సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లలో ఆరంభ లాభాలు ఆవిరైపోయాయి. ఆరంభంలో 200 పాయింట్లకు పైగా ఎగిసిన కీలక సూచీల్లో మిడ్‌సెషన్ తరువాత అమ్మకాల వెల్లువ కురిసింది. దీంతో డే హై నుంచి సెన్సెక్స్ 500 పాయింట్లు పతనం కాంగా, నిఫ్టీ 11 550 కిందికి చేరింది. వరుసగా రెండవ రోజుకూడా భారీగా నష్టపోయిన సెన్సెక్స్ 324 పాయింట్లు కోల్పోయి 38276 వద్ద, నిఫ్టీ 100 పాయింట్లు నష్టపోయి 11497 వద్ద ముగిసింది. దీంతో నిఫ్టీ సెన్సెక్స్ మద్దుతు స్థాయిలకు దిగువన చాలా బలహీనంగా ముగిశాయి. నిఫ్టీ బ్యాంకు భారీగా నఫ్టపోయింది. లాభాల స్వీకరణ కారణంగా బ్యాంక్ నిఫ్టీ భార పతనాన్ని నమోదు చేసింది. దాదాపు అన్నిరంగాలూ బలహీనపడ్డాయి. మీడియా, రియల్టీ , టెలికాం, నష్టపోయాయి. ఐటీ ఒక్కటి లాభపడింది.
మీడియా కౌంటర్లలో డిష్ టీవీ, జీ జీమీడియా, హాథవే, టీవీటుడే, ఈరోస్‌టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. ఇంకా టాటా మోటార్స్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌ఎసీ, ఆర్‌ఐఎల్, బీపీసీఎల్, ఎయిర్‌టెల్, ఐవోసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, వేదాంతా, హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ, వేదాంతా కూడా నష్టపోయాయి. అయితే హెచ్‌యూఎల్, ఎల్‌అండ్‌టీ, టైటన్, పవర్‌గ్రిడ్, ఇన్‌ఫ్రాటెల్, హిందాల్కో, ఇన్ఫోసిస్, ఐబీ హౌసింగ్, హెచ్‌డీఎఫ్‌సీ, కోల్ ఇండియా స్వల్పంగా లాభపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment