న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం ప్రకటించింది. మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్నికల షెడ్యూల్‌ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
మహారాష్ట్రలో ఒకే దశలో పోలింగ్
- అక్టోబర్ 22న నోటిఫికేషన్
- నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ- అక్టోబర్ 29
- అక్టోబర్ 30న స్క్రూటినీ
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ- నవంబర్ 4
- నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు
- నవంబర్ 23న ఫలితాల వెల్లడి
రెండు విడతల్లో జార్ఖండ్ ఎన్నికల పోలింగ్
- తొలి దశ పోలింగ్‌కు సంబంధించి
- అక్టోబర్ 18న నోటిఫికేషన్
- నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ- అక్టోబర్ 25
- అక్టోబర్ 28న స్క్రూటినీ
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 30
- నవంబర్ 13న పోలింగ్
- నవంబర్ 23న ఫలితాల వెల్లడి
రెండో దశ పోలింగ్‌కు సంబంధించి
- అక్టోబర్ 22న నోటిఫికేషన్
- నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ- అక్టోబర్ 29
- అక్టోబర్ 30న స్క్రూటినీ
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 1
- నవంబర్ 20న పోలింగ్
- నవంబర్ 23న ఫలితాల వెల్లడి
రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. హర్యానా, జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు విజయవంతంగా జరిగాయని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లో ఎలాంటి హింస లేకుండా ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయని చెప్పారు.
288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 26వ తేదీతో ముగుస్తుంది.
ఇక 81 స్థానాలతో కూడిన జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం 2025 జనవరి 5వ తేదీతో ముగుస్తుంది.
మహారాష్ట్రలో 9.63 కోట్ల ఓటర్లు
జార్ఖండ్‌లో మొత్తం ఓటర్లు 2.6 కోట్లు
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా 48 అసెంబ్లీ స్థానాలకు, 2 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. వీటి ఎఎన్నికల షెడ్యూల్‌ను కూడా ఈసీ ప్రకటించింది. ఆ తేదీల వివరాలు ..↓
Comments
Please login to add a commentAdd a comment