Factory Output
-
19 నెలల గరిష్టానికి ఈసీఐ ఇండెక్స్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని ప్రధాన రంగాలు రికార్డ్ స్థాయిలో భారీగా పుంజుకున్నాయి. ఐఐపీ డేటాలో 40శాతం వెయిటేజీ ఉన్న ఈసీఐ ఇండెక్స్ (ఎయిట్ కోర్ ఇండెక్స్) నవంబర్ నెలలో వృద్ధిరేటు 6.8 శాతం వృద్ధిని రేటును నమోదు చేసింది. దీంతో మౌలిక సదుపాయాల ఉత్పత్తి 19 నెలల గరిష్టాన్ని తాకింది. గత ఏడాది ఇదే నెలలో ఇది 3.2 శాతంగా ఉంది. బొగ్గు, ఉక్కు, సిమెంటు, విద్యుత్ వంటి ప్రధాన రంగాల ఉత్పాదనను సూచించే ఈసీఐ ఇండెక్స్ తాజా గణాంకాలను వాణిజ్య, పరిశ్రమల శాఖ సోమవారం విడుదల చేసింది. ఏప్రిల్, నవంబర్ మధ్యకాలంలో పారిశ్రామిక వృద్ధిరేటు 3.9 శాతంగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఐఐపి వృద్ధిరేటు 5.3 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే నెలలో 3.2 శాతం వృద్ధి సాధించిన ఎనిమిది ప్రధాన రంగాల వృద్ధిరేటు 6.8 శాతం వృద్ధి చెందిందని వాణిజ్య పరిశ్రమల శాఖ పేర్కొంది. ముఖ్యంగా సంవత్సరం ప్రాతిపదికన ఫెర్టిలైజర్స్, కోల్, క్రూడ్ ఆయిల్, నాచురల్ గ్యాస్,ఎలక్ట్రిసిటీ, స్టీల్ , పెట్రోలియం అండ్ రిఫైనరీ ఉత్పత్తి బాగా ఉంజుకుంది. స్టీల్ 8.4 శాతం నుంచి పుంజుకుని 16.6శాతం గానూ, సిమెంట్ సెక్టార్ -2.7నుంచి ఎగిసి 17.3శాతంగా నమోదైంది. అయితే మంత్ ఆన్ మంత్ బొగ్గు ఉత్పత్తి 0.2 శాతం, చమురు ఉత్పత్తి 0.2 తగ్గింది. స్టీల్ ఉత్పత్తి 16.6గా ఉంది. సిమెంట్ ఉత్పత్తి కూడా 2.7శాతం (నెలవారీ)క్షీణించి 17.3శాతంగా నమోదుకాగా, విద్యుత్ ఉత్పత్తి 2.1 శాతం క్షీణించి 2.1గా ఉంది. -
ద్రవ్యోల్బణం పెరిగింది.. ఉత్పత్తి తగ్గింది!
న్యూఢిల్లీ : వినియోగదారుల ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్ట స్థాయికి ఎగిసింది. ఇంధన ధరలు పెరుగడంతో మార్చి నెల ద్రవ్యోల్భణం పెరిగినట్టు బుధవారం విడుదలైన డేటాలో వెల్లడైంది. ధరలు పెరుగుతాయని ముందుగానే ఊహించిన రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా పాలసీ రేట్లను యథాతథంగా ఉంచింది. వారి అంచనాల మేరకే ద్రవ్యోల్బణం ఎగిసింది. గత నెల వినియోగదారుల ద్రవ్యోల్బణం 3.81 శాతం పైకి ఎగిసినట్టు ప్రభుత్వ డేటాలో తెలిసింది. 2016 అక్టోబర్ నుంచి ఇదే అత్యంత వేగవంతమైన పెరుగుదలని తేలింది. ఫిబ్రవరి నెలలో ద్రవ్యోల్బణం 3.65 శాతానికి ఎగిసినప్పటికీ, ఇంత వేగంగా పెరుగలేదని గణాంకాల మంత్రిత్వశాఖ డేటాలో వెల్లడైంది. ఫిబ్రవరి నెలలో 3.91శాతంగా ఉన్న రిటైల్ ఇంధన ద్రవ్యోల్బణం మార్చి నెలలో ఏకంగా 5.56 శాతానికి పెరిగింది. ఆహారపు ధరలు కూడా 1.93 శాతం పైకి వెళ్లాయి. కానీ ముందస్తు నెలతో పోల్చుకుంటే ఇది తక్కువేనని తెలిసింది. ఓ వైపు వినియోగదారుల ద్రవ్యోల్బణం పెరుగగా.. మరోవైపు పారిశ్రామికోత్పత్తి అనూహ్యంగా ఫిబ్రవరి నెలలో 1.2 శాతం పడిపోయింది. జనవరి నెలలో ఈ ఉత్పత్తి 2.7 శాతం వృద్ధి నమోదుచేసుకుంది. కానీ పారిశ్రామికోత్పత్తి 1.3 శాతం వృద్ధి నమోదుచేస్తుందని రాయిటర్స్ అంచనావేసింది. ప్రస్తుతం రాయిటర్స్ అంచనాలు తప్పాయి. -
నడత మారని పారిశ్రామికం
న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగంలో రికవరీ కనబడ్డం లేదు. ఫిబ్రవరి తరహాలోనే (-1.8 శాతం) మార్చిలో సైతం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో వృద్ధిలేకపోగా క్షీణత నమోదయ్యింది. ఈ సూచీ -0.5 శాతం క్షీణించింది. ప్రధాన రంగాలు తయారీ, మైనింగ్, క్యాపిటల్ గూడ్స్ పేలవ పనితీరు దీనికి ప్రధాన కారణం. అయితే ఫిబ్రవరితో పోల్చితే క్షీణత రేటు మెరుగుపడ్డమే ఇక్కడ చెప్పుకోదగింది. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) సోమవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. 2013 మార్చి నెలలో పారిశ్రామిక వృద్ధి రేటు 3.5 శాతం. ప్రధాన రంగాల పనితీరును పరిశీలిస్తే... తయారీ: మొత్తం సూచీలో దాదాపు 70% వాటా కలిగిన తయారీ రంగం వృద్ధి రేటు క్షీణతలోకి జారింది. 4.3% వృద్ధి రేటు మైనస్ 1.2%లోకి జారింది. మైనింగ్: సూచీలో 14 శాతం వెయిటేజ్ ఉన్న ఈ రంగంలో క్షీణత కొనసాగుతోంది. అయితే క్షీణత (-) 2.1 శాతం నుంచి 0.4 శాతానికి తగ్గింది. విద్యుత్: ఈ రంగంలో వృద్ధిరేటు మాత్రం బాగుంది. ఇది 3.5 శాతం నుంచి 5.4 శాతానికి మెరుగుపడింది. క్యాపిటల్ గూడ్స్: డిమాండ్‌కు ప్రధాన సూచికగా ఉండే భారీ ఉత్పత్తుల రంగం క్యాపిటల్ గూడ్స్ 9.6% వృద్ధి నుంచి మైనస్ 12.5 శాతంలోకి పడిపోయింది. వినియోగ వస్తువులు: ఈ రంగం 1.8% వృద్ధి నుంచి 0.9% క్షీణతలోకి చేరింది. ఈ రంగంలోని వినియోగ మన్నిక ఉత్పత్తుల్లో అసలు వృద్ధిలేకపోగా 11.8% క్షీణించింది. 2013 మార్చిలో సైతం ఈ రంగం క్షీణతలో ఉన్నా, అప్పట్లో ఇది మైనస్ 4.9 శాతం. -
పరిశ్రమలు మైనస్
ఆర్థిక వ్యవస్థకు కష్టకాలం కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఒకేరోజు విడుదలైన రెండు కీలక గణాంకాలు దీనికి అద్దం పడుతున్నాయి. మార్చి నెలలో ఎగుమతులు క్షీణించడంతో పాటు 2013-14 పూర్తి ఏడాదికి ప్రభుత్వం నిర్ధేశించుకున్న ఎగుమతుల లక్ష్యాన్ని చేరకపోవడం, ఫిబ్రవరిలో పారిశ్రామికోత్పత్తి రంగం మళ్లీ తిరోగమనంలోకి జారిపోవడం మందగమనం తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. న్యూఢిల్లీ: దేశ పారిశ్రామిక రంగం తీవ్ర ఆటుపోట్లతో కుదేలవుతోంది. మినుకుమినుకుమంటూ కొద్దిగా ఆశలు రేపడం... అంతలోనే తిరోగమనంలోకి జారిపోతుండటంతో పారిశ్రామిక వర్గాలకు ఏంచేయాలో పాలుపోని పరిస్థితి. ఈ ఏడాది జనవరిలో వృద్ధిబాటలోకి వచ్చిన పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ).. ఫిబ్రవరిలో మళ్లీ మైనస్‌లోకి కుంగిపోయింది. 1.9 శాతం క్షీణించింది. ప్రధానంగా తయారీ, యంత్ర పరికరాల రంగాలు అత్యంత పేలవ పనితీరు పారిశ్రామికోత్పత్తిని తూట్లుపొడుస్తోంది. క్రితం ఏడాది ఫిబ్రవరిలో ఐఐపీ వృద్ధి 0.6 శాతంగా నమోదైంది. కేంద్రీయ గణాంకాల సంస్థ(సీఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలను వెల్లడించింది. మళ్లీ ఉసూరుమనిపించింది... గతేడాది అక్టోబర్ నుంచి పారిశ్రామికోత్పత్తి తిరోగమనం(మైనస్)లోకి జారిపోవడం మొదలైంది. అక్టోబర్‌లో 1.2% కుంగిన ఐఐపీ.. డిసెంబర్ వరకూ మైనస్‌లోనే కొనసాగింది. తిరిగి జనవరిలో కాస్త వృద్ధిలోకి వచ్చినట్లే వచ్చి.... మళ్లీ ఈ ఫిబ్రవరిలో భారీగా క్షీణించడం(మైనస్ 1.9 %) గమానార్హం. పరిశ్రమల వెనుకబాటుకు అధిక వడ్డీరేట్లు కూడా ప్రధాన కారణమేనంటూ గగ్గోలుపెడుతున్న కార్పొరేట్లు... తక్షణం వడ్డీరేట్లు తగ్గించి ఆర్బీఐ చేయూతనందించాలని డిమాండ్ చేశారు. తయారీ తుస్... మొత్తం ఐఐపీలో 75% మేర వాటా కలిగిన తయారీ రంగం ఘోరంగా చతికిలపడింది. గతేడాది ఫిబ్రవరిలో 2.1% వృద్ధి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరిలో 3.7 శాతం క్షీణతలోకి దిగజారిపోయింది. ఇక 2013-14 ఏప్రిల్-ఫిబ్రవరి కాలంలోనూ ఈ రంగం ఉత్పాదకత 0.7% కుంగింది. అంతక్రితం ఏడాది ఇదే వ్యవధికి 1 శాతం వృద్ధి నమోదైంది. యంత్ర పరికరాల రంగం ఉత్పాదకత ఫిబ్రవరిలో ఏకంగా 17.4% కుంగిపోయింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ రంగం 9.1% వృ ద్ధి సాధించింది. తయారీ రంగంలోనూ 22 పారిశ్రామిక విభాగాలకుగాను 13 విభాగాలు ఈ ఫిబ్రవరిలో మైనస్‌లోనే కొనసాగడం దుర్భర పరిస్థితికి నిదర్శనం. ఇతర రంగాల పరిస్థితి ఇదీ... కన్జూమర్ గూడ్స్ ఉత్పాదకత ఫిబ్రవరిలో 4.5% కుంగింది. కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగం ఉత్పాదకత క్షీణత 2.6% నుంచి 9.3 శాతానికి చేరింది. కన్జూమర్ నాన్డ్యూరబుల్స్ విభాగం ఉత్పాదకత కూడా ఫిబ్రవరిలో 3.2 శాతం వృద్ధి నుంచి 1.2 % క్షీణతలోకి జారింది. ఇక విద్యుత్ రంగం ఉత్పాదకత ఫిబ్రవరిలో 11.5 % పెరిగింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఈ రంగం 3.2 శాతం క్షీణతను నమోదుచేసింది. మైనింగ్ రంగం క్రితం ఏడాది ఫిబ్రవరిలో 7.7 శాతం క్షీణించగా.. ఈ ఏడాది ఇదే నెలలో 1.4 శాతం వృద్ధిరేటును సాధించింది.