
భారత ఎన్నికల సంఘం.. సార్వత్రిక ఎన్నికలకు శనివారం షెడ్యూల్ ప్రకటించింది. పోలింగ్ ఏప్రిల్ 19న ప్రారంభమై.. ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1 తేదీల్లో మొత్తం ఏడు దశల్లో జరుగుతుంది. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ఎన్నికల సంఘం పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంతో.. మొత్తం నియోజకవర్గాల సంఖ్య 544కి చేరుకుంది. దీనికి రాజీవ్ కుమార్ స్పష్టమైన వివరణ ఇచ్చారు.
నియోజకవర్గాల సంఖ్య 544కి చేరిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొత్త నియోజకవర్గాన్ని అదనంగా యాడ్ చేయలేదు. ఈశాన్య రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా మణిపూర్ నియోజకవర్గంలో రెండుసార్లు (ఇన్నర్ మణిపూర్, ఔటర్ మణిపూర్) ఓటింగ్ నిర్వహిస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.
ఇన్నర్ మణిపూర్‌లో మొదటి దశలో ఏప్రిల్ 19న పోలింగ్ జరుగుతుంది. ఔటర్ మణిపూర్‌లోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్‌లలో కూడా మొదటి దశలో పోలింగ్ జరగనుండగా, ఔటర్ మణిపూర్‌లోని మిగిలిన సెగ్మెంట్లకు ఏప్రిల్ 29న రెండవ దశలో ఎన్నికలు జరుగుతాయి.
ఇన్నర్ మణిపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. ఇందులో హీరోక్, వాంగ్జింగ్ టెన్థా, ఖంగాబోక్, వాబ్‌గై, కక్చింగ్, హియాంగ్లాం, సుగ్నూ, చందేల్, సైకుల్, కాంగ్‌పోక్పి, సైతు, హెంగ్లెప్, చురాచంద్‌పూర్, సైకోట్, సింఘత్ ఉన్నాయి.
ఔటర్ మణిపూర్ పరిధిలోని మిగిలిన 13 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్నాయి. అవి జిరిబామ్, తెంగ్నౌపాల్, ఫంగ్యార్, ఉఖ్రుల్, చింగై, కరోంగ్, మావో, తడుబి, తామీ, తమెంగ్లాంగ్, నుంగ్బా, తిపైముఖ్, థన్లోన్.