పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్ | Rahul Gandhi Perform Pooja at Congress Office | Sakshi
Sakshi News home page

పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్

May 3 2024 9:50 PM | Updated on May 3 2024 9:54 PM

Rahul Gandhi Perform Pooja at Congress Office

కాంగ్రెస్‌ కీలక నేత రాహుల్‌ గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీకి సిద్ధం అయ్యారు. శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ రాయ్‌బరేలీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాహుల్‌ గాంధీ పేరును అధికారికంగా ప్రకటించింది. అమేథీ నుంచి కిషోరీలాల్‌ శర్మను బరిలో దించింది.

రాహుల్ గాంధీ రాయ్‌బరేలి ఎంపీ సీటుకు పోటీ చేస్తున్నట్లు నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఈ సమయంలో ఆయన వెంట తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంకగాంధీ వాద్రా, రాబర్ట్ వాద్రా ఉన్నారు. రాయ్‌బరేలి జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు.

నామినేషన్ వేయడానికి ముందు రాహుల్‌గాంధీ ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ, రాబర్ట్‌ వాద్రా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement