది రేఖ. ‘‘అమ్మో, వద్దు మమ్మీ. దీన్ని ఇంకా ఉంచుకుంటే కంపు కొడుతుంది. ఫ్రెండ్స్ ఎవ్వరూ నా దగ్గరకు కూడా రారు’’ అన్నాడు ముఖం ఇబ్బందిగా పెట్టి. ‘‘ఒక బంగాళాదుంప కంపు కొడితేనే ఫ్రెండ్స్ నీ దగ్గరకు రారంటున్నావు కదా. మరి దానికంటే చెడ్డవైన నీ అసహనం, కోపం చూస్తే నీ దగ్గరకు వస్తారా?’’ తల్లివైపు చూశాడు మిత్ర. ఆమె చిన్నగా నవ్వింది. అమ్మ ఏం చెప్పాలనుకుందో మిత్రకు అర్థమైంది. ‘‘సారీ మమ్మీ. పొటాటోతో పాటే వాటిని కూడా వెంటనే తీసి పారేస్తా’’ అంటూ స్కూలుకు బయలుదేరాడు మిత్ర. - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
'ఆ వార్తతో నాకు సంబంధం లేదు'
హైదరాబాద్ : ఆంగ్ల దినపత్రిక 'మెట్రో ఇండియా డైలీ టుడే'లో వచ్చిన 'now, stir for seema statehood' అనే కథనానికి తనకు ఏమాత్రం సంబంధం లేదని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఎంవీ మైసురారెడ్డి స్పష్టంచేశారు. తనను సంప్రదించి ఆ పత్రికలో వార్త ప్రచురితమైనట్లుగా వచ్చిన కథనంపై ఆయన తీవ్రంగా స్పందించారు. సీమ భవితవ్యం, రాష్ట్ర ఏర్పాటుపై తాను ఆందోళన చెందుతున్నట్లు అందులో వచ్చిన వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. తనను ఎవరూ ఇంటర్వ్యూ చేయలేదని, ఆ కథనంపై తాను ఆశ్చర్యానికి లోనైనట్లు ఆయన చెప్పారు. ఆ కథనాన్ని ప్రచురించినందుకు తనను క్షమాపణ కోరాలని మైసురా పేర్కొన్నారు. -
నేటి నుంచి హెల్మెట్ తప్పనిసరి
హైదరాబాద్ : నవంబరు 1 నుంచి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకం తప్పనిసరని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. నేటి నుంచి హెల్మెట్ లేకుండా ప్రయాణించేవారికి జరిమానా విధించనుంది. మొదటిసారి జరిమానా వేయాలని, మరోసారి పట్టుబడితే వాహనం సీజ్ చేయాలని నిర్ణయించారు.ఇప్పటికే రెండు దఫాలుగా హెల్మెట్ వినియోగంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా వివిధ కారణాలతో వాయిదా వేస్తూ వచ్చింది. ఇక ఆదివారం నుంచి హెల్మెట్ వాడకం తప్పనిసరి కావడంతో హెల్మెట్ ధరలకు రెక్కలొచ్చాయి. ఉన్నట్టుండి హెల్మెట్ వ్యాపారులకు గిరాకీ పెరిగింది. -
వారఫలాలు: 1 నవంబర్ నుంచి 7 నవంబర్, 2015 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులు, విద్యార్థులకు శుభదాయకమైన కాలం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. గులాబి, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయ దర్శనం మంచిది. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమానంతరం పనులు పూర్తి కాగలవు. విద్యార్థులకు నిరుత్సాహపూరితం. వాహనాలు, గృహ కొనుగోలు యత్నాలు ముందుకు సాగవు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపార లావాదేవీలు సామాన్యం. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఆకుపచ్చ, లేతనీలం రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. వినాయకుని పూజించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) యుక్తితో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. సేవా కార్య క్రమాలు చేపడతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణదాతల ఒత్తిడులు తొలగు తాయి. వ్యాపార విస్తరణలో ముందడుగు. ఉద్యోగులకు పదోన్నతులు. తెలుపు, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కొత్త పనులు ప్రారంభిస్తారు. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. మనసులోని భావాలను కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కొంత జాప్యం జరిగినా వ్యవహారాలు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొన్ని నిర్ణయాలపై కుటుంబసభ్యుల నుంచి ప్రశంసలు. ఇంటి నిర్మాణయత్నాలు కలిసి వస్తాయి. వాహనయోగం. నిరుద్యోగులకు శుభవార్తలు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళాకారులకు విశేష ఆదరణ, సన్మానాలు. పసుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) పట్టింది బంగారమే. కొత్త పనులకు శ్రీకారం. ఆత్మీయులు, బంధువులతో సఖ్యత. మాటల చాతుర్యంతో అందర్నీ ఆకట్టు కుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక లాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆకుపచ్చ, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతకు కుంకుమార్చన చేయండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత బయటపడతారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి కాగలవు. విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు అనుకూల పరిస్థితి. చాక్లెట్, పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) మొదట్లో కొన్ని చికాకులు, సమస్యలు వచ్చినా క్రమేపీ తొలగుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకమే. సంఘంలో గౌరవ మర్యాదలు. వాహనయోగం. ఆస్తి వివాదాలు తీరతాయి. సోదరులతో సఖ్యత. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులు సమర్థత చాటుకుంటారు. ఎరుపు, ఊదా రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ స్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) పనులు నిదానంగా పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళాకారులకు అవార్డులు. తెలుపు, లేత పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఇంటా బయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువర్గంతో విభేదాలు తొలగుతాయి. భూములు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు పదవీయోగం. నీలం, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) చేపట్టిన పనులు సజావుగానే పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుని ముందుకు సాగుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. కళాకారులకు అవార్డులు దక్కవచ్చు. నలుపు, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) పనులు నిదానంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. భూవివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహంగా గడుస్తుంది. గులాబీ, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణ స్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
నవంబర్‌లో కొత్త రేషన్ కార్డులు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో ఆహార భద్రత (రేషన్) కార్డుల జారీకి రంగం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం పాత కార్డులను రద్దు చేసి ఆహార భద్రత కింద రేషన్ కార్డులు మంజూరు చేసిన ప్రభుత్వం... తాజాగా వాటికి సంబంధించిన కొత్త కార్డుల జారీకి సన్నాహాలు చేస్తోంది. గులాబీ రంగులో ఉండే కార్డుపై తెలంగాణ లోగో తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఫొటోలు ఉంటాయి.ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో నవంబర్ నెలలో కార్డులు జారీ చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులు యోచిస్తున్నారు. ఈసారి యూవిక్ పేపర్‌తో కార్డులు ఉంటాయి. కేంద్ర ఆహార భద్రతా చట్టం, రాష్ట్ర పరిధిలోకి వచ్చే లబ్ధిదారులతో పాటు అంత్యోదయ లబ్ధిదారులందరికీ ఒకేలాంటి యూవిక్ కార్డులు జారీ కానున్నాయి. గతంలో జారీ చేసే కార్డులతో పోలిస్తే వీటి ఖర్చు చాలా తక్కువ. యూవిక్ పేపర్ చించినా చిరగదు. కాల్చినా తగలబడదు. నీటిలోనూ తడువదు. దీనిపై ఉన్న వివరాల్లో ఎలాంటి మార్పులైనా సులభంగా చేసుకోవచ్చని సంబంధిత అధికారులు చెబుతున్నారు. గ్రేటర్లో 13.95 లక్షల కార్డులు గ్రేటర్ హైదరాబాద్ పౌర సరఫరాల విభాగం పరిధిలో 13.95 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. అందులో హైదరాబాద్ లోని తొమ్మిది సర్కిల్స్‌లో 8,17,410, రంగారెడ్డి అర్బన్‌లోని మూడు సర్కిల్స్‌లో 5,77,618 కార్డులు ఉన్నాయి. వాస్తవంగా ఇప్పటికే కొత్త కార్డులు జారీ కావాల్సి ఉంది. ఆహార భద్రత నిబంధనలను తూచా తప్పకుండా పాటించాల్సిందేనని కేంద్రం తేల్చి చెప్పడంతో ఆలస్యమైంది. కేంద్ర , రాష్ట్ర పరిధిలోకి వచ్చే లబ్ధిదారుల జాబితాలను వేర్వేరుగా అధికారులు తయారు చేశారు. ప్రస్తుతం ఆహార భద్రత చట్టం కింద కేంద్రం 4కిలోల బియ్యాన్ని పంపిణీ చేస్తుండగా... రాష్ట్రం దానికి అదనంగా మరో రెండు కిలోలను కలిపి కిలో రూపాయికి పంపిణీ చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర కోటా కిందకు వచ్చే వారికి ఎలాంటి తేడాలు లేకుండా సరుకులు సరఫరా జరుగనున్నందున ఒకేలాంటి గులాబీ యూవిక్ కార్డులు అందజేయనున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీతో లబ్ధిదారుల కుటుంబాలకు డేటా స్లిప్ భారం తప్పనుంది. ఇప్పటి వరకు ఆన్లైన్ డేటా స్లిప్ కోసం నెలకు రూ.10 చొప్పున రూ.136.5 లక్షల వరకు భారాన్ని భరించారు. పది నెలల క్రితం ఆహార భద్రత కార్డులు మంజూరు చేసిన ప్రభుత్వం కనీసం కూపన్లు కూడా జారీ చేయకుండా ఆన్లైన్లో కార్డు డేటాను పొందు పర్చి చేతులు దులుపుకుంది. ప్రతినెలా ఆన్లైన్ ద్వారా డేటా స్లిప్ తీసుకొని చౌక ధరల దుకాణంలో సమర్పిస్తే తప్ప రేషన్ అందని పరిస్థితి నెలకొంది. లబ్ధిదారులు డేటా స్లిప్ కోసం అదనపు భారం భరించారు. మరోవైపు డీలర్లు ప్రైవేటు కార్డుల పేరిట రూ.50 నుంచి రూ.100 వరకు దండుకున్నారు. తాజాగా కార్డులు జారీ కానుండటంతో లబ్ధిదారుల కుటుంబాల్లో సంతోషం వ్యక్త మవుతోంది. -
నగరంలో 781 డెంగీ కేసులు
న్యూఢిల్లీ: నగరంలో డెంగీ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయినప్పటికీ ఈ సీజన్లో గతేడాది కన్నా తక్కువగానే నమోదు అయ్యాయి. ఈ ఏడాది నవంబర్ 22 వరకూ 781 డెంగీ కేసులు నమోదు అయ్యాయని మున్సిపల్ అధికారులు సోమవారం తెలిపారు. నగర వ్యాప్తంగా మొత్తం 725 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 171, పశ్చిమం 320, తూర్పు 141, న్యూఢిల్లీ 19 కే సులు నమోదు అయ్యాయి. మిగతా 56 కేసులు ఉత్తర ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల పరిధిలో నమోదు అయ్యాయి. శ్రీనగర్‌కు చెందిన ఎనిమిదేళ్ల రిషీ క్వాడాఫీ సెప్టెంబర్ 28వ తేదీన సర్ గంగారామ్ ఆస్పత్రిలో మృతి చెందింది. ఈ ఘటన తర్వాత ఇప్పటి వరకూ నగరంలో ఇద్దరు డెంగీ బాధితులు మాత్రమే మృతిచెందారు. దివాళీ పండు గ నుంచి డెంగీ కేసుల నమోదు తగ్గిపోయిందని చెప్పారు. అయితే ప్రస్తు తం డెంగీ దోమలు వృద్ధిచెందడానికి నగరవాతావరణం అనుకూలంగా మారిందని, పలువురు డెంగీ బారిన పడుతున్నారని సీనియర్ అధికారి పేర్కొన్నారు. ఈఏడాది ఎక్కువ కేసులు నమోదు అయినప్పటికీ ఇదే సీజన్లో గతేడాదికన్నా తక్కువే నమోదు అయ్యాయి. అప్పట్లో మొత్తం 5,212 డెంగీ కేసులు ఈ సీజన్లోనే నమోదు అయ్యాయని చెప్పారు. -
23, 30 తేదీల్లో రైల్వే గ్రూప్-డీ ఎగ్జామ్స్
దళారులను నమ్మి మోసపోవద్దు: సీపీఆర్వో సాక్షి, హైదరాబాద్: రైల్వే రిక్రూట్మెంట్ సెల్ గ్రూప్-డీ తుది విడత పరీక్షలు ఈ నెల 23, 30ల్లో జరగనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సాంబశివరావు బుధవారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 4గంటల వరకు జరుగుతాయన్నారు. హైదరాబాద్, సికిం ద్రాబాద్, విజయవాడ, గుంటూరు, నాందేడ్, తిరుపతిలో పరీక్షల కోసం ఏర్పా ట్లుచేసినట్లు చెప్పారు. కాల్‌లెటర్స్ అందని వారు దక్షిణమధ్య రైల్వే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 040-27788824 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు. గ్రూప్-డీఉద్యోగాలిప్పిస్తామనే మోసగాళ్ల గురించి 09701370053, 040-27830516 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వొచ్చన్నారు. -
ఏపీలో ఆగిపోయిన పాలన చక్రం
-
నవంబర్ 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు
న్యూఢిల్లీ: నవంబర్ 24 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమవేశాలకు కేంద్రం సన్నద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సాయంత్రం పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు. అనవసర పర్యటనలను తగ్గించుకుని పెండింగ్ బిల్లులపై దృష్టిసారించాలని మోదీ మంత్రులకు సూచించారు. -
15 నుంచి గ్యాస్‌కు నగదు బదిలీ
సిలిండర్‌కు రూ. 996 చెల్లిస్తే.. బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేది రూ. 552 సాక్షి, హైదరాబాద్: సబ్సిడీ వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకం కొద్దిపాటి మార్పులు, చేర్పులతో తిరిగి ప్రారంభమవుతోంది. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు తొలిదశలో ఈ నెల 15వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 54 జిల్లాల్లో నగదు బదిలీ అమల్లోకి రానుంది. ఇందులో రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలున్నాయి. ఇందుకు సంబంధించిన కసరత్తు కూడా వేగంగా జరుగుతోంది. జనవరి ఒకటి నుంచి రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో వంటగ్యాస్‌కు నగదు బదిలీ ప్రారంభం కానుంది. ఇది అమల్లోకి వస్తే వంటగ్యాస్ సిలిండర్ పూర్తి ధరను వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుం ది. అనంతరం ప్రభుత్వం నిర్ణయించిన సబ్సిడీ సొమ్ము నేరుగా లబ్ధిదారుల బ్యాం కు ఖాతాల్లో జమ అవుతుంది. అయితే సిలిండర్ పూర్తి ధరను ఒకేసారి చెల్లించాలంటే.. పేదలకు అది తలకు మించిన భారమనే విమర్శలు వస్తున్నాయి. సబ్సిడీ వంట గ్యాస్‌కు నగదు బదిలీ అంశాన్ని గతంలోనే యూపీఏ ప్రభుత్వం అమల్లోకి తెచ్చినా... దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో దానిని ఉపసంహరించుకుంది. కానీ ఇటీవల ఈ అంశంపై సమీక్షించిన ఎన్డీయే ప్రభుత్వం.. కొద్దిపాటి మార్పు, చేర్పులతో తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. నవంబర్ 10వ తేదీ నుంచే నగదు బదిలీని ప్రారంభించాలని భావించినా... పలు కారణాలతో ఇదే నెల 15వ తేదీకి వాయిదా పడింది. తొలిదశలో భాగంగా ఈ నగదు బదిలీని రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రాథమికంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో మొత్తంగా దాదాపు కోటి మంది ఎల్పీజీ వినియోగదారులు ఉండగా అందులో సుమారు 35 లక్షలు ఈ మూడు జిల్లాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. రూ. 996 చెల్లించాలి.. గృహ వినియోగదారులు ఇకపై వంటగ్యాస్‌ను తీసుకోవాలంటే ముందుగా నిర్ణీత ధర రూ. 996.50 (14.2 కేజీల సిలిండర్‌కు) చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం ప్రభుత్వం ఇందులో వినియోగదారులు చెల్లించాల్సిన రూ. 444 మినహాయించి, సబ్సిడీ మొత్తమైన రూ. 552.50ను తిరిగి వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. అయితే గతంలో విధంగా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదు. ఆధార్ లేకున్నా కేవలం బ్యాంకు ఖాతా ఉంటే చాలు వంటగ్యాస్ సబ్సిడీని నేరుగా వినియోగదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ఒకవేళ ఆధార్ సంఖ్య, బ్యాంకు ఖాతా రెండూ లేనివారు ఉంటే వారికి మూడు నెలల పాటు ఖాతా తెరిచేందుకు అదనపు సమయం ఇస్తారు. అప్పటివరకు ప్రస్తుతం కొనసాగుతున్న పద్ధతిలోనే వారు వంట గ్యాస్‌ను పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. కాగా.. రాష్ట్రంలో ప్రస్తుతం నగదు బదిలీ అమలుకానున్న మూడు జిల్లాల్లో సుమారు 24 శాతం మందికి బ్యాంకు ఖాతాలు వంటగ్యాస్ కనెక్షన్‌తో అనుసంధానం కాలేదని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇక ఏడాదిలో ఎప్పుడైనా 12 సిలిండర్లను తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే.. మరోవైపు నగదు బదిలీ కారణంగా.. పేద వినియోగదారులు ఒకేసారి పూర్తి సిలిండర్ ధరను చెల్లించాల్సి రావడం ఇబ్బంది మారుతుందనే విమర్శలు వస్తున్నాయి. -
నవంబర్ 9నుండి 15 వరకు
సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష పండితులు మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగించవచ్చు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులుంటాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార లావాదేవీలు అంతంతగా ఉంటాయి. ఉద్యోగస్తులు పైస్థాయి వారి నుంచి ఒత్తిడులు ఎదుర్కొంటారు. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. వారం మధ్యలో ఆకస్మిక ధనలాభం. వృషభం (కృత్తిక 2,3,4పా, రోహణి, మృగశిర 1,2పా.) ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. అంచనాలు నిజమవుతాయి. రావలసిన డబ్బు అందుతుంది. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులు పనిభారం తగ్గి ఊరట చెందుతారు. కళారంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి. వారం చివరిలో ధనవ్యయం. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. అనారోగ్యం. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఏపని చేపట్టినా విజయవంతంగా పూర్తి కాగలదు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు శుభవార్తలు. గృహ నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. పారిశ్రామికవర్గాలకు అంచనాలు నిజమవుతాయి. వారం చివరిలో ఆరోగ్యభంగం. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) కొత్త పనులు ప్రారంభిస్తారు. సేవలకు గుర్తింపు లభిస్తుంది. ఆస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించవచ్చు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో ధనవ్యయం. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,) కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంటాబయటా ప్రోత్సాహకరం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కొన్ని వివాదాల నుంచి చాకచక్యంగా బయటపడతారు. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి సన్మానాలు. వారం ప్రారంభంలో కుటుంబసమస్యలు. అనారోగ్యం. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.) మీ సమర్థతను చాటుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు. పనులు చకచకా సాగుతాయి. శ్రమ ఫలిస్తుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. రుణాలు తీరుస్తారు. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన వార్తలు. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) కొన్ని పనులు నెమ్మదిగా సాగుతాయి. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు ఊరట కలిగిస్తాయి. నిరుద్యోగులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనారోగ్యం. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) కొత్త పనులకు శ్రీకారం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇంటాబయటా అనుకూలం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతి అవకాశాలు. కళారంగం వారికి సన్మానాలు. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) అనుకోని విధంగా డబ్బు అందుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగుల యత్నాలు సఫలం. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని సమస్యలు ఎట్టకేలకు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు పదవులు దక్కే అవకాశం. వారం మధ్యలో దూరప్రయాణాలు. ధనవ్యయం. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ముఖ్య నిర్ణయాలలో తొందరవద్దు. పనులలో జాప్యం. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. బంధువులు ఒత్తిడులు పెంచుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఊరిస్తాయి. కళారంగం వారికి పురస్కారాలు. వారం చివరిలో వాహనయోగం. -
5వ తేదీ ధర్నాలో అందరూ పాల్గొనండి
-
5వ తేదీ ధర్నాలో అందరూ పాల్గొనండి: వైఎస్ జగన్
హైదరాబాద్ : నవంబర్ 5వ తేదీ నాడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో జరిగే ధర్నాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని కోరారు. ఆయన మంగళవారం నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు హామీల వైఫల్యంపై ఆయన ఏమన్నారంటే.. * చంద్రబాబు తన పథకాల గురించి గ్రామాల్లో పెద్దపెద్ద హోర్డింగులు పెట్టారు. లైట్లు కూడా పెట్టారు. ఎక్కడైనా కనపడకుండా పోతుందేమోనని, అందరూ చూడాలని భారీ ప్రచారాలు చేసుకున్నారు. * ప్రతి ఒక్క ప్రకటనా చివరకు కార్యకర్తలకు ఇంటింటికీ వెళ్లి పాంప్లెట్లు కూడా పంచారు. * అధికారంలోకి వస్తూనే దేశం బాగుండాలంటే రైతులు బాగుండాలని, రుణమాఫీపై మొట్టమొదటి సంతకం చేస్తానని అన్నారు. * ప్రతి కుటుంబం బాగుంటాలంటే అక్కచెల్లెళ్లు బాగుండాలి, అందుకే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్నారు. * జాబు కావాలంటే బాబు రావాలి.. ఇంటికో ఉద్యోగం, ఉపాధి కల్పిస్తాను. అది దొరకనంత వరకు నెలకు 2వేల రూపాయలు ఇస్తానన్నారు. ఇలా హామీలు గుప్పించి ప్రజలను వంచించారు. * ఎన్ని వ్యవసాయ రుణాలున్నాయని బ్యాంకర్ల కమిటీ సమావేశంలో అడిగారు. బ్యాంకర్లు అన్ని వివరాలూ ఇచ్చారు. 87 వేల కోట్ల వ్యవసాయ రుణాలు, 14వేల కోట్ల డ్వాక్రా రుణాలు ఉన్నాయి. రెండూ కలిపితే లక్ష కోట్లకు పైగా ఉన్నాయి. * వీటిపై చంద్రబాబు మాటలు నమ్మి, ఆయన కట్టొద్దంటే కట్టకుండా ఉన్నందుకు వీటిమీద 14వేల కోట్ల అపరాధ వడ్డీ పడింది. దీన్ని బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. * చంద్రబాబు చేసిన బడ్జెట్ కేటాయింపులు ఏమాత్రం సరిపోవు కాబట్టి, ఈ సంవత్సరం పూర్తయ్యే నాటికి మరో 14వేల కోట్ల వడ్డీ భారం పడుతుంది. మొత్తం కలిపి 28వేల కోట్లు వడ్డీలే అవుతుంటే.. చంద్రబాబు కేవలం 5వేల కోట్లే కేటాయించి చేతులు దులుపుకొన్నారు. * 20 శాతం రుణాలు మాఫీ చేస్తామని ఇప్పటికీ చెబుతున్నారు. రైతులను ఎంతగా మోసం చేస్తున్నారనేదానికి ఇదే నిదర్శనం. * చంద్రబాబు చెప్పారు కాబట్టి రుణాలు కట్టకపోవడంతో అవి రెన్యువల్ కాలేదు. దాంతో హుదూద్ తుఫాను వల్ల కలిగిన పంట నష్టానికి కనీసం బీమా కూడా రాలేదు. -
5 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
-
5 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: నవంబర్ 5న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. నవంబర్ 24 వరకు సమావేశాలు జరగనున్నాయి. 5వ తేదీనే తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 6 వ తేదీ అసెంబ్లీకి సెలవు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులతో సమావేశమయ్యారు. -
5 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: నవంబర్ 5 నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 7న తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాలు రెండు వారాల పాటు జరగనున్నాయి. మంగళవారం సాయంత్రం తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. కేసీఆర్ ఈ రోజు పలువురు అధికారులతో సమావేశమయ్యారు. -
నవంబర్ 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ!
-
మీ ఇంటికొస్తున్నం
ఇవి ఉంటే మేలు... ఆహారభద్రతకు వచ్చిన సర్వే వివరాలను సరిపోల్చి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారు. కాబట్టి ఇందుకు ప్రత్యేకంగా ధ్రువపత్రాలు అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. వికలాంగులయితే పింఛన్‌కు సంబంధించిన సదరమ్ సర్టిఫికెట్ ఉండాలి. వితంతు పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారు భర్తమరణ ధ్రువీకరణ పత్రం చూపించాలి. లేని పక్షంలో వైద్య పత్రాలు తాత్కాలికంగా ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. లేదంటే పక్కంటివారు, లేదా కుల పెద్దల అనుమతితో వాటిని ఆమోదిస్తారు. వృద్ధాప్య పింఛన్ల కోసం వయస్సు ధ్రువీక రణకు సంబంధించి ఆధార్, ఓటరు కార్డు ఇలా ఏదైనా ఓకార్డు చూపిస్తే సరిపోతుంది. సదరమ్, మరణ ధ్రువీకరణ పత్రాలు లేనిపక్షంలో పక్కంటి వారిని అడిగి నిజాలు నిర్ధారించుకుంటారు. కల్లుగీతకార్మికులు, చేనేత పింఛన్‌దారులు సొసైటీ గుర్తింపు కార్డులు చూపించాలి. నీలగిరి : జిల్లాలో ఆహారభద్రత కార్డులు, పింఛన్ల దరఖాస్తుల పరిశీలన క్షేత్రస్థాయిలో మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే తహసీల్దార్ కార్యాలయాల్లో శిక్షణ తీసుకున్న 427 మంది విచారణాధికారులు ఇంటింటికి వెళ్లి ప్రజలు ఇచ్చిన సమాచారం సరైందా? కాదా? అనే విషయాలను తేల్చనున్నారు. పింఛన్లకు సంబంధించి నవంబర్ 2 వరకు దరఖాస్తుల పరిశీలన పూర్తిచేయాలి. తదనంతరం అర్హుల జాబితాను రూపొందించి ప్ర భుత్వానికి అందజేస్తారు. కొత్త పిం ఛన్లు నవంబర్‌లో పంపిణీ చేస్తారు. ఆహార భద్రత కార్డులకు భారీ సం ఖ్యలో దరఖాస్తులు వచ్చిన నేపథ్యం లో , పరిశీలన నవంబర్నెలలో పూర్తి చేసి, డిసెంబర్లో కొత్త కార్డులు జారీ చేయనున్నారు. మంగళవారం నుంచి నిర్వహించే ఇంటింటి సర్వేలో మాత్రం ఆహార భద్రత కార్డులు, పింఛన్లకు కలి పి ఒకేసారి విచారణ చేపట్టనున్నారు. తహసీల్దార్లు, ఎండీఓలు బాధ్యులు.. దరఖాస్తుల స్వీకరణ సోమవారంతో ముగిసింది. జిల్లావ్యాప్తంగా ఆహారభద్రత కార్డులకు 10,67,004 దరఖాస్తులు వస్తే..పింఛన్లకు 5,47,287 దరఖాస్తులు వచ్చాయి. గతంతో పోలిస్తే భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడం తో అధికారులు బెంబేలెత్తుతున్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో కుటుంబాల సంఖ్య 11.30 లక్షలు కాగా, ప్రస్తుతం ఆహార భద్రత కార్డులకు 10 లక్షలకు పైగా దరఖాస్తులొచ్చాయి. మొత్తం కుటుంబాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, అనర్హులు మినహాయించినా ఇంత మొత్తంలో దరఖాస్తులు వచ్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. పింఛన్ల విషయంలో కూడా ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దరఖాస్తుల పరిశీలన సందర్భంగా అర్హులకు అన్యాయం జరిగినా..అనర్హులకు జాబితాలో చోటు దక్కినా..ఆహార భద్రత కార్డులకు సంబంధంచి తహసీల్దార్లు, పింఛన్ల విషయంలో ఎండీఓలు బాధ్యత వహించాలి. విచారణాధికారులుగా ఉండే డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలు, సీనియర్ అసిస్టెంట్లు, పంచాయతీ విస్తరణ అధికారులు తమకు కేటాయించిన గ్రామాల్లోకి వెళ్లి స్థానికంగా ఉండే వీఆర్వోలు, వీఆర్ఏలు, పంచాయతీ కార్యదర్శుల సహకారంతో పరిశీలన చేపడతారు. సర్వే వివరాల ఆధారంగా... సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా ప్రజలు ఇచ్చిన వివరాల ప్రతిని ప్రస్తుతం ఇచ్చిన దరఖాస్తులకు జతచేసి అందులోని వివరాల ఆధారంగా మరోసారి పరిశీలన చేస్తామని అధికారులు చెబున్నారు. ప్రస్తుతం వచ్చిన దరఖాస్తుల నంబర్లను సర్వే ఫారాలపై నమోదు చేస్తారు. అదే విధంగా సర్వే ఫారాలపై ఉన్న నంబర్లును వచ్చిన దరఖాస్తులపైనమోదు చేస్తా రు. సర్వేలో సేకరించిన కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ నంబర్లు, మొత్తం భూమి, ఇంటి రకం, నాలుగు చక్రాల వాహనం...తదితర అంశాలను సరిపోల్చనున్నారు . ఎవరికెంత భూమి ఉందనే విషయాన్ని సులువుగా తె లుసుకునేందుకు 1 బీ రిజిస్టర్లను వీఆర్వోలు సిద్ధంగా ఉంచనున్నారు. కుటుంబాల సంఖ్యపైనా ఆరా.. సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా కొందరు ఒకే కుటుంబంగా ఉన్నప్పటికీ, వేర్వురుగా నమోదు చేయించుకున్నారు. ప్రస్తుతం వాళ్లు ఒకేచోట ఉంటూ వేర్వేరు కుటుంబాలు గానే దరఖాస్తు చేసుకుంటే ఆ వివరాలను విచారణాధికారులుతమకు అందించిన పత్రంలో పొందుపర్చనున్నారు. ఎవరైనా తప్పుడు వివరాలు ఇస్తున్నట్లు అనుమానం వస్తే స్థానికులను అడిగి నిజనిజాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇలా ఒక్కో కుటుంబానికి సంబంధించిన వివరాలు పరిశీలించిన అనంతరం ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల మేరకు దరఖాస్తుదారులు ఆయా పథకాలకు అర్హులా..? కాదా..? అనే విషయాన్ని తేల్చనున్నారు. రెండు దరఖాస్తుల పరిశీలన... ఆహార భద్రత కార్డులు, పింఛన్ల దరఖాస్తుల పరిశీలన ఒకేసారి ఉంటుంది. నవంబర్ 2 వరకు పింఛన్ల దరఖాస్తుల పరిశీలిస్తారు. విచారణాధికారులు ఇళ్లకు వచ్చినప్పుడు ఆధార్ కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులు, ఇతర అర్హత కార్డులు చూపించాలి. అప్పటికప్పుడు లేకుంటే విచారణ పూర్తయ్యే నాటికి సమర్పించాలి. లేదంటే అనర్హులుగా పరిగణిస్తారు. -
నవంబర్ 5న నిరసన ప్రదర్శనలు:వైఎస్ జగన్ పిలుపు
విజయనగరం: ప్రభుత్వం చేసే మోసాలకు, వంచనకు నిరసన తెలుపుతూ నవంబరు 5న అన్ని మండల కార్యాలయాల వద్ద ప్రదర్శనలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు ఇచ్చారు. రైతులు, డ్వాక్రా మహిళలు ముందుకు వచ్చి నిరసనలు తెలపాలన్నారు. రైతుల రుణాలు మాఫీ చేయలేదు, రీషెడ్యూల్ కూడా చేయలేదన్నారు. క్రాప్ ఇన్యూరెన్స్ కూడా లేదని చెప్పారు. రైతులు తీసుకున్న రుణాలపై 14 శాతం వడ్డీ పడుతుందని తెలిపారు. ఈ పరిస్థితులలో రైతులు రుణాలు ఎలా చెల్లిస్తారని జగన్ ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా యూ కొత్తపల్లి మండలం వాకతిప్పలో బాణాసంచా గోడౌన్లో జరిగిన పేలుడు దుర్ఘటనపై జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. తిప్పవలసలో బాధితులకు పరామర్శ పూసపాటిరేగ మండలం తిప్పవలసలో తుపాను బాధితులను వైఎస్ జగన్ పరామర్శించారు. మత్య్సకారులను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు.