Lok Sabha Exit Polls 2024
-
స్టాండింగ్ కమిటీల ఏర్పాటు కొలిక్కి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత లోక్‌సభకు సంబంధించి వివిధ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల కూర్పు ఓ కొలిక్కి వచి్చనట్లు తెలుస్తోంది. లోక్‌సభ పరిధిలోని 16, రాజ్యసభ పరిధిలోని 8 విభాగాల స్టాండింగ్ కమిటీల్లో తమకు కనీసంగా 5 కమిటీలకు ఛైర్మన్ పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ వచి్చంది. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్లు కాంగ్రెస్ నేతలు గౌరవ్ గొగోయ్, కె.సురేశ్, జైరాం రమేశ్ తదితరులతో చర్చించారు. 5 కమిటీలతో పాటు, కమిటీల్లో అత్యంత కీలకమైన హోంశాఖను కాంగ్రెస్ కోరింది. అయితే హోంశాఖను అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. లోక్‌సభ స్టాండింగ్ కమిటీల్లో మూడింటికి ఓకే చెబుతూనే.. విదేశీ వ్యవహారాలు, గ్రామీణాభివృధ్ధి– పంచాయతీరాజ్, వ్యవసాయం వంటి కీలక విభాగాల స్టాండింగ్ కమిటీలకు కాంగ్రెస్ ఎంపీలను ఛైర్మన్లుగా నియమించేందుకు అంగీకరించింది. ఇక రాజ్యసభ కమిటీల్లో విద్యా శాఖను అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ వర్గాలు సోమవారం దీన్ని ధృవీకరించాయి. -
Congress: మాకొచ్చే సీట్లు ఇవిగో
న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై కాంగ్రెస్, విపక్షాలతో కూడిన ఇండియా కూటమి ఆగ్రహ జ్వాలలు చల్లారడం లేదు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని దాదాపుగా శనివారం విడుదలైన సర్వేలన్నీ పేర్కొనడం తెలిసిందే. ఎన్డీఏ హీనపక్షం 350 స్థానాలు దాటుతాయని అవి తెలిపాయి. ఇండియా కూటమికి 92 నుంచి గరిష్టంగా 200 లోపే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంపై కూటమి పార్టీలన్నీ తీవ్రంగా మండిపడ్డాయి. తమ అంచనా ప్రకారం ఇండియా కూటమికి 295 సీట్లు ఖాయమని, ఎన్డీఏకు 235 లోపే వస్తాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మూడు రోజులుగా పదేపదే చెబుతున్నారు. పలు రాష్ట్రాల్లో ఇండియా కూటమి సాధించబోయే లోక్‌సభ స్థానాల సంఖ్యను కూడా కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. -
ఇంట్లో కూర్చుని రెడీ చేశారా?.. ఎగ్జిట్‌పోల్స్‌పై మమతా బెనర్జీ సెటైర్లు
కోల్కత్తా: దేశంలో ఎన్నికల పోరు తుది దశకు చేరుకుంది. దేశవ్యాప్తంగా రేపు(మంగళవారం) ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇక, ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌పోల్స్ రిలీజ్ అయ్యాయి. కాగా, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన కామెంట్స్ చేశారు. ఈ ఎగ్జిట్‌పోల్స్‌ను రెండు నెలల క్రితమే ‘ఇంట్లో తయారు చేశారు’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.కాగా, ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలపై మమతా బెనర్జీ ఆదివారం స్పందించారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్ వాస్తవ పరిస్థితికి అనుగుణంగా లేవు. వీటిని రెండు నెలల క్రితమే ఇంట్లో కూర్చుని తయారు చేసినట్టు అనిపిస్తోంది. బెంగాల్లో 2016, 2019, 2021లో ఎగ్జిట్ పోల్స్ ఎలా చేశారో అందరూ చూశారు. వారి అంచనాలేవీ నిజం కాలేదు. ఎన్నికల ప్రచార ర్యాలీల్లో ప్రజా స్పందన ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ధ్రువీకరించడం లేదు అంటూ కామెంట్స్ చేశారు.అలాగే, ఇండియా కూటమికి సంబంధించి కూడా మమత కీలక వ్యాఖ్యలు చేశారు. అఖిలేశ్ యాదవ్, తేజస్వీ యాదవ్, స్టాలిన్‌తో పాటు అన్నిచోట్లా ప్రాంతీయ పార్టీలు మెరుగైన పనితీరు కనబరుస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. "Exit polls were 'manufactured at home' two months ago", claims Mamata Banerjee"The way BJP tried to polarise and spread false information that Muslims were taking away quotas of SC, ST and OBCs, I don't think Muslims will vote for BJP And, I think the CPI(M) and Congress… pic.twitter.com/JiL76naHAI— Ashish Kumar (@BaapofOption) June 2, 2024 ఇదిలా ఉండగా.. ఎన్నికలకు సంబంధించి దాదాపు ఎగ్జిట్‌పోల్స్ అన్నీ ఎన్డీయే కూటమికి అనుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. మోదీనే మరోసారి ప్రధాని అవుతారని ఫలితాలను వెల్లడించాయి. ఇండియా కూటమికి భారీ ఓటమి తప్పదని తేల్చేశాయి. అయితే, అటు కూటమి నేతలు కూడా ఎగ్జిట్‌పోల్స్ ఫేక్ అంటూ కొట్టిపారేస్తున్నారు. -
Telangana Lok Sabha Elections Exit Poll 2024: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ఊహించని ఫలితాలు
తెలంగాణ లోక్‌సభకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రముఖ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా సీట్లు సాధించే అవకాశం ఉందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. బీఆర్ఎస్ కు నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ఆరా మస్తాన్ సర్వేఆరా మస్తాన్ సర్వే ఎగ్జిట్ పోల్స్ బీజేపీ, కాంగ్రెస్‌లకు పోటాపోటీగా సీట్లు వస్తాయని పేర్కొంది. ఈ సర్వే ప్రకారం.. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీకి 8-9, కాంగ్రెస్‌కు 7-8, బీఆర్ఎస్కు 0 స్థానాలు, ఎంఐఎంకి 1 స్థానం రాబోతున్నట్లు స్పష్టం చేసింది.పోల్ లాబొరేటరీపోల్ లాబొరేటరీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. కాంగ్రెస్ 8-10, బీజేపీ 5-7 స్థానాలు గెలవబోతోంది. బీఆర్ఎస్ 0-1, ఎంఐఎం 1 స్థానం దక్కించుకోబోతున్నాయి.ఇండియా టుడేఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కి 6-8, బీజేపీకి 8-10, బీఆర్ఎస్ 0-1, ఎంఐఎం 1 స్థానం వస్తాయని పేర్కొంది.పోల్ స్టార్ట్‌బీజేపీకి 8-9, కాంగ్రెస్‌కు 7-8, బీఆర్ఎస్కు 0-1 స్థానాలు, ఎంఐఎంకి 1 స్థానం రాబోతున్నట్లు పోల్ స్టార్ట్ స్పష్టం చేసింది.పార్థ చాణక్యపార్థ చాణక్య ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపింది. ఈ పార్టీ అత్యధికంగా 9-11 సీట్లు, బీజేపీ 5-7, బీఆర్ఎస్ 0, ఎంఐఎం 1 స్థానం సాధించబోతున్నట్లు పేర్కొంది.ఆపరేషన్ చాణక్య ఆపరేషన్ చాణక్య ప్రకారం.. కాంగ్రెస్ 7, బీజేపీ 8, బీఆర్ఎస్ 0, ఎంఐఎం 1 స్థానం గెలవబోతున్నాయి.టైమ్స్ ఆఫ్ ఇండియాటైమ్స్ ఆఫ్ ఇండియా ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అధిక స్థానాలు వస్తాయని చెప్పింది. బీజేపీ 7-10 సీట్లు, కాంగ్రెస్ 5-8, బీఆర్ఎస్ 2-5, ఎంఐఎం 1 స్థానం గెలుచుకుంటాయని స్పష్టం చేసింది.ఏబీపీ సీ ఓటర్‌ఏబీపీ సీ ఓటర్ సర్వే అయితే కాంగ్రెస్, బీజేపీ సమానంగా సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేస్తోంది. కాంగ్రెస్‌కు 7-9, బీజేపీకి కూడా 7-9 సీట్లు వస్తాయని చెబుతోంది. బీఆర్ఎస్ ఖాతా తెరవదని, ఎంఐఎం ఒక గెలుచుకుంటుందని తెలిపింది.న్యూస్ 24న్యూస్ 24 ప్రకారం కాంగ్రెస్‌కు 5, బీజేపీకి 11, బీఆర్ఎస్కి 0, ఎంఐఎంకి 1 సీటు రాబోతున్నాయి.ఎక్కడా కనిపించని కారు జోరుతెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కారు జోరు పెద్గగా కనబడలేదు. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ శ్రేణులు భావించినా వారికి నిరాశే ఎదురైట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్ని బట్టి అర్థమవుతోంది. లోక్‌సభ ఎన్నికలు కాబట్టి.. బీజేపీ, కాంగ్రెస్‌ల వైపు ప్రజలు మొగ్గుచూపిట్లు తెలుస్తోంది. -
Lok Sabha Election 2024: గోరఖ్‌పూర్‌లో స్టార్ వార్!
ఉత్తరప్రదేశ్‌లో శనివారం పోలింగ్ జరగనున్న స్థానాల్లో గోరఖ్‌పూర్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. బీజేపీ అభ్యరి్థ, సిట్టింగ్ ఎంపీ రవికిషన్ శుక్లా, ఇండియా కూటమి తరఫున బరిలో ఉన్న ఎస్పీ అభ్యర్థి కాజల్ నిషాద్ ఇద్దరూ భోజ్‌పురి స్టార్లే కావడం అందుకు కారణం... రవికిషన్‌కు పీఠం మద్దతు... భోజ్‌పురి సినిమాల్లో సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న రవి కిషన్ అసలు పేరు రవీంద్ర శుక్లా. కాంగ్రెస్ సభ్యునిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో జౌన్పూర్ నుంచి పోటీ చేసి ఓడారు. 2017లో బీజేపీలో చేరారు. 2019లో 3 లక్షల పైచిలుకు మెజారిటీతో గెలిచారు. కానీ ఈ ఐదేళ్లలో నియోజకవర్గంలో కనిపించనే లేదనే విమర్శలున్నాయి. ప్రతిపక్షాలు ఆయనను ‘బయటి వ్యక్తి’గా అభివర్ణిస్తున్నాయి. దాంతో పీఎం మోదీ, సీఎం యోగి చరిష్మానే నమ్ముకున్నారు. గోరఖ్‌పూర్‌లో తనకు ఇల్లుందని, ఇక్కడే ఉంటున్నానని చెప్పుకొస్తున్నారు. యువకులతో కుస్తీ పడుతూ, స్థానికులతో సెల్ఫీలు దిగుతూ ప్రచారం జోరుగా చేశారు. రవి కిషన్‌కు గోరక్షనాథ్ పీఠం మద్దతు కూడా ఉంది. నిషాద్ ఓట్లను నమ్ముకున్న కాజల్ భోజ్‌పురి నటి, ఎస్పీ అభ్యర్థి కాజల్ నిషాద్కు ఇది నాలుగో ఎన్నిక. రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ రూరల్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై, కాంపియర్గంజ్ నుంచి ఎస్పీ తరఫున పోటీ చేసి ఓడారు. మేయర్ ఎన్నికల్లోనూ ఓటమి చవి చూశారు. రాజకీయాల్లో చురుకుగా ఉండే ఆమెకు ఈసారి గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. తన సామాజికవర్గమైన నిషాద్ ఓట్లనే నమ్ముకున్నారు. అయితే 2019 మాదిరిగా ఈసారి కూడా ఎస్పీ ఓట్లను బీఎస్పీ గట్టిగానే చీల్చేలా కని్పస్తోంది. 1990ల నుంచి బీజేపీ హవా.. గోరఖ్‌పూర్ స్థానంలో 1984 దాకా కాంగ్రెస్‌దే హవా. రామమందిర ఉద్యమ నేపథ్యంలో 1989 నుంచీ గోరక్షనాథ్ పీఠం ఆధిపత్యం మొదలైంది. అప్పటినుంచి 1996 దాకా వరుసగా మూడుసార్లు గోరక్షనాథ్ పీఠాధిపతి మహంత్ అవైద్యనాథ్ ఇక్కడినుంచి గెలిచారు. 1998 నుంచి 2014 దాకా ఐదుసార్లు ప్రస్తుత పీఠాధిపతి యోగి గెలిచారు. సీఎం అయ్యాక ఆయన రాజీనామాతో 2018లో జరిగిన ఉప ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యరి్థగా ఎస్పీ నేత ప్రవీణ్ నిషాద్ బీజేపీ అభ్యర్థి ఉపేంద్ర శుక్లాను ఓడించారు. కానీ ఈ ఆధిపత్యాన్ని ఎస్పీ నిలబెట్టుకోలేకపోయింది. కుల సమీకరణాలదే కీలకపాత్ర..గోరఖ్‌పూర్‌లో అగ్రవర్ణ ఓట్లు 6 లక్షలున్నాయి. 9 లక్షల ఓబీసీ, 4 లక్షల నిషాద్, 2 లక్షలకు పైగా యాదవ ఓట్లున్నాయి. 2.5 లక్షల దళిత ఓట్లు, 2 లక్షల ముస్లిం ఓట్లూ తనకేనని కాజల్ చెబుతున్నారు. నిషాద్లూ తన వెంటే ఉన్నారంటున్నారు. బీజేపీ కూడా నిషాద్‌ల ఓట్ల కోసం ముమ్మర ప్రయత్నాలు చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్