దేశంలో త్వరలో జరగనున్న లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. కృత్రిమ మేధస్సు (AI) పోలింగ్ ప్రక్రియకు అడ్డంకి కాకుండా ఎదుర్కొనేందుకు ‘చాట్‌జీపీటీ’ సృష్టికర్త ‘ఓపెన్ ఏఐ’ సాయం తీసుకుంటోంది.
ఈ మేరకు ఈసీఐ అధికారులు ఓపెన్ ఏఐ ప్రతినిధులతో ఇటీవల సమావేశం నిర్వహించారు. గత నెలలో జరిగిన ఈ సమావేశానికి భారత ఎన్నికల సంఘం కోసం ఓపెన్ ఏఐ ఒక ప్రజెంటేషన్‌ను సిద్ధం చేసింది. పోలింగ్ ప్రక్రియలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగం కాకుండా ఎలా అరికట్టాలో కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు ఎలక్షన్ కమిషన్‌కు సూచనలిచ్చారు.
ఈ సమావేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లోని పురోగతులను అధిక స్థాయిలో లోక్‌సభ ఎన్నికల సమయంలో దుర్వినియోగం కాకుండా చూసేందుకు బడా టెక్ కంపెనీలు, కేంద్ర సంస్థలు తీసుకోవాల్సిన చర్యల గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఓపెన్‌ఏఐ ప్రతినిధులు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment