నవంబర్‌లో 37.84 బిలియన్ డాలర్లు
ఎగుమతులు 4.85 శాతం క్షీణత
32.11 బిలియన్ డాలర్లుగా నమోదు
దిగుమతులు 27 శాతం పెరిగి 69.95 బిలియన్ డాలర్లకు చేరిక
న్యూఢిల్లీ: భారత్‌కు వాణిజ్యలోటు సవాళ్లు తలెత్తుతున్నాయి. ఎగుమతులు నవంబర్‌లో అసలు పెరగకపోగా, 4.85 శాతం క్షీణించి (2023 ఇదే నెలతో పోల్చి) 32.11 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఎగుమతులు భారీగా 27 శాతం పెరిగి 69.95 బిలియన్ డాలర్లకు చేరాయి. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు ఆల్‌టైమ్ హై 32.84 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వంట నూనెలు, ఎరువులు, పసిడి వెండి దిగుమతులు భారీగా పెరగడం మొత్తం వాణిజ్యలోటు తీవ్రతకు దారితీసిందని వాణిజ్య మంత్రిత్వశాఖ తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే..
→ పసిడి దిగుమతుల విలువ ఆల్‌టైమ్ హై 14.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 2023 నవంబర్‌లో ఈ విలువ 3.5 బిలియన్ డాలర్లు.
→ క్రూడ్ ఆయిల్ దిగుమతులు సమీక్షా నెల్లో 7.9 శాతం పెరిగి 16.11 బిలియన్ డాలర్లకు చేరాయి.
→ పెట్రోలియం ప్రొడక్టుల దిగుమతులు 50 శాతం తగ్గి, 3.71 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
→ జౌళి, ఇంజనీరింగ్ గూడ్స్, ఎల్రక్టానిక్స్, ఫార్మా, సుగంధ ద్రవ్యాల ఎగుమతులు బాగున్నాయి.
ఏప్రిల్–నవంబర్ మధ్య ఇలా..
ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య ఎగుమతులు 2.17 శాతం పెరిగి 284.31గా నమోదయ్యాయి. దిగుమతులు 8.35 శాతం పెరిగి 486.73 బిలియన్ డాలర్లుగా ఉంది. దీనితో వాణిజ్యలోటు 202.42 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 170.98 బిలియన్ డాలర్లు. కాగా, ఎనిమిది నెలల్లో పసిడి దిగుమతులు 49 శాతం పెరిగి 49 బిలియన్ డాలర్లకు ఎగశాయి.
సేవల రంగం ఇలా..
నవంబర్‌లో సేవల ఎగుమతుల విలువ గత ఏడాది ఇదే కాలంతో పోలి్చతే 28.11 బిలియన్ డాలర్ల నుంచి 35.67 బిలియన్ డాలర్లకు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment