శత్రువులతో కాంగ్రెస్ కుమ్మక్కయింది: యోగి ఆదిత్యనాథ్ | Pak Minister Post On Rahul Gandhi Says Yogi Adityanath | Sakshi
Sakshi News home page

శత్రువులతో కాంగ్రెస్ కుమ్మక్కయింది: యోగి ఆదిత్యనాథ్

Published Fri, May 3 2024 2:45 PM | Last Updated on Fri, May 3 2024 2:59 PM

Pak Minister Post On Rahul Gandhi Says Yogi Adityanath

లక్నో: దేశంలో రెండు దశల లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా ఐదు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ రాయ్‌బరేలీ, అమేథీ అభ్యర్థులుగా రాహుల్ గాంధీ, కెఎల్ శర్మలను ప్రకటించింది. అయితే కాంగ్రెస్ మీద 'యోగి ఆదిత్యనాథ్' కీలక వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ గాంధీకి మద్దతుగా.. మాజీ మంత్రి, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) నాయకుడు ఫవాద్ చౌదరి చేసిన వైరల్ పోస్ట్‌ను ప్రేరేపిస్తూ, దేశ బద్ధ శత్రువులతో కాంగ్రెస్ కుమ్మక్కయ్యిందనడానికి ఈ పోస్ట్ నిదర్శనమని యోగి అన్నారు. ప్రధానమంత్రి మోదీ సృష్టించిన పురోగతి, సానుకూల వాతావరణాన్ని నాశనం చేయడానికి మన శత్రువులు ఎంతటికైనా తెగించడానికి ఇది ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు.

దేశం మొత్తం ప్రధాని మోదీకి అండగా నిలుస్తున్న తరుణంలో.. మన బద్ద శత్రువులు రాహుల్‌గాంధీకి మద్దతుగా నిలిచేందుకు ఎంతటి కఠోరమైన ప్రయత్నాలు చేస్తున్నారో చూడవచ్చు. భారత శత్రువులతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. ప్రజలను మతాల వారీగా విభజించడానికి కూడా ప్రయత్నిస్తోందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. బుజ్జగింపు రాజకీయాలే దేశ భద్రతకు ముప్పు కలిగిస్తాయని యోగి అన్నారు.

గత 10 ఏళ్లలో తీవ్రవాదం, నక్సలిజాన్ని అరికట్టడానికి ప్రధాని మోదీ కృషి చేశారు. ప్రజలు ప్రధాని వెంట ఉన్నారు.  జరగనున్న ఎన్నికల్లో అమేథీ, రాయ్‌బరేలీ, కన్నౌజ్‌లలో కూడా బీజేపీ గెలుస్తుందని అన్నారు. తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉందని యోగి పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement