Rises Over
-
19 నెలల గరిష్టానికి ఈసీఐ ఇండెక్స్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని ప్రధాన రంగాలు రికార్డ్ స్థాయిలో భారీగా పుంజుకున్నాయి. ఐఐపీ డేటాలో 40శాతం వెయిటేజీ ఉన్న ఈసీఐ ఇండెక్స్ (ఎయిట్ కోర్ ఇండెక్స్) నవంబర్ నెలలో వృద్ధిరేటు 6.8 శాతం వృద్ధిని రేటును నమోదు చేసింది. దీంతో మౌలిక సదుపాయాల ఉత్పత్తి 19 నెలల గరిష్టాన్ని తాకింది. గత ఏడాది ఇదే నెలలో ఇది 3.2 శాతంగా ఉంది. బొగ్గు, ఉక్కు, సిమెంటు, విద్యుత్ వంటి ప్రధాన రంగాల ఉత్పాదనను సూచించే ఈసీఐ ఇండెక్స్ తాజా గణాంకాలను వాణిజ్య, పరిశ్రమల శాఖ సోమవారం విడుదల చేసింది. ఏప్రిల్, నవంబర్ మధ్యకాలంలో పారిశ్రామిక వృద్ధిరేటు 3.9 శాతంగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఐఐపి వృద్ధిరేటు 5.3 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే నెలలో 3.2 శాతం వృద్ధి సాధించిన ఎనిమిది ప్రధాన రంగాల వృద్ధిరేటు 6.8 శాతం వృద్ధి చెందిందని వాణిజ్య పరిశ్రమల శాఖ పేర్కొంది. ముఖ్యంగా సంవత్సరం ప్రాతిపదికన ఫెర్టిలైజర్స్, కోల్, క్రూడ్ ఆయిల్, నాచురల్ గ్యాస్,ఎలక్ట్రిసిటీ, స్టీల్ , పెట్రోలియం అండ్ రిఫైనరీ ఉత్పత్తి బాగా ఉంజుకుంది. స్టీల్ 8.4 శాతం నుంచి పుంజుకుని 16.6శాతం గానూ, సిమెంట్ సెక్టార్ -2.7నుంచి ఎగిసి 17.3శాతంగా నమోదైంది. అయితే మంత్ ఆన్ మంత్ బొగ్గు ఉత్పత్తి 0.2 శాతం, చమురు ఉత్పత్తి 0.2 తగ్గింది. స్టీల్ ఉత్పత్తి 16.6గా ఉంది. సిమెంట్ ఉత్పత్తి కూడా 2.7శాతం (నెలవారీ)క్షీణించి 17.3శాతంగా నమోదుకాగా, విద్యుత్ ఉత్పత్తి 2.1 శాతం క్షీణించి 2.1గా ఉంది. -
లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆరంభంలోనే లాభాలను ఆర్జించిన సెన్సెక్స్ 164పాయింట్ల లాభంతో 29,332వద్ద నిఫ్టీ 56 పాయింట్ల లాభంతో 9,086 వద్ద స్థిరపడ్డాయి. ముందురోజు నష్టాల నుంచి ప్రపంచ మార్కెట్లు కుదురుకోవడంతో దేశీయంగానూ సెంటిమెంటు మెరుగుపడింది. దీనికితోడు విదేశీ ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్‌లో పెట్టుబడులు మార్కెట్లకు ఊతమిచ్చింది. దీంతో నిఫ్టీ సాంకేతిక నిపుణులు కీలకమైన 9,050కి ఎగువన స్థిరపడింది. మెటల్, ఆటో జోరుకు తోడు ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్ రంగ లాభాలు జతకలిశాయి. అయితే ఎఫ్ఎంసీజీ నష్టపోయింది. యస్‌బ్యాంక్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, గెయిల్, విప్రో, బీపీసీఎల్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా లాభపడగా, టీసీఎస్, ఐషర్, ఐటీసీ, బాష్, హెచ్‌యూఎల్ నష్టపోయాయి. అటు డాలర్ మారకంలో రూపాయి 0.06పైసలు నష్టంతో 65.50 వద్ద నిలవగా, ఎంసీఎక్స్ మార్కెట్లో పుత్తడి పది గ్రా. 28,885 వద్ద ఉంది.