న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధించిన కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏప్రిల్ 19 ఉదయం 7.00 నుంచి జూన్ 1 సాయంత్రం 6.30 గంటల వరకు లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ పూర్తయ్యేదాకా ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, ప్రచురించడం, ప్రచారం చేయడంపై నిషేధం విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం.. ఒపీనియన్ పోల్ లేదా మరేదైనా పోల్ సర్వే ఫలితాలను ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రదర్శించడం నిషేధమని నోటిఫికేషన్‌లో ఈసీఐ స్పష్టం చేసింది.
లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు 12 రాష్ట్రాల్లోని 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు విడివిడిగా ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment