సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని ప్రధాన రంగాలు రికార్డ్ స్థాయిలో భారీగా పుంజుకున్నాయి. ఐఐపీ డేటాలో 40శాతం వెయిటేజీ ఉన్న ఈసీఐ ఇండెక్స్ (ఎయిట్ కోర్ ఇండెక్స్) నవంబర్ నెలలో వృద్ధిరేటు 6.8 శాతం వృద్ధిని రేటును నమోదు చేసింది. దీంతో మౌలిక సదుపాయాల ఉత్పత్తి 19 నెలల గరిష్టాన్ని తాకింది. గత ఏడాది ఇదే నెలలో ఇది 3.2 శాతంగా ఉంది. బొగ్గు, ఉక్కు, సిమెంటు, విద్యుత్ వంటి ప్రధాన రంగాల ఉత్పాదనను సూచించే ఈసీఐ ఇండెక్స్ తాజా గణాంకాలను వాణిజ్య, పరిశ్రమల శాఖ సోమవారం విడుదల చేసింది. ఏప్రిల్, నవంబర్ మధ్యకాలంలో పారిశ్రామిక వృద్ధిరేటు 3.9 శాతంగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఐఐపి వృద్ధిరేటు 5.3 శాతంగా నమోదైంది.
గత ఏడాది ఇదే నెలలో 3.2 శాతం వృద్ధి సాధించిన ఎనిమిది ప్రధాన రంగాల వృద్ధిరేటు 6.8 శాతం వృద్ధి చెందిందని వాణిజ్య పరిశ్రమల శాఖ పేర్కొంది. ముఖ్యంగా సంవత్సరం ప్రాతిపదికన ఫెర్టిలైజర్స్, కోల్, క్రూడ్ ఆయిల్, నాచురల్ గ్యాస్,ఎలక్ట్రిసిటీ, స్టీల్ , పెట్రోలియం అండ్ రిఫైనరీ ఉత్పత్తి బాగా ఉంజుకుంది. స్టీల్ 8.4 శాతం నుంచి పుంజుకుని 16.6శాతం గానూ, సిమెంట్ సెక్టార్ -2.7నుంచి ఎగిసి 17.3శాతంగా నమోదైంది.
అయితే మంత్ ఆన్ మంత్ బొగ్గు ఉత్పత్తి 0.2 శాతం, చమురు ఉత్పత్తి 0.2 తగ్గింది. స్టీల్ ఉత్పత్తి 16.6గా ఉంది. సిమెంట్ ఉత్పత్తి కూడా 2.7శాతం (నెలవారీ)క్షీణించి 17.3శాతంగా నమోదుకాగా, విద్యుత్ ఉత్పత్తి 2.1 శాతం క్షీణించి 2.1గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment