ప్రలోభ పెడితే చర్యలు: భన్వర్‌లాల్
హైదరాబాద్ : ఈ నెల 13వ తేదీన తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఐదు, తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు గ్యాడ్యుయేట్, రెండు టీచర్స్ నియోజకవర్గాలకు, అలాగే తెలంగాణలో ఖాళీ కాబోతున్న టీచర్స్ నియోజకవర్గానికి ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే, ఈ నెల 23న అభ్యర్ధుల తుదిజాబితా విడుదల చేస్తామని ఆయన తెలిపారు.
మార్చి 9 వ తేదీన ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ఓట్ల లెక్కింపు మార్చి 15 వ తేదీన చేపడుతామని వివరించారు. అయితే, ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల నియమావళి అమలును పరిశీలించేందుకు ప్రతి మండలానికి రెండు టీంలు ఏర్పాటు చేయనున్నామన్నారు. బ్యాలెట్ పేపర్ పై ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ లో గ్రాడ్యుయేట్ ఓటర్ల వివరాలు:
- శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ
గ్రాడ్యుయేట్ ఓటర్లు: 155094
పోలింగ్ స్టేషన్ : 224
- ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు
గ్రాడ్యుయేట్ ఓటర్లు: 220554
పోలింగ్ స్టేషన్ : 283
- కడప, అనంతపురం, కర్నూలు
గ్రాడ్యుయేట్ ఓటర్లు: 250734
పోలింగ్ స్టేషన్ : 336
టీచర్స్ ఓటర్ల వివరాలు :
- ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు
టీచర్స్ ఓటర్లు: 20290
పోలింగ్ స్టేషన్ :176
- కడప, అనంతపురం, కర్నూలు
టీచర్స్ ఓటర్లు : 20262
పోలింగ్ స్టేషన్ : 171
తెలంగాణలో టీచర్స్ ఓటర్ల వివరాలు :
- మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్
టీచర్స్ ఓటర్లు : 23013
పోలింగ్ స్టేషన్ : 126