తెలంగాణ లోక్‌సభకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రముఖ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా సీట్లు సాధించే అవకాశం ఉందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. బీఆర్‌ఎస్ కు నెగిటివ్ ఫలితాలు వచ్చాయి.
ఆరా మస్తాన్ సర్వే
ఆరా మస్తాన్ సర్వే ఎగ్జిట్ పోల్స్ బీజేపీ, కాంగ్రెస్‌లకు పోటాపోటీగా సీట్లు వస్తాయని పేర్కొంది. ఈ సర్వే ప్రకారం.. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీకి 8-9, కాంగ్రెస్‌కు 7-8, బీఆర్‌ఎస్‌కు 0 స్థానాలు, ఎంఐఎంకి 1 స్థానం రాబోతున్నట్లు స్పష్టం చేసింది.
పోల్ లాబొరేటరీ
పోల్ లాబొరేటరీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. కాంగ్రెస్ 8-10, బీజేపీ 5-7 స్థానాలు గెలవబోతోంది. బీఆర్‌ఎస్ 0-1, ఎంఐఎం 1 స్థానం దక్కించుకోబోతున్నాయి.
ఇండియా టుడే
ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కి 6-8, బీజేపీకి 8-10, బీఆర్‌ఎస్ 0-1, ఎంఐఎం 1 స్థానం వస్తాయని పేర్కొంది.
పోల్ స్టార్ట్
బీజేపీకి 8-9, కాంగ్రెస్‌కు 7-8, బీఆర్‌ఎస్‌కు 0-1 స్థానాలు, ఎంఐఎంకి 1 స్థానం రాబోతున్నట్లు పోల్ స్టార్ట్ స్పష్టం చేసింది.
పార్థ చాణక్య
పార్థ చాణక్య ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపింది. ఈ పార్టీ అత్యధికంగా 9-11 సీట్లు, బీజేపీ 5-7, బీఆర్‌ఎస్ 0, ఎంఐఎం 1 స్థానం సాధించబోతున్నట్లు పేర్కొంది.
ఆపరేషన్ చాణక్య
ఆపరేషన్ చాణక్య ప్రకారం.. కాంగ్రెస్ 7, బీజేపీ 8, బీఆర్‌ఎస్ 0, ఎంఐఎం 1 స్థానం గెలవబోతున్నాయి.
టైమ్స్ ఆఫ్ ఇండియా
టైమ్స్ ఆఫ్ ఇండియా ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అధిక స్థానాలు వస్తాయని చెప్పింది. బీజేపీ 7-10 సీట్లు, కాంగ్రెస్ 5-8, బీఆర్‌ఎస్ 2-5, ఎంఐఎం 1 స్థానం గెలుచుకుంటాయని స్పష్టం చేసింది.
ఏబీపీ సీ ఓటర్
ఏబీపీ సీ ఓటర్ సర్వే అయితే కాంగ్రెస్, బీజేపీ సమానంగా సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేస్తోంది. కాంగ్రెస్‌కు 7-9, బీజేపీకి కూడా 7-9 సీట్లు వస్తాయని చెబుతోంది. బీఆర్‌ఎస్ ఖాతా తెరవదని, ఎంఐఎం ఒక గెలుచుకుంటుందని తెలిపింది.
న్యూస్ 24
న్యూస్ 24 ప్రకారం కాంగ్రెస్‌కు 5, బీజేపీకి 11, బీఆర్‌ఎస్‌కి 0, ఎంఐఎంకి 1 సీటు రాబోతున్నాయి.
ఎక్కడా కనిపించని కారు జోరు
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కారు జోరు పెద్గగా కనబడలేదు. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్‌ఎస్ శ్రేణులు భావించినా వారికి నిరాశే ఎదురైట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్ని బట్టి అర్థమవుతోంది. లోక్‌సభ ఎన్నికలు కాబట్టి.. బీజేపీ, కాంగ్రెస్‌ల వైపు ప్రజలు మొగ్గుచూపిట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment