alliance with congress
-
కాంగ్రెస్‌పై కత్తులు!
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో వరుస పరాజయాల నేపథ్యంలో విపక్ష ‘ఇండియా’ కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. కూటమి పార్టీలకు పరస్పరం పొసగడం లేదు. కూటమి భవిష్యత్తు గురించి కొత్త చర్చ మొదలైంది. కూటమిలో అతి పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ తీరు పట్ల మిత్రపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నేతలు గొంతు విప్పుతున్నారు. సమాజ్‌వాదీ పార్టీ ఒకడుగు ముందుకేసి మహారాష్ట్రలో కాంగ్రెస్ సారథ్యంలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఎస్) నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది! అదానీ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చకు ఇండియా పక్షాలు చేస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్ పాల్గొనడం లేదు. ఇతర అంశాల్లోనూ భాగస్వాముల మధ్య ఏకాభిప్రాయం కనిపించడం లేదు. పార్లమెంట్ లోపల, బయట కలిసి ఒక్కతాటిపై పని చేస్తున్న దాఖలాలు లేవు. ప్రధానంగా హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూటమిలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఆధిపత్యాన్ని కొందరు నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రజాభిమానం కోల్పోయి బలహీనపడుతున్న కాంగ్రెస్ విపక్ష కూటమిని ముందుకు నడిపించలేదని కుండబద్ధలు కొడుతున్నారు. సారథ్యం నుంచి కాంగ్రెస్ తప్పుకుని సమర్థులకు బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమన్న పశి్చమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ వ్యాఖ్యలు కూటమిలో కలకలం రేపాయి. ఇండియా కూటమికి ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఇదేనా పొత్తు ధర్మం? బీజేపీ హఠావో.. దేశ్ బచావో నినాదంతో లోక్‌సభ ఎన్నికలకు ముందు 2023 జూన్‌లో 17 పార్టీలతో ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (ఇండియా) ఫ్రంట్ ఏర్పాటైంది. బీజేపీని వ్యతిరేకించే పార్టీలు ఒకే వేదికపైకి చేరాయి. కాంగ్రెస్‌తో పాటు భావసారూప్యం కలిగిన పార్టీలు చేతులు కలిపాయి. అయితే, బీజేపీ ఓటమే లక్ష్యంగా ఇండియా కూటమి ఏర్పాటుకు చొరవ తీసుకున్న జేడీ(యూ) చీఫ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ తర్వాత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరిపోయారు! ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా పక్షాలు కొన్నిచోట్ల కలివిడిగా, మరికొన్ని రాష్ట్రాల్లో విడివిడిగా పోటీచేశాయి. అంతిమంగా పరాజయమే మిగిలింది. లోక్‌సభలో స్వీయ బలం పెరగడం ఒక్కటే కాంగ్రెస్‌కు కొంత ఊరట కలిగించింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, హరియాణాలో మిత్రపక్షాలను పక్కనపెట్టి దాదాపుగా ఒంటరిగా పోటీచేయడం వికటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌వి ఒంటెత్తు పోకడలంటూ భాగస్వామ్య పార్టీలు మండిపడుతున్నాయి. అందరినీ కలుపుకొని వెళ్లడం లేదని, పొత్తుధర్మం పాటించడంలేదని ఆక్షేపిస్తున్నాయి. అన్ని వైపులా ఒత్తిడి పెరుగుతుండడంతో కాంగ్రెస్ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ఆత్మవిమర్శ చేసుకోవాలి సమాజ్‌వాదీ ఇప్పటికీ ఇండియా కూటమిలోనే ఉందని ఆ పార్టీ ఎంపీ జావెద్ అలీఖాన్ చెప్పారు. అయితే కూటమిలో అభిప్రాయభేదాలు నిజమేనని అంగీకరించారు. లుకలుకలపై కాంగ్రెసే స్పందించి భాగస్వాములను సమాధానపరచాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా సూచించారు. మిత్రపక్షాలను లెక్క చేయకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తే ఇక కూటమి ఎందుకని ప్రశ్నించారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వల్ల సీట్ల పంపకం సక్రమంగా జరగలేదు, అందుకే అవమానాలు ఎదురయ్యాయి’’ అని ఆరోపించారు. కూటమి ఒక్కటిగా కలిసి ఉంటుందన్న నమ్మకం తమకు లేదని, ఏ క్షణమైనా అది ముక్కలయ్యే అవకాశం ఉందని జేడీ(యూ) సీనియర్ నేత రాజీవ్ రంజన్ వ్యాఖ్యానించారు. కూటమికి ఎవరు సారథ్యం వహించాలో త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ తెలిపారు. సారథ్యానికి సిద్ధమన్న మమత ప్రతిపాదనపై దృష్టి పెట్టాలని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఉదయ్‌వీర్ సింగ్ కోరారు. ఆమెకు తమ మద్దతు, సహకారం ఉంటాయని స్పష్టంచేశారు. కాంగ్రెస్ మాత్రం మమత వ్యాఖ్యలపై గుర్రుగా ఉంది. తమ కూటమి పెద్దగా మరొకరు అవసరమని భావించడం లేదని కాంగ్రెస్ ఎంపీ వర్ష గైక్వాడ్ తేల్చిచెప్పారు. మమత వ్యాఖ్యలను పెద్ద జోక్‌గా కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాకూర్ కొట్టిపారేశారు.ఎంవీఏకు సమాజ్‌వాదీ గుడ్బైముంబై: మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి ఎంవీఏతో తెగదెంపులు చేసుకుంటున్నామని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) తెలిపింది. 1992లో జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసం ఘటనను కీర్తిస్తూ శివసేన(యూబీటీ) ఇటీవల ఒక పత్రికా ప్రకటన ఇచ్చింది. అదేవిధంగా ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు, ఎమ్మెల్సీ మిలింద్ నర్వేకర్ మసీదు విధ్వంసాన్ని పొగుడుతూ ‘ఎక్స్’లో వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం’అని మహారాష్ట్ర ఎస్పీ చీఫ్ అబూ అజ్మీ చెప్పారు. ఈ పరిణామంపై శివసేన(యూబీటీ) స్పందించింది. బాబ్రీ మసీదుపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని పేర్కొంది. ఈ విషయం తెలుసుకునేందుకు ఎస్పీకి దశాబ్దాలు పట్టిందని వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర అసెంబ్లీలో ఎస్పీకి ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో కాంగ్రెస్, శివసేన(యూబీటీ), నేషనలిస్ట్ కాంగ్రెస్(ఎస్పీ),ఎస్పీ ఉన్నాయి.‘‘ఇండియా కూటమి తీరు సరిగా లేదు. నాకు చాన్సిస్తే కూటమి సారథ్య బాధ్యతలకు సిద్ధం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా, కూటమి అధినేతగా కొనసాగడం కష్టమేమీ కాదు. ఆ సామర్థ్యం నాకుంది. విపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చి కూటమి ఏర్పాటు చేశా. ప్రస్తుత సారథులు దాన్ని సమర్థంగా నడిపించగలరో లేదో వాళ్లే చెప్పాలి. లేదంటే ప్రత్యామ్నాయం చూడాలి. అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలన్నదే నా సూచన’’ – శుక్రవారం మీడియాతో మమత -
PM Narendra Modi: సమాజాన్ని విభజించాలని చూస్తున్నారు
అహ్మదాబాద్: భారత సమాజాన్ని విభజించి ముక్కలుచెక్కలు చేయడానికి జాతివ్యతిరేక శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కులగణన పేరిట దేశంలోని భిన్న కులస్తుల మధ్య విపక్షాల ‘ఇండియా’ కూటమి చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ విమర్శల వేళ మోదీ పరోక్షంగా ఆ అంశాన్ని ప్రస్తావించడం గమనార్హం. సోమవారం గుజరా త్‌లోని అహ్మదాబాద్‌లో శ్రీ స్వామి నారా యణ్ ఆలయం 200వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఖేడా జిల్లాలోని వడ్తాల్లో జరిగిన కార్యక్రమంలో మోదీ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగించారు. అభివృద్ధిభారత్కు ఐక్యతే పునాది‘‘ఐక్యమత్యంతో పనిచేసే పౌరులు, దేశ సమగ్ర తతోనే భారత్ 2047 సంవత్సరంలో అభివృద్ధి చెందిన ఆధునిక భారత్‌గా అవతరించగలదు. దురదృష్టవశాత్తు కొందరు సమాజా న్ని కులం, మతం, ప్రాంతం,జాతి, లింగం, స్వస్థలం పేరిట విభజి స్తున్నారు. సంకుచిత మనస్తత్వంతో కొన్ని విభజన శక్తులు చేస్తున్న జాతవ్యతిరేక కుట్ర లివి. ఈ జాతివ్యతిరేక శక్తుల ఉద్దేశాలు ఎంత ప్రమాద కరమో మనం గమనించాలి. కుట్రల పర్యావసానాలను ఊహించాలి. ఈ దుష్టశక్తుల ఆటకట్టించేందుకు మనందరం ఐక్యంగా నిలబడదాం. పోరాడి వాటిని ఓడిద్దాం’’ అని అన్నారు. ఆత్మనిర్భరత మంత్రంతో ముందుకుసాగి అభివృద్ధిభారత్ను సాక్షాత్కారం చేసుకుందాం’’ అని పిలుపునిచ్చారు.ఆలయంతో ఆత్మీయ అనుబంధం‘‘నాటి దుర్భర పరిస్థితులకు ప్రజలు తమను తామే నిందించుకుంటూ కడుపేదరికంలో, బానిసత్వంలో బతు కీడుస్తున్న కాలంలో స్వామినారాయణ అవతరించారు. ఆపత్కాలంలో స్వామినారాయణ, సాధువులు భారతీయు లకు తమ కర్తవ్యబోధ చేసి ఆత్మగౌరవం గొప్పతనాన్ని తెలియజెప్పారు. దీంతో నూతన ఆధ్యాత్మిక శక్తితో ప్రజలు తమ అసలైన గుర్తింపును తెల్సుకోగలిగారు. వడ్తాల్ స్వామి నారాయణ్ ఆలయంతో నాకు దశాబ్దాల అనుబంధం ఉంది. ముఖ్యమంత్రిని అయ్యాక బంధం బలపడింది. 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్రప్రభుత్వం సైతం స్మారక నాణెంను ఆవిష్కరించింది’’ అని గుర్తుచేశారు. -
యూపీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ దూరం
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న తొమ్మది స్థానాలను ఇండియా కూటమిలో భాగంగా ఉన్న సమాజ్‌వాదీ పారీ్టకే వదిలేయడంతో పాటు ఆ పార్టీ అభ్యర్థులకే మద్దతివ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు కాంగ్రెస్ నిర్ణయం చేసిందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అవినాష్ పాండే గురువారం తెలిపారు. నిజానికి çపాండే ప్రకటనకు ముందే ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఉప ఎన్నికల్లో మొత్తం తొమ్మిది స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులందరూ తమ పార్టీ ఎన్నికల గుర్తు ’సైకిల్’పై పోటీ చేస్తారని ప్రకటించారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు ఐక్యంగా ఉన్నాయని, భారీ విజయం కోసం భుజం భుజం కలిపి పనిచేస్తాయని, ఈ ఎన్నికల విజయంతో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తామని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అఖిలేశ్ ప్రకటన అనంతరం కాంగ్రెస్ తన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించింది. నిజానికి ప్రస్తుతం ఎన్నికలు జరుగనున్న 9 స్థానాలకు గానూ కాంగ్రెస్ 5 స్థానాలను ఆశించింది. దీనిపై చర్చలు కొనసాగుతుండగానే 6 స్థానాల్లో ఎస్పీ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన మూడు స్థానాల్లో ఘాజియాబాద్, ఖైర్ స్థానాల్లో కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు సుముఖత తెలిపింది. అయితే ఈ రెండు స్థానాల్లోనూ గెలుపు అవకాశాలు లేకపోవడం, బీజేపీకి మెరుగైన అవకాశాలు ఉండటంతో ఈ స్థానాల్లో పోటీ చేయకూడదని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. తమ నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ‘ఇండియా కూటమి 9 స్థానాల్లో పోటీ చేస్తోంది. మాకు గుర్తు ముఖ్యం కాదు..బీజేపీ దుష్పరిపాలన అంతం ముఖ్యం. శాంతి భద్రతలు ముఖ్యం‘అని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్‌రాయ్ పేర్కొన్నారు. దీనికి కౌంటర్‌గా బదులిచ్చిన బీజేపీ, ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’నినాదాన్ని ఎస్పీ నిజం చేస్తోందని ఎద్దేవా చేసింది. -
‘హంగ్’ రావొద్దనే... కాంగ్రెస్‌తో పొత్తుపై ఒమర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల అనంతరం హంగ్ పరిస్థితి రాకుండా ప్రజలకు ఒక అవకాశం కల్పించేందుకే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దులా వివరించారు. ప్రభుత్వం ఏర్పాటు కాదేమోనన్న అనుమానాలు అక్కర్లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. దాల్ సరస్సులో ఆదివారం షికారా(పడవ)లతో చేపట్టిన ర్యాలీలో అబ్దుల్లా మాట్లాడారు. ఎన్నికల తర్వాత జమ్మూకశ్మీర్‌లో హంగ్ ఏర్పడాలని బీజేపీ కోరుకుంటోందని, తద్వారా లెఫ్టినెంట్ గవర్నర్ పాలనను పొడిగించాలని చూస్తోందని ఆరోపించారు. అయితే, ప్రజలు బీజేపీకి ఆ అవకాశం ఇవ్వబోరని చెప్పారు. కశ్మీర్ లోయలో ప్రచారంతో ఫలితం ఉండదని ముందుగానే గ్రహించిన బీజేపీ నేతలు జమ్మూలో మాత్రమే పర్యటిస్తున్నారని ఒమర్ వ్యాఖ్యానించారు. బీజేపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే జమ్మూకశ్మీర్‌లో మూడు కుటుంబాల పాలన అంటూ విమర్శలు చేస్తోందన్నారు. -
ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి జోరు
న్యూఢిల్లీ: ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలు ఆధిక్యాన్ని కనబర్చాయి. విపక్ష ఇండియా కూటమి పారీ్టలైన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), డీఎంకే, ఆప్‌లు పది అసెంబ్లీ సీట్లను గెల్చుకున్నాయి. బీజేపీ రెండు స్థానాలతో సరిపెట్టుకోగా, ఒకచోట స్వతంత్ర అభ్యర్థి నెగ్గారు. పశ్చిమబెంగాల్లోని నాలుగు, హిమాచల్ ప్రదేశ్‌లోని మూడు, ఉత్తరాఖండ్‌లోని రెండు, పంజాబ్, మధ్యప్రదేశ్, బిహార్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి బుధవారం ఉప ఎన్నికలు జరగ్గా.. శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో 42 స్థానాలకుగాను 29 చోట్ల నెగ్గి బెంగాల్లో తనకు తిరుగులేదని నిరూపించుకున్న సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నాలుగింటికి నాలుగు స్థానాలను తమ ఖాతాలో వేసుకుంది. వీటిలో మూడు బీజేపీ సిట్టింగ్ స్థానాలు కావడం విశేషం. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఆధిక్యం వచి్చన చోట్ల కూడా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఎంసీ జయకేతనం ఎగురవేసింది. 294 మంది సభ్యులున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో టీఎంసీ బలం 215కు చేరింది. అసెంబ్లీలో భార్యాభర్తలు హిమాచల్ ప్రదేశ్‌లో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు రాజీనామా చేసి.. బీజేపీ టికెట్‌పై పోటీచేశారు. వీరిలో ఇద్దరు ఓటమి పాలుకాగా.. ఒక్కరు గెలుపొందారు. అందరి దృష్టిని ఆకర్షించిన డేహ్రా నియోజకవర్గంలో హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సతీమణి కమలేష్ ఠాకూర్ విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం పట్టుబట్టి మరీ కమలే‹Ùను రంగంలోకి దింపింది. హిమాచల్ అసెంబ్లీలో ఇకపై భార్యాభర్తలు సుఖ్విందర్, కమలే‹Ùలు కనిపించనున్నారు. తాజాగా ఇద్దరి గెలుపుతో 68 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 40కి చేరింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లు నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో ఏకంగా ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి బీజేపీకి ఓటేయడంతో కాంగ్రెస్ బలం 34కు పడిపోయింది. సుఖు ప్రభుత్వాన్ని అస్థిరత వెంటాడింది. లోక్‌సభ ఎన్నికలతో పాటే 6 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నాలుగు నెగ్గింది. ఇప్పుడు మరో రెండు స్థానాలు గెలవడంతో కాంగ్రెస్ బలం మళ్లీ 40కి చేరింది. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్‌లో రెండు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. రెండింటినీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇందులో ఒకటి కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. -
ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి జోరు
న్యూఢిల్లీ: ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలు ఆధిక్యాన్ని కనబర్చాయి. విపక్ష ఇండియా కూటమి పారీ్టలైన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), డీఎంకే, ఆప్‌లు పది అసెంబ్లీ సీట్లను గెల్చుకున్నాయి. బీజేపీ రెండు స్థానాలతో సరిపెట్టుకోగా, ఒకచోట స్వతంత్ర అభ్యర్థి నెగ్గారు. పశ్చిమబెంగాల్లోని నాలుగు, హిమాచల్ ప్రదేశ్‌లోని మూడు, ఉత్తరాఖండ్‌లోని రెండు, పంజాబ్, మధ్యప్రదేశ్, బిహార్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి బుధవారం ఉప ఎన్నికలు జరగ్గా.. శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో 42 స్థానాలకుగాను 29 చోట్ల నెగ్గి బెంగాల్లో తనకు తిరుగులేదని నిరూపించుకున్న సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నాలుగింటికి నాలుగు స్థానాలను తమ ఖాతాలో వేసుకుంది. వీటిలో మూడు బీజేపీ సిట్టింగ్ స్థానాలు కావడం విశేషం. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఆధిక్యం వచి్చన చోట్ల కూడా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఎంసీ జయకేతనం ఎగురవేసింది. 294 మంది సభ్యులున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో టీఎంసీ బలం 215కు చేరింది. అసెంబ్లీలో భార్యాభర్తలు హిమాచల్ ప్రదేశ్‌లో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు రాజీనామా చేసి.. బీజేపీ టికెట్‌పై పోటీచేశారు. వీరిలో ఇద్దరు ఓటమి పాలుకాగా.. ఒక్కరు గెలుపొందారు. అందరి దృష్టిని ఆకర్షించిన డేహ్రా నియోజకవర్గంలో హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సతీమణి కమలేష్ ఠాకూర్ విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం పట్టుబట్టి మరీ కమలే‹Ùను రంగంలోకి దింపింది. హిమాచల్ అసెంబ్లీలో ఇకపై భార్యాభర్తలు సుఖ్విందర్, కమలే‹Ùలు కనిపించనున్నారు. తాజాగా ఇద్దరి గెలుపుతో 68 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 40కి చేరింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లు నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో ఏకంగా ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి బీజేపీకి ఓటేయడంతో కాంగ్రెస్ బలం 34కు పడిపోయింది. సుఖు ప్రభుత్వాన్ని అస్థిరత వెంటాడింది. లోక్‌సభ ఎన్నికలతో పాటే 6 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నాలుగు నెగ్గింది. ఇప్పుడు మరో రెండు స్థానాలు గెలవడంతో కాంగ్రెస్ బలం మళ్లీ 40కి చేరింది. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్‌లో రెండు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. రెండింటినీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇందులో ఒకటి కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. -
రాజ్యాంగం వర్ధిల్లాలి.. ‘ఇండియా’ ఎంపీల నినాదాలు
న్యూఢిల్లీ: 18వ లోక్‌సభ ప్రారంభమైన తొలి రోజే ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీల నినాదాలతో పార్లమెంట్ ప్రాంగణం దద్దరిల్లింది. సోమవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా పార్లమెంట్ ప్రాంగణంలో గతంలో గాం«దీజీ విగ్రహం ఉన్నచోట విపక్ష ఎంపీలు గుమికూడారు. రాజ్యాంగం ప్రతులను చేతబూని నినాదాలు చేశారు. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, మనమంతా కలిసి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి అంటూ బిగ్గరగా నినదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీ, తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సుదీప్ బందోపాధ్యాయ, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం జోలికి రావొద్దు: రాహుల్ పవిత్రమైన మన రాజ్యాంగంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా నిస్సిగ్గుగా దాడి చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగం జోలికి రావొద్దని హెచ్చరించారు. ప్రతిపక్ష కూటమి సందేశం ప్రజల్లోకి వెళ్లిందన్నారు. రాజ్యాంగంపై ఎవరు దాడికి దిగినా సహించబోమని తేలి్చచెప్పారు. పార్లమెంట్ ప్రాంగణంలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. దేశంలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలకు ప్రధాని మోదీ బాధ్యత వహించాలన్నారు. దేశంలో ఏ శక్తి కూడా రాజ్యాంగాన్ని టచ్ చేయలేదని తేలి్చచెప్పారు. రాజ్యాంగాన్ని కచి్చతంగా కాపాడుకుంటామని స్పష్టంచేశారు. ప్రభుత్వాన్ని నిలదీస్తాం ప్రజా సమస్యలను పక్కనపెట్టి, ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలో ప్రధాని మోదీ బిజీగా ఉన్నారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. రాజ్యాంగంపై దాడి చేయడాన్ని తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రజా సమస్యలపై పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని తెలిపారు. ప్రజల గొంతుకను సభలో వినిపిస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం నుంచి మోదీ తప్పించుకోలేరని పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వంలో తొలి 15 రోజుల్లో ఎన్నో ఘోరాలు, ప్రమాదాలు జరిగాయని, పరీక్షల్లో పేపర్ లీకేజీలు చోటుచేసుకున్నాయని, ధరలు పెరిగిపోయాయని రాహుల్ గాంధీ విమర్శించారు. -
Sanjay Raut: టీడీపీ స్పీకర్ పదవికి పోటీ చేస్తే.. ఇండియా కూటమి మద్దతిస్తుంది
ముంబై: లోక్‌సభ స్పీకర్ పదవికి అధికార ఎన్డీఏ పక్షంలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పోటీ చేస్తే ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలన్నీ మద్దతిచ్చే అవకాశముందని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ చెప్పారు. లోక్‌సభ స్పీకర్ పోస్టు చాలా కీలకమైందని, ఈ పదవి బీజేపీకి దక్కితే, ప్రభుత్వానికి మద్దతిచ్చే టీడీపీ, జేడీయూలతో పాటు చిరాగ్ పాశ్వాన్, జయంత్ చౌదరిలకు చెందిన పార్టీలను ముక్కలు చేస్తుందని ఆరోపించారు. బీజేపీని నమ్మి మోసపోయిన అనుభవం తమకు కూడా ఉందని రౌత్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘లోక్‌సభ స్పీకర్ పదవిని టీడీపీ కోరుతున్నట్లుగా విన్నాను. అదే జరిగితే, ఇండియా కూటమి ఈ విషయాన్ని చర్చిస్తుంది. మా భాగస్వామ్య పక్షాలన్నీ టీడీపీకి మద్దతిచ్చేందుకు ప్రయత్నిస్తాయి’అని చెప్పారు. నిబంధన ప్రకారం ప్రతిపక్ష పార్టీకి డిప్యూటీ స్పీకర్ పోస్టు కేటాయించాలన్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అగ్ర నేతలు బీజేపీపై చేసిన వ్యాఖ్యలపై సంజయ్ రౌత్.. గతంలో బీజేపీ చేసిన తప్పిదాలను ఆర్ఎస్ఎస్ సరిచేయాలనుకోవడం మంచి పరిణామమేనని పేర్కొన్నారు. జూన్ 7వ తేదీన పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన భేటీలో ప్రధాని మోదీ ఎన్డీఏ పార్లమెంటరీ పక్షం నేతగా, బీజేపీ పార్లమెంటరీ పార్టీ, లోక్‌సభలో బీజేపీ నేతగా ఎన్నికయ్యారని రౌత్ అన్నారు. ‘బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రత్యేకంగా జరగలేదు. అలా జరిగిన పక్షంలో నేత ఎవరనే ప్రశ్న ఉదయిస్తుంది, అప్పుడిక పరిణామాలు వేరుగా ఉంటాయి’అని అభిప్రాయపడ్డారు. మోదీ ఎన్డీఏ పార్లమెంటరీ పక్షం నేతగా మాత్రమే ఎన్నికవడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని రౌత్ వ్యాఖ్యానించారు. -
సమీప భవిష్యత్తులో ఇండియా కూటమి సర్కారు
కోల్‌కతా: సమీప భవిష్యత్తులో కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం కొలువుదీరుతుందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు అధికారం కోసం ప్రయతి్నంచనంత మాత్రాన రాబోయే రోజుల్లో ప్రయత్నం చేయబోమని కాదన్నారు. తృణమూల్ వేచి చూసే ధోరణిని అవలంబిస్తుందని చెప్పారు. ‘‘బీజేపీ నేతృత్వంలోని బలహీన, అస్థిర ఎన్డీఏ ప్రభుత్వం అధికారం కోల్పోతే సంతోషిస్తాను. దేశం మార్పు కోరుతోంది. తాజా ప్రజాతీర్పు మార్పు కోసమే. ఇది నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వచ్చిన ప్రజా తీర్పు. కనుక ఆయన ప్రధాని పదవి చేపట్టకుండా మరొకరికి అవకాశం ఇచ్చి ఉండాల్సింది’’ అని మమత అన్నారు. కొత్తగా ఎంపికైన తృణమూల్ ఎంపీలతో మమత శనివారం సమావేశమయ్యారు. మోదీ ప్రమాణస్వీకారానికి తృణమూల్ దూరంగా ఉంటుందని తెలిపారు. బీజేపీ అప్రజాస్వామికంగా, చట్టవిరుద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని అన్నారు. ‘‘బీజేపీకి సొంతంగా మెజారిటీ లేదు. మిత్రపక్షాలపై ఆధారపడుతోంది. ప్రభుత్వాన్ని ఎలా నడుపుతుందో, ఎంతవరకు బండిని లాగుతుందో చూద్దాం. పదేళ్లుగా ఎలాంటి చర్చలు లేకుండానే బిల్లులు ఆమోదించుకునేది. ఇక అలా కుదరదు. రాజ్యాంగాన్ని కూడా మార్చలేరు’’ అని మమత అన్నారు. ఎన్డీఏ పక్షాలైన టీడీపీ, జేడీయూ గురించి అడగ్గా.. ‘వారు మా మిత్రులు కూడా. టీడీపీ, జేడీయూలు మాతో లేవని మీకెవరు చెప్పారు?’ అని మమత ప్రశ్నించారు. ఫేక్ ఎగ్జిట్ పోల్స్‌తో స్టాక్ మార్కెట్ల ప్రభావితం చేశారని, దీనిపై దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ఉపసంహరించాలని టీఎంసీ ఎంపీలు రాజ్యసభ, లోక్‌సభల్లో డిమాండ్ చేస్తారని తెలిపారు. బెంగాల్ 42 స్థానాలకు గాను టీఎంసీ 29 సీట్లకు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సుదీప్ బందోపాధ్యాయ్‌ను లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ నేతగా మమత నియమించారు. -
Lok Sabha Election Results 2024: ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం రండి
న్యూఢిల్లీ: కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై విపక్ష ఇండియా కూటమి మల్లగుల్లాలు పడుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో అందరి అంచనాలనూ మించి కూటమి 234 స్థానాలు సాధించడం తెలిసిందే. దాంతో కాంగ్రెస్‌తో పాటు భాగస్వామ్య పక్షాలన్నీ జోష్‌లో ఉన్నాయి. బుధవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కూటమి నేతల కీలక సమావేశం జరిగింది. ఇండియా కూటమిలో చేరాల్సిందిగా పార్టీలన్నింటినీ ఆహా్వనిస్తున్నట్టు ఖర్గే ఈ సందర్భంగా ప్రకటించారు. రాజ్యాంగ పరిరక్షణకు, అందులో పేర్కొన్న విలువలకు కట్టుబడ్డ పారీ్టలన్నింటికీ ఇండియా కూటమిలోకి స్వాగతమన్నారు. తమ కూటమి పక్షాలన్నీ ఎన్నికల్లో అద్భుతంగా పోరాడాయంటూ ప్రశంసించారు. ‘‘ప్రజా తీర్పు ప్రధాని మోదీకి, ఆయన విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా వెలువడింది. ఫలితాలు ఆయనకు నైతిక ఓటమి. అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కానీ ప్రజా తీర్పును కాలరాసేందుకు మోదీ ప్రయతి్నస్తున్నారు’’ అంటూ ఖర్గే దుయ్యబట్టారు. దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత అన్ని పారీ్టలపైనా ఉందన్నారు. సరైన సమయంలో సరైన చర్యలు భేటీ అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. బీజేపీ పాలన వద్దని ప్రజలు స్పష్టంగా తీర్పు వెలువరించారన్నారు. దాన్ని నెరవేర్చేందుకు ఇండియా కూటమి సరైన సమయంలో చర్యలు తీసుకుంటుందంటూ నర్మగర్భంగా మాట్లాడారు. కూటమి నేతలంతా భేటీలో ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఇప్పటికిప్పుడు ముందుకు వెళ్లడం లేదన్నారు. మోదీ సారథ్యంలోని బీజేపీ ఫాసిస్టు పాలనపై రాజీలేని పోరు కొనసాగించాలని కూటమి నేతలంతా నిర్ణయించామన్నారు. లోక్‌సభలో మెజారిటీ మార్కు 272. దాన్ని చేరేందుకు ఇండియా కూటమికి మరో 38 సీట్లు కావాలి. పాలక ఎన్డీఏ కూటమికి మెజారిటీకి మించి 292 స్థానాలొచి్చనా బీజేపీ మాత్రం 240కే పరిమితమైంది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ, జేడీ(యూ), శివసేన, ఎల్జేపీ వంటి భాగస్వాములపై ఆధారపడింది. ఈ నేపథ్యంలో ఆ పారీ్టలను తమవైపు తిప్పుకునేందుకు ఇండియా కూటమి ఇప్పటికే జోరుగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు చెబుతున్నారు. ఇండియా కూటమి భేటీలో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాం«దీ, ప్రియాంక గాంధీ వద్రాతో పాటు భాగస్వామ్య పక్షాల నుంచి అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), అభిషేక్ బెనర్జీ (టీఎంసీ), స్టాలిన్ (డీఎంకే), సంజయ్ రౌత్ (శివసేన–యూబీటీ), శరద్ పవార్, సుప్రియా సులే (ఎన్సీపీ–ఎస్పీ), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ), చంపయ్ సోరెన్ (జేఎంఎం), సీతారాం ఏచూరి (సీపీఎం), సంజయ్ సింగ్, రాఘవ్ ఛద్దా (ఆప్), ఒమర్ అబ్దుల్లా (ఎన్సీ), ఎన్కే ప్రేంచంద్రన్ (ఆరెస్పీ) తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు తదితర భావి వ్యూహాలపై నేతలంతా రెండు గంటలకు పైగా లోతుగా చర్చించారు. వేచి చూడండి: తేజస్వి భేటీకి ముందు తేజస్వి మీడియాతో మాట్లాడుతూ ‘ఏం జరగనుందో వేచి చూడండి’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఆయన, ఎన్డీఏ భేటీలో పాల్గొనేందుకు జేడీ(యూ) చీఫ్ నితీశ్‌కుమార్ బుధవారం పట్నా నుంచి ఢిల్లీకి ఒకే విమానంలో వెళ్లడం విశేషం! ఆ సందర్భంగా పక్కపక్కనే కూర్చుని మాటలు కలిపడంతో మీడియాలో విపరీతమైన ఆసక్తి నెలకొంది. నితీశ్‌ను తిరిగి ఇండియా కూటమిలో చేరేలా ఒప్పించేందుకు తేజస్వి ప్రయతి్నంచారంటూ పుకార్లొచ్చాయి. దాంతో ఢిల్లీ చేరగానే విమానాశ్రయంలో మీడియా అంతా తేజస్విని చుట్టుముట్టింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఇండియా కూటమి చేస్తున్న ప్రయత్నాలపై ప్రశ్నల వర్షం కురిపించింది. నితీశ్‌తో తన మాటలు కుశల ప్రశ్నలకే పరిమితమైనట్టు తేజస్వి బదులిచ్చారు. -
Congress: మాకొచ్చే సీట్లు ఇవిగో
న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై కాంగ్రెస్, విపక్షాలతో కూడిన ఇండియా కూటమి ఆగ్రహ జ్వాలలు చల్లారడం లేదు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని దాదాపుగా శనివారం విడుదలైన సర్వేలన్నీ పేర్కొనడం తెలిసిందే. ఎన్డీఏ హీనపక్షం 350 స్థానాలు దాటుతాయని అవి తెలిపాయి. ఇండియా కూటమికి 92 నుంచి గరిష్టంగా 200 లోపే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంపై కూటమి పార్టీలన్నీ తీవ్రంగా మండిపడ్డాయి. తమ అంచనా ప్రకారం ఇండియా కూటమికి 295 సీట్లు ఖాయమని, ఎన్డీఏకు 235 లోపే వస్తాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మూడు రోజులుగా పదేపదే చెబుతున్నారు. పలు రాష్ట్రాల్లో ఇండియా కూటమి సాధించబోయే లోక్‌సభ స్థానాల సంఖ్యను కూడా కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. -
Exit polls 2024: దేశ రాజధానిలో... బీజేపీకి సవాలే
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి 295కుపైగా స్థానాలు కచి్చతంగా లభిస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయాలు తెలుసున్న తర్వాతే ఈ సంఖ్య చెబుతున్నామని వెల్లడించారు. తమది ప్రజల సర్వే అని, బీజేపీది ప్రభుత్వ సర్వే అని చెప్పారు. శనివారం ఢిల్లీలో ఖర్గే నివాసంలో ఇండియా కూటమి పార్టీల అగ్రనేతలు సమావేశమయ్యారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫలితాల సరళి, ఆ తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై రెండున్నర గంటలపాటు విస్తృతంగా చర్చించారు. ఈ భేటీలో మల్లికార్జున ఖర్గేతోపాటు కాంగ్రెస్ నాయకులు సోనియా గాం«దీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా, కె.సి.వేణుగోపాల్ పాల్గొన్నారు. ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ ముఖ్య నాయకుడు తేజస్వీ యాదవ్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, రాఘవ్ చద్ధా, జేఎంఎం నాయకులు చంపయ్ సోరెన్, కల్పనా సోరెన్, డీఎంకే నేత టి.ఆర్.బాలు, జమ్మూకశీ్మర్ నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఫరూక్ అబ్దుల్లా, సీపీఐ నాయకుడు డి.రాజా, సీపీఐ(ఎంఎల్) నేత దీపాంకర్ భట్టాచార్య తదితరులు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ హాజరు కాలేదు. సమావేశం అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలపై ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని విమర్శించారు. ఫలితాల పేరిట బీజేపీ మీడియా మిత్రులు తప్పుడు అంకెలను ప్రదర్శిస్తున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశాలు ఎంతమాత్రం లేవని స్పష్టం చేశారు. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం పూర్తయ్యేదాకా కౌంటింగ్ హాళ్లనుంచి బయటకు వెళ్లొద్దంటూ తమ పార్టీ కార్యకర్తలను ఆదేశించామని ఖర్గే తెలిపారు. ఇండియా కూటమిలో తామంతా ఐక్యంగా ఉన్నామని, తమను విభజించే ప్రయత్నం చేయవద్దని మీడియాను కోరారు. బీజేపీ 220 సీట్లకే పరిమితం: కేజ్రీవాల్ ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి 295కుపైగా, బీజేపీకి 220 సీట్లు వస్తాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు మొత్తం 235 స్థానాలు వచ్చే అవకాశం ఉందన్నారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వ ఏర్పాటు దిశగా తమ కూటమి ముందుకు సాగుతోందని తెలిపారు. -
ఇంత దారుణంగా మాట్లాడిన ప్రధాని దేశ చరిత్రలోనే లేరు: ప్రియాంక
న్యూఢిల్లీ/గోరఖ్‌పూర్(యూపీ): ప్రతిపక్ష ఇండియా కూటమినుద్దేశించి ‘ముజ్రా’అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా తీవ్రంగా మండిపడ్డారు. ఇంత దారుణంగా మాట్లాడిన ప్రధానమంత్రి దేశ చరిత్రలోనే లేరని పేర్కొన్నారు. ‘ప్రధానమంత్రి పదవిని దేశం యావత్తూ గౌరవిస్తుంది. అటువంటి పదవికున్న ఔన్నత్యాన్ని కాపాడండి’అని మోదీకి హితవు పలికారు. యూపీలోని గోరఖ్‌పూర్‌లో శనివారం ఆమె మాట్లాడారు. ‘బిహార్‌లో ప్రధాని మోదీ ఏమన్నారో విన్నారా? దేశ చరిత్రలోనే అటువంటి భాష ను వాడిన ప్రధాని మరొకరు లేరు. అటువంటి మాటలు ప్రధాని నోట రాకూడదు. సహనం కోల్పోయిన మోదీ దేశానికి, దేశ ప్రజలకు ప్రతినిధిననే విషయం మర్చిపోతున్నారు. ఆయన అసలు రూపం బట్టబయలైంది’అని ప్రియాంక అన్నారు. ‘దేశమే తన కుటుంబమని చెప్పుకుంటున్న వ్యక్తి అనాల్సిన మాటలు కావవి. కుటుంబసభ్యులు పరస్పరం గౌరవించుకోవాలి. ఎప్పటికీ అది అలాగే కొనసాగాలి’ అని ప్రియాంక అన్నారు. -
Lok Sabha Election 2024: ప్రాంతీయ సవాల్!
ఫైనాన్షియల్, కార్పొరేట్ హబ్‌గా దేశ ఆర్థిక ముఖచిత్రంలో కీలకమైన హరియాణాలో సార్వత్రిక ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధమైంది. ఇక్కడి మొత్తం 10 లోక్‌సభ స్థానాలకూ ఆరో విడతలో భాగంగా శనివారం పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీకి వాటిని నిలబెట్టుకోవడం సవాలుగా మారింది. కాంగ్రెస్, ఆప్‌లతో కూడిన ఇండియా కూటమి నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ 9 చోట్ల, ఆప్ ఒక్క స్థానంలో బరిలో ఉన్నాయి. ప్రాంతీయ పారీ్టలు కూడా గట్టిగా సవాలు విసురుతున్నాయి. హరియాణాలోని కీలక స్థానాలపై ఫోకస్...కురుక్షేత్ర.. నువ్వా నేనా! మోదీ వేవ్‌లో 2014లో ఇక్కడ తొలిసారి కాషాయ జెండా ఎగిరింది. 2019లో రాష్ట్ర బీజేపీ చీఫ్ నాయబ్ సింగ్ సైనీ భారీ మెజారిటీతో నెగ్గారు. ఆయన సీఎం కావడంతో ఈసారి పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్‌కు బీజేపీ టికెటిచి్చంది. ఆప్ అభ్యర్థి సుశీల్ కుమార్ గుప్తాకు విద్యా, వ్యాపారవేత్తగా మంచి పేరుంది. ఐఎన్ఎల్డీ ప్రధాన కార్యదర్శి అభయ్ సింగ్ చౌతాలా తొలిసారి లోక్‌సభ బరిలో దిగారు. రైతు అందోళనల సెగ బీజేపీకి గట్టిగా తగులుతోంది. జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) ఎన్డీఏ కూటమి వీడి సొంతంగా పోటీ చేస్తుండటం కూడా కమలనాథులకు ప్రతికూలాంశమే. ఆ పార్టీ నుంచి పలరామ్ సైనీ బరిలో ఉన్నారు. బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.హిసార్... ప్రాంతీయ పారీ్టల అడ్డా రాష్ట్రంలో చక్రం తిప్పుతున్న ప్రాంతీయ పారీ్టల మధ్య చేతులు మారుతూ వస్తున్న కీలక నియోజకవర్గమిది. అయితే మాజీ సీఎం, కాంగ్రెస్ దిగ్గజం భజన్‌లాల్ పెట్టిన హరియాణా జనహిత్ కాంగ్రెస్‌ను ఆయన కుమారుడు కుల్దీప్ తిరిగి కాంగ్రెస్‌లోనే విలీనం చేశారు. దేవీలాల్ ముని మనవడు దుష్యంత్ చౌతాలా ఐఎన్ఎల్డీ తరఫున తొలిసారి 26 ఏళ్లకే ఎంపీ అయ్యారు! ఆ పారీ్టతో విభేదాలతో జేజేపీ ఏర్పాటు చేసి గత ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ చేతిలో ఓటమి చవిచూశారు. ఈసారి జేజేపీ నుంచి దుష్యంత్ తల్లి నైనా సింగ్ చౌతాలా పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి దుష్యంత్ కుంటుంబానికే చెందిన దేవీలాల్ తనయుడు రంజిత్ సింగ్ చౌతాలా బరిలో దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ నుంచి జై ప్రకాశ్, ఐఎన్ఎల్డీ నుంచి సునైనా చౌతాలా పోటీ చేస్తున్నారు. ఫరీదాబాద్.. బీజేపీ హ్యాట్రిక్ గురి ఈ పారిశ్రామిక హబ్‌లో గత రెండు ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. సిట్టింగ్ ఎంపీ కృష్ణ పాల్ గుజ్జర్ హ్యాట్రిక్‌పై గురిపెట్టారు. కాంగ్రెస్ నుంచి మహేంద్ర ప్రతాప్ సింగ్, జేజేపీ నుంచి నళిన్ హుడా పోటీ పడుతున్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని 9 అసెంబ్లీ సెగ్మెంట్లలో 7 బీజేపీ గుప్పిట్లోనే ఉండటం ఆ పారీ్టకి కలిసొచ్చే అంశం.రోహ్తక్... కాంగ్రెస్ జైత్రయాత్రకు బ్రేక్ మాజీ ఉప ప్రధాని చౌదరి దేవీలాల్, హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా వంటి దిగ్గజాలు ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానం పూర్తిగా కాంగ్రెస్ అడ్డా. ఆ పార్టీ జైత్రయాత్రకు 2019లో బీజేపీ బ్రేక్ వేసింది. ఆ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ అరవింద్ కుమార్ శర్మ, కాంగ్రెస్ నుంచి దీపీందర్ సింగ్ హుడా మళ్లీ తలపడుతున్నారు. ఈ జాట్ ప్రాబల్య స్థానంలో 70 శాతం ఓటర్లు గ్రామీణులే. 20 శాతం మేర ఎస్సీలుంటారు. దీని పరిధిలోని 9 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 8 కాంగ్రెస్ చేతిలో ఉండటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం.అంబాలా... దళితులే కీలకం ఒకప్పటి ఈ కాంగ్రెస్ కంచుకోటలోనూ కమలనాథులు పాగా వేశారు. 2014, 2019ల్లో బీజేపీ నుంచి గెలిచిన రతన్ లాల్ కటారియా మరణించడంతో ఈసారి ఆయన భార్య బాంటో బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ములానా సిట్టింగ్ ఎమ్మెల్యే వరుణ్ చౌదరి బరిలో ఉన్నారు. ఇక్కడ 25 శాతం దళితులు, 20 శాతం వెనుకబడిన వర్గాలున్నాయి. పంజాబీ, సిక్కు, రాజ్‌పుత్, జాట్, బ్రాహ్మణ ఓటర్లూ కీలకమే. దళితుల్లో రవిదాసీయాలు 5 లక్షల మేర ఉంటారు.సిర్సా... కాంగ్రెస్ వర్సెస్ మాజీ బీజేపీ సిట్టింగ్ ఎంపీ సునితా దుగ్గల్‌ను కాదని అశోక్ తన్వర్‌కు టికెటిచ్చింది. 2019లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిన ఆయన ఇటీవలే బీజేపీలోకి జంప్ చేయడం విశేషం! కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ కుమారి సెల్జా బరిలో ఉన్నారు. ఆమె 1991లో తొలిసారి ఇక్కడి నుంచే ఎంపీగా గెలిచారు. జేజేపీ, ఐఎన్ఎల్డీలకు కూడా ఇక్కడ గట్టి ఓటు బ్యాంకు ఉండటంతో పోటీ ఉత్కంఠ రేపుతోంది. -
PM Narendra Modi: ఇటు నేను.. అటు ఎవరు?
మహేంద్రగఢ్/పటియాలా: ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నాయకులు అధికారంలోకి రాకముందే ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారని, ఆవు పాలు ఇవ్వకముందే నెయ్యి కోసం రగడ మొదలైందని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో ఐదుగురు ప్రధానమంత్రులు మారితే దేశం ఎలా ముందుకు సాగుతుందని ప్రశ్నించారు. తాను బతికి ఉన్నంతకాలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను ఎవరూ లాక్కోలేరని పునరుద్ఘాటించారు. ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావని చెప్పారు. దేశ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయని స్పష్టంచేశారు. ఈ పోరాటంలో ఒకవైపు ప్రజల సేవకుడు మోదీ ఉన్నారని, మరోవైపు ఎవరున్నారో తెలియదని వ్యాఖ్యానించారు. విపక్ష కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థి లేడని పరోక్షంగా వ్యంగ్యా్రస్తాలు విసిరారు. కరడుగట్టిన కులతత్వం, మతతత్వం, బంధుప్రీతితో కూడిన ఇండియా కూటమిని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం హరియాణాలోని మహేంద్రగఢ్, పంజాబ్‌లోని పటియాలాలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ మాట్లాడారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి విపక్షాల కుట్రలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ‘రామ్ రామ్’ అని జపించినవారిని అరెస్టు చేస్తారని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పార్టీ మన దేశాన్ని ముక్కలు చేసిందని, ఓటు బ్యాంక్‌ను సంతృప్తిపర్చడానికి రెండు ముస్లిం దేశాలను సృష్టించిందని విమర్శించారు. ఈసారి అధికారంలోకి వస్తే అయోధ్య రామమందిరానికి తాళం వేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని గుర్తచేశారు. మన ఆరాధన, విశ్వాసాన్ని కాంగ్రెస్ కించపరుస్తోందని దుయ్యబట్టారు. విభజించగా మిగిలిపోయిన భారతదేశంలోని వనరులపై మొదటి హక్కు ముస్లింలకే ఉందని విపక్ష నాయకులు అంటున్నారని, బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రాజ్యాంగం ఇచి్చన రిజర్వేషన్లను సైతం కాజేయాలని చూస్తున్నారని తప్పుపట్టారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పాలనలో ముస్లింలకు రాత్రికి రాత్రే ఓబీసీ సరి్టఫికెట్లు ఇచ్చేశారని పేర్కొన్నారు. గత పన్నెండేళ్లలో ఇచి్చన ఆ సర్టిఫికెట్లను కలకత్తా హైకోర్టు రద్దు చేసిందని తెలిపారు. ఒకవేళ కోర్టు అడ్డుకోకపోతే ఓబీసీ అన్యాయం జరిగే మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. ముస్లింలకు రిజర్వేషన్లకు కలి్పంచాలని కుట్ర పన్నుతున్న ప్రతిపక్షాల నిజస్వరూపం ప్రజలు తెలుసుకోవాలని కోరారు. ఈ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమికి ఓటమి తప్పదన్నారు. ఓటమికి బాధ్యులను చేసేందుకు ఒక బకరా కోసం ఆ కూటమిలో ఇప్పటినుంచే అన్వేషణ మొదలైందని పేర్కొన్నారు.పంజాబ్‌లో అరాచక పాలన పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో అరాచకం రాజ్యమేలుతోందని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల దందా విచ్చలవిడిగా సాగుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. పరిశ్రమలు పంజాబ్‌ను వదిలి వెళ్లిపోతున్నాయని, ప్రజలు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక, డ్రగ్స్ మాఫియా, షూటర్ గ్యాంగ్‌లు చెలరేగిపోతున్నాయని ధ్వజమెత్తారు. పంజాబ్ మంత్రులు ఎంజాయ్ చేస్తున్నారని, ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఢిల్లీ దర్బార్‌లో హాజరు వేయించుకోవడంతోనే సమయం గడిపేస్తున్నారని ఆక్షేపించారు. అలాంటి వ్యక్తులు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పారీ్టలు పంజాబ్‌లో మాత్రం పరస్పరం పోటీ పడుతున్నాయని చెప్పారు. ఇది డ్రామా కాదా? అని మోదీ నిలదీశారు. -
Delhi CM Arvind Kejriwal: ప్రధాని కావాలని లేదు
న్యూఢిల్లీ: విపక్ష ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రధాని కావాలన్న ఆశ తనకు అస్సలు లేదని ఆప్ జాతీయ కనీ్వనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అయితే ఇండియా కూటమి గెలిస్తే న్యాయ వ్యవస్థను ఒత్తిళ్ల నుంచి విముక్తం చేస్తామన్నారు. తన భార్య సునీతకు రాజకీయాలు నచ్చవని వెల్లడించారు. బెయిల్‌పై విడుదలయ్యాక బుధవారం ఆయన తొలిసారి పీటీఐ వీడియోస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. సొంత రాజ్యసభ ఎంపీ స్వాతీ మలివాల్‌పై తన ఇంట్లోనే పీఏ బిభవ్ కుమార్ దాడి చేసిన ఉదంతంపై కేజ్రీవాల్ తొలిసారి స్పందించారు. వివరాలు ఆయన మాటల్లోనే... నియంతృత్వాన్ని నిలువరిస్తాం ‘‘బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే విపక్ష నేతలందర్నీ కట్టగట్టి జైలుకు పంపుతుంది. ఎన్నికలను హైజాక్ చేస్తుంది. రష్యా మాదిరే ఏకపక్ష ఎన్నికలుంటాయి. అక్కడ పుతిన్ విపక్ష నేతల్ని జైలుకు, కొందర్ని పైకి పంపారు. అందుకే తాజా ఎన్నికల్లో 87 శాతం ఓట్లు సాధించారు. పాకిస్థాన్‌లోనూ అంతే. ఇమ్రాన్ ఖాన్‌ను జైలుకు పంపారు. సొంత పార్టీ గుర్తును కూడా ఎన్నికల్లో వాడుకోనివ్వలేదు. బీజేపీ మళ్లీ గెలిస్తే ఎవ్వరినీ వదలదు. కానీ మోదీ నియంతృత్వ పాలనను నిలువరిస్తాం. ఇండియా కూటమి 300 మార్కు దాటుతుంది. చక్కటి, సుస్థిర ప్రజాపాలన సాగిస్తాం. నాకు ప్రధాని కావాలనే ఆలోచనే లేదు. మాది (ఆప్) చాలా చిన్న పార్టీ. కేవలం 22 చోట్ల పోటీ చేస్తున్నాం. ప్రధానిగా రాహుల్‌ను నేను అంగీకరిస్తానా అన్నది ఊహాజనిత ప్రశ్న. అలాంటి అంశాలు చర్చకే గెలిచాక అందరం కలిసి కూర్చొని దీనిపై చర్చిస్తాం. సానుకూల పవనాలు ఊహించిందే ఆప్ 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 67 సీట్లు, 2020లో 62 సీట్లు సాధించింది. ఈసారి ఆప్–ఇండియా కూటమికి సానుకూల పవనాలు వీయడంలో ఆశ్చర్యమేమీ లేదు. నన్ను అరెస్టు చేయడంతో ఢిల్లీ ఓటర్లు భావోద్వేగానికి గురయ్యారు. ఆ ప్రజాగ్రహం బీజేపీ ఓటమికి కారణం కాబోతోంది. నాకు బెయిల్ దొరకడం నిజంగా దేవుడి మాయ. నన్ను జైలుకు పంపితే ఆప్ ముక్కలుచెక్కలవుతుందన్న బీజేపీ కల కలగానే మిగిలిపోయింది. మలివాల్ ఉదంతంలో బాధితులకు న్యాయం జరగాలి మలివాల్‌పై దాడి కేసు విచారణ నిష్పాక్షికంగా జరగాలి. రెండు వైపుల వాదనలను ఆలకించి పోలీసులు సరైన మార్గంలో దర్యాప్తు జరపాలి. నిజమైన బాధితులకు న్యాయం జరగా>లి. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఇంతకు మించి మాట్లాడలేను. న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లుండవ్ఇండియా కూటమి అధికార పగ్గాలు చేపడితే న్యాయవ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు లేకుండా చేస్తాం. ఆ వ్యవస్థ స్వతంత్రంగా పని చేస్తుంది. అప్పుడు నాపై మోపిన కేసులన్నీ బోగస్ అని తేలుతాయి. అందుకే జూన్ 4 ఫలితాల తర్వాత విపక్షాల కూటమి గెలిచాక కేసుల నుంచి విముక్తుడినవుతా. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి బీజేపీ, ఈడీ ఆరోపించినట్లు నగదు అక్రమ బదిలీ జరగలేదు. ఈ కేసులో వాళ్లింతవరకు ఒక్క పైసా కూడా కనుక్కోలేకపోయారు. అవినీతి జరిగి ఉంటే ఆ నగదు అంతా ఎటు పోయినట్లు?సునీతది ధర్మాగ్రహం 2000 దశకంలో ఢిల్లీ మురికివాడల పరిధిలో ఐటీ కమిషనర్‌గా పని చేశా. పదవీ విరమణ చేసి ప్రజా జీవితంలోకి వచ్చా. సొంతంగా పార్టీ పెడతానని, ఎన్నికల్లో పోటీ చేస్తానని, ఏకంగా సీఎం అవుతానని అస్సలు ఊహించలేదు. నా భార్య సునీతకు రాజకీయాలపై ఆసక్తి లేదు. భవిష్యత్తులోనూ క్రియాశీల రాజకీయాల్లోకి రాదు. నన్ను అక్రమంగా అరెస్టు చేసినందుకే తను ఇల్లు దాటి బయటికొచ్చి ధర్మాగ్రహం చూపింది. సునీత భార్య కావడం నా అదృష్టం. జీవితంలో ప్రతి సందర్భంలోనూ నాకు తోడుగా నిలిచింది. నేను జైల్లో ఉండగా నాకు, ఢిల్లీ ప్రజలకు వారధిగా నిలిచింది. కస్టడీ ముగిసి నేను జైలుకెళ్తే సీఎంగా బాధ్యతల నిర్వహణకు తగిన వసతులు కలి్పంచాలని కోర్టును కోరతా. -
Lok Sabha Election 2024: ఆరో విడత స్థానాల్లో... కాంగ్రెస్ ఖాతా తెరిచేనా?
ఏడు విడతలుగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటిదాకా ఐదు దశల్లో 428 స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. మిగతా 115 లోక్‌సభ స్థానాలకు మే 25న ఆరు, జూన్ 1న ఏడో విడతలో పోలింగ్ జరగనుంది. దాంతో 42 రోజుల సుదీర్ఘ పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఆరో విడతలో మొత్తం 58 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. హరియాణాలోని మొత్తం 10 సీట్లు, రాజధాని ఢిల్లీలోని 7 స్థానాలూ వీటిలో ఉన్నాయి. ఈ 58 స్థానాల్లో 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 44 చోట్ల బరిలో దిగినా కనీసం ఒక్క సీటు కూడా నెగ్గలేకపోయింది. అధికార బీజేపీ మాత్రం 53 చోట్ల పోటీ చేసి ఏకంగా 40 స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం! అంతేగాక వాటిలో ఏకంగా 90 శాతం స్థానాల్లో 40 శాతం పై చిలుకు ఓట్లు సాధించింది! ఈ నేపథ్యంలో ఆ 40 స్థానాలనూ నిలబెట్టుకోవడం బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. కానీ ఆప్‌తో జతకట్టిన కాంగ్రెస్ నుంచి అధికార పార్టీ ఈసారి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. ఏడో విడతలో పోలింగ్ జరగనున్న పంజాబ్‌లో ఆప్, కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తున్నా హరియాణా, ఢిల్లీల్లో మాత్రం ఇండియా కూటమి భాగస్వాములుగా బరిలో దిగాయి. హరియాణాలో 9, ఢిల్లీలో 3 చోట్ల కాంగ్రెస్, మిగతా స్థానాల్లో ఆప్ బీజేపీకి పెను సవాలు విసురుతున్నాయి. దీనికి తోడు హరియాణాలో రైతుల అసంతృప్తి బీజేపీకి మరింత ప్రతికూలంగా మారేలా కని్పస్తోంది. 2019లో బీజేపీదే హవా! ఆరో విడతలో పోలింగ్ జరుగుతున్న 58 లోక్‌సభ స్థానాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీయే పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఆరు స్థానాల్లోనైతే ఏకంగా 35 శాతం పై చిలుకు మెజారిటీ సాధించడం విశేషం. అవి కర్నాల్ (6.6 లక్షల మెజారిటీ), ఫరీదాబాద్ (6.4 లక్షలు), వెస్ట్ ఢిల్లీ (5.8 లక్షలు), నార్త్ వెస్ట్ ఢిల్లీ (5.5 లక్షలు), ధన్‌బాద్ (4.9 లక్షలు), భివానీ (4.4 లక్షలు). ఏ స్థానంలో అయినా మూడు వరుస ఎన్నికల్లో కనీసం రెండుసార్లు నెగ్గిన పార్టీని అక్కడ గట్టి పోటీదారుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటారు. ఆ లెక్కన ఆరో విడత స్థానాల్లో బీజేపీ కనీసం 30 స్థానాల్లో గట్టి పోటీదారుగా ఉంది. కాంగ్రెస్‌కు మాత్రం అలాంటి స్థానం కేవలం హరియాణాలోని రోహ్తక్ మాత్రమే. అక్కడ కూడా 2009, 2014ల్లో నెగ్గినా 2019లో మాత్రం వెంట్రుకవాసిలో బీజేపీకి కోల్పోవడం విశేషం! బీజేపీ కంచుకోటలు 5 ఆరో విడతలో పోలింగ్ జరగనున్న 58 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌కు కంచుకోటగా చెప్పదగ్గ సీటు ఒక్కటీ లేకపోవడం విశేషం. బీజేపీకి ఐదున్నాయి. బీజేపీ జార్ఖండ్‌లో ధన్‌బాద్, జెంషెడ్పూర్; బిహార్‌లో పూర్వీ చంపారన్, పశి్చమ చంపారన్, శివోహర్ స్థానాలను చాలా ఏళ్లుగా గెలుచుకుంటూ వస్తోంది. ఒడిశాలోని కటక్, ధెంకెనాల్, కియోంఝర్, పూరి స్థానాల్లో బీజేడీకి ఎదురు లేదు. అలాగే పశి్చమ బెంగాల్లో కాంథీ, తామ్లుక్ లోక్‌సభ స్థానాలు తృణమూల్ కంచుకోటలు. ఆరో విడత స్థానాల్లో 2019లో 5 చోట్ల పోరు హోరాహోరీగా సాగింది. అయితే వాట న్నింట్లోనూ బీజేపీయే విజేతగా నిలవడం విశేషం! మఛ్లీషహర్ (యూపీ) నియోజకవర్గంలోనైతే బీజేపీ అభ్యర్థి భోలానాథ్ కేవలం 198 ఓట్ల (0.02 శాతం) మెజారిటీతో గట్టెక్కారు! శ్రావస్తి (యూపీ), రోహ్తక్ (హరియాణా), సంభాల్పూర్ (ఒడిశా), ఝార్గ్రాం (పశ్చిమ బెంగాల్) స్థానాలను కూడా బీజేపీ ఒక్క శాతం కంటే తక్కువ మెజారిటీతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. అయితే ఆరో విడత పోలింగ్ జరుగుతున్న 58 స్థానాలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశముంది! వీటిలో మూడింట ఒక స్థానంలో ప్రజలు ప్రతి ఎన్నికలోనూ కొత్తవారిని గెలిపిస్తూ వస్తుండటం ఆసక్తికరం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: దేశ రాజధానిలో... బీజేపీకి సవాలే
దేశ రాజధానివాసులు గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీకి జైకొట్టారు. ఈసారి మాత్రం కాంగ్రెస్–ఆప్ గట్టి పోటీ ఇస్తున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో మూడు పారీ్టలూ విడిగా పోటీ చేయడం బీజేపీకి బాగా కలిసొచ్చింది. ఇండియా కూటమి భాగస్వాములైన కాంగ్రెస్ 3, ఆప్ 4 చోట్ల బీజేపీకి సవాలు విసురుతున్నాయి. దాంతో అధికార వ్యతిరేకతను అధిగమించేందుకు ఏకంగా ఆరుగురు సిట్టింగులను కాషాయ పార్టీ మార్చేసింది! ఆప్ సర్కారుపై అవినీతి ఆరోపణలనే ప్రచారాస్త్రంగా చేసుకుంది. అదంతా తమ పార్టీని అంతం చేసే కుట్రలో భాగమంటూ ఆప్ తిప్పికొడుతోంది. జైలు నుంచి తిరిగొచ్చిన అధినేత కేజ్రీవాల్ ప్రచార భారాన్ని భుజాలపై మోశారు. శనివారం జరిగే పోలింగ్‌లో ఓటర్లు ఎవరిని దీవిస్తారన్నది ఉత్కంఠగా మారింది... న్యూఢిల్లీకేంద్ర మంత్రి మీనాక్షి లేఖి స్థానంలో దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె, యువ న్యాయవాది, బాసురీ స్వరాజ్‌కు బీజేపీ టికెటిచ్చింది. 40 ఏళ్ల బాసురీ రాజకీయాలకు కొత్త కాదు. 2013, 2015, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాలవీయనగర్ నుంచి విజయం సాధించారు. ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతి కూడా లాయరే. ఇద్దరూ పోటాపోటీగా ప్రచారం చేశారు. ప్రధాని, కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారుల నివాసాలు ఈ వీఐపీ స్థానం పరిధిలోనే ఉన్నాయి. ట్రాఫిక్ జామ్, మురుగునీటి సమస్యలపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. చాందినీ చౌక్ విస్తీర్ణంలో దేశంలోనే అతి చిన్న లోక్‌సభ స్థానమిది. సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్ బదులు వ్యాపారి ప్రవీణ్ ఖండేల్వాల్ (64)కు బీజేపీ టికెటిచ్చింది. కాంగ్రెస్ నుంచి జై ప్రకాశ్ అగర్వాల్ పోటీలో ఉన్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉండే వర్తకుల కోసం తాము చేసిన పనులను గుర్తు చేస్తూ అగర్వాల్, ఖండేల్వాల్ ఓట్లడిగారు. ఆప్ మద్దతు అగర్వాల్‌కు అదనపు బలం.నార్త్ ఈస్ట్ ఢిల్లీ విస్తీర్ణంలో దేశంలోనే అతి చిన్న లోక్‌సభ స్థానమిది. సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్ బదులు వ్యాపారి ప్రవీణ్ ఖండేల్వాల్ (64)కు బీజేపీ టికెటిచ్చింది. కాంగ్రెస్ నుంచి జై ప్రకాశ్ అగర్వాల్ పోటీలో ఉన్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉండే వర్తకుల కోసం తాము చేసిన పనులను గుర్తు చేస్తూ అగర్వాల్, ఖండేల్వాల్ ఓట్లడిగారు. ఆప్ మద్దతు అగర్వాల్‌కు అదనపు బలం.నార్త్ ఈస్ట్ ఢిల్లీ బీజేపీ సిట్టింగ్ ఎంపీ, భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీ హ్యాట్రిక్ కోసం ప్రయతి్నస్తున్నారు. మాజీ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ కాంగ్రెస్ అభ్యరి్థగా సవాల్ విసురుతున్నారు. బిహార్, యూపీ, జార్ఖండ్ నుంచి వలస వచ్చిన ఓటర్లు ఇక్కడ ఏకంగా 30 శాతం పైగా ఉంటారు. అందుకే బిహార్‌కు చెందిన కన్హయ్యకు కాంగ్రెస్ చాన్సిచి్చంది. అయితే ఆయన పోటీ తమకే కలిసొస్తుందని బీజేపీ అంటోంది. ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకునిగా కన్హయ్య ఎదుర్కొన్న ఆరోపణలను ప్రచారంలో పదేపదే ప్రస్తావించింది.ఈస్ట్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ, ప్రముఖ క్రికెటర్ గౌతమ్ గంభీర్ బదులు హర్షా మల్హోత్రాకు బీజేపీ టికెటిచ్చింది. ఆప్ నుంచి కులదీప్ కుమార్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ తొలిసారి లోక్‌సభ బరిలో దిగారు. అయితే ఈస్ట్ ఢిల్లీ మేయర్‌గా చేసిన అనుభవం మల్హోత్రా సొంతం. ఈస్ట్ ఢిల్లీ బీజేపీ కంచుకోట అనే చెప్పాలి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన పీసీసీ మాజీ చీఫ్ రవిందర్ సింగ్ లవ్లీ ఇటీవలే బీజేపీలో చేరడం ఆ పారీ్టకి మరింత కలిసి రానుంది.నార్త్‌వెస్ట్ ఢిల్లీ ఈ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ హన్స్‌రాజ్ హన్స్ బదులు కౌన్సిలర్ యోగేంద్ర చందోలియాకు బీజేపీ చాన్సిచి్చంది. ఆయన గతంలో నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా చేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై ఎంపీగా గెలిచిన ఉదిత్‌రాజ్ ఈసారి కాంగ్రెస్ అభ్యరి్థగా బరిలో దిగడం ఆసక్తికరం. ఆయన ఎంపీగా నియోజకవర్గానికి ముఖం కూడా చూపించలేదని ప్రచారంలో చందోలియా పదేపదే చెప్పారు.వెస్ట్ ఢిల్లీ ఆప్ నేత మహాబల్ మిశ్రా, బీజేపీ అభ్యర్థి కమలీత్ షెరావత్ మధ్య గట్టి పోటీ నెలకొంది. 70 ఏళ్ల మహాబల్ మిశ్రాది బిహార్‌లోని మధుబని. ఇక్కడ బిహారీ ఓటర్లు భారీగా ఉండటం ఆయనకు అనుకూలించే అంశం. షెరావత్ బీజేపీ మహిళా మోర్చా ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఎక్కువ మంది ఇంటి నుంచి ఓటేసిన లోక్‌సభ స్థానంగా ఈసారి వెస్ట్ ఢిల్లీ వార్తల్లోకెక్కింది. 85 ఏళ్లు పై బడిన 969 మంది, 179 మంది దివ్యాంగులు ఇంటి నుంచి ఓటేశారు.సౌత్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ, వివాదాస్పద నేత రమేశ్ బిదురి బదులు బదార్పూర్ ఎమ్మెల్యే రామ్‌వీర్ సింగ్ బిదురికి బీజేపీ టికెటిచి్చంది. ఆప్ నుంచి సాహిరాం పహిల్వాన్ బరిలో ఉన్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని 10 అసెంబ్లీ సీట్లలో బీజేపీ చేతిలో ఉన్నది బదార్పూర్ ఒక్కటే! అభ్యర్థులిద్దరూ గుర్జర్ సామాజికవర్గానికి చెందిన వారే కావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: దేశ రాజధానిలో... బీజేపీకి సవాలే
దేశ రాజధానివాసులు గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీకి జైకొట్టారు. ఈసారి మాత్రం కాంగ్రెస్–ఆప్ గట్టి పోటీ ఇస్తున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో మూడు పారీ్టలూ విడిగా పోటీ చేయడం బీజేపీకి బాగా కలిసొచ్చింది. ఇండియా కూటమి భాగస్వాములైన కాంగ్రెస్ 3, ఆప్ 4 చోట్ల బీజేపీకి సవాలు విసురుతున్నాయి. దాంతో అధికార వ్యతిరేకతను అధిగమించేందుకు ఏకంగా ఆరుగురు సిట్టింగులను కాషాయ పార్టీ మార్చేసింది! ఆప్ సర్కారుపై అవినీతి ఆరోపణలనే ప్రచారాస్త్రంగా చేసుకుంది. అదంతా తమ పార్టీని అంతం చేసే కుట్రలో భాగమంటూ ఆప్ తిప్పికొడుతోంది. జైలు నుంచి తిరిగొచ్చిన అధినేత కేజ్రీవాల్ ప్రచార భారాన్ని భుజాలపై మోశారు. శనివారం జరిగే పోలింగ్‌లో ఓటర్లు ఎవరిని దీవిస్తారన్నది ఉత్కంఠగా మారింది... న్యూఢిల్లీకేంద్ర మంత్రి మీనాక్షి లేఖి స్థానంలో దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె, యువ న్యాయవాది, బాసురీ స్వరాజ్‌కు బీజేపీ టికెటిచ్చింది. 40 ఏళ్ల బాసురీ రాజకీయాలకు కొత్త కాదు. 2013, 2015, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాలవీయనగర్ నుంచి విజయం సాధించారు. ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతి కూడా లాయరే. ఇద్దరూ పోటాపోటీగా ప్రచారం చేశారు. ప్రధాని, కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారుల నివాసాలు ఈ వీఐపీ స్థానం పరిధిలోనే ఉన్నాయి. ట్రాఫిక్ జామ్, మురుగునీటి సమస్యలపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. చాందినీ చౌక్ విస్తీర్ణంలో దేశంలోనే అతి చిన్న లోక్‌సభ స్థానమిది. సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్ బదులు వ్యాపారి ప్రవీణ్ ఖండేల్వాల్ (64)కు బీజేపీ టికెటిచ్చింది. కాంగ్రెస్ నుంచి జై ప్రకాశ్ అగర్వాల్ పోటీలో ఉన్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉండే వర్తకుల కోసం తాము చేసిన పనులను గుర్తు చేస్తూ అగర్వాల్, ఖండేల్వాల్ ఓట్లడిగారు. ఆప్ మద్దతు అగర్వాల్‌కు అదనపు బలం.నార్త్ ఈస్ట్ ఢిల్లీ విస్తీర్ణంలో దేశంలోనే అతి చిన్న లోక్‌సభ స్థానమిది. సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్ బదులు వ్యాపారి ప్రవీణ్ ఖండేల్వాల్ (64)కు బీజేపీ టికెటిచ్చింది. కాంగ్రెస్ నుంచి జై ప్రకాశ్ అగర్వాల్ పోటీలో ఉన్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉండే వర్తకుల కోసం తాము చేసిన పనులను గుర్తు చేస్తూ అగర్వాల్, ఖండేల్వాల్ ఓట్లడిగారు. ఆప్ మద్దతు అగర్వాల్‌కు అదనపు బలం.నార్త్ ఈస్ట్ ఢిల్లీ బీజేపీ సిట్టింగ్ ఎంపీ, భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీ హ్యాట్రిక్ కోసం ప్రయతి్నస్తున్నారు. మాజీ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ కాంగ్రెస్ అభ్యరి్థగా సవాల్ విసురుతున్నారు. బిహార్, యూపీ, జార్ఖండ్ నుంచి వలస వచ్చిన ఓటర్లు ఇక్కడ ఏకంగా 30 శాతం పైగా ఉంటారు. అందుకే బిహార్‌కు చెందిన కన్హయ్యకు కాంగ్రెస్ చాన్సిచి్చంది. అయితే ఆయన పోటీ తమకే కలిసొస్తుందని బీజేపీ అంటోంది. ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకునిగా కన్హయ్య ఎదుర్కొన్న ఆరోపణలను ప్రచారంలో పదేపదే ప్రస్తావించింది.ఈస్ట్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ, ప్రముఖ క్రికెటర్ గౌతమ్ గంభీర్ బదులు హర్షా మల్హోత్రాకు బీజేపీ టికెటిచ్చింది. ఆప్ నుంచి కులదీప్ కుమార్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ తొలిసారి లోక్‌సభ బరిలో దిగారు. అయితే ఈస్ట్ ఢిల్లీ మేయర్‌గా చేసిన అనుభవం మల్హోత్రా సొంతం. ఈస్ట్ ఢిల్లీ బీజేపీ కంచుకోట అనే చెప్పాలి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన పీసీసీ మాజీ చీఫ్ రవిందర్ సింగ్ లవ్లీ ఇటీవలే బీజేపీలో చేరడం ఆ పారీ్టకి మరింత కలిసి రానుంది.నార్త్‌వెస్ట్ ఢిల్లీ ఈ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ హన్స్‌రాజ్ హన్స్ బదులు కౌన్సిలర్ యోగేంద్ర చందోలియాకు బీజేపీ చాన్సిచి్చంది. ఆయన గతంలో నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా చేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై ఎంపీగా గెలిచిన ఉదిత్‌రాజ్ ఈసారి కాంగ్రెస్ అభ్యరి్థగా బరిలో దిగడం ఆసక్తికరం. ఆయన ఎంపీగా నియోజకవర్గానికి ముఖం కూడా చూపించలేదని ప్రచారంలో చందోలియా పదేపదే చెప్పారు.వెస్ట్ ఢిల్లీ ఆప్ నేత మహాబల్ మిశ్రా, బీజేపీ అభ్యర్థి కమలీత్ షెరావత్ మధ్య గట్టి పోటీ నెలకొంది. 70 ఏళ్ల మహాబల్ మిశ్రాది బిహార్‌లోని మధుబని. ఇక్కడ బిహారీ ఓటర్లు భారీగా ఉండటం ఆయనకు అనుకూలించే అంశం. షెరావత్ బీజేపీ మహిళా మోర్చా ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఎక్కువ మంది ఇంటి నుంచి ఓటేసిన లోక్‌సభ స్థానంగా ఈసారి వెస్ట్ ఢిల్లీ వార్తల్లోకెక్కింది. 85 ఏళ్లు పై బడిన 969 మంది, 179 మంది దివ్యాంగులు ఇంటి నుంచి ఓటేశారు.సౌత్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ, వివాదాస్పద నేత రమేశ్ బిదురి బదులు బదార్పూర్ ఎమ్మెల్యే రామ్‌వీర్ సింగ్ బిదురికి బీజేపీ టికెటిచి్చంది. ఆప్ నుంచి సాహిరాం పహిల్వాన్ బరిలో ఉన్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని 10 అసెంబ్లీ సీట్లలో బీజేపీ చేతిలో ఉన్నది బదార్పూర్ ఒక్కటే! అభ్యర్థులిద్దరూ గుర్జర్ సామాజికవర్గానికి చెందిన వారే కావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Centre for the Study of Developing Societies: ఒపీనియన్లు వేరువేరయా!
ఎన్నికలగానే ముందుగా ఒపీనియన్ పోల్స్ వెలువడుతుంటాయి. ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంచనాలు వెల్లువెత్తుతుంటాయి. ఇవి ఓటర్ల అభిప్రాయాలపై ఎంతో కొంత ప్రభావం చూపుతాయి. ఇలాంటి ఒపీనియన్ పోల్స్ ఫలితాల్లో కచి్చతత్వం ఎంతంటే చెప్పడం కష్టమే. ఈసారి ఎన్డీఏ కూటమి 400 పైచిలుకు లోక్‌సభ స్థానాలు సాధిస్తామని చెబుతుండటం తెలిసిందే. ఎన్డీఏ కూటమికి 372 స్థానాలు రావచ్చని ఎన్డీటీవీ పోల్ ఆఫ్ ఒపీనియన్స్ పోల్స్ సర్వే పేర్కొంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమికి 122 దాకా వస్తాయని అంచనా కట్టింది. కానీ, ఒపీనియన్ పోల్స్ ఫలితాలు కొన్నిసార్లు నిజమైనా, బెడిసికొట్టిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్) కూడా ఇదే చెబుతోంది. 1998 నుంచి 2009 ఎన్నికల దాకా వెలువడ్డ పలు ఒపీనియన్ పోల్స్‌ను సీఎస్డీఎస్ విశ్లేషించగా ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి... అంచనాలు ఇలా.. 1998 లోక్‌సభ ముందస్తు ఎన్నికల తరుణంలో వచ్చిన ఒపీనియన్ పోల్స్ ఫలితాలకు దగ్గరగానే ఉన్నాయి. కానీ 1999 లోక్‌సభ ఎన్నికలపై వచ్చిన అంచనాలు అంత కచి్చతంగా లేవు. నాడు బీజేపీ సాధించబోయే స్థానాలను ఒపీనియన్ పోల్స్ ఎక్కువ చేసి చూపాయి. అలాగే 2004 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఒపీనియన్ పోల్స్ జ్యోతిష్యం ఏమాత్రం పండలేదు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూపీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని పోల్స్ అసలే అంచనా వేయలేకపోయాయి. దాదాపు అన్ని ఒపీనియన్ పోల్స్ ఎన్డీఏ అధికారం నిలబెట్టుకుందనే చెప్పాయి. అలాగే 2009 లోక్‌సభ ఎన్నికల ముందు వేసిన అంచనాలు కూడా తప్పాయి. యూపీఏ అధికారాన్ని నిలుపుకుంటుందని మెజారిటీ ఒపీనియన్ పోల్స్ అంచనా వేయలేకపోయాయి. కానీ యూపీఏ కూటమికి 2004లో 222 లోక్‌సభ స్థానాలు రాగా 2009 ఎన్నికల్లో 262కు పెరిగాయి! 2014 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఎన్డీఏ కూటమి 257 నుంచి 340 సీట్ల వరకు గెలుచుకోవచ్చని ఒపీనియన్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. ఎన్డీఏకు 336 స్థానాలొచ్చాయి. కాంగ్రెస్ బలం బాగా పడిపోతుందన్న అంచనాలకు అనుగుణంగా 44 స్థానాలకే పరిమితమైంది. మళ్లీ 2019 ఎన్నికల్లో ఒపీనియన్ పోల్స్ అంచనాలు తప్పాయి. ఎన్డీఏకు 285 స్థానాలకు మించి రావని మెజారిటీ పోల్స్ పేర్కొనగా 353 స్థానాలు వచ్చాయి. బీజేపీ ఒంటరిగానే 303 స్థానాలు సాధించడం తెలిసిందే.ఎగ్జిట్ పోల్స్ కూడా అంతే! ప్రీ పోల్ సర్వేలకు, ఎగ్జిట్ పోల్ అంచనాలకు పెద్ద వ్యత్యాసం కనిపించదు. 2003 చివర్లో జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూల ఫలితాలు రావడంతో ఇండియా షైనింగ్ నినాదంతో 2004 కేంద్రంలో బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి 240–250 నుంచి స్థానాలు సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించగా ఫలితాలు రివర్సయ్యాయి. ఎన్డీఏ 187కే పరిమితమైంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీజేపీ సొంతంగా స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయలేకపోయాయి. 2016 చివర్లో మోదీ సర్కారు పెద్ద నోట్లను రద్దు చేశాక జరిగిన 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ తుస్సుమన్నాయి. హంగ్ వస్తుందన్న వాటి అంచనాలకు భిన్నంగా బీజేపీ ఏకంగా 300 సీట్లతో ఘన విజయం సాధించింది.నిబంధనలు ఇలా... ఎన్నికల్లో ఎవరికి ఓటేసే అవకాశం ఉందంటూ ఓటర్ల అభిప్రాయాలను తెలుసుకుని రూపొందించేవి ఒపీనియన్ పోల్స్. ఓటేసి పోలింగ్ బూత్‌ల నుంచి తిరిగి వెళ్లే ఓటర్లను ప్రశ్నించి వేసే అంచనాలే ఎగ్జిట్ పోల్స్. ఒపీనియన్ పోల్స్ ఫలితాలను ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందు వరకు ప్రకటించవచ్చు. తుది దశ పోలింగ్ ముగిశాక ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చు.తప్పడానికి కారణమేమిటి? ఒపీనియన్ పోల్స్ అంచనాలు చాలా వరకు తారుమారు కావడానికి ఎన్నో కారణాలున్నాయి. అంచనాల్లో తప్పులు ఎంత తక్కువగా ఉంటే ఫలితాలు కచి్చతత్వానికి అంత దగ్గరగా ఉంటాయి. → 1999 లోక్‌సభ ఎన్నికల్లో ఒపీనియన్ పోల్స్ అంచనాలు, వాస్తవ ఫలితాల మధ్య 20 సీట్ల దాకా తేడా ఉంది. → 2009 ఎన్నికల్లో ఈ అంతరం 25–60 స్థానాలకు పెరిగింది. 2014లోనైతే ఏకంగా 50–100 స్థానాల తేడా వచి్చంది. → ఓటర్ల అభిప్రాయాలు తెలుసుకుని తదనుగుణంగా ఈ సంస్థలు అంచనాలు వేస్తుంటాయి. అలా ఒక్కో పార్టీ/కూటమికి వచ్చే స్థానాలను లెక్కగడుతుంటాయి. → ఇది కాలం చెల్లిన పాత విధానమని నిపుణులు అంటున్నారు. → పోలింగ్ ఏజెన్సీలు సర్వేకు కావాల్సిన బలమైన వసతులు లేకపోవడం కూడా అంచనాల్లో తప్పులు పెరగడానికి కారణం. → ప్రతి నియోజకవర్గం నుంచి శాంపిల్ సైజు వీలైనంత ఎక్కువగా ఉండాలి. ఇందుకు భారీగా సిబ్బంది, నిధులు, సమయం కావాలి. → కానీ మన దగ్గర పోల్ ఏజెన్సీలకు ఈ వనరుల్లేవు. → పారీ్టల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే, ఫలితాల అంచనాలు అంత కష్టమవుతాయని సీఎస్డీఎస్ సైతం చెబుతోంది. → 2014 ఎన్నికల్లో 464 రాజకీయ పారీ్టలు పోటీ చేశాయి. 1998తో పోలిస్తే ఇది రెట్టింపు! → పోలింగ్ ఏజెన్సీలు పోటాపోటీగా పెరుగుతున్నాయి. దాంతో చాలా శాస్త్రీయంగా పోల్ సర్వేలు నిర్వహించకుండానే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. → సర్వే అంచనాలు ఎందుకు తప్పాయని చాలా పోలింగ్ ఏజెన్సీలు విశ్లేషణను చేసుకోవడం లేదు. → పైగా సర్వే ఫలితాలను ఎలా రూపొందించారో ఆధారాలను కూడా వెల్లడించడం లేదు. → ప్రీ పోల్ అంచనాలకు సంబంధించి జవాబుదారీ లేకపోవడం కూడా సమస్యకు కారణమే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Rahul Gandhi: యూపీలో ‘ఇండియా’ తుపాను
కనౌజ్/కాన్పూర్: విపక్షాల ‘ఇండియా’ కూటమి తుపాను ఉత్తరప్రదేశ్‌లోకి దూసుకొస్తోందని ఈ ధాటికి మరోసారి మోదీ ప్రధాని కాలేరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. యూపీలో 80 స్థానాలకుగాను కనీసం 50 చోట్ల మా కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్, కాన్పూర్లలో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో రాహుల్ మాట్లాడారు. ‘‘ దేశ ప్రధానిగా మోదీ మరోసారి పగ్గాలు చేపట్టలేరని లిఖితపూర్వక గ్యారెంటీగా భావించండి. ఇక అంతా అయిపోయింది. బీజేపీ ఓటమి ఖాయం. అందుకు అనుగుణంగానే విపక్షాల కూటమి చాన్నాళ్ల క్రితమే ఎన్నికల ప్రచార వ్యూహాలు రచించింది. విద్వేష బజార్లలో ప్రేమ దుకాణాలను తెరిచాం. భారత్ జోడో యాత్ర, న్యాయయాత్ర చేశాం. దేశవ్యాప్తంగా విపక్షాల సమావేశాలు నిర్వహించాం’’ అని అన్నారు. పారిశ్రామికవేత్తలు అదానీ, అంబానీలతో కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం చేసుకుందన్న మోదీ ఆరోపణలపై రాహుల్ స్పందించారు. ‘‘ ఓటర్లు పదేళ్ల నుంచి చూస్తున్నారు. ఒక్కసారైనా మోదీ అదానీ, అంబానీల పేరెత్తలేదు. కానీ ఇప్పుడు ఓటమి సుడిగుండం నుంచి కాపాడతారేమోనని వాళ్ల పేర్లు తొలిసారిగా ప్రస్తావిస్తున్నారు. ఓడిపోతున్నాను.. కాపాడండి అదానీ, అంబానీజీ అంటూ మోదీ ప్రాథేయపడుతున్నారు’’ అని రాహుల్ వెటకారంగా మాట్లాడారు. మోదీకి టెంపో బాగా తెలుసు టెంపోల నిండా అదానీ, అంబానీల నుంచి నగదు మూటలు వచ్చినందుకేæ కాంగ్రెస్ నోరుమూసుకుందని మోదీ అనడంపై రాహుల్.. ‘‘ అంటే మోదీకి తరచూ అదానీ డబ్బులను టెంపోలో పంపిస్తారన్నమాట. ఏ రకం టెంపోలో డబ్బులు పంపిస్తారో ఆయనకు బాగా తెలుసు. టెంపోల గురించి మోదీకి బాగా అవగాహన ఉన్నట్లుంది’’ అని అన్నారు. -
Lok Sabha Elections 2024: యూపీ... హస్తినకు గేట్‌వే
ఉత్తరప్రదేశ్. లోక్‌సభ ఎన్నికలనగానే అందరి మదిలో మెదిలే రాష్ట్రం. రాజకీయంగానే కాక జనాభాపరంగా, భౌగోళికంగానూ దేశంలో యూపీది ఎప్పుడూ కీలక పాత్రే. 2024 లోక్‌సభ ఎన్నికల ముంగిట ఇక్కడి రాజకీయ ముఖచిత్రం కూడా కొత్త మలుపులు తిరుగుతోంది. ఆయోధ్య రామమందిరం కల సాకారం చేసి హిందువుల మనసుల్లో గుడి కట్టుకున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరింత దూకుడు పెంచగా, విపక్ష ఇండియా కూటమి కూడా వ్యూహాలకు పదును పెడుతోంది. యూపీ కుంభస్థలాన్ని కొట్టిన పార్టీ హస్తినలో పాగా వేసినట్లేననేది నానుడి. స్టేట్ స్కాన్ దేశ రాజకీయాలకు గుండెకాయ వంటి యూపీలో సత్తా చాటేందుకు పార్టీలన్నీ అ్రస్తాలను రెడీ చేసుకుంటున్నాయి. దేశంలోనే అత్యధికంగా ఏకంగా 80 లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రం యూపీ. దేశాన్నేలే నాయకులను తీర్చిదిద్దడంలోనూ ఈ రాష్ట్రానిది ఘన చరిత్రే. ఏకంగా 8 మంది ప్రధానులను అందించింది యూపీ. ఈ రికార్డుకు మరే రాష్ట్రమూ దరిదాపుల్లో కూడా లేదు... ఈ ఎన్నికలు అత్యంత కీలకం... ఒకప్పుడు కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బహుజన సమాజ్ పార్టీ వంటి పార్టీలకు కంచుకోటగా ఉన్న యూపీలో 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తిస్థాయిలో పాగా వేసింది. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రత్యర్థులను మట్టి కరిపించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకుని తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. యూపీలో క్లీన్ స్వీప్ ద్వారానే బీజేపీ వరుసగా రెండుసార్లు బంపర్ మెజారిటీతో హస్తిన పీఠాన్ని చేజిక్కించుకోగలిగింది. కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఒంటరి పోరు చేసి కకావికలమైంది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, అఖిలేశ్ యాదవ్ సారథ్యంలోని ఎస్పీ కలిసి పోటీ చేసినా ప్రభావం చూపలేకపోయాయి. బీజేపీ హవాలో చిన్నా చితకా పార్టీలు సోదిలో కూడా లేకుండా పోయాయి. ఈసారి కూడా యూపీలో సత్తా చాటాలని బీజేపీ ఉవి్వళ్లూరుతోంది. ఎన్నికల షెడ్యూలైనా రాకుండానే తొలి విడతలో అభ్యర్థులను ప్రకటించిన 195 సీట్లలో ఏకంగా 51 స్థానాలు యూపీ నుంచే ఉండటం విశేషం! ఎస్పీ ఈసారి విపక్ష ఇండియా కూటమి భాగస్వామిగా కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తోంది. 2014లో యూపీలో ఏకంగా 71 సీట్లు గెలిచిన బీజేపీ 2019లోనూ 62 స్థానాలు నెగ్గింది. ఎన్డీఏ భాగస్వామి అప్నాదళ్(ఎస్) 2 సీట్లు గెలిచింది. బీఎస్పీ, ఎస్పీ, రాష్ర్టీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ)తో కూడిన మహా కూటమి 15 సీట్లకే పరిమితమైంది. బీఎస్పీ 38 స్థానాల్లో పోటీ చేసి 10 సీట్లలో విజయం సాధించగా, ఎస్పీ 37 సీట్లలో పోటీ చేసి ఐదే నెగ్గింది. ఆర్ఎల్డీ 3 సీట్లలోనూ మట్టికరిచింది. 67 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానంతో ఘోర పరాజయం మూటగట్టుకుంది. కేవలం సోనియాగాంధీ మాత్రమే రాయ్‌బరేలీలో నెగ్గారు. అతి పెద్ద రాష్ట్రం కావడంతో యూపీలో ఈసారి మొత్తం ఏడు దశల్లోనూ పోలింగ్ జరుగుతోంది. అయోధ్య.. బీజేపీ బ్రహా్మస్త్రం ఈసారి 400 పైగా లోక్‌సభ స్థానాలే లక్ష్యంగా బీజేపీ ముందునుంచే చకచకా పావులు కదిపింది. అయోధ్య రామమందిర కలను సాకారం చేయడం హిందువుల ఓట్లను కొల్లగొట్టడం ఖాయమని నమ్ముతోంది. ప్రధాని మోదీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేయడం ఎప్పట్లాగే మరింతగా కలిసొస్తుందని భావిస్తోంది. రాష్ట్రంలోనూ బీజేపీ సర్కారే ఉండటం, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసి, వేలాది కోట్లతో భారీ ఎత్తున అభివృద్ధి కార్యకలాపాలను చేపడుతుండటమూ బీజేపీకి కలిసొచ్చేదే. యూపీలో రెండుసార్లు బీజేపీ జెండా రెపరెపలాడించిన సీఎం యోగి ఆధిత్యనాథ్ పార్టీకి అదనపు బలం. జాట్ల మద్దతు దండిగా ఉన్న మాజీ ప్రధాని చౌధరి చరణ్ సింగ్ మనుమడు జయంత్ నేతృత్వంలోని ఆర్ఎల్డీ ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పి ఎన్డీఏలో చేరడం కాషాయదళంలో కొత్త జోష్ నింపింది. చరణ్ సింగ్‌కు భారతరత్న ప్రకటనతో జాట్ల ఓట్లు ఎన్డీఏకేనని బీజేపీ భావిస్తోంది. మరో భాగస్వామి అప్నాదళ్ (ఎస్)కూ యూపీలో మంచి పట్టుంది. ప్రధాని మోదీ ఇప్పటికే రాష్ట్రంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఆయనకు తోడు రాజ్‌నాథ్‌సింగ్, సీఎం యోగితో సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా కలియదిరుగుతున్నారు. ‘ఇండియా’ కూటమి పోటీనిచ్చేనా? విపక్ష ‘ఇండియా’ కూటమి యూపీలో ఇంకా కాలూచేయీ కూడదీసుకునే పనిలోనే ఉంది. కూటమి భాగస్వాముల్లో ఎస్పీ 63 సీట్లలో, కాంగ్రెస్ 17 సీట్లలో పోటీ చేసేలా ఒప్పందం కుదిరింది. సోనియా రాజ్యసభకు వెళ్లడంతో రాయ్‌బరేలీ నుండి ప్రియాంక పోటీ చేసే అవకాశం కన్పిస్తోంది. 2019 పరాజయం నేపథ్యంలో అమేథీలో రాహుల్ గాంధీ ఈసారి బరిలో దిగుతారో, లేదో చూడాలి. ఈ రెండు తప్ప మిగతా 15 స్థానాలకూ కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. వెనకబడ్డ, దళిత, మైనారిటీ వర్గాలపై అఖిలేశ్ బాగా దృష్టి పెట్టారు. కానీ గత ఎన్నికల సరళిని బట్టి చూస్తే, యాదవేతర ఓబీసీలు, జాతవేతర దళిత ఓటర్లను బీజేపీ తనవైపు తిప్పుకునేలా కనిపిస్తోంది. ఇక ఆర్ఎల్డీ గుడ్‌బై చెప్పడం ఇండియా కూటమికి ఎదురుదెబ్బే. బీఎస్పీ ఈసారి ఒంటరి పోరుకు సిద్ధమైంది. ఇవన్నీ బీజేపీకి మరింత కలిసొచ్చే అవకాశముందని విశ్లేషకుల అంచనా. ముస్లింల రూటెటు? యూపీ జనాభాలో 19% ఉన్న ముస్లింల ఓట్లపై విపక్షాలు ప్రధానంగా గురి పెడుతున్నాయి. 24 లోక్‌సభ సీట్లలో వీరు 20 నుంచి ఏకంగా 50 శాతం దాకా ఉన్నారు. దాంతో ఆ స్థానాల్లో వారు కీలకం కానున్నారు. ఈసారి ఎస్పీ, కాంగ్రెస్ జట్టు కట్టేందుకు ముస్లిం ఫ్యాక్టర్ కూడా ప్రధాన కారణమే. 2014, 2019ల్లో అవి విడిగా పోటీ చేయడంతో ముస్లిం ప్రాబల్య స్థానాల్లో బీజేపీ బాగా లాభపడింది. 2019లో ఎస్పీ, బీఎస్పీ నెగ్గిన స్థానాల్లో ముస్లింల ప్రాబల్యమున్నవే ఎక్కువ! రాహుల్ భారత్ జోడో యాత్ర, అఖిలేశ్ పీడీఏ (వెనుకబడిన, దళిత, మైనారిటీ) యాత్రలు యూపీలో ముస్లిం ప్రాబల్య జిల్లాల్లోనే సాగాయి. సర్వేలు ఏమంటున్నాయి...? యూపీలో ఎన్డీఏ కూటమికి ఏకంగా 70 నుంచి 72 సీట్లు రావచ్చని పలు ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఇండియా కూటమి ఆరేడు స్థానాలకు మించకపోవచ్చని చెబుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హస్తినలో విపక్షాల ర్యాలీ నేడే
న్యూఢిల్లీ: ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ నినాదంతో విపక్ష ఇండియా కూటమి ఆదివారం తలపెట్టిన భారీ ర్యాలీకి సర్వం సిద్ధమైంది. ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఇందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కూటమిలోని 29 పార్టీలూ ర్యాలీలో పాల్గొంటాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్‌గాంధీతో పాటు కూటమికి చెందిన పలువురు నేతలు ప్రసంగిస్తారన్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా పాల్గొనే అవకాశముందని చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు అడ్డంగా దుర్వినియోగం చేస్తోందని, ర్యాలీలో దీన్ని ప్రధానంగా ప్రస్తావిస్తామని తెలిపారు. డెరిక్ ఒబ్రియాన్ (టీఎంసీ), తిరుచ్చి శివ (డీఎంకే), అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), శరద్ పవార్ (ఎన్సీపీ–ఎస్సీపీ), తేజస్వీ యాద వ్ (ఆర్జేడీ), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) తదితరులు పాల్గొంటారన్నారు. ఇండియా కూటమి భాగస్వామి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ర్యాలీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. పార్టీ సారథి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ మద్యం కుంభకోణం కేసులో జైలుపాలైన నేపథ్యంలో ర్యాలీకి భారీగా జన సమీకరణ చేసి సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. -
ఇండియా కూటమి చెదరలేదు: జైరామ్ రమేశ్
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి చెక్కుచెదరలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ స్పష్టం చేశారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్, పశి్చమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దూరంగా ఉంటున్నప్పటికీ తమ కూటమికి స్థిరంగా, బలంగా ఉందని అన్నారు. అవినీతిని వ్యతిరేకిస్తున్నాం అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న ప్రకటనలన్నీ ఉత్తడొల్లేనని కొట్టిపారేశారు. జైరామ్ రమేశ్ ఆదివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని తేల్చిచెప్పారు. విపక్షాలు 272కి పైగా సీట్లు సాధిస్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు పొందినవారు పెద్ద ఎత్తున ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసి, బీజేపీకి సమర్పించుకున్నారని తెలిపారు. రూ.4,000 కోట్ల విలువైన బాండ్లకు రూ.4 లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులతో ప్రత్యక్షంగా సంబంధం ఉందన్నారు. ఐటీ, ఈడీ, సీబీఐ కేసులు ఎదుర్కొంటున్నవారు కూడా ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసి బీజేపీకి అందజేశారని వెల్లడించారు. ఇది ముమ్మాటికీ క్విడ్ ప్రో కో అని తేలి్చచెప్పారు. మౌలిక సదుపాయాలకు సంబంధించిన కాంట్రాక్టులను దక్కించుకున్న ఓ బీజేపీ ఎంపీ కూడా ఎలక్టోరల్ బాండ్లు కొన్నాడని వెల్లడించారు అవినీతిపై పోరాటం అంటూ ప్రధాని మోదీ చెబుతున్న మాటల్లో ఏమాత్రం పస లేదని జైరామ్ రమేశ్ స్పష్టం చేశారు. -
Delhi liquor scam: 31న విపక్షాల మహా ర్యాలీ
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కనీ్వనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుగా విపక్ష ‘ఇండియా’ కూటమి నాయకులు చేతులు కలుపుతున్నారు. కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూ, ఆయనకు సంఘీభావంగా ఈ నెల 31న తేదీన ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ పేరుతో మహా ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. కూటమి భాగస్వామ్య పక్షాల అగ్రనేతలు ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక భాగస్వామి అన్న సంగతి తెలిసిందే. దేశ ప్రయోజనాలతోపాటు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్న లక్ష్యంతో మహా ర్యాలీ చేపట్టాలని నిర్ణయించామని ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. దేశంలో తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ప్రజాస్వామ్యం పెను ముప్పును ఎదుర్కొంటోందని అన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించేవారంతా కేజ్రీవాల్ ఆరెస్టు పట్ల ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ‘‘ఇది కేవలం అరవింద్ కేజ్రీవాల్‌కు సంబంధించిన సమస్య కాదు. ప్రతిపక్షాలన్నీ బెదిరింపులను ఎదుర్కొంటున్నాయి. అధికారంలో ఉన్న వ్యక్తులు మొదట విపక్షాలను డబ్బుతో కొనేయాలని చూస్తున్నారు. మాట వినకపోతే ఈడీ, ఐటీ, సీబీఐని ప్రయోగిస్తున్నారు. అయినా లొంగకపోతే తప్పుడు కేసుల్లో ఇరికించి అరెస్టు చేస్తున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఇలాగే అరెస్టు చేశారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పైనా గురిపెట్టారు’’ అని గోపాల్ రాయ్ ఆరోపించారు. కేజ్రీవాల్ కుటుంబ సభ్యులను గృహ నిర్బంధంలో ఉంచారని, ఆప్ కార్యాలయాన్ని సీజ్ చేశారని ధ్వజమెత్తారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి విపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయని చెప్పారు. కేవలం రాజకీయ సభ కాదు ఢిల్లీలో ఈనెల 31న జరిగే మహా ర్యాలీ కేవలం రాజకీయ సభ కాదని, కేంద్రంలోని నిరంకుశ బీజేపీకి వ్యతిరేకంగా వినిపించే గొంతుక అని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరి్వందర్ సింగ్ లవ్లీ పేర్కొన్నారు. దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ ఖాతాలను స్తంభింపజేశారని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ అలుపెరుగని పోరాటం సాగిస్తున్నారని చెప్పారు. ఇండియా కూటమి పక్షాలకు అండగా నిలుస్తామని తెలిపారు. మోదీ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ పోరాడుతాయని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంపై దాడులను సహించబోమని సీపీఎం నేత రాజీవ్ కున్వార్ స్పష్టం చేశారు. -
Lok Sabha elections 2024: నాలుగు రాష్ట్రాల్లో పొత్తు కాంగ్రెస్, ఆప్ ఒప్పందం
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ సహా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు ఖరారైంది. ఢిల్లీ, గుజరాత్, గోవా, హరియాణాల్లో సీట్ల పంపకం పూర్తయింది. ఢిల్లీలో కాంగ్రెస్ 4, ఆప్ 3 చోట్ల బరిలో దిగుతాయి. న్యూఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ స్థానాల్లో ఆప్, చాందినీ చౌక్, నార్త్ ఈస్ట్ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ సీట్లలో కాంగ్రెస్ బరిలో ఉంటాయి. గుజరాత్లో 24 స్థానాల్లో కాంగ్రెస్, రెండు స్థానాల్లో (భావ్‌నగర్, భరూచ్) ఆప్ పోటీ చేస్తాయి. హరియాణాలో కురుక్షేత్ర స్థానంలో ఆప్, మిగతా 9 చోట్లా కాంగ్రెస్ బరిలో ఉంటాయి. గోవాలో మొత్తం రెండు సీట్లతో పాటు చండీగఢ్ లోక్‌సభ స్థానంలోనూ కాంగ్రెసే పోటీ చేస్తుంది. కాంగ్రెస్ నేత ముకుల్ వాస్నిక్, ఆప్ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ శనివారం ఈ మేరకు మీడియాకు వెల్లడించారు. పంజాబ్‌లో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొత్తుతో సంబంధం లేకుండా అక్కడి 13 స్థానాల్లో విడిగానే పోటీ చేయాలని రెండు పారీ్టలూ నిర్ణయించాయి. గుజరాత్లో భరూచ్ స్థానాన్ని ఆప్‌కు కేటాయించడాన్ని దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కుమారుడు ఫైజల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్కడ అహ్మద్ పటేల్ పలుమార్లు గెలిచారు. ఈసారి కూడా కాంగ్రెస్ టికెట్‌పై తాను పోటీ చేస్తానని, దీనిపై పార్టీ అధిష్టానాన్ని కలిసి చర్చిస్తానని ఫైజల్ చెప్పారు. -
Lok Sabha elections 2024: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 17 సీట్లు
లక్నో: విపక్షాల ‘ఇండియా’ కూటమిలో మిత్రపక్షాలైన కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల పొత్తు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో ఓ కొలిక్కి వచ్చింది. చాన్నాళ్లుగా సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగి చివరకు బుధవారం తమ సీట్ల పంపకాలపై ప్రకటన చేశాయి. ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలు ఉండగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌కు 17 చోట్ల పోటీచేసే అవకాశం ఇచి్చంది. ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్ ఉత్తమ్ పటేల్, ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర చౌదరి, కాంగ్రెస్ యూపీ చీఫ్ అజయ్ రాయ్, ఏఐసీసీ యూపీ వ్యవహారాల ఇన్చార్జ్ అవినాశ్ పాండేల భేటీ తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ‘మేం 17 చోట్ల పోటీ చేస్తాం. మిగతా 63 స్థానాల్లో ఎస్పీ, ఇతర కూటమి భాగస్వామ్య పారీ్టలు బరిలో నిలుస్తాయి’’ అని కాంగ్రెస్ నేత వినాశ్ పాండే చెప్పారు. ప్రియాంకా గాంధీ చొరవతో కుదిరిన ఒప్పందం యూపీలో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఒక అడుగు ముందుకేసి ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌తో ఫోన్లో మంతనాలు జరిపారని, దీంతో సీట్ల పంపకాల ప్రక్రియ ఒక కొలిక్కి వచి్చందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. శ్రవస్థీ నియోజకవర్గంలో తామే పోటీచేస్తామని పట్టుబట్టి ఎస్పీ సాధించింది. కాంగ్రెస్ అదనంగా సీతాపూర్, బారాబంకీల్లో పోటీచేసే అవకాశం సాధించింది. వీటితోపాటు అమేథీ, రాయ్‌బరేలీ, కాన్పూర్ నగర్, వారణాసి, షహరాన్‌పూర్, అమ్రోహా, సిక్రీ, మహారాజ్‌గంజ్, బన్స్‌గావ్, బులంద్òÙహర్, ఘజియాబాద్, మథుర, ప్రయాగ్‌రాజ్, దేవరియా, ఝాన్సీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీచేయనుంది. మరోవైపు, మధ్యప్రదేశ్‌లో ఖజురహోలో మాత్రమే ఎస్పీ పోటీచేయనుంది. మిగతా 28 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు ఎస్పీ మద్దతు ఇవ్వనుంది. -
కూటమిని కాపాడుకుంటాం: ఖర్గే
కలబురిగి(కర్ణాటక): బిహార్‌లో సీఎం నితీశ్ కుమార్‌కు చెందిన జేడీ(యూ) ఇండియా కూటమిని వీడి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏలో చేరనుందన్న వార్తలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే తపన ఉన్నవారు కచ్చితంగా ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోరని తమ పార్టీ భావిస్తోందని ఖర్గే పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలతో కూడిన ఇండియా కూటమిని ఐక్యంగా నిలిపి ఉంచేందుకు కాంగ్రెస్ శాయశక్తులా ప్రయత్నిస్తుందని ఆయన స్పష్టం చేశారు. -
India alliance: సీట్ల సర్దుబాటు కింద 11 స్థానాలిస్తాం
లక్నో: విపక్షాల ‘ఇండియా’ కూటమి భాగస్వామి పారీ్టగా భావిస్తూ 11 లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్‌కు ఇస్తున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ శనివారం ప్రకటించింది. ఈ కేటాయింపుతో విపక్షాల కూటమిలో సీట్ల సర్దుబాటు పర్వానికి చక్కటి శుభారంభం లభించిందని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. ‘ ఈ పంథా గెలుపు సమీకరణాలతో మరింత ముందుకెళ్తుంది. వెనుకబడిన, దళిత, అల్పసంఖ్యాల వర్గాల ఫార్ములాతో ఇండియా కూటమి చరిత్ర సృష్టించనుంది’’ అని అఖిలేశ్ అభిలíÙంచారు. ‘‘ కాంగ్రెస్‌కు ఇస్తామన్న సీట్ల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండబోదు’’ అని ఎస్పీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి స్పష్టంచేశారు. ‘‘ యూపీలో సీట్ల సర్దుబాటులో భాగంగా మేం కాంగ్రెస్‌కు 11, రా్రïÙ్టయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ)కి ఏడు సీట్లు ఇస్తాం. మిగతా మొత్తం 62 స్థానాల్లో మేమే పోటీచేస్తాం’’ అని వివరించారు. దీనిపై ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ స్పందించారు. ‘‘ మిత్ర పక్షం ఎస్పీ చేసిన ప్రతిపాదనపై తుది నిర్ణయం కాంగ్రెస్ నేత ముకుల్ వాస్నిక్ నేతృత్వంలోని కమిటీ తీసుకోనుంది’ అని అన్నారు. -
ఐక్యంగానే పోరాడతాం: రాహుల్
కూచ్ బెహార్(పశ్చిమ బెంగాల్): దేశవ్యాప్తంగా విపక్షాల ‘ఇండియా’ కూటమి ఐక్యమత్యంగానే దేశవ్యాప్తంగా అన్యాయంపై పోరాటం కొనసాగిస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. పశ్చిమబెంగాల్లో ఒంటరిగానే బరిలో దిగుతామని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ప్రకటించిన వేళ రాహుల్ కూటమి ఐక్యతపై మరోసారి స్పష్టతనివ్వడం గమనార్హం. అస్సాంలో గువాహటి నగరంలోకి భారత్ జోడో న్యాయ్ యాత్ర అడుగుపెట్టకుండా పోలీసులు అడ్డుకోవడం, కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల ఘర్షణల నడుమ అస్సాంలో ఉద్రిక్తంగా కొనసాగిన యాత్ర గురువారం పశ్చిమబెంగాల్‌లోకి అడుగుపెట్టింది. బక్షీర్హాట్ గుండా రాష్ట్రంలోని కూచ్ బెహార్ జిల్లాలో రాహుల్ యాత్రను మొదలుపెట్టి అక్కడ మద్దతు దారులు, కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘దేశంలో అన్యాయం రాజ్యమేలు తున్నందుకే యాత్రకు న్యాయ్ అనే పదం జతచేశాం’’ అని అన్నారు. మరోవైపు బెంగాల్లో యాత్రలో సీపీఎం, వామపక్ష పార్టీలు పాలుపంచుకునే అవకాశం ఉంది. బస్సులో ఉన్నది రాహుల్ కాదేమో: అస్సాం సీఎం హిమంత అస్సాంలో న్యాయ్ యాత్ర సందర్భంగా బస్సు లోపలి వైపు రాహుల్ సేదతీరుతూ ముందువైపు డూప్‌ను కూర్చోబెట్టి యాత్ర చుట్టేస్తు న్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. ‘‘అస్సాంలో న్యాయ్ యాత్ర ప్రభావం శూన్యం. యాత్ర కొనసాగిన అన్ని నియోజకవర్గాల్లో బీజేపీనే విజయం సాధిస్తుంది. రాహుల్ ప్రచారం చేసిన చోటల్లా బీజేపీనే గెలుస్తుంది. ఆ కోణంలో చూస్తే బీజేపీకి రాహుల్ అవసరం ఎంతైనా ఉంది’’ అని వ్యంగ్యంగా మాట్లాడారు. కొన్ని చోట్ల రాహుల్ అస్సలు బస్సు దిగట్లేరని, బస్సులో ముందువైపు కనిపించేది రాహుల్ కాదని కొన్ని మీడియాకథనాలు వచ్చాయన్నారు. -
Lok Sabha polls 2024: బీజేపీ వైపు... నితీశ్ చూపు!
పట్నా/న్యూఢిల్లీ: కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమికి రెండు రోజుల్లోనే మూడో భారీ ఎదురుదెబ్బ! కీలక భాగస్వామి అయిన జేడీ(యూ) అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ కూటమికి కటీఫ్ చెప్పేలా కని్పస్తున్నారు. అవసరార్థపు గోడ దూకుళ్లకు పెట్టింది పేరైన ఆయన 2024 లోక్‌సభ ఎన్నికల ముంగిట యూ టర్న్ తీసుకుని మళ్లీ బీజేపీతో జట్టు కట్టే దిశగా సాగుతున్నారు. ఈ దిశగా బుధవారం నుంచీ జరుగుతున్న వరుస పరిణామాలతో బిహార్‌లో ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్, వామపక్షాల మహాఘట్బంధన్ సంకీర్ణ సర్కారు కూడా కుప్పకూలేలా కన్పిస్తోంది. ఘట్‌బంధన్‌తో 18 నెలల కలహాల కాపురానికి ఫుల్స్టాప్ పెట్టి బీజేపీ మద్దతుతో మరోసారి సీఎం పీఠం కాపాడుకునే ప్రయత్నాలకు నితీశ్ పదును పెట్టారంటూ వార్తలు వస్తున్నాయి. ప్రతిగా ఆర్జేడీ కూడా జేడీ(యూ)తో నిమిత్తం లేకుండా మెజారిటీ సాధనకు ప్రయత్నాలకు పదును పెట్టింది. ఈ దిశగా జేడీ(యూ) సీనియర్ నేతలతో నితీశ్ ఇంట్లో, ఘట్‌బంధన్‌లోని ఇతర పక్షాలతో ఆర్జేడీ చీఫ్ లాలుప్రసాద్ నివాసంలో పోటాపోటీ సమావేశాలతో గురువారం బిహార్ రాజధాని పట్నాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నితీశ్ నివాసంలో భేటీలో జేడీ(యూ) ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు. ఇక లాలు ఒకవైపు తన నివాసంలో భేటీ జరుగుండగానే మరోవైపు ఆర్జేడీకే చెందిన అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌధరితో కూడా ఫోన్లో మంతనాలు జరిపారు. దాంతో నితీశ్ మరింత అప్రమత్తయ్యారు. ఆర్జేడీకి ప్రభుత్వ ఏర్పాటుకు చాన్సివ్వకుండా అవసరమైతే అసెంబ్లీని రద్దు చేయాలని కూడా ఆయన యోచిస్తున్నట్టు చెబుతున్నారు! లోక్‌సభ ఎన్నికల్లో పశి్చమ బెంగాల్లో కాంగ్రెస్‌తో పొత్తుండబోదని, ఒంటరిగానే పోటీ చేస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పంజాబ్‌లో ఆప్‌దీ ఒంటరి పోరేనని ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ బుధవారం ప్రకటించడం తెలిసిందే. దాంతో ఒక్కసారిగా డీలా పడ్డ ఇండియా కూటమిలో బిహార్ తాజా పరిణామాలు మరింత కలవరం రేపుతున్నాయి. నితీశ్ బీజేపీ గూటికి చేరితే విపక్ష కూటమి దాదాపుగా విచి్ఛన్నమైనట్టేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ జోడో న్యాయ్ యాత్రకు రెండు రోజుల విరామమిచ్చి ఢిల్లీ చేరిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఈ పరిణామాలన్నింటిపై పార్టీ నేతలతో మంతనాల్లో మునిగిపోయారు. మరోవైపు బిహార్ బీజేపీ చీఫ్ సమర్థ్ చౌదరి, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి అశ్వినీ చౌబేతో పాటు జేడీ(యూ) రాజకీయ సలహాదారు కేసీ త్యాగి కూడా ఒకే విమానంలో హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు. దాంతో హస్తినలోనూ రాజకీయ వేడి తారస్థాయికి చేరుతోంది. ఆదినుంచీ కలహాల కాపురమే... బిహార్‌లో 2020లో ఏర్పాటైన మహాఘట్బంధన్ సంకీర్ణ సర్కారు నిత్యం కలహాలమయంగానే సాగుతూ వస్తోంది. ముఖ్యంగా తేజస్విని సీఎం చేసి తప్పుకోవాలని లాలు కొంతకాలంగా పట్టుబడుతుండటంపై నితీశ్ గుర్రుగా ఉన్నారు. జేడీ(యూ) తాజా మాజీ అధ్యక్షుడు లలన్ సింగ్ సాయంతో ఆ పార్టీ నుంచి డజను మంది ఎమ్మెల్యేలను లాగేసేందుకు లాలు ఇటీవల గట్టి ప్రయత్నమే చేశారు. దాన్ని సకాలంలో పసిగట్టిన నితీశ్ లలన్‌కు ఉద్వాసన పలికి తానే పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు. ఈ ఉదంతంతో ఆర్జేడీతో విభేదాలు తారస్థాయికి చేరాయి. లాలు, నితీశ్‌లిద్దరికీ రాజకీయ గురువైన బిహార్ దివంగత సీఎం కర్పూరి ఠాకూర్ శత జయంత్యుత్సవాల సందర్భంగా బుధవారం నితీశ్ చేసిన వ్యాఖ్యలు విభేదాలకు మరింతగా ఆజ్యం పోశాయి. పారీ్టల్లో కుటుంబాల పెత్తనాన్ని కర్పూరి తీవ్రంగా వ్యతిరేకించేశారన్న నితీశ్ వ్యాఖ్యలు ఆర్జేడీని ఉద్దేశించినవేనంటూ లాలు కుటుంబం మండిపడింది. నితీశ్ అవకాశవాది అని తూర్పారబడుతూ లాలు కుమార్తె రోహిణీ ఆచార్య ఎక్స్‌లో పెట్టిన పోస్టులతో పరిస్థితి రసకందాయంలో పడింది. నితీశ్‌పై ఆమె విమర్శలను రాష్ట్ర బీజేపీ అగ్ర నేతలు తీవ్రంగా ఖండించడం, ఆ వెంటనే ఆ పారీ్టతో జేడీ(యూ) దోస్తీ అంటూ వార్తలు రావడం... నితీశ్, లాలు నివాసాల్లో పోటాపోటీ సమావేశాల తదితర పరిణామా లు వెంటవెంటనే జరిగిపోయాయి. గిరిరాజ్ చెణుకులు పదేపదే ఆర్జేడీపై అలగడం నితీశ్‌కు పరిపాటేనంటూ కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర నేత గిరిరాజ్‌సింగ్ విసిరిన చెణుకులు గురువారం వైరల్‌గా మారాయి. ‘‘నే పుట్టింటికి వెళ్లిపోతా. నువ్వు చూస్తూ ఉండిపోతావ్ అని పాడుతూ లాలును నితీశ్ చీటికీమాటికీ బెదిరిస్తుంటారు. కానీ పుట్టింటి (బీజేపీ) తలుపులు తనకు శాశ్వతంగా మూసుకుపోయాయన్న వాస్తవాన్ని మాత్రం దాస్తుంటారు’’ అంటూ తాజా పరిణామాలపై గిరిరాజ్ స్పందించారు. గోడదూకుళ్లలో ఘనాపాఠి రాజకీయ గాలికి స్వీయ ప్రయోజనాలకు అనుగుణంగా మంచినీళ్ల ప్రాయంగా కూటములను మార్చడంలో నితీశ్‌కుమార్ సిద్ధహస్తుడు. దాంతో ఆయన్ను పల్టూ (పిల్లిమొగ్గల) కుమార్‌గా పిలవడం పరిపాటిగా మారింది. బీజేపీ వాజ్‌పేయీ, అడ్వాణీల సారథ్యంలో సాగినంత కాలం ఆ పారీ్టతో నితీశ్ బంధం అవిచి్ఛన్నంగా సాగింది. వారి శకం ముగిసి నరేంద్ర మోదీ తెరపైకి రావడంతో పొరపొచ్ఛాలు మొదలయ్యాయి. ఆయన్ను ప్రధాని అభ్యరి్థగా ప్రకటించడంతో బీజేపీతో 17 ఏళ్ల బంధానికి 2013లో తొలిసారిగా గుడ్‌బై చెప్పారు. 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత బిహార్ సీఎంగా తప్పుకుని జితిన్‌రాం మాంఝీని గద్దెనెక్కించారు. తన బద్ధ విరోధి అయిన లాలు సారథ్యంలోని ఆర్జేడీతో పొత్తు ద్వారా సర్కారును కాపాడుకున్నారు. 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో మహాఘట్‌బంధన్‌గా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఘనవిజయం సాధించి మళ్లీ సీఎం అయ్యారు. కానీ సంఖ్యాబలంలో ఆర్జేడీ పెద్ద పారీ్టగా అవతరించడంతో నితీశ్ ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. లాలు కుమారుడు తేజస్విని అయిష్టంగానే డిప్యూటీ సీఎం చేయాల్సి వచి్చంది. రెండేళ్లలోపే కూటమిలో పొరపొచ్ఛాలు పెద్దవయ్యాయి. సరిగ్గా అదే సమయంలో లాలు, తేజస్విలపై సీబీఐ కేసులు నితీశ్‌కు అందివచ్చాయి. డిప్యూటీ సీఎం పోస్టుకు రాజీనామా చేసేందుకు తేజస్వి ససేమిరా అనడంతో తానే సీఎం పదవికి రాజీనామా చేసి 2017లో కూటమి సర్కారును కుప్పకూల్చారు. గంటల వ్యవధిలోనే బీజేపీ మద్దతుతో మళ్లీ గద్దెనెక్కి ఔరా అనిపించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయంతో నితీశ్ మళ్లీ సీఎం అయ్యారు. కానీ ఈసారి బీజేపీ పెద్ద పారీ్టగా అవతరించడంతో ఏ విషయంలోనూ తన మాట సాగక ఉక్కపోతకు గురయ్యారు. చివరికి జేడీ(యూ)ను చీల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ 2022 ఆగస్టులో దానికి గుడ్‌బై చెప్పారు. మర్నాడే ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో మహాఘట్బంధన్ సర్కారు ఏర్పాటు చేసి సీఎం పీఠం కాపాడుకున్నారు. తాజాగా నితీశ్ మళ్లీ బీజేపీ వైపు చూస్తున్నారన్న వార్తలు నిజమైతే ఇది ఆయనకు ఐదో పిల్లిమొగ్గ అవుతుంది! తెరపైకి మెజారిటీ లెక్కలు... నితీశ్ బీజేపీ గూటికి చేరతారన్న వార్తల నేపథ్యంలో బిహార్ అసెంబ్లీలో బలాబలాలు మరోసారి తెరపైకొచ్చాయి. 243 మంది సభ్యుల అసెంబ్లీలో మెజారిటీ మార్కు 122. మహాఘట్బంధన్ ప్రస్తుత బలం 159. 45 మంది ఎమ్మెల్యేలున్న జేడీ(యూ) ని్రష్కమిస్తే ఆర్జేడీ (79), కాంగ్రెస్ (19), వామపక్షాల (16)తో కూటమి బలం 114కు పడిపోతుంది. అప్పుడు మెజారిటీకి మరో 8 మంది ఎమ్మెల్యేలు అవసరమవుతారు. జితిన్‌రాం మాంఝీ సారథ్యంలోని హెచ్ఏఎం (4), మజ్లిస్ (1), స్వతంత్ర ఎమ్మెల్యే (1) మద్దతు కూడగట్టినా 120కే చేరుతుంది. మెజారిటీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కావాలి. ఈ నేపథ్యంలో మాంఝీ తదితరులతో పాటు జేడీ(యూ) అసంతృప్త ఎమ్మెల్యేలతో కూడా ఆర్జేడీ చీఫ్ లాలు జోరుగా మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జేడీకి చెందిన స్పీకర్ పాత్ర కూడా కీలకంగా మారేలా కన్పిస్తోంది. మరోవైపు బీజేపీ, జేడీ(యూ) కలిస్తే 123 మంది ఎమ్మెల్యేలతో మెజారిటీ మార్కును అలవోకగా దాటేస్తాయి. తద్వారా తానే సీఎంగా కొనసాగాలని నితీశ్ భావిస్తున్నట్టు సమాచారం. కానీ అందుకు బీజేపీ సుముఖంగా లేదని, తమకే సీఎం చాన్సివ్వాలని భావిస్తోందని చెబుతున్నారు. అందుకు నితీశ్ అంగీకరించే పక్షంలో ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. -
Lok Sabha polls 2024: ఇండియా కూటమికి బీటలు
కోల్‌కతా/చండీగఢ్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మోదీ సారథ్యంలోని అధికార బీజేపీ కూటమికి గట్టి పోటీ ఇవ్వాలన్న విపక్షాల ప్రయత్నాలకు ఆదిలోని హంసపాదు! కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ‘ఇండియా’ కూటమికి భాగస్వామ్య పారీ్టలు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం రెండు భారీ షాకులిచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో పశి్చమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించింది. పంజాబ్‌లోనూ తమది ఒంటరి పోరేనని ఆప్ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బెంగాల్లోకి ప్రవేశించడానికి ఒక రోజు ముందు జరిగిన ఈ పరిణామంతో ఆ పార్టీ ఒక్కసారిగా కంగుతిన్నది. వెంటనే నష్ట నివారణ చర్యలకు రంగంలోకి దిగింది. మమత లేని విపక్ష కూటమిని ఊహించలేమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు. తృణమూల్‌తో పొత్తు చర్చలింకా సాగుతున్నాయని, బెంగాల్లో కలిసే పోటీ చేస్తామని ఆశాభావం వెలిబుచ్చారు. కానీ ఆ వ్యాఖ్యలను మమత నిర్ద్వంద్వంగా ఖండించారు. పొత్తుపై కాంగ్రెస్‌తో ఎలాంటి చర్చలూ జరగడం లేదని స్పష్టం చేశారు. ఈలోపే, సీట్ల కోసం తృణమూల్‌ను వేడుకోబోమంటూ కాంగ్రెస్ అగ్ర నేత, బెంగాల్ పీసీసీ చీఫ్ అధీర్ రంజన్ చౌధరి చేసిన వ్యాఖ్యలు మరింతగా మంటలు రేపాయి. 28 విపక్ష పార్టీలతో కూడిన ఇండియా కూటమికి కీలక సమయంలో బీటలు పడుతుండటం కాంగ్రెస్‌ను కుంగదీసే పరిణామమేనని అంటున్నారు. బెంగాల్లో కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తూ ఉండబోదని మీడియాతో మమత కుండబద్దలు కొట్టారు. ఆ పార్టీ మొండి వైఖరి వల్లే ఒంటరి పోరు నిర్ణయం తీసుకోవాల్సి వచి్చందని స్పష్టం చేశారు. సీట్లు సర్దుబాటుపై తన ప్రతిపాదనలను కాంగ్రెస్ పరిశీలించను కూడా లేదని ఆమె ఆరోపించారు. అంతేగాక బెంగాల్లో క్షేత్రస్థాయి వాస్తవాలను పరిగనణలోకి తీసుకోకుండా కాంగ్రెస్ ఆచరణసాధ్యం కాని డిమాండ్లు తమ ముందుంచినట్టు తృణమూల్ వర్గాలు మండిపడ్డాయి. ఆది నుంచీ అంతంతే... విపక్ష ఇండియా కూటమికి మమత దూరంగానే మెలుగుతూ వస్తున్నారు. ఇటీవలి వర్చువల్ భేటీకి కూడా డుమ్మా కొట్టారు. బెంగాల్లో ఆగర్భ శత్రువులైన తృణమూల్, లెఫ్ట్ ఫ్రంట్ రెండూ ఇండియా కూటమి భాగస్వాములే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 42 స్థానాలకు గాను తృణమూల్ 22 సీట్లు నెగ్గగా బీజేపీ ఏకంగా 18 స్థానాలు సొంతం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 2 సీట్లతో సరిపెట్టుకుంది. ఈసారి పొత్తులో భాగంగా అవే రెండు సీట్లు కాంగ్రెస్‌కు ఇస్తామని మమత ప్రతిపాదించడంతో కాంగ్రెస్ అవాక్కైనట్టు చెబుతున్నారు. అన్ని తక్కువ స్థానాలతో సరిపెట్టుకునేందుకు ససేమిరా అనడంతో చిర్రెత్తుకొచి్చన దీదీ మొత్తానికే అడ్డం తిరిగారని సమాచారం. పొత్తులో భాగంగా లెఫ్ట్ ఫ్రంట్‌కు కూడా కొన్ని సీట్లు వదులుకోవాల్సి రావడం కూడా ఆమెకు రుచించలేదని తృణమూల్ వర్గాలు వివరించాయి. బెంగాల్లో 2001, 2011 అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2009 లోక్‌సభ ఎన్నికల్లో కూడా తృణమూల్, కాంగ్రెస్ జట్టుగా పోటీ చేశాయి. పంజాబ్‌లో ఒంటరి పోరే సీఎం భగవంత్ మాన్ వెల్లడి పంజాబ్‌లో మొత్తం 13 సీట్లలోనూ ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తుండబోదని స్పష్టం చేశారు. నిజానికి లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ, పంజాబ్, హరియాణా, గోవా, గుజరాత్‌ల్లో పొత్తు దిశగా కాంగ్రెస్, ఆప్ మధ్య చర్చలింకా జరుగుతూనే ఉన్నాయి. పైగా త్వరలో జరగనున్న చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాన్ ప్రకటన కాంగ్రెస్‌లో కలకలం రేపింది. ఆ పార్టీతో పొత్తు ప్రతిపాదనను పంజాబ్ ఆప్ నేతలంతా వ్యతిరేకిస్తున్నారని మాన్ మీడియకు స్పష్టం చేశారు. మొత్తం 13 లోక్‌సభ స్థానాలకూ ఆప్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే చురుగ్గా సాగుతోందని తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో 13 స్థానాలకు గాను కాంగ్రెస్ 8 నెగ్గింది. అకాలీదళ్, బీజేపీ చెరో రెండు, ఆప్ ఒక స్థానంలో గెలిచాయి. కూటమిపై ఎవరికీ పెత్తనముండదు మమత నర్మగర్భ వ్యాఖ్యలు బెంగాల్లో పొత్తు లేకపోయినా జాతీయ స్థాయిలో మాత్రం విపక్ష ఇండియా కూటమికి తృణమూల్ కట్టుబడి ఉంటుందని మమత ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం. ‘‘కావాలంటే కాంగ్రెస్‌ను దేశవ్యాప్తంగా 300 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయమనండి. మిగతా 243 స్థానాల్లో ప్రాంతీయ పారీ్టలు బరిలో దిగుతాయి. కానీ బెంగాల్లో మాత్రం కాంగ్రెస్ వేలు పెడతానంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు’’ అంటూ ఆమె కుండబద్దలు కొట్టారు. జాతీయ స్థాయిలో విపక్షాల వ్యూహం ఎలా ఉండాలో కూడా లోక్‌సభ ఎన్నికల తర్వాతే నిర్ణయించుకుంటామని చెప్పుకొచ్చారు. ‘‘బీజేపీని సమష్టిగా ఎదుర్కొనే విషయంలో ప్రాంతీయ పారీ్టలన్నీ ఒక్కతాటిపై ఉంటాయి. దాన్ని ఓడించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలూ చేస్తాం’’ అని స్పష్టం చేశారు. అయితే, విపక్ష కూటమి ఏ ఒక్క పారీ్టకో చెందబోదంటూ కాంగ్రెస్‌పై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ యాత్ర శుక్రవారం బెంగాల్లోకి ప్రవేశించనున్నా కనీసం మర్యాద కోసమన్నా దానిపై కాంగ్రెస్ తనకు సమాచారం కూడా ఇవ్వలేదని దీదీ ఆరోపించారు. మమత ప్రకటన బహుశా ఇండియా కూటమి వ్యూహంలో భాగమై ఉండొచ్చని మరో భాగస్వామ్య పార్టీ ఎన్సీపీ (శరద్ పవార్) అభిప్రాయపడింది! -
Hain Tayyar Hum: మేమొస్తే కుల గణన
నాగపూర్: దేశంలో కీలకమైన రంగాల్లో ఓబీసీలు, దళితులు, గిరిజనులకు వారికి జనాభా తగ్గుట్టుగా తగిన ప్రాతినిధ్యం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహిస్తామని మరోసారి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ 139వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని నాగపూర్‌లో గురువారం ‘హై తయ్యార్ హమ్’ పేరిట నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. రాజ్యాధికారాన్ని సామాన్య ప్రజల చేతికి అప్పగించాలన్నదే కాంగ్రెస్ ప్రధాన ఉద్దేశమని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కోట్లాది మందిని పేదరికంలోకి నెట్టేసిందని ఆరోపించారు. పేదల ఇండియా, ధనికుల ఇండియా అనే రెండు దేశాలను తాము కోరుకోవడం లేదన్నారు. గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచి్చందో చెప్పాలని నిలదీశారు. దేశంలో నిరుద్యోగం అత్యధిక స్థాయికి చేరిందని ఆరోపించారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలి్పస్తామని పేర్కొన్నారు. మోదీ ఓబీసీనని ఎందుకు చెప్పుకుంటున్నారు ప్రధాని మోదీ తాను ఓబీసీనని పదేపదే చెప్పుకుంటున్నారని, ఇప్పుడు కుల గణన గురించి తాము ప్రశ్నిస్తే నోరు విప్పడం లేదని రాహుల్ విమర్శించారు. పేదలు అనే ఒకే కులం ఉందని అంటున్నారని ఆక్షేపించారు. నిజంగా ఒకే కులం ఉంటే ఓబీసీనని ఎందుకు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. బీజేపీలో అగ్రనేతల నుంచి ఆదేశాలు వస్తుంటాయని, కాంగ్రెస్‌లో మాత్రం సామాన్య కార్యకర్తలు సైతం నాయకత్వాన్ని ప్రశ్నించే వెసులుబాటు ఉందని అన్నారు. దేశంలో పాలనా పగ్గాలు సాధారణ ప్రజల చేతుల్లో ఉండాలని ఆకాంక్షించారు. దేశంలో హరిత విప్లవం, శ్వేత విప్లవం, సమాచార సాంకేతిక విప్లవానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పునాది వేశాయని, వీటితో రైతులు, మహిళలు, యువత లబ్ధి పొందారని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో అన్ని వ్యవస్థలను చెరపట్టిందని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. బీజేపీలో బానిసత్వం: రాహుల్ అధికార బీజేపీలో బానిసత్వం కొనసాగుతోందని ఆ పార్టీ ఎంపీ ఒకరు తనతో చెప్పారని రాహుల్ గాంధీ అన్నారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న ఆ ఎంపీ ఇటీవల తనను ప్రైవేట్‌గా కలిశాడని చెప్పారు. బీజేపీలో ఉన్నప్పటికీ తన హృదయం మాత్రం కాంగ్రెస్‌తోనే ఉందని వెల్లడించాడని పేర్కొన్నారు. బీజేపీ పెద్దల నుంచి వచ్చే ఆదేశాలను ఎవరైనా పాటించాల్సిందేనని, నోరెత్తడానికి వీల్లేదని, పార్టీ కార్యకర్తల గోడును ఎవరూ పట్టించుకోరని ఆ ఎంపీ ఆవేదన వ్యక్తం చేశాడని రాహుల్ తెలిపారు. ప్రతిపక్ష ఇండియా కూటమి అధికారం చేపట్టిన తర్వాత పేదలు, మహిళల సంక్షేమం కోసం కనీస వేతన పథకాన్ని(న్యాయ్ స్కీమ్) అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ‘హై తయ్యార్ హమ్’ సభలో ఆయన ప్రసంగించారు. నాగపూర్ నగరం రెండు సిద్ధాంతాలకు కేంద్ర బిందువు అని చెప్పారు. ఒకటి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రవచించిన ప్రగతిశీల సిద్ధాంతమైతే, మరొకటి దేశాన్ని విచ్ఛన్నం చేసే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమని అన్నారు. దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం అంతమైపోతుందని హెచ్చరించారు. సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రధాని నరేంద్ర మోదీ బద్ధ వ్యతిరేకి అని ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్య వ్యవస్థ పెనుముప్పు ఎదుర్కొంటోందని అన్నారు. మోదీ పాలనలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఆకాశం అంచులకు చేరాయని విమర్శించారు. -
కాంగ్రెస్ అంటే కోత, అవినీతి, కమీషన్: మంత్రి అమిత్ షా
కర్నాల్(హరియాణా): కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్‌పై తీవ్రంగా మండిపడ్డారు. ఆ పార్టీని ఆయన కోత, కమీషన్, అవినీతి(కట్, కమీషన్, కరప్షన్) పార్టీగా పేర్కొన్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమిలోని 27 పార్టీల నేతలు స్వలాభం కోసమే చేతులు కలిపారని ఆరోపించారు. తమ బీజేపీ మాత్రం ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తోందని చెప్పారు. గురువారం హరియాణా ప్రభుత్వం నిర్వహించిన అంత్యోదయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో దేశంలో శాంతి భద్రతలను మెరుగుపర్చిందని, అవినీతిని, బంధుప్రీతిని నిర్మూలించిందని చెప్పారు. -
ఉప పోరులో మిశ్రమ ఫలితాలు
లక్నో/అగర్తలా: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 5న జరిగిన ఉప ఎన్నికలో మిశ్రమ ఫలితాలు వెల్లడయ్యాయి. అధికార బీజేపీ మూడు, ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు నాలుగు సీట్లు గెలుచుకున్నాయి. ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, త్రిపురలోని ధన్పూర్ సీట్లను బీజేపీ నిలబెట్టుకోవడంతోపాటు త్రిపురలోని బొక్సానగర్ స్థానాన్ని సీపీఐ నుంచి కైవసం చేసుకుంది. బెంగాల్‌లోని ధుప్‌గురిలో జరిగిన ముక్కోణపు పోటీలో టీఎంసీ అభ్యర్థి గెలిచారు. ఇక్కడ ఇండియా కూటమి అభ్యర్థి కూడా బరిలో ఉన్నప్పటికీ, బీజేపీ అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చారు. ఇక కేరళలోని పుత్తుప్పల్లి సీటును ప్రతిపక్ష కాంగ్రెస్–యూడీఎఫ్ కూటమికి చెందిన చాందీ ఊమెన్ గెలిచారు. కాంగ్రెస్‌కు చెందిన దిగ్గజ నేత ఊమెన్ చాందీ మృతితో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఊమెన్ చాందీ కొడుకే చాందీ ఊమెన్. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఇండియా కూటమిలోనివే అయినప్పటికీ ఇక్కడ పరస్పరం తలపడటం గమనార్హం. ఇండియా కూటమిలోని జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) జార్ఖండ్‌లోని దుమ్రి సీటును నిలబెట్టుకుంది. యూపీలోని ఘోసి స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఇండియా కూటమి బలపరిచిన సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి బీజేపీకి చెందిన సమీప ప్రత్యర్థిపై గెలిచారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ ఉమ్మడి పోరు బనశంకరి: వచ్చే లోక్‌సభ ఎన్నికలను బీజేపీ, జేడీఎస్ పారీ్టలు ఉమ్మడిగా ఎదుర్కోనున్నాయని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప ప్రకటించారు. ఢిల్లీలో జేడీఎస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చర్చలు జరిపారన్నారు. యడియూరప్ప శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. అయిదు వరకు ఎంపీ స్థానాలను జేడీఎస్‌కు కేటాయించడానికి అమిత్ షా సమ్మతించారని తెలిపారు. -
ఇండియా కూటమికి తొలి సవాల్
లక్నో/అగర్తలా: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు మంగళవారం జరగనున్న ఉప ఎన్నికలు ప్రతిపక్ష ఇండియా కూటమికి తొలి పరీక్షగా నిలిచాయి. ఇండియా కూటమి కొన్ని చోట్ల ఉమ్మడిగా పోటీ చేస్తుండగా, మరికొన్ని చోట్ల పరస్పరం పోటీపడుతున్నాయి. యూపీలోని ఘోసి, జార్ఖండ్‌లోని డుమ్రి, త్రిపురంలోని ధన్పూర్, బొక్సానగర్, ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి ఉమ్మడిగా అభ్యర్థులను బరిలోకి దించింది. పశి్చమబెంగాల్‌లోని ధుప్గురి, కేరళలోని పుత్తుపల్లిల్లో ఇవే కూటమి పారీ్టలు పరస్పరం తలపడుతుండటం గమనార్హం. ధుప్‌గురిలో టీఎంసీ, బీజేపీ, కాంగ్రెస్ బలపరిచిన సీపీఎం అభ్యర్థుల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 8న ఉటుంది. -
నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ సమావేశం
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో పార్టీపరంగా అనుసరించాల్సిన వ్యూహంపై విపక్ష కాంగ్రెస్ దృష్టి పెట్టింది. కాంంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ మంగళవారం సాయంత్రం 5 గంటలకు సమావేశం కానుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 18 నుంచి ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ భేటీలో చర్చిస్తారు. స్వల్ప జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ సోమవారం డిశ్చార్జి అయ్యారు. ఇంటికి చేరుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు సమాచారం. విపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే త్వరలో సమావేశం కానున్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కూటమి తరఫున అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చిస్తారు. -
5న ఇండియా ఎంపీలతో ఖర్గే భేటీ
న్యూఢిల్లీ: రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ నెల 5న ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఢిల్లీ రాజాజీమార్గ్‌లోని ఖర్గే నివాసంలో ఈ భేటీ జరగనుంది. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రతిపక్షాలు అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు వెల్లడి చేయలేదు. కాగా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆదివారం ఖర్గేను ఆయన నివాసంలో కలుసుకున్నారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలతోపాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వారు చర్చించినట్లు సమాచారం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని దీటుగా ఎదుర్కొనే లక్ష్యంతో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఇండియా పేరుతో కూటమిగా ఏర్పాటైన విషయం తెలిసిందే. -
‘ఇండియా’ భేటీ ప్రారంభం
ముంబై: దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికే తామంతా చేతులు కలిపామని విపక్ష ‘ఇండియా’ కూటమి నాయకులు స్పష్టం చేశారు. కూటమి సమావేశం గురువారం సాయంత్రం ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్లో ప్రారంభమైంది. కూటమిలోని వివిధ పారీ్టల అగ్రనేతలు హాజరయ్యారు. తొలిరోజు సాధారణ సమావేశమే జరిగింది. రెండో రోజు నాటి అజెండాపై చర్చించారు. అనంతరం కూటమి నాయకులకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన(ఉద్ధవ్) పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే విందు ఇచ్చారు. కీలక సమావేశం శుక్రవారం జరుగనుంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్డీయేను ఓడించడమే ధ్యేయంగా స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయనున్నారు. మొదటి రోజు భేటీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్ నాయకులు సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్, తమిళనాడు సీఎం స్టాలిన్, పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, పంజాబ్ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు భగవంత్ మాన్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జమ్మూకశీ్మర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, రా్రïÙ్టయ లోక్‌దళ్ చీఫ్ జయంత్ చౌదరి, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ తదితరులు పాల్గొన్నారు. దేశ ఐక్యతను, సార్వభౌమత్వాన్ని వెంటనే బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని లాలూ ప్రసాద్ యాదవ్ అభిప్రాయపడ్డారు. దేశ సమస్యలను పరిష్కరించడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా సీట్ల పంపకంపై తేల్చాలని ఆప్ డిమాండ్ చేసినట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. -
విపక్షాల మేధోమథనం: యాంటీ భేటీ.. ఫ్రెండ్స్ పోటీ
జాతీయ రాజకీయాల తీరుతెన్నులను నిర్ణాయక మలుపు తిప్పగల కీలక పరిణామాలు మంగళవారం చోటు చేసుకోనున్నాయి. అటు బెంగళూరులో కాంగ్రెస్ చొరవతో సోమవారం మొదలైన 26 విపక్షాల కీలక సమావేశం మంగళవారం పూర్తిస్థాయిలో జరగనుంది. ఇటు అందుకు దీటుగా బీజేపీ సారథ్యంలో అధికార ఎన్డీఏ కూటమి ఏకంగా 38 పార్టీలతో హస్తినలో పోటీ భేటీ తలపెట్టింది. ఇరు పక్షాల నుంచీ ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సోనియా, రాహుల్, ఖర్గే తదితర కాంగ్రెస్ అగ్ర నేతలతో పాటు నితీశ్ సహా పలు విపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలు... ఇలా మొత్తం 26 విపక్ష పార్టీల అధినేతలు సోమవారమే బెంగళూరు చేరారు. మంగళవారం చర్చించాల్సిన అంశాలపై సాయంత్రం నుంచి రాత్రి విందు భోజనం దాకా సుదీర్ఘ మంతనాల్లో మునిగి తేలారు. మరోవైపు బీజేపీ కూడా ఎల్జేపీ (పాశ్వాన్)ని సోమవారం ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవడం ద్వారా విపక్షాల సవాలుకు దీటుగా స్పందించింది. మంగళవారం జరిగే ఎన్డీఏ పూర్తిస్థాయి భేటీలో ఎల్జేపీ, హిందూస్తానీ అవామ్ మోర్చా వంటి కొత్త మిత్రులతో కలిపి ఏకంగా 38 పార్టీలు పాల్గొంటాయని కూడా బీజేపీ వర్గాలు వెల్లడించాయి! హస్తిన, బెంగళూరు వేదికలుగా జరగనున్న అధికార, విపక్ష కూటముల పోటాపోటీ భేటీల మీదే ఇప్పుడిక అందరి కళ్లూ నిలిచాయి. అతి కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికల కురుక్షేత్ర సమరానికి ఈ భేటీలను వైరి కూటముల తొలి సన్నాహకంగా పరిశీలకులు భావిస్తున్నారు. బెంగళూరు: 2024 ఎన్నికల్లో కేంద్రంలో అధికార బీజేపీని ఓడించడమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో విపక్షాలు కొంతకాలంగా చేస్తున్న ముమ్మర ప్రయత్నాలు కీలక దశకు చేరుకున్నాయి. ఇందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు తలపెట్టిన రెండు రోజుల సమావేశాలు సోమవారం బెంగళూరులో మొదలయ్యాయి. కాంగ్రెస్ సహా 26 విపక్ష పార్టీల అధినేతలు, అగ్ర నేతలు సాయంత్రానికల్లా సమావేశ వేదిక వద్దకు చేరుకున్నారు. రాత్రి పొద్దుపోయేదాకా చర్చోపచర్చల్లో మునిగి తేలారు. బీజేపీని నిలువరించడమే ఏకైక అజెండాగా ఉమ్మడి కార్యాచరణకు రూపమిచ్చేందుకు మంగళవారం రోజంతా కీలక మేధోమథనం జరపనున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత సోనియా సారథ్యంలో కొత్త కూటమి ఆవిర్భావం జరగవచ్చని తెలుస్తోంది. సోనియాతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు రాహుల్‌గాం«దీ, ప్రియాంకగాంధీ వద్రా, విపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు నితీశ్‌కుమార్ (జేడీ–యూ), మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), ఎంకే స్టాలిన్ (డీఎంకే), అరవింద్ కేజ్రీవాల్ (ఆప్)తో పాటు ఆర్జేడీ చీఫ్ లాలుప్రసాద్, జేఎంఎం నేత హేమంత్ సొరేన్, అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), ఉద్ధవ్ ఠాక్రే (శివసేన–యూబీటీ), ఫరూక్ అబ్దుల్లా (ఎన్సీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, జయంత్చదరి (ఆరెల్డీ), వైకో (ఎండీఎంకే) తదితరులు సోమవారం సమావేశంలో పాల్గొన్నారు. బెంగళూరు నగరమంతటా ఎటు చూసినా ‘కలుద్దాం, నిలుద్దాం’ నినాదంతో విపక్ష కూటమి నేతలందరి ఫొటోలతో కూడిన భారీ బ్యానర్లే కని్పంచాయి. ఇక కాంగ్రెస్‌తో చిరకాలంగా ఉప్పూనిప్పుగా ఉన్న మమత విందు భేటీలో సోనియా పక్కనే కూర్చోవడం ప్రధానాకర్షణగా నిలిచింది. ఆ సందర్భంగా వారిరువురూ 20 నిమిషాల పాటు చర్చలు కూడా జరిపారు. పార్టీలో చీలికతో సతమతమవుతున్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సోమవారం భేటీకి హాజరు కాలేదు. మంగళవారం కుమార్తె సుప్రియా సులేతో పాటు ఆయన చర్చల్లో పాల్గొంటారని విపక్ష వర్గాలు తెలిపాయి. విపక్షాలతో తలపడేందుకు తానొక్కన్నే చాలని గొప్పలకు పోయిన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు 30కి పైగా పార్టీలతో జట్టు కట్టేందుకు ఎందుకు తహతహలాడుతున్నారని ప్రశ్నించారు. జేడీ(ఎస్)తో పాటు బీజేపీ ఓటమి కోరే భావ సారూప్య పార్టీలన్నింటికీ కూటమిలోకి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నట్టు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా తెలిపారు. సయోధ్య ఏ మేరకు సాధ్యం? అయితే పశ్చిమ బెంగాల్లో వామపక్షాలు–తృణమూల్ సహా పలు రాష్ట్రాల్లో విపక్షాల మధ్యే సహజ వైరం నెలకొని ఉన్న నేపథ్యంలో వాటి మధ్య సయోధ్య ఏ మేరకు సాధ్యమవుతుంన్నది ఆసక్తికరం. తృణమూల్‌తో బెంగాల్లో ఎలాంటి పొత్తూ ఉండబోదని సమావేశ వేదిక వద్దే సీపీఎం ప్రధాన కార్యదర్శి కుండబద్దలు కొట్టారు. అయితే, విపక్షాల ఓటు బ్యాంకులో చీలికను నివారించేందుకు కలిసి పని చేస్తామంటూ ముక్తాయించారు. భేటీలో పాల్గొంటున్న పార్టీలు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, జేఎంఎం, ఎన్సీపీ, శివసేన (యూబీటీ), ఎస్పీ, జేడీ(యూ), ఎండీఎంకే, కేడీఎంకే, వీసీకే, ఆరెస్పీ, సీపీఐ–ఎంఎల్, ఫార్వర్డ్ బ్లాక్, అప్నాదళ్, మణిథనేయ మక్కల్ కచ్చి (ఎంఎంకే) సహా మొత్తం 26 పార్టీలు. వీటన్నింటికీ కలిపి లోక్‌సభలో 150 మంది దాకా ఎంపీల బలముంది! కూటమి కన్వీనర్‌గా నితీశ్...? కొత్త కూటమి పేరు కూడా మంగళవారం నాటి చర్చల అజెండాలో ఉన్నట్టు సమాచారం. ‘‘ఇండియా అని వచ్చేలా కూటమికి ఆకర్షణీయమైన పేరును పార్టీలన్నీ సూచిస్తాయి. ‘యునైటెడ్ వుయ్ స్టాండ్’ అన్నది ట్యాగ్‌లైన్‌గా ఉండనుంది’’ అని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ► అంతేగాక యూపీఏ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన సోనియాగాం«దీని కొత్త కూటమి సారథిగా వ్యవహరించే అవకాశముందని చెబుతున్నారు. ► సామాజిక న్యాయం, సమ్మిళిత వృద్ధి, జాతీయ సంక్షేమమే ప్రధాన లక్ష్యాలుగా ఉమ్మడి కార్యాచరణ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ► కనీ్వనర్‌గా బిహార్ సీఎం నితీశ్ కీలక బాధ్యతలు తీసుకోవచ్చు. ► మంగళవారం భేటీ అనంతరం సంయుక్త ప్రకటనతో పాటు ఉమ్మడి ఆందోళన ప్రణాళికను కూడా విపక్ష కూటమి ప్రకటించవచ్చని సమాచారం. ► కీలకమైన రాష్ట్రాలవారీగా పార్టీలవారీగా పోటీ చేయాల్సిన లోక్‌సభ స్థానాల సంఖ్యను ఖరారు చేసుకోవడం వంటివీ చర్చకు వస్తాయంటున్నారు. ► ఒక కమిటీతో పాటు కనీస ఉమ్మడి ప్రణాళిక, విపక్షాల సంయుక్త నిరసన కార్యక్రమాల ఖరారుకు రెండు సబ్ కమిటీలు కూడా ఏర్పాటు చేసే అవకాశముంది. -
ఢిల్లీ బరిలో ఆర్జేడీ
న్యూఢిల్లీ: లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) దేశ రాజధాని ఢిల్లీలో తొలిసారి బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ కూటమిలోని ఆర్జేడీ 10 శాతం సీట్లు కావాలని డిమాండ్ చేసినప్పటికీ.. చివరకు నాలుగింటితో సరిపెట్టుకుంది. అభ్యర్థుల పేర్లను సోమవారం విడుదల చేయనుంది. ఢిల్లీ ఎన్నికలకు నామినేషన్ పత్రాల దాఖలు మంగళవారంతో ముగియనుంది. -
కాంగ్రెస్‌తో పొత్తు దాదాపుగా లేనట్టే!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మద్య పొత్తుపై సాగుతున్న ఊహాగానాలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తెరదించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఎంతవరకు అంగీకారం కుదిరింది అన్న ప్రశ్నకు కేజ్రీవాల్ జవాబిస్తూ ఇంతవరకు ఈ దిశలో ఎలాంటి అంగీకారం కుదరలేదని చెప్పారు. పొత్తు గురించి అడిగిన ప్రశ్నకు మరో ప్రశ్నకు ఆయన కాంగ్రెస్ దాదాపుగా పొత్తుకు నిరాకరించిందని చెప్పారు. బుధవారం శరద్‌పవార్ నివాసంలో జరిగిన ప్రతిపక్ష నేతల సమావేశానికి రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రివాల్ హాజరు కావడంతో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ తమ మనసులో దేశం గురించిన ఆందోళన ఎక్కువగా ఉందని, ఐదేళ్లలో దేశంలో సుహృద్భావాన్ని దెబ్బతీశారని ఆయన ఆరోపించారు. నోట్ల రద్దు వంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని, మాబ్ లించింగ్ వంటి ఘటనలు పెరగడంతో పాటు సంస్థలను దెబ్బతీస్తున్నారని ఆయన ఆరోపించారు. మోదీ, అమిత్‌షా ద్వయాన్ని ఓడించాలని మొత్తం దేశం కోరుకుంటోందని, అందువల్ల బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కరే అభ్యర్థిని నిలబెట్టవలసిన అవసరం ఉందని, దాని వల్ల ఓట్లు చీలకుండా ఉంటాయని కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీలో బీజేపీకి వ్యతిరేకంగా ఇద్దరు అభ్యర్థులు నిలబడితే దాని వల్ల బీజేపీకే ప్రయోజనం ఉంటుందని, ఈ విషయాన్ని అన్ని పార్టీలు అర్థం చేసుకోవాలని ఆయన చెప్పారు. యూపీలో ఎస్పీ, బీఎస్పీలతో పాటు అనేక పార్టీల అభ్యర్థులు బరిలోకి దిగితే బీజేపీకి లాభం ఉంటుందని అన్నారు. షీలాదీక్షిత్ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించడంపై అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కేజ్రివాల్ అన్నారు. -
చిన్న పార్టీలకు పెద్ద సవాల్
సాక్షి, న్యూఢిల్లీ : రాహుల్ గాంధీ ప్రతిపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిగా ద్రావిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నాయకుడు ఎంకే స్టాలిన్ డిసెంబర్ 16వ తేదీన ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే రాహుల్ గాంధీని తెలుగుదేశం, తృణమూల్ కాంగ్రెస్ లాంటి ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయిగానీ, తమిళనాడులో మాత్రం ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గుచూపుతున్నాయి. ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని అంగీకరిస్తున్నాయి. ‘విద్యుతలై చిరుతైగల్ గాట్చీ, మరుములార్చి ద్రావిడ మున్నేట్ర కళగం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వాన్ని, రాష్ట్ర స్థాయిలో డీఎంకే నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు తాజాగా ప్రకటించాయి. ఇక ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఇప్పటికే డీఎంకేతో పొత్తు పెట్టుకుంది. మరోపక్క కమల్ హాసన్ రాష్ట్రంలోని 39 లోక్‌సభ స్థానాలకు, పుదుచ్ఛేరిలోని ఒక్క సీటుకు తాను కొత్తగా ఏర్పాటు చేసిన ‘మక్కల్ నీది మయామ్’ పోటీ చేస్తుందని చెప్పారు. అంతేకాకుండా రానున్న 20 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో కూడా తన పార్టీ పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. భావ సారూప్యత పార్టీలతో తమ పార్టీ పొత్తు పెట్టుకునేందుకు సుముఖంగా ఉందని ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులు తెలిపారు. అయితే తాము ప్రధానంగా డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలను వ్యతిరేకిస్తున్నందున ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలో ప్రస్తుతానికి స్పష్టత లేదని వారు అంటున్నారు. అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం తిరుగుబాటు నాయకుడు టీటీవీ దినకరన్ గత మార్చి నెలలో ఏర్పాటు చేసిన ‘అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం’ ఒంటిరిగా పోటీ చేయాలా, పొత్తులకు వెళ్లాలా ? అంశాన్ని ఇంకా తేల్చుకోలేదు. కమల్ హాసన్, దినకరన్‌లు తమ పార్టీలకు ఎన్నికల అనుభవం లేకపోయినా రానున్న 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ మంచి ప్రభావాన్ని చూపగలవని భావిస్తున్నారు. ఏఐఏడీఎంకే, డీఎంకే పార్టీలకు ఇప్పుడు జయలలిత, ఎం. కరుణానిధి లేకపోవడమే తమ పార్టీలకు లాభిస్తుందని వారు ఆశిస్తున్నారు. కేంద్రంలో ఫాసిస్ట్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు తాము కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపుతున్నామని, అది వచ్చే ఎన్నికల నాటికి ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో బలమైన ప్రత్యామ్నాయం అవుతుందని డీఎంకే అధికార ప్రతినిధి తమిళన్ ప్రసన్న తెలిపారు. చిన్నా, చితక పార్టీలు తమతో కలిసి వచ్చినా, లేకపోయినా ఫర్వాలేదని ఆయన దీమా వ్యక్తం చేశారు. -
‘చంద్రబాబు తెలంగాణలో పెత్తనం చేయాలని చూస్తున్నాడు’
సాక్షి, కర్నూల్ : ఏపీలో రాజ్యాంగ విలువలను సర్వనాశనం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య ఆరోపించారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగానికి తూట్లు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శించారు. నిన్నటి దాక బీజేపీతో పొత్తు పెట్టుకుని నాలుగేళ్లు సంసారం చేసిన వ్యక్తి.. నేడు సిగ్గు లేకుండా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని తెలంగాణలో ప్రచారం చేస్తున్నారంటూ మండి పడ్డారు. దేశంలో చరిత్ర హీన చక్రవర్తి చంద్రబాబేన్నారు. కాంగ్రెస్ మహాకూటమితో కలిసి తెలంగాణలో పెత్తనం చెలాయించాలని చంద్రబాబు ఆరాటపడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఏపీలో వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను డబ్బుల సంచులతో పశువులను కొన్నట్లు కొన్నది నీవు కాదా బాబు అంటూ ఐజయ్య ప్రశ్నించారు. స్పీకర్ స్థానాన్ని కూడా అపహాస్యం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ విలువలకు కట్టుబడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ప్రజల కోసం ప్రజల వెంటే ఉంటూ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తుందని తెలిపారు. -
ఎప్పటికి తేలుతుందో.. ?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కాంగ్రెస్‌లో ఉత్కంఠతకు ఇప్పట్లో తెరపడేలా లేదు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. ఎవరికి వారే అభ్యర్థులుగా చెప్పుకోవడం తప్ప... ఏఐసీసీ నుంచి ప్రకటన వచ్చేదాకా ఏమవుతుందో తెలియని పరిస్థితి ఇక్కడి నేతలది. ఇప్పటి వరకు కాంగ్రెస్, మిత్రపక్షాలకు సంబంధించి పోటీ చేసే స్థానాల సంఖ్యపైనే స్పష్టత రాలేదు. కూటమిలోని కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ నాయకులు అప్పుడప్పుడు సమావేశమవుతున్నా... లెక్క తేలడం లేదు. ఏ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందో తెలిస్తే అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మిత్రపక్షాల భేటీలో తేలని లెక్క కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నాయకులు శనివారం కూడా హైదరాబాద్‌లోని ఓ హోటల్లో సమావేశమై సుధీర్ఘంగా చర్చించారు. ఈ భేటీలో ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తారో తెలుస్తుందని భావించినప్పటికీ, అదేమీ జరగలేదు. కూటమిలోని పార్టీల తరఫున భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు సమావేశమైనట్లు నేతలు చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది సీట్లలో కాంగ్రెస్ పోటీ చేయాలని భావిస్తోంది. పొత్తులో బెల్లంపల్లి, మంచిర్యాల సీట్లలో ఏది పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు మాత్రం అన్ని సీట్లలో పోటీకి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దరఖాస్తుల స్క్రూటినీ పూర్తయినట్టేనా..? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో నాయకులు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్త నాయకులు, అధికారులు సైతం ఆయా నియోజకవర్గాల్లో సీటు కోసం దరఖాస్తులు సమర్పించుకున్నారు. అభ్యర్థుల స్క్రూటినీ ఎంత వరకు వచ్చిందో తెలియని స్థితి. పోటీ అధికంగా ఉన్న స్థానాల్లో ఫ్లాష్ సర్వే జరుపనున్నట్లు గతంలోనే ప్రకటించారు. సర్వే స్థితిగతుల మీద కూడా స్పష్టత లేదు. డీసీసీ, పీసీసీ నుంచి వడబోత తరువాత గుర్తించి మూడు పేర్ల నుంచి స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి, ఫ్లాష్ సర్వే ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరపడంతో ప్రక్రియ ముగుస్తుంది. ఉమ్మడి జిల్లా నుంచి డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కుకు పోటీ లేదు. మిగతా అన్ని చోట్ల స్క్రీనింగ్ కమిటీ నిర్ణయమే అభ్యర్థుల ప్రకటన ఉంటుందనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ టికెట్ల కోసం కొత్త నేతల హంగామా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్న తరుణంలో కాంగ్రెస్ సీట్ల కోసం పోటీ పెరిగింది. పార్టీలో ఇప్పటి వరకున్న నాయకులతోపాటు కొత్తగా టీఆర్ఎస్లో టికెట్టు రాని రమేష్ రాథోడ్ పార్టీలో చేరి ఖానాపూర్ సీటుపై దస్తీ వేశారు. చారులత రాథోడ్ అనే మహిళా నాయకురాలు సైతం ఇటీవలే కాంగ్రెస్‌లో చేరి టికెట్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరితోపాటు అధికారులుగా వివిధ హోదాల్లో పనిచేస్తున్న రాంకిషన్, సుమన్జాదవ్ కూడా టికెట్టు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. స్థానికులైన హరినాయక్, భరత్ చౌహాన్, తదితరులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. సిర్పూరు నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్ టికెట్టు ఆశిస్తూ పాల్వాయి పురుషోత్తంరావు తనయుడు పాల్వా యి హరీష్‌రావు ఇటీవల పార్టీలో చేరారు. తొలుత ఇండిపెండెంట్‌గా రంగంలో ఉంటానని ప్రకటించినప్పటికీ, తరువాత మహేశ్వర్‌రెడ్డి హామీతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని టికెట్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. గతంలో రేవంత్రెడ్డితోపాటే పార్టీలో చేరిన రావి శ్రీనివాస్ కూడా పోటీలో ఉండగా, సీనియర్ నాయకుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ సైతం బీసీగా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. శ్రీనివాస్‌యాదవ్ మినహా ఇద్దరూ పార్టీకి కొత్తవారే. చెన్నూరులో కూడా కొత్త నాయకత్వం పట్ల పార్టీ అనుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ గ్రూప్–1 అధికారిగా రాజీ నామా చేసి వచ్చిన బోర్లకుంట వెంకటేష్ నేత టికె ట్టు రేసులో ముందున్నారు. ఆయన సంస్థాగతంగా పార్టీ యంత్రాంగాన్ని తనకు చేరువ చేసుకునే పని ఇప్పటికే ప్రారంభించారు. కాగా టికెట్టు మీద నమ్మకంతోనే రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి బోడ జనార్దన్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే సోత్కు సంజీవరావు, దుర్గం అశోక్ కూడా పోటీ పడుతున్నారు. ఇక మంచిర్యాల, బెల్లంపల్లి, బోథ్, ముథోల్‌లలో పార్టీ సీనియర్ నాయకులే టికెట్టు రేసులో ఉన్నారు. -
తేలని లెక్కలు
సాక్షి, కొత్తగూడెం: అసెంబ్లీ ఎన్నికలకు తెరదీసిన టీఆర్ఎస్ ఏకంగా అభ్యర్థులను ప్రకటించి ప్రచారపర్వంలో దూసుకెళుతుండగా, కాంగ్రెస్ కూటమిలో సీట్ల లెక్కలు ఇప్పటికీ సశేషంగానే ఉన్నాయి. కూటమిగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుని రెండు వారాలు దాటినప్పటికీ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏ పార్టీ ఏ సీటు తీసుకోవాలనే విషయమై ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. దీంతో ప్రతిష్టంభన నెలకొంది. సీట్ల కేటాయింపునకు సంబంధించి జిల్లాలో పంపకంపైనే చిక్కుముడి వీడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా కొత్తగూడెం, అశ్వారావుపేట సీట్ల విషయంలోనే కాంగ్రెస్‌కు సీపీఐ, టీడీపీలతో ముడిపడే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో ఉన్న ఐదు శాసనసభ స్థానాల్లో ఏకైక జనరల్ స్థానం కొత్తగూడెం విషయంలో కాంగ్రెస్ పార్టీకి సీపీఐకి మధ్య గట్టి పోటీ నెలకొంది. ఎవరికి వారు ఈ సీటు తమకే కావాలని పట్టుబడుతున్నారు. టీఆర్ఎస్ను ఓడించాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆ పార్టీ నుంచి టికెట్ల కోసం హోరాహోరీ ప్రయత్నాలు చేస్తున్న వనమా వెంకటేశ్వరరావు, ఎడవల్లి కృష్ణ చెపుతున్నారు. వీరిద్దరూ ఢిల్లీ స్థాయిలో టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అవకాశమిస్తే సీటును గెలిపించుకుని వస్తామని అధిష్టానం వద్ద వాదనలు వినిపిస్తున్నారు. సీపీఐకి ఆ సీటు ఇవ్వవద్దని గాంధీభవన్ వద్ద వనమా ఏకంగా ఆందోళన సైతం చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో కొత్తగూడెం సీటు గెలవాలంటే ఏ పార్టీకి కేటాయిస్తే ఫలితమంటుందని కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు సర్వేలు చేయించినట్లు తెలుస్తోంది. మరోవైపు తమకు ఆది నుంచి బలమున్న కొత్తగూడెం సీటు ఇవ్వాల్సిందేనని సీపీఐ పట్టుబడుతోంది. సీపీఐ అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని రేసులో ఉండడంతో ఈ సీటుపై ప్రతిష్టంభన నెలకొంది. అశ్వారావుపేట టీడీపీకిస్తే సహకరింమంటున్న కాంగ్రెస్ శ్రేణులు.. పొత్తుల్లో భాగంగా టీడీపీ మొదటి నుంచీ ఆశిస్తున్న అశ్వారావుపేట సీటు విషయంలోనూ తకరారు నెలకొంది. గత ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచిన టీడీపీ ఈసారి ఆ సీటును పొత్తుల్లో భాగంగా కోరుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, ఖమ్మం సీట్లతో పాటు భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే ఈ సీటును కాంగ్రెస్ పార్టీకే కేటాయించాలని, టీడీపీకి కేటాయిస్తే ఏ మాత్రం సహకరించేది లేదని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. గతంలో ఉన్న టీడీపీ కేడర్ మొత్తం టీఆర్ఎస్లోకి వెళ్లిందని, ఈ నేపథ్యంలో నామమాత్రంగా బలమున్న టీడీపీకి తాము ఎందుకు సహకరించాలని కాంగ్రెస్ కార్యకర్తలు గుర్రుమంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి సున్నం నాగమణి, బాణోత్ పద్మావతి, కోలా లక్ష్మీనారాయణ, కారం శ్రీరాములు, ధన్జూనాయక్ టికెట్ కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌కు ఇస్తేనే టీఆర్ఎస్ను ఓడించడం సాధ్యమని పార్టీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. మొదట్లో జిల్లాలోని అశ్వారావుపేటతో పాటు ఇల్లెందు, పినపాక లేదా భద్రాచలం సీటు కావాలని టీడీపీ కోరింది. అయితే ప్రస్తుతం హైదరాబాద్ చుట్టుపక్కల, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాలోని సీట్లకు ప్రాధాన్యం ఇస్తోంది. కాగా, టికెట్ రేసులో ఉన్న పినపాక నియోజకవర్గానికి చెందిన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వట్టం నారాయణ పినపాక సీటును టీడీపీ కేటాయించాలని పట్టుబడుతున్నారు. పినపాక కాకుంటే భద్రాచలం సీటు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే విడతల వారీగా సర్వేలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మాత్రం సీట్ల కేటాయింపు విషయంలో పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని అన్ని సీట్లకు కాంగ్రెస్ నుంచి ఆశావహులు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని సీట్ల విషయంలోనే కాంగ్రెస్ కూటమి పొత్తులకు చిక్కుముడి పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
పొడుస్తున్న పొత్తు.. వీడుతున్న సస్పెన్స్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కాంగ్రెస్ మిత్రపక్షాల కూటమిలో సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వస్తోంది. కూటమిలో భాగమైన తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జన సమితి తాము పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అందజేశాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఆశావహుల నుంచి అభ్యర్థిత్వం కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. ఒక్కో నియోజకవర్గం నుంచి వచ్చిన దరఖాస్తుల నుంచి ముగ్గురి పేర్లను స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసి, ఏఐసీసీకి పంపనుంది. ఈ పరిణామాల క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అశావహులు టికెట్ల కోసం హైదరాబాద్‌లో మంత్రాంగం ప్రారంభించారు. డీసీసీ నుంచి వచ్చిన జాబితాల ఆధారంగా పీసీసీ అభ్యర్థుల జాబి తాలో తమ పేర్లు ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నా రు. ఉమ్మడి జిల్లా నుంచి కొత్తగా పార్టీలో చేరిన ఒకరిద్దరు బలమైన నాయకులకు పార్టీ టికెట్లు ఖ రారైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫ్లాష్ సర్వే ద్వారా టికెట్ల కోసం తుది జాబితాను సిద్ధం చేసే స్క్రీనింగ్ కమిటీ వైపే అందరూ చూస్తున్నారు. కాంగ్రెసేతరులకు పొత్తుల్లో ఏదో ఒక సీటే.. కూటమి పొత్తులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి టీడీపీ ఏ ఒక్క సీటును ఆశించడం లేదు. ఆ పార్టీ తనకు బలమైన అభ్యర్థులున్న ఇతర జిల్లాల నుంచి ఆశావహుల పేర్లను కాంగ్రెస్ పార్టీకి అందజేసింది. అందులో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఒక్క సీటు కూడా లేదు. సీపీఐ రాష్ట్రంలో ఐదు సీట్లు కోరుతుండగా, నాలుగు సీట్లు మాత్రమే ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించినట్లు సమాచారం. కాగా సీపీఐ పంపించిన జాబితాలో ఐదో సీటుగా మంచిర్యాలను చేర్చారు. బెల్లంపల్లిలో పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ ఆసక్తి చూపకపోవడంతో సీపీఐ మంచిర్యాలను కోరుతోంది. జిల్లా కార్యదర్శి కలవేన శంకర్ ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సీపీఐ ఐదు సీట్లు పోటీ చేస్తే మంచిర్యాల సీపీఐ ఖాతాలోకి వెళ్లనుంది. టీజేఎస్ ఎన్ని సీట్ల నుంచి పోటీ చేస్తుందనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కోదండరాం సొంత జిల్లా మంచిర్యాల నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపించినా, సికింద్రాబాద్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. కోదండరాం నివాస ప్రాంతం ఉన్న బెల్లంపల్లి స్థానాన్ని టీజేఎస్ కోరే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పది సీట్లలో తొమ్మిదింట కాంగ్రెస్ అభ్యర్థులే పోటీ చేయడం ఖాయమైనట్టే. కాంగ్రెస్‌లో మూడు చోట్ల ఖరారైనట్టే... కాంగ్రెస్ పార్టీలో నిర్మల్, ఆసిఫాబాద్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఖరారైనట్టే. డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నిర్మల్ నుంచి పోటీ చేయడం లాంఛనమే. ఈ నేపథ్యంలో నిర్మల్ పట్టణంతో పాటు ఊరూరా ఫ్లెక్సీలతో నింపేశారు. ఆసిఫాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అభ్యర్థిత్వం ప్రకటించడమే మిగిలింది. ఖానాపూర్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు సీటివ్వడంతో టీఆర్ఎస్ను వీడిన మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ టిక్కెట్టు హామీతో కాంగ్రెస్‌లో చేరారు. ఆయన అభ్యర్థిత్వం కూడా ఖాయమైనట్టే. ఈ మూడు నియోజకవర్గాల్లో వీరిని అభ్యర్థులుగా ప్రకటించడం ఒక్కటే మిగిలిందని గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి. మూడు చోట్ల నామమాత్రపు స్క్రీనింగే... ఉమ్మడి జిల్లాలోని బోథ్, సిర్పూరు, చెన్నూరు సీట్ల విషయంలో కూడా అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తయినప్పటికీ, మొక్కుబడిగా స్క్రీనింగ్ కమిటీ ఫ్లాష్ సర్వే ద్వారా తతంగం పూర్తి చేస్తారని తెలిసింది. బోథ్‌లో మాజీ ఎమ్మెల్యే సోయం బాబూరావు సీటు విషయంలో రెండో మాట లేకపోయినా, ఆదివాసీలకు కాకుండా లంబాడాలకు టికెట్లు ఇచ్చే పరిస్థితి ఎదురైతే తమ పేరు పరిశీలించాలని గతంలో ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసిన నరేష్ జాదవ్ అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అనిల్ జాదవ్ కూడా టెకెట్టు ఆశిస్తున్నారు. సిర్పూరులో మాజీ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తంరావు తనయుడు పాల్వాయి హరీష్‌రావు ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. ఇక్కడ నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు టికెట్టు ఖాయమని సమాచారం. అయితే గతంలో రేవంత్‌రెడ్డితో పాటు టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రావి శ్రీనివాస్, బీసీ నాయకుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ సైతం టికెట్టు ఆశిస్తున్నారు. చెన్నూరులో గ్రూప్–1 అధికారిగా ఎక్సైజ్, ఇతర శాఖల్లో పనిచేసిన బొర్లకుంట వెంకటేష్ నేతకే టికెట్టు ఖాయమైనట్లు సమాచారం. ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడైన మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు ద్వారా వెంకటేష్ నేత టిక్కెట్టుపై ధీమాతో ఉన్నారు. మాజీ మంత్రి బోడ జనార్ధన్, మాజీ ఎమ్మెల్యే సోత్కు సంజీవరావు, డీసీసీ ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ మాత్రం స్థానికులకే టికెట్టు ఇవ్వాలనే డిమాండ్‌తో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మంచిర్యాల, ఆదిలాబాద్, ముథోల్‌లలో సస్పెన్స్ మంచిర్యాల నియోజకవర్గంలో ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సభ్యుడుగా నియమితులైన మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు టికెట్టు రేసులో ముందున్నారు. ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క వర్గానికి చెందిన ప్రేంసాగర్‌రావు గత కొంతకాలంగా నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై ఉన్నారు. ప్రేంసాగర్‌రావు కానిపక్షంలో మహిళా కోటాలో ఆయన భార్య కొక్కిరాల సురేఖను బరిలోకి దింపేందుకు కూడా సర్వం సిద్ధం చేసుకున్నారు. ప్రేంసాగర్‌రావుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మద్ధతు కూడా ఉండడం కలిసొచ్చే అంశం. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి కూడా పార్టీ టికెట్టు రేసులో ఉన్నారు. సౌమ్యుడిగా, వివాద రహితుడిగా పేరున్న అరవింద్‌రెడ్డి తనకే టికెట్టు వస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఈ ముగ్గురి పేర్లు స్క్రీనింగ్ కమిటీకి చేరనున్నాయి. ఫ్లాష్ సర్వేలో ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి. ∙ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి సి.రామచంద్రారెడ్డితో పాటు గతం లో పార్టీ అభ్యర్థులుగా పో టీ చేసిన గండ్రత్ సుజాత, భార్గవ్ దేశ్పాం డే సీటు కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో ము ఖ్యలు. మంత్రి జోగు రామన్న సామాజిక వర్గానికి చెందిన గండ్రత్ సుజాతకు సీటిస్తే గట్టి పో టీ ఇస్తారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. ఆమె భట్టి విక్రమార్క వర్గీయురాలిటీ టికెట్టు రేసులో ముందున్నారు. అలాగే మహేశ్వర్‌రెడ్డి వర్గీయుడిగా ఉన్న భార్గవ్ దేశ్‌పాండే కూడా టికెట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మాజీ మంత్రి రామచంద్రారెడ్డి ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నారు. ముథోల్‌లో వరుసకు సోదరులైన రామారావు పటేల్, నారాయణరావు పటేల్ మధ్య టికెట్టు పోటీ ఉంది. ఇద్దరి పేర్లను డీసీసీ గాంధీభవన్‌కు పంపించింది. వీరు కూడా ఎవరికి వారే దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఇద్దరు సోదరులు కలిసి కట్టుగా పనిచేస్తే తిరుగుండదనే అభిప్రాయం కార్యకర్తల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఎవరికి సీటొస్తుందో చూడాలి. బెల్లంపల్లి ఎవరికి..? ల్లంపల్లిని టీజేఎస్‌కు కేటాయిస్తే ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఒకరిద్దరు నాయకులు సిద్ధంగా ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి టీజేఎస్‌లో చేరి నియోజకవర్గంలో క్రియాశీలకంగా ఉన్న దుర్గం గోపాల్‌తో పాటు ఉపాధ్యాయుడు ఇ.చంద్రశేఖర్, అడ్లూరి వెంకటస్వామి టికెట్టు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి గతంలో పోటీ చేసిన చిలుముల శంకర్‌తో పాటు రొడ్డ శారద, దుర్గాభవాని వంటి నాయకులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. బెల్లంపల్లిలో బలమైన అభ్యర్థిగా గద్దర్ తనయుడు క్రాంతికిరణ్‌ను రంగంలోకి దింపే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
పొత్తులు.. ఎత్తులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘కారు’ జోరుకు అడ్డుకట్ట వేసేందుకు జట్టు కట్టిన మహా కూటమి ఇక సీట్ల పంపకాల మీద దృష్టి పెట్టింది. కూటమిగా ఏర్పడిన తర్వాత సీట్ల కోసం కొట్లాడుకుని విడిపోవడం కంటే ముందే మాట్లాడుకుని దోస్తీ కడితే బాగుంటుందనే ఆలోచనలతో ఆయా పార్టీల అగ్రనాయకత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు స్థానిక రాజకీయ సమీకరణాలు, పార్టీల బలాబలాల వివరాలను రాష్ట్ర నాయకత్వం తెప్పించుకుని కసరత్తు చేస్తోంది. టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌తో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఇతర నేతలు ఇటీవలే చర్చలు జరిపారు. గెలిచే స్థానాలు మినహా మిగతా చోట్ల ఇతర పార్టీలకు కేటాయించాలని కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ సూచిం చిన నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీడీపీ మూడు సీట్లు, టీజేఎస్ రెండు సీట్లను అడుగుతున్నట్లు తెలిసింది. నర్సంపేటపైనే.. జిల్లాలో టీడీపీ బలాబలాలపై వారం రోజుల క్రితం ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఇంటెలిజెన్సీ అధికారులతో ఆ పార్టీ సర్వే చేయించింది. పరకాల, భూపాలపల్లి, నర్సంపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గాలో సర్వే కొనసాగినట్లు సమాచారం. ఇందులో కనీసం మూడు సీట్లు కావాలని అడుగుతోంది. కాంగ్రెస్ మాత్రం కేవలం ఒకే ఒక సీటు ఇస్తామని సూచన ప్రాయంగా చెప్పినట్లు సమాచారం. ఒకే ఒక్క సీటు ఇస్తే అది కచ్చితంగా నర్సంపేట కావాలని టీడీపీ పట్టుబడుతోంది. ఇక్కడ నుంచి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, చంద్రబాబునాయుడికి సన్నిహితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకా శ్‌రెడ్డి పోటీలో ఉన్నారు. ఆయన కోసం నర్సంపేట సీటును టీడీపీ అడుగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఉం డడంతో సీటు వదులుకోవటానికి కాంగ్రెస్ పార్టీ ససేమిరా అంటోంది. గతంలో ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. అనంతరం తిరిగి కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చారు. ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వకుం డా ఉండలేమని కాంగ్రెస్ పార్టీ తెగేసి చెప్పింది. దీంతో మరో దఫా చర్చలకు కూర్చోవాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ జన సమితి.. తెలంగాణ జన సమితి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంతో పాటు జనగామ టికెట్‌ను అడుగుతున్నట్లు సమాచారం. వరంగల్ పశ్చిమ నుంచి టీజేఎఫ్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడ టీజేఎస్ అంతగా వేళ్లూనుకోకపోవడం, సంస్థాగతంగా నాయకులు, కార్యకర్తలు లేక బలహీనంగా ఉండడం వంటి కారణాలతో మంచిర్యాల నియోజకవర్గాన్ని ఎంచుకోవచ్చనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కోదండరామ్ సొంత ఊరు నెన్నెల మండలం జోగాపూర్. ప్రస్తుతం ఇది మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో ఉంది. 25న హైదరాబాద్‌లో స్క్రీనింగ్ కమిటీ సమావేశం కాంగ్రెస్ పార్టీలో జిల్లా నుంచి ఢిల్లీ వరకు జరుగుతున్న కసరత్తు ఆ పార్టీ నాయకుల అభ్యర్థిత్వాలపై ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాల నుంచి పోటాపోటీగా అధిష్టానానికి దరఖాస్తు చేస్తున్నారు. పొత్తుల నేపథ్యంలో చెరొకటి చొప్పున టీడీపీ, టీజేఎస్‌కు ఇస్తే మిగిలిన 10 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశం ఉంది. కాగా, అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. చైర్మన్‌గా భక్తచరణ్‌దాస్, సభ్యులుగా శర్మిష్ఠముఖర్జీ, జ్యోతిమణి సెన్నిమైలతో స్కీన్రింగ్ కమిటీ వేసింది. ఈ కమిటీ 25న హైదరాబాద్‌లో పార్టీ నేతలతో సమావేశం కానుండడంతో ఆశావహుల్లో అలజడి మొదలైంది. ముఖ్యనేతలు, డీసీసీ కమిటీలు సిఫారసు చేసిన పేర్లపై ఈ కమిటీ చర్చించి.. పోటీ ఉన్న సెగ్మెంట్లలో ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున పేర్లను ఎంపిక చేసి అధినేత రాహుల్‌గాంధీకి సిఫారసు చేయనున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. -
పొత్తుతో పోయేవెన్ని..?!
కాంగ్రెస్ పార్టీలో జిల్లానుంచి ఢిల్లీ వరకు జరుగుతున్న కసరత్తు ఆ పార్టీ నాయకుల అభ్యర్థిత్వాలపై ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 11 నియోజకవర్గాల నుంచి పోటాపోటీగా అధిష్టానానికి దరఖాస్తు చేస్తున్నారు. రెండుచోట్ల మాత్రమే ఒక్కొక్క పేరు ఉండగా.. మిగతా స్థానాల్లో ఆశావహులు రోజురోజుకూ పెరుగుతున్నారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ నుంచి 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై తమ ప్రతిపాదనలను పంపాలని అధిష్టానం ఆదేశించినట్లు తెలిసింది. ఇటీవలే ఏఐసీసీ కార్యదర్శి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి శ్రీనివాస కృష్ణన్ రెండు పర్యాయాలు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పొత్తు నేపథ్యంలో టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌తో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఇతర నేతలు ఇటీవలే చర్చలు జరిపారు. గెలిచే స్థానాలు మినహా మిగతా చోట్ల ఇతర పార్టీలకు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో ఆ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ ముగ్గురు సభ్యులతో అభ్యర్థుల ఎంపిక చైర్మన్‌గా భక్తచరణ్‌దాస్, సభ్యులుగా శర్మిష్ఠముఖర్జీ, జ్యోతిమణి సెన్నిమైలతో స్క్రీనింగ్ కమిటీ వేయడం.. ఆ కమిటీ 25న హైదరాబాద్‌లో పార్టీ నేతలతో సమావేశం కానుండడంతో ఆశావహుల్లో అలజడి మొదలైంది. ఈనెల 25న హైదరాబాద్‌కు రానున్న స్క్రీనింగ్ కమిటీ పార్టీనేతలతో సమావేశం కానుంది. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల నుంచి అందిన ఆశావహుల దరఖాస్తులు, ముఖ్యనేతలు, డీసీసీ కమిటీలు సిఫారసు చేసిన పేర్లపై చర్చించి.. పోటీ ఉన్న సెగ్మెంట్లలో ఇద్దరు లేదా ముగ్గురి చొప్పున పేర్లను అధినేత రాహుల్‌గాంధీకి సిఫారసు చేయనున్నారని చెప్తున్నారు. జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యే, తాజామాజీ ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి (జగిత్యాల), మాజీమంత్రి డి.శ్రీధర్‌బాబు (మంథని) స్థానాలకు ఒక్కొక్క పేరే ఉండగా, మిగతా చోట్ల మూడు నుంచి ఎనిమిది మంది వరకు టికెట్ ఆశిస్తున్నారు. ముందస్తుగా టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించి ప్రచారాన్ని నిర్వహించగా.. కాంగ్రెస్ పొత్తులు, టికెట్లపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. పొత్తులలో నాలుగు స్థానాల్లో కిరికిరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా కలిసొచ్చే పార్టీలతో కూటమి కట్టే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలుగుదేశం, సీపీఐ, టీజేఎస్ నేతలతో చర్చలు జరిపింది. టీడీపీ పొత్తుల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో రెండు స్థానాలు, సీపీఐ, టీజేఎస్ పార్టీలు తలో సీటును కోరుతున్నట్లు చెప్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ కోసం హుజూరాబాద్, కోరుట్ల స్థానాల నుంచి టికెట్ అడుగుతున్నట్లు సమాచారం. హుస్నాబాద్ స్థానాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డికి ఇవ్వడం అనివార్యమంటున్నారు. ఇదే సమయంలో టీజేఎస్‌కు ఇచ్చే స్థానాల్లో హుజూరాబాద్‌ను కూడా అడుగుతున్నట్లు చెప్తున్నారు. ఒకవేళ ఈ జిల్లా నుంచి టీడీపీ ఒకటే స్థానాన్ని కోరితే... హుజూరాబాద్‌ను టీజేఎస్ జిల్లా కన్వీనర్ ముక్కెర రాజుకు ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. పొత్తులో భాగంగా టీడీపీకి రెండు స్థానాలు ఇస్తే హుజూరాబాద్, కోరుట్లలో టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలకు నిరాశే మిగలనుంది. హుస్నాబాద్ పరిస్థితి కూడా అంతే కానుండగా.. పొత్తులలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ కాంగ్రెస్ ఎన్ని సీట్లు వదులుకుంటుందన్న చర్చ ఇప్పుడా పార్టీ నేతల్లో హాట్‌టాఫిక్‌గా మారింది. కాంగ్రెస్‌లో ఎక్కడి నుంచి ఎవరు..? పొత్తులు, సీట్ల కేటాయింపు ఇంకా స్పష్టత రాకపోగా.. జగిత్యాల, మంథని మినహా 11 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి 8 మంది నుంచి 10 మంది పోటీ పడుతున్నారు. నియోజకవర్గాల వారీగా ఆశావహుల వివరాలు పరిశీలిస్తే.. కరీంనగర్: చల్మెడ లక్ష్మినర్సింహారావు, ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, రేగులపాటి రమ్యారావు, కటకం మృత్యుంజయం, మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్, ఆయన కుమారుడు బొమ్మ శ్రీరామ్, ఉప్పుల అంజనీ ప్రసాద్, గందె మాధవి, జువ్వాడి నిఖిల్‌చక్రవర్తి, కొత్త జైపాల్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. సిరిసిల్ల: సిరిసిల్ల నియోజకవర్గం నుంచి కేకే.మహేందర్ రెడ్డి, డీసీసీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కటకం మృత్యుంజయం, దరువు ఎల్లయ్య తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే కేకే.మహేం దర్ రెడ్డి పేరును అధిష్టానం పరిశీలిస్తోందని అంటున్నారు. వేములవాడ: గతంలో పోటీచేసి ఓడిపోయిన బొమ్మ వెంకటేశ్వర్, ఆది శ్రీనివాస్, ఏనుగు మనోహర్‌రెడ్డి, కొలగాని మహేష్ తదితరులు దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. చొప్పదండి: ఓయూ జేఏసీ నేత మేడిపల్లి సత్యం, గజ్జెల కాంతం, బండ శంకర్, నాగి శేఖర్‌తోపాటు పలువురు ఆశిస్తున్నారు. సామాజిక కోణంలో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలన్న విషయంలో పార్టీ పరిశీలిస్తోంది. హుజూరాబాద్: జమ్మికుంట ఏఎంసీ చైర్మన్ తు మ్మేటి సమ్మిరెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి ప్యాట రమేశ్, పాడి కౌశిక్‌రెడ్డి, స్వరం రవి, పరిపాటి రవీందర్ రెడ్డి తదితరులు టికెట్ రేసులో ఉన్నారు. పెద్దపల్లి: మాజీ ఎమ్మెల్యే సీహెచ్.విజయరమణరావు, ఈర్ల కొంరయ్య, మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి కోడలు గీట్ల సవితారెడ్డి, గొట్టెముక్కుల సురేష్‌రెడ్డి తదితరులు టికెట్ రేసులో ఉన్నారు. రామగుండం: రాజ్‌ఠాకూర్ మక్కాన్ సింగ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ బడికెల రాజలింగం, ఐఎన్టీయూసీ నేత జనక్‌ప్రసాద్, గుమ్మడి కుమారస్వామి, హర్కర వేణుగోపాల్ తదితరులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. కోరుట్ల: కొమొరెడ్డి రామ్‌లు, జేఎన్.వెంకట్, బీజేపీకి రాజీనామా చేసిన రఘు కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ఓ ప్రధాన పార్టీలో కొనసాగుతున్న ముఖ్యనేత తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి టిక్కెట్ ఆశించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. హుస్నాబాద్: హుస్నాబాద్ నుంచి అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పేరే ప్రధానంగా ఉండగా.. బొమ్మ వెంకటేశ్వర్, ఆయన కుమారుడు బొమ్మ శ్రీరాంచక్రవర్తి కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ధర్మపురి: ఈ నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తోపాటు మద్దెల రవీందర్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. మానకొండూరు: మాజీ విప్ ఆరెపల్లి మోహన్‌కు ఇక్కడి నుంచి టికెట్ పక్కా అయ్యిందన్న ప్రచారం ఉంది. అయితే రేవంత్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరిన టీడీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు కవ్వంపెల్లి సత్యనారాయణ కూడా ఇక్కడి నుంచి టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు చెప్తున్నారు. -
టీడీపీ నేతల్లో నైరాశ్యం
సాక్షి, మెదక్: జిల్లాలో తెలుగుదేశం నేతలను నైరాశ్యం అలుముకుంటోంది. మెదక్‌లో ఒకప్పుడు టీడీపీ బలమైన పార్టీగా ఉండేది. ప్రస్తుతం ఆ ప్రాభవాన్ని కోల్పోయి ఉనికిని చాటుకునేందుకు ఆగచాట్లు పడాల్సివస్తోంది. ప్రస్తుతం ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయలేని దుస్థితికి చేరుకుంది. ఒకప్పుడు మెదక్, నర్సాపూర్ నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉండేది. కాంగ్రెస్, టీడీపీ రెండు పార్టీ మధ్య నువ్వానేనా అన్న పోటీ ఉండేది. కానీ ప్రస్తుతం వైరి పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు కోసం తహతహలాడుతోంది. కాంగ్రెస్‌తో పొత్తు కుదిరితే తప్ప రాబోయే ఎన్నికల బరిలో నిలవలేని పరిస్థితి టీడీపీలో నెలకొంది. కాంగ్రెస్‌తో పొత్తు విషయమై టీడీపీ అధిష్టానం చర్చలు జరుపుతోంది. రాష్ట్రంలో మొత్తం 40 స్థానాలను టీడీపీ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఐదు స్థానాలు కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ కోరిన స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా లేదని సమాచారం. కానీ పొత్తు విషయంపై క్షేత్రస్థాయిలోని కార్యకర్తలు తీవ్రంగా విముఖత చూపుతున్నారు. వైరి పార్టీ అయిన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ప్రజల్లోకి ఎలా వెళ్తాం? ఏం చెబుతాం? టీడీపీ అభ్యర్థులకు కాంగ్రెస్‌కు పనిచేసే ప్రసక్తే లేదని టీడీపీ నేతలు కొంత మంది బహిరంగాగానే వాపోతున్నారు. పొత్తు కుదరడంతో పార్టీ వీడేందుకు మెదక్, నర్సాపూర్‌లోని పలువురు నాయకులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మెదక్, నర్సాపూర్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న టీడీపీ నేతల్లో సైతం నిరాశ కమ్ముకుంటోంది. కొంతమంది మాత్రం పొత్తు కుదరకపోతే పరిస్థితి ఏమిటన్న ఆయోమయంలో ఉన్నారు. కంచుకోటలో నేడు దైన్యం.. మెదక్ నియోకజవర్గంపై టీడీపీ ముద్ర బలంగా ఉండేది. దివంగత టీడీపీ నేత రామచంద్రరావు పలుమార్లు మెదక్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేశారు. 1983, 1985, 1994, 1998, 2001, 2009లో జరిగిన ఎన్నికల్లో కరణం రామచంద్రరావు, కరణం ఉమాదేవి, మైనంపల్లి హన్మంతరావు ఇక్కడి నుంచి టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. మెదక్‌లో టీడీపీకి బలమైన కేడర్ ఉండేది. మెదక్ మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసిన బట్టి జగపతికి కూడా మంచి పట్టు ఉండేది. కాగా తెలంగాణ ఉద్యమ ప్రభావంతో టీడీపీ వైభవం తగ్గుతూ వచ్చింది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున బట్టి జగపతి పోటీ చేయగా మూడో స్థానంలో నిలిచారు. బట్టి జగపతి సహా పలువురు నాయకులు కాంగ్రెస్, టీఆర్ఎస్లోకి వలసలు వెళ్లటంతో పార్టీ నిర్వీర్యమైంది. ప్రస్తుతం మెదక్ నియోజకవర్గంలో టీడీపీ అంతగా ప్రభావం చూపలేని పరిస్థితిలో ఉంది. నర్సాపూర్ నియోజకవర్గంలో సైతం గతంలో టీడీపీ ప్రభావం చూపే స్థాయిలో ఉండేది. టీడీపీ పొత్తుతో సీపీఐ పలుమార్లు ఇక్కడ గెలుపొందింది. అప్పటి టీడీపీ నేత మదన్‌రెడ్డి రెండు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగినప్పటికీ గెలవలేకపోయారు. తెలంగాణ ఉద్యమం అనంతరం పార్టీ ఇక్కడా పూర్తిగా దెబ్బతింది. మదన్‌రెడ్డి, మురళీయాదవ్‌తోపాటు పలువురు ముఖ్యనాయకులు టీఆర్ఎస్లోకి వలసలు వెళ్లారు. దీంతో పార్టీ పూర్వవైభవం కోల్పోయింది. ప్రస్తుతం నియోజకవర్గంలో టీడీపీ ఉనికి చాటుకునే స్థితలో ఉంది. సీటు దక్కేనా..? కాంగ్రెస్‌తో పొత్తుపైనే టీడీపీ నేతలు నమ్మకంతో ఉన్నారు. పొత్తు కుదిరిన పక్షంలో మెదక్ సీటు దక్కించుకోవాలని పలువురు టీడీపీ నేతలు పట్టుదలగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ మెదక్, నర్సాపూర్ రెండు స్థానాలు ఇచ్చేందుకు నికారిస్తున్నట్లు తెలుస్తోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో టీడీపీ ఒక్క స్థానంలో గెలుపొందలేదు. గత ఎన్నికలో బీజేపీతో పొత్తులో భాగంగా మెదక్ నుంచి టీడీపీ అభ్యర్థి బట్టి జగపతి పోటీ చేయగా నర్సాపూర్ నుంచి బీజేపీ చాగళ్ల బల్వీందర్‌నాథ్ పోటీ చేశారు. ఇద్దరు అభ్యర్థులు ఒటమిపాలయ్యారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ ఎత్తిచూపుతూ మెదక్, నర్సాపూర్‌లో టీడీపీకి బలంలేదని రెండు స్థానాలు తమకు వదిలివేయాలని కాంగ్రెస్ చెబుతున్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా మెదక్, నర్సాపూర్ నుంచి పోటీ చేయకపోతే మెదక్ జిల్లాలో టీడీపీ ఉనికి కోల్పోవటం ఖాయమని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. -
సైకిల్‌పై సవారీకి వెనుకంజ !
కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించే అవకాశాలున్న నియోజకవర్గంలో ఆ పార్టీ గుర్తుపై బరిలోకి దిగేందుకు ఆశావహులు వెనుకడుగు వేస్తున్నారు. బాల్కొండ స్థానం టీడీపీకి దక్కే అవకాశాలుండగా, 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓటింగ్ 12 శాతమే. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన తెలుగుదేశం పార్టీ గుర్తు పై ఈ ఎన్నికల్లో పోటీచేసేందుకు టీ డీపీ ఆశావహులు సైతం ఆసక్తి చూ పడం లేదు. పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించే అవకాశాలున్న ఒక టీ రెండు నియోజకవర్గాల్లో ఆ పా ర్టీ గుర్తుపై బరిలోకి దిగేందుకు ఆశావహులు వెనుకడుగు వేస్తున్నారు. కాం గ్రెస్‌తో పొత్తులో భాగంగా జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల్లో బాల్కొం డ స్థానం టీడీపీకి దక్కే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ స్థానాన్ని ఆశిస్తున్న అన్న పూర్ణమ్మ కుమారుడు డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి టీడీపీ బీఫారంపై కాకుండా, కాంగ్రెస్ గుర్తుపైనే పోటీ చేయాలని యోచనలో ఉన్నట్లు వారి అనుచరవర్గం పేర్కొంటోంది. కాంగ్రెస్ ఓటుబ్యాంకుపైనే ఆశలు.. తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం కారణంగా జిల్లాలో ఆ పార్టీ ఉనికి లేకుండా పోయింది. ప్రస్తుతం మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ వంటి ఇద్దరు ముగ్గురు నాయకులే మిగిలారు. జిల్లా అంతటా టీడీపీ పూర్తిగా పట్టు కోల్పోయింది. 2014 ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే.. బాల్కొండ నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఓట్లలో టీడీపీకి వచ్చిన ఓటింగ్ కేవలం 12 శాతమే. ఇందులో అభ్యర్థిని చూసి వేసిన ఓట్లే అధికం. 2014 ఎన్నికల తర్వాత జిల్లాలోని నాయకులంతా ఒక్కొక్కరుగా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. చివరకు జిల్లా అధ్యక్షులు అర్కల నర్సారెడ్డి సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్సీగా పనిచేసిన వీజీ గౌడ్ వంటి నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ద్వితీయ శ్రేణి నాయకులు కూడా పార్టీని వీడారు. గ్రామాల్లో కేడర్ కనుమరుగైంది. చెప్పుకోదగిన నాయకులిద్దరు, ముగ్గురు మినహా టీడీపీ పూర్తిగా తన ప్రభావాన్ని కోల్పోయింది. ఓటింగ్ శాతం కూడా నామమాత్రానికి పడిపోయింది. దీంతో టీడీపీ గుర్తుపై పోటీ చేస్తే.. కాంగ్రెస్ ఓట్లు పూర్తి స్థాయిలో తమకు మళ్లే అవకాశాలు ఉండవని భావిస్తున్న ఆశావహులు.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు పైనే ఆశలు పెట్టుకున్నారు. ఆ పార్టీ గుర్తుపైనే బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నారు. టీడీపీ గుర్తుపై పోటీ చేస్తే అసలుకే ఎసరొచ్చే అవకాశాలుండటంతో మల్లికార్జున్‌రెడ్డి కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నట్లు అనుచరవర్గంలో ప్రచారం కొనసాగుతోంది. కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేస్తే టీడీపీ అధినాయకత్వం ఇందుకు అంగీకరిస్తుందా అనే అంశంపైనా చర్చ జరుగుతోంది. కాగా, ఈ స్థానాన్ని ఆశించిన మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి కారెక్కారు. దీంతో ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌కు లైన్ క్లియరైంది. కానీ అనూహ్యంగా టీడీపీ పొత్తు తెరపైకి రావడంతో ఈరవత్రి టిక్కెట్ కోసం తన ప్రయత్నం ముమ్మరం చేయాల్సి వస్తోంది. మొత్తం మీద కాంగ్రెస్ – టీడీపీ పొత్తు అంశంపై జిల్లా రాజకీయవర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
పొత్తులు తేలాకే.. ఎత్తులు!
సాక్షి, రంగారెడ్డి ప్రతినిధి: పొత్తుల వ్యవహారం కాంగ్రెస్ నేతల్లో కలవరం సృష్టిస్తోంది. టీడీపీతో సయోధ్య కుదిరితే ఎక్కడ తమ సీటుకు ఎసరు వస్తుందోననే ఆందోళన పలువురినివెంటాడుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)ని ఢీకొనాలంటే విపక్షాలన్నీ ఏకం కావాలని నిర్ణయిం చాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్, తెలుగుదేశం పొత్తుకు బీజం పడింది. శివారు సెగ్మెంట్లలో టీడీపీకిచెప్పుకోదగ్గ బలం ఉందని, ఉమ్మడిగా బరిలో దిగడం వల్ల లాభం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ సమీకరణాలన్నింటినీ విశ్లేషించిన కాంగ్రెస్.. శివార్లలో కొన్ని నియోజకవర్గాలను టీడీపీకి వదిలేసే అంశంపై చర్చిస్తోంది. రాష్ట్ర స్థాయిలో పొత్తు అంశం తేలనప్పటికీ.. జిల్లాలో మాత్రం పొత్తు పొడిస్తే ఎవరి టికెట్టు గల్లంతవుతుందోననే ఆం దోళన వ్యక్తమవుతోంది. మరోవైపు టీడీపీతో చేయి కలిపితే పార్టీని వీడేందుకు కూడా కొందరు కాంగ్రెస్ ఆశావహులు రెడీ అవుతున్నారు. పొత్తుతో రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని భావించి బండారి లక్ష్మారెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆయన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఉప్పల్ అసెంబ్లీ స్థానానికి పోటీచేసి ఓడిపోయారు. ఆయనే కాకుండా మరికొందరు కూడా పార్టీ వీడే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. పొత్తు పొడవకముందే... గత ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని కుత్బుల్లాపూర్, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, కూకట్పల్లి నియోజకవర్గాలను టీడీపీ గెలుచుకుంది. అనంతరం మారిన రాజకీయ సమీకరణలతో ఎల్బీనగర్ మినహా మిగతా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరూ గులాబీ గూటికి చేరారు. దీంతో ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా నిలిచిన జిల్లాలో ఆ పార్టీ ఇప్పుడు నామ్‌కే వాస్తేగా మిగిలింది. 2014లో బీజేపీతో జతకట్టిన తెలుగుదేశం.. ఏపీ హక్కుల విషయంలో ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుంది. ఈ క్రమంలోనే బీజేపీ రాజకీయ శత్రువు కాంగ్రెస్‌తో చేతులు కలుపుతామని సంకేతాలిచ్చింది. దీనికి అనుగుణంగా ఇరుపార్టీల అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబునాయుడు ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటు వ్యవహారం బాధ్యత టీడీపీ మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్‌కు అప్పగించారు. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో ఉప్పల్ సీటు ఆశించి భంగపడ్డ ఆయన కుమారుడు వీరేందర్‌కు పొత్తులో భాగంగా ఈసారి అవకాశం లభిస్తుందని భావించిన కాంగ్రెస్ నేత లక్ష్మారెడ్డికి పార్టీకి రాజీనామా చేశారు. ఇదిలావుండగా, గత ఎన్నికల్లో గెలుపొందిన సెగ్మెంట్లను తమకే వదిలేయాలని టీడీపీ పట్టుబడుతోంది. ఈ పరిణామాలు కాంగ్రెస్ ఆశావహుల్లో కలకలం సృష్టిస్తున్నాయి. మహేశ్వరంపైనా కన్ను! మహేశ్వరం నియోజకవర్గంపై కూడా టీడీపీ కన్నేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఆ పార్టీ తరఫున గెలుపొందిన నేపథ్యంలో ఈ సీటును కూడా కోరుతోంది. ఇక్కడి నుంచి మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్ పోటీచేయాలని భావిస్తున్నారు. సొంత నియోజకవర్గం కావడం.. పార్టీకి చెప్పుకోదగ్గ కేడర్ ఉండడంతో మహేశ్వరం నుంచి బరిలో దిగాలని యోచిస్తున్నారు. 2009లో ఈ సెగ్మెంట్ నుంచి గెలుపొందిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈసారి ఇక్కడి నుంచి రంగంలోకి దిగాలని నిర్ణయించారు. అందుకనుగుణంగా క్షేత్రస్థాయిలో ప్రచారం కూడా మొదలు పెట్టారు. గత ఎన్నికల్లో కొడుకు కార్తీక్‌రెడ్డి కోసం సీటును త్యాగం చేసిన ఆమె.. ఈ సారి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజా పరిణామాలను ఆమె వర్గీయుల్లో కలవరం సృష్టిస్తున్నాయి. శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, ఎల్బీనగర్ నియోజకవర్గాలను తమకే కేటాయించాలని టీడీపీ పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కూటమి ఎవరి సీటుకు ముప్పు తెస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో పొత్తు చర్చలు కొలిక్కి వస్తే తప్ప ముందడుగు వేయకూడదని ఆశావహులు భావిస్తున్నారు. -
పొత్తులతో.. కిరికిరి తప్పదా?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వలసలతో చిక్కి శల్యమైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ (టీ.టీడీపీ) కాంగ్రెస్‌తో దోస్తీ కోసం స్నేహహస్తం చాస్తోంది. మరోవైపు గత ఎన్నికల్లో ఉన్న పొత్తునే తిరిగి కొనసాగించాలని సీపీఐ కూడా సిద్ధంగా ఉంది. ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ఏర్పాటు చేసిన తెలంగాణ ఇంటి పార్టీతో కాంగ్రెస్ జతకలవనుందంటున్నారు. ఇక, తెలంగాణ జనసమితికి కాంగ్రెస్‌కు పొత్తు ఉండే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌తో ఇన్ని పార్టీలూ నిజంగానే జతకలిస్తే ఎవరికి ఏయే సీట్లు దక్కుతాయో అన్న చర్చ జోరుగా సాగుతోంది. టీడీపీ ఆరాటం! తెలంగాణ జిల్లాల్లో టీడీపీని బతికించుకోవాలంటే ఏదో ఒక పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లడం మినహా మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర నాయకత్వంతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దీంతో జిల్లాలో టీడీపీనుంచి టికెట్లు ఆశిస్తున్న నాయకులు ఉత్కంఠగా ఎదురుచూశారు. దాదాపుగా పొత్తు కుదిరే అవకాశాలు ఉన్నాయని తేలడం, తెలంగాణ వ్యాప్తంగా కేటాయించే సీట్ల సంఖ్యను బట్టి జిల్లాలో ఒకటో రెండో స్థానాలు తమకు వస్తాయన్న ఆశ పెట్టుకున్నారు. టీడీపీ వర్గాలు చెబుతున్న సమాచారం మేరకు కాంగ్రెస్‌తో పొత్తు కుదిరే పక్షంలో తమ పార్టీ కోదాడ, నకిరేకల్ లేదా తుంగతుర్తి, నల్లగొండ స్థానాలను కోరుతుందని అంటున్నారు. అయితే, ఇందులో నకిరేకల్, తుంగతుర్తి మినహా కోదాడ, నల్లగొండ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు. దీంతో ఆ రెండు స్థానాలపై ఆశ అంతగా పెట్టుకోవడం లేదని, కాకుంటే కోదాడలో తమకే టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరో వైపు తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో ఏదో ఒకటి దక్కుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి టీడీపీ – కాంగ్రెస్ పొత్తు వల్ల ఎవరి అవకాశం గల్లంతవుతుందోనన్న అంశంపై భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. పొత్తులపై లేని స్పష్టత వాస్తవానికి కాంగ్రెస్‌తో ఏ పార్టీ జత కలుస్తుందో ఏ పార్టీ నాయకత్వం ఇదమిద్దంగా చెప్పలేకపోతోంది. ఈ చర్చలన్నీ ఇంకా ప్రాథమిక దశలోనే ఉండడంతో ఇప్పుడిప్పుడే ఏ పార్టీకి ఏ స్థానం కేటాయిస్తారన్న అంశం కూడా అపరిపక్వ దశలోనే ఉందని అభిప్రాయపడుతున్నారు. కాకుంటే గత ఎన్నికల్లో సీపీఐ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లో పోటీ చేసి దేవరకొండలో విజయం సాధించింది. కాంగ్రెస్ తమ సిట్టింగ్ స్థానాన్ని త్యాగం చేసి సీపీఐకి కేటాయిస్తే దేవరకొండలో విజయం తర్వాత కొన్నాళ్లకు ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన రమావత్ రవీంద్రకుమార్ టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. మరోవైపు మునుగోడులో కాంగ్రెస్ టికెట్ దక్కక పాల్వాయి స్రవంతి రెబల్‌గా పోటీకి దిగడంతో కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దిగిన సీపీఐ ఓడిపోయింది. అయినా, ఈసారి కూడా సీపీఐ కోరే కొన్ని సీట్లతో మునుగోడు కూడా ఒకటిగా ఉంటుందంటున్నారు. ఈసా రి కాంగ్రెస్‌లో టికెట్‌కు గట్టి పోటీ ఉంది. ఇద్దరు, ముగ్గురు నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్–సీపీఐ పొత్తు ఫలిస్తుందా లేదన్న అంశం తేలా లేదు. తెలంగాణ ఇంటి పార్టీ కూడా కాంగ్రెస్ నాయకత్వంతో మంతనాలు జరుపుతోందని ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ నాయకత్వం నకిరేకల్ సీటును గట్టిగా కోరే అవకాశం ఉందంటున్నారు. ఇంటిపార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ సతీమణి లక్ష్మి గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి సొంత పార్టీ ఏర్పాటు చేసుకోవడంతో పొత్తు ఉన్నా, లేకున్నా ఈ స్థానం నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ పొత్తు కుదిరి సీటు కేటాయిస్తే.. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌నుంచి పోటీ చేసి ఓడిపోయిన చిరుమర్తి లింగయ్యకు చెక్ పడినట్లేనన్న అభిప్రాయం కూడా లేకపోలేదు. ఇక, తెలంగాణ జనసమితి పొత్తు ఉంటే ఆ పార్టీ మిర్యాలగూడ స్థానాన్ని కోరే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తంగా కాంగ్రెస్‌తో ఏయే పార్టీలు పొత్తు పెట్టుకుంటాయి? ఏ సీట్లు అడుగుతాయి? ఎన్ని దక్కించకుంటాయి? ఎవరి ఆశలు గల్లంతవుతాయి? అన్న ప్రశ్నలకు కొద్ది రోజులు ఆగితే కానీ సమాధానాలు లభించేలా లేవు. -
ఎవరికో.. పొత్తు ముప్పు !
పొత్తులో భాగంగా జిల్లాలో టీడీపీకి కేటాయించే అవకాశాలున్న సీటుతో కాంగ్రెస్‌లో ఎవరి స్థానం గల్లంతవుతుందోననే అంశం తెరపైకి వస్తోంది. కాంగ్రెస్‌లో ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్నారు. టీడీపీతో జతకట్టడం ద్వారా జిల్లాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన ఆ పార్టీకి ప్రయోజనం చేకూరుతుందే తప్ప., కాంగ్రెస్‌కు పెద్దగా ఒరిగేదేమీ లేదనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: అధికార పార్టీ టీఆర్ఎస్ను ఢీ కొనేందుకు బీజేపేతర ప్రతిపక్ష పార్టీలు జట్టు కట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ పొత్తులో భాగం గా జిల్లాలో టీడీపీకి కేటాయించే అవకాశాలున్న సీటుతో కాంగ్రెస్‌లో ఎవరి స్థానం గల్లంతవుతుందనే అంశం తెరపైకి వస్తోంది. ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు ఆస క్తి చూపుతున్న కాంగ్రెస్‌లోని ఎవరి ఆశలు నీరుగారుతాయో అన్న చర్చకు దారితీ స్తోంది. కాంగ్రెస్‌తో జతకట్టనున్న సీపీఐ, సీపీఎంలు ఉమ్మడి జిల్లాలో ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తున్నప్పటికీ ఎన్నికల విషయానికి వస్తే గట్టి పోటీని ఇచ్చే స్థాయి లో లేవు. మరోవైపు తెలంగాణ జన సమి తి కూడా ఇంకా పుంజుకున్న దాఖలాల్లేవు. ఇస్తే టీడీపీకి ఒక సీటు కేటాయించే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తు న్నాయి. దీంతో జిల్లాలో కాంగ్రెస్ ఒక స్థానాన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్‌లో ఒక్కో నియోజకవర్గంలో టిక్కెట్ కో సం ఇద్దరు, ముగ్గురు పోటీ ప డుతున్నారు. ఈ తరుణంలో తమ సీటు పొత్తులో గల్లంతైతే తమ పరిస్థితి ఏంటని ఆశావహుల్లో ఆందోళన షురువైంది. బాల్కొండ నుంచి బరిలోకి..! ప్రస్తుతం జిల్లాలో టీడీపీ కేడర్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు వంటి ఒకరిద్దరు నేతలు మాత్రమే మిగిలారు. గత కొంత కాలంగా వీరిద్దరు కూడా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ ఎన్నిక ల్లో పోటీ చేసేందుకు మండవ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అన్నపూర్ణమ్మ కుమారుడు మల్లికార్జున్‌రెడ్డి మాత్రం బాల్కొండ నుంచి బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నారు. గత ఎన్నిక ల్లో కూడా ఆయన ఇక్కడి నుంచే పోటీ చేశారు. పొత్తులో భాగంగా బాల్కొండ స్థానాన్ని టీడీపీకి కేటాయిస్తే.. ఈ స్థానంపై ఆశలు పెట్టుకు న్న కాం గ్రెస్ నేత ఈరవత్రి అనీల్ పరిస్థితి ఏంటనే అంశం తెరపైకి వస్తోంది. ఇప్పటికే బాల్కొండపై ఈరవత్రితో పాటు, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి కూడా కన్నేశారు. ఈసారి ఆర్మూర్ నుం చి కాకుండా, బా ల్కొండ నుంచే బరిలోకి దిగే యోచనలో ఉన్నట్లు ఆయన అనుచర వర్గం పేర్కొంటోంది. ఈ తరుణంలో బాల్కొండ స్థానం పొత్తులో గల్లంతైతే ఇక్కడి ఇద్దరు కాంగ్రెస్ ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లినట్లు కానుంది. మరోవైపు అన్నపూర్ణమ్మ తన కు మారుడితో కలిసి కాంగ్రెస్‌లో చేరే అవకాశాలున్నాయి. ఇప్పటికే జానారెడ్డితో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అభ్యర్థిత్వంపై స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఇంకా వేచి చూస్తున్నారనే చర్చ జరుగుతోంది. మల్లికార్జున్‌రెడ్డి మాత్రం టీడీపీ నుంచి పోటీ చేసేందుకు అంతగా ఆసక్తిగా లేరని అనుచరులు పే ర్కొంటున్నారు. అభ్యర్థిత్వంపై హామీ లభిస్తే కాంగ్రెస్‌లో చేరి బాల్కొండ నుంచి బరిలో ఉండే అవకాశాలున్నాయి. టీడీపీతో జతకట్ట డం ద్వారా జిల్లాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన ఆ పార్టీకి ప్రయోజనం చేకూరుతుం దే తప్ప కాంగ్రెస్‌కు పెద్దగా ఒరిగేదేమీ లేదనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికల వరకు మహాకూటమి పొత్తు తో జిల్లాలో రాజకీయ సమీకరణలు భారీగా మారుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. -
‘పచ్చ’ బంధంతో కలకలం!
పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరిగినా.. ‘ముందస్తు’ అయినా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తులు ఖాయమనే చర్చ ఇటీవల మళ్లీ ఊపందుకుంది. ఆరు నెలల కిందటే రెండు పార్టీల హైకమాండ్ మధ్య ఓ అవగాహన వచ్చిందన్న ప్రచారం జరగ్గా.. తెలంగాణలో టీఆర్ఎస్ను ఢీకొట్టేందుకు పొత్తులు అవసరమన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు కూడా ప్రకటించారు. ఆ తర్వాత ఈ రెండు పార్టీల నడుమ కొంత స్థబ్దత నెలకొనగా, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు పొత్తులతోనే ముందుకు సాగుతాయన్న చర్చ 15 రోజులుగా జోరందుకుంది. ఈ మేరకు ఆ రెండు పార్టీల అధిష్టానంలో ఎన్ని స్థానాలకు, ఏయే జిల్లాల్లో ఏయే నియోజకవర్గాలను కేటాయిం చాలన్న ఎక్సర్సైజ్ జరుగుతోందంటున్నారు. ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిరి ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీలోని ఎవరి టికెట్æకు ఎసరు వస్తుందన్న చర్చ ఆ పార్టీ ఆశావహుల్లో అలజడి రేపుతోంది. ఇదే సమయంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ఉధృతం చేసింది. ఆ పార్టీ ఏఐసీసీ కార్యదర్శులు, రాహుల్‌గాంధీ దూతలు సమీక్షలు, సదస్సుల పేరిట ఉమ్మడి జిల్లాలోని అన్ని ని యోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీల బలాబలాలను కూడా అంచనా వేసే పనిలో పడ్డారు. ప్రధానంగా ఆయా సెగ్మెంట్లలో తెలుగుదేశం ప్రాబల్యం ఏ మేరకు ఉందన్న అంచనా కూడా వేస్తున్నారు. సాక్షిప్రతినిధి, కరీంనగర్: టీఆర్ఎస్ను ఢీకొనేందుకు మైత్రి అవసరమని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఎవరికి టికెట్ చేజారుతుందోనన్న ఆందోళన హస్తం పార్టీ ఆశావహుల్లో మొదలైంది. 2014 ఎన్నికల్లో రెండు పార్లమెంట్, 13 అసెంబ్లీ స్థానాలకు ఒకే అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఆధిక్యతను చాటుకోవాలని చూస్తోంది. ఆ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన నేతలందరు కూడా మళ్లీ పోటీలో ఉండాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో ఒక పార్లమెంట్, రెండు అసెంబ్లీ స్థానాలపై దృష్టి పెట్టిన తెలుగుదేశం పార్టీ ఆ మేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తీవ్రం చేసినట్లు కూడా ప్రచారం ఉంది. ఇదిలా వుంటే హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి గతంలో రెండు పర్యాయాలు తెలుగుదేశం నుంచి గెలిచి మంత్రిగా పనిచేసిన ఇనుగాల పెద్దిరెడ్డి ప్రస్తుతం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన పొత్తుల హామీతోనే ఏ పార్టీలోకి వెళ్లలేదంటున్నారు. అదే విధంగా మరో సీనియర్ నేత, రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ కూడా ఈ సారి జిల్లా నుంచే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ కమిటీలు వేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కార్యక్రమాలను ఉధృతం చేశారు. ఆ పార్టీ ప్రస్తుతం ఉనికి కోసం పాకులాడుతోంది. ఈ దశలో కాంగ్రెస్‌తో స్నేహ హస్తం చాచడం, బలీయశక్తిగా అవతరించిన టీఆర్ఎస్ను ఢీకొనేందుకు రెండు పార్టీల మధ్యన మైత్రి కలిసి వస్తుందని అంచనాకొచ్చినట్లు తెలిసింది. ఏఐసీసీ స్థాయిలో ఈ మేరకు ప్రాథమిక చర్చలు జరిగాయని, పొత్తుకు ఇరుపార్టీలు దాదాపుగా అంగీకరించాయని, అయితే టీడీపీకి ఎన్ని స్థానాలు కేటాయించడమన్నదే ప్రధాన సమస్యని కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఈ పొత్తు పొడిస్తే ఎవరికి లాభం.. ఎవరికి నష్టం అనే చర్చ పక్కనపెడితే.. ఆశావహులకు మాత్రం ఈ వార్త కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పొత్తుల ప్రతిపాదనలు బాగానే ఉన్నా.. ఎవరికి నష్టం? మరెవరికి లాభం? అన్న లెక్కల్లో కాంగ్రెస్ పార్టీ ఆశావహులు పడ్డారు. ఓ వైపు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చిన నేతలు.. మరోవైపు పొత్తుల్లో భాగంగా టీడీపీ నేతలకు సీట్లను కేటాయించడం ద్వారా ఎవరి స్థానా లకు ఎసరు వస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. టీడీపీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డితోపాటు కవ్వంపెల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, చింతకుంట్ల విజయరమణారావు, ము ద్దసాని కశ్యప్‌రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరు మానకొండూరు, చొప్పదండి, పెద్దపల్లి, హుజూరాబాద్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ టికెట్లు ఆశించారు. ఈ స్థానాలకు వస్తే చొప్పదండి నుంచి 2014లో ఓడిపోయిన సుద్దాల దేవయ్య, గజ్జెల కాంతం, బండి శంకర్, ఎన్.శేఖర్ పోటీ పడుతున్నారు. పెద్దపల్లిలో గీట్ల సబితా, ఈర్ల కొమురయ్య, సురేష్‌రెడ్డి, హుజూరాబాద్ నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ బంధువు పాడి కౌశిక్‌రెడ్డి, తుమ్మేటి సమ్మిరెడ్డి, ప్యాట రమేష్ తదితరులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. పొత్తుల్లో భాగంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి కూడా ఇక్కడే పోటీ చేయాలనుకుంటున్నారు. కాగా.. మానకొండూరు నుంచి మాజీ విప్ ఆరెపెల్లి మో హన్ ఖాయమన్న ప్రచారం ఉండగా పలువురు పోటీ పడుతుండటం చర్చనీయాంశంగా మారిం ది. ఇదిలా వుండగా జగిత్యాల నుంచి సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి, మంథనిలో మాజీ మంతి డి.శ్రీధర్‌బాబులే ఖాయమని చెప్తుండగా, హుజూరాబాద్, రామగుండం, కోరుట్లలపై కన్నేసినట్లు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ దాదాపుగా నిర్వీర్యమైనప్పటికీ చాలా చోట్ల ఆ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంది. ముఖ్యనేతలు పార్టీని వీడినా క్షేత్రస్థాయి కేడర్ మాత్రం ఇంకా అంటిపెట్టుకునే ఉంది. ఈ నేపథ్యంలోనే తమకు ఆశించిన టిక్కెట్లు ఇవ్వాలన్న ప్రతిపాదనలను వేగం చేస్తున్నట్లు ప్రచారం. కాగా వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్, ఏనుగు మనోహర్‌రెడ్డితోపాటు మరో ఇద్దరు పోటీ పడుతుండగా, సిరిసిల్లలో కెకె మహేందర్‌రెడ్డి, చీటి ఉమేష్‌రావు తదితరుల పేర్లుండగా, కరీంనగర్ నుంచి గత ఎన్నికల్లో ఓటమి చెందిన చల్మెడ లక్ష్మీనరసింహరావుతోపాటు 10 మంది పేర్లు వినిపిస్తున్నాయి. రామగుండం నుంచి రాజ్‌ఠాకూర్ మక్కాన్ సింగ్, బడికెల రాజలింగం, గుమ్మడి కుమారస్వామి తదితరులు ఉండగా, ధర్మపురి నుంచి కూడా ఈసారి అడ్లూరి లక్ష్మన్కుమార్తోపాటు మరో ఇద్దరు పోటీ పడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. హుస్నాబాద్ నుంచి ఎ.ప్రవీణ్‌రెడ్డి పేరు తెరమీద ఉండగా, బొమ్మ వెంకటేశ్వర్, బొమ్మ శ్రీరామ్ అడుగుతున్నారంటుండగా, సీపీఐతో సైతం పొత్తు కుదిరితే ఈ స్థానం కూడా కాంగ్రెస్ ఆశావహుల చేజారే అవకాశం లేకపోలేదంటున్నారు. ఓ వైపు పార్టీ బలోపేతం రాహుల్‌గాంధీ వేగుల పర్యటన, ఇంకోవైపు పొత్తులు కాంగ్రెస్ పార్టీ వర్గాలో హీట్ పెంచగా, కాంగ్రెస్ పార్టీతో ఇతర పార్టీల పొత్తుల వ్యవహారం ఎవరికి ఎసరు తెస్తుందోనన్న చర్చ హాట్‌టాపిక్‌గా మారింది. -
కశ్మీర్ రాజకీయంపై కాంగ్రెస్ సమీక్ష
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కశ్మీర్‌లోని తాజా రాజకీయ పరిస్థితులపై కశ్మీర్‌పై ఏర్పాటైన కాంగ్రెస్ కోర్ గ్రూపు సోమవారం చర్చించింది. మాజీ ప్రధాని మన్మోహన్ నివాసంలో జరిగిన ఈ భేటీలో సీనియర్ కాంగ్రెస్ నేతలు కరణ్ సింగ్, చిదంబరం, గులాం నబీ ఆజాద్, పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ అంబికా సోనీ, కశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ గులాం అహ్మద్ మిర్‌లు పాల్గొన్నారు. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర నేతలతో మంగళవారం శ్రీనగర్‌లో చర్చలు జరపాలని భేటీలో నిర్ణయించారు. సమావేశం అనంతరం అంబికా సోనీని ‘పీడీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. ఊహాగానాలపై తాను స్పందించను’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌తో పొత్తుకు పీడీపీ రాయబారం? కశ్మీర్లో కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పీడీపీ ప్రయత్నాలు చేస్తుందన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధమేనని, ఆజాద్‌కు సీఎం చాన్స్ ఇచ్చేందుకు అభ్యంతరం లేదని కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా వర్తమానం పంపినట్లు సమాచారం. కశ్మీర్లో పీడీపీకి 28, బీజేపీకి 25, నేషనల్ కాన్ఫరెన్స్‌కు 15, కాంగ్రెస్‌కు 12 మంది సభ్యుల బలముంది. -
కాంగ్రెస్‌తో పొత్తుకు సీపీఎం నో!
కోల్‌కతా: కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వర్గం ప్రతిపాదించిన ముసాయిదా తీర్మానాన్ని పార్టీ కేంద్ర కమిటీ తోసిపుచ్చింది. ఈ మేరకు ఆదివారం కోల్‌కతాలో జరిగిన ఓటింగ్‌లో పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ నేతృత్వంలోని కేరళ బృందం ఏచూరి తీర్మానాన్ని ఓడించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 31 ఓట్లు, వ్యతిరేకంగా 55 మంది ప్రతినిధులు ఓటేశారు. కాంగ్రెస్‌తో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి పొత్తు ఉండొద్దని ప్రకాశ్ కారత్ బృందం తేల్చిచెప్పింది. కేంద్రంలో బీజేపీని అడ్డుకోవాలంటే కాంగ్రెస్‌తో ఒప్పందం చేసుకోవడమే మేలని ఏచూరి ప్రతిపాదించారు. మూడు రోజుల పాటు జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశాలు ఆదివారం ముగిసిన తరువాత ఏచూరి మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. సవరణలు చేసిన తరువాత ఆమోదం పొందిన తీర్మానంలో కాంగ్రెస్‌తో ఎలాంటి ఎన్నికల పొత్తు, అవగాహన కుదుర్చుకోవద్దని నిర్ణయించినట్లు వెల్లడించారు. త్రిపుర, పశ్చిమ బెంగాల్ ప్రతినిధులు అనుకూలంగానే ఉన్నా కేరళ సభ్యులు వ్యతిరేకించిననట్లు తెలిపారు. రాజీనామాకు సిద్ధపడ్డ ఏచూరి! కారత్ బృందం తీర్మానాన్ని పార్టీలో అంతర్గతంగా చర్చించడానికి ఫిబ్రవరిలో విడుదల చేస్తారు. ఏప్రిల్‌లో పార్టీ సమావేశాలు జరగబోయే ముందు దీనిపై అభిప్రాయాలు సేకరిస్తారు. తన తీర్మానం ఆమోదం పొందకుంటే సీపీఎం ప్రధాన కార్యదర్శిగా తప్పుకోవాలని ఏచూరి అనుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తన ఓటమిని పసిగట్టిన ఏచూరి అసలు ఓటింగ్ జరగకుండా ఉండేలా ఎంతో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇందుకోసం అత్యవసరంగా పొలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటుచేసినా ఏకాభిప్రాయం కుదరలేదు. కేంద్రకమిటీసభ్యుడి హఠాన్మరణం ఈ సమావేశాలకు హాజరైన కేంద్ర కమిటీ సభ్యుడు, త్రిపుర అధికార లెఫ్ట్‌ఫ్రంట్ చైర్మన్ ఖగేన్‌దాస్(79) హఠాన్మరణం చెందారు. శనివారం వేకువజామున ఆయన తీవ్ర గుండెపోటుతో మృతి చెందారని కుటుంబసభ్యులు తెలిపారు. దాస్ 1978, 1983 ఎన్నికల్లో శాసనసభ్యుడిగా, 1998–2002 కాలంలో రాజ్యసభ సభ్యుడిగా, 2002 నుంచి 2014 వరకు లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. -
‘ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు’లో కొత్త ట్విస్ట్
-
‘ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు’లో కొత్త ట్విస్ట్
లక్నో: పొత్తుల ద్వారాలు దాదాపు మూతపడే సమయానికి.. ’సమయం ఉంది మిత్రమా..’ అంటూ కోరుకున్న నేస్తానికి కబురు పంపాడు అఖిలేశ్ యాదవ్! ఉత్తరప్రదేశ్‌లో ఇక ఉండదేమో అనుకున్న సమాజ్‌వాదీ-కాంగ్రెస్ పార్టీల పొత్తుపై శనివారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎస్పీ చీఫ్, యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ తాజాగా ఒక ప్రతిపాదనకు తలొగ్గినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అటు బీజేపీని, ఇటు బీఎస్పీని ఒక్కసారే చిత్తు చేయాలంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తు తప్పదని గట్టిగా నమ్ముతోన్న అఖిలేశ్.. హస్తం గుర్తు పార్టీకి 99 స్థానాలు కేటాయించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ అంగీకరిస్తుందా లేదా అనేది రేపు(ఆదివారం) ఉదయం తేలుతుందని యూపీ కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడు గులాం నబీ ఆజాద్ అన్నారు. ఇదే విషయంపై ఎస్పీ ఎంపీ నరేశ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. 300 స్థానాలకు తగ్గకుండా పోటీచేయాలనేది తమ అభిమతమని అన్నారు. వీగిపోయిందనుకున్న పొత్తు.. ‘అఖిలేశ్ 99’ ఆఫర్‌తో తిరిగి జీవం పోసుకుందని అన్నారు. ఏడు దశల్లో ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్‌లో మొదటిదశ పోలింగ్ ఫిబ్రవరి 11న జరగనుంది. -
పోరు నష్టం.. పొత్తు లాభం!
-
పోరు నష్టం.. పొత్తు లాభం!
కాంగ్రెస్‌తో పొత్తుపై అఖిలేశ్ వ్యూహం పొత్తుల విషయంలో అఖిలేశ్ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. బీజేపీకి అసలైన ప్రత్యామ్నాయంగా ఎస్పీ–కాంగ్రెస్–ఆర్ఎల్డీల మహాకూటమిని నిలపాలనేది ఆయన ఆలోచన. తద్వారా ముస్లిం ఓట్లలో చీలికను అడ్డుకోవచ్చని భావిస్తున్నారు. యూపీ జనాభాలో 9 శాతంగా ఉన్న యాదవులు, 19 శాతంగా ఉన్న ముస్లింలు ఎస్పీకి సంప్రదాయ ఓటు బ్యాంకు. 2012లో 11.65 శాతం ఓట్లు (28 సీట్లు) సాధించిన కాంగ్రెస్, 2014 లోక్‌సభ ఎన్నికల్లో 7.5 శాతం ఓట్లు పొందింది. కాంగ్రెస్‌కు ప్రతి నియోజకవర్గంలో పడుతున్న దాదాపు 5 వేల ఓట్లు ఎస్పీకి బదిలీ అయితే విజయావకాశాలు మెండుగా ఉంటాయని అఖిలేశ్ శిబిరం అంచనా. ముస్లిం ఓట్ల కోసం: కాంగ్రెస్‌కు 2012లో 18%, 2014లో 11% ముస్లిం ఓట్లు పడ్డాయి. ఎస్పీకి 2012లో 39%, 2014లో బీజేపీపై వ్యతిరేకతతో 58% ముస్లిం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పొత్తుతో ముస్లిం ఓట్లూ దక్కుతాయని అఖిలేశ్ లెక్క. బీజేపీకి బలమైన ప్రత్యర్థిగా కనపడితే ముస్లింలు బీఎస్పీ వైపు వెళ్లరని అంచనా. జాట్ల కోసం గాలం: రాష్ట్ర జనాభాలో జాట్లు 1.7%. జాట్ల పార్టీగా పరిగణించే ఆర్‌ఎల్‌డీనీ కూటమిలోకి తేవాలనేది అఖిలేశ్ వ్యూహం. 2012లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్న ఆర్ఎల్డీ 46 స్థానాల్లో పోటీచేసి 9 చోట్ల గెలిచింది. 2.3 శాతం ఓట్లు సాధించింది. పశ్చిమ యూపీలో 50 స్థానాల్లో ప్రభావం చూపగల జాట్ల ఓట్ల కోసం కూటమి తరఫున ఆర్ఎల్డీ అధినేత అజిత్‌సింగ్ కుమారుడు జయంత్‌ను డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలూ ఉన్నాయని పరిశీలకుల అంచనా. తమను ఓబీసీల్లో చేర్చకపోవడం వంటి కారణాలతో జాట్లు బీజేపీపై గుర్రుగా ఉన్నారు. చిన్నపార్టీలు ఓట్లు చీల్చకుండా త్రిముఖ పోరు ఉండేలా(ఎస్పీ–కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ) అఖిలేశ్ యత్నిస్తున్నారు. కాంగ్రెస్‌కు 75–80 సీట్లు, ఆర్ఎల్డీ, ఇతర చిన్నాచితకా పార్టీలకు కలిపి 25 సీట్ల వరకు వదులుకోవడానికి ఎస్పీ సిద్ధంగా ఉంది. మరోపక్క.. ఎస్పీ కలహాలతో విసిగిన ముస్లింలు తమవైపు మొగ్గుతారనే ఆశతో ఉన్న బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఎస్పీ–కాంగ్రెస్ పొత్తు ఆశనిపాతమే. ముస్లిం ఓట్లపై భారీ అంచనాలతో ఆమె ఏకంగా 97 మంది ముస్లింలకు టికెట్లిచ్చారు. ముస్లిం ఓట్లు ఎస్పీ– బీఎస్పీ మధ్య ఎంతగా చీలిపోతే అంత లాభమనేది బీజేపీ లెక్క. బీజేపీని మహాకూటమి నిలువరించగలదంటూ ముస్లింలు దానివైపు మొగ్గితే బీజేపీ లెక్కలూ తప్పుతాయి. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఇక ‘మహా’ సంగ్రామమే
ఒకట్రెండు రోజుల్లో కాంగ్రెస్‌తో పొత్తుపై తుది నిర్ణయం: అఖిలేశ్ • యూపీలో తదుపరి ప్రభుత్వం ఎస్పీ–కాంగ్రెస్‌లదే: గులాంనబీ ఆజాద్ • కూటమిలో చేరేందుకు ఆర్ఎల్డీ, ఎన్సీపీ ఆసక్తి • కొడుకుతో రాజీకి ములాయం ఓకే... • తాను సూచించిన 40 మందికి టికెట్లు ఇవ్వాలంటూ కొడుకుకు షరతు ⇔ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం రసవత్తరంగా మారింది. బీజేపీ, బీఎస్పీల్ని ఎదుర్కొని యూపీ అధికారం చేజిక్కించుకునే లక్ష్యంతో ‘మహా లౌకిక కూటమి’ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పొత్తుకు సై అంటూ సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలు మంగళవారం స్పష్టమైన సంకేతాలిచ్చాయి. ఒకట్రెండు రోజుల్లో కూటమి ఏర్పాటుపై నిర్ణయం దాదాపు ఖరారవుతుందని యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేయగా... ఎస్పీ–కాంగ్రెస్ కూటమే యూపీలో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటూ కాంగ్రెస్ ప్రకటించింది. లక్నో/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం రసవత్తరంగా మారింది. బీజేపీ, బీఎస్పీల్ని ఎదుర్కొని యూపీ అధికారం చేజిక్కించుకునే లక్ష్యంతో ‘మహా లౌకిక కూటమి’ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పొత్తుకు సై అంటూ సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌లు మంగళవారం స్పష్టమైన సంకేతాలిచ్చాయి. ఒకట్రెండు రోజుల్లో కూటమి ఏర్పాటుపై నిర్ణయం దాదాపు ఖరారవుతుందని యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేయగా... ఎస్పీ–కాంగ్రెస్ కూటమే తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటూ కాంగ్రెస్ ప్రకటించింది. మహాకూటమిలో చేరేందుకు సిద్ధమంటూ ఇప్పటికే ఆర్ఎల్డీ, ఎన్సీపీలు కూడా సంకేతాలివ్వడంతో యూపీ ఎన్నికల సంగ్రామంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. యూపీలో ఈసారి ఎస్పీ నేతృత్వంలోని మహా కూటమి, బీజేపీ, బీఎస్పీల మధ్య త్రిముఖ పోరు ఖాయమని తేలింది. సైకిల్ గుర్తును దక్కించుకున్నాక... అఖిలేశ్ సోమవారం రాత్రి నుంచి జోరు పెంచారు. మొదటి నుంచి కాంగ్రెస్‌తో పొత్తుకు ఆసక్తి చూపుతున్న ఆయన కాంగ్రెస్‌తో పొత్తుకు పచ్చజెండా ఊపారు. ‘కాంగ్రెస్‌తో పొత్తుపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం’ అని లక్నోలో చెప్పారు. మహా లౌకిక కూటమి ఆధ్వర్యంలోనే ఎన్నికల్ని ఎదుర్కొంటామంటూ ఎస్పీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. నేడో–రేపో రాహుల్, అఖిలేశ్‌ల భేటీ ఇదే సమయంలో ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ... పొత్తుకు తాము కూడా సిద్ధమేనని ప్రకటించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ విలేకరులతో మాట్లాడుతూ... ‘సమాజ్‌వాదీ–కాంగ్రెస్ కూటమి యూపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు. కాగా ఏ క్షణమైనా అఖిలేశ్–రాహుల్‌గాంధీ సమావేశమై పొత్తును ఖరారు చేయవచ్చని భావిస్తున్నారు. ఎస్పీతో పొత్తుకు సిద్ధమంటూ ఇప్పటికే ఆర్ఎల్డీ ప్రకటించించగా... అఖిలేశ్ నేతృత్వంలోని ఎస్పీకే తమ మద్దతంటూ ఎన్సీపీ కూడా స్పష్టం చేసింది. అయితే ఆ రెండు పార్టీలు అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు కాంగ్రెస్ యూపీ సీఎం అభ్యర్థిగా భావించిన షీలాదీక్షిత్ మాట్లాడుతూ... ఒకవేళ కూటమి ఏర్పాటైతే అఖిలేశ్‌కు మద్ధతుగా తాను సీఎం అభ్యర్థిత్వం నుంచి పక్కకు తప్పుకుంటానని చెప్పారు. మొదటి దశకు నామినేషన్లు ఫిబ్రవరి 11న జరిగే తొలి దశ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. పశ్చిమ యూపీలోని 15 జిల్లాల్లో ఉన్న 73 నియోజక వర్గాల్లో తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. లక్నోలో ముఖ్య ఎన్నికల అధికారి నోటిఫికేషన్ జారీ చేయగానే ఉదయం 11 గంటలకు నియోజకవర్గాల్లో నామినేషన్ల సందడి ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జనవరి 24 కాగా.. విత్‌డ్రాకు గడువు జనవరి 27. మెత్తబడిన ములాయం ఒకవైపు మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు సాగిస్తూనే తండ్రిని బుజ్జగించే ప్రయత్నాల్ని అఖిలేశ్ కొనసాగించారు. మంగళవారం కూడా ములాయంతో సమావేశమయ్యారు. తండ్రి ములాయంతో కలిసి ముందుకు సాగుతానని చెప్పారు. కొడుకుతో చర్చల అనంతరం ములాయం మొత్తబడినట్లు కనిపించారు. తన వర్గం ఎంపిక చేసిన 40 మందికి తప్పకుండా సీట్లు ఇవ్వాలని కొడుకుని ములాయం కోరారు. ఈ జాబితాలో పలువురు సీనియర్ మంత్రుల పేర్లు ఉండగా.. అఖిలేశ్ బాబాయ్, ములాయం సన్నిహితుడు శివ్‌పాల్ యాదవ్ పేరు లేకపోవడం గమనార్హం. ఇరు వర్గాల జాబితాలో 90 శాతం పేర్లు ఒకటేనని... త్వరలో అభ్యర్థుల జాబితా ఖరారు చేస్తామని అఖిలేశ్ చెప్పారు. పార్టీ గుర్తు (సైకిల్)పై ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ములాయం వర్గం కోర్టుకెళితే... ముందుగా తమకు తెలియచేసేలా అఖిలేశ్ వర్గం సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది. -
కాంగ్రెస్‌తో పొత్తుకు ఇంకా సమయం ఉంది: అఖిలేష్
కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయాన్ని నిర్ణయించడానికి ఇంకా సమయం ఉందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. అప్పుడే పొత్తు విషయాన్ని ఖరారు చేయలేదని తెలిపారు. సైకిల్ గుర్తు, పార్టీ పగ్గాలు తమకు దక్కిన తర్వాత తమ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన తన నివాసంలో మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. తండ్రితో తన సంబంధలు ఎప్పుడూ చెడిపోలేదని.. వాస్తవానికి ఆయనతో తనకు అసలు విభేదాలే లేవని స్పష్టం చేశారు. తనవద్ద, ఆయన వద్ద ఉన్న అభ్యర్థుల జాబితాలలో 90 శాతం మంది పేర్లు ఒకటేనని కూడా ఆయన చెప్పారు. తండ్రి మీద విజయం అనేది సంతోషించే విషయం కాదని.. కానీ ఈ పోరాటం తప్పనిసరి అయ్యిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు తన మీద పెద్ద బాధ్యత ఉందని, మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడం మీదే తన పూర్తి దృష్టి ఉందని అఖిలేష్ చెప్పారు. -
'భవిష్యత్తులో కాంగ్రెస్‌తో పొత్తుండదు'
ఖమ్మం: భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదని, ఆ పార్టీ తనంతట తానుగా సముద్రంలో మునిగిపోయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఖమ్మంలోని సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనపడటం వలనే ఎన్నికల్లో వైఫ్యలం చెందామన్నారు. భారతదేశంలో ఎక్కడా కాంగ్రెస్‌తో పొత్తు లేదనీ, తెలంగాణ ఇచ్చారనే కారణంతోనే ఇక్కడ పొత్తు పెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం రైతాంగ రుణాల విషయంలో రైతులందరినీ అయోమయానికి గురి చేస్తోందన్నారు. 2013 జూన్ నుంచి 2014 జూన్ వరకు రైతులు తీసుకున్న లక్ష లోపు రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని బ్యాంకర్ల సమావేశంలో తెలంగాణ మంత్రులు వెల్లడించడం దారుణమని, వెంటనే వారు దీనిపై పునః సమీక్షించాలని కోరారు. ఎన్నికలకు ముందు వాగ్దానాలను చేసిన విధంగా రైతులందరి రుణాలు మాఫీ చేయాలని, రైతుల బంగారం రుణాలను కూడా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం సమస్యపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు కూర్చుని మాట్లాడి పరిష్కరించాలని కోరారు. తెలంగాణలో సమస్యలపై తమ పార్టీ పోరాటాలు కొనసాగిస్తుందని, ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంపై సమస్యల పరిష్కారానికి పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టంచేశారు.