ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలపై బహిరంగ చర్చలో పాల్గొనాలని కోరుతూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో సహా కొంతమంది ప్రముఖులు ఇటీవల మోదీ, రాహుల్ గాంధీలకు లేఖ రాశారు. ఆ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, ప్రధాని అందుకు అంగీకరించరని రాహుల్ గాంధీ అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చకు సిద్ధమైన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై బీజేపీ అధికార ప్రతినిధి 'సుధాన్షు త్రివేది' కీలక వ్యాఖ్యలు చేశారు. సమస్యలపై ఆయనకున్న అవగాహనను, ఆయన స్థితిగతులను త్రివేది ప్రశ్నించారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి గెలుస్తుందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపైన సుధాన్షు త్రివేది విరుచుకుపడ్డారు. అమేథీ నుంచి నామినేషన్ దాఖలు చేయలేని వ్యక్తి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గురించి మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 'మీ పేరు రాహుల్ గాంధీ' అని ఎగతాళిగా అన్నారు
2019 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన రాహుల్ గాంధీ ఈసారి రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. రాయ్‌బరేలీలో బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ బరిలో ఉన్నారు. అయితే అమేథీ నుంచి రాహుల్ గాంధీ కుటుంబానికి సన్నిహితుడు కిషోరీ లాల్ శర్మ పోటీ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment