లోక్‌సభ ఎన్నికల కోసం వివిధ రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి కీలక సూచన చేసింది. బహిరంగ ప్రసంగాలలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేసినట్లు తెలిసింది.
గతేడాది నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో సహా బీజేపీ నేతలపై విమర్శల సందర్భంగా రాహుల్ గాంధీ కొన్ని తీవ్రమైన పదాలను ఉపయోగించిన సంగతి తెలిసిందే. దీంతో రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆయనకు ఈసీఐ నోటీసులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ అయిన రాహుల్ గాంధీకి మార్చి 1న కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రచారాలలో ఈసీఐ సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరింది. ఇటీవల జరిగిన ఎన్నికలలో రాజకీయ ప్రచార ప్రసంగాలు హద్దులు మీరుతున్నట్లు గుర్తించిన ఈసీఐ ప్రసంగాలలో సంయమనం పాటించాలని గతం వారం కొన్ని సూచనలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment