ఢిల్లీలోని ఖర్గే నివాసంలో భేటీ అయిన ‘ఇండియా’ కూటమి పార్టీల నేతలు
అన్ని పార్టీలకు ఖర్గే పిలుపు
ఇండియా కూటమి నేతల భేటీ
ప్రభుత్వ ఏర్పాటుపై మల్లగుల్లాలు
బీజేపీ పాలన వద్దన్నది ప్రజాభీష్టం
దాన్ని నెరవేర్చేందుకు చర్యలు: ఖర్గే
న్యూఢిల్లీ: కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై విపక్ష ఇండియా కూటమి మల్లగుల్లాలు పడుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో అందరి అంచనాలనూ మించి కూటమి 234 స్థానాలు సాధించడం తెలిసిందే. దాంతో కాంగ్రెస్‌తో పాటు భాగస్వామ్య పక్షాలన్నీ జోష్‌లో ఉన్నాయి. బుధవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కూటమి నేతల కీలక సమావేశం జరిగింది. ఇండియా కూటమిలో చేరాల్సిందిగా పార్టీలన్నింటినీ ఆహా్వనిస్తున్నట్టు ఖర్గే ఈ సందర్భంగా ప్రకటించారు.
రాజ్యాంగ పరిరక్షణకు, అందులో పేర్కొన్న విలువలకు కట్టుబడ్డ పారీ్టలన్నింటికీ ఇండియా కూటమిలోకి స్వాగతమన్నారు. తమ కూటమి పక్షాలన్నీ ఎన్నికల్లో అద్భుతంగా పోరాడాయంటూ ప్రశంసించారు. ‘‘ప్రజా తీర్పు ప్రధాని మోదీకి, ఆయన విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా వెలువడింది. ఫలితాలు ఆయనకు నైతిక ఓటమి. అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కానీ ప్రజా తీర్పును కాలరాసేందుకు మోదీ ప్రయతి్నస్తున్నారు’’ అంటూ ఖర్గే దుయ్యబట్టారు. దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత అన్ని పారీ్టలపైనా ఉందన్నారు.
సరైన సమయంలో సరైన చర్యలు
భేటీ అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. బీజేపీ పాలన వద్దని ప్రజలు స్పష్టంగా తీర్పు వెలువరించారన్నారు. దాన్ని నెరవేర్చేందుకు ఇండియా కూటమి సరైన సమయంలో చర్యలు తీసుకుంటుందంటూ నర్మగర్భంగా మాట్లాడారు. కూటమి నేతలంతా భేటీలో ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఇప్పటికిప్పుడు ముందుకు వెళ్లడం లేదన్నారు.
మోదీ సారథ్యంలోని బీజేపీ ఫాసిస్టు పాలనపై రాజీలేని పోరు కొనసాగించాలని కూటమి నేతలంతా నిర్ణయించామన్నారు. లోక్‌సభలో మెజారిటీ మార్కు 272. దాన్ని చేరేందుకు ఇండియా కూటమికి మరో 38 సీట్లు కావాలి. పాలక ఎన్డీఏ కూటమికి మెజారిటీకి మించి 292 స్థానాలొచి్చనా బీజేపీ మాత్రం 240కే పరిమితమైంది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ, జేడీ(యూ), శివసేన, ఎల్జేపీ వంటి భాగస్వాములపై ఆధారపడింది. ఈ నేపథ్యంలో ఆ పారీ్టలను తమవైపు తిప్పుకునేందుకు ఇండియా కూటమి ఇప్పటికే జోరుగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు చెబుతున్నారు.
ఇండియా కూటమి భేటీలో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాం«దీ, ప్రియాంక గాంధీ వద్రాతో పాటు భాగస్వామ్య పక్షాల నుంచి అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), అభిషేక్ బెనర్జీ (టీఎంసీ), స్టాలిన్ (డీఎంకే), సంజయ్ రౌత్ (శివసేన–యూబీటీ), శరద్ పవార్, సుప్రియా సులే (ఎన్సీపీ–ఎస్‌పీ), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ), చంపయ్ సోరెన్ (జేఎంఎం), సీతారాం ఏచూరి (సీపీఎం), సంజయ్ సింగ్, రాఘవ్ ఛద్దా (ఆప్), ఒమర్ అబ్దుల్లా (ఎన్‌సీ), ఎన్‌కే ప్రేంచంద్రన్ (ఆరెస్పీ) తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు తదితర భావి వ్యూహాలపై నేతలంతా రెండు గంటలకు పైగా లోతుగా చర్చించారు.
వేచి చూడండి: తేజస్వి
భేటీకి ముందు తేజస్వి మీడియాతో మాట్లాడుతూ ‘ఏం జరగనుందో వేచి చూడండి’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఆయన, ఎన్డీఏ భేటీలో పాల్గొనేందుకు జేడీ(యూ) చీఫ్ నితీశ్‌కుమార్ బుధవారం పట్నా నుంచి ఢిల్లీకి ఒకే విమానంలో వెళ్లడం విశేషం! ఆ సందర్భంగా పక్కపక్కనే కూర్చుని మాటలు కలిపడంతో మీడియాలో విపరీతమైన ఆసక్తి నెలకొంది. నితీశ్‌ను తిరిగి ఇండియా కూటమిలో చేరేలా ఒప్పించేందుకు తేజస్వి ప్రయతి్నంచారంటూ పుకార్లొచ్చాయి. దాంతో ఢిల్లీ చేరగానే విమానాశ్రయంలో మీడియా అంతా తేజస్విని చుట్టుముట్టింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఇండియా కూటమి చేస్తున్న ప్రయత్నాలపై ప్రశ్నల వర్షం కురిపించింది. నితీశ్‌తో తన మాటలు కుశల ప్రశ్నలకే పరిమితమైనట్టు తేజస్వి బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment