Congress: మాకొచ్చే సీట్లు ఇవిగో | Lok Sabha Election Results 2024: Congress says INDIA bloc will win 295 seats | Sakshi
Sakshi News home page

Lok Sabha Election Results 2024: మాకొచ్చే సీట్లు ఇవిగో

Published Tue, Jun 4 2024 6:30 AM | Last Updated on Tue, Jun 4 2024 6:36 AM

Lok Sabha Election Results 2024: Congress says INDIA bloc will win 295 seats

జాబితా వెల్లడించిన కాంగ్రెస్‌ వర్గాలు 

ఇండియా కూటమికి 295 ఖాయమని ధీమా 

న్యూఢిల్లీ: ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలపై కాంగ్రెస్, విపక్షాలతో కూడిన ఇండియా కూటమి ఆగ్రహ జ్వాలలు చల్లారడం లేదు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని దాదాపుగా శనివారం విడుదలైన సర్వేలన్నీ పేర్కొనడం తెలిసిందే. ఎన్డీఏ హీనపక్షం 350 స్థానాలు దాటుతాయని అవి తెలిపాయి. 

ఇండియా కూటమికి 92 నుంచి గరిష్టంగా 200 లోపే వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పడంపై కూటమి పార్టీలన్నీ తీవ్రంగా మండిపడ్డాయి. తమ అంచనా ప్రకారం ఇండియా కూటమికి 295 సీట్లు ఖాయమని, ఎన్డీఏకు 235 లోపే వస్తాయని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే మూడు రోజులుగా పదేపదే చెబుతున్నారు. పలు రాష్ట్రాల్లో ఇండియా కూటమి సాధించబోయే లోక్‌సభ స్థానాల సంఖ్యను కూడా కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement