
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత లోక్‌సభకు సంబంధించి వివిధ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల కూర్పు ఓ కొలిక్కి వచి్చనట్లు తెలుస్తోంది. లోక్‌సభ పరిధిలోని 16, రాజ్యసభ పరిధిలోని 8 విభాగాల స్టాండింగ్ కమిటీల్లో తమకు కనీసంగా 5 కమిటీలకు ఛైర్మన్ పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ వచి్చంది. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌లు కాంగ్రెస్ నేతలు గౌరవ్ గొగోయ్, కె.సురేశ్, జైరాం రమేశ్ తదితరులతో చర్చించారు.
5 కమిటీలతో పాటు, కమిటీల్లో అత్యంత కీలకమైన హోంశాఖను కాంగ్రెస్ కోరింది. అయితే హోంశాఖను అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. లోక్‌సభ స్టాండింగ్ కమిటీల్లో మూడింటికి ఓకే చెబుతూనే.. విదేశీ వ్యవహారాలు, గ్రామీణాభివృధ్ధి– పంచాయతీరాజ్, వ్యవసాయం వంటి కీలక విభాగాల స్టాండింగ్ కమిటీలకు కాంగ్రెస్ ఎంపీలను ఛైర్మన్‌లుగా నియమించేందుకు అంగీకరించింది. ఇక రాజ్యసభ కమిటీల్లో విద్యా శాఖను అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ వర్గాలు సోమవారం దీన్ని ధృవీకరించాయి.
Comments
Please login to add a commentAdd a comment