ECI
-
EVM Row: ‘ఒకవేళ సీఈసీని తొలగించమని కోరితే..!’
దేశంలో ఇటీవల జరిగిన కొన్ని అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(EVM) పనితీరు మీద ఎన్నో సందేహాలకు కారణమయ్యాయి. ఈవీఎంలను ఎవరో.. ఎక్కణ్ణుంచో ఆపరేట్ చేస్తున్నారని.. క్షేత్ర స్థాయిలో జరుగుతున్నా ఎన్నికల సరళికి ఎన్నికల ఫలితాలకు సంబంధం లేకుండా ఉంటోందనే విమర్శలు వస్తున్నాయి. అమెరికాలో ఉంటున్న సుజా సయీద్ అనే ఉద్యోగి తాను ఈవీఎంను హ్యాక్ చేయగలను అని ఛాలెంజ్ చేసినందుకు ఆయనమీద ఎలక్షన్ కమిషన్ మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేయగా అయన మీద కేసు కూడా బుక్కైంది... మొన్న మహారాష్ట్రలో పోలింగ్ జరిగిన తీరుమీద సందేహాలు వ్యక్తం చేస్తూ షోలాపూర్ జిల్లా మల్షిరాస్ తహసీలులో 1900 ఓట్లున్న మర్కర్‌వాడీ గ్రామం ప్రజల వినూత్న పోరాటం చేస్తున్నారు. ఈవీఎంల మీద అనుమానాన్ని వ్యక్తం చేస్తూ తమ ‘తీర్పు’ను తామే బ్యాలెట్ పేపర్ల ద్వారా మరోసారి క్రాస్ చెక్ చేసుకోవాలని సంకల్పించారు. అధికారవర్గాలకు కంగారు పుట్టించింది. ప్రజలు స్వచ్ఛందంగా అలాంటి పోలింగును నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోగా ఊరుమొత్తాన్ని చుట్టుముట్టిన పోలీసులు ఏకంగా ప్రజలను కర్ఫ్యూ పేరిట నిర్బంధించారు.ఇదిలా ఉండగా దేశంలో పలు చోట్ల జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల పనితీరు.. వాటిని హ్యాక్ చేసేందుకు ఉన్న అవకాశాల మీద విస్తృతంగా చర్చ జరుగుతోంది. గతంలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ నిన్నటి మహా రాష్ట్ర ఎన్నికల్లోనూ పోలింగ్ సమయానికి ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఓట్లకు, కౌంటింగ్ రోజున బయల్పడిన ఓట్లకు భారీ వ్యత్యాసం రావడంతో ఓడిపోయిన పార్టీల్లో బోలెడు సందేహాలు ముప్పిరిగొన్నాయి. దేశంలో మళ్ళీ బ్యాలెట్ విధానం రావాలంటూ డిమాండ్స్ వస్తున్నాయి. ఈ తరుణంలో భాను ప్రతాప్ అనే సీనియర్ న్యాయవాది ఏకంగా చీఫ్ ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలని డిమాండ్ చేయండి.. ఈ మేరకు లోక్ సభలో నోటీస్ ఇవ్వండి అంటూ కాంగ్రెసుకు సలహా ఇచ్చారు. మీరు డిమాండ్ చేసినట్లు ఈసీని తొలగించడానికి బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోదు కానీ ఒక చర్చ అయితే అవుతుంది కదా.. ఎన్నికల కమిషనర్‌ను తొలగించడం అంత ఈజీ కాదు కానీ మీ ప్రయత్నం వల్ల ఈవీఎంల పనితీరు మీద ప్రజల్లోనూ చర్చ జరుగుతుంది కదా.. ఈ దిశగా ఒక అడుగు వేయండి అంటున్నారు ఆ అడ్వకేట్.ఇక ఎన్నికల కమిషన్ నిర్మాణం..కమిషనర్ తొలగింపు పద్ధతులు చూద్దాం..భారత ఎన్నికల సంఘం:-భారత ఎన్నికల సంఘం (ECI) దేశంలో ఎన్నికల ప్రక్రియలను నిర్వహించడానికి బాధ్యత వహించే స్వయంప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థభారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324లో ఎన్నికల సంఘం గురించి పేర్కొన్నారుకమిషన్ ప్రధానకార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఈ కమిషన్ భారతదేశంలోని లోక్ సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభలతోబాటు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలను నిర్వహిస్తుందిప్రస్తుతం రాజీవ్ కుమార్ ముఖ్య ఎన్నికల కమిషనర్‌గా ఉన్నారు.ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలంటే : ఎన్నికల కమిషనర్ తొలగింపు గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5)లో పేర్కొన్నారు.లోక్‌సభ, రాజ్యసభలలో మూడింట రెండొంతుల మెజారిటీ ఉండి దానికి ఓటు వేయడానికి అవసరమైన అభిశంసన ప్రక్రియ ద్వారా మాత్రమే ప్రధాన ఎన్నికల కమిషనరును తొలగించవచ్చు. దీంతోబాటు ముఖ్య ఎన్నికల కమిషనర్ సిఫార్సుపై ఇతర ఎన్నికల కమీషనర్లను రాష్ట్రపతి తొలగించవచ్చు. ఇదిలా ఉండగా 2009 లో, ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రవర్తించారంటూ ఎన్నికల కమిషనరు నవీన్ చావ్లాను తొలగించాలని అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్. గోపాలస్వామి అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు సిఫార్సు పంపినా దాన్ని రాష్ట్రపతి ఆమోదించలేదు.-సిమ్మాదిరప్పన్న -
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం ప్రకటించింది. మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్నికల షెడ్యూల్‌ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు.మహారాష్ట్రలో ఒకే దశలో పోలింగ్అక్టోబర్ 22న నోటిఫికేషన్నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ- అక్టోబర్ 29అక్టోబర్ 30న స్క్రూటినీనామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ- నవంబర్ 4నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలునవంబర్ 23న ఫలితాల వెల్లడి రెండు విడతల్లో జార్ఖండ్ ఎన్నికల పోలింగ్తొలి దశ పోలింగ్‌కు సంబంధించి అక్టోబర్ 18న నోటిఫికేషన్నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ- అక్టోబర్ 25అక్టోబర్ 28న స్క్రూటినీనామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 30నవంబర్ 13న పోలింగ్నవంబర్ 23న ఫలితాల వెల్లడిరెండో దశ పోలింగ్‌కు సంబంధించిఅక్టోబర్ 22న నోటిఫికేషన్నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ- అక్టోబర్ 29అక్టోబర్ 30న స్క్రూటినీనామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 1నవంబర్ 20న పోలింగ్నవంబర్ 23న ఫలితాల వెల్లడిరాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. హర్యానా, జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు విజయవంతంగా జరిగాయని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లో ఎలాంటి హింస లేకుండా ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయని చెప్పారు.288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 26వ తేదీతో ముగుస్తుంది.ఇక 81 స్థానాలతో కూడిన జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం 2025 జనవరి 5వ తేదీతో ముగుస్తుంది.మహారాష్ట్రలో 9.63 కోట్ల ఓటర్లుజార్ఖండ్లో మొత్తం ఓటర్లు 2.6 కోట్లుమహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా 48 అసెంబ్లీ స్థానాలకు, 2 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. వీటి ఎఎన్నికల షెడ్యూల్‌ను కూడా ఈసీ ప్రకటించింది. ఆ తేదీల వివరాలు ..↓ -
మార్పు మేలు చేస్తుందా?
కొన్ని నిర్ణయాలంతే! అధికారపక్షం స్వాగతిస్తుంటుంది, ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీని అక్టోబర్ 1 నుంచి 5కు మారుస్తూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకున్న నిర్ణయం విషయంలోనూ అదే జరిగింది. సెలవుల వల్ల ఓటింగ్ తగ్గకూడదనే భావనతో సరైన నిర్ణయం తీసుకున్నారంటూ అధికారంలో ఉన్న బీజేపీ, ఉనికి కోసం పోరాడుతున్న ప్రతిపక్షం ‘ఇండియన్ నేషనల్ లోక్‌దళ్’ హర్షం వ్యక్తం చేశాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మాత్రం ఇదంతా ఓటమి భయంతో ప్రచారం గడువు పెంచుకొనేందుకు బీజేపీ ఆడిస్తున్న తేదీ మార్పు నాటకం అంటోంది. ఈ నెల 18 నుంచి అక్టోబర్ మొదటి వారంలోగా సాగే ఈ విడత అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానాతో పాటు జమ్మూ కశ్మీర్‌లోనూ పోలింగ్ జరగనుంది. ఒక్కో రాష్ట్రం ఒక్కోలా దృష్టిని ఆకర్షిస్తున్నా, హర్యానాలో అధికార బీజేపీకి ఎదురుగాలి వీస్తున్న నేపథ్యంలో తేదీ మార్పు కథ ఆసక్తి రేపుతోంది. వ్యవసాయ రంగంలో సంక్షోభం, రైతుల నిరసనలు – డిమాండ్లపై ప్రభుత్వ వ్యవహారశైలి, పారిశ్రామికీకరణలో హర్యానా వెనుకబాటు, అంతకంతకూ పెరుగుతున్న నిరుద్యోగం, మహిళా రెజ్లర్ల ఆందోళన, వివాదాస్పద అగ్నిపథ్ పథకం లాంటి అనేక అంశాలు హర్యానాలో బీజేపీకి ఎదురుగాలి వీచేలా చేస్తున్నాయి. వర్గపోరుతో సతమతమవుతున్నప్పటికీ కాంగ్రెస్ కొంత ముందంజలో ఉందని కథనం. ఈ పరిస్థితుల్లో పోలింగ్ తేదీ మార్పు ప్రశ్నలు లేవనెత్తింది. అసోజ్ అమావాస్య పుణ్యతిథి ఉన్నందున ఓటింగ్ తేదీని మార్చాలని ఆలిండియా బిష్ణోయ్ మహాసభ అభ్యర్థనలు చేసిందనీ, వాటిని దృష్టిలో ఉంచుకొనే ఈ మార్పు చేపట్టామనీ ఎన్నికల సంఘం చెబుతోంది. కేంద్రంలోని అధికార బీజేపీ చెప్పినట్టు ఎన్నికల సంఘం నడుచుకుంటోందనీ, హర్యానాలో విజయంపై అనుమానాలు ఉన్నందున పోలింగ్‌కు మరింత గడువు కోసమే బీజేపీ ఈ తేదీ మార్పు చేయించిందనీ ప్రతిపక్షాల ఆరోపణ. సహజంగానే కౌంటింగ్ తేదీ మారింది. ఇప్పుడు హర్యానాతో పాటు జమ్మూ – కశ్మీర్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు అక్టోబర్ 4న కాక 8న జరగనుంది. నిజానికి, సాంస్కృతిక, ధార్మిక ఉత్సవాలకు అడ్డు రాకుండా పోలింగ్ తేదీలను మార్చడమనేది కొత్తేమీ కాదు. ఎన్నికల సంఘం గతంలోనూ ఆ పని చేసింది. గురు రవిదాస్ జయంతికి భక్తులు వారణాసికి వెళతారనే కారణంతో 2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్ని వారం పాటు వాయిదా వేశారు. అదే ఏడాది మణిపుర్లో సైతం క్రైస్తవుల ఆదివారం ప్రార్థనల రీత్యా ఎన్నికల తేదీని మార్చారు. ఇక, నిరుడు 2023లో దేవుథని ఏకాదశి రోజున రాష్ట్రంలో సామూహిక వివాహాలు జరుగుతాయి గనక రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను ఆ రోజు నుంచి మార్చారు. ఇటీవలే కాదు... పుష్కరకాలం క్రితం 2012లోనూ బారావఫాత్ (మిలాద్ ఉన్ నబీ) కారణంగా ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల తేదీని మార్చారన్నది గమనార్హం. తాజాగా హర్యానాలో తేదీ మార్పునకు మరో కారణమూ ఉందని అధికార వర్గాలంటున్నాయి. ముందుగా ప్రకటించిన పోలింగ్ తేదీ ప్రకారమైతే... సెప్టెంబర్ 30వ తేదీ ఒక్క రోజు గనక సెలవు పెడితే, ఆ రాష్ట్రంలో వరుసగా ఆరు రోజులు సెలవులు వచ్చే పరిస్థితి. దానివల్ల పలువురు సెలవు పెట్టి, ఓటింగ్‌కు దూరంగా ఊళ్ళకు వెళ్ళే ప్రమాదం ఉంది. కొత్త పోలింగ్ తేదీతో ఆ అలసత్వాన్ని తప్పించి, ఓటింగ్ శాతాన్ని పెంచవచ్చనేది అధికారుల కథనం. మరీ ఇన్ని తెలిసిన ఎన్నికల సంఘం ముందుగానే ఈ అంశాలన్నీ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్నది ప్రశ్న. ఎన్నికల తేదీలను ఖరారు చేస్తున్నప్పుడే ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని కసరత్తు చేయాల్సిన బాధ్యత దానికి ఉంది. హర్యానాలో ఆ పని ఎందుకు చేయలేకపోయిందో ఈసీ జవాబు చెప్పాలి. అసలు రాజ్యాంగబద్ధ సంస్థ అయినప్పటికీ ఎన్నికల సంఘాన్ని తమ చేతిలో సాధనంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు వాడుకుంటున్నాయన్న విమర్శ చాలా కాలంగా ఉన్నదే. ఆ ఆరోపణలు అంతకంతకూ పెరుగుతుండడమే విషాదం. పైగా, ఈ ఏడాది ప్రథమార్ధంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం వ్యవహారశైలి పైన, ఈవీఎంల పని తీరు పైన తీవ్రమైన ఆరోపణలు రావడం తెలిసిందే. ఇప్పటికీ వాటికి సంతృప్తికరమైన సమాధానం ఇవ్వని ఈసీ ఇప్పుడిలా వ్యవహరించడం లేనిపోని అనుమానాల్ని మరింత పెంచుతోంది. వ్యవస్థలు పారదర్శకంగా లేవని తేటతెల్లమవుతున్న పరిస్థితి ఆందోళన రేపుతోంది.ఇలాంటి పరిస్థితుల్లో నరం లేని నాలుకతో మాట్లాడే పార్టీల పాపం కూడా లేకపోలేదు. ప్రస్తుతం హర్యానా విషయంలో చెరొకవైపు నిలబడ్డ బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ... రెండేళ్ళ క్రితం ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్) నుంచి గట్టిపోటీ ఉన్న పంజాబ్ ఎన్నికల వేళ మాత్రం ఒకే తాటి మీద నిలవడం విచిత్రం. అప్పట్లో గురు రవిదాస్ జయంతి గనక పోలింగ్ తేదీని మార్చాలంటూ రెండు పార్టీలూ కోరాయి. ఎన్నికల సంఘం ఆ కోరికను మన్నించింది. కానీ, పోలింగ్‌ను వాయిదా వేయించినంత మాత్రాన ఫలితం మారలేదు. ఆ పార్టీలకేమీ కలసి రాలేదు. ఆప్ ప్రభంజనంలో అవి కొట్టుకుపోయాయి. ఎన్నికల బరిలో పరిస్థితులు పోటాపోటీగా ఉన్న సందర్భంలో నాలుగు రోజులు అదనంగా ప్రచారానికి లభించడం కీలకమే. కానీ, ఎవరిని గద్దె దింపాలి, ఎవరిని పీఠమెక్కించాలన్న అంశంపై ప్రజలు ముందే ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చి ఉంటారు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా పోలింగ్ తేదీని నాలుగైదు రోజులు అటో ఇటో మార్చినా ఫలితం ఉంటుందనుకోవడం పిచ్చి భ్రమ. అప్పుడు పంజాబ్‌కైనా, ఇప్పుడు హర్యానాకైనా అదే వర్తిస్తుంది. ఈ తర్కాన్ని మార్చిపోయి దింపుడు కళ్ళం ఆశతో ఉంటే ఉపయోగం లేదని గుర్తించాలి. కారణమేమైనప్పటికీ తేదీ మార్పు వల్ల ఓటింగ్ శాతమంటూ పెరిగితే ప్రజాస్వామ్యానికి మంచిదే. కానీ, అది ఏ పార్టీకి ఉపకరిస్తుందన్నదే బేతాళప్రశ్న. -
అప్పటి వరకూ ఎగ్జిట్ పోల్స్ వద్దు.. ఈసీ ఆదేశాలు
న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధించిన కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏప్రిల్ 19 ఉదయం 7.00 నుంచి జూన్ 1 సాయంత్రం 6.30 గంటల వరకు లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ పూర్తయ్యేదాకా ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, ప్రచురించడం, ప్రచారం చేయడంపై నిషేధం విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం.. ఒపీనియన్ పోల్ లేదా మరేదైనా పోల్ సర్వే ఫలితాలను ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రదర్శించడం నిషేధమని నోటిఫికేషన్లో ఈసీఐ స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు 12 రాష్ట్రాల్లోని 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు విడివిడిగా ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. -
ఈ ఎన్నికల్లో బిర్యానీ రూ.150 అంతే.. కాస్ట్లీ అంటే కుదరదు!
లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేయడానికి వీల్లేదు. వారు ఖర్చు చేసే ప్రతి పైసాకు ఎన్నికల కమిషన్‌కు లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. ప్రచార సమయంలో తమ మద్దతుదారులకు ఇప్పించే ఛాయ్, సమోసాలకు ఖర్చుపెట్టిన డబ్బుకు కూడా లెక్క చెప్పాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఖర్చులపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక బృందాలను ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపయోగించే 200కు పైగా వస్తువుల సవరించిన ధరల జాబితాను ఇటీవలి నోటిఫికేషన్లో ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. అభ్యర్థులు ఖర్చు పరిమితిని మించకుండా చూసుకోవడానికి వీటిని ఎన్నికల ప్రకటిచింది. ఈసీకి సమర్పించే ఖర్చుల వివరాల్లో ఆయా వస్తువులు, ఆహార పదార్థాలకు ఎన్నికల కమిషన్ నిర్ణయించిన రేట్ల కంటే ఎక్కువగా చూపించేందుకు వీలుండదు. పార్లమెంటరీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖర్చు పరిమితిని ఎలక్షన్ కమిషన్ ఈ సారి రూ.95 లక్షలకు పెంచింది. ఇది 2019 ఎన్నికల సమయంలో రూ. 70 లక్షలు ఉండేది. ఇందుకు అనుగుణంగా రాజకీయ పార్టీలు వినియోగించే వస్తువులు, సేవల ధరలను కూడా ఈసీ స్వల్పంగా పెంచింది. ధరల జాబితాను ఉపయోగించి అభ్యర్థులు చేసే ఖర్చులను జిల్లా ఎన్నికల అధికారి మూల్యాంకనం చేస్తారు. చెన్నై జిల్లా ఎన్నికల అధికారి జె.రాధాకృష్ణన్ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. టీ ధరను రూ.10 నుంచి రూ.15కి, కాఫీ ధరను రూ.15 నుంచి రూ.20కి పెంచారు. అయితే చికెన్ బిర్యానీ ప్యాకెట్ ధరను మాత్రం రూ. 2019తో పోలిస్తే రూ.180 నుంచి రూ.150కు తగ్గించారు. మరోవైపు మటన్ బిర్యానీ ప్యాకెట్ ధరలో మార్పు లేదు. అది రూ. 200గా ఉంది. టీషర్టులు, చీరల ధరలు కూడా పెంచలేదు. ప్రచారానికి సంబంధించిన కార్యకలాపాలలో పాల్గొనే వారికి అందించే ఆహారం, వాహనాలు, ప్రచార కార్యాలయాలు, సమావేశాల కోసం అద్దెకు తీసుకున్న ఇతర ఫర్నిచర్, వేదిక అలంకరణ ఖర్చులు, కూలీల ఖర్చులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యానర్లు, పోస్టర్లు, కుర్చీలు వంటి వస్తువులతో సహా అనేక అంశాలు ఈ జాబితాలో ఉన్నాయి. జెండాలు, బాణాసంచా, పోస్టర్లు, దండలు, సాంస్కృతిక నృత్యాలతో సహా రాజకీయ నేతలకు స్వాగతం పలికేందుకు అయ్యే ఖర్చులు కూడా అభ్యర్థి ఖర్చుల్లోనే చేరుస్తారు. -
దేశంలోనే అత్యధిక ఎన్నికల బాండ్ల కొనుగోలు.. చుట్టూ వివాదాలు
ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లను బయటపెట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దాంతో రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం బహిర్గతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భారతీయ స్టేట్ బ్యాంక్ సమర్పించిన డేటాను ప్రజలకు అందుబాటులో ఉంచింది. మొత్తం 763 పేజీలతో ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో వివరాలను అప్లోడ్ చేసింది. అయితే ఈ డేటా వచ్చిన వెంటనే ‘ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీస్’ పేరు మారుమోగింది. ఆ సంస్థ 2024 జనవరి వరకు అత్యధికంగా రూ.1,368 కోట్ల విలువ చేసే ఎన్నికలబాండ్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది. భారీగా ఎన్నికలబాండ్లు కొనుగోలు చేసిన ఆ కంపెనీ యజమాని, లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ పేరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మయన్మార్‌లో సాదాసీదా కూలీగా జీవనం సాగించిన మార్టిన్ రూ.కోట్ల విరాళాలు ఇచ్చే స్థాయికి ఎలా ఎదిగాడో ఈ కథనంలో తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచే లాటరీ వ్యాపారం భారత్‌లోనే పుట్టిన మార్టిన్ చిన్నతనంలో మయన్మార్‌లో చాలాకాలం పాటు కూలీగా జీవనం సాగించారు. తన 13వ ఏటా తిరిగి భారత్‌కు వచ్చి తమిళనాడులోని కోయంబత్తూరులో లాటరీ వ్యాపారం మొదలుపెట్టారు. తన వ్యాపారాన్ని తమిళనాడు, కర్ణాటక, కేరళతోపాటు దేశం అంతటా విస్తరించారు. అనంతరం ఈశాన్య భారత్‌కు మకాం మార్చారు. అక్కడ ప్రభుత్వ లాటరీ స్కీమ్‌లతో వ్యాపారం ప్రారంభించారు. కొన్నాళ్లకు భూటాన్, నేపాల్‌లో కూడా తన బిజినెస్‌ను మొదలుపెట్టారు. తర్వాత స్థిరాస్తి, నిర్మాణ, టెక్స్టైల్, ఆతిథ్య రంగాల్లోకి అడుగుపెట్టారు. అరుణాచల్ ప్రదేశ్, అసోం, గోవా, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపుర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో లాటరీలు చట్టబద్ధమని తెలుసుకున్న మార్టిన్ ఆయా రాష్ట్రాల్లో సుమారు 1,000 మందిని నియమించుకుని వ్యాపారం సాగిస్తున్నారు. నాగాలాండ్, సిక్కింలో అయితే తన కంపెనీకి చెందిన 'డియర్ లాటరీ' సంస్థదే ఆధిపత్యం. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ లాటరీ ట్రేడ్ అండ్ అలైడ్ ఇండస్ట్రీ సంఘానికి అధ్యక్షుడిగా మార్టిన్ వ్యవహరిస్తున్నారు. భారత్‌లో ఈ వ్యాపారంపై విశ్వాసం పెంచేందుకు ఈ సంస్థ పనిచేస్తుంది. ఆయన నేతృత్వంలోని ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు వరల్డ్ లాటరీ అసోసియేషన్‌లో సభ్యత్వం కూడా ఉంది. వివాదాలతో వెలుగులోకి.. సిక్కిం ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2008లో రూ.4,500 కోట్లకు పైగా మోసానికి పాల్పడడంతో మార్టిన్ పేరు బయటకొచ్చినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. మార్టిన్ కంపెనీలు బహుమతి పొందిన టికెట్లను పెంచి చూపడంతో సిక్కిం ప్రభుత్వానికి రూ.910 కోట్ల నష్టం వాటిల్లినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. 2011లో అక్రమ లాటరీ వ్యాపారాలపై అణిచివేతలో భాగంగా తమిళనాడు, కర్ణాటక పోలీసులు సంయుక్తంగా తన కంపెనీలో సోదాలు నిర్వహించారు. 2013లో, కేరళ పోలీసులు రాష్ట్రంలో అక్రమ లాటరీ కార్యకలాపాలపై దర్యాప్తులో భాగంగా మార్టిన్ సంస్థలో దాడులు చేశారు. ఇదీ చదవండి: ఎన్నికల ఎఫెక్ట్.. హెలికాప్టర్లకు పెరిగిన డిమాండ్.. ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థపై మనీలాండరింగ్ నిరోధక చట్టం ఉల్లంఘనల అనుమానాలతో ఈ కంపెనీపై ఈడీ పలు మార్లు దాడులు చేసింది. దాదాపు రూ.603 కోట్ల విలువైన స్థిరాస్తులను అటాచ్ చేసింది. సిక్కిం ప్రభుత్వ లాటరీలను కేరళలో విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై సీబీఐ నమోదు చేసిన కేసు దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి. ఏంటీ ఎన్నికల బాండ్లు..? ఎన్నికల బాండ్లు ఒక ప్రామిసరీ నోట్ లాంటివి. ఇవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో లభ్యం అవుతాయి. వ్యక్తులు, కంపెనీలు వీటిని కొనుగోలు చేయవచ్చు. అలా కొనుగోలు చేసిన వాటిని నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వొచ్చు. రాజకీయ పార్టీలు తమకు వచ్చిన బాండ్లను నగదుగా మార్చుకొని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకుంటాయి. రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రంలోని అధికార భాజపా ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే, రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల గురించి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం-2017 సవరణ చేసింది. దాంతో ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శించారు. ఈ క్రమంలోనే ఈ పథకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. -
ఈసీలో కొత్త నీరు!
ఎన్నికల నోటిఫికేషన్ల విడుదల సమయాల్లో మాత్రమే వినబడే ఎన్నికల సంఘం చాన్నాళ్లుగా తరచు వార్తల్లోకెక్కుతోంది. అక్కడ కమిషనర్ల ప్రవేశమూ, నిష్క్రమణా కూడా సంచలనాలుగా, వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ నెల 9న ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా చేశాక ముగ్గురు సభ్యుల ఎన్నికల సంఘంలో కేవలం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. తాజాగా ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారులు జ్ఞానేశ్‌కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధూలను ఎన్నికల కమిషనర్లుగా నియమిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల ఎంపిక కమిటీ గురువారం ప్రకటించింది. తనకు 212 పేర్లతో బుధవారం రాత్రే జాబితా పంపారని, తెల్లారేలోగా అంతమందిని జల్లెడపట్టి వారిలో ఇద్దరిని ఎంపిక చేయటం సాధ్య మేనా అని కమిటీలోని విపక్ష నేత అధీర్ రంజన్ చౌధురి ప్రశ్నించారు. ఆ సంగతలావుంచి రేపో మాపో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతున్న దశలో ఈ ఎంపిక వుండదని, ఏకసభ్య సంఘం చేతులమీదుగా అంతా ముగుస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ రాజు తల్చుకుంటే కానిదంటూ ఏముంటుంది? నిజానికి ఎన్నికల సంఘం 90వ దశకం వరకూ ఏకసభ్య సంఘంగానే వుండేది. 1987లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో జైల్‌సింగ్‌కు రెండోసారి అవకాశం లేకుండా ఎన్నికల ప్రక్రియను సవరించాలన్న నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రయత్నానికి అప్పటి ఎన్నికల కమిషనర్ ఆర్వీఎస్ పేరిశాస్త్రి అడ్డుపుల్ల వేయటంతో ఆగ్రహించి ఆ సంఘాన్ని త్రిసభ్య సంఘం చేయాలని కేంద్రం భావించింది. అయితే అనంతర కాలంలో వీపీ సింగ్ ప్రభుత్వం దాన్ని బుట్టదాఖలా చేసింది. 1990లో నాటి ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ దూకుడును తట్టుకోలేకపోయిన నాటి పీవీ నరసింహారావు సర్కారు దాన్ని త్రిసభ్యసంఘంగా మార్చింది. నిర్వాచన్ సదన్‌లో ఏదో జరుగుతోందని తెలిసినా ఎందుకో అర్థంకాని పరిస్థితి గతంలో లేదు. ఏదైనా సమస్యవుంటే ప్రభుత్వం వివరణనివ్వటం రొటీన్‌గా సాగిపోయేది. లేదంటే మీడియానే కూపీ లాగే ప్రయత్నం చేసేది. ఇప్పుడు వివరణనిచ్చే సంస్కృతీ లేదు... వెలికితీసే మీడియా కూడా లేదు. ఈమధ్యే ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేసి నిష్క్రమించారు. వచ్చినప్పటిలాగే వెళ్లేటపుడు కూడా ఎన్నో ప్రశ్నలు మిగిల్చారు. వాస్తవానికి ఆయనకు ఇంకా మూడేళ్ల వ్యవధివుంది. పైగా వచ్చే ఫిబ్రవరిలో రాజీవ్‌కుమార్ రిటైరయ్యాక ప్రధాన ఎన్నికల కమిషనర్ అయ్యే అవకాశం కూడావుంది. ఈ చాన్సును కమిషనర్లుగా వున్నవారు ఎట్టి పరిస్థితు ల్లోనూ వదులుకోరు. పోనీ గోయెల్‌కు అలా వెళ్లితీరాల్సిన పరిస్థితి ఏర్పడినా సాధారణంగా కేంద్రం సర్దిచెప్పే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే గత నెలలో మరో కమిషనర్ అనూప్ పాండే రిటైరయ్యారు. గోయెల్ కూడా నిష్క్రమిస్తే ఒక్కరే మిగులుతారు. ఒక్కరితో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు బదులు ఆ ప్రక్రియ ముగిసేవరకూ వుండాలని ఆయన్ను కోరితే వేరుగా వుండేది. ఈ హఠాత్తు నిష్క్ర మణలోని ఆంతర్యమేమిటో మూడోకంటికి తెలియదు. ఆయనంతట ఆయన వెళ్లారా, ప్రభుత్వమే అడిగిందా అన్నది అర్థంకాదు. ఆయన నియామకం కూడా వివాదాస్పదమే. 2022 నవంబర్ వరకూ పంజాబ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిగా వున్న గోయెల్ ఆ నెల 18న స్వచ్ఛంద పదవీవిరమణ చేశారు. రాత్రికి రాత్రి కేంద్ర న్యాయశాఖలో కమిషనర్ ఫైలు చకచకా కదిలి, నలుగురు సభ్యుల జాబితాలో గోయెల్ పేరు చేరిపోయింది. ఆ మర్నాడే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు ఆ ఫైలు వెళ్లటం, గోయెల్‌ను ఎంపిక చేయటం, ఆయన కమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టడం ముగిసిపోయాయి. ఈ హైస్పీడ్ ‘24గంటల వ్యవహారం’పై దాఖలైన పిల్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘ఎందుకింత తొందర?’ అంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది కూడా. కానీ చివరకు ఆ పిల్‌ను తోసిపుచ్చింది. ఎన్నికల కమిషనర్ల నియామకం అంశంలో కొత్త చట్టం వచ్చేవరకూ ఎంపిక కమిటీలో ప్రధాని, లోక్‌సభలో విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వుండాలని నిరుడు మార్చిలో అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సూచించింది. రాజ్యాంగంలోని 324(2) అధికరణను ఉల్లంఘించి ప్రధాని ఏకపక్షంగా నియమకాలు చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం ఆ తీర్పునిచ్చింది. అనంతరం ఆగస్టులో కేంద్రం తెచ్చిన చట్టంలో ఆ తీర్పు స్ఫూర్తి గాలికెగిరి పోయింది. ప్రధాని, కేంద్రమంత్రి, లోక్‌సభలో విపక్షనేత ఎంపిక కమిటీలో వుంటారని ఆ చట్టం చెబుతోంది. పర్యవసానంగా ఎప్పటిలా పాలకపక్షం అభీష్టమే నెరవేరుతుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విపక్షం లేకుండానే బిల్లు ఆమోదం పొంది, చట్టం కావటాన్ని సవాలు చేస్తూ దాఖలైన రిట్ ప్రస్తుతం విచారణలో వుంది. ఆ చట్టంకిందనే తాజాగా ఇద్దరు కమిషనర్లను నియమించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ కీలకమైన అంశం. దాన్ని పర్యవేక్షించే ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వుండాలని జనం కోరుకుంటారు. అందుకే కమిషనర్ల నియామకం, పదోన్నతులు సాధ్యమైనంత పారదర్శకంగా వుండేందుకు ప్రయత్నించాలి. హఠాత్తు నిష్క్రమణలు, ఆగమనాలు ఎన్నికల సంఘం తటస్థతను ప్రశ్నార్థకం చేస్తాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ అయ్యే దశలో అశోక్ లావాసా 2020లో హఠాత్తుగా రాజీనామా చేయటం, ఇటీవల వున్నట్టుండి గోయెల్ నిష్క్రమించటం, పాలకపక్షందే పైచేయిగావున్న ఎంపిక కమిటీ కొత్త నియామకాలు చేయటం వంటివి సంశ యాలకు తావిస్తాయని పాలకులు తెలుసుకోవటం ఉత్తమం. -
ఎలక్షన్ కమిషన్‌కు ‘చాట్‌జీపీటీ’ కంపెనీ సాయం!
దేశంలో త్వరలో జరగనున్న లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. కృత్రిమ మేధస్సు (AI) పోలింగ్ ప్రక్రియకు అడ్డంకి కాకుండా ఎదుర్కొనేందుకు ‘చాట్‌జీపీటీ’ సృష్టికర్త ‘ఓపెన్ ఏఐ’ సాయం తీసుకుంటోంది. ఈ మేరకు ఈసీఐ అధికారులు ఓపెన్ ఏఐ ప్రతినిధులతో ఇటీవల సమావేశం నిర్వహించారు. గత నెలలో జరిగిన ఈ సమావేశానికి భారత ఎన్నికల సంఘం కోసం ఓపెన్ ఏఐ ఒక ప్రజెంటేషన్‌ను సిద్ధం చేసింది. పోలింగ్ ప్రక్రియలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగం కాకుండా ఎలా అరికట్టాలో కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు ఎలక్షన్ కమిషన్‌కు సూచనలిచ్చారు. ఈ సమావేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లోని పురోగతులను అధిక స్థాయిలో లోక్‌సభ ఎన్నికల సమయంలో దుర్వినియోగం కాకుండా చూసేందుకు బడా టెక్ కంపెనీలు, కేంద్ర సంస్థలు తీసుకోవాల్సిన చర్యల గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఓపెన్ఏఐ ప్రతినిధులు తెలియజేశారు. -
రాహుల్ గాంధీకి ఎలక్షన్ కమిషన్ కీలక సూచన!
లోక్‌సభ ఎన్నికల కోసం వివిధ రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి కీలక సూచన చేసింది. బహిరంగ ప్రసంగాలలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేసినట్లు తెలిసింది. గతేడాది నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో సహా బీజేపీ నేతలపై విమర్శల సందర్భంగా రాహుల్ గాంధీ కొన్ని తీవ్రమైన పదాలను ఉపయోగించిన సంగతి తెలిసిందే. దీంతో రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆయనకు ఈసీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ అయిన రాహుల్ గాంధీకి మార్చి 1న కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రచారాలలో ఈసీఐ సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరింది. ఇటీవల జరిగిన ఎన్నికలలో రాజకీయ ప్రచార ప్రసంగాలు హద్దులు మీరుతున్నట్లు గుర్తించిన ఈసీఐ ప్రసంగాలలో సంయమనం పాటించాలని గతం వారం కొన్ని సూచనలు చేసింది. -
ఎన్నికల షెడ్యూల్ అప్పుడే.. హింట్ ఇచ్చిన ఈసీ అధికారి!
Lok Sabha Elections 2024: దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది. రాజకీయ పార్టీలతోపాటు దేశ ప్రజలంతా ఎన్నికల ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్, తేదీని ఈ నెలాఖరులో ప్రకటించే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం.. 15 నుంచి 20 రోజుల్లో లోక్‌సభ ఎన్నికల తేదీని ఈసీఐ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదిక ప్రకారం.. కేంద్ర ఎన్నికల సంఘం రాబోయే 15- 20 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తుందని జమ్మూకశ్మీర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పీకే పోల్ పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలోపు ఏవైనా సంభావ్య సమస్యలను పరిష్కరించేందుకు సీనియర్ అధికారులు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేస్తున్నారని ఆయన తెలిపారు. జమ్మూకశ్మీర్ ఎలక్షన్ చీఫ్ చెప్పడమే కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 13 తర్వాత ఎన్నికల తేదీలను ప్రకటిస్తుందని మరికొన్ని నివేదికలు కూడా పేర్కొన్నాయి. మార్చి 13 నాటికి భారత ఎన్నికల సంఘం రాష్ట్రాలలో తన అంచనాను పూర్తి చేస్తుందని భావిస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 97 కోట్ల మంది భారతీయులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలకూ సిద్ధమవుతున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఈసీఐ త్వరలో ప్రకటించనుంది. -
స్వచ్ఛ ఓటర్ల జాబితా ముఖ్యం
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు అనేది అత్యంత కీలకమని, 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా రాష్ట్ర అధికారులు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అధికారులు ఆదేశించారు. ఓటర్ల జాబితా తయారీలో 100శాతం స్వచ్చత ఎంత ముఖ్యమో... ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కూడా అంతే ముఖ్యమని ఈసీఐ ప్రతినిధుల బృందం సారథి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్)–2024, సాధారణ ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై శుక్రవారం విజయవాడలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ వ్యాస్, స్వీప్ డైరెక్టర్ సంతోష్ అజ్మేరా, అండర్ సెక్రటరీ సంజయ్‌కుమార్‌తోపాటు ఏపీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి ముఖేష్‌కుమార్ మీనా, అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్, జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎ.వెంకటేశ్వరరావు, స్టేట్ పోలీస్ నోడల్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ తదితరులు హాజరయ్యారు. ధర్మేంద్ర శర్మ మాట్లాడుతూ అర్హత ఉన్నవారందరూ ఓటు నమోదు చేసుకునేలా, ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించడం ప్రధానమని చెప్పారు. బూత్, నియోజకవర్గ స్థాయిలో గతంలో నమోదైన పోలింగ్ శాతాలను పరిశీలించి... తక్కువగా ఉన్నచోట అందుకు కారణాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పారి్టసిపేషన్ (స్వీప్) కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎలాంటి అవరోధాలు లేకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసేందుకు సమగ్ర, పటిష్ట ఎన్నికల నిర్వహణ ప్రణాళిక (ఈఎంపీ) అవసరమని, స్వచ్చమైన ఓటర్ల జాబితాతోపాటు సుశిక్షితులైన మానవవనరులు, మెటీరియల్ తదితరాలపై దృష్టిసారించాలన్నారు. ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదికలు ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల నిర్వహణలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయని, ఈఎస్ఎంఎస్, సువిధ, ఈఎన్‌కోర్, సీ విజిల్, ఈటీపీబీఎంఎస్, ఓటర్ టర్నవుట్, కౌంటింగ్ ఓట్స్ యాప్‌లపై అధికారులు, సిబ్బందికి తప్పనిసరిగా అవగాహన ఉండాలన్నారు. జిల్లాస్థాయిలోనూ సమర్థ మానవ వనరులతో ఐటీ టీమ్స్ ఏర్పాటుచేయాలని సూచించారు. సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కాగా, ఓటు హక్కుపై స్ఫూర్తిదాయకమైన ప్రముఖులతో అవగాహన కార్యక్రమాలు, విశ్వసనీయత పెంపొందిస్తూ క్షేత్రస్థాయి తనిఖీల ఆధారంగా ఓటుకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారం, మద్యం, డబ్బు తదితరాల అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు సరిహద్దు జిల్లాలు, రాష్ట్రాల మధ్య సమన్వయం, ఎన్నికల సమయంలో నమోదైన కేసుల విచారణ, రాజకీయ తటస్థత కలిగిన ఎన్జీవోలు, పౌర సంస్థల భాగస్వామ్యం, పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ తదితర శాఖల మధ్య సమన్వయం, ఓటింగ్ శాతం పెంపు కోసం వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు తదితరాలపై ఈసీఐ అధికారులు పలు సూచనలు చేశారు. కలెక్టర్లు, ఎస్పీల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు ఎస్ఎస్ఆర్–2024, సాధారణ ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఎస్పీలు శాంతిభద్రతల పరిరక్షణ, గత ఎన్నికల నిర్వహణ సమయంలో ఉల్లంఘనలకు సంబంధించి నమోదైన కేసుల విచారణ, అక్రమ మద్యం, డబ్బు తరలింపులను అడ్డుకునేందుకు తీసుకుంటున్న చర్యలు, చెక్‌పోస్టుల మ్యాపింగ్, సమస్యాత్మక, వల్నరబుల్ పోలింగ్ స్టేషన్లు తదితరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పారదర్శకంగా ఎస్ఎస్ఆర్–2024: సీఈవో రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ–2024 ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో దరఖాస్తులు అందాయన్నారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా వాటిని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఎస్ఎస్ఆర్–2023 కింద ఈ ఏడాది జనవరి 5న తుది జాబితా ప్రచురించిన తర్వాత నుంచి దాదాపు 90 లక్షల దరఖాస్తులు వచ్చాయని.. వీటిలో 89 లక్షల దరఖాస్తుల పరిష్కారం పూర్తయిందన్నారు. మిగిలినవి ఈ నెల 26లోపు పరిష్కరిస్తామని తెలిపారు. ప్రతి వారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నామని, వారి సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ ఫిర్యాదులను పరిష్కరిస్తున్నట్లు వివరించారు. జిల్లా అధికార యంత్రాంగం ఎస్ఎస్ఆర్–2024, ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి ప్రతి దశలోనూ సమస్యను గుర్తించడంతోపాటు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సీఎం కేసీఆర్ కు ECI నోటీసులు
-
ఓట్ల కౌంటింగ్ తేదీని మార్చండి..
ఈశాన్య రాష్ట్రం మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీని మార్చాలంటూ ఆ రాష్ట్ర పౌర సంఘాలు విజ్ఞప్తులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు ఆ రాష్ట్ర పౌర సమాజం, విద్యార్థి సంఘాల గొడుగు సంస్థ అయిన మిజోరం ఎన్జీవో కోఆర్డినేషన్ కమిటీ నుంచి ఆరుగురు సభ్యుల ప్రతినిధి బృందం ఢిల్లీకి వచ్చింది. అయితే వీరికి ఎన్నికల కమిషన్ అపాయింట్మెంట్ లభించలేదని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. ఆదివారం కావడంతోనే.. మిజోరాంలో నవంబర్ 7న పోలింగ్ జరిగింది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌తోపాటుగా మిజోరాంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. క్రైస్తవ మెజారిటీ రాష్ట్రమైన మిజోరాంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు, పౌర సమాజం, ఇతర సంఘాలు కౌంటింగ్ తేదీని మార్చాలని ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని కోరాయి. డిసెంబర్ 3 ఆదివారం కావడంతో చర్చి కార్యక్రమాలకు ఇబ్బందులు కలుగుతాయని విజ్ఞప్తులు చేశాయి. అయితే కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం వారి డిమాండ్లను అంగీకరించలేదు. పోలింగ్ తేదీ లాగా కౌంటింగ్ తేదీ ప్రభావం సాధారణ ప్రజలపై ఉండదని, ఆ రోజున వారు నచ్చినట్లుగా అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొనవచ్చిని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. తమకు ఎన్నికల కమిషన్‌తో ముందస్తు అపాయింట్మెంట్ లేనప్పటికీ ఢిల్లీకి చేరుకుని ఎలక్షన్ కమిషన్ అధికారులను కలవడానికి ప్రయత్నించవచ్చన్న సూచన మేరకు ఇక్కడికి వచ్చినట్లు సెంట్రల్ యంగ్ మిజో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మల్సావ్‌మ్లియానా పీటీఐకి చెప్పారు. సీవైఎంఏ అనేది ఎన్‌జీవోసీసీలో ఒక భాగం కాగా, ఢిల్లీకి వచ్చిన ఆరుగురు ప్రతినిధుల్లో మల్సావ్‌మ్లియానా ఒకరు. తమ డిమాండ్లను ఈసీ అంగీకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా తాము ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలవడానికి ప్రయత్నిస్తామని, కౌంటింగ్ తేదీని రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థిస్తామని సీవైఎంఏ ప్రెసిడెంట్ లాల్‌మచువానా తెలిపారు. -
ఎల్లుండి తెలంగాణ ఎన్నికల షెడ్యూల్.! ఒకే విడతలో పోలింగ్
సాక్షి, ఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల ఎన్నికల పరిశీలకులతో ఇవాళ భేటీ కానుంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే సమీక్షలు పూర్తి చేసిన ఈసీ ఓ అంచనాకి వచ్చినట్లు తెలుస్తోంది. నాలుగు రాష్ట్రాలకు ఒకే విడతలో.. ఒక రాష్ట్రానికి మాత్రం రెండు విడుతలుగా పోలింగ్ నిర్వహించాలని భావిస్తోందని సమాచారం. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్ , రాజస్థాన్ , చత్తీస్ ఘడ్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల పరిశీలకులతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది. పోలీస్, జనరల్ , ఎక్సపెండేచర్ పరిశీలకులు ఈ భేటీకి హాజరు కానున్నారు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు వ్యూహాన్ని ఖరారు చేసేందుకే ఈ భేటీ నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక.. ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాంలలో ఒకే విడత పోలింగ్‌లో ఎన్నిక నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. అలాగే.. ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించాలనుకుంటోంది. ఇక డిసెంబర్ 10-15 తేదీల మధ్య ఓట్ల కౌంటింగ్ నిర్వహించేందుకు ఈసీ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు ఉపయోగించే మద్యం , డబ్బు.. నియంత్రణ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే తమ అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినంగా అమలు చేయడంతో పాటుగా డబ్బు, మజిల్ పవర్ నియంత్రణకు కృషిచేయాలని పరిశీలకులకు సూచించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నెల 8-10 తేదీల మధ్యలో.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనుంది. -
అక్టోబర్ 10న తెలంగాణ ఎన్నికల షెడ్యూల్?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) అక్టోబర్ 10న ప్రకటించనున్నట్లు తెలిసింది. అక్టోబర్ మొదటి వారంలో ఈసీ అధికారుల బృందం నిర్వహించే సమీక్షా సమావేశం అనంతరం ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోని ఈసీ బృందం అక్టోబర్ 3 నుంచి హైదరాబాద్‌లో పర్యటించనుంది. ఈ క్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమై శాసనసభ ఎన్నికల సన్నద్ధతను సమీక్షించనుంది. తెలంగాణ గత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ 2018 అక్టోబర్ 6న విడుదల కాగా డిసెంబర్ మొదటి వారంలో పోలింగ్ జరిగింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇదే తరహాలో జరుగుతాయని అందరూ భావిస్తున్నారు. ఎన్నికల తేదీలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలోని అధికార బీఆర్ఎస్ సహా పార్టీలన్నీ తమ సన్నాహాలను ముమ్మరం చేశాయి. ప్రత్యర్థులపై పట్టు సాధించేందుకు బీజేపీ సీనియర్ జాతీయ నేతలను రంగంలోకి దింపాలని యోచిస్తోంది. అక్టోబరులో బీజేపీ ప్రతిరోజూ ఒక భారీ ర్యాలీ నిర్వహిస్తుందని పార్టీ నాయకులు తెలిపారు. -
Election Commissioner: నచ్చినవాడికి ఇచ్చేద్దామా?
నిష్పక్షపాతంగా వ్యవహరించడమే కాదు, వ్యవహరించినట్టు కనిపించడం కూడా అంతే ముఖ్యం. కానీ, ప్రజాస్వామ్యానికి పునాది లాంటి ఎన్నికలు, వాటిని నిర్వహిస్తున్న మన ఎన్నికల వ్యవస్థ అలానే ఉన్నాయా? ఎన్నికల సంఘానికి పెద్ద అయిన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఇతర ఎన్నికల కమిషనర్ల (ఈసీల) నియామక ప్రక్రియ నిష్పాక్షికంగా, న్యాయబద్ధంగా జరుగుతోందా? దేశ సర్వోన్నత న్యాయస్థానం మంగళ, బుధవారాల్లో అన్న మాటలు, అడిగిన ఫైళ్ళు చూశాక సహజంగానే ఈ ప్రశ్నలు అడగాల్సినవే అనిపిస్తాయి. సీఈసీ, ఈసీల వ్యవస్థ రాజకీయ, ప్రభుత్వ జోక్యాలకు అతీతంగా ఉండేలా చూడాలంటూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యలు ఆలోచన రేపుతున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ లాంటి చోట్ల కూడా ఎన్నికల సంఘ నియామకాలు, చట్టాలు పారదర్శకంగా ఉంటే 72 ఏళ్ళ తర్వాతా మన వద్ద ఆ పరిస్థితి లేకపోవడం విషాదమే. ఈ నెల 18న స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి అరుణ్ గోయెల్‌ను ఆ వెంటనే 19వ తేదీన ఎన్నికల కమిషనర్‌గా ప్రభుత్వ పెద్దలు నియమించడం సైతం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మామూలుగా అయితే, ఈ ఏడాది ఆఖరుకు రిటైరవ్వాల్సిన వ్యక్తికి హఠాత్తుగా స్వచ్ఛంద పదవీ విరమణ ఇచ్చి, ఇలా ఎన్నికల సంఘంలో నియుక్తం చేయడంలో అంతా సవ్యంగానే జరిగిందా అన్నది ప్రశ్న. అది తెలుసుకొనేందుకే సుప్రీమ్ కోర్ట్ ఇప్పుడు అరుణ్ గోయెల్ నియామకం సహా నిర్ణీత ఫైళ్ళను పంపాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరడం గమనార్హం. అధికార పార్టీలు తమకు నచ్చిన ప్రభుత్వ ఉన్నతాధికారులను సీనియారిటీ ప్రాతిపదికన ఎన్నికల కమిషనర్లుగా నియమిస్తున్న విధానం తప్పనేది ప్రాథమికంగా పిటిషనర్ల వాదన. సీఈసీల నియామకంలోనూ కొలీజియమ్ తరహా విధానాన్ని పాటించాలని అభ్యర్థన. ఎన్నికల కమిషనర్ల నియామకం పూర్తిగా పాలకుల ఇష్టారాజ్యమైందన్నది చేదు నిజం. సుప్రీమ్ అన్నట్టు – క్యాబినెట్ నియమించిన సీఈసీ, ఈసీలు ఏ ప్రధానమంత్రి స్థాయి వ్యక్తికో వ్యతిరేకంగా నోరు విప్పగలరా అన్నది అనుమానమే. గణాంకాలు చూస్తే రాజ్యాంగం అమలులోకి వచ్చాక తొలి 46 ఏళ్ళలో (1950 –1996) సీఈసీగా వ్యవహరించింది పట్టుమని పది మందే! ఆ తర్వాత గత 26 ఏళ్ళలో ఇప్పటికి 15 మంది వచ్చారు, పోయారని కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 2004 తర్వాత ఏ ఒక్కరూ పూర్తి ఆరేళ్ళ పదవీకాలం లేరు. కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ సారథ్య యూపీఏ అయినా, బీజేపీ నేతృత్వ ఎన్డీఏ అయినా ఇదే దుఃస్థితి. స్వల్పకాలమే ఉంటున్న ఈ ఎన్నికల పెద్దలు అనుకున్నది చేయగలరా? ఏ మేరకు స్వతంత్రంగా వ్యవహరించగలరు? సుప్రీమ్ ప్రశ్న కూడా ఇదే! దేశంలో తొలిసారిగా ఎన్నికల సంఘం గురించి సామాన్యులకు తెలిసింది – ఎన్నికల కమిష నర్గా శేషన్ సంస్కరణలు సాగించిన కాలంలోనే. ఇవాళ్టి ఓటర్ గుర్తింపుకార్డులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రవేశపెట్టిందీ ఆయనే. శేషన్ తర్వాత లింగ్డో లాంటి కొందరు నిర్భయంగా ఎన్నికల సంఘం అధికారాలను వినియోగించినా, గత దశాబ్దిన్నరలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎక్కడా ఎన్నికల వ్యయంపై నియంత్రణ లేకుండా పోయింది. ఇటీవలి మునుగోడు ఉప ఎన్నిక సహా అనేకచోట్ల మద్యం ఏరులై పారుతూ, కోట్లకొద్దీ నోట్ల కట్టలు తెగుతూ, ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్నా, ఎన్నికల సంఘం చేష్టలుడిగి చూస్తోంది. శేషన్ నాటికీ, నేటికీ అధికా రాల్లో మార్పు లేకపోయినా అంకితభావంలో మార్పు వచ్చింది. పదవీప్రసాద ప్రభుభక్తి పెరిగింది. రాజ్యాంగంలోని 324వ అధికరణం ఈసీల నియామక ప్రక్రియను వివరించలేదు. దానిపై పార్లమెంట్ చట్టం చేస్తుందని భావించింది. ఇన్నేళ్ళుగా అది జరగలేదు. తాజా కేసులోనూ సర్కారు 1991 నాటి చట్టాన్నీ, అలాగే రాష్ట్రపతికి ప్రధాని సారథ్యంలోని మంత్రివర్గ సిఫార్సుల పైనే నియా మకాలు జరుగుతున్న పూర్వోదాహరణల్నీ అడ్డుపెట్టుకుంటోంది. లా కమిషన్ సైతం కొలీజియమ్, లేదా ప్రధాని, ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన సెలక్షన్ కమిటీయే ఈసీలం దర్నీ నియమించాలని 2015 నివేదికలో పేర్కొంది. కొలీజియమా, కమిటీయా అన్నది పక్కన పెడితే ఈసీల నియామక ప్రక్రియలో తక్షణ సంస్కరణలు అవసరం. అయితే, దీనికి పార్లమెంట్ ఆమోదంతో రాజ్యాంగ సవరణ చేయాలి. అందుకు మన పాలకులెంత సిద్ధం ఉంటారో చెప్పలేం. అసలైనా అధికారంలోని వారి అభీష్టమైన ఈసీల నియామకంపై జడ్జీలు జోక్యం చేసుకోవడమే మిటనేది ప్రభుత్వ అనుకూల వర్గాల వాదన. ధర్మాన్ని నిలబెట్టాల్సిన న్యాయవ్యవస్థ సైతం దృష్టి సారించరాదంటే తప్పొప్పులు దిద్దేదెవరు? రాష్ట్ర విభజన జరిగాక ఏపీకి తొలి ఈసీగా నియుక్తులైన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ లాంటి వారు బాధ్యత మరిచి, పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించడం తాజా ఉదాహరణే. ఇక, ఈసీల నియామకంపై వ్యాఖ్యానించిన సుప్రీమ్ తన సొంత జడ్జీల నియామక ప్రక్రియపై విమర్శలకు స్పందించదేమన్నది కొందరి విమర్శ. కొలీజియమ్ వ్యవస్థ ఆసరాగా ప్రధాన న్యాయమూర్తులు మెచ్చినవారినే జడ్జీలుగా నియమిస్తున్నారనీ, ఈ నియామకాల్లో పారద ర్శకత లేదనీ ఆరోపణ. న్యాయశాఖ మంత్రీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజం చెప్పాలంటే, ఎన్నికల సంఘంలోనైనా, న్యాయవ్యవస్థలోనైనా నియామకాలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరపాలి. తటస్థ వ్యవస్థలుంటేనే విశ్వాసం బలపడుతుంది. ప్రజాస్వామ్య పరిపుష్టి సాధ్యమవుతుంది. -
ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్‌పై ఈసీ నిషేధం!
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్రం ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో నేటి (నవంబర్ 12)నుంచి ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్‌లో శనివారం ఉదయం 8 గంటలకు భారీ భద్రత నడుమ పోలింగ్ మొదలైంది. మరోవైపు.. గుజరాత్లో డిసెంబర్ 1, 5 వ తేదీల్లో ఓటింగ్ జరగనుంది. నవంబర్ 12, ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 5, సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌ను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రచురణ, ప్రసారం చేయకూడదని నోటిఫికేషన్ జారీ చేసింది. పీపుల్స్ యాక్ట్ 1951లోని సెక్షన్ 126(1)(బీ)ప్రకారం.. అలాగే ఒపీనియన్ పోల్స్ ఫలితాలు, సర్వేలు సహా ఎలాంటి ఎన్నికల అంశాలను ఎన్నిక ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయరాదని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గెజిట్ నోటిఫికేషన్ ద్వారా తమ ఆదేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని హిమాచల్, గుజరాత్ ఎన్నికల ప్రధానాధికారులకు సూచించింది. అలాగే.. మీడియా రంగాలకు సైతం తెలియజేయాలని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: హిమాచల్ ప్రదేశ్ పోలింగ్: ఈ పోలింగ్ బూత్ ప్రపంచంలోనే ఎంతో ప్రత్యేకం! 52 మంది ఓటర్లతో ఏకంగా.. -
ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీచేసే అభ్యర్థులకు ‘ఆన్లైన్ అవకాశం’
సాక్షి, అమరావతి: ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులకు భారత ఎన్నికల సంఘం కొత్త అవకాశాన్ని కల్పించింది. ఆన్లైన్ ద్వారా నామినేషన్ ఫామ్, అఫిడవిట్లో వ్యక్తిగత సమాచారాన్ని పొందుపర్చేందుకు, నామినేషన్లు దాఖలు చేయడానికి అపాయింట్మెంట్, ప్రచార కార్యక్రమాల నిర్వహణకు అనుమతులను పొందే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు suvidha.eci.gov.in పోర్టల్ ద్వారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. నామినేషన్లను జూన్ 6వ తేదీలోగా దాఖలు చేసుకోవాలని, నామినేషన్ల పరిశీలన 7వ తేదీన జరుగుతుందని, ఉపసంహరణకు 9 చివరి తేదీ అని మీనా తెలిపారు. -
Election Results 2022: కచ్చితమైన సమాచారం కోసం..
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఉత్తరప్రదేశ్‌లో 7 దశల్లో, మణిపూర్‌లో 2 దశల్లో, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్‌లలో ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. ఫలితాల కోసం ఆయా రాష్ట్రాల ప్రజలతో పాటు దేశంలోని వారంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వార్తా చానళ్లు, వెబ్సైట్లు తమ అందించిన సమాచారం ఆధారంగా ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తుంటాయి. అయితే కచ్చితమైన, అధికారిక సమాచారం కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ లేదా యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎలా చూడాలి? ► ముందుగా ఎన్నికల సంఘం వెబ్సైట్ (results.eci.gov.in)లోకి వెళ్లాలి. ► 'అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ ఎన్నికలు - మార్చి 2022' లింక్‌పై క్లిక్ చేయండి. ► క్లిక్ చేయగానే మీరు కొత్త వెబ్‌పేజీకి మళ్లించబడతారు ► ఎన్నికల ఫలితాలను చూడాలనుకుంటున్న రాష్ట్రం పేరుపై క్లిక్ చేయండి. ► క్లిక్ చేయగానే ఎన్నికల ఫలితాల ట్రెండ్ పేజీ ఓపెనవుతుంది. ► పార్టీల వారీగా, నియోజకవర్గాల వారీగా, అభ్యర్థులు అందరూ, నియోజకవర్గాల వారీగా ట్రెండ్స్.. ఆప్షన్లలో దేనినైనా ఎంచుకోండి. ► ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత తుది ఫలితం వెల్లడిస్తారు. ► దీంతో పాటు sakshi.comలోనూ ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. -
రిజిస్టర్డ్ పార్టీగా వైఎస్సార్టీపీ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ రిజిస్టర్డ్ రాజకీయ పార్టీగా ఆవి ర్భవించింది. ప్రజాప్రతినిధ్య చట్టం–1951లోని సెక్షన్ 29 కింద వైఎస్సార్టీపీని రిజిస్టర్చేసినట్టు ప్రకటిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 18న పార్టీ అధ్య క్షురాలు షర్మిలకు లేఖ రాసింది. బుధవారం అందిన లేఖలో ఈ నెల 16 నుంచి వైఎస్సార్టీపీ రిజిస్టర్డ్ పార్టీగా మనుగడలోకి వచ్చినట్టు తెలిపింది. కాగా, రిజిస్టర్డ్ పార్టీ కావడంతో వైఎస్సార్టీపీకి శాశ్వత ఎన్నికల చిహ్నం కేటాయింపు ఉండదని, రాష్ట్ర శాసన సభ లేదా లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో 5శాతానికి పైగా సీట్లలో తమ అభ్యర్థులను పార్టీ నిలబెడితే అందరికీ ఒకే ఎన్నికల గుర్తు కేటాయిస్తామని తెలి పింది. ఏ పార్టీకి కేటాయించకుండా ఉండే ఎన్నికల గుర్తుల విషయంలో స్వతంత్ర అభ్యర్థులతో పోలిస్తే రిజిస్టర్డ్ పార్టీకి ప్రాధాన్యతనిస్తామని వెల్లడించింది. రిజిస్టర్డ్ పార్టీగా అవతరించడంతో వైఎస్సార్టీపీ లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత సాధించింది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ వై.ఎస్. షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు నివ్వడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సహాన్ని నింపింది. బుధవారం ఈసీ నుంచి లేఖ అందుకున్న నేపథ్యంలో లోటస్‌పాండ్‌లోని కార్యాలయంలో పార్టీ అధినేత్రి షర్మిల తన తల్లి విజయమ్మ, భర్త అనిల్‌తో కలసి కేక్ కట్ చేశారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర త్వరలో ప్రారంభమవుతుందని సీనియర్ నాయకుడు తూడి దేవేందర్‌రెడ్డి మీడియాకు తెలిపారు. -
చిక్కుల్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
-
ఎన్నికల అధికారులకు ఈసీఐ దిశానిర్దేశం
అమరావతి: ఎన్నికల ఫలితాల రోజున అనుసరించాల్సిన విధివిధానాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) డిప్యూటీ చీఫ్ ఉమేశ్ సిన్హా దిశానిర్దేశం చేశారు. పోలింగ్ నాడు చోటుచేసుకున్న సంఘటనలుల దృష్టిలో పెట్టుకుని పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా చేపట్టాలని, ప్రణాళిక విభాగం రూపొందించిన మార్గదర్శకాలను తూచ తప్పకుండా పాటించాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేయాలని చెప్పారు. స్ట్రాంగ్ రూంల భద్రతపై వారాంతపు నివేదికలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా పంపించాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు వివరాలు ఈసీఐ అధికారిక పోర్టల్ న్యూసువిధకు అనుసంధానం చేసిన తర్వాతే ఫలితాలు ప్రకటించాలని తెలియజేశారు. రాజకీయ పార్టీల ఏజెంట్ల సంతకాలు తీసుకున్న తర్వాతే ఫలితాలు ప్రకటించాలని సూచన చేశారు. రోజువారీ నివేదికలివ్వండి: సుజాత(అడిషల్ సీఈఓ) స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతపై రోజువారీ నివేదికలివ్వాలని కలెక్టర్లను ఏపీ అదనపు ప్రధాన ఎన్నికల అధికారిణి సుజాత శర్మ ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియను ప్రోటోకాల్ ప్రకారం అత్యంత పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. 17న కౌంటింగ్‌పై రాష్ట్రస్థాయి శిక్షణా కార్యక్రమం విజయవాడలో నిర్వహిస్తామని చెప్పారు. -
శాసనమండలి ఉప ఎన్నికలకు షెడ్యూలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన ముగ్గురు సభ్యుల స్థానంలో ఉపఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూలు జారీచేసింది. స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి ఎన్నికైన సభ్యులు పట్నం నరేందర్ రెడ్డి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నేపథ్యంలో వీరిద్దరూ గత డిసెంబరులో రాజీనామా చేశారు. అలాగే కొండా మురళి పార్టీ మారడంతో శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ స్థానిక సంస్థల నియో జకవర్గాలకు ఉపఎన్నిక నిర్వహించేందుకు తాజాగా షెడ్యూలు విడుదల చేసింది. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణం అమలులోకి వస్తుందని షెడ్యూలులో పేర్కొంది. ఇదీ షెడ్యూలు నోటిఫికేషన్ తేదీ- 7 మే 2019(మంగళవారం) నామినేషన్లకు గడువు- 14 మే నామినేషన్ల పరిశీలన- 15 మే అభ్యర్థిత్వాల ఉపసంహరణకు గడువు- 17 మే పోలింగ్ తేదీ- 31 మే పోలింగ్ సమయం- ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓట్ల లెక్కింపు- 3 జూన్ -
పోటీ చేసేవాళ్లెక్కువ..! పోలింగ్ తక్కువ...!!
సాక్షి వెబ్, హైదరాబాద్ : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమకు ఎక్కువ ఓట్లు వేయించుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. అనేక రకాలుగా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తుండటం మనం చూస్తూనే ఉంటాం. ఒక నియోజకవర్గంలో నలుగురు అభ్యర్థులు పోటీలో నిలిస్తే వారంతా ఎవరి ప్రయత్నాల్లో వారుంటారు. ఓటింగ్ పెంచుకోవడానికి తెగ తాపత్రయ పడుతారు. నలుగురు పోటీలో ఉన్న చోట ఇలా ఉంటే... అదే నలభై మంది ఉన్న చోట ఎలా ఉండాలి. కచ్చితంగా పోలింగ్ ఎక్కువగా నమోదు కావాలి. కానీ అలా జరగడం లేదు. ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ జరిగిన తీరు గమనిస్తే... అనేక ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లో అత్యధిక పోలింగ్ జరగాలి. కానీ ప్రతిసారీ రివర్స్ లో నగరాల్లోనే తక్కువ పోలింగ్ నమోదు కావడం గమనిస్తూనే ఉన్నాం. తాజా ఎన్నికల్లో అభ్యర్థులు పోటీ పడిన తీరు, అభ్యర్థులు ఎక్కువగా పోటీలో ఉన్న నియోజకవర్గాల్లోనే పోలింగ్ తక్కువ కావడం గమనార్హం. ఉదాహరణకు మల్కాజిరిగి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 42 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. పోటీ చేస్తున్న వారంతా ప్రచారం చేసుకోవడంతో పాటు పెద్దఎత్తున ఏజెంట్లను రంగంలోకి దింపారు. కానీ విచిత్రమేమంటే... రాష్ట్ర వ్యాప్తంగా అతితక్కువ ఓటింగ్ నమోదైన నియోజకవర్గాల్లో మల్కాజిరిగి కూడా ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 24 నియోజకవర్గాల్లో మాత్రమే 80 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. అయితే, ఈసారి 69 స్థానాల్లో పోలింగ్ శాతం 80 దాటింది. గత ఎన్నికలతో పోల్చితే పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగినప్పటికీ హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో అతి తక్కువ పోలింగ్ నమోదైంది. తెలంగాణలో ఎస్సీ (19), ఎస్టీ (12) నియోజకవర్గాలు మొత్తం 31 స్థానాల్లో పోలింగ్ సరళి చూస్తే 26 నియోజకవర్గాల్లో 80 శాతానికిపైగా పోలింగ్ జరిగింది. కేవలం అయిదు చోట్ల మాత్రమే అంతకన్నా తక్కువ పోలింగ్ నమోదు కాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) స్థానంలో అతితక్కువగా 49.05 శాతం పోలింగ్ నమోదైంది. ఇకపోతే, ఒక్కో నియోజకవర్గంలో 20 మంది అంతకన్నా ఎక్కువ అభ్యర్థులు పోటీ చేసిన స్థానాలు 22 ఉన్నాయి. మల్కాజిగిరి (42), ఎల్బీ నగర్ (35), ఉప్పల్ (35), ఖైరతాబాద్ (32), అంబర్ పేట్ (31), శేరిలింగంపల్లి (29), సికింద్రాబాద్ (29), రాజేంద్ర నగర్ (26), ముషీరాబాద్ (26), గోషామహల్ (25), యాకుత్ పుర (21), కుత్బుల్లాపూర్ (20), కూకట్ పల్లి (20), ఇబ్రహీంపట్నం (20), మలక్ పేట్ (20) చొప్పున అభ్యర్థులు పోటీలో నిలిచారు. కానీ ఈ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం మాత్రం అతితక్కువ నమోదైంది. -
19 నెలల గరిష్టానికి ఈసీఐ ఇండెక్స్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని ప్రధాన రంగాలు రికార్డ్ స్థాయిలో భారీగా పుంజుకున్నాయి. ఐఐపీ డేటాలో 40శాతం వెయిటేజీ ఉన్న ఈసీఐ ఇండెక్స్ (ఎయిట్ కోర్ ఇండెక్స్) నవంబర్ నెలలో వృద్ధిరేటు 6.8 శాతం వృద్ధిని రేటును నమోదు చేసింది. దీంతో మౌలిక సదుపాయాల ఉత్పత్తి 19 నెలల గరిష్టాన్ని తాకింది. గత ఏడాది ఇదే నెలలో ఇది 3.2 శాతంగా ఉంది. బొగ్గు, ఉక్కు, సిమెంటు, విద్యుత్ వంటి ప్రధాన రంగాల ఉత్పాదనను సూచించే ఈసీఐ ఇండెక్స్ తాజా గణాంకాలను వాణిజ్య, పరిశ్రమల శాఖ సోమవారం విడుదల చేసింది. ఏప్రిల్, నవంబర్ మధ్యకాలంలో పారిశ్రామిక వృద్ధిరేటు 3.9 శాతంగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఐఐపి వృద్ధిరేటు 5.3 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే నెలలో 3.2 శాతం వృద్ధి సాధించిన ఎనిమిది ప్రధాన రంగాల వృద్ధిరేటు 6.8 శాతం వృద్ధి చెందిందని వాణిజ్య పరిశ్రమల శాఖ పేర్కొంది. ముఖ్యంగా సంవత్సరం ప్రాతిపదికన ఫెర్టిలైజర్స్, కోల్, క్రూడ్ ఆయిల్, నాచురల్ గ్యాస్,ఎలక్ట్రిసిటీ, స్టీల్ , పెట్రోలియం అండ్ రిఫైనరీ ఉత్పత్తి బాగా ఉంజుకుంది. స్టీల్ 8.4 శాతం నుంచి పుంజుకుని 16.6శాతం గానూ, సిమెంట్ సెక్టార్ -2.7నుంచి ఎగిసి 17.3శాతంగా నమోదైంది. అయితే మంత్ ఆన్ మంత్ బొగ్గు ఉత్పత్తి 0.2 శాతం, చమురు ఉత్పత్తి 0.2 తగ్గింది. స్టీల్ ఉత్పత్తి 16.6గా ఉంది. సిమెంట్ ఉత్పత్తి కూడా 2.7శాతం (నెలవారీ)క్షీణించి 17.3శాతంగా నమోదుకాగా, విద్యుత్ ఉత్పత్తి 2.1 శాతం క్షీణించి 2.1గా ఉంది. -
వీవీపీఏటీ నిధుల వివరాలు తెలపండి
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతోపాటు ఓటరు ధ్రువీకరణ రశీదు కోసం సంబంధిత పరికరాలను కొనుగోలు చేయడానికి కేంద్రం నుంచి అందుకున్న మొత్తం నిధుల వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు.. భారత ఎన్నికల కమిషన్(ఈసీఐ)ను ఆదేశించింది. బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) వేసిన పిటిషన్ వాదనల సందర్భంగా జస్టిస్ చలమేశ్వర్, అబ్దుల్నజీర్లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తు ఎన్నికలలో ఉపయోగించడానికి ఓటరు ధ్రువీకరణ రశీదు(ఓటర్ వెరిఫబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్– వీవీపీఏటీ) సంబంధిత పరికరాల కొనుగోలుకు రూ. 3,174 కోట్లతో ప్రతిపాదనలను ఈసీఐ కేంద్రానికి పంపింది. దీనికి కేంద్ర కేబినెట్ గతనెలలో ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. పలు పిటిషన్ల విచారణ సందర్భంగా న్యాయవాది చిదంబరం వాదనలు వినిపిస్తూ.. ‘‘త్వరలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి. అయితే ఎప్పుడు భారత ఎన్నికల సంఘం వీవీపీఏటీ పరికరాలను ఉపయోగిస్తుందో, కేంద్రం నుంచి ఎన్ని నిధులు అందుకున్నారో వివరాలు ఇవ్వమనండి’’ అని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై జూలై మూడో వారంలో వాదనలు వింటామని, అంతలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంటూ ధర్మాసనం కేసును విచారణ వాయిదా వేసింది. -
యూపీలో ఎవరికి మెజారిటీ రాదా!
లక్నో: అయిదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినప్పటికీ ప్రజల అందరి దృష్టి ఉత్తరప్రదేశ్ పైనే ఉంది. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో అధికారం ఏ పార్టీని వరించనుందన్న విషయంలో అనేక విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలపై అనేక సంస్థలు ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ నిర్వహించినప్పటికీ కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు 9 వ తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు వాటిని వెల్లడించడానికి వీలులేదు. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా... ఫలితాలు మాత్రం తేలేది 11 వ తేదీన మాత్రమే. నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో దాదాపు మూడేళ్ల బీజేపీ సర్కారు, యూపీలో అధికారంలో ఉన్న అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం, అంతకుముందున్న బీఎస్పీల మధ్య పోరు హోరాహోరీగానే సాగిందని ప్రాథమిక అంచనాలు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నాయి. మోదీ ప్రచారం, తమ పాలన, అనుసరించిన రాజకీయ వ్యూహం తమకు అనుకూలమైన ఫలితాలను అందిస్తాయని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. గత ఎన్నికల తరహాలో దళిత, ముస్లిం, బ్రాహ్మణ ఓటర్లే లక్ష్యంగా అనుసరించిన రాజకీయ ఎత్తుగడ ఫలిస్తుందని బీఎస్పీ ఎంతో నమ్మకంతో ఉంది. ఇకపోతే, సమాజ్ వాది పార్టీలో ప్రారంభంలో మొదలైన లుకలుకలు కనిపించినప్పటికీ అవేవీ ఫలితాలపై ప్రభావం చూపించబోవని, అఖిలేష్ నాయకత్వం పట్ల అనేక వర్గాలు అనుకూలంగా ఉన్నాయని, దానికి తోడు కాంగ్రెస్ పొత్తు మరింత సానుకూల ఫలితాలను అందిస్తుందని ఎస్పీ ఆశాభావంతో ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రాథమికంగా వస్తున్న సమాచారం, రాజకీయ విశ్లేషకుల అంచనాల మేరకు ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలోని 403 అసెంబ్లీ స్థానాలకు మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగ్గా, ఒక్కో దశలో ఒక్కో పార్టీకి మెరుగైన అవకాశాలు కనిపించాయి. తుదిగా మాత్రం ఏ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశాలు లేవని అంచనాలు వేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అత్యధిక సీట్లు సాధించే (సింగిల్ లార్జెస్ట్) రాజకీయ పార్టీగా ఎవరుంటాయన్నది కూడా కీలకం కానున్నది. ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా చర్చకు వచ్చిన నోట్ల రద్దు వంటి అంశాలు కేవలం రాష్ట్రానికి మాత్రమే సంబంధించనివి కాకపోవడం దీనికి కారణమంటున్నారు. అలాగే పార్టీల సంప్రదాయ ఓటు బ్యాంకుల్లో కులమతాల ఆధారంగా చోటుచేసుకున్న కొత్త సమీకరణాలు కూడా ఫలితాన్ని త్రిశంకు స్వర్గంలోకి నెట్టనున్నాయని విశ్లేషకుల అంచనా. ఎస్పీలో అంతర్గత కుమ్ములాట నేపథ్యంలో ముస్లింలు ఆ పార్టీవైపు మొగ్గుచూపాలో, లేకపోతే తమ సామాజిక వర్గానికి దాదాపు 100 టికెట్లు ఇచ్చిన బీఎస్పీవైపు మొగ్గు చూపాలో తేల్చులేకపోయారు. బీఎస్పీ, ఎస్పీ-కాంగ్రెస్, బీఎస్పీల మధ్య ప్రధానంగా పోరు నెలకొన్న యూపీలో ఏ పార్టీ అయినా సగం సీట్లు (202) గెలవాలంటే 35 శాతం ఓట్లను దక్కించుకోవాల్సి ఉంటుందని అంచనా. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షం ఆప్నా దళ్లు రాష్ట్రంలోని 80 లోక్‌సభ స్థానాలకుగాను 73 స్థానాలను, 42 శాతం ఓట్లును గెలుచుకోవడం తెలిసిందే. ఈ లెక్కన కాషాయదళానికి తాజా ఎన్నికల్లో 7 శాతం ఓట్లు కోల్పోయినా విజయానికి ఢోకా ఉండదు. 2012 ఎన్నికల్లో ఎన్నికల్లో 29 శాతం ఓట్లతో(226 సీట్లు) అధికారంలోకి వచ్చిన ఎస్పీ.. ఈసారి గెలవాలంటే కాంగ్రెస్‌తో కలసి మరో 6 శాతం ఓట్లు ఎక్కువగా సంపాదించాలి. గత ఎన్నికల్లో 26 శాతం ఓట్లు(80 సీట్లు)సాధించిన బీఎస్పీ అధికారంలోకి రావాలంటే మరో 9 శాతం ఓట్లు తెచ్చుకోవాలి. 14 ఏళ్లపాటు హంగ్ తీర్పు ఇచ్చిన యూపీ ప్రజలు 2007లో దానికి స్వస్తి పలికి బీఎస్పీకి 206 సీట్లతో పట్టాభిషేకం చేశారు. మొత్తంమీద ఈ ఫలితాలు యూపీ అధికారపక్షమేదో తేల్చడంతోపాటు కాకుండా మరో రెండేళ్ల తర్వాత జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో గాలి ఏ పార్టీ వైపు వీస్తుందో కూడా చెప్పనున్నాయి. -
చిన్నమ్మకు ‘ఈసీ’ షాక్
-
చిన్నమ్మకు ‘ఈసీ’ షాక్
చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి నియామకం వ్యవహారంలో చిన్నమ్మ శశికళకు కేంద్ర ఎన్నికల యంత్రాంగం షాక్ ఇచ్చింది. ఆమె నియామకం గురించి వివరణ ఇచ్చే అధికారం ఆ పార్టీ ఉప ప్రధానకార్యదర్శి టీటీవీ దినకరన్‌కు లేదని స్పష్టం చేసింది. పదో తేదీలోపు శశికళ సంతకంతో వివరణ తమకు సమర్పించాలని శుక్రవారం రాత్రి ఆదేశించింది. దివంగత సీఎం జయలలిత మరణంతో అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడ్డ విషయం తెలిసిందే. జయలలిత నెచ్చెలి శశికళ నేతృత్వంలో ఓ శిబిరం, మాజీ సీఎం పన్నీరుసెల్వం నేతృత్వంలో మరో శిబిరంగా, జయలలిత మేన కోడలు దీప నేతృత్వంలో మరో శిబిరంగా పార్టీ కేడర్ చీలారు. అయితే, ప్రభుత్వం చిన్నమ్మ శిబిరం చేతిలో ఉన్నా, పార్టీ మాత్రం తమదేనని, శశికళ నియామకం చెల్లదంటూ పన్నీరు శిబిరం వాదిస్తూ వస్తోంది. ఇందుకు తగ్గ ఫిర్యాదు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు చేరింది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం చెల్లదు అని, ఎలాంటి అధికారాలు లేకుండా ఆమె నియామకాలు, తొలగింపులు సాగించారని ఆ ఫిర్యాదులో పన్నీరు శిబిరం పేర్కొంది. దీనిపై శశికళను కేంద్ర ఎన్నికల కమిషన్ వివరణ కోరగా, ఆమె తరఫున అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ గత నెల 28న ఎన్నికల కమిషన్‌కు వివరణ ఇచ్చారు. అన్నాడీఎంకే నియమ నిబంధనల మేరకు శశికళ నియామకం జరిగినట్టు వివరించారు. అయితే, ఆ వివరణను కేంద్ర ఎన్నికల కమిషన్ పరిగణించలేదు. శశికళ తరఫున వివరణ ఇచ్చే అధికారం టీటీవి దినకరన్‌కు లేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. శుక్రవారం రాత్రి ఢిల్లీలో ఇందుకు తగ్గ ప్రకటన వెలువడ్డట్టు తమిళనాట మీడియాల్లో వార్తలు, కథనాలు హల్చల్ చేశాయి. ఆ మేరకు శశికళ చేత నియమించబడ్డ టీటీవీ దినకరన్‌కు వివరణ ఇచ్చే అధికారం లేదని ప్రకటించారు. ఆ వివరణను పరిగణించమని, ఈనెల పదోతేదీలోపు శశికళ సంతకంతో కూడిన వివరణ సమర్పించాలని ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. పరప్పన అగ్రహార చెరలో ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న శశికళ పదో తేదీలోపు ఏ రూపంలో వివరణ ఇస్తారో అన్న చర్చ ఆ శిబిరంలో బయలు దేరింది. టీటీవీ దినకరన్ అన్నాడీఎంకేలో ఏ పదవిలోనూ లేదని, వివరణ ఇచ్చే అధికారం ఆ పార్టీలో అధికారిక పదవుల్లో ఉన్న వారికే ఉందంటూ ఎన్నికల కమిషన్ పేర్కొని ఉండడంతో పన్నీరు శిబిరంలో ఆనందం వ్యక్తం అవుతోంది. శశికళ నియామకం సైతం రద్దు అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
ప్రలోభ పెడితే చర్యలు: భన్వర్‌లాల్
హైదరాబాద్ : ఈ నెల 13వ తేదీన తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఐదు, తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు గ్యాడ్యుయేట్, రెండు టీచర్స్ నియోజకవర్గాలకు, అలాగే తెలంగాణలో ఖాళీ కాబోతున్న టీచర్స్ నియోజకవర్గానికి ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే, ఈ నెల 23న అభ్యర్ధుల తుదిజాబితా విడుదల చేస్తామని ఆయన తెలిపారు. మార్చి 9 వ తేదీన ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ఓట్ల లెక్కింపు మార్చి 15 వ తేదీన చేపడుతామని వివరించారు. అయితే, ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల నియమావళి అమలును పరిశీలించేందుకు ప్రతి మండలానికి రెండు టీంలు ఏర్పాటు చేయనున్నామన్నారు. బ్యాలెట్ పేపర్ పై ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో గ్రాడ్యుయేట్ ఓటర్ల వివరాలు: - శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ గ్రాడ్యుయేట్ ఓటర్లు: 155094 పోలింగ్ స్టేషన్ : 224 - ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్ ఓటర్లు: 220554 పోలింగ్ స్టేషన్ : 283 - కడప, అనంతపురం, కర్నూలు గ్రాడ్యుయేట్ ఓటర్లు: 250734 పోలింగ్ స్టేషన్ : 336 టీచర్స్ ఓటర్ల వివరాలు : - ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు టీచర్స్ ఓటర్లు: 20290 పోలింగ్ స్టేషన్ :176 - కడప, అనంతపురం, కర్నూలు టీచర్స్ ఓటర్లు : 20262 పోలింగ్ స్టేషన్ : 171 తెలంగాణలో టీచర్స్ ఓటర్ల వివరాలు : - మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ టీచర్స్ ఓటర్లు : 23013 పోలింగ్ స్టేషన్ : 126 -
ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూలును ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో ఐదు, తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు గ్యాడ్యుయేట్, రెండు టీచర్స్ నియోజకవర్గాలకు, అలాగే తెలంగాణలో ఖాళీ కాబోతున్న టీచర్స్ నియోజకవర్గానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం ఈ స్థానాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి 29తో ముగుస్తోంది. ఈ ఎన్నికల నిర్వహణ కోసం ఈ నెల 13 న నోటిఫికేషన్ జారీ కానుంది. మార్చి 9 న పోలింగ్ నిర్వహించి 15 న లెక్కింపు ప్రక్రియను పూర్తి చేస్తారు. నామినేషన్లు దాఖలు చేయడానికి ఫిబ్రవరి 20 వరకు గడువు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గానికి ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంవీఎస్ శర్మ, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు గ్రాడ్యుయేట్స్ నియోజవర్గం ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాస రెడ్డి, కడప-అనంతపురం-కర్నూలు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎం. గేయానంద్, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు టీచర్స్ స్థానం ఎమ్మెల్సీ వి బాలసుబ్రమణ్యం, కడప-అనంతపురం-కర్నూలు టీచర్స్ నియోజకవర్గం ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్యల పదవీ కాలం మార్చి 29తో ముగుస్తోంది. అలాగే తెలంగాణలోని మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్స్ స్థానం నుంచి కాటిపల్లి జనార్ధన్ రెడ్డి పదవీ కాలం కూడా అదే సమయానికి ముగియనుంది. రెండు రాష్ట్రాల్లో ముగుస్తోన్న ఈ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూలును ప్రకటించగా, బీహార్ రాష్ట్రానికి చెందిన రెండు ఉపాధ్యాయ, రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఇదే షెడ్యూలును ప్రకటించింది. మార్చి 9 న పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ఈ స్థానాల కోసం ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఓటర్ల తుది జాబితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. -
వాట్సాప్ గ్రూపు: 'హలో... హాయ్' కోసం కాదు
దేశంలో ప్రస్తుతం అత్యంత కీలకంగా మారిన ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం అనేక చర్యలకు ఉపక్రమించింది. ఎన్నికలు జరుగుతున్న యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిశీలకులను నియమించిన విషయం తెలిసిందే. ఆధునిక సాంకేతిక సౌకర్యాలను కూడా ఈ పరిశీలకుల అందుబాటులోకి తేవాలని నిర్ణయించిన ఈసీ వారందరికీ ఆయా రాష్ట్రాల్లోని లోకల్ మొబైల్ సిమ్ లు, వాటికవసరమైన స్మార్ట్ ఫోన్లను ఇవ్వడంతో పాటు వాటి ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల తీరుతెన్నులను పరిశీలించాలని ఈసీ తాజాగా నిర్ణయించింది. సాధారణ ఎన్నికల పరిశీలకులు, పోలీసు ఉన్నతాధికారులు, ఆయా పార్టీలు పెట్టే వ్యయాన్ని పర్యవేక్షించడానికి మూడు విధానాల్లో నియమించిన ఈ ఎన్నికల అధికారులకు ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రత్యేకాధికారులు (సీఈవో), కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు అందరితో కలిపి ఒక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల సంఘమే ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి ఎన్నికల నిమిత్తం నియమించిన అధికారులందరినీ ఆ గ్రూపులో చేరుస్తారు. గతంలో ఎన్నికలు జరిగిన సందర్భాల్లో అత్యవసరమైన విషయాలను ఈ మెయిల్స్ ద్వారా లేదా ఫాక్స్ ద్వారా ఎన్నికల సంఘానికి చేరవేసేవారు. ఇప్పుడు అలా కాకుండా అత్యవసర సమాచారం, ముఖ్యమైన ఘటన చోటుచేసుకున్నప్పుడు ఆ వివరాలను ఎప్పటికప్పుడు ఆ వాట్సాప్ గ్రూపులో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తేవాలి. ఈ గ్రూపు ద్వారా వచ్చే సమాచారం మేరకు తీసుకోవలసిన చర్యలపై ఎన్నికల అధికారులు మరింత అప్రమత్తం చేస్తారు. అయితే టాప్ సీక్రెట్ సమాచారం గానీ సున్నితమైన సమాచారం గానీ ఈ గ్రూపుల్లో పోస్టు చేయరాదని కట్టడి విధించారు. ఈ గ్రూపు కేవలం ఎన్నికల వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేయడానికే తప్ప ఇతరత్రా దుర్వినియోగం కారాదని కూడా ఈసీ స్పష్టంచేసింది. అనేక మంది అధికారులు తమ మధ్య ఉన్న పరిచయాలతో సోది కబుర్లు చెప్పుకోవడం, పనికిమాలిన విషయాలను పోస్టు చేయడం, పొద్దున్నే హలో... హాయ్... అంటూ మెసేజీలు పెట్టరాదని ఎన్నికల సంఘం అధికారులందరికీ గురువారం జారీచేసిన ఆదేశాల్లో స్పష్టంచేసింది. -
ఎన్నికల ఎఫెక్ట్: బడ్జెట్ వాయిదాపై ఈసీ చర్యలు
న్యూఢిల్లీ: ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌ను వాయిదా వేయాలన్న విపక్షాల డిమాండ్‌పై ఎన్నికల సంఘం స్పందించింది. ప్రాథమిక చర్యగా ‘విపక్షాల అభ్యర్థనపై మీ స్పందన తెలపండి..’ అంటూ కేంద్ర కేబినెట్ కార్యదర్శికి శనివారం లేఖరాసింది. ఒకవేళ ఎన్నికలకు ముందే బడ్జెట్ నిర్వహిస్తే, ప్రభుత్వం ఓటర్లను ఆకర్షించేందుకు పథకాలను ప్రకటించే అవకాశాలు ఉంటాయని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు.. మార్చి 8(ఎన్నికల ప్రక్రియ తర్వాతే) బడ్జెట్ ప్రవేశపెట్టేలా కేంద్రాన్ని ఆదేశించాలని ఈసీని అభ్యర్థించిన దరిమిలా ఈ పరిణామం చోటుచేసుకుంది. (చదవండి: 'బడ్జెట్ ఆపించండి.. కుదరదు.. మేం పెడతాం') ఐదు రాష్ట్రాల(ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్) అసెంబ్లీలకు ఫిబ్రవరి 4 నుంచి మార్చి 8 వరకు ఎన్నికలు నిర్వహించేలా ఈసీ జనవరి 4న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. (మోగిన నగారా) అయితే నోటిఫికేషన్ ను పరిగణలోకి తీసుకోకుండా ముందుగా అనుకున్నట్లే ఫిబ్రవరి 1నే బడ్జెట్ ప్రవేశపెట్టేలా కేంద్రం కసరత్తు చేస్తోంది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విపక్షాలు ఈసీని ఆశ్రయించాయి. మరోవైపు ఇదే అంశంపై ఓ న్యాయవాది దాఖలు చేసిన పిల్‌ను ‘అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదు’ అంటూ సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది. (బడ్జెట్ ఆపే పిల్‌పై అర్జెంట్ లేదన్న సుప్రీం) నేటి ఈసీ లేఖకు మోదీ సర్కార్ స్పందన వెలువడాల్సిఉంది. -
ఎన్నికల ఎఫెక్ట్: బడ్జెట్ వాయిదాపై ఈసీ చర్యలు
-
పనిలో పనిగా ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా...
న్యూఢిల్లీ, సాక్షి: ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూలును ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూలును కూడా విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ రాష్ట్రాల్లో 11 ఎమ్మెల్సీ స్థానాలు గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లోనే ఖాళీ అయ్యాయి. ఉత్తరప్రదేశ్ 3 గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు, 2 ఉపాధ్యాయ నియోజకవర్గాలు, మహారాష్ట్రలో 3 ఉపాధ్యాయ స్థానాలు, 2 గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు కర్నాటక రాష్ట్రంలోని దక్షిణ-తూర్పు కర్నాటక టీచర్స్ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన సభ్యుడు రాజీనామా కారణంగా ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ 11 ఖాళీల భర్తీ కోసం ఎన్నికలకు జనవరి 1 న నోటిఫికేషన్ జారీ కానుంది. ఫిబ్రవరి 3న ఎన్నికలు నిర్వహించి 6 వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. -
ఐదు రాష్ట్రాల ఎన్నికలు: ఈసీ మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల కమిషన్ బుధవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన తేదీలతోపాటు అనుసరించనున్న మార్గదర్శకాలనూ వెల్లడించింది. (ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల) ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లోని అన్ని కుటుంబాలకూ తొలిసారిగా ‘ఓటర్ గైడ్’ బుక్‌లెట్‌ను అందించనున్నారు. ఓటింగ్ కంపార్ట్మెంట్(చుట్టూ తెరలతో ఈవీఎంలు ఉండే చోట) ఎత్తును 30 ఇంచులు పెంచుతున్నట్లు ఈసీ ప్రకటించింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఈసీ వెల్లడించిన మార్గదర్శకాల్లో కొన్ని ముఖ్యాంశాలాలివి.. ► ఐదు రాష్ట్రాల్లో ఏకబిగిన ఎన్నికలు నిర్వహింస్తారు. నోటిఫికేషన్ వెలువడిన బుధవారం నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుంది. ► ఐదు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 16 కోట్ల మంది ఓట్లు ఉన్నారు. ► ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లోని ప్రతి ఇంటికి(కుటుంబానికి) ఒక ఓటర్ గైడ్(బుక్లెట్)ను అందిస్తారు. కలర్‌ఫుల్ పేజీలతో ముద్రించిన ఈ బుక్‌లెట్‌లో ఓటు విలువ, ఓటు వేయాల్సిన అవసరత, పోలింగ్ స్టేషన్లో నడుచుకోవాల్సిన తీరు తదితర సూచనలు పొందుపర్చారు. ► ఓటింగ్ కంపార్ట్మెంట్(ఈవీఎంలు ఉండే చోటు) ఎత్తును 30 ఇంచులు పెంచారు. దీంతో ఓటు వేసేందుకు లోపలికి వెళ్లినవారికి.. బూత్‌లోనే కూర్చొని ఉండే ఏజెంట్లుగానీ, ఇతరులుగానీ సంజ్ఞలు చేసే అవకాశం ఉండదు. తద్వారా రహస్య ఓటింగ్ ప్రక్రియ పకడ్బందీగా అమలవుతుందని ఈసీ పేర్కొంది. ► ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒటింగ్ ప్రక్రియకు సంబంధిచిన 4 పోస్టర్లను అంటించి ఉంచుతారు. ► ఐదు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 1లక్షా 85 వేల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటుచేయనున్నారు. ► మహిళల కోసం ప్రత్యేక పోలింగ్ స్టేషనల్ లను ఏర్పాటుచేస్తారు. ► ఎన్నికల ప్రచారంలో రాజకీయపార్టీలు ప్లాస్టిక్ వినియోగించరాదని, ఎక్కువ శబ్దాన్నిచ్చే లౌడ్స్పీకర్లు, టపాసులు పేల్చడంలాంటివి కూడదని ఈసీ సూచించింది. ఈ ఎన్నికల ప్రక్రియ అంతటా ఈసీ పర్యావరణహిత వస్తువులను మాత్రమే వినయోగిస్తుందని సీఈసీ నజీంజైదీ చెప్పారు. ► ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఒక్కొక్కరు గరిష్టంగా రూ.28 లక్షలకు మించి ఎన్నికల ప్రచారానికి వినియోగించరాదు. అదే గోవా, మణిపూర్లలోనైతే ఆ పరిమితి రూ.20 లక్షలే. ► సొంత టీవీ చానెళ్లు కలిగిన నేతలు, పార్టీలపై ఈసీ ప్రత్యేక నిఘా పెడుతుంది. టీవీల్లో ప్రసారం అయ్యే యాడ్లను కూడా అభ్యర్థుల ఖర్చుకిందే పరిగణిస్తారు. అలాగే పత్రికల్లో వచ్చే ప్రకటనలను గుర్తించేందుకు ఈసీ.. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహకారం తీసుకోనుంది. ► పంజాబ్, గోవా రాష్ట్రాల్లో ఒకే విడతలో ఫిబ్రవరి 4న పోలింగ్ జరుగుంది. ► ఉత్తరాఖండ్‌లో ఒకే విడత ఫిబ్రవరి 15న పోలింగ్ జరుతుంది. ► మణిపూర్‌లో రెండు విడదలుగా.. మార్చి 4, మార్చి 8న పోలింగ్ ఉంటుంది. ► పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 11, 15, 19, 23, 27, మార్చి 4, మార్చి 8 తేదీల్లో పోలింగ్ నిర్వహిస్తారు. ► ఐదు రాష్ట్రాల ఎన్నికల కు సంబంధించిన ఓట్ల లెక్కింపు మార్చి 11న ప్రారంభం అవుతంది. అదేరోజు ఫలితాలు వెల్లడవుతాయి. -
ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు
న్యూఢిల్లీ, సాక్షి: నోట్ల రద్దు అంశంపై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్న తరుణంలో అయిదు రాష్ట్రాల ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీలన్నింటికీ కీలకంగా మారాయి. దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. పదవీ కాలం ముగుస్తున్న అయిదు రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖంఢ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఎన్నికల షెడ్యూలును ప్రకటించింది. అయిదు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటిల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 403 స్థానాలున్నాయి. ఆ తర్వాత స్థానంలో పంజాబ్ అసెంబ్లీ 117, ఉత్తరాఖంఢ్ 70, మణిపూర్ 60, గోవా 40 స్థానాలున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం 27 మే 2017 నాటికి పూర్తవుతుంది. అలాగే ఉత్తరాఖంఢ్ రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం 26 మార్చి 2017 నాటికి పూర్తవుతుండగా, మిగిలిన మూడు రాష్ట్రాలకు 18 మార్చి 2017 తో పూర్తవుతుంది. పదవీ కాలం పూర్తయ్యే ఆరు నెలల్లోగా ఎప్పుడైనా ఎన్నిక ప్రక్రియ ముగించాల్సి ఉన్నందున కేంద్ర ఎన్నికల సంఘం తాజా షెడ్యూలును ప్రకటించింది. -
హైదరాబాద్‌లో ఎందుకు వద్దన్నారు?
ఆంధ్రప్రదేశ్ కోటాలో జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలను హైదరాబాద్‌లో జరపొద్దని రాష్ట్ర శాసనసభ కార్యదర్శి ఎందుకు కోరినట్టు? రాజ్యసభ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించాల్సిన అసెంబ్లీ కార్యదర్శి ఆ రకంగా నిర్ణయానికి రావడానికి కారణాలేంటి.. అధికార టీడీపీ ఒత్తిళ్లకు లొంగే ఆయన ఆ నిర్ణయానికి వచ్చారా? ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం గత మే నెల 12న షెడ్యూలు ప్రకటించింది. అందుకు సంబంధించి 24న నోటిఫికేషన్ జారీచేసిన తర్వాత ఏపీ అసెంబ్లీకి ఇంచార్జి కార్యదర్శిగా ఉన్న సత్యనారాయణ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఒక లేఖ రాశారు. రాజ్యసభ ఎన్నికలను హైదరాబాద్‌లో కాకుండా విజయవాడలో నిర్వహించాలని అందులో కోరారు. అయితే ఆయన విజ్ఞప్తిని ఎన్నికల కమిషన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఆయన చెప్పిన కారణాలేవీ సహేతుకంగా లేవని తేల్చిచెప్పింది. ఇంతకు ఆయన చెప్పిన కారణాలేంటంటే... హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు సంబంధించిన అంశాల్లోగానీ ఇతరత్రా అంశాల్లోగానీ తెలంగాణ ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తోందని, ఆ కారణంగా ఎన్నికలను విజయవాడ కేంద్రంగా జరపాలన్నారు. విచిత్రమేమంటే... రాజ్యసభ ఎన్నికల నిర్వహణలో ఎక్కడా శాంతి భద్రతల అంశం ఉత్పన్నం కాదు. అసెంబ్లీకి ఎన్నికైన ప్రజాప్రతినిధులు మాత్రమే ఓటు వినియోగించుకుంటారు. పైగా రాష్ట్ర విభజన జరిగిన రెండేళ్ల నుంచి అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయి. శాసనసభ పరిధి మొత్తం స్పీకర్ ఆధీనంలో ఉంటుంది. శాంతి భద్రతలకు సంబంధించిన పోలీసు వ్యవస్థ అంతా ఏపీ ప్రభుత్వాధికారుల ఆధ్వర్యంలోనే ఉంటుంది. అమరావతిలో కనీస సదుపాయాలు కూడా లేవని ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అక్కడ ఏదైనా హోటల్లో లేదా మరేదైనా ప్రాంతంలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించుకోవాలని ఒకసారి ప్రయత్నం చేసి విఫలమైన విషయమూ తెలిసిందే. వీటన్నింటికి తోడు... హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైతే ఇరు రాష్ట్రాల గవర్నర్ ఇక్కడే కొలువై ఉన్నారు. పైగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు కూడా అదే సమయంలో ఎన్నికలు జరుగుతున్నందున శాసనసభ పరిధిలో అధికార పార్టీలు జోక్యం చేసుకోవడానికి వీలుండదు. అంతా కేంద్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం నడుచుకోవలసిందే. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించే అసెంబ్లీ కార్యదర్శికి వాటి నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకోవడానికి కావలసినన్ని అధికారాలూ ఉంటాయి. సాధారణంగా ఏ ఎన్నికల్లో అయినా అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి ఏవైనా అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు వాటిని పరిశీలించి ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుంది. కానీ రాజ్యసభ ఎన్నికల విషయంలో అలాంటిదేమీ జరగలేదు. కనీసం ఆ ఛాయలు కూడా ఎక్కడా కనిపించలేదు. ఏపీ అసెంబ్లీ కార్యదర్శి అత్యంత రహస్యంగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అది కూడా ఎన్నికల షెడ్యూలు విడుదలైన వెంటనే కాకుండా నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత లేఖ రాశారు. అందులోని ఆంతర్యమేంటో చూస్తే దిమ్మతిరిగిపోతుంది. ఓటుకు కోట్లే కారణమా... సరిగ్గా ఏడాది కిందట తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. శాసనసభ్యుల కోటాలో జరిగిన ఆ ఎన్నికల్లో తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కోట్లాది రూపాయలు ఎర చూపిన వైనం, 50 లక్షల రూపాయల నోట్లకట్టల బ్యాగుతో కెమెరాకు చిక్కిన ఘటన, ఆ వ్యవహారంలో చంద్రబాబు స్వయంగా స్టీఫెన్ సన్ తో ఫోన్ లో మాట్లాడిన ఆడియో టేపులు బయటకు పొక్కి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అలాంటి సంఘటనలు పునరావృతమవుతాయని చంద్రబాబు గానీ అధికార టీడీపీ నేతలు గానీ భయపడ్డారా? కొంతకాలంగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి 20 నుంచి 30 కోట్ల ఎరచూపి కొనుగోలు చేస్తున్నారని విమర్శలున్నాయి. అలా ఇప్పటికే 17 మంది ఎమ్మెల్యేలను చేర్పించుకున్న విషయం తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డిని ఓడించడానికి బలం లేకపోయినా చంద్రబాబు నాలుగో అభ్యర్థిని పోటీలోకి దింపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. విజయసాయి రెడ్డిని ఓడించి టీడీపీ నిలబెట్టే నాలుగో అభ్యర్థి గెలుపొందాలంటే మరో 19 మంది వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలి. నయానో భయానో ఏదో రకంగా 19 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టాలి. ఒకటి కాదు రెండు కాదు... 19 మంది మద్దతు కూడగట్టడానికి రూ. 200 కోట్ల వరకు వెచ్చించే స్థాయి ఉన్న నెల్లూరుకు చెందిన ఒక పారిశ్రామికవేత్తను బరిలోకి దింపి వ్యవహారం నడిపించాలన్న ప్రయత్నాలు జరిగినట్టు టీడీపీ నేతలే చెప్పుకొన్నారు. హైదరాబాద్‌లో సాధ్యపడదనే... ఇంతటి భారీ కొనుగోలు వ్యవహారం, రహస్య లావాదేవీలు, బెదిరింపు రాజకీయాలు హైదరాబాద్‌లో సాధ్యపడుతాయా అన్నది పక్కన పెడితే... ఏడాది కింద జరిగిన ఓటుకు నోటులో అడ్డంగా దొరికిపోయిన వైనం ఒక్కటే ఎన్నికల వేదికను విజయవాడకు మార్చడానికి పురికొల్పిందని రాజకీయాల్లో తలపండిన నేతలంతా చెబుతున్నారు. ఈ వ్యవహారంలో తమ చేతులకు మరకలు అంటొద్దని వ్యూహాత్మకంగా చంద్రబాబు అసెంబ్లీ కార్యదర్శిపై ఒత్తిడి తెచ్చి ఆయన ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయించినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా కార్యదర్శి ఆ పని చేసి ఉండరన్న సంగతిని పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అధికారి.. ఒక పార్టీకి ప్రయోజనం కలిగించే నిర్ణయాలు చేయొచ్చా అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ కార్యదర్శి అభ్యర్థనను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించడంతో విజయసాయి రెడ్డిని ఓడించడానికి అప్పటివరకు విజయవాడ కేంద్రంగా సాగిన కుట్రకు ఒక రకంగా బ్రేక్ పడినట్టయింది. రాజ్యసభ ఎన్నికల నామినేషన్లకు గడువు 31తో ముగిసిపోతోందనగా.. 29న మహానాడు ముగిసిన తర్వాత తిరుపతిలో, 30న విజయవాడలో చంద్రబాబు పార్టీ నేతలు, వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో సమాలోచనలు చేసి నాలుగో అభ్యర్థిని పోటీ దించాలని నిర్ణయించారు. ఎన్నికల నిర్వహణను విజయవాడకు మార్చడానికి వీలులేదని సరిగ్గా 30వ తేదీ సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు రాయడంతో మొత్తం కుట్రకు బ్రేక్ పడినట్టయింది. సరిగ్గా ఆ సమయానికి నాలుగో అభ్యర్థిని నిలబెట్టడంపై చంద్రబాబు నాయుడు విజయవాడలో ఫిరాయించిన ఎమ్మెల్యేలతో సమావేశంలో ఉన్నారు. ఆ సమావేశంలో ఉండగానే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అందిన లేఖ విషయాన్ని అసెంబ్లీ అధికారులు తెలియజేయడంతో ఇక చంద్రబాబు చేసేది లేక... మీరంతా హైదరాబాద్ వెళ్లండి... రేపు మాట్లాడుదాం... అంటూ ఆ సమావేశాన్ని వాయిదా వేశారని ఒక సీనియర్ నేత వివరించారు. -
రాజ్యసభ నుంచి ఆ నలుగురు అవుట్
తెలుగు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జైరాం రమేష్ (ఏపీ), జేడీ శీలం (ఏపీ), వీ హనుమంతరావు (తెలంగాణ)లకు తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశాలు ఏమాత్రం లేవు. వచ్చే జూన్ 21తో వీరందరి పదవీ కాలం ముగుస్తోంది. వీరితో పాటు తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న గుండు సుధారాణికి కూడా మరో అవకాశం లేనట్టే. టీడీపీకి చెందిన ఆమె ఆ తర్వాత కాలంలో టీఆర్ఎస్లో చేరడానికి ప్రయత్నాలు చేయడంతో పాటు టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్ (బీజేపీ), యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) లతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన జైరాం రమేష్, జేడీ శీలం పదవీ విరమణ చేయనున్నారు. అలాగే తెలంగాణ నుంచి వీహెచ్, గుండు సుధారాణి రిటైర్ కాబోతున్నారు. వీరి స్థానంలో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ గురువారం షెడ్యూలు ప్రకటించింది. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి జూన్ 11న ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే ప్రస్తుతం ఏపీ శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి అసలు ప్రాతినిధ్యమే లేకపోవడంతో ఆ పార్టీ పోటీ చేయడానికి కూడా చాన్స్ లేదు. ఇకపోతే తెలంగాణలో టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మినహాస్తే మిగిలిన 14 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ రాజ్యసభ సీటును గెలుచుకునే అవకాశాలు లేవు. తెలంగాణలో ఏర్పడిన రెండు ఖాళీల్లో ఒక స్థానాన్ని గెలుచుకోవాలంటే కనీసం 40 తొలి ప్రాధాన్యత ఓట్లు రావాలి. టీడీపీలో మిగిలిన ముగ్గురు, లెఫ్ట్ పార్టీలకు చెందిన ఇద్దరిని కలుపుకొన్నా కాంగ్రెస్ కు ఏమాత్రం అవకాశం లేదు. శాసనసభలో ఆయా పార్టీలకు ఉన్న బలాబలాల మేరకు తెలంగాణలో ప్రస్తుతం ఖాళీ అయిన రెండు స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉండగా, ఏపీలో ఖాళీ అయిన నాలుగింటిలో మూడు స్థానాలు టీడీపీ, ఒక స్థానం వైఎస్సార్ కాంగ్రెస్ గెలుచుకోగలుగుతుంది. -
ఏపీ, తెలంగాణ రాజ్యసభ ఎన్నికలకు రంగం సిద్ధం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే జూన్ లో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల భర్తీ కోసం త్వరలోనే షెడ్యూలు విడుదల కానుంది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో వచ్చే కొద్ది కాలంలో ఖాళీ అయ్యే స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, నాగాలాండ్, త్రిపుర, పంజాబ్ రాష్ట్రాల నుంచి వచ్చే ఏప్రిల్ లో ఖాళీ అవుతున్న 13 స్థానాలను భర్తీ చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ గురువారం షెడ్యూలు విడుదల చేసింది. అస్సాం (2), హిమాచల్ ప్రదేశ్ (1), కేరళ (3), నాగాలాండ్ (1), త్రిపుర (1), పంజాబ్ (5) రాష్ట్రాల్లో 13 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం వచ్చే ఏప్రిల్ లో పూర్తవనుంది. ఆ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికల నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూలు ప్రకటించింది. ఈ ఎన్నికల నిర్వహణకు మార్చి 4 న నోటిఫికేషన్ జారీ కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఈ స్థానాలకు మార్చి 21 న పోలింగ్ నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పదవీ కాలం పూర్తవుతున్న సభ్యుల స్థానంలో ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. కొద్ది రోజుల్లోనే ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూలు విడుదల చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి సుజనా చౌదరి (టీడీపీ), నిర్మలా సీతారామన్ (బీజేపీ), జైరాం రమేశ్ (కాంగ్రెస్), జేడీ శీలం (కాంగ్రెస్)ల పదవీకాలం జూన్ 21తో పూర్తవుతోంది. అలాగే తెలంగాణలో వీ హన్మంతరావు (కాంగ్రెస్), గుండు సుధారాణి (టీడీపీ - తర్వాత టీఆర్ఎస్ లో చేరారు)ల పదవీ కాలం కూడా అదే సమయానికి పూర్తవుతోంది. -
నల్లగొండ బరిలో నువ్వా నేనా..
ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల పర్వం హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు చేతులెత్తేశాయి. నిన్నమొన్నటి వరకు హడావిడి చేసిన పార్టీలు అనేక చోట్ల అసలు నామినేషన్లు కూడా దాఖలు చేయలేదు. తెలంగాణలో స్థానిక సంస్థల ప్రతినిధుల ద్వారా ఎన్నుకునే ఎమ్మెల్సీ ఎన్నికలకు బుధవారం సాయంత్రంతో నామినేషన్ల ఘట్టం ముగిసింది. మొత్తం 12 స్థానాలకు గాను అధికార టీఆర్ఎస్ అన్నింటికీ నామినేషన్లు వేసింది. మిగతా పార్టీలు కొన్ని జిల్లాలకే పరిమితమయ్యాయి. కాంగ్రెస్ 5 చోట్ల మాత్రమే బరిలో నిలిచింది. టీడీపీదీ అదే పరిస్థితి. బీజేపీ అసలు ఈ ఎన్నికల బరిలోనే లేదు. ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను బట్టి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో పోటీ రసవత్తరంగా సాగే అవకాశాలున్నాయి. నల్లగొండలో కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా ఒక నామినేషన్ దాఖలైనా ఆ ప్రభావం కాంగ్రెస్ పై ఉండదని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు తెలంగాణ శాసనమండలిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా పెంచాల్సి ఉన్న నేపథ్యంలో కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల స్థానిక సంస్థల్లో అదనంగా ఒక్కో స్థానాన్ని పెంచిన విషయం తెలిసిందే. మొత్తంగా 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, ఈ స్థానాలన్నీ గతమే ఒకటి నుంచి ఖాళీగా ఉన్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. గురువారం నామినేషన్ల పరిశీలన పూర్తి చేస్తారు. 12 వ తేదీ వరకు ఉపసంహరణకు గడువుంది. ఈనెల 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వీటికి పోలింగ్ నిర్వహిస్తారు. 30వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది. బరిలో నిలిచింది వీరే... రంగారెడ్డి (2 స్థానాలు): పట్నం నరేందర్ రెడ్డి (టీఆర్ఎస్), శంభీపూర్ రాజు (టీఆర్ఎస్), ఎ. చంద్రశేఖర్ (కాంగ్రెస్), దారా సింగ్ (కాంగ్రెస్), బుక్కా వేణుగోపాల్ (టీడీపీ), కొత్త అశోక్‌గౌడ్ (ఎంపీటీసీల ఫోరం). కరీంనగర్ (2 స్థానాలు): నారదాసు లక్ష్మణరావు (టీఆర్ఎస్), భానుప్రసాదరావు (టీఆర్ఎస్), మునిపాక తిరుపతిరావు (స్వతంత్ర), ముద్దసాని రంగయ్య (స్వతంత్ర), తాటిపాముల రాజు (స్వతంత్ర), ముత్యాల ప్రియారెడ్డి (స్వతంత్ర), సిరిసిల్ల ప్రసాద్ (స్వతంత్ర). మహబూబ్‌నగర్ (2 స్థానాలు): ఎస్.జగదీశ్వర్‌రెడ్డి (టీఆర్ఎస్), కె.నారాయణరెడ్డి (టీఆర్ఎస్), కె.దామోదర్‌రెడ్డి (కాంగ్రెస్), కె.దయాకర్‌రెడ్డి (టీడీపీ), కె.శ్రీనివాసాచారి (స్వతంత్ర), బోళ్ల కరుణాకర్ (స్వతంత్ర), జగదీశ్వర్‌రెడ్డి (స్వతంత్ర). ఆదిలాబాద్ (1 స్థానం): పురాణం సతీష్‌కుమార్ (టీఆర్ఎస్), రియాజుద్దీన్ (ఎంపీటీసీల ఫోరం), ఐ.నారాయణ రెడ్డి (టీడీపీ), నల్లగొండ (1 స్థానం): తేరా చిన్నపరెడ్డి (టీఆర్ఎస్), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (కాంగ్రెస్), సాదినేని శ్రీనివాసరావు (టీడీపీ), మిట్ట పురుషోత్తమరెడ్డి (స్వతంత్ర). నిజామాబాద్ (1 స్థానం): ఆర్.భూపతిరెడ్డి (టీఆర్ఎస్), కె.వెంకట రమణారెడ్డి (కాంగ్రెస్), బి.జగదీష్ (ఎంపీటీసీల ఫోరం). ఖమ్మం (1 స్థానం): బాలసాని లక్ష్మీనారాయణ (టీఆర్ఎస్), పువ్వాడ నాగేశ్వరరావు (సీపీఐ), లింగాల కమల్‌రాజ్ (వైఎస్సార్సీపీ), జి. లక్ష్మీనారాయణ (స్వతంత్ర), కె.లక్ష్మీనారాయణ (స్వతంత్ర). వరంగల్ (1 స్థానం): కొండా మురళి (టీఆర్ఎస్) మహబూబ్ రెడ్డి (స్వతంత్ర), చంద్రమౌళి (స్వతంత్ర), మోడెం మల్లేష్ (స్వతంత్ర), ఎ.నరేందర్‌రెడ్డి (టీడీపీ), రంగరాజు రవీందర్ (స్వతంత్ర). మెదక్ (1 స్థానం): వి. భూపాల్‌రెడ్డి (టీఆర్ఎస్), శివరాజ్ పాటిల్ (కాంగ్రెస్) , కొన్యాల బాల్‌రెడ్డి (టీడీపీ). -
కాంగ్రెస్, టీడీపీలు ఏకమై...
టీపీసీసీ నేతలతో టీటీడీపీ నాయకుల సమావేశం హైదరాబాద్ శత్రువు శత్రువు మిత్రుడన్నట్టు... రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. దశాబ్దాల కాలంగా బద్ధశత్రువులైన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలు మార్చుకుంటున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ను ఎదుర్కొనడానికి బద్ధ శత్రువులైన కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటయ్యే ప్రయత్నాలు మొదలయ్యాయి. స్థానిక సంస్థల నుంచి ఎన్నికయ్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి పనిచేద్దామని పరస్పరం ప్రతిపాదించాయి. తెలంగాణ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈ నెల 2 న ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణలోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, మొత్తం స్థానాలను గెలుచుకోవాలని అధికార టీఆర్ఎస్ వ్యూహం పన్నుతోంది. ఇటీవల వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ఘోర పరాభవం నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు కొత్త పొత్తులపై దృష్టి సారించాయి. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి పనిచేద్దామన్న ప్రాతిపదికన కొన్ని సీట్లను గెలుచుకోవడానికి కలిసి పనిచేద్దామని టీడీపీ నేతలు కాంగ్రెస్ నాయకుల ముందు ప్రతిపాదించారు. తెలంగాణ పీసీసీ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని సోమవారం టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు మరికొందరు నేతలు కలిసి ఈ ప్రతిపాదన చేశారు. దీనిపై వారు కొద్దిసేపు చర్చలు జరిపినట్టు తెలిసింది. కలిసి పనిచేయడం వల్ల రంగారెడ్డి, మహబూబ్‌నగర్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించవచ్చని, అందుకు ఒక అంగీకారానికి రావాలని టీడీపీ నేతలు కోరారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల 9వ తేదీతో నామినేషన్ల గడువు పూర్తవుతోంది. డిసెంబర్ 27న పోలింగ్ జరుగుతుంది. తెలంగాణలోని స్థానిక సంస్థల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానం, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండేసి స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, టీడీపీలు కలిస్తే రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లలో ఒక్కో స్థానం గెలుచుకునే అవకాశం ఉన్నందున రెండింటిలో మహబూబ్‌నగర్ స్థానంలో తమకు మద్దతునివ్వాలని టీటీడీపీ నేతలు కోరినట్టు తెలిసింది. ఇదే అంశంపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లా నేతలను సంప్రదించగా, వారు ఈ ప్రతిపాదనను ఏకగ్రీవంగా వ్యతిరేకించారు. దాంతో ఏం చేయాలో నేతలకు పాలుపోలేదు. నామినేషన్లు దాఖలు చేయడానికి మరో రెండు రోజులు గడువు ఉన్నందున మంగళవారం మరోసారి సమావేశం కావాలన్న నిర్ణయానికి ఆ నేతలు వచ్చినట్టు తెలిసింది. -
నందమూరి హరికృష్ణకు అవకాశం లేనట్టే...
టీడీపీ నాయకుడు నందమూరి హరికృష్ణకు ఈసారి రాజ్యసభ టికెట్ విషయంలో నిరాశే మిగలనుందా? గత పార్లమెంట్లో రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన హరికృష్ణ వచ్చే ఎన్నికల్లో తనకు మరోసారి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే తన బంధువు, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో చర్చించారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు సానుకూలంగా స్పందించలేదని తెలిసింది. హరికృష్ణ మొదటిసారిగా 2008 ఏప్రిల్‌లో రాజ్యసభకు ఎంపికయ్యారు. అయితే 2014 సాధారణ ఎన్నికలకు ముందు రాష్ట్ర విభజన అంశం తెరపైకి వచ్చిన సందర్భంగా సమైక్యాంధ్ర కోరుతూ హరికృష్ణ 2013 ఆగస్టులో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన పదవీ కాలం ముగియడానికి ఏడు నెలల ముందుగానే రాజీనామా చేయగా, వచ్చే మార్చిలో జరగబోయే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఇటీవలే చంద్రబాబు కలిసి కోరారు. నాలుగు ఖాళీలు 2016 జూన్ 21 నాటికి ఏపీ నుంచి రాజ్యసభ స్థానాలు నాలుగు ఖాళీ అవుతున్నాయి. ప్రస్తుత కేంద్ర మంత్రులు వైఎస్ చౌదరి (సుజనా చౌదరి) (టీడీపీ), నిర్మలా సీతారామన్ (బీజేపీ), కాంగ్రెస్‌కు చెందిన జైరాం రమేష్, జేడీ శీలం పదవీ కాలం పూర్తికానుంది. వీరిలో సుజనా చౌదరికి మరోసారి అవకాశం కల్పించాలని చంద్రబాబు కుమారుడు లోకేష్ పట్టుదలతో ఉన్నారు. నిర్మలా సీతారామన్ 2014 రాజ్యసభ ఉపఎన్నికలో ఎన్నికయ్యారు. రెండేళ్లపాటే సభ్యురాలిగా ఉన్నందున బీజేపీ జాతీయ నాయకత్వం ఆమెకు మరోసారి అవకాశం కల్పించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఏపీ శాసనసభలో కాంగ్రెస్‌కు అసలు ప్రాతినిథ్యమే లేకపోవడం కారణంగా ఇక ఆ పార్టీ నుంచి ఎన్నికైన జైరాం రమేష్, జేడీ శీలంకు ఏరకంగానూ ఛాన్స్ లేదు. శాసనసభలో పార్టీల బలాబలాలను బట్టి ఖాళీ అయ్యే మొత్తం నాలుగు స్థానాల్లో మూడింటిని టీడీపీ, బీజేపీ మిత్రపక్షాలు సాధించుకునే అవకాశం ఉండగా మరో స్థానం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలుగుతుంది. బీజేపీ అభ్యర్థి నిర్మలా సీతారామన్‌తో పాటు సుజనా చౌదరి పేర్లు దాదాపు ఖాయమైన నేపథ్యంలో మరో స్థానం మాత్రమే టీడీపీ గెలుచుకోగలదు. హరికృష్ణకు చాన్స్ లేనట్టే... రాజ్యసభ స్థానంపై హరికృష్ణ ఎంతో నమ్మకంతో ఉన్నప్పటికీ ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని సీనియర్లు చెబుతున్నారు. ఈసారి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అంతా లోకేష్ కనుసన్నల్లో కొనసాగుతోందని, తన మామ నందమూరి బాలకృష్ణ ఇప్పటికే ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా, ఒకే కుటుంబం నుంచి మరొకరికి అవకాశం ఇవ్వరని అంటున్నారు. ఇలావుండగా, పార్టీలో ఎంతో సీనియర్ అయిన హరికృష్ణ రాజ్యసభ టికెట్ విషయంలో ఎంతో జూనియర్ అయిన లోకేష్‌ను కలిసి అడగడానికి ఏమాత్రం సిద్ధంగా లేరని సన్నిహితులు చెబుతున్నారు. -
మార్చి 4న ఎన్నికల నోటిఫికేషన్ ?