ఎగ్జిట్‌ పోల్స్‌పై ఈసీ కీలక ఆదేశాలు | Election Commission of India Key Orders On Exit Polls | Sakshi
Sakshi News home page

రేపే ఎగ్జిట్‌ పోల్స్‌.. ఈలోపే కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

Published Fri, May 31 2024 6:42 PM | Last Updated on Fri, May 31 2024 7:01 PM

Election Commission of India Key Orders On Exit Polls

న్యూఢిల్లీ, సాక్షి: దేశవ్యాప్తంగా రేపు వెలువడబోయే ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో శుక్రవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.  

రేపటితో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగియనుంది. దీంతో రేపు సాయంత్రం ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడాల్సి ఉంది. అయితే.. నిర్ణీత సమయం కంటే ముందు ఫలితాలను ఇవ్వకూడదని ఈసీ తాజాగా ఆదేశాలు విడుదల చేసింది. రేపు అంటే జూన్‌ 1వ తేదీ శనివారం సాయంత్రం 6:30 తరువాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని తెలిపింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126ఏ(1) ప్రకారం నిబంధనలు పాటించాల్సిందేనని తాజా ఆదేశాల్లో ఈసీ పేర్కొంది.

లోక్‌సభ ఎన్నికలతో పాటు ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు,అలాగే దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి.  అయితే వీటన్నింటికి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను ఈసీ బ్యాన్‌ చేసింది. పూర్తి స్థాయిలో అంతటా పోలింగ్‌ ముగిసిన తర్వాతే వెల్లడించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసర్లకు మార్చి  28వ తేదీ జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఈసీ స్పష్టం గా పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement