ఎలక్షన్ షెడ్యూల్ బీజేపీ ప్రయోజనం కోసమే!.. మండిపడ్డ విపక్షం | Seven Phase Voting Plan To Benefit For BJP Says Opposition | Sakshi
Sakshi News home page

ఎలక్షన్ షెడ్యూల్ బీజేపీ ప్రయోజనం కోసమే!.. మండిపడ్డ విపక్షం

Published Sun, Mar 17 2024 3:13 PM | Last Updated on Sun, Mar 17 2024 3:33 PM

Seven Phase Voting Plan To Benefit For BJP Says Opposition - Sakshi

భారత ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించింది. ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన ఏడు దశల ఓటింగ్ ప్రణాళిక అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ప్రయోజనం చేకూర్చే విధంగా ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు 'మల్లికార్జున్ ఖర్గే' పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ కూడా ఈ షెడ్యూల్‌ను విమర్శించింది.

మేము రాష్ట్రంలో ఒకటి లేదా రెండు దశల లోక్‌సభ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాము. కానీ ఎలక్షన్ కమీషన్ ఏడు ద‌శ‌ల్లో లోక్‌స‌భ ఎన్నిక‌ల పోలింగ్ చేప‌ట్ట‌డం వల్ల ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా విస్తృతంగా ప్ర‌చారం చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లయిందని ప్రతిపక్షాలు పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వచ్చే లోక్‌సభ ఎన్నికలే చివరి అవకాశం అని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఎక్స్(ట్విటర్)లో 2024 లోక్‌సభ ఎన్నికలు భారతదేశానికి న్యాయ్ తలుపును తెరుస్తాయి. ప్రజాస్వామ్యాన్ని, మన రాజ్యాంగాన్ని నియంతృత్వం నుంచి రక్షించడానికి ఇది బహుశా చివరి అవకాశం కావచ్చని పేర్కొన్నారు.

భారత ప్రజలమైన మనం అందరూ కలిసి ద్వేషం, దోపిడీ, నిరుద్యోగం, ధరల పెరుగుదల, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడదామని ఖర్గే అన్నారు. నేను దాదాపు 12 ఎన్నికల్లో పోటీ చేసాను. అప్పుడు నాలుగు దశలు కూడా లేవు. అయితే ఇప్పుడు ఎలక్షన్ కమీషన్ మోదీ ప్రచారం కోసం ఏడు దశలు పెట్టినట్లు అనిపిస్తోందని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement