దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆరంభంలోనే లాభాలను ఆర్జించిన సెన్సెక్స్ 164పాయింట్ల లాభంతో 29,332వద్ద నిఫ్టీ 56 పాయింట్ల లాభంతో 9,086 వద్ద స్థిరపడ్డాయి. ముందురోజు నష్టాల నుంచి ప్రపంచ మార్కెట్లు కుదురుకోవడంతో దేశీయంగానూ సెంటిమెంటు మెరుగుపడింది. దీనికితోడు విదేశీ ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్‌లో పెట్టుబడులు మార్కెట్లకు ఊతమిచ్చింది. దీంతో నిఫ్టీ సాంకేతిక నిపుణులు కీలకమైన 9,050కి ఎగువన స్థిరపడింది.
మెటల్, ఆటో జోరుకు తోడు ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్ రంగ లాభాలు జతకలిశాయి. అయితే ఎఫ్‌ఎంసీజీ నష్టపోయింది. యస్‌బ్యాంక్, టాటా మోటార్స్, ఎన్‌టీపీసీ, గెయిల్, విప్రో, బీపీసీఎల్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా లాభపడగా, టీసీఎస్, ఐషర్, ఐటీసీ, బాష్, హెచ్‌యూఎల్ నష్టపోయాయి.
అటు డాలర్ మారకంలో రూపాయి 0.06పైసలు నష్టంతో 65.50 వద్ద నిలవగా, ఎంసీఎక్స్ మార్కెట్‌లో పుత్తడి పది గ్రా. 28,885 వద్ద ఉంది.