సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ పతనాన్నినమోదు చేస్తున్నాయి. ఆరంభంలో 100 పాయింట్లు ఎగిసిన సూచీలు బడ్జెట్ ప్రసంగం ముగిసే సమయానికి భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 440పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 133 పాయింట్లు క్షీణించి, 11900స్థాయికి దిగువకి చేరింది. దాదాపు అన్ని రంగాలు నష్టపోతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, మెటల్, ఐటీ, ఆటో రంగాలు నష్టపోతున్నాయి. యస్‌బ్యాంకు, ఓఎన్‌జీసీ, వేదాంతా, టీసీఎస్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.
ముఖ్యంగా విలువైన మెటల్స్‌పై దిగుమతి సుంకం పెంపు, పెట్రోలుపై రూపాయి సెస్ లాంటి ఇతర విధానాలు ఇన్వెస్టర్లను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో అమ్మకాల జోరు కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment