7వ రోజూ అదే బాట..ఆఐఎల్‌ డౌన్‌, మీడియా షైన్‌ | Sensex Nifty Extend Decline To Seventh Day  | Sakshi
Sakshi News home page

7వ రోజూ అదే బాట.. ఆఐఎల్‌ డౌన్‌, మీడియా షైన్‌

Published Thu, May 9 2019 4:05 PM | Last Updated on Thu, Jul 11 2019 8:55 PM

Sensex Nifty Extend Decline To Seventh Day  - Sakshi

సాక్షి,ముంబై :  ఇన్వెస్టర్ల అమ్మకాల జోరుతో  వరుసగా ఏడో రోజు కూడా దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.  ఆరంభంనుంచీ బలహీనంగా కదిలిన మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు సరికదా చివరికి సెన్సెక్స్‌ 230 పాయింట్లు క్షీణించి 37,559 వద్ద , నిఫ్టీ 58 పాయింట్ల  నష్టంతో 11,302 వద్ద   ముగిసింది.

ప్రధానంగా మెటల్‌ ఇండెక్స్‌ 1.4 శాతం బలహీనపడగా.. మీడియా 3.6 శాతం ఎగసింది. మీడియా కౌంటర్లలో డిష్‌ టీవీ, జీ ఎంటర్‌టైన్‌, జీ మీడియా, డెన్‌ నెట్‌వర్క్స్‌ 9-6 శాతం మధ్య దూసుకెళ్లగా.. టీవీ టుడే, హాథవే, జాగరణ్‌, ఐనాక్స్‌ లీజర్‌, సన్‌ టీవీ 4.4-2.4 శాతం మధ్య జంప్‌ చేశాయి. అయితే మెటల్‌ కౌంటర్లలో జిందాల్‌ స్టీల్‌, ఏపీఎల్‌ అపోలో, కోల్‌ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సెయిల్‌, హింద్‌ జింక్‌, వేదాంతా, ఎన్‌ఎండీసీ 4.4-1 శాతం మధ్య పతనమయ్యాయి.

నిఫ్టీ దిగ్గజాలలో ఆర్‌ఐఎల్‌ భారీగా నష్టపోయింది. దీంతోపాటు బీపీసీఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, కొటక్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, ఎయిర్‌టెల్‌, అదానీ పోర్ట్స్‌, పవర్‌గ్రిడ్‌  టాప్‌ లూజర్స్‌గానూ,  యస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్ ఫిన్‌, హీరో మోటో, ఐబీ హౌసింగ్, టైటన్‌, టెక్‌ మహీంద్రా, గెయిల్‌, బ్రిటానియా  టాప్‌ విన్నర్స్‌గాను నిలిచాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement