సాక్షి, ముంబై: అమెరికా, చైనా ట్రేడ్ వార్ సెగ దేశీ స్టాక్ మార్కెట్లనూ దెబ్బతీస్తోంది. బుధవారం కూడా భారీ నష్టాలతోనే సూచీలు ట్రేడింగ్‌ను ఆరంభించాయి. అనంతరం అమ్మకాలు ఊపందుకున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 342 పాయింట్లు పతనమై 38వేల పాయింట్ల కీలక మార్క్ దిగువకు చేరింది. నిఫ్టీ సైతం 102 పాయింట్లు కోల్పోయి 11,396కు చేరింది. ప్రస్తుతం దాదాపు ఇ దేస్థాయిలో కొనసాగుతోంది. మరోవైపు ఎన్నికల సమరం మరికొద్ది రోజుల్లో ముగియనున్నేన పథ్యంలో ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి.
అన్నిరంగాలూ బలహీనపడ్డాయి. మీడియా, రియల్టీ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. మీడియా కౌంటర్లలో జీ ఎంటర్‌టైన్ 12 శాతం పతనమైంది. ఇంకా సన్ టీవీ, జీ మీడియా, టీవీ 18, టీవీ టుడే, డిష్ టీవీ, నెట్‌వర్క్ 18, జాగరణ్ శాతం మధ్య క్షీణించాయి. వీటితోపాటు వేదాంతా, సన్ ఫార్మా, టాటామోటార్స్, రిలయన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్ బ్యాంకు ఓన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ భారీగా నష్టపోతున్నాయి. యూపిఎల్, భారత్ పెట్రోలియం, టైటాన్, కోల్ ఇండియా, పవర్‌గ్రిడ్ లాభపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment